"ఇలా ఎందుకు చేసావ్? ఇప్పుడు చూడూ, గుండు మీద చెట్లు మొలిచి పూలు పూస్తాయి!! ఇలా చెయ్యకూడాదు. చిన్నపిల్లలకి హెయిర్ కట్ చెయ్యాలి, గుండు చెయ్యకూడదు." - సూర్య
"ఏంటి" "మీవాడు ఘనకార్యం" "ఏమిజేసాడూ?" "పిల్లని పడుకోబెట్టి వచ్చేలోపు" "ఏమిజేసాడూ????" "కుర్చీలాక్కుని, దానిమీదకెక్కి, గూటితలుపుతీసి, గూట్లోంచి కత్తెర తీసి, పెంగ్విన్ కి బొచ్చు పెరిగిందిటా!!! దానికి కత్తిరించి, తన జుట్టునీ కత్తిరించుకున్నాడు" "హా!!!!" "అవును బాబు, వాడికీ పెరిగిందట. మళ్లీ వాడికి క్షురకర్మ జేసి తలంటిపోసి ఇప్పటికి కూర్చుందాం అని వస్తే ఆ పిల్ల లేచింది. అదీ కధ నాయనా" "హా$%$%@^@%$^"
కొసమెఱుపు: "ఎందుకు తీసావు కత్తెర?" "అస్సలునువ్వు నాకు అందేలా ఎందుకు పెట్టావు? కత్తెర్లు అలాంటివి దాచిపెట్టుకోవాలి కదా?"
నా పాడ్కాస్ట్ ఫీడ్కోసం ఇక్కడ సబ్స్క్రైబు చేస్కోండి. ఇది పూర్తిగా ఉచితం. మీకూ ఐఫోను ఉంటే, దాంట్లో ఐట్యూన్స్ -> పాడ్కాస్ట్ -> ఆడియో పాడ్కాస్ట్ -> కిడ్స్ మరియూ ఫ్యామిలి -> భాస్కర్'స్ పోస్టేరస్ (iTunes -> PodCast -> Audio PodCast -> Kids & Family -> Bhaskar's Posterous) కోసం వెతకండి. మీకేమైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి. నా పాడ్కాస్ట్ వినటానికి ఐఫోనే అవసరంలేదు. ఐట్యూన్స్ ఉంటే చాలు. పైన ఇచ్చిన లింకుని మీటితే మీ కంప్యూటరులో ఐట్యూన్స్ ఉంటే అదే ఐట్యూన్స్లో తెరుచుకుంటుంది, ఒకవేళ ఐట్యూన్స్ లేకపోతే మీకు చెప్తుంది "మీ కంప్యూటర్లో ఐట్యూన్స్ లేదు, ఇన్స్టాల్ చేస్కోండి" అని.
నిన్న ఎదో ప్రోగ్రాములో కప్పలు వెయ్యటం చూపిస్తున్నాడు. అది ఏమి ప్రోగ్రాము? దానిగురించి సవివరంగా రాస్తా ఇంకో పోష్టులో. ముందు దీని సంగతి చూద్దాం. హా!! కప్పలు!!! మీకు కప్పలు వెయ్యటం అంటె తెలుసా? నిశ్చలనంగా ఉన్న నీళ్లలో, బల్లపరుపుగా ఉన్న రాయినో లెక ఓ పెంకునో తీస్కుని ఏటవాలుగా విసిరితే అది నీళ్ల మీద కప్పలా తెప్పలేస్కుంటూ కొంతదూరం వెళ్తుంది. కప్ప గెంతినట్టు వెళ్లటం వల్ల దాన్ని కప్పాట అనే వాళ్లం. మజా వచ్చేది తస్సదియ్య. నీళ్లు కనిపిస్తే చాలు, ఏస్కో రాళ్లు. పందాలు ఆటికి, ఎవుడిదెక్కువ తెప్పలు అని. రాయి విసరటం ఒక న్యాగ్గా ఒక పధతి, ఆ రాయిని ఎన్నుకోవడం ఇంకో విధానం. చిన్నప్పుడు జేబులోనో బడి సంచిలోనో నాలుగైదు రాళ్లు ఉండేవి. వాటిని బెచ్చాలు అంటాం. కప్పాటకి వేసే రాళ్లుకూడా అలానే గుండ్రంగా, కొంచెం పల్చగా ఉండేలా ఎతుక్కునేవాళ్లం.
మనసు కేరింతలు కొడుతున్నది. ఉంటా
Note : తెప్పలు - గెంతులు
ఈ పోష్టు రాస్తుంటే మనసులో ఇంకో ఆలోచన కలిగింది. దాన్ని ఇక్కడ పెట్టా. ఆశీర్వదించండీ, మీరూ ఓ చెయ్యి వెయ్యండి, కాలు గూడా వేయొచ్చు!! http://veedhiaata.blogspot.com/
మొన్న వారాంతం జీటీవీ సారెగామాపా 2009 కార్యక్రమంలో ప్రతిభాసింగ్ భగేల్ అనే ఓ పోటీదారు హిందీలో ఓ పాటపాడింది - యె మై కహ ఆ ఫసి, కైసి ఫసి, రోన ఆవె న ఆవె హసి, పాపె బచాలొ తుసి. ఇది కారవాన్ అనే సిత్రంలోనిది. మనకి వెంటనే దీని తెలుగు పాట గుర్తుకొచ్చింది, నాయ్యాల్ది, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇరగదీసి కుమ్మేసొదిలాడు ఈ పాటని. ఈ పెపంచకంలో యస్.పి.బి మాత్రమే అలా పాడగలడు. అదేంపాట? సిత్రం - శ్రీవారు - మావారు సంగీతం - జికె వెంకటేష్ రాసిన వారు - సి నారాయణరెడ్డి
పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని అది ఈరోజే తెల్సింది లాల లాలాల లాల్లాల లలలాలా లలలాల
మబ్బు కన్నెలు పిలిచేనని మనసు రివ్వున ఎగిరేనని వయసు సవ్వడి చేసేనని ఇపుడే తెలిసిందీ రురు .. రురు.. రురురూ
పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని అది ఈరోజే తెల్సింది
అలలు చేతులు సాచేనను నురుగు నవ్వులు పూచేనని నింగి నేలను తాకేనని నేడే తెల్సింది రురు .. రురు.. రురురూ ..ఆ .. ఓ
పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని అది ఈరోజే తెల్సింది
ఇక్కడ వినండి ఆ పాటని
సర్వజనులకూ ఏసుక్రీశ్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు. Merry Christmas to all!! Happy Holidays!!
ఇప్పటికి చాలామంది, చాలాసార్లు, చాలారకాలుగా రాస్కొచ్చారు, రాసారు, చదివాం, చదువుతూనే ఉంటాం - టీవీ వార్తల, టీవీ సీరియళ్ల తఢాకా గురించి, ఎలక్ట్రానిక్కు మీడియా గురించి. కొన్ని కొన్నిసార్లు వళ్లు జలదరిస్తుంటుంది టీవీల వాళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలకి. ఓ రోజునా నాకు బాగా గుర్తు, టీవీ 9 లో(అప్పుడప్పుడే వచ్చింది ఈ టీవీ9, రవిప్రకాశ్, బ్లాబ్లా వల్ల మా నాన్నా నేను తెగ చూసే వాళ్లం) ఓ వార్త ఒంగోలు జిల్లాలో చాపకిందనీరులా అర్ధరాత్రులు జరుగుతున్న "నగ్న నృత్యాలు" అని. సరే, బానే ఉంది, మన సమాజ దిగజారుడుతనం, వెంటనే ప్రత్యక్షం ఆ నృత్యం దృశ్యాలు. షాక్ అయ్యాం. కనీసం బ్లర్ కూడా చేయకుండ వేసేసాడు. ఇంకోరోజున, ఎక్కడో హైదరాబాద్లో ఓ మస్సాజ్ సెంటరు, వాడు మస్సాజు చేస్తు చేసిన అకృత్యాలని టీవి9 బయటకిలాగింది. సరే బానే ఉంది. మస్సాజు చెసేవాడు దొంగతనంగా తీసిన వీడియోలు గట్రా ప్రసారం జేసేసాడు నిస్సంకోచెంగా. ఇంకోసారి ఏదో ఇంటర్నెట్ సెంటర్లో జరిగిన కామక్రీడ అని ఆ వీడియోని ప్రసారం జేసేసాడు. ఇదిజాలదన్నట్టు పొద్దుణ్ణుండి సాయంత్రం దాకా అదే వార్త సూపించిందే సూపించి జనాల్ని రెచ్చగొటేస్తున్నారు, హింసించేస్తున్నారు. మనలో ఎంతమంది ఎన్నిసార్లు ఇలా అనుకోలేదు, చిన్నపిల్లల ముందీ పాడు/ పాడు నాటాకాలు /పాడు సినిమాలు చూడలేకపోతున్నాం అని, ఛీఛీ ఏంటీ వీళ్ల కార్యక్రమాలు అనీ. మన ప్రసారభారతి, బ్రాడ్క్యాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు విధిగా ప్రతీ టీవీ ఛానెల్కీ ఈ క్రిందతెలిపిన లోగోలని ప్రతీ కార్యక్రమంలో ప్రసారం చేసి తీరాలి అని ఎందుకు చెప్పరూ? TV-Y (Youth Television) (All children) రెండు నుండి ఆరు సంవత్సరాల వయసు వాళ్లకి TV-Y7/TV-Y7-FV (Directed to older children) (Youth-7 Television) ఏడేళ్లు మరియూ అంతకన్నా ఎక్కువ వయసు వాళ్లకి FV - అంటే ఫాంటాసీ వయొలెన్సు అని. TV-G (General audience) ఎవుడైనా జూడొచ్చు అని TV-PG (Parental guidance) ఈ కార్యక్రమాల్ని తల్లితండ్రుల పర్యవేక్షణాలో మాత్రమే చూడాలీ అని అర్ధం. దీంట్లో V - కొంచెం వయొలెన్స్ S - సజెస్టివ్ కౄడ్ హ్యూమర్. అంటే కుళ్ళుజోకులు అని అనుకోవచ్చేమో. ఉదా!! ఆంటినడుగూ ఏదైనా ఇస్తది (భగవాన్ డైలాగు - దేన్ని మన వెన్నెముకలేని తెలుగు జనాలు పంచ్ అంటారు - బొంగు భోషాణం) L - స్వల్ప కారు కూతల, పిచ్చి భాష (డబల్ మీనింగు వచ్చేలా ఉండే భాష) D - పిచ్చి పిచ్చి డైలాగులు TV-14 (Recommended for people 14 or older) పధ్నాలుగు ఏళ్లు మరియూ అంతకన్నా ఎక్కువ వయసు వాళ్లకి V భయంకరమైన కౄరత్వం, చంపుకోడాలు, నరుక్కోడాలు S కామప్రక్రియలు, అంటే ముద్దులు, వాటేస్కోడాలు అవి ఇవీ. L బూతులు D బూతికూతలు TV-MA (intended for mature audiences) పదిహేడు ఏళ్లకన్నా ఎక్కువ వయసువారికి మాత్రమే. అంటే పెద్దలకి మాత్రమే అని. V భరించలేనంత కౄరత్వం S కామక్రీడలు L దారుణమైన బూతిమాటలు
వివరాల పట్టిక
దీని ప్రకారం చిన్నపిల్లలకి ఇవి చూపరాదు, వినబడనివ్వరాదు, కనబడనివ్వరాదు #౧. ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే రా #౨. పందినాకొడుకులు, సచ్చారు #౩. నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి, అదివినబడుతుంటే జారుతుంది మిడ్డీ. #౪. భగవాన్ పంచులు #౬. వార్తల్లో బూతు బొమ్మలు #౭. తొడకొడతా, జడపడతా అట్.అల్ (et. al)
నిన్నటి వారం, శుక్రవారం నుండి-ఆదివారం వరకూ ఉత్తర అమెరికా మొత్తం మంచు దిబ్బలు దిబ్బలుగా పడింది. మాకు శుక్రవారం మద్యానం 12 మొదలై, శనివారం రాత్రికి కొంచెంతెరిపిచ్చి, ఆదివారం సాయంత్రం వరకూ కుమ్మేసింది. చికాగోలో జనాలు -24 ఫారెన్హైట్ విండ్చిల్ల్ చూసారని వార్త. జీవితం అంటె అంత సులభం కాదు అనిపిచటంలేదూ?
ఈ తుపాను ఫోటోలు, కొన్ని వీడియోలు ఇక్కడ పెడుతున్నా చూడండి.
నిన్న దేశి షాపుకి వెళ్లాం, వస్తుంటె, ఓ చోట సిగ్నలు పడింది, ఆగాను, పక్కనే సిమెట్రీ, అదేంటి అని అడిగాడు సూరిగాడు, "సిమెట్రి" "ఎందుకది?" "చనిపొయ్యాక అక్కడ బూడ్చిపెడతారు" "చనిపోవటం అంటే" "యం&యం తిను అరవకుండా" "its dark out there, its spooky out there, hello" "ఎవరికిరా హెల్లొ?" "చెయ్యిఫోను లో మాట్లాడుతున్నా?" "చెయ్యిఫోనా? అంటే?" "చేతిని చెవిదగ్గర పెట్టుకుని మాట్లాడితే చెయ్యిఫోను, కాలుని చెవిదెగ్గర పెట్టుకుని మాట్టాడితే కాలు ఫోను" "ఇంతలో నాకు call, మా మితృడు, ఎదో install చెయ్" "Install అంటే ఏంటి?" "నీకు తెలియదులే నాన్నా" "install కాదు, అది బ్యాడ్, చిన్నపిల్లల దెగ్గర అనకూడదు" ఇంతలో పోలీస్ కార్ పక్కనుంచి కుయ్యో కుయ్యో "పోలీస్ పోలీస్" "అవునమ్మా, గోల చేస్తే నిన్ను ఇచ్చేస్తా" "అతను గుడ్ పోలీస్, నన్ను తీస్కెళ్లి అమ్మకి ఇచ్చేస్తాడు సూర్యా గుడ్ బోయ్ అని. పోలీస్కి కూడా పోలీస్ బేబి ఉంటుంది, ఆ బేబి పోలీస్ కార్ సీట్లో కుర్చుంటుంది. మోన్స్టరేమో కేజ్ లో ఉంటుంది." "సరే నాన్నదేం కారు?" "నిస్సాన్ ఆల్టిమా, నాన్నా నీకారు బాగలేదు" "ఏమిరా ఏమి దీనికి" "నా షూస్ లైటెనింగ్ మెక్వీన్, క్యాప్ లైటెనింగ్ మెక్వీన్, గ్లొవ్స్ లైటెనింగ్ మెక్వీన్, జాకెట్టు లైటెనింగ్ మెక్వీన్, టీ షర్టు లైటెనింగ్ మెక్వీన్, కార్ లైటెనింగ్ మెక్వీన్! ఫెర్రార్రీ కొను రెడ్ ఫెర్రారీ, 95 వ్రూం వ్రూం వ్రూం!!" "హా!!!!!@#@#$!$%%^!#$^!^&^&*&*()*)" Note : Vroom = side exhausts, 95 is the car number for ferrari in famous pixar movie called "CARS"
ఒక్కసారి వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూస్కుంటే, ఎన్నో ఓడుదుడుకులు, ఎన్నో మైలురాళ్లు, ఎన్నో గోతులు, ఎన్నో బొక్కలు, ఎన్నో అబద్ధాలు, అన్నో పచ్చి నిజాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, మరెన్నో కష్టాలు, కన్నీళ్లు. ప్రతీ మనిషీ తెలిసి కొన్ని తప్పులు చేస్తాడు, తెలియక కొన్ని తప్పులు చేస్తాడు, తప్పటడుగులు వేస్తాడు. ఐతే తెల్సిచేసిన తప్పులు ఈష్టు తెలియక చేసిన తప్పుల నిష్పత్తి చాలా ముఖ్యం. నేనూ చాలా చేసాను, కొన్ని కొన్ని సార్లు తెల్సి చేసాను. కొన్ని తెలియక చేసాను, కొన్ని అడాలసెంట్ వయసు చేయించింది. అలాంటి తప్పుల్లో నా అతిపెద్దద్ది, సిగరెట్టు తాగే అలవాటు. సరదాగా మొదలుపెట్టాను, అందర్లానే. దాన్ని మానటం పెద్ద కష్టమైన విషయం కాదు అనికూడా తెల్సు మొదలెట్టిన రోజున, కాని, దేనికో అసంబద్ధమైన కారణాలు నాకు నేనే చూపుకుంటూ అలా తాగుతూనే వచ్చా. ఓ రోజున ఠకా మని మానేసా, కొన్ని నెలల క్రితం. అది ఎప్పుడో చేసుండాల్సింది. ఎంతైనా ప్రతీ మనిషికీ సమాజం కొన్ని పాఠాలు నేర్పిస్తే, జీవితం కొన్ని నేర్పుతుంది. నేనూ నాజీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. ఐతే, నా జీవితమ్లో నాకు జరిగిన అతిపెద్ద నష్టం, మా నాన్నని కోల్పోవటం. ఆనందాలు -పెళ్లి, నేనంటే ప్రాణం అనే శ్రీమతి, సూరిగాడు పుట్టటం, ఇప్పుడు పాప పుట్టటం. ఐనా ఏదో వెలితి. మా అమ్మ ఒక్కతే దేశంలో ఉందే అని. కోరి అమెరికా రావడం నిజంగా నా జీవితంలో పెద్ద తప్పటడుగు. మనం కొన్నిటికి వేదాంతంతో మూసేసుకుంటాం "డెస్టినీ ఎవ్వర్ని ఎటు తీకెళ్తుందో కదా" అని. చూద్దాం ఇక ముందు ముందు ఎలా ఉంటుందో. కానీ అమెరికా కి వచ్చి నేను ఎన్నో నేర్చుకున్నా. నేను ఎన్ని బ్లాగులు రాస్తున్నా, నా పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలా. Bhaskar is the pillar for the projects అని అనిపించుకున్నా. Bhaskar, Problem Solver అనే అనిపించుకున్నా. I am happy for that. నాకు చేతైనంతలో నా అనుభవాల్ని నలుగురితో పంచుకుంటున్నా. WebSphere మీద బ్లాగు రాస్తున్నా. నాకు ఎవ్వరైనా మెయిల్ చేసి సహాయం అడిగితే వాళ్లని ఏమాత్రం నిరుత్సాహపరచను. FileNet మీద ఈ ఫోరంలో ప్రశ్నలకి నాకు తెల్సిన సమాధానాలు రాస్తుంటా. నలుగురికీ ఉపయోగపడాలని http://projectsforfuture.blogspot.com రాస్తున్నా.
లేక అగ్ని. ఈరోజు మా కార్యాలయంలో అగ్గి సైర్రన్లు కుయ్ కుయ్ కుయ్ అని మోగినై. అందరం కిందకి వెళ్లాం, అగ్నిమాపక యంత్రం వెంటనే వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది లోపలకి వెళ్లారు. వాళ్లు మొత్తం చూసి మొత్తానికి ఆ అలారం అఱుపులు అపేసి, మేము మళ్లీ తిరిగి మామా సీట్లలోకి వచ్చేసరికి అరగంట పట్టింది. మా కార్యాలం ఓ పెద్ద ఆకాశ హార్మ్యం కాదు. ఆరు అంతస్థులు ఉంటాయ్ మొత్తం. మేము నాలుగో అంతస్థులో ఉంటాం. మాకు మా వింగులో మొత్తం ఇద్దరు అగ్ని మార్షల్స్ ఉంటారు. వీళ్లు అగ్ని అలారం మోగంగనే రంగమ్లోకి దిగి ఇటు వెళ్లండి, అటు దూకండి అని చెప్తారు, దారి చూపిస్థారు. మరియూ అందరూ ఖాళీ చేసారా లేదా, రెష్ట్ రూముల్లో, డెస్కుల కిందా లేక మూలల్లో ఎవరైనా మిగిలిపొయ్యారా అని చూసే బాధ్యత వీళ్లదే. అప్పుడప్పుడు డ్రిల్లు కూడ చేస్తారు. అంటే ఫాల్స్ అలారం వీళ్లే ఇచ్చి, అందర్నీ కిందకి పంపించి ఇదిగో ఇలా అలారం మోగంగనే కిందకి రావాలి, ఆ అగ్ని మార్షల్స్ చెప్పినట్టు చెయ్యాలి అని చెప్తారు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటె, నేను కొంతకాలం క్రితం చెన్నై లో పనిచేసేవాడిని. మా కార్యలయం క్యాపిటాలే టవర్సు, అన్నా సాలై, తెయినంపేట. ఈ బిల్డింగులో మొత్తం 11 అంతస్థులు ఉంటాయ్. నిల్చోబెట్టిన అగ్గిపెట్టెలా ఉంటుంది ఈ కట్టడం. దీంట్లో మావి 8,9,10,11 అంతస్థులు. రెండు లిఫ్ట్లు. లిఫ్టుకి రెండువైపులా మెట్లు. ఇది అమెరికన్ పద్ధతిలో కట్టబడింది. అంటే తెల్సుగా, ఫ్లోర్లు పైకిలేపటం, చుట్టూ అద్దాలతో మూసేయ్యడం. ప్రతీ ఫ్లోరుకి అగ్ని అలారమ్లు ఉన్నయ్. ఇంతకీ సంగతేంటంటే, అప్పుడప్పుడూ అగ్ని అలారం మోగేది. మనోళ్లు పొరబాటున కూడా లేచే వాళ్లు కాదు సీట్లలోంచి. అలారం మోగంగనే సెక్యూరిటీ వచ్చి దాన్ని ఆపేసి వెళ్ళిపొయ్యేవాడు. దీంట్లో పెద్ద రాయటానికేముంది అనుకుంటున్నారా. చెప్తా! నిజంగనే అగ్ని పుట్టింది, అలారం మోగింది. కిందకి ఎలా వెళ్లాలి? ఫ్లోరు మొత్తానికి ఒక్కటే ద్వారం. ఎంతమంది పడతారు దాంట్లోంచి? ఎప్పుడైనా ఒక డ్రిల్లు జరిగిందా ఇదీ పద్ధతీ నిజంగా అగ్ని రాజుకుంటే - మిమ్మల్ని మీరు బయటపడేస్కునే విధానం ఇదీ అని ఎప్పుడూ ఎవ్వడూజెప్పలా. ఒక్క వాలంటీరు కూడా లేడు. కనీసం అగ్ని అలారం మోగినప్పుడు ఇలా చెయ్యండి అనే బొమ్మలు కూడా లేవు. మీరు ఇక్కడ ఉన్నారు అనే ఒక లేఅవుట్ పెట్టినంత మాత్రాన సరిపోదుకదా?
ఓ బిల్డింగులు కట్టేస్కుంటాం, అమెరికా ఎక్కడోలేదు ఇక్కడే మన కళ్లముందే ఉంది అనేట్టు ఆర్భాటం చేస్కుంటాం. కానీ కనీస వసతులు మర్చిపోతాం. మీ కార్యాలయంలో కూడా ఇలానే ఉంటుందా? జనాలకి తెలియజెప్పండి. మీ మేనేజిమెంటుకి తెలియజేయండి, కనీసం ఆరు నెలలకోసారి డ్రిల్లు ఏర్పాటు చెయ్యమని. మార్షల్స్ ని తయ్యారు జేస్కోండి, ఆళ్లకి శిక్షణ ఇవ్వమని తెలియజేయండి.
పోయిన ఆదివారం రాత్రి టీవీ ఏసియా లో బాగ్బాన్ అనే సినిమా వేసాడు. నేను ఈ సినిమా మొట్టమొదటినుండీ చూడలేకపోయినా సగం నుండి చూడటానికి వీలైయ్యింది. ముందుగా బాగ్బాన్ అంటే అర్ధం ఏమైఉంటుందీ అనుకుని, గూగుల్లో గెలికా, వెంటనే "తోటమాలి" అని వచ్చింది. ఆ పేరు ఈ సినిమా కధకి వందశాతం సరిగ్గా సరిపోయింది. తండ్రి అనే తోటమాలి సంసారం అనే తోటని, పిల్లలు అనే మొక్కల్ని, ఎంత అపురూపంగా పాదులు తీసి, నీళ్లు పోసి, పురుగుపుట్రా నుండి కాపాడుతూ, రెక్కలు ముక్కలు చేసుకుని కాయకష్టం చేసుకుంటు, చిగుళ్లేస్తే ఆనందపడుతూ, పూలుపూస్తే కేరింతలుకొడుతూ అహర్నిశలూ తపిస్తాడు. ఈ సినిమా అలాంటి ఓ తోటమాలి కధ.
అడ్డాలనాటి పిల్లలే కాని గడ్డాలనాటి పిల్లలు కాదు ఓ సామెత. ఒక తండ్రి కొడుక్కి మొట్టమొదటి అడుగు వెయ్యటానికి అండగా నిలిస్తే, ఆ కొడుకు ఆ తండ్రికి చివరి అడుగు వెయ్యటంలో అండగా ఎందుకు నిలవలేకపోతున్నాడు?. ఈ సినిమా కధ అదే. ఎన్నో తెలుగు సినిమాలు ఇలాంటివి ఉన్నాయ్, కాని, అమితాభ్ మళ్లీ ఈ సినిమాలో, "అమితాభ్ ఒక్కడే" అనిపించుకున్నాడు. నాకు ఆ పాత్రలో ఆయన మా నాన్నలానే అనిపించాడు, మీకూ మీనాన్నలానే అనిపిస్తాడు. అంత సహజంగా జీవించాడు, ఎందుకంటే అతనూ ఓ తండ్రేగా.
సరే, ఈ సినిమాలో పాత్రలు పాత్రధారులు అమితాభ్, హేమామాలిని, శరత్ సక్సేనా, పరేశ్ రావల్, మరియూ బృందం విడుదల - అక్టోబర్ 2003 దర్శకత్వం - రవి ఛోప్ర కధ - బి ఆర్ ఛోప్ర ఈ కధని బి.ఆర్. ఛోప్రా ఎప్పుడో రాసిపెట్టుకున్నారుట. ఆయన దిలీప్ కుమార్ మరియూ రాఖీ లనిపెట్టి తీద్దాం అనుకున్నారుట. కధలోకొస్తే :- రాజ్ మల్హోత్ర (అమితాభ్), పూజ (హేమామాలిని) దంపతులకు నలుగురు పిల్లలు. రాజ్ ICICI బ్యాంక్లో పనిచేస్తూ సంతుష్టంగా బతికేస్తూ ఓరోజున పదవీ విరమణ చేసి, పెళ్లాం పిల్లతో గడపొచ్చు అని ఆశిస్తాడు. రాజ్ పూజాల వైవాహిక బంధం 40 ఏళ్లైనా వాళ్ల ప్రేమ ఇంకా వికసిస్తూనే ఉంటుంది. ఐతే, మరి పదవీ విరమణ అయ్యాక, పెద్దరికం వల్లా, ఇక పిల్లలదెగ్గరకి చేరుకుందాం సహారాకోసం అనుకుంటారు రాజ్ మరియూ పూజ. కానీ వీళ్ల బాధ్యతల్ని తాము తీస్కోటానికి ఆ పిల్లలు పెద్దగా ఇష్టపడరు, దానికో ప్రత్యేక కారణం రాజ్ దెగ్గర ఆస్తులు కూడా లేకపోవటం. మొత్తానికి ఆ నలుగురు పిల్లలు ఒక పరిష్కారం కనిపెడతారు. అది, రాజ్ పెద్ద కొడుకు దగ్గర, పూజ రెండో కొడుకు దగ్గర ఉండాలి అని. ఆరూనెలల తర్వాత, రాజ్ మూడోవాడి దగ్గర, పూజ నాలుగోవాడి దగ్గరకీ మారాలి అని. రాజ్ కి ఈ ఆలోచన నచ్చదు, పూజ ని తనని అలా విడదీయ్యటం అతనికి మింగుడుపడదు. కాని తప్పని పరీస్తితుల్లో రాజ్ మరియూ పూజ విడిపోయి పిల్లలదగ్గరకి చేరుకుంటారు. ఇక వాళ్ల కష్టాలు మొదలౌతాయి. ఇక్కడ కష్టాలకన్నా అభిమానాలు హర్ట్ అవుతుంటాయి. ఇటు తండ్రికి రావాల్సిన గౌరవం అటు తల్లికి ఇవ్వ్లాల్సిన గౌరవం ఉండదు. పిల్లల మాటలు చాలా కటువుగా, వీళ్లు తమ కొడుకులపై పెట్టుకున్న నమ్మకాల్ని చీల్చి చెండాడుతూ ఉంటాయి. ఉదాహరణాకి, రాజ్ పొద్దున్నే బ్రేక్ఫాష్ట్ చెయ్యటనికి భోజనబల్ల దెగ్గరకి వస్తాడు, ఓ కుర్చీలో కూర్చుంటాడు, వెంటనే కోడలు, మామయ్య, అది మీకొడుకు కూర్చునే కుర్చి, మీరు అటు కూర్చోండి అని చెప్తాడు. ఈ లోపల రాజ్ కి అదే అపార్ట్మెంటుల్లో ఉంటున్న పరేశ్ రావల్ పరిచయం అవుతాడు. ఇతనికి ఓ కాఫీషాప్ ఉంటుంది. పరేశ్ రావల్, రాజ్ తో మీ కధని కాయితానికెక్కించండి అని ప్రోత్సహిస్తే, రాజ్, అది రాస్తుంటాడు, ఒక చిన్న టైప్ రైటర్ సహాయంతో. ఓరోజు నిద్ర పట్టక టైప్చేస్తూ ఉంటాడూ టిక్కు టిక్కు అని. ఆ శబ్దానికి కోడలుగారికి నిద్ర పట్టక మొగుడ్నిలేపి పంపిస్తుంది ఆపమని చెప్పు మీ నాన్నకి అని. వాడు వచ్చి, ఏంటి ఈ గోలా అంటాడు. నిద్ర పట్టడమ్లేదు అందుకని అంటే ఈ వయ్యసులో నిద్ర పట్టదు, అది మామూలే, ఐతే, మేముకూడా నిద్రపోకూడదా అంటాడు. ఓరోజు అర్ధరాత్రి కొడుకు పనిచేస్కుంటుంటే రాజ్ అడుగుతాడు, ఏంజేస్తున్నావ్ అని, ప్రెజెంటేషన్ తయ్యారు చేస్తున్నా అంటాడు కొడుకు. నేను సహాయం చేయనా అంటే కొడుకు తండ్రిని ఎగతాళిగా మాట్లాడుతూ, మేము మీలా కాదు, మా ఆలోచనల్తో యింతవాళ్లమయ్యాం, మీ వయ్యస్సొచ్చినా ఇబ్బందిలేకుండా, మీలా ఇంకొకళ్ల దెగ్గర దేబిరించకుండా కూడబెట్టుకుంటున్నాం అంటాడు. ఇలాంటివి పూజ కి కూడ జరుగుతూ ఉంటయి. ఇలా ఆరునెలలు గడచిపోతాయి. మరి బాధ్యతలు షిఫ్ట్ అయ్యే రోజు వస్తుంది. కింది కొడుకులు ఇద్దరూ అస్సలు సుముఖంగా ఉండరు వీళ్ల బాధ్యతల్ని తీస్కోటానికి. ఇంతలో రాజ్ తన కధని, పేరు బాగ్బన్, పూర్తి చేసి, పరేష్ రావల్ కి ఇచ్చేసి వెళ్లి పోతాడు. పూజ కి ఫోన్ చేసి నువ్వు వచ్చే రైలు, నేనొచ్చే రైలు కలిసే చోట మనం ఒకచోట కలుద్దాం అంటాడు. తను సరే అని ఆ స్టేషన్లో దిగుతుంది. రాజ్ పూజ కలుస్తారు. ఆ వూరు వాళ్లు వాళ్ల జీవితాన్ని మొదలుపెట్టిన ఊరే. మొత్తానికి అక్కడ రాజ్ యొక్క పెంపుడుకొడుకు, సల్మాన్ కలుస్తాడు. సల్మాన్ ఇంటికి వీళ్లు వెల్తే అక్కడ భగవంతుడితో పాతు వీళ్లని కూడా పెట్టి పూజిస్తున్నట్టు తెల్సుకుంటారు రాజ్ మరియూ పూజ. ఇంతలో పరేష్ రావల్ మరియూ అతని భార్య ఈ కధని చూసి చెలించిపొయి, ఇతన్ని కలుద్దాం, అనుకునేలోపు, కొంతమంది సలహామేరకు బాగ్బన్ అనే కధని అచ్చువేస్తారు, ఆ కధకి ఉత్తమ కధ అవార్డ్ వస్తుంది. ఆ కధ పబ్లిషర్ టోకెన్ అడ్వాన్స్ కింద ఒక 10 లక్షల చెక్కు ఇస్తే, దాన్ని రాజ్ కి అందిద్దాం అని పరేష్ రావల్ రాజ్ దెగ్గరకి వెల్తాడు. ఆ పుబ్లిషర్ రాజ్ కి సన్మానం ఏర్పాటు చేస్తాడు. దీని సంగతి తెల్సుకుని రాజ్ కొడుకులు "రాజ్ దెగ్గర డబ్బు మళ్లీ వచ్చింది" కాబట్టి, వెళ్లి కాళ్ల మీద పడి క్షమించేయమని అడుగుదాం, తల్లితండ్రులు క్షమిచి తీరుతారు అని ఆ సన్మాన కార్యక్రమానికి వెళ్తారు.
ఇక ఈ సినిమాకి హైలైట్ మొదలు - అది - ఆ వేదికనుద్దేశించి రాజ్ ఇచ్చిన ప్రసంగం.
ప్రసంగం అయ్యాక, రాజ్ పూజ ని తీస్కుని వెళ్లిపోతుంటె, కొడుకులు క్షమించమని అడుగుతారు, నేను క్షమించను అనేసి ముందుకి వెళ్లగానే, వాళ్లు తల్లిని వేడుకుంటారు. ఆ తల్లి, "ఒక తల్లిగా మిమ్మల్ని క్షమించినా, ఒక భార్యగా నేను క్షమించలేను" అంటుంది.
ఈ కధ మనలో చాలా మందికి దెగ్గరగా ఉంటుంది. కావాలని తల్లితండ్రుల్ని మనం విసిగించక పోయినా, కొన్ని కొన్ని సార్లు మనం వాళ్లకి ఇవ్వాల్సిన విలువని ఇవ్వము. అది క్షమించ రాని నేరం. కాబట్టి మనల్ని కని పెంచి, విద్యా బుధుల్ని నేర్పి, విజ్ఞానాన్ని ఇచ్చి, మనం ఈ రోజున ఇలా నిలబడేలా కష్టపడిన మన తోటమాలుల్ని మనం మన పూల పరిమళాలతో, కమ్మని ప్రేమా వాత్స్ల్యపు వాసనల్తో వాళ్లుపడిన కష్టాలనుండి సేదదీరుద్దాం.
ఓ చిన్న విన్నపం: పై అమితాభ్ ప్రసంగాన్ని ఎవ్వరైనా తెలుగులోకి అనువదించగలరా? నోట్: ఈ అమితాభ్ ప్రసంగాన్ని రాసింది జావేద్ అక్తర్. అక్తర్ ఈ సినిమాకి రచయిత కాదు, కానీ కేవలం ఈ ప్రసంగం రాసిచ్చారాయన. దీంట్లో నాకు నచ్చిన పాట : నేను ఇక్కడ నువ్వు అక్కడ జీవితం ఎక్కడ - main yahan tu wahan jindaji hai kahaan: పాదింది : అమితాభ్ మరియూ అల్కా యాగ్నిక్ సంగీతం : ఆదేష్ శ్రీవాత్సవ్ రచన : షహీద్ ఫియాజ్
Read somwhere that: "The movie is a remake of 2 different movies - the Marathi movie 'Tu Thitha Me', meaning Where You Are There I Am, and a National award winning Kannada movie 'Post Master'."
మనకి భారత్ లో ఎక్కడ బాంబు పడిన, వెంటనే ఐ.యస్.ఐ అనే వినిపిస్తుంది/అనిపిస్తుంది. ఇక్కడనుండి మతం పేరుతో పాకిస్థాన్ వైపుకి వెళ్లి అక్కడి యే ల.ఏ.తో లోనో జేరి, మళ్లి వెనక్కొచ్చి అఱాచకాలు సృష్టింస్తుంటారు అనేది మన నమ్మకం, మనకి తెల్సిన నిజం. ఐతే, FlipSide చూస్తే? దేనికోసమో గూగుల్లో గెలుకుతుంటె ఈ లింకు తగిలింది. చదివి బిత్తరబొయ్య, ఆశ్చర్య పోయా. నాయ్యాళ్లలారా, ఎంతకి తెగించారు అనుకున్నా. వీడి సారాంశం ఏంటంటే, పాకిస్థాన్లో జరిగే బాంబు పేలుళ్లకి కారణం మన రా (ఆర్.యే.డబ్ల్యూ - రీసెర్చ్ మరియూ ఎనాలిసిస్ వింగ్) మరియూ ఆఫ్ఘన్ ఏజెన్సీల ప్రోద్బలమే అని. వీడంటాడూ, పాకిస్థాని ఇన్వెస్టిగేటర్లు మొత్తానికి ఛేదించారు అని, అది ఇది. ఏదేదో రాశాడు. బాగుంది కధ, ఇటైపు మనం వాళ్లని అటైపు ఆళ్లు మనల్ని, కానీ నిజం ఏంటో ఎవ్వనికీ తెలియదు.
ఈ రోజు పొద్దున్నుంచి నేనూ పాడ్ క్యాస్టింగు మొదలుపెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ, నా పక్కన కూర్చునే టోనీ గానిదెగ్గరకి వెళ్లి ఊర్కనే గెలికా. దేనికంటే మనోదెగ్గర సానా కళలు ఉన్నాయ్. వీడు ఫార్ములా ఐదు రేసరు. డి.బి.యే. మ్యాక్ డెవలపర్, అది ఇదీ. మనోడి దోస్తులుకూడా మంచి నిఖార్సైన బ్యాచి. అట్టాంటోళ్లలో స్కాట్ అనేవోడొకడు, వాని ద్వారంవెలుపలి (OUTDOOR) ఫోటోగ్రఫి ఇక్కడ చూసి దసుకోమాకండి. సరే అలాఎళ్లి గెలకంగనే, మనకి తెల్సిన ఇషయల్నే ఇంగిల్పీసులో సెప్పాడు. అయ్యాక, ఇందాక మళ్లీ కేకేసాడు, బాస్కార్ ఉన్నావా అని, వస్చన్నా అని ఎళ్లా. మా సొలారిస్ పెద్దాయన ఉన్నాడు అక్కడ. అతని పేరు, బాబ్. ఏంటి సంగతి బాస్కర్ అన్నాడు బాబ్. ఇదీ అన్నా, నీకు మ్యాక్ ఉందా అన్నాడు, లేదు అన్నా, ఐతే సారీ బాస్కార్, మ్యాక్తో ఇట్స్ వీజీ అన్నాడు, సర్లే మావా, ఇప్పుడు దీంకోసం మ్యాక్ యాడకొనంమంటా అని సెప్పేసి యనక్కి తిరగబోతుంటె, ఇదిగో నా పాడ్ క్యాస్ట్ యూఆర్యల్ అని ఇచ్చాడు. చాలా ఫన్నీగా ఉన్నాయ్ బాబ్ పాడ్ క్యాస్ట్. ఆటికోసం ఇక్కడో లుక్కు వెయ్యండి
నేనూ ఒక పాడ్ క్యాస్ట్, అంటె పెద్దేమి లేదు ఒక యం.పి.త్రీ ఫైలు, పెట్టా. నా పీజ్జా పురాణంలో ఇందాక జతచేసా. ఇది కేవలం పరీక్షకి మాత్రమే, నా గొంతు చాలా తక్కువ గొంతుకతో ఉంది, దేనిఅంటే కార్యాలమ్లో ఉండి మాట్టాడా కాబట్టి.ఇక్కడ వినండి.
పోయిన వారం నేను కళ్లు చూపించుకోటానికి డాట్టరు దెగ్గరకెళ్లా, ఈ సారి కళ్లద్దాల బదులు కళ్లకతుక్కునే కటకాలు - కాంటాక్ట్ లెన్స్ తీస్కోవాలని ఆలోచించా. "ఈ సారి" ఎందుకంటే, మా బుడ్డోడితో నా కళ్లజోడుకి మంచి అనుభవం. ఇప్పటికీ లాగి అవతలేస్తాడు, లేక వెనకనుంచి వచ్చి ఘట్టిగా కళ్లజోడుని గుంజుతాడు. మరి ఇప్పుడింక ఈ పిల్ల చేతులు పైకి లేపుతున్నది, క్రికెట్టులో అంపైర్లా. డాట్టరుకాడికి ఎళ్లా. కూర్చో బాసు పిలుస్తా అన్నాడు, సరే కూసున్నా, పక్క కుర్సికేసి ఓ లుక్కేసా, ఓ పత్రిక ఉంది అక్కడ. వెంటనే నా బుర్ర దాని వివరాలు బ్లా బ్లా నోట్సేసేస్కుంది. అదేం పత్రికరాబాబు అంటే - Electronic Gaming Monthly. నాకు తెలవదు ఇట్టాంటిదోటుంటదని. దీంట్లో మొట్టమొదటగా నన్ను ఆకర్షించింది గేముల రేటింగులు, అంటే యే యే గేములు యే యే వయసోళ్లకి అని. ESRB అంటే Entertainment Software Rating Board అని. ఇవీ రేటింగులు - E, EC, E 10+, T, M, AO. E - Everyone EC - Early Childhood E 10+ - Everyone 10 and above T - Teen M - Matured (17+) AO - Adult Only. మరి RP అని ఉంటేనో అని అడగొచ్చు, RP అంటే - Rating Pending అని. కాబట్టి మీరుకూడా గేములు కొనేప్పుడు తప్పక వీటికోసం చూసి నిర్ణయించుకుని కొనుక్కోండి.
ఈ పత్రిక Electronic Gaming Monthly సంగతి ఏంటో చూద్దాం:
ఈమాసపత్రిక ఈరోజు రేపటి వీడియోగేమింగ్ కాన్సోళ్ల గురించి, గేముల గురించి, వాటి తయ్యరీదారులతో ముఖాముఖిలు ఇత్యాది వార్తల్ని అందిస్తుంది. మరియూ, గేముల సమీక్షలుని కూడా కూలంకుషంగా అందిస్తుంది. ఆ రోజు పత్రికలో వీటిమీద రివ్యూ చూసా - ఆసాంతం చదవకపోయినా ఓ లుక్కేసా. అవి - Madden NFL 09 NCAA Football 09 Beijing 2008 Alone in the Dark Izuna 2 Guitar Hero Decades
నేను పెద్ద గేమర్ని కాదు. నాదెగ్గర Ages of the Empire, Warcraft, Tzar అనే గేంస్ ఉండేవి. మొన్నీమధ్య brother bear అని ఒకటి కొన్నా మాబుడ్డోడికి. I think he is not yet ready for it. సరే! గేమింగు కాన్సోల్ అంటే గేము ఆడే పరికరం. అసలు ఎన్ని గేమింగ్ కాన్సోల్స్ ఉన్నయో తెలుసా మీకు? గేమింగ్ కాన్సోల్స్ లో ప్రస్తుతానికి ఏడోతరం వి నడుస్తున్నాయ్. 7th Generation Gaming Consoles. అవి - #1. మైక్రోసాఫ్ట్ వారి ఎక్స్బాక్స్ మూడొందల అరవై - Microsoft's XBOX 360 #2. సోని వారి ప్లే స్టేషన్ మూడు - Sony's Playstation 3 #3. నింటిండో వారి వీ - Nintendo's Wii
ఇవి కాక పిల్లల్ని చెడగొట్టటానికి ఈ నింటిండో వాడి డీయస్ అని ఒకటి ఉంది. దీనికి అలవాటైతే ఇక అదేలోకం అవుతుంది. అదీ కధ. Happy Gaming.
౧. టెర్రరిష్ట్లు హైజాక్ చేసిన పోలీస్ వ్యాన్ ఏమైంది? ౨. రూమ్ సర్వీస్ చేసేవాళ్లు తీవ్రవాదులు బసచేసిన గదుల్లో సర్వీసు చేసేప్పుడు ఎటువంటి తేడాని గమనించలేకపొయ్యారా? ౩. ౪ నెలలనుండే ప్లాన్ చేసి స్టూడేంట్లుగా వచ్చినప్పుడు హోటళ్లలో చెక్-ఇన్ క్రైటీరియా ఏంటి? ౪. ఇంత పెద్ద పెద్ద హోటళ్లలో సిసిటీవీలు ఉండవా? ౫. రూమ్ ౬౮౦ కి చాలామంది జనాలు వచ్చేవాళ్లు - ఎంత విలువైన సమాచారం ఇది. సమాచారం ఉపయోగం లేకుండాపోయినట్టేగా ఎవడొచ్చాడు అని ప్రూఫ్ లేదు. ౬. పాకిస్థాన్ యొక్క పాత్రని నిరూపించే ఆధారాలు ఏవి? ౭. సి.యన్.యన్ లో చర్చించినట్టు - జనాలు ఇలాంటి ఆపరేషన్ జరుగుతుంటే - తాజ్ లో లోపలి లాబీదాకా వెళ్లి రాగలిగారు, గుంపులు గుంపులుగా చేరితే అది ఎంతవరకు సమంజసం? ౮. పోలీసులుకూడా జనాల్ని ఒక పరిధివరకూ ఆపేయలేకపోతే ఎలా. దీనివల్ల క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ట్యాంపర్ అయ్యే అవకాసం కూడా లేకపోలేదుకదా?
http://www.eenadu.net/story.asp?qry1=16&reccount=45 ఈ వార్త సారాశం నన్ను ఆశ్చర్యపరిచింది. "నేను హైదరాబాదీని, మాకు హైదరబాద్ ప్రత్యేక దేశం కావాలి". ఇంతకముందెన్నడూ విన్లా ఈ కోరికని. కొత్తగా ఉంది! ఈళ్లెవరయ్యా అడగటానికి? ఎదో సరదాగా మా పల్నాడు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే, కొంచెసేపు నవ్వుకోవచ్చు. కాని ఇదేందిది? ఇలాంటి పరీస్తితుల్లో హైదరాబాదు నగరం ఎంతవరకు సురక్షితమైన ప్రదేశం? హైదరాబాదీయులారా: అటూ ఇటూ ఓ కన్నేసి ఉండండి, పొరపాటున ఎవ్వడైనా అటు ఇటుగా ఉన్నాడాంటే ఆ పాట బాదొదిలిపెట్టండి. ఐనా హైదరాబాదు ప్రత్యేక దేశం కావాల్సొస్తే పాకిస్థాన్కి వెళ్లటం దేనికి? ముంబైలో మారణ కాండ జెయ్యటం దేనికి? కొడుకులకి పిల్లాటాలా ఉన్నటుందే. మొత్తం 20 మంది తీవ్రవాదుల్లో ఏడుగ్గురు హైదరాబాద్ నుండే. సిగ్గుచేటు. హైదరాబాదులో ముస్లిం తీవ్రవాదానికి చారిత్రాత్మక కారణాలున్నాయ్ - బొంగు భోషాణం. మనకి బతకటమా సావటమా అనే ప్రశ్న వచ్చినప్పుడు చారిత్రకం లేదు బొంగులేదు. జనాల్లారా - ఈయ్యాల్టి రోడ్డు షోలు ఎంతవరకూ మిమ్మల్ని కాపాడగలవు? ఆలోచించుకోండి. చిరంజీవైనా, రాజశేఖర్ రెడ్డి ఐనా, సెం.బా ఐనా ఆళ్ల రక్షణ ఆళ్లు జూస్కుంటారు, బలైయ్యేది జనాలే.
కె.సి.ఆర్ విన్నవా వీళ్లు ఏమంటున్నరో? గిప్పుడేంజేస్తవ్? Added on 29th Nov, 9 AM EST -
ఎంత మంది చచ్చారు, ఎంత మంది ఉన్నారు, మన పోలీసుల వ్యూహం ఇది, యన్.యస్.జి ఇది చేయబోతోంది, ఢిల్లీ నుండి వైమానిక దళం రావటానికి కొన్ని గంటలు పట్టింది, వాళ్లకి మ్యాపులు, సమాచారం సరిగ్గాలేదు - ఇన్ని అవసరం లేని, మాట్టాడకూడని విషయాలు కూపీలాగి మరీ తెరకెక్కిస్తున్నారు. ఐతే, ఇస్లాం తీవ్రవాదం రూట్స్ ఏంటి, ఇస్లాం యూత్ దేనికి తీవ్రవాదం వైపుకు వెళ్తున్నారు, వాళ నిజమైన, న్యాయమైన సమస్యలు ఏంటి? వీటి మూలాలు ఎక్కడ? ఒక మీడియగా మీ "కంక్లూజన్" ఏంటి? అసలు ఇస్లాం కుర్రాళ్లు పాకిస్తాన్ ఎలా వెళ్లగల్గుతున్నారు? - వీటిపై మీరు మాకు వార్తలందిస్తే మేమూ తెల్సుకుని మాలో లోపాలను సరిదిద్దుకుని "వసిధైకం" కోసం పాటుపడతాం.
(మూలం:ఈనాడు) ౧. ఐతే ఇంతవరకూ ఎంత ఆస్తి నష్టం జరిగింది? ఆ డబ్బుతో మనం ఒక "గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా" కట్టుకుని ఉండేవాళ్లం. ౨. ఒకానొక నాడు ఇందిరాగాంధీని చంపేస్తే సిక్కు ప్రజల్ని ఊచకోత కోసారు. అలాచెయ్యటానికి వచ్చిన చైతన్యం మన జాతిని నిలువునా నిలబెట్టిమరీ ఛీరేస్తోంటే రాదేం? ౩. ఒకానొక రోజున రంగాని చంపితే జనం రగిలిపోయి మారణకాండ చేసారే, యం.టీ.ఆర్ పోయినప్పుడూ, చివరకి పరిటాల రవి పోయినప్పుడుకూడా. మరీ ఈరోజున ఇంతమందిపోతే కనీసం చైతన్యం కూడాలేకపోతే!! సిగ్గు సిగ్గు. ౪. హిందు టెర్రరిష్టులు బొంగు అని రాసినోళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు? ౫. నీకు అవమానం జరిగింది, సరే, ఒప్పుకున్నా, దానికి వేరే దేశం వాడు వచ్చి చెప్తేకానీ అర్ధం కాలేదా? నీకు అవమానం జరిగితే నువ్వే నిలదీయ్, పాకిస్థాన్ దేనికి మధ్యలో? ఇక్కడే నువ్వూ సమాజాన్ని ఎలా ఎదురించాలో నేర్చుకో, ఎదురించు. నీ హక్కులకోసం పోరాడు. నీ హక్కులకోసం పోరాడే హక్కు నీకుంది ప్రజాస్వామ్య పరంగా. జనాల జీవించే హక్కుని కాలరాసే హక్కు ఆ భగవంతుడికి కూడా లేదు. ౬. ఎవ్వని సహాయం లేకుండా కరాచీ నుండి ముంబైకి రాగలిగారు అంటే మా సూరిగాడు కూడా నమ్మడు. ౭. మనలో ఉన్న కొందరు కొజ్జాల కక్కుర్తి వల్ల ఏవత్ జాతికే ప్రమాదం అనిపిస్తే, నేనూ నాభారతాన్ని రక్షించుకునే, నా దేశాన్ని కాపాడుకునే, నా జీవించే హక్కు కోసం టెర్రరిష్టుగా మారటానికి వెనుకాడను.
శోభాడే అన్నట్టు - అయ్యా రాజకీయనాకులూ - మీరు అటు మీమీ రంగులు తీస్కుని వెళ్ళకండి. అక్కడ పోరాడుతున్న మన రక్త నాడుల్ని పోరాడనివ్వండి. దిగజారిన మా ధైర్యాన్ని నిలబెట్టనివ్వండి. దయచేసి మీరటు మీ రంగుల్తో వెళ్లకండి.
ఎందుకిలా జరుగుతోంది? ఎటుపోతున్నాం మనం? మనంవీటిని ఎదురించలేమా? అంత బిజీ అయిపొయ్యామా మనచుట్టూ ఏంజరుగుతోందో తెలియనంత, తెలుస్కోలేనంత? చనిపోయిన కుటుంబాలకి నా హృదయం అట్టడుగు నుంచి సానిభూతి తెల్పుతున్నా. ముందు దీనెమ్మ ప్రభుత్వం అంటాం! కాని ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఇట్టాంటోళ్లకి సహాయం చేస్తున్నది మనలో ఒకరే, మనం ఎన్నుకున్న ప్రభుత్వమే.
http://www.ndtv.com/convergence/ndtv/default.aspx http://www.rediff.com/news/2008/nov/26-firing-in-cst-station.htm http://news.bbc.co.uk/2/hi/south_asia/7751160.stm Firing, blasts in city
Fresh blast at Taj and Trident hotels Attacks at Oberoi, Taj and Trident hotel ATS team arrives at the Taj Hotel Encounter on between police and terrorists at Taj, Oberoi: A N Roy, Dy Police Commissioner Two types of attacks: Blasts, AK-47 Prime Minister Office confirms five blasts Terror attack outside CST Station CST Station cordoned off by the police 2 blasts reported in Napean Sea Road area Oberoi hotel lobby on fire after attack Trains on the central line stopped 2 terrorists said to be holed up at CST station armed with guns, grenades
నేను 2001-2003 దాకా హైదరబాద్లో ఉన్నా. ఆ రోజున చందా నగర్ నుంచి బంజారా హిల్ల్స్కి వైయా హైటెక్ సిటీ - 15 కి.మి - ఇరవై నిమిషాలు పట్టేది. ఈ రోజున ఎంత పడుతుందో? మరిక నేను హైదరబాద్లో దేనికి పనిచెయ్యాలి? అద్దె - 10000 తక్కువ ఏమైనా దొరుకున్నయా ఇళ్లు? రోడ్డులు - 1 గంటలో ఇంటికి చేరగలనా? పిల్లలు ఆడుకోటానికి పార్కులు ఉన్నాయా? నేను ఉండబొయ్యే ఏరియాలో మంచి బడి ఎక్కడా? అసలు మంచి బడి అంటే? నీళ్లు వస్తాయా? కూరగాయలు మంచివి దిరుకుతాయా? బస్సు సౌకర్యం ఉందా?
అన్నిటికి సమాధానాలు "లేదు/లేవు/తెలియదు". మరిక నేను హైదరబాదులో దేనికి పని చెయ్యాలి?
Flipside-
ఆరకిల్ - హైదరబాద్ లోనే దేనికి? సత్యం - హైదరబాద్ లోనే దేనికి? అంతా కట్టకట్టుకుని హైదరబాద్లోనే దేనికి కంపెనీలు పెట్టడం?
నా ఆలోచన - సత్తెనపల్లి, లేక పేట, లేక మిర్యాలగూడ లాంటి ఊళ్లని ఒక పద్ధతి ప్రకారం అభివృధి చేసి - IT అని తరలిస్తే "PLANNED GROWTH" కి ఒక బాటలా ఉంటుంది.
నా కల - మోర్జంపాడులోనో లేక, దాచేపల్లిలోనో ఒక రెండెకరాలు పొలం చూస్కుంటూ ఇంట్లోంచి నేను ఐ.బి.యం లాంటి కంపెనీకి పని చెయ్యాలి అని.
I mean, not necessarily living in Mumbai/Hyderabad/Chennai/BlaBla and getting frustrated with the living standards and life style, cannot we have a strong infrastructure and make it as "IT to Village" concept? Added On November 28th - After Mumbai Blasts: If Something happens in Hyd like what happened in Mumbai, are we going to sustain such a loss financially, resources wise?
మా గుళ్లో నిన్న, కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. నేనూ 108 వొత్తులేసి దీపం పెట్టాను. ఆ పూజ mp3 ఇదిగో. దీంట్లో నాగొంతుకూడా ఉంది. రుద్రం మరియూ మంత్ర పుష్పం
గూగుల్ సెర్చ్ లో ఇప్పుడు ప్రతీ సెర్చ్ రిజల్ట్ లింక్ కి రెండు కొత్త ఆప్షన్స్ వచ్చినై. "ప్రొమోట్" మరియూ "రిమూవ్" అని. "ప్రొమోట్" నొక్కితే ఆ లింక్ పైకి జరిగుతుంది. "రిమూవ్" నొక్కితే ఆ లింక్ అక్కడనుండి తొలగింపపడుతుంది, అది మీ సెర్చ్ పుటలో కిందకి నెట్టివేయబడి, మీరు తొలగించిన లింకులు అనేలిస్ట్కి జతచేయబడుతుంది.
జీమెయిల్లో కొత్తగా థీంస్ వచ్చినై చూసారా? అద్భుతంగా ఉన్నాయి. నేను పెబుల్స్ థీం పెట్టుకున్నా :):) ఆనందించండి :):)
November 21st: I have switced to Planets. You know what, to my surprise, When setting to Planets, It asked my zip code. I could see the planets position changing. This is something interesting. :):)
ఇప్పుడే ఎక్కడో చదివా, మీభూమికూడా ప్రభుత్వం లాక్కుంటే ఇలా చెయ్యండి అని. ఇదేంటిది? భూమి ఎవ్వడిదీ? ప్రభుత్వానిదా? లేక ప్రజలదా? నాగార్జున సాగర్ కట్టినప్పుడూ ఇలానే అయిందిగా? శ్రీశైలం కట్టినప్పుడూ ఇలానే అయిందిగా? హైటెక్ సిటీ కట్టినప్పుడూ ఇలా అయిందా? పక్కనే ఉన్న జయభేరి కట్టినప్పుడూ ఇదే జరింగిందా?
SEZ లు వద్దు, సంస్కరణలు వద్దు, TAX కట్టొద్దు, కట్టినోడికి లెక్కలు అడిగే సొతంత్రం లేదు, అప్పుజేయ్ 20,00,000 కోట్లు, మూరెత్తు రోడ్లు వేస్కో, నీళ్లకోసం డ్యాం వద్దు, నీళ్లే లేవురా బగమంతుడా అంటే డ్యాం ఇక్కడ వద్దు అని అరువు, పేదోళ్లకోసం అప్పుజేయి - మింగు, రిజర్వేషన్లు పొడిగించు, కిలో రూపాయ్ బియ్యం - బయట బస్తా 2400, కూరగాయలు పండించే స్థలం లేదు, పంటల భూములు రియల్ ఎష్టేటోనికి అమ్మేయి, అడదిడ్డంగా ఇళ్లు కట్టు, అడ్డదిడ్డంగా రోడ్లేయ్, డబ్బున్నోడి ఇంటిముదు ముగ్గులెయ్యి, డబ్బున్నోడి దేశమ్ముందు మన బట్టలిప్పేయ్, 1930 నాటీ లారీలు బండ్లు నడుపు - వద్దూ అంటే బందుజెయ్, కోపంవస్తే రాయుచ్చుకో - ఆర్ టీ సీ మీద ఇసురు,
కొత్తపాళీ గారి మంచుసందేశం నాకు నిన్న అందింది. మాకు నిన్న రాత్రి మంచు కురిసింది. ఈ పొద్దున్నే ఫోటో తీసి ఇక్కడ పెడదాం అనుకున్నా కాని కార్లమీద కానీ, మరెక్కడా కానీ మంచు జాడలు కనబళ్లా చిన్న చిన్న తుప్పల మొదళ్లలో తప్ప.
నాకిలా అనిపించింది:- 1. మా ఊరు పట్నానికి 100 కిలోమీటర్ల దూరమ్లో ఉంది. మాది ఓ చిన్న పల్లె. మొత్తం 1000 గడప. చిన్న సన్నకారు రైతులు, రోజువారి కూలీలు - అది మా కధ. మాకు వైద్యం అంటె నాటు వైద్యమే. ఆకులు నులిమి పసరు నోట్టో ఏస్కోటమో లేదా కళ్లల్లోనో ఏస్కోటం మాకు మామూలే. ఓ రోజున మా ఊళ్లోని సత్తెయ్యకి గుండెనొప్పి రావటం మొదలైంది. అతని వయ్యసు 76. కనా కష్టం మీద దగ్గర్లో ఉన్న ఆశుపత్రి కి నెట్టుకెళ్లాం, ట్రాట్టరు మీదనో, కిందనో పడి. అక్కడి ఆర్.యం.పి పట్నం తీస్కెళ్లండి అని చెప్పాడు సాధ్యమైనంత తొందరగా. ఎలా ఎలా అని ఆలోచిత్తాఉంటే, అక్కడ పనిజేసే ఎంకయ్య "ఆంబులెన్స్" అని ఓటుంటది, దాన్ని మాట్టాడుకోండి అనిజెప్పాడు. ఆ ఆంబులెన్సోడు ఇంత అంతా అని డిమాండు జేసాడు. పేదోని ప్రాణం, ముసలోడు, ఎవని ఇలువ వానికుంటది. సరేఅన్నరు ఆ ముస్సలోడి తరుపోళ్లు అన్నిటికి. ముసలోడ్ని దాంటోకి ఎక్కించారు. ఇక బండి కదుల్తుందనంగా, ఓ పెద్దాయన రయ్ మనుకుంటా వచ్చి ఆ "ఆంబులెన్స్" నడిపేవానితో ఏదోజెప్పాడు. ఒకైపు గుండె జబ్బు మనిషి, ఇంకోఐపు పోవాల్సింది సానా దూరం, మద్దలో ఈడెవుడురా అని జనాలు జూత్తుంటే, ఆ పెద్దోడి మడుసులొచ్చి సత్తెయ్యని కిందకీడ్చబొయ్యారు. ఆ పెద్దోడు గొఱ్ఱెలేకదా పడిఉంటాయ్ అనుకున్నాడు. అట్ట ఇట్టా పోయే బండ్లు అన్నీ పోగై, ఆ పెద్దోడ్ని, "ఆంబులెన్స్" ని నిలదీసారు. తర్వాత ఏంజరిగిందో అనవసరం. 2. "ఆంబులెన్స్" కుయ్యో కుయ్యో అనుకుంట రయ్ రయ్ మని వెళ్తా ఉంది. జనాలు అడ్డం తప్పుకుంటా పాపం ఎవుడున్నాడో లోన, ప్రాణాపాయమ్లో ఉన్నాడేమో అనుకుంట ఉన్నారు. ఇంతలో ఎవుడో జూసాడు లోన భాగోతం. ఓ డబ్బున్న దొరబాబు లోన కులుకుతా ఉన్నాడు. మరి ఇక జనం ఆగుతారా ఇలా నిలదీయ్యక. 3. "ఆంబులెన్స్" గుంటూరెళ్లాల, మాచారం నుంచి. బయల్దేరింది బండి, లోన ఎవుడో మనిషి కాలో సెయ్యో అనుకుంటా, ఇరిగినట్టుంది. రక్తం కారతంది. మరి బయల్దేరాక, కొండమోడుకాడికొచ్చేతలికి ట్రాఫిక్కు జామంట, అన్నీ బళ్లూ ఆగిపోయినయ్. నకెరికల్లైపు తిప్పడు "ఆంబులెన్స్" తోలేటోడు. ఎటుపోవాల్నో తెలీక బండి ఆపేసి అటెమ్మటెల్లేఓళ్లని అడుగుతుంటే సూడండి ఎంతమంది అట్టా గుంపుగూడారో.
ఒకళ్లమీద ఇంకొకళ్లు ఇలా బురద జల్లుకోవడం ఎంతవరకూ భావ్యం? నా ఉద్దేశంలో బ్లాగటం: 1.నా బ్లాగు - నా ఇష్టం, నా బ్లాగుగికి నేనే వై.యస్.ఆర్, నా బ్లాగుకి నేనే మహరాజ్. కాదని ఎవడూంటాడు. ఐతే - బ్లాగు శరీరం లాంటిది. నా శరీరం నాఇష్టమని బట్టలిప్పుకుని తిరిగితే జనాలు రాళ్లేస్తారు. 2. సెన్సిటివిటి - నా బ్లాగు నా ఇష్టం అని కొన్ని సున్నితమైన విషయాల మీద రాయడం అవివేకం. నేనేమి సంఘ సంస్కర్తని కాను. నేనూ సోర్దజీవినే. 3. మన సమాజమ్లో ప్రతీది ఓ దారంతో అల్లబడి ఉంటుంది - మన సంబంధాలు, కులాలు, మతాలు, మనస్సులు, ఆలోచనా విధానాలు - టెంపర్మెంట్లు, ఎదురుతిరిగే తత్వం అన్నీ - తెగిందాకా లాక్కోవటం దేనికి? 4. నీతులు గోతులు అనవసరం. ప్రతీవోడు సదువుకున్నోడే. ప్రతీవోడూ ఆలోచిస్తాడు. నేను కొత్తగా మన సరిత్ర ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు నా చరిత్రతోనే తెల్లారుతోందిగాబట్టి. 5. నా కాల్లో ఉన్న ముల్లు తీస్కోనీయండి ముందు, పక్కనోడి కాల్లో ముల్లులు తర్వాత దింపొచ్చు. 6. రాసేవోనికి సదివేవోడు తక్కువ ఏమాత్రంకాదు. నేను రాసింది ఇంకోడుచదువున్నాడు అంటే వానిది పెద్ద మనసు అని. అంతే కాని నాయ్యాల, నేను కోడిపియ్య తొక్కా, వాశ్సనజూసిపో అంటే, కాకొచ్చి నెత్తిమీద రెట్టేసిపోతుంది. 7. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమ్మన్నా. సివరాకరిగా 8. ఎదవగోల ఆపేస్తా (ద్దాం)
పదవి : ముఖ్యమంత్రి విద్యార్హతలు : ఏమీలేవు (ఓపెన్) కనీస అర్హతలు: 1. పగటి కలలు కనటం 2. ఆత్మస్తుతి 3. పరనింద 4. పరులను ప్రశ్నించే తత్వం 5. సినిమా హీరోగా పని చేసి ఉంటే మంచిది లేదా రాయలసీమ అయిఉంటే పెద్ద ప్లస్ 6. లాబీయింగ్ చేయగల్గి ఉండాలి 7. హైజాకింగు తెలిస్తే మరీ పెద్ద ప్లస్ 8. అయితే నందమూరి వంశం అన్నా అయిఉండాలీ, లేదా రాయలసీమ రెడ్డి ఐనా అయిఉండాలి లేదా మెగాస్టార్ అయినా అయిఉండాలి 9. పొత్తులుకు పై పొత్తులు పెట్టుకోగలగాలి 10.కులదీపకుడు, కుల ప్రకాశకుడు అయిఉండాలి 11.మంచి మాటల రచయిత దోస్తై ఉండాలి 12."మీతో పొత్తుపెట్టుకుంటే ఏమిస్తారు, మాతోపొత్తుపెట్టుకుంటే ఏంతెస్తారు" అనే తత్వం ఉండాలి 13."నేను ఏంచేసాను" కన్నా "నువ్వు ఏమిచెయ్యలేదు" గురించి మార్కెటింగు చెయ్యగల్గి ఉండాలి 14.చెట్టుపేరుజెప్పి కాయలు అమ్ముకోగల్గి ఉండాలి. 15.కులాల మధ్య కుమ్ములాట పెట్టగల్గి ఉండాలి. 16.అఱచేతిలో వైకుంఠం చూపగల్గి ఉండాలి. 17.ఘట్టి కాళ్లు ఉండలి (కొంతమందిని తొక్కుకుంటూ ముందుకుపోవాలిగాబట్టి) .. .. .. ..
నిన్న మా స్నేహితుడు టోనీతో మాట్లాడుతుంటే ఓ ఆసక్తికరమైన విషయం జెప్పాడు. అమెరిక ఆర్ధిక వ్యవస్థ మునిగిపోతున్నది కదా, ఇప్పుడు వచ్చే కొత్త రాష్ట్రపతి మొట్టమొదటి కదం ఏమైఉంటుంది అనే మాటల్లోవాడు ఇలా చెప్పుకొచ్చాడు:ప్రంపంచ ద్రవ్య నిధి (ఐ.యం.యఫ్) లాంటి సంస్థలకి అమెరికా లాంటి సంపన్నదేశాలు డబ్బునిచ్చి భారత్ లాంటి గెఱ్ఱె దేశాలకి ఇవ్వమని చెప్తుంటాయి. ఇక్కడ రహస్యం ఏంటాంటే 1. సంపన్న దేశాలకి మంచి వడ్డీ రేటు లభిస్తుంది 2. ఎగవేత ఉండదు. ఉంటే సాంక్షన్స్ పేర్యుమీద తొక్కేయొచ్చు. 3. ముఖ్యమైనది - లాబీయింగు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదే ట్విష్టు. అభివృధి పేరుతో మన లాంటి దేశాలకి సంపన్న దేశాలు "టెక్నాలజీ సొల్యూషన్స్" ని సరఫరా చేస్థాయ్. దీనివల్ల టెక్నాలజీ కాంట్రాక్ట్స్ ఈ సంపన్న దేశాల కంపెనీలకి వెళ్తాయ్. అంటే బుష్ బాబాయ్ ని నమ్ముకున్న బిజినెస్ లాబీ బాగా డబ్బు గడిస్తుంది. 4. ఎక్కువసార్లు మనకి ముఖ్యమైన, కావాల్సిన వాటిని పక్కనబెట్టి అవసరంలేని వాటిమీద ఎక్కువ ఖర్చు చేయించేలా చేస్తాయ్ ఈ "టెక్నాలజీ సొల్యూషన్స్". దీని వాల్ల మన బ్యూరోక్రాట్స్కి, రాజకీయ నాయకులకీ ధనవరద చేరుతుంది. 5.ఈ సంపన్న దేశాలకి మార్కెట్ ఏర్పడుతుంది. దాని వల్ల మనలాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థ వీళ్ల చేతిలోకి వస్తుంది లేదా వీళ్లు చెప్పినట్టు నడుచుకుంటుంది. 6. ఇలా రాజకీయ/అనుయాయులకి లభించిన ధన - వరద, నల్ల ధనమ్లా స్విస్ బ్యాంకులకి చేరి, అటునుంచి మళ్లీ సంపన్న దేశాలకి లోనులా వెళ్లి అధిక వడ్డీతో మళ్లీ మనకే వస్తుంటుంది. .. .. ..ఇత్యాదివి వీటివల్ల మనకి కొన్ని లాభాలు కూడా ఉంటాయ్: 1. ఉద్యోగావకాశాలు పెరుగుతాయ్ 2. ఫండ్స్ ఫ్లో పెరుగుతుంది 3. పురాతన టెక్నాలజీ ని అప్గ్రేడ్ చేస్కునే అవకాశం లభిస్తుంది. 4. గ్లోబల్ మార్కెట్ - ప్రపంచ మార్కెట్ లోకి మన ఉత్పత్తుల్ని అమ్ముకోటానికి ఒక మార్గం దొరుకుతుంది (GATT/WTO లాంటి ఒప్పందాలద్వారా - వీటిల్లో కూడా సంపన్న దేశాలకి అణువైన ప్రతిపాదన్లే ఉంటాయ్ అది వేరే విషయం) 5. హ్యూమన్ క్యాపిటల్/రిసోర్సెస్ కి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయ్. .. .. ..ఇత్యాదివి ఏది ఏమైనా ఇలా సంపన్నదేశాలమీద ఆధారపడటం వల్ల అవి మునుగుతున్నప్పుడు మనం కూడా మునుగుతూ ఉంటాం.
"ఏంది కత?" "యాభై?" "ఏందీ?" "అదే!! యాభై పోష్టులు రాసా ఇప్పటికి. రెండొందల ఎనభై వ్యాఖ్యలు పడినై ఆటికి." "ఓహో!! అక్కడ! ఏదీ అక్కడ!! ఐదు వందలు రాసినోళ్ళు ఉన్నారు." "తెలుసు కానీ" "నకరాలు వద్దు" "అదేలే ఈయ్యాల్టి యాభయ్యే రేపటి ఐదువందలు" "ఏంది రేపటికల్లా ఐదొందలు రాసిపడేస్తావా ఏంది. ముందేజెప్పు (ముందే/ మందే కాదు - ఎప్పుడూ మందేకాదు జీవితంలో)" "ఎకసెక్కాలు ఆపి...విను...ఇప్పటికి యాభై. చూద్దాం మునుముందు ఎన్ని రాయగలనో." "సరే!! మంచోడివే!! నీకు నచ్చిన పోష్టు ఏది?" "యో!! నేను తొక్కిన కోడిపియ్య కూడా కమ్మటోసన, తెల్సా. నేను రాసిన ప్రతీ అచ్చరం నాకు నచ్చిందే." "నచ్చని పోష్టు?" "మర్యాద!! థర్టి ఇయర్స్ ఇండష్ట్రీ" "ఇంకేమైనా జెప్పాలా?" "నేటి ఉపాధ్యాయులూ చదువులూ అనేపోష్టుమీద వ్యాఖ్యలు బాగా వస్తాయి అనుకున్నా. పెద్దగా లేవు. ఐతే వ్యాఖ్యానించిన నలుగురూ గట్టి మాటలే జెప్పారు." "చివరగా?" "రాసినోడికి చదివినోడి వ్యాఖ్యలే మందు. సునిసిత విమర్శని నేను ఆశ్వాదిస్తా. నా ఆలోచనల్ని అందరితో పంచుకోవాలి అని ఎప్పుడూ కోరుకుంటా. ఐతే నేనుజెప్పిందే వప్పు అనే వితండవాదం నాకు లేదు. రకరకాల నా ఆలోచనలని, నా ఆనందాన్నీ, ఇలా పంచుకుందామనే ఉద్దేశ్యంతో మరిన్ని బ్లాగులు రాస్తున్నా. నా బ్లాగులు పాతపాటలు http://paatapaatalu.blogspot.com వెబ్స్పియరు గురించి నా టెక్నికల్ బ్లాగు http://javagongura.blogspot.com జావా గురించి నా టెక్నికల్ బ్లాగు http://verbosegc.blogspot.com ప్రాజెక్టువర్క్స్ మన తరం నుంచి ముందుతరానికి మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వాలి? లంచగొండి ప్రభుత్వాల, ప్రభుత్వోద్యోగుల ఆగడాలని అరికట్టి సమూలంగా లంచాన్ని రూపుమాపాలంటే? మన మౌళిక అవసరాల్ని మనమే నిర్మించుకోవాలంటే? మనకి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త రక్తం కావాలి. అలాంటి ఒక్కో ఆలోచన ఒక్కో కొత్త ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుల్ని ముందుకుతేవటమే నా ఈ బ్లాగు లక్ష్యం. యువతకి మార్గనిర్దేశమే ప్రాజెక్టుల లక్ష్యం http://projectsforfuture.blogspot.com/ నల భీమ పాకం నా ఈ బ్లాగు పెళ్ళికాని బాచిలర్లకి, పెళ్ళైన బాచిలర్లకి వంట సలహాలకోసం అంకితమిస్తున్న. "ఈయ్యాల్టి బాచిలరే రేపటి సంసారి" http://nalabhima.blogspot.com/ నా యస్.యల్.ఆర్ కన్ను నేనూ మార్గదర్శిలో చేరా, ఒక ఫిల్మ్ యస్.యల్.ఆర్ కొన్నా. నైకాన్ యన్ 75. ఈ బ్లాగులో నా ప్రపంచం నా యస్.యల్.ఆర్ కన్నులోంచి http://nasitralu.blogspot.com/ వేదసంహితం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే। పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ -ఈశోపనిషత్ http://vedasamhitam.blogspot.com/ " - జైహింద్
ఎప్పటినుంచో రాద్దాం అనుకున్న పోష్టు ఇది. నేను అమెరికాలో గమనించిన మంచి విషయాలల్లో ఇదీ ఒకటి.వాల్మార్ట్కెళ్లాం అనుకోండి. లోపలకి అడుగుబెట్టంగనే డబ్బాలు పెట్టి ఉంటాయ్ "Please Return Your Plastic Bags Here" అని.
మనం!!! ఈ క్యారీ బ్యాగుల్ని విసిరి, కాలవల్లో పడేసి, నానా రకాలుగా హింసిస్తున్నాం మన నేలతల్లిని.
ఎవడుకనిపెట్టాడోగాని, ఇవిలేకుండా మన జీవితం నడవదా అన్నట్టు ఉంది. కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్తుంటే బొల్లారం టర్నింగు దగ్గర పెద్ద డంపుయార్డ్, అక్కడనుంచి ఈ సంచులు గాలికి ఎగిరి బళ్లు నడిపేవాళ్ల మొహాల మీద పడటం, యాక్సిడెంట్లు కావటం. ఎన్నోజూసా. ప్రాణాలు పోయినోళ్లుకూడా ఉన్నారు. అలా గాలికి వదిలెయ్యడం మన సాంప్రదాయమా? ప్రభుత్వం చెప్పిందా? మీ టీచెరుజెప్పాడా? ఎవుడుజెప్పాడు అలా ఇస్సిర్నూకమనీ? ఒక్కసారి ఆలోచిద్దాం?
ఒకానొక రోజున గుడ్డ సంచులు, జనపనార సంచులుఉండేవి. ఇప్పుడు అంతా ఫ్యాషన్. ఆ సంచులు తీస్కెళ్లాలి అంటే నామోషి.
ప్రభుత్వం వీటిని బ్యాన్ చెయ్యాలి!! ప్రభుత్వమా వీటిని తీస్కొచ్చింది? కాదే? మనమే!!! ఎవుడో డబ్బున్నోడు తెచ్చాడు, అమ్ముకున్నాడు, ఆ సంచులు అలా, విశాఖ నుంచి గాలికి ఎగురుకుంటూ గుంటూర్ కి వచ్చి అక్కడనుంచి యన్.హెచ్ 5 మిదగుండా హైదరాబాద్ చేరి..హైదరబాదువి అలా చెన్నై చేరి ఇదీ మన సంగతి.
హైదరబాద్ లాంటి మహానగరమ్లో రోజుకి సరాసరి ఎన్ని ఇలాంటి సంచులు ఖర్చు అవుతాయి? కనీసం ఒక్క కేంద్రం ఐనా ఉందా మనకి ఇలా ఇట్టాంటి సంచుల్ని సేకరించేది? ఓ డబ్బా పడేసి, బాబులూ మీ సంచుల్ని ఇక్కడ దీంట్లో దొబ్బండి అని పెట్టటానికి కోట్లు ఖర్చేమీ కాదుగా?
నేను ఈ రోజునుంచి ఈ సంచుల్ని వాడను, అధవా వాడినా వాల్మార్ట్ లాంటి కేంద్రాలల్లో ఉన్న డబ్బాల్లో పడేస్తా. మీరు అలానే చేయండి. దయచేసి.
ఇప్పుడే ఓ ఛానెల్లో చెప్తుంటే చూసా ఈరోజున 80-90 శాతం పిల్లలు బ్యాక్ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. సరిగ్గా వాడాటం తెలియకపోతే వీటితో మెడ, భుజాలు, నడుము నొప్పులు రావొచ్చుఅని చెప్తున్నారు.
బ్యాక్పాక్ని సరిగ్గా మోస్తున్నప్పుడు పొట్ట, వీపు కండరాలు దానిబఱువుని సప్పోర్ట్ చేస్తాయ్. అలా కాకుండా ఒంటిచేత్తోనో లేక, సరిగ్గా తగిలించుకోకపోతేనో, లేక ఒక భుజం మీద వేస్కుంటేనో వీపులోని మెత్తని కండరాలు స్ట్రైన్ అవుతాయి. ఇలా ప్రత్రోజు అడ్డదిడ్డంగ వేస్కుంటే స్పైనల్ కాలం డ్యామేజి అయ్యి కండరాల సమతౌల్యం దెబ్బతింటుంది.
1. మొత్తం బ్యాక్ప్యాక్ బఱువు, మోస్తున్న మనిషి బఱువులో 10-15% కన్నా మించకూండా చూస్కోండి 2. బ్యాక్ప్యాక్ నడుముకి 2-3 ఇంచులకన్నా కిందకి దిగకుండా బ్యాక్ప్యాక్ చెవుల్ని భుజాలమీదకి సరిచేకోండి. 3. కిందనుంచి భుజాలమీదకి వేస్కోటానికి తీస్కునేప్పుడూ, భుజాలమీదనుండి దింపినాక కిందపెట్టేప్పుడూ మోకాళ్ల మీద వంగి, కాళ్లమీద బఱువుపడేట్టు చేస్కోండి. (ఢభా అని వంగితే నడుము పట్టేస్తుంది బాసు) తల్లితండృలకి టిప్పు: Educate your children about the importance of postural awareness and proper lifting techniques. Prevention of an incorrectly carried backpack will lead to your child's healthy spine today and in the future.
ఈ మధ్య కత్తి మహేష్ కుమార్ బ్లాగులో ఈ పోష్టు చదివా. హిందూ తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం అని. దానికోసం ఇక్కడ నొక్కొచ్చు దాంట్లో ఎవడో ఇలా వ్యాఖ్యానించాడు. ప్రాణాలను తేగించే ధైర్యం ఒక్క ఇస్లామ్ కే సొంతం. ఇక ప్రపంచం మేత్తం ఇస్లామ్ రాజ్యం తధ్యం ఒక్క ముస్లిం చావుకు వంద మంది కాఫిర్ల రక్తం తొ బదులు తీర్చుకుంటాము. ఇస్లామ్ ని అపే శక్తి ఈ ప్రపంచంలొ ఎవరికి లేదు,అమీన్ లాఇలా హ ఇల్లాలా హు ఈ ప్రపంచం ఇస్లామ్ రాజ్యం రావడం తధ్యం.దినిని ఎ కాఫిర్ అపలేడు.అమిన్. ఇక పాకిస్తాన్ మత్రమే ముస్లిం దేశం అనుకుంటున్న ని వంటి వారికి ...........బావి లొని కప్ప కధ గుర్తుందిగా
వాహ్!! వాహ్!! నాకు చాలా ఆనందంగా ఉంది, కనీసం వాళ్ల మక్సద్ ఇదీ అని తెల్సినందుకు. ఇవ్వాల్టికి వీళ్ల అసలు రంగు బైటపెట్టుకున్నారు. ఐతే ఇలా బాంబులు గట్రా దేనికి? ఓ పని చేస్తే పోలా. ముస్లింలు ఓ వైపు, హిందువులు ఓ వైపు నిల్చోని యుద్ధం చేస్కుంటే ఓడిపోయినోడు తనవాళ్లనందరినీ అంతం చేస్కుని తనని తాని కప్పేస్కుంటే ఇక ప్రపంచెంలో గెల్చినోడి మతం ఒక్కటే మిగుల్తుందిగా. ఇక ఇంత పీక్కోవటం లాక్కోవటం, అక్కడ బాంబులు ఇక్కడ బాంబులు, తెలియని వాళ్లని చంపటం, పసిపిల్లల్ల్ని తునా తునకలుగా పేల్చెయ్యటం, తెలియకుండా చంపుకోవటం చావటం దేనికి? ఇలా పిచ్చి టపాలు రాయటం కొంతమందికో సరదా, అలా మతం మీద ఓ రాయి వేసి ఏదో గొప్పగా. దానికి ఇట్టాంటోళ్ల కామెంట్సు.
చిరంజీవి తెలంగాణ పై వ్యాఖ్య. ప్రజలే వెయ్యి గొంతుకలతో అరిస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లాలి.
ప్రజలు నిజంగానే ప్రత్యేక తెలంగాణాని కోరుకుంటున్నారా? ఒక ప్రత్యేక రాష్ట్రం జనజీవితాల్ని ఎలా మార్స్తుంది? ఆనాడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎవరుకోరుకున్నారు? గోవిందపురంలో ఒక ఎకరం పొలం సేద్యం చేస్కునే వానికి ఇవి అన్నీ నిజంగనే తెలుస్థయా?
కాంగ్రేసును బొందపెడతాం: కె.సి.ఆర్ పిచ్చివాగుడు ఆపకపోతే నీ గోరీ నీచేతే కట్టిస్తాం: జనం Posted by భాస్కర్ రామరాజు at 4:08 AM 4 comments: nice said... ఈయన చెప్పే జనం ఆంధ్రా జనం మాత్రమే. తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. కాంగ్రేస్ ను బొందపెట్టాలంటే ఈ ఆంధ్రా బిడ్డకెందుకో నొప్పి..!! కలిసి ఉండాలనే పాకులాట ఎందుకో...!!
September 23, 2008 7:00:00 AM IST భాస్కర్ రామరాజు said... చిచ్చా!! క్యా బోలా!! మంచిగుంది నీ తెలివి. కెసిఆర్ నీ కళ్ళల్ల కారంగొడ్తడు. ముందు గజూస్కుపో పొయ్యి. నేను ఆంధ్ర బిడ్డనో నా తల్లి బిడ్డనో నాకు మంచిగదెల్సు. నాల్గున్నర సమచ్చరాలు బట్టింది కెసిఆర్ గానికి, కాంగ్రేసు బొంద బెట్టాలని తెల్సుకునేటందుకు. కల్సి ఉండాలని పాకులాటెవ్వనికుంది మియా? నాకేంలే. ఐనా కల్సుందాం అనేటందుకు నేనవ్వన్ని? వద్దనేటందుకు నువ్వెవ్వనివి? శతకోటి గొఱ్ఱెల్లో బోడిగొఱ్ఱెవా?
September 23, 2008 7:35:00 AM IST భాస్కర్ రామరాజు said... తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. మంచిగ చెప్పినవ్. మరి తెలంగాణ తెస్తమని జనాలకి మాయమాటల్జెప్పిన కెసిఆర్నేజేయాలే?
ప్రత్యేక రాష్ట్రం ఒక బస్తా బియ్యం ఎక్కువ పండిస్తుందా? కాళ్లల్లో దిగిన ముల్లుతీయ్యండ్రా బాబు అని ఓ వైపు పేదోడు, రైతూ, జనం ఆత్మహత్యలు చేస్కుంటుంటే నాకునీతో కలిసి ఉండటం ఇష్టమ్లేదు, ప్రత్యేకం కావాలి అంటాడొకడు, లేదు లేదు ప్రాజెక్టులు అన్నీ మీకేనా అంటాడు ఇంకొకడూ, ప్రత్యేక రాష్ట్రం వస్తే మతాల కుమ్ములాట అవుతుంది అంటాడు ఇంకొకడు. విడిపోదాం, గౌరవించుకుందాం అంటాడు ఇంకొకడు. సందట్లో సడేమియా బాంబులేస్తాడు ఇంకొకడు. అసలు సామాన్య మానవునికి ఏంగావాలో ఎవ్వనికి పడుతుంది? వాని గురించి వానికే పడతల్లేదు....
ప్రాజెక్టువర్క్స్ మన తరం నుంచి ముందితరానికి మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వాలి? లంచగొండి ప్రభుత్వాల, ప్రభుత్వోద్యోగుల ఆగడాలని అరికట్టి సమూలంగా లంచాన్ని రూపుమాపాలంటే? మన మౌళిక అవసరాల్ని మనమే నిర్మించుకోవాలంటే? మనకి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త రక్తం కావాలి. అలాంటి ఒక్కో ఆలోచన ఒక్కో కొత్త ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుల్ని ముందుకుతేవటమే నా ఈ బ్లాగు లక్ష్యం. యువతకి మార్గనిర్దేసమే ప్రాజెక్టుల లక్ష్యం http://projectsforfuture.blogspot.com/ మీరూ నాలాగా ఆలోచిస్తున్నారా? మీకు నాలా మన సమాజం, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఇలా ఎందుకు ఉండకూడదూ అనిపిస్తున్నదా? మీకూ నా దేశంలో ప్రజలకి ఇవి ఎందుకులేవు అనిపిస్తున్నదా? మీరూ సమాజంలో మార్పు కోరుకుంటున్నారా? నాతో మీ ఆలోచనల్ని పంచుకోండి. నా ఈ-పోష్టు projectsforfuture@gmail.com
అప్పటికప్పుడు తినేవి: వడలు, పకోడి, తప్పాల చెక్కలు, "పుట్నాలపప్పు/వేయించినశనగపప్పు ఉల్లిపాయలు కారం ఉప్పు నెయ్యి". మరపురాని సీతాకాలం లేక వానాకాల వంటలు - అలా బయట చిత్తడి చిత్తడిగా ఉంటే పొట్టలో గురుగురు అని ఎవో పేగులకేకలు వింపడుతుంటే -డబ్బాలోంచి సగ్గుబియ్యం వడియాలు తీసి ఫటాఫట్ వేయించేది మా అమ్మ..వహ్. కుంపట్లో మా అమ్మ పప్పు వండాక, దాంట్లో చిక్కుడుకాయలు కాల్చుకు తినేవాళ్లం. అలానే, నిప్పుల్లో ఉల్లిపాయలు కాల్చి తింటుంటే..అప్పుడప్పుడూ పిత్తులు గట్రా రావట్లేదనుకోండి - బెష్ట్ మార్గం - గెణుసుగడ్డలు. కుంపట్లో గెణుసుగడ్డలు కాల్సుకుతింటే మర్నాడు క్లాసులో ఎవ్వడూ ఉండకూడదు.. ఎండాకాలం శెలవుల్లో గెణుసుగడ్డల్ని ఉడకబెట్టేది మా అమ్మ. కింద పెద్ద గిన్నె, నిండా నీళ్లు, పైన ఇంకో చిన్న గిన్నెలో రెండో నాలుగో గెణుసుగడ్డలు వేసి మూతపెట్టేస్తే అవి ఉడికేవి. భలేవుండేవి.
కొనుక్కుని ఇంట్లో తినేవి: అప్పట్లో స్వీట్లు ఒక అద్దాల బండిలో పెట్టి అమ్మేవాళ్ళు. ఎక్కువగా కొన్నుకునేవి - పూసమిఠాయి, బాదుషా, జాంగ్రీ, పేడా, బర్ఫి మరియూ చేగోడీలు. నాకు మహా ఇష్టం చేగోడీలు. కాని కొనుక్కుని తినేది చాలా తక్కువ. ఎప్పుడో, సంవత్సరానికోసారి. అంతే. చిప్సు అంటే ఏంటో తెలియదు. చిప్సు తింటారని పెద్దయ్యాక తెల్సింది.అప్పుడప్పుడూ కొన్ని కొత్తవి తెలుస్తుండేది. వేయించిన బియ్యం. దోసకాయ ఒరుగులు - దోసకాయ విత్తనాలు నోట్టోవేస్కుని పైపొట్టు చాలా నేర్పుతో చెయ్యి పెట్టకుండా తేసేసి తినెయ్యటం. మంచి గుమ్మడికాయ విత్తనాలు.
రోజులు గిర్రున తిరుగుతున్నై. ఇక మేమూ రగ్గులు దులిపాం. ఇక కరెంటు బిల్లు పేల్తుంది, మూలిగే నక్కమీద తాటికాయ పడట్టు. కారుకి కూడా ఎక్కువ దాహం వేస్తుంది చలికాలంలో. జనాలకి చిరాకులు పెరుగుతయి. పిల్లలు కొంచెం క్రాంకీ గా ఉంటుంటారు. చిన్నపిల్లల్లతో మరీ కష్టం. దయ్యాల పండక్కి పోయినేడాది మావోడు ట్రిక్ ట్రీటు అని మా సందంతా తిరిగొచ్చెప్పటికి న్యుమోనియా వచ్చింది. సచ్చాం. ఈఏడాది ఏంజేస్తడో చూడాలి, ఇక్కడ అప్పుడే జనాలు దయ్యాల్ని, భూతాల్ని, గుమ్మడికాయల్ని గుమ్మాలకి తగిలించేసారు. కొన్ని గుమ్మడి కాయలు కుళ్లికూడా పోయినయి. దయ్యాలపండగేందో నాకర్ధంగాలా. సరే నల్గురితో పాటు నారాయణ. నిన్న పొద్దున కార్ అద్దాలమీద సీజను మొట్టమొదటిసారి ఐసు లేయరు ఫార్మ్ అయింది. ఆకులు రాలుతున్నాయి. కాలాలు మారుతున్నా నాలో ఎటువంటి మార్పు లేదు. పని, ఇల్లు, పిల్ల, పీచు, పని, ఇల్లు, పిల్ల, పీచు....చలిప్రదేశమ్లో ఆహారం పాడైపోదు, అట్టానే మనిషిక్కూడా ఆ స్టేట్ వచ్చేస్తుందేమో. పోయినేడాది స్నో బానే పడింది. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతోందో. సగటు స్నోఫాల్ 64.1 ఇంచులు. 2006-2007 చలికాలమ్లో నా జీవితమ్లో ఒక మోస్తరి నుంచి కొంచెం భయంగొల్పే రెండవ మంచుతుఫాను చూసా. 2003-04 లో అమెరికా వచ్చినప్పుడు మొట్టమొదటి అనుభవం. కాని అప్పుడు నేను డ్రైవింగు గట్రా చెయ్యలేదు. కానిప్పుడు కుటుంబం, గట్ర, నా సొంత కారు, నేనే డ్రైవరు. తుఫాను మొదలైంది. మరి ఆఫీసుకి ఎళ్లటానికిబయల్దేరా. నెమ్మదిగా నెట్టుకుంట నెట్టుకుంట చేరా మొత్తానికి. ఇక మద్దానం 4 అలా బయల్దేరా తిరిగి ఇంటికి. దారిలో ఒక షవల్ కొన్నా అనుకోకుండా. మా ఇల్లు ఇంకో మైలు దూరమనంగా మంచులో చుక్కికున్నా. పడిన స్నో ని ప్లో చేసే బళ్ళు ఉంటయి. అవి ఒక పారలాంటి ఇనప పళ్లెంతో పడిన మంచుని పక్కకి నెట్టుకుంటూ పోతుంటయి. ఆటి ఎనకమాల పెద్ద పెద్ద ట్రక్కులు ఉప్పు ఏస్కుంటా/జల్లుకుంటా ఎళుతుంటయి. పక్కకి నెట్టి నెట్టి వారెమ్మటి స్నో పేరుకుపొతుటుంది. నాకార్ కొంచెం స్కిడ్ అయి దానిమీదకెక్కింది. ఇంకేముంది, ఇరుక్కుపోయింది నా కారు, కారు ఇరుసు కింద స్నో. నాది నిస్సాన్ ఆల్టిమ, సెడన్. సెడాన్ ఎత్తు 13 అంగుళాలు ఉంటుందేమో, మళ్లా అది ముంగటి గాన్ల డ్రైవు (ఫ్రంట్ వీల్ డ్రైవ్). టైర్లు కింద ఆనట్లా. గ్యాసు (యాక్సిలరేటరు ని ఇక్కడ గ్యాసు అనికూడా అంటారు) ఎంత తొక్కినా టైర్లు తిరుగుతున్నయి కానీ కారు అట్టనే ఉండిపోయిది. కార్లోంచి కిందకి దిగటమే కష్టం ఐపోయింది. డ్రైవ్ వే వైపు ప్లో వాన్లు ట్రక్కులు. నెమ్మదిగా దిగి రెండో వైపు వెల్తే గజ్జల్దాకాదిగిపోయినై కాళ్ళు స్నోలోకి. ఎట్టనో లోపల థర్మల్ ఏస్కున్న కాబట్టి బతికిపోయ్యా. మొత్తానికి ఒక గంటసేపు కుస్తీపడి ఆ పక్కనున్న ఇంటి వాళ్ల దెగ్గర ఒక పెద్ద షవల్ దెచ్చి, ఇరుసు కింద స్నో మొత్తాన్ని తీసి బయటపడేసరికి కాళ్లు దిబ్బలెక్కి, జివ్వు జివ్వు మని లాగటం మొదలెట్టినై. ఎట్టనో కుస్తీపడి ఇంటికిజేరి వెంటనే వేడి వేడి నీళ్లల్లో కాళ్లెట్టుకుని ఒక కప్పు వేడి వేడి కాపీ పీకితేగానీ బండి మళ్లీ లైన్లోకి రాలా. ఇదిచదివినోళ్లు అనొచ్చు, అంత కక్కుర్తి దేనికి, ఆయాల ఇంటిపట్టునే ఉండొచ్చుకదా అని. సీత కష్టాలు పీతకష్టలు నాయనా. సర్వర్ల మీద పని, ఆయాల తప్పకుండా ఎళ్లి తీరాల్సిన రోజు, ఎందుకంటే ఆ ముందురోజు రేత్తిరి మైంటెనెన్సు కిటికీ ఉండింది. ఆయాలో మర్రోజో నా కారు ఇట్టా ఉంది.
నిన్న మా బుడ్డోడికేవో బిస్కెట్లు కొన్నాం.పెప్పరిడ్జ్ ఫార్మ్ వాళ్లవి ఛెస్మెన్ కుక్కీస్.
నేనూ ఓటి నోట్టోవేస్కున్నా. అమెరికాకొచ్చాక, కాస్త రుచి తగిలిన బిస్కెట్లు ఇవే. మావోడికి మరి అవి ఎలా కొనాలనిపించిందో తెలుసా? ఆటిమీద గుఱ్ఱం బొమ్మ ఉంటంవల్ల. సరే అట్టా తినుకుంటా వారెమ్మెటి కార్ని తోల్కుంట ఎల్తుంటే చిన్నపటి బిస్కెట్లు, చాక్లెట్లు, తినుబండారాలు గుర్తొచ్చినై.
చిన్నప్పటి ఆల్టైం హిట్ బిస్కెట్లు - బ్రిటానియా. అవి ఇప్పటి 5 రూపాయల్ బిళ్ళంత ఉండేవి. మా బుడ్డోడు తింటున్నాడు చూడండి ఇక్కడ, అవే.నోట్టోఏస్కుని అట్టే నాలికతో పైనోటికేసి నొక్కిపెట్టి, కొంచెంసేపు నానినాక నాలికతో నొక్కితే సుర్రున కరిగిపోయేవి. అలా నాలికమీదపెట్టి పైనోటికేసి నొక్కి నొక్కి కాయలు కాసేవి. తర్వాత బాగా ఇష్టంగా తిన్నవి చందమామ బిస్కెట్లు. ఉఫ్ఫ్.. వీటిరుచే వేరు. మళయాళం వాళ్లు ఎక్కడికెళ్లినా టీ కొట్టు పెట్టినట్టే బేకరీలుకూడా పెడతారు. అలాంటి బేకరీలో చేసేవే ఈ చందమామ బిస్కెట్లు. నోట్టోవేస్కుంటే కరిగిపోతాయ్. అలాంటివే కొబ్బరి బిస్కెట్లు, జీడిపప్పువి మొవి. ఇంక, అత్యంత ఇష్టమైన చాక్లేట్లు - parrys. చాలా తక్కువ ఖరీదు. బ్రంహాండమైన రుచి. ఎప్పుడో ఓసారి eklairs తినేవాళ్లం. అవి కొంచెం ఖరీదు, ఒక్కోటి అర్ధ రూపాయ్. నాటు నాటుగా తినేవి, తెగ ఎగబడి తినేవి "కొబ్బరి బిళ్లలు". మా బడి గేటు దగ్గర ఒక బూబమ్మ కిందపెట్టుకు కూర్చుని కొబ్బరి బిళ్లలు, గొట్టాలు, రేగి అప్పచ్చులు, నూగుజీడీలు, పుల్లశనగ గుగ్గిళ్ళు అవి ఇవి అమ్ముతుండేది. 5 పైసల్కి ఒక బిళ్ల. తెగతినే వాళ్లం. అలానే గొట్టాలు. 5 పైసలకి 5. ఒక్కోవేలుకి ఒక్కోటి పెట్టుకుతినేవాళ్లం. అప్పుడప్పుడూ గుంటపునుగులు వెల్లుల్లి కారప్పొడి. ఇంక నూగుజీడీలు: పెద్దవి చిన్నవి. పెద్దది ఐతే నోట్టో పట్టేది కాదు చీకి చీకి..చిన్నవి ఆ బుగ్గలో ఓటి ఈబుగ్గలో ఓటి పెట్టుకుని చీకేటప్పుడు ఒకసౌండు, ఇషక్ ఇషక్ అని.. ఇంక, పప్పుండలు... మా ఇంటో ఒక కుటుంబం అద్దెకుండేవాళ్లు. వాళ్లది పప్పుండల వ్యాపారం. వేడి వేడి పప్పుండలు, ఆ బెల్లప్పాకం వాసన, యాలుకల వాసన...నాయనా!! పార్ధాయ ప్రతిబోధి చెట్టూ, రిక్షా పై విమానయాత్రా...
తర్వాత్తర్వాత మిరపకాయ బజ్జీలు, పునుగులు. వహ్.. పల్నాళ్లో పుట్టినందుకు, గుంటూరు జిల్లావాణ్ణైనందుకూ నాకు చాలా గర్వంగా ఉంది.
ఇంతకముందు గుంటూర్లో బోంబే టీష్టాల్ అని లక్ష్మీ పురమ్లో ఉండేది. అక్కడ ఉల్లి మిర్చి బజ్జి. అంటే, వేడి వేడి మిరపకాయ బజ్జిని నిలువునా కోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసిం, కారం ఉప్పులో నిమ్మకాయ పిండి దాన్ని ఆ ఉల్లిపాయలమీద జల్లి ఇస్తాడు...జీవితం ఎటుపోతుందో..నాలిక అలా కిందపడి కొట్టుకుండేది ఆ రుచికి. అలా తిన్నాక, అసలే వేడి వాతావరణం, ఆపైన, మిర్చి బజ్జి, ఆపైన కారం ఇన్ నిమ్మ రసం, చెమట కక్కి దెబ్బకి చొక్కా తడిసాక, వేడి వేడి చాయ్ కొడితే...గణేస్ నిమర్జనమ్లో తీన్మార్ కి డాన్సేసినట్టు అహా షేకు షేకు అవుతుండేది మనసు.అట్టానే, బ్రాడిపేట 2/1లో ఒక బజ్జి బండి. వానిదెగ్గర పునుగులు. వేడి వేడి పునుగులు, వాయి తీయ్యంగనే ఖతం. వానిష్. ముందుగానే బుక్ చేస్కోవాలి ఆర్డరు. అలా వేడి వేడివి, కారప్పొడితో తిని వగర్స్తూ ఓ షోడా తాగితే...అహా జజ్జినక జజ్జినక.. మొదట్లో బ్రాడీపేట 4/7 లో రెడ్డి మసాలా, జిలేబి ఉండేది. తర్వాత్తర్వాత 4/14లో పెట్టాడు రెడ్డి. ఒక సాదా మసాల - మరమరాలు, వేయించిన వేరుశనగ ఇత్తనాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగిన మిర్చి, కొన్ని అలచందలు ఉదకబెట్టినవి ఒక కొబ్బరి ముంతలో వేసి బాగా కలిపి, ధనియాపొడి, ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి మళ్లీ గిలక్కొట్టి ఒక ఆకులో వేసి, తాటాకుని ఒక ని స్పూన్లా వేసి ఇస్తాడు. జజ్జనకా, అహా జజ్జనక...ఇది అయ్యాక, బఠాణి మసాలా - బఠాణీలు టమాటాలు, కారెట్టు, అలా ఉడుకుతూ ఉంటాయ్..దాన్లోంచి ఒక పెద్ద స్పూన్ తీసి, ఉల్లి, కొత్తిమీర పుదినా వేసి నిమ్మకాయ పిండి ఇస్తే...జజ్జనకా అహా జజ్జనకా...అలా పొట్టపగలా తిన్నాక, రెడ్డి బండికి ఎదురుగానె జిలేబి బండి..వేడి వేడి జిలేబి. 100గ్రాములు ఒక్కరూపాయే.. పట్టాభిపురం గుడిదెగ్గర,బాషా మసాలా అని ఒక బండి ఉండేది. అహా ఏమి రుచి...అనరా మైమరచి...
తర్వాత్తర్వాత గప్చుప్లు. ఇవి వచ్చిన కొత్తల్లో ఒకటి రెండు బళ్లు మాత్రమే ఉండేవి. వాడిదెగ్గర, ముందుగా ఒక మసాలా కట్లెట్ - అంటే ఉడకబెట్టిన బంగాళాదుంప, ఎదో మసాల, దాన్ని పెద్ద పెనం మీదపెట్టి మాష్ చేసి, పాని పోసి కొన్ని బఠాణి వేసి మెత్తగా నూరి ఒకటిరెండు పూరీలు నలిపేసి ఇస్తాడు. బానే ఉండేది. అది అయ్యాక ఒక పాతికో ముప్పైయ్యో పానీపూరీలు తినే వాళ్లం. ఇప్పట్లో, మనకి పొరుగింటిపిల్ల కూర సారి పుల్లకూర రుచి. మనవి మర్చిపోవటం అంటే మనకి మహా సరదా. ఎక్కడ చూసినా బేకరీలు పిజ్జాలు బర్గర్లు గోల.
ఇక..చివరాకరికి ఇక్కడ...అమెరికన్ వడలు..ఒక్కటికూడా తినలేము. బేగల్, పొటాటో విడ్జెట్స్ తినలేము, ఫ్రెంచ్ ఫ్రైస్ తినలేము. ఏందయ్యా అంటే అలా ఆప్-పిళ్ (యాపిల్), పీచ్, గట్రా పళ్లు తింటమే.. ఒకప్పటిరుచిని తల్చుకుంటూ....
అప్పుడే నావైపు "ఏంటి పొద్దుగూకులూ కంప్యూటరేనా..నాతో ఆడవా..అలా గుడ్లు మిటకరించి చూస్తావేం..కళ్ళాజోడుపెట్టుకుచూడొచ్చుగా" అన్నట్టు ఎలా చూస్తోందో చూడండి ఈ పిల్ల...
అవును... ఈరోజు, అనగా, అక్టోబరు తొమ్మిది, గురువారం, మధ్యనం మూడుగంటలా పదిహేను నిమిషాలకి ఆ దుర్గాదేవి మాకు అమ్మాయిని ప్రసాదించింది. తల్లి, పిల్ల ఇద్దరు క్షేమం..
చిన్నప్పుడు విపరీతంగా, అత్యంత ఉత్సుకతతో, అత్యంత తక్కువ ఖర్చుతో ఆడుకున్న ఆటల్లో ఇదొకటి.
దీనికి కావాల్సింది,ఐసుపుల్లలు. ఎన్ని? ఎన్నైనా. ఒక 11 అనుకోండి. 11లో ఒకటి తీసి పక్కనబెట్టి, మిగతా 10 ని గుప్పిట పెట్టి నేల మీద ఒక జానెడు ఎత్తులోంచి నిలువుగా జారెయ్యాలి. పుల్లలు ఒక దాని మీద ఒకటి ఇష్టంవచ్చినట్టు పేరుకుంటయ్. అప్పుడు ఇందాక పక్కనబెట్టిన పుల్లతో ఒక్కోపుల్లని, మిగతా పుల్లలు కదలకుండా తియ్యటం. ఎవరు ఎక్కువ తీస్తే ఆళ్ళు గెల్చినట్టు.
ఈ ఆట "ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్" మరియూ "కాన్సంట్రేషన్" ని పెంచుతుంది. టిప్: ఐసుపుల్లలు లేకపోతే? వెదురు పుల్లలు ఐసుపుల్లంతవి. అవికూడాలేకపోతే, చీపురుపుల్ల. అవికూడా లేకపోతే...అరెయ్ అరెయ్ అరెయ్..నాకింకో పేరు కూడా ఉంది..బాషా బాషా బాషా..ఆడితే ఆడులెకపోతే వెళ్ళి క్రిక్కెట్టుజూస్కోపో....
ఈరోజు బియ్యం కొంటానికి వెళ్ళా. లక్ష్మి బ్రాండ్ సోనా మసూరి బియ్యం, 20 lb సంచి ముఫైఎంది డాలర్లు. పోయినేడాది ఇదే సీజన్లో అదే సంచి తొమ్మిది డాలర్లు. 20lb=8.93 kg. అంటే ఒక్కో కిలో 4.26 డాలర్లు. అంటే డాలరు ఒక్కింటికి 46 రూపాయలు వేస్కుంటే కిలో బియ్యం తస్సదియ్య 196 రూపాయలు. ఇడ్లీలోకి, దోశెల్లోకి బియ్యం కావాల్సిందే.
ఉద్యోగానికీ భరోసాలేదు. ఎప్పుడు ఏ పుట్టిమునుగుతుందో తెలీదు. బైల్ ఔట్ అంటారు, అదేదో రన్ ఔట్లా. షేర్లు అరవైల్నుంచి వందశాతం తగ్గినై. ఏందీగోల. సచ్చిన పావుని ఎంతమంది ఎన్నిసార్లు సంపుతారో. అటైపు సూద్దాం అంటే తెలంగాణా అంటాడొకడు, కిలో బియ్యం ఉచితం అంటాడింకోడు, నీకు పూరా జీవితం ఉచితం అంటాడింకొకడు.
రేపటికి నా ఉద్యోగం ఉంది. చూద్దాం ఎల్లుండి ఎలా ఉంటుందో?
నిజంగా ఇదేదో ఆడవాళ్ళమీదకోపంతోనో, లేక స్త్రీద్వేషంతోనో రాయటమ్లేదు.
ఈరోజున, మగపిల్లోడు, ఇంజనీరింగో లేక, యం.సి.ఏ నో చెయ్యటం దెగ్గర్నుంచి ఇంటికి దూరంగనే ఉంటున్నడు. వాడు చదువు పూర్తిజేసి, ఉద్యోగం వచ్చి, సెటిల్ అయ్యి, బంగళూరో పాటిబండ్లో ఎదోచోట బ్రహ్మచారిలా మిగతా మూకల్తో కల్సి ఉంటూ, మొత్తమ్మీద ఇంటికి దూరంగనే ఉంటాడు. ఈలోపల ఆన్-సైట్ అది ఇదీ. ఈలోపల ఏదో టీకొట్టోడు (అదేనండీ మన కన్సల్టెన్సీలు - అమెరికాలో అవి చాయ్ దుకాణాల్లానేగా) పట్టేస్తడు. హెచ్-1. మనోడు అమ్రికాలో వాల్తడు. ఈలోపల పెళ్ళి. పెళ్ళికాంగనే ఆ పిల్లకి అత్త మామల్తో కల్సి ఉండి, వాళ్ళ టెంపర్మెంట్సు తెల్సుకునే అవకాశం, సమయం లేవు. పెళ్ళి అవ్వటం అమెరికా ప్రయాణం. ఇక్కడకి రాంగనే ఐసోలేటెడ్ జీవితం. దాంతోటి, పెద్దోళ్ళు ఎవ్వరూ లేకపొయ్యేసరికి, మనం ఏది ఆలోచిస్తే అదే కరెక్టు. మొండితనం, పంతం, పట్టుదల పెరిగి మఱ్ఱిచెట్టంత అయితై. ఈలోపల కడుపు కాకరకాయ. ఇన్వైటేషన్ లెటర్సు ఎవరికి పంపాలి? పిల్ల తల్లికే!!! కానుపు ఐంది. ఇక్కడా పిల్లాడి తల్లితండ్రులకి దిగులు, పేపర్లు పంపిస్తా రండీ అన్నా ఒక రకమైన అభిమానం, కానుపు మమ్మల్ని పిలవలేదు కదా అని. ఈలోపల ఆ పిల్లకి మొదలే దూరమైన అత్త మామలు ఇంకా దూరమై, భారంగా కూడా కనబడ్తారు. అప్పటిదాకా గుర్తురాని "పేరెంట్స్ రావాటానికైయ్యే ఖర్చు" అప్పుడు గుర్తొస్తుంది. మొత్తానికి నాయనమ్మలు, అటు కొడుకూ దూరమై, ఇటు కొడుక్కి పుట్టిన నలుసునీ కూడా చూస్కోలేక ఏడుస్తున్నారు.
గాంధి ని చంపేసాను అవును. నేనే. గాంధిని అత్యంత దారుణంగా, హేయంగా, ఆతని అరుపులు ఎవ్వరికీ వినబడనీయకుండా నేనే చంపేసాను. దేనికంటే.. సత్యాగ్రహమంటాడా? అహింసా? ఖాదీయా? ఉపవాసం చేయమంటాడా? కట్నాలకోసం అమ్మాయిల్ని అతిదాఋణంగా హింసిస్తున్న సమాజాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా అఱవకుండా, తిలాపాపంలో పాలుపంచుకుని గాంధీని చంపేసాను. అడుగడుగునా లంచాలతో జనాల రాక్తాన్ని పీల్చుకుంటున్న అధికారగణం మీద యుద్ధాన్ని ప్రకటించకుడా, నాకు చేతనైనంతవఱకూ లంచాల్ని ప్రోత్సహిస్తూ గాధీని చంపేసాను. కులం కులం అని కుచ్చితాలుపెంచుకుంటున్న జనాల్ని సరైన మార్గంలో పెట్టకుండా నేనూ ఒక కుల కుంపట్ని వెలింగించి గాధీ చంపేసాను. మతం తన పరిధులు దాటి గజ్జిగా మాఱితే నేను దాన్ని కడుక్కోకుండా అందఱికి అంటిస్తూ గాంధీని మళ్ళీ చంపేసాను. సత్యాగ్రహం అనేపదానికి సమాజం "అ" చేర్చినప్పుడు కిమ్మనకుండా నేనూ అసత్యాగ్రహాన్ని ప్రచారం చేస్తూ గాంధీని అతిదారుణంగా చంపేసాను. అహింస పరమో ధర్మహ కి బూజు పట్టించి దాన్ని హింస పరమో ధర్మహ లా మార్చినప్పుడు సమాజాన్ని ఎదురించటం మానేసి నేనూఒక కత్తి పట్టి గాంధీని నఱికేసాను. పేదరికాన్ని రూపుమాపేందుకు అప్పులు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాన్ని ఎదురించటం పక్కనబెట్టి ప్రపంచీకరణ పేరుతో మన సహజ వనరుల్ని అమ్ముకుంటూ గాంధీని చంపేసా. అభివృద్ధి పేరుతో సంస్కృతినీ సంప్రదాయాన్ని గాలికొదిలేస్తూ గాంధీని మళ్ళి చంపేసా
నేననుకుంటుంటాను, ఈరోజున ఆంగ్ల పాఠశాలల్లో చదువు ఎంతవరకు విలువైన చదువూ? అని. కారణం, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ఒక ప్రవేశ పరీక్ష రాసి, ఒక సెలెక్షను ప్రాసెస్ తో వస్తారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవాళ్ళు? జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయులకి ఒక బోధనా పద్ధతి, ఇన్స్పెక్షను గట్రా, మరి వీళ్ళకి? ఏంటి ప్రమాణాలు? ఇన్ని ఇంగ్లీషు బడులు రాకమునుపు స్టేటు ర్యాంకులు తెలుగు మీడియం వాళ్ళకే వస్తుండేవి, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల పాఠశాలలకి ఎక్కువ వస్తుండేవి, కొడిహినగళ్ళి, తాడికొండ ఇలా. ఈ ప్రైవేటు పాఠశాలలు వచ్చాక వీళ్ళు డబ్బుబెట్టికొనుక్కోటం మొదెలుబెట్టారు అన్నీ. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే ,ఈరోజు ఎంతమంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పిల్లల్ని అదే బడిలో జేరుస్థున్నారు? ఇంగ్లీషు మీడియం చదువే చదువా? మిగతావి బడులే కావా? పిడుగు రాళ్ళలో బడి ఒకప్పుడు చాలా పేర్ప్రఖ్యాతులు గడించింది. మానాన్న దాంట్లో పని చేసేప్పుడు ఆయన, సహ ఉపాధ్యాయులు, పోటీలుపడి పాఠాలు చెప్పే వాళ్ళు (Quality). ఆ బడికి పెద్ద గ్రౌండు. మేము (నా సోదరుడు, నేను) తండా బడిలో చదువుకున్నాం, అది మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల. మా ఉపాధ్యాయులు తాట తీసేవారు. ఎఱ్ఱంశెట్టి సీతారామయ్య మాష్టారు, సీతారామయ్య మాష్టారు, ఆంజనేయులు మాష్టారు, రామిరెడ్డి మాష్టారు, రామస్వామి మాష్టారు, విజ్యలక్ష్మి టీచరుగారు ఒక్కొక్కళ్ళూ డెడికేటెడ్గా పనిచేసేవారు. నేను 8-10 చదువుకున్న మోర్జంపాడు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల చాలా పెద్దది. అసలు బడికి వెళ్తే ఒక రకమైన భావన రావాలి. ఇరుకు గదుల్లో, ఆటస్థలంలేకుండా, ఎవుడుపాఠాల్జెప్తున్నాడో తెలియదు, దేనికిజెప్తున్నారో తెలియదు, ముక్కునబెట్టుకోటం పరీక్షల్లో ఛీదటం. మర్కులు బానే వస్తాయ్..కాని? మోర్జంపాడు ఎత్తుబడికి బెస్ట్ బడి అవార్డ్ కూడా వచ్చింది. 1000-2000 చెట్లు నాటాం. రకరకాల చెట్లు. బళ్ళో మగ్గాలుండేవి. క్రాఫ్ట్స్ మాష్టారు ఒకాయన, ఒకక్రాఫ్ట్స్ పిరీడు. మగ్గాలమీద నవారు నేసే వాళ్ళం. సంవత్సరానికోసారి వాటిని పాటపెట్టి అమ్మేవాళ్ళం. బళ్ళో పెరిగిన గడ్డికోస్కుంటానికి పాట ఉండేది. బళ్ళో టమాటా, వంకాయా గట్రా కూరగాయలు పండించేవాళ్ళం. చదువు ఎంతవరకూ వచ్చింది అనేది పెద్ద విషయం కాదు. అది విద్యార్ధి మీద ఉంటుంది. ఒక పద్ధతి ఉందా లేదా అనేది ముఖ్యం. ఈరోజున జి.ప్ర.ప.ఉ పాఠశాలలు బోసిపోతున్నయి.
ఒకానొక కాలంలో ఆడపిల్లలూ ఈడపిల్లలు, అంటే అబ్బాయిలూ ఈ ఆటలాడేవాళ్ళు: బిళ్ళంగోడు/గూటి బిళ్ళ కబడ్డి ఖోఖో బాడ్మెంటెన్ వాలీబాల్ అంజనం పెద్ద అంజనం అష్టా చెమ్మ గిల్లాలు వంగుళ్ళు దూకుళ్ళు బెచ్చాలు ఓకులు గోలీలు కోతికొమ్మచ్చి నాలుగు స్థంభాలాట ఉడుం వీధీ వీధీ గుమ్మడిపండు కాళ్ళాగజ్జాకంకాళమ్మ పుల్లాట పులి మేక రాముడు సీత దీనిపేరు నాకు తెలియదు. ఒకడు చేతులు పైకెత్తి ఒక కర్రని రెండుచేతుల్తో పట్టుకుంటాడు. దాన్ని ఇంకొకడు ఇంకో కర్రతో తియ్యాలి. గుడుగుడు గుంజం అందరూ గుండ్రంగా కూర్చుని ఉంటే ఒకడు వాళ్ళ వెనక పరిగెత్తుతూ ఖర్చీఫ్ వేస్తాడు. అదేదో ఆట. నేల బండా ఏడుపెంకులాట
ఇప్పుడు ఒకటే ఆట - క్రికెట్టు. లేకపోతే కంప్యూటరు ఆటలు. పైన పేర్కొన్న ఆటలన్ని కనుమఱుగైపోతున్నాయి.. కొత్త నీరొచ్చి పాతనీరుని ఆక్రమించేస్తుంది, సృష్టి సహజం. కాని ఆ పాతవాటి విలువ కొత్తతరానికి తెలిపేదెలా?
పోయిన వారాంతానికి మళ్ళీ యాపిల్ పికింగ్ కి వెళ్ళాం. దేనికెళ్ళాం అంటే మా బుడ్డోడ్ని గుఱ్ఱం ఎక్కించొచ్చని. మావోడికి గుఱ్ఱాల పిచ్చి పట్టుకుంది. ఆవు కధలా, ప్రతీదాన్ని గుఱ్ఱానికి లింకు పెడతాడు. నాన్నా ఆవు ఏంటుంది? భారత్ లో అంబా అంటుంది, ఇక్కడ మూ. మరి గోట్ ఏంటుంది? మా మా. మరి గుయ్యం? హీహా. గుఱ్ఱం బొమ్మ తెస్తాడు వెంటనే, నాన్నా నాన్నా నాన్నా దీన్ని గుఱ్ఱం అంటారు. "ఏంటమ్మ!! గడ్డితిన్నావా" అను అను అనూ, అన్నా, ముక్కు మీద రుద్దు. రుద్దా. అలా వచ్చి మోకాళ్ళ మీద పడుకో.. దేనికి? నేను నీ వీపు మీద ఎక్కి హార్స్ రైడ్ చేస్తా... స్నానం చేయించేప్పుడు, నాన్నా హార్స్ ఏమంటుంది. ఇదే గోల. అందుకని వీలునప్పుడు అలా వెళ్ళి గుఱ్ఱం ఎక్కిస్తాం. ఇదిగో ఇలా ఆనందిస్తాడు,
వాడి 90 ఎకరాల తోటలో రకరకాల యాప్పిల్స్, పీచ్, స్ట్రాబెర్రి, పెద్ద గుమ్మడి కాయలు, స్క్వాష్, మొ|| ఉంటాయి. పోయిన వీకెండ్కి వెళ్ళినప్పుడు జనం తిర్ణాలకొచ్చినట్టు వచ్చారు. లోనకెల్టాకి 20 ని. పట్టింది. అక్కడ తీసిన ఒక చిన్న సరదా వీడియో.
యుద్ధంలో కూడా నీతి ఉంటుంది. అంటే పోరాట యోధుడు కిందపడితే వాడ్ని చంపకూడదు అనో, లేక, రధం ఇరుసు ఇరిగిపోతే బాగుజేస్కునే వానిమీద బాణం వెయ్యకూడదనో, లేక, తెల్లజెండా ఎగరేసినోడిమీద ప్రతాపంజూపకూడదనో ఇలా.ఈనాటి యుద్ధాల్లో మరి ఇలా ఉన్నాయో లేదో తెలీదుకాని కొంతమందికి కనీస నీతి న్యాయాలు ధర్మాధర్మాలు లేవనిపిస్తుంది. ఈళ్ళెవరయ్యా అంటే మతంపేరుతో కుతికెలు కోసేవాళ్ళు. వాళ్ళు అహమ్మదాబాదు అల్లర్లుజేసినోళ్ళు కావొచ్చు, లేక దేశమ్లో పలుచోట్ల బాంబులుబెట్టి జనాన్ని జంపినోళ్ళు కావొచ్చు.తుపాకితో ఏదో చేద్దాం అనేటోళ్ళల్లో నక్సలైట్లకి కూడా నీతి ఉంది. అదేంటంటే, మేము పలానోడ్ని జంపాం, ఇదీ కారణం. ఆడు ఉత్తి ఎదవ ,లంచగొండి, జనాల్ని పీల్చి పిప్పిజేస్తున్నడు అని. ఇండియన్ మొజాహద్దీన్ అనే యదవనాకొడుకుల్కి, కనీస నీతి లేదు. మేము బాంబులు పెట్టాం అని ఈనాకొండిగాళ్ళు రొమ్ములుజింపుకుని, కాస్ట్ అవే సిన్మాలో టాం హాంక్స్ నిప్పుని రాజేసి రొమ్ములు గుద్దుకున్నట్టు, "మేమేజేసాం!! చూడంద్రా ఎంత మంది సచ్చారో" అని జబ్బల్జర్సుకున్నరే, "ఇదిగో ఇందుకు జేసాం. మా సమస్యలివి" అని ఎక్కడైనజెప్పరా? చిన్న చిన్న పిల్లల్ని, ఆడోళ్ళని, ముస్లోళ్ళని, ముతకోళ్ళని జంపమని జెప్పిందా పోరాట అజెండా?
పోరాటం అనేది టెస్టింగు లాంటిది. మేము టెస్టింగు జేస్తున్నం అంజెప్తే, ఏమి టెస్టింగు జేస్తున్నరు? మీ టెస్టింగు అజెండా ఏంది? మీ టెస్టింగు గోల్సు ఏంది? అని అడగాలె. అవిలేకుండ టెస్టింగుజేస్తున్నం అంటే నీళ్ళల్లోకి రాయేసినట్టే. అట్టానే పోరాటం జేస్తున్నం అంటే ఎవ్వనిమీద జేస్తున్నం? అజెండా ఏంది? గోల్స్ ఏంది? దేనిగురించి పోరాటం? అవిలేకుండా మేం పోరాటం జేస్తున్నం. డబ్బులున్నై, సంపాయించాం, మందుగుండు సామాగ్రి కొన్నాం బాబులు పెట్టాం, పేల్చాం....ఏందిది?
నేనీరోజు దేనికోసమో గూగుల్లో వెతుకుతుంటే ఈ బ్లాగు http://teluguplaty.blogspot.com/2007/11/blog-post.html, http://www.venuvedam.com/ కనపడింది. నా కళ్ళు చెపర్చాయి.
మనిషి పుట్టుకేంటో, పోవటమేంటో. అస్సలు ఎందుకుపుడతామో? చావంటే నాకు భయం లేదు. మా నాన్న నా చేతుల్లోనే పొయ్యాడు. మా తాతయ్య నా కళ్ళా ముందే పొయ్యాడు. ఇక్కడ నా రోదన ఏంటంటే: మనం ఐటీ రంగం అది ఇది, అభివృద్ధి, 2020, చదువు సట్టిబండలు, అమెరికా, జపాను, జెర్మనీ అని రొమ్ములు ఇరగదీసి బాదుకుంటాం. ఐతే, గుంటూరులో, బ్రాడీపేటలో మానాన్నకి గుండె నొప్పి ఎక్కువైతే, ఇంట్లోచి కిందకెళ్ళి ఆటో ని పిల్చుకొచ్చి ఆశుపత్రికి తీస్కెళ్ళేలోపు ఆయన ప్రాణం పోయింది. ఇన్ని ఉండి, ఇంత జ్ఞానం ఉండి, విజ్ఞానం ఉండి మనం మన కనీస అవసరాల్ని దేనికి పట్టించుకోము అని? మన డైయాగ్నైజు ఇలా ఉంది: మా నాన్నకి 1999 లో గుండే పెరిగింది. ఆ సమయంలో అది గుండె పెరగటం అని మేము కనిపెట్టలేక పొయ్యాం. ముందు జ్వరం వచ్చేది. ఒక పెద్దాయన దెగ్గరకి వెళ్ళాం. ఆయన ముందు మలేరియా అని క్వినైన్ ఇచ్చాడు. 10 రొజుల తర్వాత ఇంకా తగ్గక పోతే మళ్ళి వెళ్ళాం. ఈసారి యంటై బాక్టోరియల్ ఇచ్చాడు. ఇంకో 10 రోజులు గడిచినై. ఈలోపల మా నాన్న 10 కిలోలు బరువు తగ్గిపోయాడు, పేల్ గా అయిపోయాడు. అప్పూడు నా సొంత తెలివితేటల్తో, నా డాక్టరు స్నేహితులతో చర్చించి, కంప్లీటు చెకప్పు చేయిద్దాం అని నిర్ణయించి అరుండేల్ పేటలో అమరావతి డైయాగ్నోస్టిక్స్ కి వెళ్ళాం. Dr. Srinivasa Reddy MD అక్కడ ఇన్-ఛార్జ్. వెళ్ళాం, ఎక్స్-రే అవి ఇవి అయ్యాయి. స్కాన్ తీయించుకోటానికి రమ్మన్నారు, వెళ్ళాం. వాడు, ఆ స్కాన్ తీసేవాడు, ఒక కంప్యూటరు స్క్రీను మీద చూస్తున్నాడు, దాంట్లోనే ఇంకో విండో, దాంట్లో సిటికేబుల్లో సినిమాజూస్తున్నాడు. అలా మల్టై ప్రొసెస్సింగు జేస్తూ గుండే దెగ్గర స్కాన్ తీస్తూ, పేషంటుతో అంటాడూ "మీ గుండె పెరిగింది!! చాలా సీరియస్గ ఉంది" అని. వెంటానే వాడి రెక్క పట్టుకులాక్కొచ్చా బైటికి "ఎవుడ్రా నువ్వు, రోగికి చెప్తార్రా, పక్కన్నేనున్నది దేనికి" అని కొట్టినంత పనిజేస్తే అప్పుడొక "సారీ"ని నామొహాన కొట్టి రిపోర్ట్స్ చేతిలోపెట్టాడు. తర్వాత మొత్తనికి పోరాడి కొంతకాలం బతికించుకున్నాం మా నాన్నని అది వేరే సంగథి. బ్రాడీపేటలో ఉన్న ఒక రోగి, ఎక్కడో కొత్త పేటకి ఆటోలో వెళ్ళాటానికి కనీసం 30 నిముషాలు పడుతుంది, ఆయువుంటే బతుకు, లేకపోతే? అసలు అన్నీ ఆస్పత్రులూ ఒకేచోట దేనికి? ఇదేమైయినా కూరగాయల మార్కెట్టా? బ్రాడీపేట కాడ్నించి కొత్తపేట కాడికిబోటానికి ౩౦ ని పడితే, మోర్జంపాళ్ళో గుండెనొప్పొచ్చినోడిని గుంటూరు ఎత్తుకెళ్ళాలంటే? రేగులగడ్డ కాడ్నించో? ౨౦ లక్షల కోట్లు అప్పుజేసాం ఇప్పటిదాకా. ఆడబ్బుని ఏంజేసాం? మన్లో కొంతమంది ఎదవలు అప్పుజేస్తే తప్పేంటి అన్నారు, కొంతమంది కాంగ్రేస్ అప్పుజేయకూడన్నారు. కొందరు టీడీపీ మాత్రమే అప్పుజేయ్యాలన్నారు. ఒకడు ప్రపంచ ఎకనమిక్ ఫోరం కెళ్ళొస్తడు. ౫౦ మంది ఎంపిలు అమెరికాకెళ్ళొస్తరు. అది చూసాం, ఇది చూసాం. ఎక్కడ వాటి ఫలాలు? మనకి బతుకు విలువ ఎప్పటికి తెలుస్తుంది? చిన్న పిల్లలు ఇలా అర్ధం కాని ట్యూమర్లతో పోతుంటే? ఏంటో నాకు ఆవేశం తో పాటు ఆవేదన, ఆందోళన కల్గుతోంది. ఒక ఎమర్జన్సి మెడికల్ సిస్టం ఎందుకని మనం పెట్టుకోలేకపోతున్నాం? మండలానికి ఒక ఎమర్జెన్సీ, ట్రౌమా కేంద్రం ఏర్పాటుచెయ్యటానికి ఆటంకాలేంటో? పైన పేర్కొన్న బ్లాగులో ఆ తల్లితండ్రులు ఎంత హృదయవిదారకంగ కుమిలిపోయి(పోతూ) ఉంటారో? ఇశాన్ తండ్రి ఇలా రాసాడు "వాడు మాకు చాలా జీవిత సత్యాలు నేర్పాడు. మరణం అనేది కేవలం ఒక మార్పు మాత్రమే అని చెప్పాడు. ఇక ముందు మాకు ఎటువంటి కష్టాలైనా చిన్నవిగానే కనిపించేటట్లు చేశాడు. డబ్బు ఎందుకు పనికిరాదు అని విడమార్చి బోధించాడు. (అమెరికా లో చికిత్స చేయించగల స్థోమత ఉండి కూడా అందుకు వ్యవధి లేని పరిస్థితి)." అంత చిన్న పిల్లోడి ఆర్గాన్స్ డొనేట్ చేసారంటే వాళ్ళకి నేను శిరస్సు వంచి పాదాభివందనం జేస్తున్న. ఇలా అర్ధాంతరంగా మనల్నందర్ని వదిలేసి నిజంలో ఐక్యం ఐన వాళ్ళందరికోసం రెండునిమిషాలు మౌనం పాఠిస్తున్న.
ఇందాకనే నా మితృడొకడు మొహం ఏళ్ళాడేస్కుని నా డెస్కు దెగ్గరకొచ్చాడు. ఏందిరా అన్నా, మనసేం బావోలేదు. ఏం? మా స్నేహితుడి కొడుకు రెండున్నరేళ్ళు, పోయాడూ!! ఎలా? ఎక్కడా? ముంబయ్ లో ట్యూమర్. నాకు కళ్ళలో నీళ్ళుతిరిగినై. మనసంతా వికలమైంది. నాచిట్టికన్నల్లారా!! పుట్టిపుట్టంగనే ఇలా ఎళ్ళిపోతే ఎలా???? అందరూ ముందుకి రండి. మనకోసం, మన ఊరుకోసం ఎదోకటిజేద్దాం...దయచేసి.
కల కంటం మానవ హక్కు. ఐతే కలల్ని సాకారం చేస్కోటం సానా కష్టం. కలల్ని కని ఆటిని కష్టపడి సాకారం సేసుకున్నోళ్ళు సానా పైకెళ్ళారు. అంబాని, బిర్లా ఇలాంటోళ్ళు. మనం ఇప్పుడు మాట్టాడుకునేది అట్టాంటోళ్ళ గూర్చి కాదు.
"డాడీ" అస్సలు కష్టం, నరకం, బాధ ఇలాంటివి ఉంటాయనికూడ తెలవని, పట్టు పఋపులమీద, వాతావరణానుకూల గదిలో, చుట్టూ పెద్ద పెద్ద మెత్తని బొమ్మల మధ్యలోంచి అఱిచిందో పద్దెందేళ్ళ పాప కంఠం "వస్తున్నా తల్లి" (సాగర సంగమం సినిమాలో ఫోటోస్టూడియో ఓనర్లా) అని వెళ్ళిందో ఖద్దరు ఆకారం "డాడీ, నోవాట్, ఐ హాడ్ అ డ్రీం లాష్ట్ నైట్" "అవునా తల్లి!! నువ్వుకాక ఇంకెవరు కంటారు కలలు. కలలు కనే హక్కు, అధికారం మనకిమాత్రమే ఉన్నాయి. కలల హక్కులు (పేటెంట్స్) మన హస్థగతం చేస్కోటాకి సెగెట్రిని పురమాయించా!!! ఇంతకీ ఏమి కల కన్నావ్?" "డాడీ!!! ఇట్సే డ్రీమ్ అబౌట్ స్పేండింగే ఎ డే" "??" "డాడీ!!గాట్ టు గెట్టప్ ఇన్ సింగపూర్, బ్రేక్ఫాష్ట్ కౌలాలంపూర్, షాపింగ్ ద్యూబై, లంచ్ మ్యూనిక్, కాండిలైట్ డిన్నర్ వెనీస్, స్లీప్ ఇన్ సిడ్ని" "ఓసంతేనా!! నేన్జఊస్కుంటా" .. "సెగెట్రి!! గుత్తేదార్లుని పిలువ్, గుత్తే౧: ఇరవైలచ్చలు, గుత్తే౨:నువ్వో ౫౦లచ్చలుతే. .... ..." ... మనం మాట్టాడబోయేది ఇట్టాంటోళ్ళగురించి.
ఇట్టాంటోళ్ళూ కలలు కంటారు, కల్లో పక్కన భామల్తో (ఐదు నుంచి నూటాఅయిదు వయస్సు వరకు ఎవతైనా పర్లేదు) స్కాచ్ కొడుతూ, బూతుబొమ్మల్జూస్తూ విహరిస్తున్నట్టు.....అంతే ఠకామని లేచి, మనలాంటి గొఱ్ఱెలమందకి "గొఱ్ఱెల్లారా!! నేనొక కల కన్నా.. మీగుఱించి. భవిషత్తులో మీకు ఎట్టాంటి రాష్ట్రం గావాలి, గుడ్డూ గూసు" గొఱ్ఱెలు "అహా ఓహో!! అయ్యోరు మనకోసం సరిగ్గా నిద్రకూడా పోకుండా, ఒకేళ పోయినా మనకోశం కలలు కంటున్నడు!! అహా ఓహో" "కాబట్టి గొఱ్ఱెల్లారా!! నేను కన్న కలలు నిజం కావాలంటే, మీరు కలలుకన్న(కలలు వీళ్ళ ట్రేడ్మార్కులు కదా, పొరబాటున కలలు కంటే సూ జేస్తడు జాగర్త), మీరు కోరుకున్న (కోరికలా బొంగా - గొఱ్ఱెలక్కూడా కోర్కెలుంటాయా) జీవితం రావాలంటే నాకేఓటేయ్యాల" ఓట్లేసినై మన గొఱ్ఱెలు. మనోడు తన కలల్ని సాకారంజేసుకున్నడు. గుత్తేదార్లు డబ్బు పంచారు, పంచుకున్నరు. గొఱ్ఱెలు అరవకుండా కులాల, మతాల కుమ్ములాట పెట్టి, మొజాహద్దిన్ లాంటోళ్ళని అణగతొక్కకుండా ఏదోక రావణకాష్టం రగులుస్తూనే ఉంచి, కొన్ని గొఱ్ఱెల్ని బలి ఇచ్చి, గొఱ్ఱెలని మళ్ళీ గొఱ్ఱెల్నిజేస్తరు.
గొఱ్ఱెలు తమ బెత్తెడు తోకతోటి, మళ్ళీ కలలగురించి ఎవుడుజెప్తాడా అని అట్టా ఎదుర్సూస్తునే ఉంటై. దీన్సిగదరగ - ఎన్నికల్లో నెగ్గటం కోసం ఎన్ని కలలు కంటారో ఈనాకొడుకులు.
నేపధ్యం: కేసిఆర్ - దేవేందర్తో కల్సినడవటాకి సిద్దం చిరంజీవి - నాకు బెంజి తెల్సు గంజి తెల్సు వైయస్సార్ - కిలో బియ్యం రెండుకే" చంద్రబాబు - తొమ్మిదేళ్ళలో నేను టెక్నాలజీలోనే డబ్బుందనుకున్నా, ఇయ్యాల అగ్రికల్చర్లో కూడా డబ్బుందని వైయస్ని జూసినేర్చుకున్న. నన్నుగెల్పించండి. మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ కరుణానిధి - ఇంటికో టీవీ, కిలో బియ్యం రెండ్రూపాయలు (ఎదురిచ్చి) - అంటే కిలో బియ్యంకొను, బియ్యంతో రెండ్రూపాయలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అద్వాని - మాకు పగ్గాలివ్వండి - ఎనభై రోజుల్లో ఉగ్రవాదం ఖతం.
చివరాకరికి ఈపాటవిందాం. "నిదురపో...నిదురపో..నిదురపోరా తమ్ముడా" ఎందుకంటే కనీసం నిద్రలైనా మన బెత్తెడు తోకని మర్చిపోవచ్చుకదా....
మనం మళ్ళి సిగ్గుతో తలదించుకుందాం. ఇలాంటి శక్తుల్ని మన సమాజంలో పెరగనిస్తున్నందుకూ, అలాంటోళ్ళని పెట్టి పోషిస్తున్నందుకూ, సహాయసహకారాలు అందిస్తున్నందుకూ.
ఐతే, నాదొక Fundamental Question. ఇలాంటోళ్ళకి పేలుడుపదార్ధాలు, ఎక్కడ్నుంచొస్తున్నయి? పాకిస్థాన్ నుంచి అనినాకూ తెల్సు. నా ప్రశ్న, మన సైన్యం ఏంజేస్తుంది అని?
ఇక్కడ పిల్లి పిత్తినా, పాకిస్థాన్ అని అరవటం మాని, మన డాష్ కింద ఉన్న నలుపుని రూపుమాపుకుంటే మంచిది.
ఇంతమంది అటో ఇటో పోయి తీవ్రవాదం మీద ట్రైనింగ్ తీసుకుని హాప్పీగా వెనక్కి వచ్చేస్తున్నారు అంటే, మన ఇంటి కాపలా ఏంతగట్టిగా ఉందో అర్ధమౌతోంది...
సరే, బాంబులు పేల్నై. ౨౦ మంది పొయ్యారు. వార్తా ఛానెళ్ళు, పత్రికలు రాసినై, చదివాం, పడుకున్నాం, మళ్ళీ షరా మాములే, మర్చిపోతాం, మర్చిపోదాం. రేపు మళ్ళీ ఎక్కడ బాంబులేస్తారో చూద్దాం. అంతకన్నా మనం ఏంజేయగలం. మనం దున్నపోతులం కదా.
చివరగా ఇది చదువుదాం. మనదీ ఒక బతుకేనా సందుల్లో పందులవలే..
अधिगत्य गुरोः ज्ञानं छात्रेभ्यो वितरन्ति ये | विद्या वात्सल्य निधयः शिक्षका मम दैवतं || తాత్పర్యం: अधिगत्य - by acquiring गुरोर्ज्ञानं - the knowledge from the teacher छात्रेभ्यो - to students वितरंती - distributes ये - who विद्यावात्सल्यनिधयः - Source of knowledge and love शिक्षका - teacher मम - my दैवतम - god The teachers who distribute knowledge among the students after getting it from their gurus, and who are storehouses of love and knowledge, are indeed like God to me.
************
अन्नदानम् महादानम् विद्यादानमतःपरम् अन्नॆन क्षणिकातृप्तिर्यावज्जीवम् च विद्यया
************
(ఈ కింది వాక్యం మా మేనమామోపాఖ్యానం) అవశ్య మనుభోక్తవ్యం కృతంకర్మ కృతాకృత: మనం ఏం చేసినా దాని ఫలితం అనుభవించక తప్పదు అని ************ బుద్ధి కర్మాణుసారే!! ************ मात्रा समं नास्ति शरीरपोषणं चिन्तासमं नास्ति शरीरशोषणं ! मित्रं विना नास्ति शरीर तोषणं विद्यां विना नास्ति शरीरभूषणं !! ************
సంస్కృత వార్తా పత్రిక కోసం ఇక్కడ నొక్కండి సుధర్మ సంస్కృతంలో వార్తలందించే పత్రిక ఇదొక్కటే. ఈ పత్రిక గత ౩౯ (39) సంవత్సరాలనుండి మైసూరు నుండి వెలువడుతూ వార్తలందిస్తోంది.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కనుచూపు మేఱలోకి వచ్చినై. అందరూ అది ఉచితం ఇది ఉచితం అంటున్నరు. అస్సలు ఈ "ఉచితం" ఎంతవరకు ఉచితం? మనం స్వాతంత్రానికి షష్టిపీర్తి జేసాం. ఆనాటి గాంధీ కాడ్నించి ఈయ్యాల్టి గాంధీ వఱకూ, ఆయాల్టి పైం మినిష్టర్ కాడ్నించి ఈయ్యాల్టి పైం మినిష్టర్ వఱకూ, ఆనాటి ముక్యమంత్రి కాడ్నుంచి ఇయ్యాల్టి ముక్యమంత్రి వఱకూ, ప్రతీవోడు పేదరికం నిర్మూలన, పేదరికాన్ని మన దేశంలోచి తరిమేద్దాం, పేదరికం నిర్మూలనకి పెపంచ బాంకు కాడ్నుంచి అప్పుతెద్దాం, శుభ్రంగా మిగుదాం అన్నోడే కానీ పన్జేసినోడు కనబడ్లా. పైగా మనోళ్ళకి "ఉచిత" వరాలు ఇస్తున్నరు, కర్రేంటు ఉచితం, బియ్యం ఉచితం, గాలి ఉచితం, కాయితకం ఉచితం, తిండి ఉచితం, బట్ట ఉచితం, దొంగనా బట్ట ఉచితం, ఇద్దరాడపిల్లలుంటే సైకిలుచితం, ఇద్దరుపిల్లకాయలుంటే బస్సుపయాణం ఉచితం, ముగ్గురు మూర్ఖులుంటే సిలుమా(సినిమా)ఉచితం, రెండుకాళ్ళుంటే రోడ్డు మీద నడ్సుడుచితం, రెండుకళ్ళుంటే సూపుచితం, వోటుబాంకు కి అన్నీఉచితం. .... నీకు ఆయువుంటే బతుకుచితం.....
ఏందో ఈ కత...ఎంతవర్కు ఎన్ని ఉచితాలిస్తరో ఏందో?? అన్నా!! నీకేమైన అర్ధం ఐందా?
పేదోళ్ళు ఎక్కడైనా ఉన్నరు. అమ్రికాలో ఉన్నరు, జపానులో ఉన్నరు, జెర్మనీలో ఉన్నరు. మనకాడ ఎక్కువున్నరు అంతే తేడ. ఐతే, పేదోనికి ఏంగావాలా? డబ్బిస్తే పేదోన్ని ఇంకా పేదోన్ని జేసినట్టే? మఱేంజేయ్యాల? వానికి కిలో బియ్యం రెండు రూకలకియ్యాల్నా? లేక వాని పొట్ట ఆడుపోసుకునేట్టు జేయ్యాల్నా? ఆడిపొట్ట ఆడుపోస్కునే మార్గం ఏది? చారిత్రకంగా అణగారిన పెజానీకానికి "రిజర్వేషన్" ఇస్తే మంచిదా? లేక విద్యావిధానంలో మార్పు చేయ్యటం మంచిదా?
అన్నీ పశ్నలే...జవాబులు మాత్రంలేవు..... సొతంత్రభారత్ లో అన్నీ పశ్నలే జవాబులుండవ్. మన భారతంలో అన్నీ పశ్నలే...యెవుడయ్యా నువ్వు, ఏందీ పశ్నలేస్తన్నా? కొత్తా? జరుగు జరుగు...అభివృద్ధి బండొస్తోంది..అడ్డులే అడ్డులే...తొలగవయ్యా పక్కకి..అరేయ్ ఆడ్ని పక్కకి గుంజేయ్యాండ్రా...