http://www.eenadu.net/story.asp?qry1=16&reccount=45
ఈ వార్త సారాశం నన్ను ఆశ్చర్యపరిచింది. "నేను హైదరాబాదీని, మాకు హైదరబాద్ ప్రత్యేక దేశం కావాలి". ఇంతకముందెన్నడూ విన్లా ఈ కోరికని. కొత్తగా ఉంది! ఈళ్లెవరయ్యా అడగటానికి? ఎదో సరదాగా మా పల్నాడు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే, కొంచెసేపు నవ్వుకోవచ్చు. కాని ఇదేందిది? ఇలాంటి పరీస్తితుల్లో హైదరాబాదు నగరం ఎంతవరకు సురక్షితమైన ప్రదేశం?
హైదరాబాదీయులారా: అటూ ఇటూ ఓ కన్నేసి ఉండండి, పొరపాటున ఎవ్వడైనా అటు ఇటుగా ఉన్నాడాంటే ఆ పాట బాదొదిలిపెట్టండి.
ఐనా హైదరాబాదు ప్రత్యేక దేశం కావాల్సొస్తే పాకిస్థాన్కి వెళ్లటం దేనికి? ముంబైలో మారణ కాండ జెయ్యటం దేనికి?
కొడుకులకి పిల్లాటాలా ఉన్నటుందే. మొత్తం 20 మంది తీవ్రవాదుల్లో ఏడుగ్గురు హైదరాబాద్ నుండే. సిగ్గుచేటు. హైదరాబాదులో ముస్లిం తీవ్రవాదానికి చారిత్రాత్మక కారణాలున్నాయ్ - బొంగు భోషాణం. మనకి బతకటమా సావటమా అనే ప్రశ్న వచ్చినప్పుడు చారిత్రకం లేదు బొంగులేదు.
జనాల్లారా - ఈయ్యాల్టి రోడ్డు షోలు ఎంతవరకూ మిమ్మల్ని కాపాడగలవు? ఆలోచించుకోండి. చిరంజీవైనా, రాజశేఖర్ రెడ్డి ఐనా, సెం.బా ఐనా ఆళ్ల రక్షణ ఆళ్లు జూస్కుంటారు, బలైయ్యేది జనాలే.
కె.సి.ఆర్ విన్నవా వీళ్లు ఏమంటున్నరో? గిప్పుడేంజేస్తవ్?
Added on 29th Nov, 9 AM EST -
Nov 29, 2008
Subscribe to:
Post Comments (Atom)
ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు మధ్యల కెసిఆర్ ఏం జేసిండు
ReplyDeleteఎంత విషాదం లో నైన తెలంగాణాను దెబ్బ కొట్టల్సిందేనా?
ఇదేం బాగాలేదు తమ్మీ
ప్రతాప రుద్ర
వాళ్ళు నిజంగా హైదరాబాదీలే అయితే సిగ్గుతో కుమిలి పోవడం తప్ప ఇంకేమీ చేయలేం ప్రస్తుతానికి! దేశంలో ఎక్కడ ఏ తీవ్రవాద చర్య జరిగినా ఎంతో కొంత హైదరాబాద్ తో లింకులు ఉంటున్నందుకే తల దించుకుంటున్నాం ఇప్పటికే!
ReplyDeleteమనకత ఇట్టున్నది కాబట్టే ముంగటనుండి రాజకీయనాయకులు, పైనుండి తీవ్రవాదులు, ఎనకమాల అబివృద్ది భూతం మనతోని క్రికెట్టు ఆడుతున్నై(రు). నేను కెసీర్ని అన్న. తెలంగాణాని ఏమి అన్లే.
ReplyDeleteపాకిస్తాన్ లో కూడా హైదరాబాద్ వుంది!!!
ReplyDeleteకానీ, ఫోన్ చేసిన షాదుల్లా అనే వాడు "మాది డక్కన్ హైదరాబాదు, పాకిస్తాన్ లోది కాదు" అని స్పష్టంగా చెప్పాడు.
ReplyDeleteకత్తి గారు - చాలా తెలివిగా చెప్పారండి. పాకిస్థాన్లోని హైదరాబాదు ప్రత్యేక దేశం కోసం ముంబైలో అరాచకం చేస్తున్నరా? నా జ్ఞానచక్షువుల్ని తెరిపించారు. ఆంధ్రప్రదేశ్ జనులారా!! పాకిస్తాన్ లోని హైదరాబాద్ ప్రత్యేక దేశం కావాలని కోరుకోండి. నేనూ ఇక్కడ ఒబామాకి, బుష్ కి కూడా ఓ ఆర్జీ పడేస్తా.
ReplyDeleteకత్తి గారు మీరన్నది అర్థం కాలేదు.
ReplyDelete@చైతన్య గారు...
ReplyDeleteపాకిస్తాన్ లో వున్న హైదరాబాద్ నీ సింధ్ హైదరాబాద్ అని ఇండియా లో వున్న హైదరాబాద్ నీ డెక్కన్ హైదరాబాద్ అని అంటారు.....
తెలంగాణా, తెలంగాణా ప్రజల వెనకబాటుతనానికి కారణమైన నిజాంని ఓట్ల కోసం కీర్తించే వెధవలతో చేతులు కలిపి మనం మనం కొట్టుకున్నన్నాళ్ళు పక్కన వాడికి అవసకం ఇచ్చినట్లే......!
ReplyDeleteహైదరాబాదు పేరుని తొలగించేసి, మద్రాసును చెన్నై గా మార్చినట్లు, హైదరాబాదు పాత పేరైన "భాగ్యనగరం" గా మార్చేస్తే పోలా. భారతదేశానిదా, పాకిస్తాన్ దా అని ఏ గొడవా వుండదు.
ReplyDelete"హైదరాబాదు ప్రత్యేక దేశం కావాల్సొస్తే పాకిస్థాన్కి వెళ్లటం దేనికి? ముంబైలో మారణ కాండ జెయ్యటం దేనికి?".
ఇదేదో బానే వుందే. నాకు రాయలసీమ కావాలి. నే వెంటనే వెళ్ళి పాకిస్తాన్ లోనూ, బంగ్లాదేశ్ లోనూ బాంబులు వేసొస్తా.
నాగప్రసాద్ గారు మీ కామెంట్ కేక. ఎప్పుడు వెళ్తారో చెప్పండి. నేనూ వస్తా.
ReplyDeleteకత్తి గారు కల్లు తరిపించారు , చదవెస్తే ఉన్న మతి పూయిందంట , ఇప్పుడు కత్తి పరిస్తితి కూద అంతె , నువ్వు మెధావి, కత్తి ,కమాల్ అని అందరూ పొగదబట్టి కత్తి గారికి పాపం ఆ ఉగ్రవాదులు మన హైదరాబాదు కొసం కాదు వాల్ల హైదరాబాదు కొసం అని ఇందులొ పాపం ఉగ్రవాదుల తప్పుఏమీ లెదని చెప్పగలరు , బబూ మహెషూ నీకు మాత్రమె కాదు మాకూ ఏదొ కొంచం గ్నానం ఉంది , నువ్వు నీకు మెదావి అనుకుంటె సరిపోదు
ReplyDeleteకత్తి గారు కల్లు తరిపించారు , చదవెస్తే ఉన్న మతి పూయిందంట , ఇప్పుడు కత్తి పరిస్తితి కూద అంతె , నువ్వు మెధావి, కత్తి ,కమాల్ అని అందరూ పొగదబట్టి కత్తి గారికి పాపం ఆ ఉగ్రవాదులు మన హైదరాబాదు కొసం కాదు వాల్ల హైదరాబాదు కొసం అని ఇందులొ పాపం ఉగ్రవాదుల తప్పుఏమీ లెదని చెప్పగలరు , బబూ మహెషూ నీకు మాత్రమె కాదు మాకూ ఏదొ కొంచం గ్నానం ఉంది , నువ్వు నీకు మెదావి అనుకుంటె సరిపోదు
ReplyDeleteఅయ్యా బళ్ళాసుధీర్ గారూ!నేను చెప్పిందాంట్లో నా మేధావితనం ఏముందో మీరింత ఆవేశంగా ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కాకుండా వుంది.If you have problem with me this is not a place to do that.
ReplyDeleteNSG briefing లో టెర్రరిస్టులు హైదరాబాద్ అని చెబుతున్నా వారి భాష దాదాపు పంజాబీలాగా వుందని చెప్పారు. అందుకే పాకిస్తాన్ లోని హైదరాబాద్ గురించి ప్రస్తావించారేమో అనే అనుమానమేగానీ...ఈనాడు లింకులో నాకు వీరు(ఈ బ్లాగరి) చెప్పిన వార్త కనిపించలేదు.
చైతన్య గారు, మీరు కూడా వస్తారా. సరే అయితే మొదట పాకిస్తాన్ కి వెళదాం. కరాచి నేను చూసుకుంటా, లాహోర్ నువ్వు చూసుకో. డిసెంబర్ 10 లోపల పని కానించెయ్యాలి. తర్వాత కాలసర్పదోశం పోయి గ్రహస్థితులు మనకు అంతగా అనుకూలించకపోవచ్చు.
ReplyDeleteడిసెంబెర్ 10 .. ఇంకా టైం ఉంది. ఈ లోపులో ఉగ్రవాద యాగం తలపెట్టండి. ముహూర్తాన్ని దైవజ్ఞ శర్మ (హైదరాబాద్) తో పెట్టించుకోండి.
ReplyDeleteకృష్ణా రావు గారు,
ReplyDeleteపొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చింది. అన్నట్టు దైవజ్ఞ శర్మ ని ఇవాళ పొద్దున 10K రన్ దగ్గర చూసి నవ్వుకున్నాం మేము. సర్వాంతర్యామి !