Jul 31, 2009

అమ్మా అమ్మా నువ్వు నాకు కనిపించట్లేదు

"ఆంటీ, సూర్యా లాక్డ్ హింసెల్ఫ్ ఇన్ ది రెస్ట్ రూం"
"ఓహ్ రియల్లీ..లెట్స్ గో"
"కిచకిచ (పిల్ల)"
రెస్ట్ రూం దగ్గర సీన్
"టక్ టక్.. సూర్యా ఏంజేసావ్ రా!! లాక్ తీ"
"అమ్మా రావట్లేదు..రెస్క్యూ మీ."
"నీ మొహం ఇంగ్లీషు [మనసులో - ఎలా ఇప్పుడు]"
"హరితా నేను మెన్టెనెన్సు వాడికి కాల్ చేస్తా"
"అమ్మా అమ్మా నువ్వు నాకు కనిపించట్లేదు రెక్యూ మి. హెల్ప్ హెల్ప్"
"ఒరేయ్ అరవకుండా కాం గా కూర్చూ నాన్నా"
"ఏమండి నేను ప్రయత్నిస్తా ఉండండి!! సూర్యా లాక్ ని నమ్మదిగా నెట్టు"
"రావట్లా"
"ఆంటీ, కెన్ ఐ ప్లేయ్ విత్ అనఘ"
"కిచకిచ"
"వాట్స్ గోయింగ్ ఆన్"
"హీలాక్డ్ ఫ్రం ఇన్సైడ్"
"ఓహ్కే"
"ఆంటీ కెన ఇ టేక్ ది బేబీ"
"అమ్మా మార్బుల్ జేబులోంచి కిందపడింది"
"ఒరేయ్ అరవమాక!! కూర్చో. లాక్ తీయమ్మా"
"డూ యూ నో విచ్ సైడ్ ద లాక్ ఈజ్"
"ఇట్స్ దట్ సైడ్"
"నో, దిస్ సైడ్"
"గాడ్, సూర్యా లాక్ నెమ్మదిగా తీయమ్మా"
"మేం, లేట్ మీ ట్రై"
"నేను భోజనం చేసి వస్తా"
పుష్ పుష్, హమ్మయ్యా తలుపు తెరుచుకుంది.
"అమ్మా!! "
"సూర్యా ఎలారా ఇలా లాక్ వేస్కుంటే!! తప్పురా"
"సరే ఇక నువ్వు వెళ్ళు నేను ఆడుకుంటా."
"కిచకిచ"
"ఆంటీ కెన్ ఐ ప్లే విత్ ది బేబీ"

-----
సాయంత్రం ఇంటికి వచ్చాక మా ఆవిడ మైమరచి ఈ స్టోరీ విశదీకరించి చెప్పింది
"ఏరా!!"
"ఔవును!! అమ్మాఅమ్మా నువ్వు నాకంపిచట్లేదు అంటున్నా లోపల్నుంచి"
"ఏడిసావ్"
"పెద్దైయ్యాక నేను ఫైర్ ఫైటర్ అవుతా!! రెస్క్యూ చెస్తా"


ఇంతలో చంటిది పాక్కుంటూ నా ఈప్మీదకేస్కునే సంచీ సైడుపక్క జేబులోంచి నా నల్ల కళ్ళద్దాలు పీకి ఇరగ్గొట్టింది.


ఒక్కసారి రెండు రెళ్ళు ఆరు సినిమాలో శోభనం సీను గుర్తుకుతెచ్చుకోండి. చంద్రమోహన్, రజనీ జంపు అవుతారు, బయట రాళ్ళపల్లి, పి.యల్ నారాయణ, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, పొట్టి ప్రసాద్, సుత్తివేలు, శ్రీ పుఛ్చా పూర్ణానందం వీళ్ళంతా మాట్లాడుకుంటుంటారు హడావిడిగా.

Jul 30, 2009

అంత అభిమానం ఎలా?

నెమలికన్ను మురళి రేడియో కధానిక చదువుతుంటే మధ్యలో ఈ క్రింది వాక్యాలు నన్ను ఆకర్షించాయి.
డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ఇతర క్వాలిఫికేషన్లు బాగున్నాయి. ప్రయత్న లోపం లేకపోయినా ఉద్యోగం దొరకలేదు. సున్నితమైన మనస్తత్వం. తండ్రి మాటలు భరించలేక పోయాడు.
మనోళ్ళు నిజంగనే అభిమానవంతులు. ఆ అభిమానానికి హద్దు ఉండదు. ఓ మాట అంటే అంతే.
1981, April 24, స్థలం దాచేపల్లి - దాదాపు మధ్యాహ్న సమయం. మా బాబాయి టైప్ హైయ్యర్ తప్పాడు అనే వార్త తెలుసుకుని మా తాతయ్య, చెడామడ తిట్టాడు. బాబాయి అప్పటికి డిగ్రీ పూర్తి చెసాడు. టైపు నేర్చుకుంటే మంచిదన్నట్టు బహుసా నేర్చుకుని ఉంటాడు. సాధారణంగా మా ఊళ్ళవైపు మాటపట్టం అంటే మహాకష్టం. తొందరగా మాటపడం. కన్న తండ్రి అరిస్తే, ఆవయసులో ఉన్న కుఱ్ఱాడు పుసుక్కున మందు తాగేస్తారు. ఇంతమందినిజూసా. మా ఇంటి దగ్గర్లోనే క్రాంతికుమార్ గారి ఆశుపత్రి. ఎన్నో కేసులు ఇలాంటివి. పురుగు మందులు ఎండోసఫాన్, నువాక్రాన్, ఎండ్రిన్ లాంటివి తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయటం. ఐతే, బాబాయి ఏంచేసాడో తెల్సా?
ఇంట్లోంచి పారిపొయ్యాడు. ఔను, ఇంట్లోంచి ఎవ్వరికీ చెప్పకుండా పారిపొయ్యాడూ ఆరోజే. మేము పిడుగురాళ్ళలో ఉండేవాళ్ళం ఆరోజుల్లో. మానాన్నకి కబురొచ్చింది. అయ్యా మీ తమ్ముడు పారిపొయ్యాడు మీనాన్నగారు కూలబడ్డారు అని. వెంటనే వెళ్ళాం దాచేపల్లికి. తాతయ్య పాపం అవాక్కయ్యాడు. అదిరిపొయ్యాడు. ఇటు బాబాయి చిన్నవాడె, ఎలా ఎటువెళ్ళాడో ఎంటో అనే ఆందోళన. జనాలు వెతకటం ప్రారంభించారు. అక్కడ ఇక్కడ నడికుడి స్టేషన్ మాచర్లలో తెల్సిన వాళ్ళకి చెప్పారు, గురజాలలో తెల్సినవాళ్ళకి వెప్పారు. గుంటూరులో తెలిసిన వాళ్ళకీ చెప్పం. దొరకలేదు. జాడలేదు.
1982 గడిచిపోయింది
1983 గడిచిపోయింది.
తాతయ్యకి ఎటాక్ వచ్చింది. పక్షవాతం. లేవలేని స్థితికి వచ్చాడు.
1984 గడిచిపోయింది. వెతికే జనాలు వెతుకుతూనే ఉన్నారు
1985 లో తాతయ్య దిగులుతో వెళ్ళిపొయ్యాడు. పేపర్లో ప్రకటన ఇచ్చాం. బాబూ ఇకనైనా రారా నాన్నా అని. జాడలేదు.
1995 ఐపోయింది.
2005 మానాన్న పొయ్యారు. పేపర్లో ప్రకటన ఇచ్చాం.

మా బాబాయు జాడ ఇంతవరకూ లేదు.
నిజం.
ఇప్పటికి దాదాపు ముఫై ఏళ్ళు కావస్తుందా? ఇంతవరకూ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు.

Jul 23, 2009

జ్ఞాపకాల దొంతర - కానా

కానా అంటే కంత, బొక్క అని.
నేను పుట్టింది దాచేపల్లిలో, మా తాతయ్యిగారి ఇంటో. దచ్చినం గదిలో దాన్నే టవర్ గది అనేవాళ్ళం, పొద్దున్నే పుట్టా కాబట్టి ఉదయ భాస్కర్ అని పేరు పెట్టారు నాకు.
ఆ ఇల్లు భలే గమ్మత్తుగా ఉండేది. ఇంత ఎత్తున పునాదులు లేపి నాపరాయితో కట్టిన ఇల్లు. రాళ్ళు పేర్చిన ప్రహరి. నే పుట్టిన టవర్ గది కిటికీ తీస్తే ఓ పెద్ద పున్నాగ పూల చెట్టు. టవర్ గదికి ఎనకమాల ఇంకోగది. తలుపు తీస్తే బైటికి. కిందకి మెట్లు. ఆడ ఓ పెద్ద తొట్టి. ఆణ్ణుంచి కొంచెం ముందున్న బావికి దారి. తొట్టి పక్కనే ఓ జామ చెట్టు. ఇంటెనకమాల వంటగది. గదిలో అటకలు.
పొగపట్టిన చూరు. పొట్టు పొయ్యిలు. రోకలిబండ డ్రమ్ములాంటి దాని మధ్యలో పెట్టి పొట్టు కూరి, రోకలి బండ తీసేసి, కింద కానాలోంచి చెయ్యి పెట్టి బొక్కపెట్టి, అప్పుడు ఎలిగిత్తారు పొయ్యిని. వరండాలో ఈ అయిపు గోడకి ఓ పెద్ద కానా.


దాచేపల్లి ఎళ్ళినప్పుడల్లా ఈ కానా లో కూర్చుని వచ్చేపొయ్యే రైళ్ళని జూస్తూ, గూడ్సు బళ్ళని జూస్తూ ఉండేవాళ్ళం. గూడ్సుబళ్ల పెట్టెల్ని లెక్కబెట్టం మహా సరదా. ఈ కానాలో ఇద్దరు పిల్లలు పక్క పక్కన పడుకునేంత స్థలం ఉండేది. అన్నయ్యా నేను, దాంట్లోకిజేరి ఆడుకునే వాళ్ళం. మా చిన్న మేనత్త దాంట్లో గిల్లాలు ఆడేది. నాకు పేయింట్ వేసేంత సీను లేదుగానీ, దాంట్లోంచి నే చూసిన ప్రపంచాన్ని వెయ్యాలి అని నా కోరిక.
రాత్రుళ్ళు అక్కడ కూచూటానికి భయం. కారణం, ఈ కానాలోంచి చూస్తే పక్కన ఉన్న ఖాళీ స్థలంతో బాటు దానిపక్కనున్న ఓ గుడిశె, దానిముందు రెండు సమాధులు కనిపిస్తాయ్. సమాధులు అంటె మరి భయం ఉండదా?

పగలు, దృష్టి సారిస్తే, ఆ గుడిశె దాటినాక కూసింత దూరంలో రైలుపట్టాలు. ఆటికటైపు ఓ షెడ్డు. అదేందంటే, సచ్చిపోయిన ఎద్దులు అట్టాంటివి ఆడికిదెచ్చి, తోలుతీసి దట్టాలు పడేసే షెడ్దు. ఆటిల్లోని కొన్ని ఎముకల్ని పందార ఫ్యాక్టరీకి పంపిత్తారు, పందారలో ఎముకల పొడికలుపుతారు అని చెప్పుకునేవాళ్ళు. ఇక ఆ షేడ్దు దాటితే దూరాన సిమెంటు క్వారి. ఎ.సి.సి వాళ్ళు ముందు దాచేపల్లిలో సిమెంటు ఫ్యాక్టరీ బెట్టారు. ఆ తర్వాత పిడుగురాళ్ళకి దగ్గర్లో బెట్టారు. దానిపేరు సీతారాంపురం క్వారి అనేవాళ్ళు. సరే ఇక, తలకాయ ఇటు తిప్పితే దూరంగా "నడికుడి" అనే పచ్చ బోర్డు కనిపించేది. అదే నడికుడి రైల్వే స్టేషన్. తల తొంభైడిగ్రీలు ఇటు తిప్పితే నాగులేరుపైన కట్టిన రైల్వే బ్రిడ్జి కనిపించేది.
మా ఇల్లు దాదాపు చివర, మా ఇల్లు దాటినాక రెండు ఇళ్ళే. అవి దాటితే కొంత ఖాళీ దాటితే రైలుపట్టాలు. మరి మా వైపు అన్నీ రాళ్ళేగా. ఎక్కడ చూసినా, రాళ్ళు బయటికి పొడుచుకుని కనపడేవి. వానపడితే ఆ రాళ్ళెంబట నీళ్ళూజేరేవి. ఆటిల్లోకి కప్పలు. కప్పల్ని పట్టుకోడం, రాళ్ళుపెట్టికొట్టటం ఇలాంటివిజేసేవాళ్ళం.
అప్పుడప్పుడు నడికుడి స్టేషన్ కి వెళ్ళేవాళ్ళం. స్టేషన్ కి రెండోవైపున ఓ పెద్ద పార్కు ఉండేది. అక్కడ జారుడుబండ, అవి ఇవి ఉండేవి. ఇక పున్నాగ పూలు రాలి కిందపడినవి తెచ్చి ఒకదాంట్లో ఇంకోటి గుచ్చి మలలు చేసేవాళ్ళం. పున్నాగ పూల వాసన భలే ఉండేది.

ఇప్పుడు ఆ తాతా బొయ్యాడు, ఇల్లూ బోయింది, జ్ఞాపకాలు మాత్రం మిగిల్నై.

Jul 16, 2009

మల్లెతీగ వాడిపోగా

మల్లెతీగ వాడిపోగా మరలపూలు పూయునా
పూజ అనే చిత్రంలోనిది, విడులైన సంవత్సరం - 1975
పాడినవాసు - శ్రీ యస్.పి బాలసుబ్రహ్మణ్యం.
రాసినవారు శ్రీ దాశరధి
సంగీతం - రాజన్ నాగెంద్ర

మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన
మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా


నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును
నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును
నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును

మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన
మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా

కడలిలోన మునుగు వేళ పడవమనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన మనమంతా పావులం


ఎంతచక్కటి పాట. ఎంతకమ్మని మాట, భావం. ఐతే ఇత్తెఫాక్, ఈ క్రింది పాట కూడా దాదాపు అదే భావంతో ఉంది.

* Movie: Amar Prem
* Singer(s): Kishore Kumar
* Music Director: R D Burman
* Lyricist: Anand Bakshi
* Actors/Actresses: Rajesh Khanna, Sharmila Tagore (Pushpa)
* Year/Decade: 1971, 1970s

आनंद बाबू : रो मत पुश्पा, आज तुम जो हो जिस जगह हो,
तुम्हारे आँख के पानी नमकीन
पानी के अलावा कुछ नहीं है. इसलिये इन्हें पोंछ डालो
पुश्पा.
पुश्पा : हाँ आनंद बाबू आप ठीक कहते हैं. बैठिये.
आनंद बाबू : छोड़ो पुश्पा, चलो आज कहीं बाहर चलते हैं.
ढूँढें कोई ऐसी जगह जहाँ थोड़ी देर के लिये ही
सही कुछ याद न आये, न तुम्हें न मुझे.

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये,

[నిప్పు రవ్వలు రాజుకుంటే దాన్ని వర్షం తో ఆపవచ్చు
కానీ వర్షం రాజేసే వాటిని దేనితో ఆపాలి?]
ओ... उसे कौन बुझाये

पतझड़ जो बाग उजाड़े, वो बाग बहार खिलाये
जो बाग बहार में उजड़े, उसे कौन खिलाये
ओ... उसे कौन खिलाये

हमसे मत पूछो कैसे, मंदिर टूटा सपनों का - (२)
लोगों की बात नहीं है, ये किस्सा है अपनों का
कोई दुश्मन ठेस लगाये, तो मीत जिया बहलाये
मन मीत जो घाव लगाये, उसे कौन मिटाये

न जाने क्या हो जाता, जाने हम क्या कर जाते - (२)
पीते हैं तो ज़िन्दा हैं, न पीते तो मर जाते
दुनिया जो प्यासा रखे, तो मदिरा प्यास बुझाये
मदिरा जो प्यास लगाये, उसे कौन बुझाये
ओ... उसे कौन बुझाये

माना तूफ़ाँ के आगे, नहीं चलता ज़ोर किसीका - (२)
मौजों का दोष नहीं है, ये दोष है और किसी का
मजधार में नैया डोले, तो माझी पार लगाये
माझी जो नाव डुबोये, उसे कौन बचाये

[తుపానులో నావ ఊగిసలాడితే, నడిపేవాడు పార్ లగాయె..నెమ్మదిగా వడ్డుకి చేరుస్తాడు
కానీ నడిపేవాడే నావని ముంచితే ఇంకెవరు ఒడ్డుకి చేరుస్తారు?]
ओ... उसे कौन बचाये

चिंगारी ...


ఈ రెండు పాటలు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది.

Jul 15, 2009

ఏతన్మాత్రుఁడు

నాకు బాగా గుర్తు, నా ఎనిమిదో తరగతిలో తెలుగు పద్యభాగంలో ఓ పద్యం. మా తెలుగు మాష్టారు బుఱ్ఱలో చాలా లోతుగా నాటాడు ఈ పద్యాన్ని. ఎప్పుడూ నోట్లో ఆడుతూ ఉంటుంది గుర్తుండీ గుర్తులేనట్టుగా.

ఆరూపం బవికార, మాభుజబలం బత్యంత నిర్గర్వ, మా
శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్ర్కియాజ్ణాన మా
ర్యారంభ ప్రతికూల వాద రహితం, బాయీగి సమ్మానవి
స్తారోదాత్తము మాద్రి పిన్నకొడుకేతన్మాత్రుడే చూడగన్


మొత్తానికి పట్టా ఈ పద్యాన్ని మళ్ళీ.
పై పద్యం విరాట పర్వం లోనిది (విరాట - 2-209)
ఏతన్మాత్రుఁడే అనగా సహదేవుడు. ఇది సహదేవుణ్ణి గురించి ద్రౌపది అభిప్రాయం.
ఇది భర్త గురించి భార్య భావన. ఏ భార్యయైనా తన భర్తని అమాయకుడని, వెర్రిబాగుల వాడని అంటే ఒప్పుకోదు. అలా ఉండాలని కోరుకోదు. భార్యకు కావలసింది ముంది భర్త రూపం. అందుకే ఆరూపంబవికారము అని సహదేవుని రూపం బాగుంటుందని చెప్పింది. తల్లికి రూపంతో నిమిత్తం లేదు. అందుకే అక్కడ కడు పసిబిడ్డ భార్య భర్తలో గొప్ప నాయకత్వ లక్షణాలన్నీ ఉండాలని కోరుకుంటుంది. అందుకే అతని భుజబలం గురించి ప్రశంసించింది. బలం ఉంటే మంచిదే కానీ గర్వం ఉండకూడదని భార్య కోరుకుంటుంది. ఉంటే తనకీ ప్రమాదమే. అందుకే సహదేవుని నిర్గర్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పింది. భర్త శూరుడు కావాలని కోరుకొనే భార్య కూడా మరి రౌడీలా ఉంటే సహించలేదు. అందుకే అతడు శూరుడే కాని, దయారసానుగతుడని చెప్పింది. తన భర్త పదిమందీ మెచ్చుకొనేలా అన్ని పనులు నిర్వహించగలగాలని (Managing Ability) భార్య కోకుకొంటుంది. అంతే కానీ మా ఆయనకి ఔను, కాదు అనడం కూడా తెలియదు. బొత్తిగా నోట్లో వేలు పెడితే కొరకలేడు. అని ఏ భార్యా చెప్పదు. అలా చెబితే వెర్రాడి పెళ్ళాం వాడకెల్లా వదిన అన్నట్లుగా చుట్టు ప్రక్కల వాళ్ళకి ఆమె లోకువై పోతుంది. అందుకే సహదేవుని క్రియా జ్ఞానం (Working Knowledge) గొప్పదని చెప్పింది. మొత్తం మీద సహదేవుడు అసాధారణ ప్రజ్ణాశాలి అని తేల్చింది. తల్లి మాటలకి భార్య మాటలకి ఎంత తేడా ఉందో చూడండి. ఆ తేడా ఆ స్థానాల్లో ఉన్న స్త్రీల మనోభావాలను బట్టే ఏర్పడుతుంది. ఈ భేదాన్ని భావంలోనే కాదు భాషలో కూడా చూపించడం తిక్కన గొప్పదనం. పద్యం మొత్తం సంస్కృత సమాన భూయిష్టంగా నడిచింది. ఈగి, పిన్నకొడుకు, చూడగన్, వంటి మాటలు తప్ప మిగిలిన పద్యమంతా సంస్కృత సమాస బంధురమై గంభీరమైన శైలిలో నడిచింది. ఈ శైలి భార్య భర్తను గురించి వ్యక్తం చేసే ఉదాత్త గంభీర భావాలకు సరిగ్గా తగినది. సందర్భాన్ని బట్టి భాషలో ఈ భేదాన్ని అడుగడుగునా చూపించి సంస్కృత ప్రేమికులైన కవి పండితులను, ఆంధ్రాభిమానులయిన రసజ్ణులను ఇద్దరినీ మెప్పించబట్టే తిక్కనను ఉభయ కవి మిత్రుడన్నారని పెద్దలు పేర్కొన్నారు.

దీనికోసం గెలుకుతుంటే ఈ క్రింది లింకు తగిలింది.
http://siliconandhra.org/nextgen/sujanaranjani/april2009/virataparvam.html
పై పేరా ఇందునుండి సంగ్రహింప బడింది.

Jul 14, 2009

కాబట్టి బాబయా

నిన్నటి బీకెండు అనగా వీకెండు -
శనివారం సాయంత్రం, సమయం ఆరు దాటి మదమూడు సెకెండ్లు.
జుట్టు బాగా పెరిగింది, క్షురకర్మ చేస్కుందామా అని చంటిదాన్ని అడిగా, కిచకిచా అని నవ్వింది. పిల్లాడు వెంటనే నే చేస్తా నే చేస్తా అన్నాడు. నువ్వు వద్దులే నాన్న అని వారించా. భా.మ పిల్లల్ని అటుకేసి రాకుండా పోలీసు పెట్రోల్ ఉద్యోగం అప్పటికప్పుడు వేయించేసి క్లిప్పర్స్ ని ఛార్జింగ్ కి పెట్టేసి కూర్చున్నా.
ఎప్పుడు మూడు నంబర్ పెట్టి కొడతా. సరే!! ముందు, సూపర్ కట్స్ కే వెళ్ళొచ్చుకదా అని ఎవ్వరికైనా ఓ పశ్న ఉదయించొచ్చు. ఏంపర్లేదు, తప్పేమీ లేదు అలా అడగటంలో. నేను అమ్రికాకి వచ్చాక వేళ్ళమీద లెక్కెట్టవచ్చు సూపర్ కట్స్ కి వెళ్ళిన సందర్భాలు. కారణం. నాకు జుట్టు ఎక్కువ పెంచుకోటం ఇష్టం ఉండదు, మొదట, రెండోది, గిట్టుబాటు కావట్ల. అనగా మనం వెళ్ళి అంటకత్తెర వేయించుకునే దానికి పదమూడు డాలర్లు బొక్క, పైన ఓ రెండు టిప్పు. ఇంతా చేసి మన రెండు సొట్టెంట్రుకలి అవసరమా అని.
సరే కధలోకొస్తే, మూడు సైజు పెట్టి కొట్టేస్తా. నిన్న, ఓ ప్రయోగం చేద్దాం అని తలపైన నాలుగు సైడుపక్కల మూడు పెట్టి కొట్టా.
ఏసిపడేసా. అయ్యింది. పైన ఉన్న నాలుగు సైడుపక్కల ఆరుతో సరిగ్గా జతపడట్ల. ఎనకమాల అక్కడక్కడా చేలో మొదళ్ళు కొట్టేసినట్టుగా కొన్ని దుప్పులు దుప్పులు మిగిలిపొయినై.
సోమవారం పొద్దున మేడం గారి చేయి పడ్డాక ఆటిని మొదలుకంటా నరికినాక, బాసూ, నాలుగు మూడు కొట్టుకుంటున్నై, మూడేసి పైన కూడా ఓ సారి లాగించేయ్ బెస్టు అని ఓ ఉచిత సలహా పడేసి వంటింట్లోకి తుర్రుమంది.

కాబట్టి బాబయా, ప్రయోగాల్చెయ్యమాక బాబయా. ఎప్పుడు సేసినట్టే సేస్కోటం బెస్టు బాబయా.

Jul 13, 2009

తాళము వేసితిని గొళ్ళె....

ఈ దినం పొద్దుగాల్నే పొద్దుగాల్నే ఝలక్.
లేచాం, ఆపీస్కి తయ్యారయ్యాం. బండికాడికిపొయ్యాం. తాళంచెవి పెట్టాం, స్టార్టు చేసాం. అక్కడ ఓ లైటు ఎలుగుతున్నది. ఏందిరా అని కళ్ళజోడు మిటకరించి చూస్తే రిజర్వ్ లో పడింది బండి. దీనెన్కమ్మ అనుకుని పెట్రోలు బంకు దాంకా ఐనా వచ్చుద్దా నాయనా అనుకుంటా ఎళ్ళా. బంకుకాడికిబొయ్యా. ఆపినా, టాంకీ ఓపెన్జేసినా. మరి కార్డుముక్క గీకి పెట్రోలు కొట్టుకోవాలిగా, ఆడికి ఎళ్ళ, జోబిలో సేయిపెట్టి లాగా పర్సు. రాలా. ప్యాంటు ఊడదీసి దులిపా, పర్సు లేదు. గాడీలో పెట్రోలు లేదు, ఇంటికిబొయ్యి పర్సు తెచ్చి కొట్టొద్దాం అంటే. ఏట్రా బగమంతుడా అని బంకోడికాడికి బొయ్యా. బంకోడు పాకిస్తానీ.
హాయ్ అన్నాడు
నేను ఇరోచనాలప్పుడు బాత్రూం దొరక్కపోతే ఎలా మొహం పెడతామో అలాపెట్టి,
వెల్, హమ్!! నాకు నీ సహాయం కావాలి.
ఏంటి
నేను వాలెట్ మర్సిపొయ్యా, నాకు పుల్ ట్యంక్ కావాలి. అస్సలు లేదు గ్యాస్. కనీసం ఇంటికి వెళ్ళొద్దామనా లేదు. కాబట్టి పుల్ ట్యాంక్ కొట్టు, నా ఐపోన్ ఈడబెడతా. ఎళ్ళి పర్సు తెచ్చుకుంటా. డబ్బులిచ్చి నా మొబైల్ తీస్కుంట
నువ్వు యాడుంటావ్.
దగ్గరే.
ఇంటికాడికి పొయ్యిరాటానికి ఎంతకావాలి.
ఓ గ్యాలన్ కొట్టు.
గ్యాలన్ 2.59 (క్యాష్ కి)
హం!! (ఇంతలో బుడ్డి ఎలిగింది), బాసూ ఉండు నాకాడ కొంచెం క్యాష్ ఉండాలి అనీ ఆజోబీలొంచీ ఈజోబీలొంచీ పీకా 37 వొచ్చినై బైటికి.
తస్సదియ్యా కొట్టు 37కి.
వెళ్ళి కొట్టుకో పో అన్నాడు.


అలా 13.70 గ్యాలనులు కొట్టించి, మళ్ళీ ఇంటికి తిప్పి, పర్సు తీస్కుని ఆపీస్ దార్లో పడ్డా.

ప్యాంటు వేసుకుంటిమీ పర్సు మరసితిమీ.

Jul 9, 2009

కదలమాక, గాడిదల్లారా!!! ఇస్మైల్, ఛీజ్, నవ్వండహే!!

అందరూ లైన్లో నుంచోండి. హా!! అరేయ్, కదలమాక, గాడిదల్లారా!!!
నవ్వండర్రా!!
ఇస్మైల్!! ఛీజ్!!
సచ్చినాళ్ళారా!!

ఓటి, రెండు మూడూ, క్లిక్, కచక్!!
భలే వచ్చిందిరా పోటో.

Jul 8, 2009

పనిలో ఉన్న కళాకారుడు

గమనించండి, ఎంత తీవ్రమైన ఏకాగ్రతతో పనిచేస్తున్నాడో ఈ కళాకారుడు. ఆ కుంచె చూడండి. ఆ చేతులు చూడండి. ఎంత నేర్పరి తనం ఉందో ఆ చేతుల్లో
From కళాకారుడు

ఇలా రంగుని పళ్ళెంలో కుమ్మరిచ్చుకుని,
From కళాకారుడు

అప్పుడు రంగు పుయ్యాలి, ఇలా
From కళాకారుడు

ఏదైనా ఒక్కసారి చూపిస్తే చాలు, అల్లుకుపోతాం, మిగతా ట్యూబులన్నీ ఇలా ఓపెన్ చేసి
From కళాకారుడు

ఇలా అందినకాడికి పులిమితే
From కళాకారుడు

ఆ మజేనే వేరు
From కళాకారుడు

నన్నేం చెయ్యకు అని చివరికి మిగిలిన ఈ హెలికాప్టర్ ఎలా జాలిగా చూస్తోందో చూడాండి
From కళాకారుడు

Jul 7, 2009

దో నైనా ఔర్ ఏక్ కహానీ

దో నైనా ఔర్ ఏక్ కహానీ - ఈ పాట నా నోట్లో తెగ ఆడుతోంది. కారణం "ఆప్కీ అంత్ర" అనే సీరియల్ యాడ్ లో ఈ పాటేస్తున్నాడు జీ వాడు.
ఈ పాట కధా కమామీషు -
ఇది మాసూం అనే చిత్రం నుండి.
http://en.wikipedia.org/wiki/Masoom

మాసూం చిత్రం 1983 లో రిలీజైన షేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం.
మాసూం అంటే అమాయకత్వం. ఈ సినిమలోని క్యారెక్టర్లలో కనిపించే  అమాయకత్వమే ఈ సినిమా పేరు.
DK (నజీరుద్దీన్ షా) అని ఒకాయన. హ్యాపీగా పెళ్ళిసేసేస్కుని పెళ్ళాం(షబానా ఆజ్మి), ఇద్దరు పిల్లల్తో సుఖంగా జీవించేస్తుంటాడు. ఆపిల్లల్లో ఒకమ్మాయిలా ఊర్మిళా మధోణ్కర్ నటించింది. సరే ఓ రోజు అతని, ఈ పెళ్ళికిముందే ఇంకో స్త్రీతో సంబంధం వల్ల ఓ కొడుకు, వాడు ఇంటికి వస్తాడు. వాడ్ని ఆ ఇంటి ఇల్లాలు పిల్లలు ఎలా అంగీకరిచారు, మొగుడు తనని మోసం చేసాడు అని ఆ ఇల్లాలు భావించి అతన్ని ఎలా ట్రీట్ చేస్తుంది? అమాయకత్వంతో నిండిన చిన్న చిన్న అపోహలు, ఇష్టమైనా అలుకలు, కోపలూ, తాపాలు ఎలా నడిచినయ్ అనేది స్థూలంగా కధ!!

ఈ సినిమాలో రెండు అత్భుతమైన పాటలు -
దో నైనా ఔర్ ఏక్ కహాని మరియూ తుఝసె నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై

పాట - दो नैना और एक कहानी
రాసినవారు - గుల్జార్
సంగీతం - ఆర్.డి బర్మన్
పాడినవారు - ఆర్తి ముఖర్జీ

दो नैना और एक कहानी -२
थोड़ा सा बादल थोड़ा सा पानी
और एक कहानी
दो नैना और एक कहानी
थोड़ा सा बादल थोड़ा सा पानी
और एक कहानी
दो नैना और एक कहानी

छोटी सी दो झीलों में वो
बहती रहती है
ओ छोटी सी दो झीलों में वो
बहती रहती है
कोई सुने या ना सुने
कहती रहती है
कुछ लिख के और कुछ ज़ुबानी

हो थोड़ा सा बादल थोड़ा सा पानी
और एक कहानी
दो नैना और एक कहानी

थोड़ी सी है जानी हुई
थोड़ी सी नई
ओ थोड़ी सी है जानी हुई
थोड़ी सी नई
जहाँ रुके आँसू वहीं
पुरी हो गई
है तो नई फिर भी है पुरानी

हो थोड़ा सा बादल थोड़ा सा पानी
और एक कहानी
दो नैना और एक कहानी

एक ख़त्म हो तो दूसरी
रात आ जाती है
ओ एक ख़त्म हो तो दूसरी
रात आ जाती है
होंठों पे फिर भूली हुई
बात आ जाती है
दो नैनों की है ये कहानी

हो थोड़ा सा बादल थोड़ा सा पानी
और एक कहानी
दो नैना और एक कहानी

దొ నైనా ఔర్ ఎక్ కహానీ -2
థొడా సా బాదల్ థొడా సా పానీ
ఔర్ ఎక్ కహానీ
దొ నైనా ఔర్ ఎక్ కహానీ
థొడా సా బాదల్ థొడా సా పానీ
ఔర్ ఎక్ కహానీ
దొ నైనా ఔర్ ఎక్ కహానీ

ఛోటీ సీ దొ ఝీలొ మె వొ
బహతీ రహతీ హై
ఒ ఛోటీ సీ దొ ఝీలొ మె వొ
బహతీ రహతీ హై
కొఈ సునె యా నా సునె
కహతీ రహతీ హై
కుఛ్ లిఖ్ కె ఔర్ కుఛ్ జుబానీ

హొ థొడా సా బాదల్ థొడా సా పానీ
ఔర్ ఎక్ కహానీ
దొ నైనా ఔర్ ఎక్ కహానీ

థొడీ సీ హై జానీ హుయీ
థొడీ సీ నయీ
ఒ థొడీ సీ హై జానీ హుయీ
థొడీ సీ నయీ
జహాన్ రుకె ఆసూ వహీ
పురీ హొ గయీ
హై తొ నయీ ఫిర్ భీ హై పురానీ

హొ థొడా సా బాదల్ థొడా సా పానీ
ఔర్ ఎక్ కహానీ
దొ నైనా ఔర్ ఎక్ కహానీ

ఎక్ ఖత్మ్ హొ తొ దూసరీ
రాత్ ఆ జాతీ హై
ఒ ఎక్ ఖత్మ్ హొ తొ దూసరీ
రాత్ ఆ జాతీ హై
హొటోన్ పె ఫిర్ భూలీ హుయీ
బాత్ ఆ జాతీ హై
దొ నైనొన్ కీ హై యె కహానీ

హొ థొడా సా బాదల్ థొడా సా పానీ
ఔర్ ఎక్ కహానీ
దొ నైనా ఔర్ ఎక్ కహానీ
................................
పాట - तुझसे नाराज़ नहीं ज़िन्दगी, हैरान हूँ मैं
రాసినవారు - గుల్జార్
సంగీతం - ఆర్.డి బర్మన్
పాడినవారు - లతా మంగేష్కర్, అనూప్ ఘోషాల్.
तुझसे नाराज़ नहीं ज़िन्दगी, हैरान हूँ मैं
ओ हैरान हूँ मैं
तेरे मासूम सवालों से परेशान हूँ मैं
ओ परेशान हूँ मैं

जीने के लिये सोचा ही न था, दर्द सम्भालने होंगे
मुस्कुराऊँ तो, मुस्कुराने के कर्ज़ उठाने होंगे
मुस्कुराऊँ कभी तो लगता है
जैसे होंठों पे कर्ज़ रखा है
तुझसे ...

आज अगर भर आई हैं, बूँदें बरस जायेंगी
कल क्या पता इनके लिये आँखें तरस जायेंगी
जाने कहाँ गुम कहाँ खोया
एक आँसू छुपाके रखा था
तुझसे ...

ज़िन्दगी तेरे ग़म ने हमें रिश्ते नये समझाये
मिले जो हमें धूप में मिले छाँव के ठंडे साये
ओ तुझसे ...


తుఝసె నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై
ఒ హైరాన్ హూ మై
తెరె మాసూం సవాలొన్ సె పరెషాన్ హూ మై
ఒ పరెషాన్ హూ మై

జీనె కె లియె సొచా హీ న థా, దర్ద్ సంభాలనె హొంగె
ముస్కురాఊ తో, ముస్కురానె కె కర్జ్ ఉఠానె హొంగె
ముస్కురాఊ కభీ తొ లగతా హై
జైసె హొఠొన్ పె కర్జ్ రఖా హై
తుఝసె ...

ఆజ్ అగర్ భర్ ఆయీ హై, బూన్దె బరస్ జాయెగీ
కల్ క్యా పతా ఇనకె లియె ఆన్ఖే తరస్ జాయెగీ
జానె కహా గుం కహా ఖొయా
ఎక్ ఆసూ ఛుపాకె రఖా థా
తుఝసె ...

జిందగీ తెరె ఘం నె హమె రిష్తె నయె సమఝాయె
మిలె జొ హమె ధూప్ మె మిలె ఛావ్ కె ఠండె సాయె
ఓ తుఝసె ...

ఈ సినిమా కి నాలుగు అవార్డ్లు కూడ వచ్చినై
నసీరుద్దీన్ షా - ఉత్తమ నటుడు
ఆర్.డి బర్మన్ - ఉత్తమ సంగీత దర్శకుడు
గుల్జార్ - ఉత్తమ గీత రచయిత
ఆర్తి ముఖర్జి - ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్

Jul 3, 2009

తాళము వేసితిని, గొళ్ళెము....

అపీస్లో నాకాడ ఓ కాపీ మేకర్ (కాపీ పిల్ట్రీ) ఉంది. ఒకానొక కాలంలో పొద్దున, సాయంత్రం బయటకెళ్ళి కాపీలు తాగేవాణ్ణి. ఓ సమచ్చరం కాణ్ణుండి, నా డెస్కుకాణ్ణే కాపీ సేస్కుని తాగేత్తన్నా.

ఈ పిల్ట్రీ ఓ చిన్న యంత్రం. ఓ లోటా నీళ్ళు పోసి, ఓ కాయితకం ముక్కేసి అందులో కాపీ పగొడ్రీ ఏసేసి మూతపెట్టేసి స్పిచ్చి నొక్కితే కింద గాజు లోటాలోకి కాపీ వచ్చుద్ది. ఎంత వీజీ, ఏంకనిపెట్టావరా తెల్లనాకొ** అనుకుంటా అప్పుడప్పుడు.

మూడు స్టెప్పుల్లో ఎలిపెంటు అనగా ఏనుగుని ప్రిజ్జిలో ఎలా పెడతావ్ అని సిన్నప్పటి స్నేయితుల్తో ఆట్లాడేవాళ్లం.
ప్రిజ్జి డోర్ తీ
ఏనుగుని లోనకి నెట్టు
తలుపెయ్.

ఎంతవీజీ. కాపీ కూడా అంతే!! ఓ పెద్ద సెయ్యాల్సిన పన్లేదు.

మూత తీ,
నీళ్ళు పొయ్యి,
కాయితకం ముక్క ఇంతక ముంది ఉంటే తీసేయ్,
కొత్తతి పెట్టు,
కాప్పొడి కుమ్ము,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.

ఇంతవీజీ ఐతే జీవితంలో ఎకసెక్కాలేడనించొత్తాయ్ సోదరా!!
మనం ఓ రోజు ఇలాసేసాం.
మూత తీ,
....
కాయితకం ఎయ్యి,
కాపీపొడి ఎయ్యి,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.

ఓ ఐదు నిమిషాల్తర్వాత పొ(ప)గలు మంటలు (మరీ మంటలు రావులే). ఏట్రా నాగన్నా అని సూత్తే, హా!! పిల్ట్రీలో నీళ్ళు మరచితిరి, డింగ్! డాంగ్!! అంది పిల్ట్రీ.

ఓ రోజు ఇట్టా కూడా సేసాం

మూతతీ,
నీళ్ళు పొయ్యి,
కాయితకం వెయ్యి,
.....
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.
ఏసేసా, నొక్కేసా, ఓ ఐదునిమిషాలకి గాజు లోటా తీసి సుత్తే ఏడి నీళ్ళు ఎక్కిరించినయి.

ఇంకోరోజు -
మూతతీ,
నీళ్ళుపొయ్యి,
కాయితకం వెయ్యి,
కాపీపొడి ఎయ్యి,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి,
కింద గాజు లోటా మర్సిపో...
ఏందిరా కిందకి రాటల్లా అని సూత్తే కయితకం మొత్తం నిండిపొయ్యి ఉంది కాపీ.

కలికాలంలో కాపీకోసం ఎన్ని తిప్పలు బగమంతుడా