Jul 27, 2008

బాంబులు పేల్చటం - సిగ్గుచేటు

తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు, పుట్టిన దేశానికే ద్రోహం చేయ్యమని ఏమతం చెప్తుంది?
ఇది మన సమాజ పతనానికి ఒక మచ్చుతునక, అలాంటివాళ్ళకి సహాయం చేస్తున్నందుకు. మన జాతి ఏవత్తు సిగ్గుపడాలి ఇలాంటి వ్యవస్థని నిర్మించుకున్నందుకు, ఇలాంటి రాజకీయ నాయకులని ఎన్నుకున్నందుకూ, ఇలాంటి రాజకీయ వాదుల్ని పెంచి పోషిస్తున్నందుకు...

Jul 22, 2008

దీనిమీద వ్యాఖ్యానించండీ!!!!

మేక భాష మీద పెద్ద వ్యాఖ్యలు లేవు. పోని దీనిమీద వ్యఖ్యానించండి...

మేక భాష

మా సూరిగాడు, వాడి మిత్ర బృందం ఏమి మాట్టాడుకుంటున్నారో చెప్పగలరా?

Jul 21, 2008

పౌడరు పూయ్యరుగా!!

పౌడరు పూయ్యరుగా!!
తెల్లని పౌడరు పూయ్యరుగా!!

Jul 18, 2008

మీ ఇంట శుభకార్యాలకూ, పెళ్ళిళ్ళకూ

ఫోటోగ్రాఫర్ కావాలా...
సంప్రదించండి......
భాస్కర్ రామరాజు (అంటే నేనే :))

నా ఈ ఫోటో ని తీసినవాడు..
మా బుడ్డోడు...
వాడి ఫోటోగ్రఫిని ఇక్కడ చూడండి.

Jul 17, 2008

తేడా ఏంటి?

తోంది కి తుంది కి తేడా ఏంటి?
ఉదాహరణకి
వస్తోంది, పోతోంది, వెల్తోది
వస్తుంది, పోతుంది, వెల్తుంది

Jul 14, 2008

పొగతాగటం మానేస్తే!!!

మానక ముందు
సాయంత్రం అయ్యేసరికి, ఎదోఒక పని మీద ఒంటరిగా వెళ్ళటానికి ప్రయత్నించటం
అలా బయటకి వెళ్ళాక సొమాలియా ఆకలి బాధితుడిలా ఎవడో వచ్చి సిగరెట్టులాక్కెల్తాడేమొ అని గట్టి గట్టిగా పీకులు పీకటం. తర్వాత, దెగ్గర్లో ఉన్న డంకింగుడోనట్స్ కో దేనికో దానికి వెళ్ళి, మూతి కడుక్కుని, మింటు వేసుకుని, కాఫీ కొట్టి అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరిగి, ఇంక వాసన రావటం లేదు అని నిర్ణయించుకున్నాక, కారులో కూర్చొని అద్దాలు అన్ని పైకి లాగి వాసన వేస్తోందేమో మళ్ళి పరీక్ష్మిచి, నోట్టో ఒక విగ్లీసో మట్టో మషానమో వేసుకుని, దున్నపోతు నెమఱేసినట్టు నములుకుంటూ ఇంటికి చేరటం.
అలా ఇంటికి డేక్కుంటూ వెళ్ళాక, ఇంకా వాసన వస్తుందేమో అనే భయం తో, కళత్రం దెగ్గరకి పోకుండా, నంగి నంగిగా మాట్లాడుతూ, సాధ్యమైనంతవరకూ గాలిని లోపలకి పీలుస్తూ, సాధ్యమైనంత తొందరగా సింకు దెగ్గరకి వెళ్ళే ప్రయత్నం చెయ్యటం, దానికి మల్లి ఒక కవరింగు, అబ్బా కంట్లో ఎదో పడింది, చేతికి ఆయిలు అంటింది, ఇలా...

మానేసినాక
ఇప్పుడు అవేమీ అక్కర్లేదు. ఒకవేళ ఒంటరిగా బయటకి వెళ్ళినా ఇంట్లోకి ధైర్యంగా, వంట గదిలోకి అంతకన్నా ధైర్యం గా వెళ్ళిపోయి, అవసరం లేకున్నా, ఏమిజేస్తున్నావ్, అని అడిగి..అలా కొంచెంసేపు కటింగు ఇవ్వొచ్చు. లేక, ఇంటోనే రాజా లా కూర్చొని, ఒక వింతైన లుక్కుతో( కళత్రమా!! నన్ను చూడు, దమ్ము కొట్టటం మానేసా నాయాల్ది) ఒక విచిత్రమైన నవ్వుతో అలా.. అర్ధంకాకపొయినా టీవీ సీరియల్ చూస్తూ కూర్చోవచ్చు.

మానక ముందు
(ఎప్పుడూ - ఇది వస్తూనే ఉంటుంది, అందుకే ఎప్పుడైనా అని రాయటమ్లేదు) దగ్గినప్పుడు కళత్రం "ఆ దమ్ముకొట్టటం మానొచ్చుకదా" అంటే, "అబ్బే!! ఇది దమ్ము కొట్టటం వల్ల వచ్చిన దగ్గుకాదు..ఇది వేరేది (అదేంటో తెలియక పొడి పొడి గా, ఎక్కువసేపు లాగకుండా)..తగ్గిపోతుంది..అబ్బే..ఖొరపోఇంది...అంతే..జందూబాం ఇవ్వు రాసుకుంటే పోతుంది..చూడు..పోఇందే..ఇట్స్ గాన్"

మానేసినాక
దగ్గు సామాన్యంగా రాదు, వచ్చినా ఇదేంటి మానేసా కదా అని ఒక విజయ గర్వంతో ఒక లుక్కు పడేసి, "ఏమోయ్!! ఆ జందూ బాం ఇలా పడేయ్" అని పోజు కొట్టొచ్చు..

ఇలా చాలా లాభాలు ఉన్నాయి..
ఇంటికి వచ్చినవాళ్ళతో కళత్రం ముందు, లేక వినపడేలా..గురూ నేను దమ్ముకొట్టటం మానేసా తెలుసా..3 నెలలు ఐంది.. మాది పల్నాడు తెలుసుగా మాట, లక్ష్మక్కా మాట..ఒక్క సారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే.. మల్లి ఇంతవరకూ ముట్టుకోలేదు...దానెవ్వా!! నీకు ఇంకోవిషయంజెప్పనా.. నాకు సిగరెట్టు పొగే పడటమ్లేదు ఇప్పుడు...

....

ఒక మంచి పని

ఒక మంచి పని:-
మీ దెగ్గర ఉన్న, మీకు పనికి రాని పుస్తకాలని మీరు చదువుకున్న డిగ్రీ కళాశాలకి, లేక జూనియర్ కళాశాలకి లేక ఉన్నతపాఠశాలకి దానం చేయండి. చిన్నపిల్లల బొమ్మల పుస్తకాలు ఉంటే మీకు దెగ్గర్లో ఉన్న మండల పరిషత్తు లేక ఎలిమెంటరీ పాఠశాలకి దానం చేయండి.
మీ చుట్టుపక్కల పిల్లలకి మంచి కధలు చెప్పండి (స్టోరీ టెల్లింగ్).

Please donate books you don't read to your degree college, jr. college, or high school. If you have any children's books, please donate them to near by elementary school.
Have fun in STORY TELLING for kids and create enthusiasm in them.

Jul 10, 2008

హెచ్1-బి జీవితం

నాకూ నా మితృడికి మధ్య జరిగిన సంభాషణ...


నేను: శ్రీ-ని ధరించువాడు = శ్రీధరుడు!! అంటే లక్ష్మీ దేవి కి ఈశ్వరుడు = పతి = లక్ష్మీ పతి... ధనమును తన ఇంట కట్టి వేసినవాడు..
మితృడు: హ హ హ
నేను: కాబట్టి మొత్తం అంతా నువ్వే తీసుకోకుండా(అనుభవించకుండా) మాకు (నాబోంట్లకు= నాబోటి వాళ్ళకు) కూడా ఆ లక్ష్మీ దేవి కటాక్ష్మం ప్రసాదించు నాయనా
మితృడు: నువ్వు already లక్ష్మీపుత్రుడివే కదా
నేను: అలా కొట్టావా దెబ్బ!! నీదెగ్గర దాపరికం దేనికి..ఇక్కడ పెళ్ళాం పిల్లలతో జీవించాలి అంటే, అదీ హెచ్-1 మీద, చాలా కష్టం తమ్మీ....
సివరాకరికి మిగిలేది ఏమిలేదు....
దూరపు కొండలు నునుపు అని..అక్కడ అనుకుంటాం.. డబ్బు డబ్బు అని.. కానీ ఇక్కడ గాడిద బతుకు,
మితృడు: అన్నయ్యా నువ్వు సినెమాలకు దిఅలాగులు రయొచ్చు సూపెరు
నేను: ఇంకా సెపుతా ఇనుకో!! ఇక్కడ, ఇంసూరెన్సు అని ఒక పెద్ద మహమ్మారి ఉంటుంది..దానికి ఎంతకట్టినా సాలదు!! ఇంకా ఇంకా ఇంకా అని జపం సేస్తుంటుంది
అలానే క్రెడిట్టు సెరిత్ర అని ఒకటుంటది...మనకి కొత్తగా ఇక్కడకి వస్సినప్పుడు అది ఉండదు..కాబట్టి, క్రెడిట్టు కార్డు గట్రా ఏమి రావు.లోను రాదు. కారు కొనలేము..కొన్నా ఎక్కువ ఇ.యం.ఐ కట్టాలి.
ఇలా సగం జీవితం దొబ్బుతుంది బాబు..బాబు..కాబట్టి..నాయనా కొంచెం ఆ ధన లచ్చిమి ని ఇటు ఒక్కసారి...నాయనా ..ఒక్కతడవ మాఇంటికి పంపు!! ఏదో పేదోడ్ని..కూసింత కనికరం సూపించు నాయనా...
మితృడు: ఇంకా మీ వాడు బడికి కి పొవటం లేదా?
నేను: మీ ఇంట్లో నే కట్టేసుకుంటే మాలాంటి పేదోళ్ళ జీవితం..కొంచెం కనికరం సూపించు.. సిన్నోడా!!
మితృడు: వెల్తేవాడికి కూడా ఖర్చు పెట్టాలి కదా?
నేను: లేదు తమ్మి...5 సంవత్సరల లోపు ఐతే జేబుకి సిల్లు...5 దాటినాక ఫ్రీ ఫ్రీ ఫ్రీ
మితృడు: ఒహో..అదొకటుందా
ఇప్పుడు ఇంకా దెలివరి కూడ ఉందేమో కదా మరి ..అంతా ఇన్సురెన్సు కవరు చేస్తుందా
నేను: ఉంది..ఇట్టాంటి విసిత్రాలు తెల్లోడి దెగ్గర సానా ఉన్నాయి
మితృడు: లేకుంటే మనకు ఏమన్నా ఖర్చు ఉంటుందా
నేను: ఇంసూరెంసు కవరు సేస్తుంది..మనం 20% పెట్టుకోవాలి..నేను మొత్తం 700 పెట్టుకోవాలి.కట్టేసానుకూడా. అయితే అది మనం తీసుకునే ఇంసూరెన్సు మీద ఉంటుంది...
మితృడు: ok ok
నేను: ఎంత సెట్టుకి అంత గాలి అని...
మితృడు: హ హ హ
నేను: మనకి ఒక మొగుడు ఉంటాడు ఇక్కడ...వాడినే యంప్లాయరు అంటారు..మన ఈ పాపపు జీవితం వాని సేతిలో కీలుబొమ్మ...మనం మనల్ని గంగిరెద్దు లా ఊహింసుకోవాల..ఆడు గొట్టం ఊత్తుంటడు..మనం ఆడుతుండాల...ఇన్సూరెంసు కింద గ్రూపు ఇన్సూరెన్సు అని కడతడు..వాని దయ మన ప్రాప్తం.
మితృడు: monthly atleast ఒక 2000$ మిగలవంటవా ...all expenses తీసేస్తే
నేను: అది ఆధారపడి (IT DEPENDS )..
నువ్వు ఎక్కడ పని సేస్తున్నవ్, అంటే ఏ ఊరు..ఏవాడా, ఓ సిన్నోడా, మీద ఆధారపడి ఉంటది...ఒక పడక ఇల్లా, రెండు పడకల ఇల్లా, దానికి ఎన్ని విశ్రాంతి గదులు (రెష్ట్ రూం) ఉన్నాయి.. వీటిని బట్టి అద్దె..
వి-4, వి-6, వి-8 బట్టి కారు, దాన్ని బట్టి కారు లోను..
మితృడు: కరెక్టేలే ...అదీ కాక మన కి చేతి వటం కూడా ఎక్కువే
నేను: దాన్ని బట్టి కారు ఇన్సూరెన్సు
మితృడు: అంతా లింక్ అన్నమాట
నేను: అదేకదా!!! వాల్-మార్టు అని ఒక రాచ్చసి ఉంటది..దానికి ఎల్లినావనుకో 100 సమర్పయామి..ఏంటో దానికి దెగ్గరకి వెల్తే ఒకపట్టాన వదల్దు..మనల్ని ముక్కు పిండి మరి కొనిపిస్తుంది
మితృడు: హ హ
నేను: అలా..ఏది సూసినా కమ్మగా, ఇప్పుడే మార్కెట్టులోకి వచ్చిన దొరసానిలా రా రా అని పిల్స్తుంటది...
ఎళ్ళినవనుకో..జేబుకి సిల్లు...
రెండు సూటుకేసుల్తో యళతాం క్లైంటు దెగ్గరకి...అది 3 పడకగదులు అయి కూర్సుంటుంది
మితృడు: :):):)
నేను: లాక్కోలేక, పీక్కోలేక...అమ్మలేక మొయ్యలేక, మింగలేక కక్క లేక...గిల గిల గిల కొట్టుకోవాల్సిందే దానెంకమ్మ!! నాయాల్ది...తెల్లోడు భలే తెలివైనోడు
డబ్బులిస్తడు..కర్సు పెట్టిస్తడు...