ఈ రోజు పొద్దున్నుంచి నేనూ పాడ్ క్యాస్టింగు మొదలుపెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ, నా పక్కన కూర్చునే టోనీ గానిదెగ్గరకి వెళ్లి ఊర్కనే గెలికా. దేనికంటే మనోదెగ్గర సానా కళలు ఉన్నాయ్. వీడు ఫార్ములా ఐదు రేసరు. డి.బి.యే. మ్యాక్ డెవలపర్, అది ఇదీ. మనోడి దోస్తులుకూడా మంచి నిఖార్సైన బ్యాచి. అట్టాంటోళ్లలో స్కాట్ అనేవోడొకడు, వాని ద్వారంవెలుపలి (OUTDOOR) ఫోటోగ్రఫి ఇక్కడ చూసి దసుకోమాకండి. సరే అలాఎళ్లి గెలకంగనే, మనకి తెల్సిన ఇషయల్నే ఇంగిల్పీసులో సెప్పాడు. అయ్యాక, ఇందాక మళ్లీ కేకేసాడు, బాస్కార్ ఉన్నావా అని, వస్చన్నా అని ఎళ్లా. మా సొలారిస్ పెద్దాయన ఉన్నాడు అక్కడ. అతని పేరు, బాబ్. ఏంటి సంగతి బాస్కర్ అన్నాడు బాబ్. ఇదీ అన్నా, నీకు మ్యాక్ ఉందా అన్నాడు, లేదు అన్నా, ఐతే సారీ బాస్కార్, మ్యాక్తో ఇట్స్ వీజీ అన్నాడు, సర్లే మావా, ఇప్పుడు దీంకోసం మ్యాక్ యాడకొనంమంటా అని సెప్పేసి యనక్కి తిరగబోతుంటె, ఇదిగో నా పాడ్ క్యాస్ట్ యూఆర్యల్ అని ఇచ్చాడు.
చాలా ఫన్నీగా ఉన్నాయ్ బాబ్ పాడ్ క్యాస్ట్. ఆటికోసం ఇక్కడో లుక్కు వెయ్యండి
నేనూ ఒక పాడ్ క్యాస్ట్, అంటె పెద్దేమి లేదు ఒక యం.పి.త్రీ ఫైలు, పెట్టా. నా పీజ్జా పురాణంలో ఇందాక జతచేసా. ఇది కేవలం పరీక్షకి మాత్రమే, నా గొంతు చాలా తక్కువ గొంతుకతో ఉంది, దేనిఅంటే కార్యాలమ్లో ఉండి మాట్టాడా కాబట్టి.ఇక్కడ వినండి.
ఆనందం పొందు (Have Fun)
Dec 6, 2008
Subscribe to:
Post Comments (Atom)
Have fun ని "ఆనందించండి!" అంటే సరిపోతుందేమో.
ReplyDelete@వీవెన్ గారు: నా బ్లాగుకి స్వాగతం. అలారాసుంటే మీరు ఇలా వచ్చేవాళ్లు కాదుగా...నవ్వులాటా కోసం ఇలా మక్కికిమక్కి తర్జుమా చేసా. :)
ReplyDeleteThanks for good info!
ReplyDeleteReally amazing photography
@శ్రావ్య: అవును బెమ్మాండంగా ఉన్నాయ్ అతని ఫోటోలు. >> Thanks for good info.
ReplyDeleteWelcome!! Enjoy your weekend and Have Fun.
మంచి అలోచన! మీరో/నేనో ఇంకెవరో తెలుగు వారి కోసం పాడ్కాస్ట్ ఉపకరణాలు తయారు చేసేంతవరకూ మీరు ఈ క్రింది వాటిని ఉపయోగించుకోవచ్చు.
ReplyDeletehttp://social-media-university-global.org/2008/07/30/10-steps-podcast-free/
http://ourmedia.org/upload
"Have Fun" పాశ్చాత్య expression కాబట్టి, తెలుగులోకి అనువదించినా మంచి పదాలు రావేమో... నా మట్టుకు నేనయితే "పండగ చేసుకోండి" అంటా!
this is for comment feed
ReplyDelete@యోగి: Thanks man. I will pay a look at those.
ReplyDeleteGracias.