Mar 31, 2010

మిషిగన్ లో సూర్యాస్తమయం - జ్ఞాపకాల దొంతర

అన్నగారు కొత్తపాళి గారు, మిషిగన్ లో సూర్యాస్తమయాలు బాగుంటాయన్నారు.
వెంటనే నా జ్ఞాపకాలను ఓ సారి గిలక్కొట్టా. ఇది పైకి వచ్చింది.
అది మార్చ్ మాసాంతం. నేను స్థానిక ఫార్మింగుటన్ కొండల్లో ఉన్నా ఆకాలంలో. మా స్నేహితులు కొందరు నన్ను సూట్టానికి షికారుగా వచ్చి, పదహే, అలా వెళ్దాం అన్నారు. యాడికీ అన్నా. కెసీనోకి వెళ్దామా అన్నాడు మా నెల్లూరి పెద్దారెడ్డి. డీట్రాయిట్ సరే వాకే అన్నా. బువ్వ గివ్వా కానించి, బయల్దేరాం. బాచిబాబాయ్ నీకాడ ఐడీ ఏంలేదుగా పాసుపోర్టు తెచ్చుకో అని ముందుగానే సెప్పాడు మా నెల్లూరి పెద్దారెడ్డు. అన్నీ జోబిల్లో కుక్కుని బయల్దేరాం.
సమయం పది కావొస్తోంది.
పెద్దారెడ్డి కార్లో ముందు ప్యాసింజర్ సీట్లో కూకున్నా. ఉన్నట్టుండి మావాడు బాచిబాబాయ్ సూడు అని మూన్రూఫ్ తెరిసాడు.
ఆయాల పున్నమి అనుకుంటా.
ఓహ్! మ్యాన్....
సంద్రుణ్ణి అంత దగ్గరగా నా జివితంలో, నిజ జీవితంలో హెప్డూ చూళ్ళా!! అదో రకమైన రంగు, ఎరుపు గోధుమ కలిపినట్టుగా ఉందా ఆ రంగు, ఏమో అనుకుంటా. కారు ఆ సిమ్మెంటు రోడ్డుమీద సర్రున వెళ్తుంటే రోడ్డు కొసాన ఉన్నట్టున్నాడు. కొంచెంసేపు మూన్ రూఫ్ నుండి కొంచెంసేపు ఎదుటద్దంలోంచి, దోబూచులాడుతూ వెంటాడాడా వేళ సన్దమామ, సాన్ద్. అప్పుడనిపించింది, భవకవులు ఎందుకంతలా సన్దమాఁవంటే పడిసచ్చిపోతారో అని.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను అంటే ఏంటో అర్ధం అయ్యిందా పూట!! ఆ పసిమివెన్నలరాజు రాక కోసం నిజమే మరి ఎదురుచూడరా వేచి చూడరా ఎవరైనా అనిపించింది.
చల్లని రాజా ఓ చందమామా
నీ కధలన్ని తెలిసాయి ఓ చందమామా నా చందమామా అని కన్నెపిల్లలు చంద్రునితో ఎందుకు ప్రియుణ్ణి పోలుస్తారో అర్ధం అయ్యిందా రోజు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ చాలదు.....

ఆల్బని డిట్రాయిట్ రెండూ ఒకే స్కేల్ పై ఉన్నా, నిడుచందమామ అంత దగ్గరగ కనిపించలా ఎప్పుడూ ఆల్బనీలో..ఏంటో మరి ఆ మాయ.

Mar 30, 2010

సూరిగాడికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు

ఏరా నాన్నా
పార్టీకి నీ ఫ్రెండ్స్ ని పిలిచావా?
లేదు
కేకు కోస్తున్నావా
లేదు
చాక్లేట్లు తిన్నావా
లేదు
ఎందుకురా నాన్నా
నువ్వు లేవుగా, అక్కడకొచ్చాక కేక్ కొనుక్కుని, కట్ చేస్తా


గుండె పిండాడు సూరిగాడు. నేనీమధ్య మహా సెన్సిటివ్ ఐపోతున్నా!! వయసు పెరుగుతోంది కదా మరి. ఇవ్వాళ్ళ వాడి పుట్టినరోజు.
ఈ మధ్య వాళ్ళమ్మ ఏంపెట్టినా సగమే తీంటున్నాట్ట. కేకైనా మేకైనా చాక్లెట్టైనా ఏదైనా. మిగతాది తినరా అంటే నాన్న దగ్గరకి వెళ్ళినప్పుడు తింటా అంటున్నాట్టా. భార్యామణి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత, వాడి ఈప్మీదేస్కునే సంచిలోకి చీమల బారులు అదే పనిగా ఎక్కుతుంటే ఏందిరా బగమంతుడా అని చూసిందట. ఈ సగం తిన్నవన్నీ దాంట్లో దర్శనమిచ్చుకున్నాయట. అదీ సంగతి.
From chirsmas_party

Mar 29, 2010

తొలిసంధ్య వేళలో - జ్ఞాపకాల దొంతర

ఈనాడు టీవీలో ఇదేదో సినిమా చూస్తుంటే మధ్యలో ఈ పాట.
తొలిసంధ్య వేళలో. ఆర్నీ ఈ పాటి ఈ నిమ లోదా అని గూగుల్లో గెలికితే నే చూసేది సీతారాములు అనే సిత్రం అని తెలిసింది.
పాట ఇదీ -

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో........

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం


ఈ పాట అందరకీ తెలిసిందే. ఐతే ఈ పాట చిత్రీకరణ నన్ను మళ్ళీ కట్టిపడేసింది, చూసిన ప్రతీసారీ ఇలానే అనుకుంటా. సూర్యోదయం, తొలిపొద్దు వేళ, సూర్యుడు ప్రపంచాన్ని నిద్రలేపుతూ అలా పైకి వచ్చే అత్భుత దృశ్యం, అదీ కేప్ కమేరియన్ వద్ద. అల్లంత దూరంలో వివేకానందా మెమోరియల్. ఎంత సుందరమైన దృశ్యం.

నాకు భావుకత అనేది తెలిసినప్పటి నుండీ ఓ ప్రబలమైన కోరిక, సముద్ర ముఖంగ నిల్చొని, పచ్చిగాలి పీలుస్తూ, ఆకాశంలో మర్డరు జరిగినట్టుండే ఆ అరుణవర్ణాన్ని, ఆ నెత్తురుగడ్డలాంటి సూర్యుణ్ణి కళ్ళారా చూడాలని, ఆ పెత్తెచ్చ నారాయుడి సేవసేస్కోవాలని. మరే ముత్యలముగ్గు ప్రభావంలేని మడిసుంటాడా? ఉన్నాడంటేసెప్పు, డిక్కీ ఎక్కించేద్దాం ఏటంటావ్ సెగెట్రీ?

అలాంటి కోరిక మరి సూరీడు నా మనసుని సదివేసాడో ఏటోగాని, నేను యం.సీ.ఏ సదివే రోజుల్లో మానాయనా వాళ్ళు దచ్చిన భారద్దేశ యాత్రకి శ్రీకారం చుట్టారు. బడి ఎక్స్కర్షన్. ఓ సీటు ఖాళీ ఉందిరా, నువ్వూరా, ఇంటో ఒక్కడివీ ఆడపిల్లలకి లైను కొట్టుకున్టా ఏవుంటావూ? వచ్చేయ్యి అన్నాడు నాయన.

సెన్నై, మద్రాసు, మెడ్రాసు అన్నీ సూడొచ్చు, సెన్నై నుండి మధురై మీదుగా కన్యాకుమారి వరకు. మధ్యలో వచ్చే గుళ్ళూ గోపురాలు సూస్కున్టా ఎళ్ళటం....

ఎళ్ళాం, యాట యాట యాట. మధురైలో బయల్దేరాం.
మధురై నుండి రెండొందల యాభై కిలోమీటర్లనుకుంటా. బస్సు బయల్దేరింది మధురై నుండి. నాకు నిద్ర లేదు.
ఎంత ఎక్సైట్ అయ్యానంటే, పొద్దున్నే ఐదుకల్లా అక్కడుంటాం అని డ్రైవర్ రామారావు చెప్పాడు. అందరూ గుఱకలు పెట్టి నిద్ర. నేను, రోమాంచతో, జుట్టు రేపుకుని, కళ్ళకి క్లిప్పులు పెట్టెస్కుని కిటికీలోంచి చూస్తూ కూర్చున్న. పొద్దున మూడు సమయం. డ్రైవర్ పక్కకెళ్ళి కూర్చున్నా ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక.
నాలుగైంది అంతలో నన్ను ఇంకా ఏడ్పించటానికి. ఎండ్లకాలం కదా, నాలుక్కే ఆకాశం రంగు మారటం మొదలైంది. నాలుగున్నరకల్లా కన్యాకుమారి బీచ్ దగ్గరకి వెళ్ళిపొయ్యాం. నా ఎక్సైట్మెంట్ కి అవధుల్లేవు. కళ్ళు కూడా కొట్టుకోటం ఆపెసాయి. అరుణవర్ణం అని కవులు ఎందుకలా వర్ణిస్తారో అప్పుడర్ధం అయ్యింది. అత్భుతమైన ఆ రంగు. ఎవ్వరూ కలపలేని, ఎవ్వరూ తెరకెక్కించలేని రంగు అది.
సూర్యుడు నెమ్మదిగా బయటకి రావటం మొదలెట్టాడు. ఓరి దేవుడో అనుకున్నా. కానీ, నా అదృష్టం నన్ను ఎక్కిరించింది. మబ్బులు, నల్లటి మబ్బులు, గుంపులు గుంపులు, ఎక్కణ్ణుంచొచ్చయో, తుర్రున వచ్చి, సూర్యోదయాన్ని అరచేతిని అడ్డుపెట్టి ఆపేసినట్టు నాకళ్ళకి అడ్డునిలిచాయి.
హ్మ్!! భగవంతా, ఎన్నయ్యా ఎదో, ఎప్పిడీ, న్యాయమా అనుకున్నా.
తర్వాత కాలంలో నా ఎం.సీ.యే అయ్యింది. మద్రాసు పెంటాఫోర్ లో ఇంటర్వ్యూ కాల్. వెళ్ళా. ఇంటర్వ్యూ గట్రా అయ్యాక, ఆ మరుసటి రోజు పొద్దున్నే సూర్యోదయం సూసేద్దాం ఈ సారి నాయాల్ది అనుకున్నా. కారణం నే ఉన్న రూం, మా అన్న మితృడుది, క్యాతెడ్రాల్ రోడ్డు మొదట్లో, అమ్రికోడి కాన్సులేట్ దగ్గర్లో, తెయినంపేటలో, స్టెల్లా మారిస్ కళాశాల దగ్గర్లో. అక్కణ్ణుండి ఆర్కె సాలై మీదుగా వెళ్తే మెరీనా బీచ్ వస్తుంది. మూడు కిళొమీటర్లు అనుకుంటా. పొద్దున్నే నాలుక్కే లేచి, ఆటో మాట్టాడుకొని ఎళ్ళా. మెరీనా బీచ్. హ్మ్!! వెళ్ళి అలల అంచుల దగ్గరకి వెళ్ళా. ఆ అలలను గమనించే సోయలో లేను. నా దృష్టంతా సూర్యోదయం పైనే. అప్పటికే అల్లంత దూరంలో, సముద్రపుటంచు ఆకాశంలో కలిసిపొయ్యే దగ్గర, వర్ణం మారుతోంది. ఐతే ఆ సీక్వెన్స్ ని, ఆ సూర్యోదయపు ప్రక్రియని పట్టించుకునే స్థితిలో లేరు ఆ బీచ్ లోని జనాలు. వాళ్ళ జీవితం నా దృష్టిని వారివైపుకి లాక్కుంది. వాళ్ళంతా వాళ్ళవాళ్ళ దైనందిన జీవతంలో మునిగిపొయ్యి ఉన్నారు. వాళ్ళే జాలరులు. అంతలో కొన్ని చేపల పడవలు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ దృశ్యం అత్భుతం. దాని గురించి వేరే టపాలో. వచ్చే పడవలు వస్తున్నాయ్.
సూర్యుడు ఇవేంపట్టించుకోకుండా బయటకి వస్తున్నాడు. ఆహా అనుకునే లోపు - ఓ జాలరి నాకు కొంచెం ముందు, లుంగీ ఎత్తి డ్యాష్ విసర్జనం చేసి కప్పెట్టిసి నిష్క్రమించాడు.
నే లేచి వచ్చెసా.

Mar 26, 2010

విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి - రోత(శ)య్య

ఇవ్వాళ్ళ వార్తల్లో రోతయ్య ఇలా అన్నారు -
రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పత్తి జరగటం లేదు
రాబోయే రెండు మూడేళ్ళలో విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు ఘట్టిగా ప్రయత్నాలు జరగాలని మీముందు సూచిస్తున్నా
ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు లేని రాష్ట్రం కాదు ఎక్సెస్ విద్యుత్తు గల రాష్ట్రం అని నిరూపించుకోవాలి.

వాహ్!! ఎంత మంచి ఆలోచన. భేష్.
ఐతే!! ఎలా? ఎలా పెంచుతావయ్యా రోతయ్యా? అదీ చెప్పు...
ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు
ఎంత వైట్ వినియోగమౌతోందీ
ఎంత చోరీ కాబడుతోందీ
ఎంత సరఫరాలో సచ్చిపోతోందీ
ప్రైవేటు భాగస్వామ్యంలో కొన్న విద్యుత్తు ఎంత
కొనే ధర ఎంత

ఇవన్నీ పక్కనబెట్టి -
మనం ఇలా ఎందుకు ఆలోచించం?
కోర్టులు, యూనివర్సిటీలి, ప్రభుత్వ కార్యాలయాలు, కలక్టరేటు కార్యాలయాలు, కాలేజీలు, హైటెక్ సిటీలు - వీటి టాపులు వృధాగా పడిఉన్నాయిగా, వాటీపై సూర్యరశ్మితో విద్యుత్తుని ఎందుకు తయ్యారు చేస్కోలేము?
ఎన్ని చదరపు అడుగులు ఉండవచ్చు, ఎన్ని సోలార్ ప్యానల్స్ ని స్థాపించవచ్చు, ఎన్ని వాట్స్ విద్యుత్తుని తయ్యారు చేయవచ్చూ?
ఎవరైనా ఓ సర్వే చేస్తే బాగుండు.....

Mar 23, 2010

కందిపప్పు బ్యాన్ చేస్తే ఊర్కుంటారా?

అరేయ్ ఏటినీగోల
ఆ, ఆవు మాంసం నాకిట్టం. అదే కావాలి.
అరేయ్ వద్దన్నాగా. సదుకో, ఎదవ, జెల్లకాయేస్తా
హా!! నువ్వేమో కందిపప్పు తినచ్చు, నేను ఆవుని తినకూడదా?
అరేయ్, తంతా నిన్ను. బుర్రతక్కువ వెధవ. పాల దిగుబడి తగ్గిందట్రా
ఆఅ, అంతే, అట్టైతే బఱెల్ని వధించటం బ్యాన్ చేయచ్చుగా
అబే గధె!! కర్ణాటకలో ఆవులెక్కువరా సన్నాసి
ఐయే మాత్రం కందిపప్పు బ్యాన్ చేస్తే నువ్వు ఊర్కుంటావా
ఓరేయ్ తిక్క సన్నాసి, కందిపప్పు తినే శాతం ఎంత, ఆవులు తినేవాళ్ళ శాతం ఎంత, ఎల్కేజీకి తక్కువ యూకేజి కెక్కువ. ముయ్
[కందిపప్పుని తినేటోళ్ళు కేవలం బేపనోళ్ళని కొందరి భావని. అట్టాంటోళ్ళంజూసి సింతిస్తున్నా.]

Mar 22, 2010

ఏంటీ ఈ శిక్ష

నారాయణ ఒలంపియాడ్ ప్రభంజనం

ఇతరులు ప్రకటించిన విధంగా ఒలంపియాడ్ ఫలితాలు ప్రకటిస్తే -
ఈ సంవత్సరం అన్నీరాకాల ఒలంపియాడ్స్ లో సెలక్టైన నారాయణా విద్యార్ధుల సంఖ్య 596


పై ప్రకటన, మాటీవీ ప్రసారమయ్యే కార్యక్రమంలోని *ప్రకటనల విరామంలో* కనీసం ఐదు సార్లు రిపీట్ అవుతోంది. నేను నాలుగు బ్రెకుల్లో ఇది గమనించా, ఐదో బ్రేక్లో విసుగెత్తిపొయ్యి, మాటీవీని కట్టేసా.
ఎలా తట్టుకుంటున్నారో జనాలు ఈ గోలని.

Mar 19, 2010

ఆ వేళ!

ఎంత మధురంగా ఉందా వేళ!!
పచ్చని చెట్ల పందిరి కింద
మిత్రబృందంతో ఉన్నాడతను
గప్పాలు కొట్టుకుంటూ
వయ్యస్సు ఇచ్చిన గర్వంతో
అప్పుడే విడిచినపెట్టిన కళాశాల
బిలబిలమంటూ
బయటకురుకుతున్న కాళ్ళు
కుర్రాళ్ళ కొంటెచూపులు
అమ్మాయిల దొంగచూపులు
ఇంతలో బెదిరించే
డిసిప్లైనరీ సైగలు
ఈ మధ్యన!!
మనోడికి చురుక్కున
ఏదో గుచ్చుకుంటున్న భావన
చెట్టి కిందున్నాడుగా
గొంగళి పురుగేమో అనుకున్నాడు
ఈ గుచ్చుకొనుడు ఇంకెదో గుచ్చుకొనుడని అర్ధం అయ్యింది
మనోడికి అర్ధం అయ్యింది
అది ఓ స్నిగ్ధ
మూగకళ్ళ బాకని!!
ఓ నిండైన యవ్వనపు
పదునైన చూపని
తల విదిల్చి
చుట్టూ ఉన్న బస్సుల జాతరలో
ఆ కళ్ళకోసం వెతుకులాట
మొదలెట్టాడు
అన్ని బస్సులు
వందల కళ్ళు
అన్ని బస్సులు వందల కళ్ళు
కొన్ని అందమైనవి
కొన్ని పొగరైనవి
కొన్ని కాటుక దిద్దినవి
కొన్ని సొగసైనవి
కొన్ని తమ ప్రియునితో మౌనంగా ఊసులాడేవి
కొన్ని తమ ప్రియుణ్ణి చూపుతోనే దహించివేసేవి
ఇన్నిటిమధ్య
ఇన్ని కళ్ళ మధ్య
ఓ బస్సు కిటికీలోంచి
బాణం వేసినట్టుగా
తీక్షణంగా
ఏకధారగా వస్తోన్న ఆ చూపునీ
ఆ కళ్ళనీ పట్టేసాడు మనవాడు
దొరికిపొయ్యాయి ఆ కళ్ళు
ఆహా!!
ఎంత అందంగా ఉన్నాయా కళ్ళు
ఎంత విశాలంగా ఉన్నాయా కళ్ళు
ఎంత లేతగా ఉన్నాయీ అవి
ఎంత అమాయకంగా ఉన్నాయవీ
కళ్ళు కళ్ళు కలిసాయి
చూపులు కలిసాయి
అర్రె!! పట్టుపడ్డానే అనుకున్న ఆ కళ్ళు
ఇంకోవైపుకి టకామని తిరిగాయి
అహా! నేవదులుతనా అని
మనోడు కళ్ళతో తన్ని గుచ్చుతునే ఉన్నాడు
తనవైపుపుకి తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు
నేనింకా నీవైపే చూస్తున్నా
అని సంకేతాలు పంపుతునే ఉన్నాడు
విజయం సాధించాడు
ఆ సంకేతాలను డీకోడ్ చేస్కుందా
తెలివైన అమ్మయి
ఆ మీనాక్షి
ఆ సోగకళ్ళ సుందరి
మళ్ళీ కళ్ళూ కళ్ళూ కలిపింది
మనోడు ఏడిపిద్దాం అని
తనచూపుని మరల్చాడు
ఆ కళ్ళు గుచ్చాయి
ఆ విరహం తట్టుకోలేక
మనోడు ఓటమిని అంగీకరించి
అలా కళ్ళాతోనే ఊసులాట్టంలో
మినిగిపొయ్యాడు
ఇద్దరూ
వారిద్దరూ
ఇక ప్రపంచంలో
ఎవరూలేరూ
మేమిద్దరమే
మాకింకేం పట్టవ్
మాకింకెవరూ పట్టరూ
అన్నట్టుగా మునిగిపొయ్యారు
అతనెక్కడో దూరంగా చెట్టుకింద
ఆమె బస్సులో కిటికీ పక్కన
కళ్ళు మాట్లాడుకుంటున్నాయి
చామనఛాయ ముఖం
లేతగా ఉంది ఆమె
చెక్కినట్తున్న ఆమె ముక్కు చెంపలు
అతన్ని చిత్తు చేసాయి
ఇంతలో
విధి వింతనాటకం [అని అంటాడతను] ఆడింది!
ఆమె కూర్చున్న బస్సు కదిలింది
ఆమె ఎక్కిన బస్సు తన గంమ్యం వైపుకి నడిచింది
ఆమె ఎక్కిన బస్సు నిర్దయగా తను రోజూ చేసే పనినే చేసింది
ఆ బస్సు చాలా సమయపాలన చెస్తుంది
దానికి దయా దాక్షిణ్యాలు లేవు
దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయిందా బస్సు
ఆందోళన నిండిన చూపులు
విలవిల్లాడాయి
తపించిపొయ్యాయి
చూపులు మళ్ళీ కలుస్తామా అన్నట్టు
మళ్ళీ కలిసాయి
చివరిసారా అన్నట్టు కలిసాయి
ఎన్నో భావాలతో కలిసాయి
వేదనతో కలిసాయి
ఒకే కళాశాలలో ఉన్నా
కొన్ని వేల కళ్ళలో
ఎక్కడని వెతకాలా కళ్ళకోసం
ఎంతకష్టమో ఆ వెతుకులాట
బస్సు వెళ్ళిపోయింది
మనవాడూ
తను ఎక్కాల్సిన బస్సువైపు నడిచాడు
తన గమ్యంవైపుకి నడిచాడు
మనోడిబస్సు వాణ్ని వాడి గమ్యం వైపుకి లాక్కెళ్ళెంది
మనోణ్ణి
మనోడి జ్ఞాపకాలనీ
ఆ వింతైన తీయనైన మధుర క్షణాల్నీ
విరహాన్నీ దుమ్మునీ కలుపుకుని!!!

Mar 18, 2010

నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి

ఆ రోజు ఆ కళ్ళు
ఎంతో నిశ్శహయతో
ఆర్తితో
బాధతో
నిన్ను ఈ గుండెలమీద పెట్టుకు పెంచారా
నాకేమీ చేయలేవా
నీ బాటలో ముళ్ళుండకుండా ఊడ్చారా
నన్ను బతికించలేవా
నీ ఉన్నతులకోసం నా రక్తం ధారపోసారా
నన్ను కాపాడాలేవా
నిన్ను గుండెల్లో పెట్టుకుచూసారా
నన్ను యముడి పాశం నుండి తప్పించలేవా
అని విలవిల్లాట్టం చూసా
ఆ కళ్ళు
ఉన్నట్టుండి
గుండెని ఎవరో పిసికేస్తున్నార్రా అనే భావం ప్రకటించాయి
ఏమీ చేయలేని నా నిశ్శహాయత
నేను ఆటో తెచ్చేలోపే ఆ కళ్ళు రెప్పవెయ్యటం ఆగిపొయ్యాయి
నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి
నాకు బాగా గుర్తు
ఆరోజున ఈ కళ్ళే తన తండ్రి కళ్ళను ఇలానే భద్రపరచుకున్నాయి
చివరిచూపులకోసం ఆ కళ్ళు ఈ కళ్ళ కోసం వేచిచూసాయి
ఇదిగో వచ్చాడు రమాకాంతం
ఇదిగో వచ్చాడు రమాకాంతం అన్న ప్రసాదరావుగారి
మాటకు చివరిసారిగా స్పందించాయి ఆ కళ్ళు
నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి

మార్చ్ పద్దెనిమిది మా తల్లితండ్రుల పెళ్ళిరోజు. మా నాన్న గారి నిష్క్రమణకు నా ఈ కవిత అంకితం.

ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్ దినం అంట

సోదరా, ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్కు దినం అంట. మాఊళ్ళో రోడ్లమీన ఏదో పెరేడంట. గూగులోడు కూడా వచ్చిండయ్యా. నేను ఆపీసు పైనుండి ఈ పుటోబులు లాగించినా. బాగుండయా?


ఏందో తిక్కనాయాళ్ళు!!
ప్యాట్రిక్కు దినం, పూసల దండలు ఇసరటం, స్క్లేట్లు ఇసరటం..పిల్లలకి పుల్లు ఆనందం దొరికినట్టుంది. ఎవురానందం ఆరిది. ఏతంతావు? నానేతంతానూ! నువ్వేదంటే నానదే అంతానంటావా?

ప్రదర్శన అంటే ఇదీ

ధర్మేశ్ సారూ, ఇరగదీసిన్రు!! చింపేసిన్రు...
Thats what I call a performance

Mar 16, 2010

డాలరు పంట - నా ఉగాది కవిత

మత్త కోయిలలూ
మత్తు కాకులూ
రాబందులూ రెక్కల పక్షులూ
అన్నీ
నా ఉగాది చెట్టుమీదనుంచి
ఉన్నట్టుండి
ఒక్కసారిగా
రకరకాల అరుపులతో
కొన్ని జీరబోయిన గొంతులతో
కొన్ని శ్రావ్యమైన కంఠాలతో
ఎగిరిపొయ్యాయి
నా ఉగాది చెట్టుని విడిచిపొయ్యాయి
ఖాళీ చేసాయి
అవున్లే
అవిమాత్రం ఏంచేస్తాయి పాపం
నేనేమన్నా పండ్లు కాయించానా
నేను ఎమన్నా పండ్లు ఫలలా కాయించానా
మంచు నీళ్ళు పోసి డాలర్లు కాయించాలని చూసాను
స్వార్ధం ఎరువేసి బంగారపు దిమ్మెలు పూయించాలని చూసాను
కానీ ప్రకృతి నన్ను చూసి నవ్వింది
చెట్టుకి అనురాగం మాత్రమే పూస్తుందీ అని చెప్పింది
అలా ఎలా అన్నాను
చెట్టుకి ప్రేమా వాత్సల్యాల ఫలాలు మాత్రమే వస్తాయని చెప్పింది
నెను విన్లా
నేను వినలా
నా ప్రయత్నలు చెస్తూనే ఉన్నా
డాలర్ల పంట పండుతుందేమో అని
మంచుపడే దారులవెంట
ఆశగా చూస్తూనే ఉన్నా
రోజులు
నెలలు
రోజులూ నెలలూ గడిచిపొయ్యాయేగానీ డాలరుపూత లేదు
ఇదిగో ఇప్పుడొచ్చింది
ఇప్పుడే వచ్చింది ఇంకో ఉగాది
ఇంకో యుగాది
నాలోని ప్రేమతత్వాన్ని నిదురలేపే యుగానికి ఆది
మరో కొత్త సమచ్చరంలోకి
ప్రకృతితో మమేమకమౌతూ
ఆప్యాయాలనూ అనురాగాలనూ పంచుతూ
ముందుకురికే యవ్వనాన్ని చిలకరిస్తూ
వచ్చింది ఉగాది
కొత్త కొత్త ఆశలూ
కొత్త కొత్త కోరికలూ
మూటగట్టుకున్న మనసుకి
చేయందించటానికి వచ్చింది ఉగాది
కుక్కతోక వంకరన్నట్టున్నా ఈ మనస్సు
ఈఏడాదన్నా ఈ దూరపుకొండల నునుపుని
కొలవటం మానుకోవాలని ఆ ఉగాది లక్ష్మిని కోరుకుంటా

Mar 15, 2010

ఇయ్యాల రగతం కళ్ళజూసా !!

నాయాల్ది రగతం కళ్ళజూసా పొద్దున పొద్దున్నే
అహా!! ఎవుర్దీ?? అదీ సోంవారం, మటన్కొట్టెట్టావా? ఎంతకమ్ముతున్నావేంది కిలో ఇట్టా అడుగుతారని తెల్సు.
పొద్దునపొద్దున్నే, తలకిబోస్కుని, అడ్డగుడ్డ సుట్టేస్కుని ఓ డెగిశాలో పాలుపోసి కారన్ ఫ్లేక్స్ దాంట్లో ఏస్కుని కారన్ ఫ్లేక్సు అల్పాహారం బోంచేద్దాం ఇయ్యాళ అనుకుని, డేగిశని మైక్రోవేవ్లో పెట్టి, కొలువులో *కత్తి* లేదు కమలాలు గట్రా కోస్కోటానికి అని నిన్నకొన్న సిన్న *కత్తి*ని కాయితకంలో సుట్టి ఎనకమాల్నేసుకునే సంచిలో పెట్టుకుందాం అని *కత్తి*ని తీస్కున్నా. దీనెక్క సానా పదునుగా ఉంది, కాయితకం యాడుందబ్బా అన్జూస్తే పక్కమ్మెట ఓ పొట్లంలో కాయతకం ఓటుంది. ఆ పొట్లం *కత్తి*తో కోసి అవ్వతల్నూకి ఆ కాయితకం బయటకి తీద్దాం అని కోసా, అది కుడిసేతి చూపుడేలుని కొట్టేసింది కస్సుక్కున, సెక్కేసినట్టయింది. ఓ ఆరు లీటర్ల రగతం కారి వృధా అయిపోయింది. సిరన్జీవి బ్లెడ్డుబ్యాంకీకి ఇచ్చినా పుణ్యం వచ్చునే అనుకున్నా. అది సోదరా ఇయ్యాల్టి యవ్వారం.
ఎంత *కత్తుల్తో* ఆడుకునేవోడికైనా *కత్తి* తెక్క మానదు!!

ఏందీ!! అట్టుందీ ఏలూ!! ఏంపెట్టావూ ఏలుమీన అనుకోమాక. పసుప్పెట్టా!
ఇదిగో ఇదే ఆ *కత్తి*!! కొత్త *కత్తి*!! పదునైన *కత్తి*!!!

ఏటిసేత్తాం సోదరా. తప్పు *కత్తి*ది కాదు. దాన్ని ఉపగోగింసుకున్న నా ఎడం సేత్తిద్ది. అదేటి, *కత్తి*కి కేవలం నరకటమో తెగ్గొయ్యటమో మాత్రమే తెల్సు కద!! మరి దాన్ని కూసిన్త జాగరత్తగా వాడకపోతే సూసేవా ఎన్ని అనర్ధాలు జరిగిపోతయో!!
చివరాకరుగా సెప్పేదేంటన్టే!! *కత్తుల్తో* జాగ్రత్త.

Mar 11, 2010

కృష్ణా నీ బేగనే బారో - అంజనా సౌమ్య


ఈ పాట పాడింది అంజనా సౌమ్య, చాలా బాగా పాడిందనిపించింది. మరి ఏమి రాగమో తాళమో సరిగ్గా సంగతులన్నీ వేసి పాడిందోలేదో కానీ, నన్నైతే రంజింపజేసింది.
రుద్రవీణ సినిమాలో చెప్పినట్టు రంజింపజేసేదే సంగీతం అది బిళహరి ఐతే ఏంటి ఆనందభైరవి ఐతే ఏంటి!!

ఏమంటారూ?

Mar 3, 2010

ఏంటో ఈ అర్ధం లేని ప్రకటనలు

ఒక నల్ల హిట్ తెచ్చుకోండి

హిట్ తో దోమల్ని కొడితే ఒక్కటి కూడా మిగలదు


ఇదో ప్రకటన. ఐతే బాసూ -

హిట్ ఎక్కువగా కొడితే మనం మిగలం.

బాబుగారూ
రెండు వివెల్ సబ్బులివ్వండి

అరేయ్ మూడు వీవెల్ తీసుకురా

రెండు సబ్బులే ఇవ్వండి

ఇప్పుడు రెంటికి మూడు వస్తాయ్