Dec 5, 2008

ఉబుసుపోక కబుర్లు - ఎలక్ట్రానిక్ గేమింగ్

పోయిన వారం నేను కళ్లు చూపించుకోటానికి డాట్టరు దెగ్గరకెళ్లా, ఈ సారి కళ్లద్దాల బదులు కళ్లకతుక్కునే కటకాలు - కాంటాక్ట్ లెన్స్ తీస్కోవాలని ఆలోచించా. "ఈ సారి" ఎందుకంటే, మా బుడ్డోడితో నా కళ్లజోడుకి మంచి అనుభవం. ఇప్పటికీ లాగి అవతలేస్తాడు, లేక వెనకనుంచి వచ్చి ఘట్టిగా కళ్లజోడుని గుంజుతాడు. మరి ఇప్పుడింక ఈ పిల్ల చేతులు పైకి లేపుతున్నది, క్రికెట్టులో అంపైర్లా.
డాట్టరుకాడికి ఎళ్లా. కూర్చో బాసు పిలుస్తా అన్నాడు, సరే కూసున్నా, పక్క కుర్సికేసి ఓ లుక్కేసా, ఓ పత్రిక ఉంది అక్కడ. వెంటనే నా బుర్ర దాని వివరాలు బ్లా బ్లా నోట్సేసేస్కుంది.
అదేం పత్రికరాబాబు అంటే - Electronic Gaming Monthly. నాకు తెలవదు ఇట్టాంటిదోటుంటదని. దీంట్లో మొట్టమొదటగా నన్ను ఆకర్షించింది గేముల రేటింగులు, అంటే యే యే గేములు యే యే వయసోళ్లకి అని. ESRB అంటే Entertainment Software Rating Board అని. ఇవీ రేటింగులు - E, EC, E 10+, T, M, AO.
E - Everyone
EC - Early Childhood
E 10+ - Everyone 10 and above
T - Teen
M - Matured (17+)
AO - Adult Only.
మరి RP అని ఉంటేనో అని అడగొచ్చు, RP అంటే - Rating Pending అని.
కాబట్టి మీరుకూడా గేములు కొనేప్పుడు తప్పక వీటికోసం చూసి నిర్ణయించుకుని కొనుక్కోండి.

ఈ పత్రిక Electronic Gaming Monthly సంగతి ఏంటో చూద్దాం:

ఈమాసపత్రిక ఈరోజు రేపటి వీడియోగేమింగ్ కాన్సోళ్ల గురించి, గేముల గురించి, వాటి తయ్యరీదారులతో ముఖాముఖిలు ఇత్యాది వార్తల్ని అందిస్తుంది. మరియూ, గేముల సమీక్షలుని కూడా కూలంకుషంగా అందిస్తుంది.
ఆ రోజు పత్రికలో వీటిమీద రివ్యూ చూసా - ఆసాంతం చదవకపోయినా ఓ లుక్కేసా. అవి -
Madden NFL 09
NCAA Football 09
Beijing 2008
Alone in the Dark
Izuna 2
Guitar Hero Decades

కొన్ని గేముల ప్రకటనలు కూడా చూసా అవి:
Legendary
Rise of the Argonauts
Mushroom Men

నేను పెద్ద గేమర్ని కాదు. నాదెగ్గర Ages of the Empire, Warcraft, Tzar అనే గేంస్ ఉండేవి. మొన్నీమధ్య brother bear అని ఒకటి కొన్నా మాబుడ్డోడికి. I think he is not yet ready for it.
సరే! గేమింగు కాన్సోల్ అంటే గేము ఆడే పరికరం.
అసలు ఎన్ని గేమింగ్ కాన్సోల్స్ ఉన్నయో తెలుసా మీకు?
గేమింగ్ కాన్సోల్స్ లో ప్రస్తుతానికి ఏడోతరం వి నడుస్తున్నాయ్. 7th Generation Gaming Consoles. అవి -
#1. మైక్రోసాఫ్ట్ వారి ఎక్స్బాక్స్ మూడొందల అరవై - Microsoft's XBOX 360
#2. సోని వారి ప్లే స్టేషన్ మూడు - Sony's Playstation 3
#3. నింటిండో వారి వీ - Nintendo's Wii

ఇవి కాక పిల్లల్ని చెడగొట్టటానికి ఈ నింటిండో వాడి డీయస్ అని ఒకటి ఉంది. దీనికి అలవాటైతే ఇక అదేలోకం అవుతుంది. అదీ కధ. Happy Gaming.

5 comments:

  1. మంచి విషయాలు తెలియచేసారు కాని ఇలాంటి ఆటలు ఆడితే పిల్లలకు, పెద్దలకు తప్పకుండా కళ్ళజోళ్ళు (కళ్ళకతుక్కునే కాటకాలు) కావాలి. 5 సంవత్సరాల క్రితమే నేను ఓ తెలుగు ఆదివారం అనుబంధ పుస్తకం లో చదివాను.(కొరియా లో 14 ఏళ్ల కుర్రాడు అవిశ్రాంతంగా 36 గంటలు దృశ్యమాలిక ఆటలు (వీడియో గేమ్స్) ఆడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.) అంతే, మన పెద్దలు చెప్పినట్టు పరిమితి దాటితే అమృతం కూడా విషం అవుతుంది.

    ReplyDelete
  2. భలే మంచి చోట పెట్టారు ఆ పుస్తకాన్ని! కంటి డాక్టర్ ఆఫీసులో! మరింతమంది పేషంట్లు, మరిన్ని లెన్సులు, మరింత బిజినెస్సు!

    ReplyDelete
  3. ఈ రోజుల్లో జీడిపాకం ధారావాహికలకు(సీరియళ్ళు), దృశ్యమాలికా ఆటలకు (వీడియో గేములు) పెద్ద తేడా లేదనుకుంటా.

    పెద్దలకు జీడిపాకం ధారావాహికలు (సీరియళ్ళు)
    పిల్లలకు దృశ్యమాలికా ఆటలు (వీడియో గేములు)

    ReplyDelete
  4. @Amar: Thank you.
    @వేణు: మీరు చెప్పింది అక్షరాలా నిజం. శృతిమించితే ఏదైనా అంతే.
    @సుజాత గారు: వాళ్లు కావాలని పెట్టారో లేక అది కేవలం యాదృఛికమో. అక్కడా పనిచేసేవాళ్లల్లో ఎవ్వనికైనా గేములపిచ్చి ఉండిఉండవచ్చు.

    ReplyDelete