Dec 17, 2012

గ్రీటింగ్ కార్డ్స్

ఇషయం ఏటంటే
ఇయ్యాల అనఘ  సూరిగాళ్ళ పాద్రీ పుట్టిన్రోజు
ఇట్టా గీసినారు గ్రీటింగు కార్డు ముక్కలు.
సూరిగాడు బుగాతి వైరన్ గీసిచ్చినాడడు. ఏదోనాడు కొనిస్చాళ్ళే అని కలలు కంటా ఉంటి.



అనఘ ఇలా గీసిచ్చింది.


హార్టు ఓపెన్ సేస్తే



Dec 15, 2012

కనెక్టికట్ షూటింగ్

కనెక్టికట్ అనే రాష్ట్రంలోని న్యూటౌన్ అనే ఊళ్ళోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో కొద్దిసేపటి క్రితం షూటింగ్ జరిగింది.
దాదాపుగా ఇరవైఏడుమంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలో. వారిలో దాదాపు ఇరవైమంది పిల్లలే.

షూటింగ్ గరుతున్నప్పుడు లోపలే ఉన్న ఒక పేరెటంట్ చెప్పటం, దాదాపుగా వంద రౌండ్ల కాల్పులు చేసాట్ట సదరు షూటర్.

షూటర్ దొరికాడు. వాణ్ణి గన్ డౌన్ చేశారు. వాడికి పాతికేళ్ళుట. ఇంకొక షూటర్ ఉండొచ్చని అనుకుంటున్నారు. షూటర్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేస్కొని వచ్చాట్ట. నాలుగు తుపాకులు తెచ్చుకున్నాట్ట. ఒక ఆటోమెటిక్ ఎసాల్ట్ గన్ కూడా ఉన్నదట అందులో.

చిన్నారుల అర్థాంతర మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మౌనం పాటిస్తున్నాను. ఏంజరుగుతున్నదో తెలియకుండానే ప్రాణాలు కోల్పోయిన వారి భీతితో నిండిన ఆత్మలు శాంతి పొందాలని ప్రార్థిస్తున్నాను.

నాకు మాటలు రావటంలేదు. ఏదో బాధగా ఉన్నది. మనిషి ఎందుకిలా తయ్యారౌతున్నాడో?
కూలంకుషంగా చర్చ జరగాలి మనిషి యొక్క మానసిక స్థితిగతులపై.



Dec 14, 2012

కొత్త కెమేరాలు

క్రిస్మస్ సీజన్ వచ్చింది. ఎలక్స్ట్రానిక్స్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో ఏ కెమెరా బెస్టూ అని ఒక మిత్రుడడిగాడు.
ఇంతక ముందు నేను కెమెరాలపై ఒక టపా వ్రాసినా మళ్ళీ ఓమారు వ్రాస్తున్నా.
కెమేరాలు ఇప్పుడు మూడు రకాలనుకోచ్చేమో
1. పాయింట్ అండ్ షూట్
2. మిర్రర్ లెస్
3. డిజిటల్ యస్.యల్.ఆర్

పాయింట్ అండ్ షూట్ కెటగిరీలో కేనన్ వాడు కొత్తగా యస్.యక్స్ ఫిఫ్టీ హెచ్‌యస్ రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు కేనన్ సైట్లో
http://www.usa.canon.com/cusa/consumer/products/cameras/digital_cameras/powershot_sx50_hs
Inline image 1
మొన్న నా మిత్రుడు కెమేరా కొందాం రా ఆని పిలిస్తే బెస్ట్ బై అనే షాపుకి వెళ్ళినప్పుడు చూశాను ఈ కెమేరాని. దీని ముందరి వెర్షనుకీ దీనికీ పేద్ద తేడా లేదనుకుంటాను. దీని ముందరి వెర్షన్ యస్.యక్స్ వార్టీ. ధరలో ఐతే పేద్ద తేడా లేదు
Inline image 2
జూం లో తేడా ఉన్నది, ఐ.యస్.ఓ ఆప్షన్స్ కొత్తదాంట్లో ఎక్కువున్నాయి. చూస్కుని వీటిల్లో ఏదోకటి కొనుక్కోచ్చు
మిర్రర్ లెస్ కెమెరాలని కొత్తగా విపణిలోకి కొన్ని కెమేరాలొచ్చాయి.
వికీవిక్కయ్య ఏవంటాడంటే
The Mirrorless interchangeable-lens camera (MILC) is a popular class of digital system cameras. Unlike a compact digital camera, a MILC is equipped with an interchangeable lens mount and unlike a digital single-lens reflex camera, a MILC does not have a mirror-based optical viewfinder.
నైకాన్ 1
Inline image 3
పానసానిక్ లూమిక్స్ GF5
Inline image 4
ఇంకా శాంసంగ్ వారి NX 200

Inline image 5
కేనన్ వాడి ఈ.ఓ.యస్. యం
Inline image 6
ఇంకా సోనీ, ఒలింపస్ ఇత్యాదివారివి కూడా ఉన్నాయి.
ఇవి పాయింట్ అండ్ షూట్ లాంటివే కానీ లెన్స్ మార్చుకోవచ్చన్న మాట.
ఇక మిగిలింది డిజిటల్ యస్.యల్.ఆర్.
కేనన్ వాడి T4i బాగుంది.
Inline image 7
ఐతే కొనేప్పుడు రివ్యూలు గట్రా చూస్కొని కొనుక్కుంటే మంచిది.
ధర పాయింట్ అండ్ షూట్ 300-400 ఉంటే మిర్రర్ లెస్ 500-800 ఉంటే T4i వచ్చి 800-900 ఉన్నది కిట్ లెన్సుతో కలిపి

Nov 20, 2012

ఓ సంఘటన

ఈ మధ్య మా ఏకస్థలబహుళగృహ సముదాయంలో జరిగిన ఓ సంఘటన.
మొన్నోరోజు ఆఫీసునుండి ఇంటికి వెళ్తూ పోస్ట్ చూద్దామని పోస్ట్ డబ్బావైపుగా వెళ్తున్నా. పాత్ వే మీద ఇద్దరు పిల్లలు, నల్లవాళ్ళు కూడా పోస్ట్ బాక్స్ వైపుగా వెళ్తున్నరు.
వారిని క్రాస్ చేస్కుని ముందికి వెళ్ళి నేను కారు పార్కింగ్ చేసి సూరిగాడికి పోస్ట్ బాక్స్ తాళంచెవి ఇచ్చాను వెళ్ళి చూసిరారా అని. వాడు కార్ దిగాడు. అప్పుడు ఆ నల్ల పిల్లలవైపు చూశాను. అందులో ఒకడు నాతో ఏదో చెప్తున్నాడు. నేను అద్దాన్ని కిందకి దింపి ఏంటీ అని అడిగేలోపు వాడు చేబులోంచి తుపాకీ తీసి వేలుమీదగా కిందకి వేళ్ళాడేసి, ఇది బీబీ గన్ (బొమ్మ తుపాకీ) అని చెప్తున్నాడు. నాకర్థం అవ్వలేదు. నాకెందుకు చెప్తున్నాడు? అని. ఓకే వాటెవర్ అన్నాను. నా కారుని దాటుకుంటు పోస్ట్ బాక్స్ వెనక ఉన్న ప్లే ఏరియాలోకి వెళ్ళిపోయారిద్దరు పిల్లలూ. అంతలో సూరిగాడు పోస్ట్ చూసొచ్చి కార్లో కూర్చున్నాడు. నేను క్రీగంట వాళ్ళెంచేస్తున్నారా అని గమనిస్తే, నావైపే చూస్తున్నారు. నేను వారివైపు తల తిప్పేలోపు మాయం అయ్యారు.
నాకు ఆశ్చర్యం వేసింది. ఆ గన్ పుల్ చేసిన పిల్లాడు సూరిగాడు వెళ్ళే బడికే వెళ్తాడు. అంటే ఇంకా ఎలిమెంటరీ స్కూలుకే అన్నమాట. అంటె పట్టుమని టీనేజి కూడా కాదు. ప్రతీరోజూ మా ఇంటి ముందునుండే వెళ్తాడు బడికి, ఇంటికీ. రోజూ చూస్తూనే ఉంటాను వాడ్ని. నాకే ఎందుకు చెప్పాడా అని ఒక పాయింటు.
ఇక నాకు కొంత భయం కూడ వేసింది. ఎందుకంటే సూరిగాడు కూడా వాడితో పాటు ఒకే బస్సులో వెళ్తాడు. ఇలాంటి పెద్ద పిల్లలు ఉన్న బస్సులో ఎలాంటి వెధవ వేషాలు వేస్తే అవి పిల్లలకు ఎలా అంటుకుంటాయా ఆని కొంత భయం.
ఇక వాడు చూపింది బొమ్మ తుపాకీనే అవ్వచ్చు గాక. కానీ బడి అయ్యాక ఇంటికొచ్చినాక దాన్ని బయటకు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందీ? ఏ శనివారమో పిల్లలంతా జేరి బొమ్మ తుపాకులతో ఆడుకోవటం ఒక పార్శ్వం. కానీ బడి ఉన్న రోజున. సాయంత్రం ఇద్దరే అలా తుపాకీతో తిరగాల్సిన అవసరం ఏంటీ? వాడు నాకు దాదాపు ముప్ఫై అడుగుల దూరంలోంచి చూపించాడా తుపాకిని. నల్లగా ఉన్నది. పిస్టల్ అనుకుంటా. అది నిజం తుపాకీనే అయే సంభావ్యత ఎంతా?
ఇలా పలు ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చెస్తుండగా మర్రోజు రెంటల్ ఆఫీస్కి వెళ్ళాను. మేనేజర్ తో మాట్లాడాను. ఇలా జరిగింది అని వివరించాను. కావాలంటే నేను వాళ్ళని గుర్తుపట్టగలను కానీ పట్టను. నా ఉనికిని నేను కాపాడుకోవాలి కదా. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిద్దామని చెప్తున్నా అని చెప్పకొచ్చాను. ఆ సదరు పిల్లల మీద నాకెలాంటి ఇదీ లేదు కానీ, నా సేఫ్టీ నా కుటుంబం సేఫ్టీ అపార్టుమెంటు సేఫ్టీ కూడా ముఖ్యమనే భావనతోనే మీదృష్టికి తీస్కొస్తున్నాను అని వివరించాను. ఇలాంటివి మరికొన్ని సార్లు పునరావృతం అయితే ఈ అపార్టుమెంటుకి ఎవరొస్తారో మీరే ఊహించుకుని తగు సేఫ్టీ చర్యలు తీస్కుంటే బాగుంటుందని నొక్కి చెప్పొవచ్చాను.
ఐతే, చివరికి ఇలా అనిపించింది నాకు.
ఆ పిల్లాడు తుపాకీ చూపుతున్నప్పుడు నేను కార్లోనే కూర్చొనున్నాను. ఒకవేళ అది నిజం తుపాకీ అయుండి, నేను నా దురద్రుష్టం కొద్దీ కారు దిగివారివద్దకు వెళ్ళే ప్రయత్నం చేసుంటే ఏవైయుండేదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సో! మన అదృష్టం బాగుండి అలా చేయలేదు....
ఆ నల్లపిల్లాడి అదృష్టం బాగుండి నాదగ్గర తుపాకీలేదు. ఇలాంటి పరీస్థితుల్లో మరొకడో మరొకడో అయుంటే వెంటనే తుపాకి తీసి షూట్ చేసుండే అవకాశాలున్నాయి. అది బొమ్మ తుపాకీనే అయున్నప్పటికీ. పిల్లాడు నాకు తుపాకీని చూపించాడేకాని ఎక్కుపెట్టలేదు. అయినా!

మిత్రులారా! గమనిస్తూ ఉండండి. ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే మీ గృహసముదాయ కార్యాలయంలో చెప్పండి. సెక్యూరిటీని టైట్ చేయమని చెప్పండి. పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు బయటకు తెవద్దని మనవి చెయవచ్చు కూడా.

Nov 7, 2012

ఒబామానా రామ్నీనా?

కడపటి వార్తలందేప్పటికి ఇదీ టాలీ
రామ్నని 158
ఒబామా 147
మరొక రెండు మూడు గంటల్లో ఓ స్పష్టమైన దృశ్యానికి రాగలమేమో
రామ్నీ యొక్క బృందం అన్నిరకాలుగా ఒబామా మీద బురదచల్లారు. అది నాకు నచ్చలేదు. ఒకానొక రేడియో ఛానెల్లో రష్ లింబా అనొకడు ఎంత దుష్ప్రచారం చేశాడంటే అంత. అదే రేడియోలో నిన్నటికి నిన్న పార్క్స్ అనేవాడు "రిపబ్లికన్స్ అందరూ మంగళవారం ఓటేయండి, డెమొక్రాట్స్ అందరూ బుధవారం ఓటేయండి" అని పదే పదే చెప్పుకొచ్చాడు. ఎలక్షను జరిగేది మంగళవారం, బుధవారం ఓటేయటానికి ఆస్కారంలేదని వాడి వెధవ హ్యూమర్. దాన్ని నిజంగా తీసుకునే వాళ్ళు కొందరుండచ్చు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. అంతలో ఎలక్షన్ కమీషనర్ స్వయంగా రేడియో స్టేషనుకి కాల్ చేసి వార్న్ చేశాడు. తప్పు అను. ఐనా వాడు తగ్గలేదు.
ఇక మరొక టాక్ షోలో "ప్రియ మిత్రులారా! మీమీ బ్యాంక్ ఎకౌంట్లనుండు డబ్బు డ్రా చేసేస్కొండి, ఏం జరుగుతుందో చెప్పలేం" అని చెప్పుకొచ్చాడు మరొక కుంక. అదే రేపొద్దున రామ్నీ గెలిస్తే ఏంచేస్తారూ? బొక్కసంలో ధనం లేకుండా ఏంపతకాలు అమలు చేయగలరూ?
సో! వీరి నెగెటివ్ పబ్లిసిటీ ఒబామాకి వరం కానున్నదా?
మీరేమంటారూ?

Oct 9, 2012

అనఘ పుట్టినరోజు


అనఘ పుట్టినప్పటి టపా. http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_10.html
హ్మ్! నాలుగేళ్ళు నిండాయి తారీఖుల ప్రకారం ఈనాటికి. ఎన్ని మాటలు నేర్చిందో.
"ఈ రోజు నా బర్త్‌డె కదా! నాన్నా! నా బర్త్‌డే కదా. అందుకే దోసె మొత్తం, అమ్మ తినూ తినూ అని చెప్పకుండానే తినేశా".
ఇక సూరిగాడు వాళ్ళ చెల్లికి గీసిచ్చిన గ్రీటింగు కార్డు.


అనఘకి పుట్టినరోజు శుభాకాంక్షలు దీవెనలూ అందించగోరతాను

Sep 22, 2012

గుంటూరులోని ఈనాటి ధరలు.

కందిపప్పు కిలో 70
మినప గుండ్లు కిలో 70
చింతపండు కిలో 120
సఫోల కిలో 152
శనగలు కిలో 80
పెసలు కిలో 80
పేస్టు డబర్ లాల్ ఎఱ్ఱది 70
నూగుజీడీల్ పొట్లం ఓక్టికి 20 రూప్యములు

అయ్యా! ఇవీ గుంటూరులోని ఈనాటి ధరలు.
ఎంత సంపాదిస్తే గుంటూరు లాంటి పట్టణంలో నలుగురున్న ఇంట్లో బ్రతుక గల్గుతారూ అనేది నా మౌళిక ప్రశ్న.

Sep 14, 2012

సిగరెట్టు కాల్చే వాళ్ళు

సిగరెట్టు కాల్చే వాళ్ళు ఇట్టే మిత్రులైపోతారు. దీనివల్ల రోజుకి రెండు తాగేవాళ్ళు దానికన్నా ఎక్కువసార్లు తాగుతారు. ఎంచేతనంటే ఒకడు రెండోవాణ్ణి లాక్కెళ్తాడు, నే ఎలల్తన్నా వస్తావా అని. సరే అని వెళ్తారా, ఇద్దరూ తాగుతారు. అలా. దీనివల్ల సిగరెట్లు ఎక్కువ కాల్చటమే కాదు జబ్బులు కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇద్దరు పంచుకుంటారు. వాడు సగం వీడు సగం.
మా కార్యాలయంలో ఇలాంటి బ్యాచిలు అనేకం. అందులో మా గ్రూపులోని ఇద్దరు మహిళలు. రోజుకి ఆరు సార్లు తాగుతారు. తాగొచ్చి తమ తమ డెస్కులవైపుకి వెళ్ళేముందు తలుపు దగ్గర ముచ్చట్లు. ఏందయ్యా మాట్లాడుకునేదీ అంటే నా బార్బిక్యూ సరిగ్గా రాలేదని ఒకామె అంటే ఔనా, నాదీ సరిగ్గా రాలేదు అనో, మా అబ్బాయి లాగులో ఉచ్చ పోసుకుంటున్నాడని కుర్రామె అంటే నా మనవడు కూడా అంతే చేస్తున్నాడని ముసలావిడ.
ముసలావిడ సీటు పక్కనే ఇంకో ముసలావిడ, ఆమె వీరి బ్యాచ్ కాకపోయినా దమ్ము కొట్టే బ్యాచే. ఆమె ఈ మధ్యన నెత్తికి కర్చీఫ్ కట్టుకుని వస్తుంటే నా పక్కనోడ్ని అడిగా, ఏవిట్టా అని. కేన్సర్ వస్తే కిమొ థిరపీ చేయించుకుంటున్నది అన్చెప్పాడు.
ఆమెని చూసైనా వీళ్ళు మారరు.
మనిషి మారడు!

ఐతే ఈమధ్య అనేకసార్లు అనేక మందిని గమనించిందేవిటంటే, కార్లో కూర్చుని దర్జాగా దమ్ము కొడుతుంటారు. భార్యా భర్తలిద్దరూ. భేష్! మెచ్చుకు తీరాలి వారి సౌభాత్రుత్వానికి, మిత్రత్వానికీ. కానీ వెనుక సీట్లో పిల్లలుంటారు. వారేం చేశారని వారు సెకెండ్ హ్యాండ్ స్మోకర్స్ అవ్వాలీ?
వారి లంగ్స్ పింక్ నుండి నల్లగా మాడిపోయినట్లుగా చిన్నవయసులోనే ఎందుకవ్వాలి?
చిన్నప్పటినుండే సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల ఆస్తమాకి ఎందుకు గురి అవ్వాలి?
అలా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడే హక్కు సదరు తల్లితండ్రులకు ఎవరిచ్చారూ?
ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఉండవు. ఉండబోవు కూడా.

Aug 30, 2012

Aug 23, 2012

బుల్లీయింగు చేసేవాళ్ళతో జాగ్రత్త

సూరిగాడి టెక్‌వాన్-డొ గురువు చక్కని మార్గనిర్దేశకం చేస్తున్నాడు అతని శిష్యులకు.
 సూరిగాడు గురువు నిన్న ఇలా నేర్పించాండు -
బడిలో బుల్లీయింగ్ చేసే వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు. వాళ్ళతో ఎలా నెట్టుకురావాలి అని చెప్పుకొచ్చాడు. ఎలా నెట్టుకురావాలో చూపించాడు.
బుల్లీయింగు సమయంలో పాటించవలసిన ముఖ్యమైన సూత్రాలు ఎ బి సి డి
ఎవాయిడ్ కాన్ఫ్లిక్ట్.
బి అంటే బి కామ్. ఎవడన్నా వచ్చి కంటి దగ్గర ఏలు పెట్టి ఏడిపిస్తున్నాడుకుందాం. వెను వెంటనే ఢమాల్ ఢిమీల్ అనకుండా కామ్ గా ఉండాలట
సి అంటే కమ్యూనికేట్ విత్ కాన్ఫిడెన్స్ అట. కామ్ గా ఉండి, కాన్ఫిడెన్స్ తో వాడికి చెప్పాలట, స్టే అవే ఫ్రం మి అని.
డి అంటే డోంట్ వొర్సెన్ అట, అంటె తెగిందాకా లాగకూడదట. అంటే? స్టే అవే అని వెళ్ళిపోవాలట. అంతేకానీ వాడి ముక్కు పచ్చడి పచ్చడి చేయటం తెగిందాకా లాగటం అవుతుందట.
బుల్లీయింగ్ చెసేవాడు ఐనా వెంటపడితే టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలట. కొన్ని కొన్ని అక్కడే వదిలేస్తే మంచిదట. కొన్ని తప్పక టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలట.
ఐ కంప్లీట్లీ ఎగ్రీ విత్ హిం.

ఏటా బుల్లీయింగ్ రాక్షసికి బలౌతున్న పిల్లలు ఎందరో. ఇలాంటి డిఫెన్సివ్ స్కిల్స్ పిల్లలకి నేర్పటం ప్రతీ తల్లితండ్రుల బాధ్యత అని నా అభిప్రాయం.

Aug 20, 2012

కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ ప్లే విత్ మి.

[సూరిగాడు ఆడుకుంటుంటాడు వాడి బ్లోక్స్ తోటి, సరిగ్గా అప్పుడు]
అనఘ: కెన్ ఎనీవన్ ప్లే విత్ మీ
నేను: అరెయ్! చెల్లితో ఆడుకోరా
సూర్య: ఏం! నాకు స్పేస్ వద్దా. పొద్దుగూకులు చెల్లితోనే ఆడుకోవాలా? నేను బ్లోక్స్ ఆడుకుంటా. హా!
నేను: నాన్నా! చెల్లిని ఆడించాలి. నీ రెస్పాన్సిబిలిటి.
సూర్య: ఎప్పుడూ కాదు. పొద్దున ఆడించా. ఐ వాంట్ మై టైమ్.
నేను: అమ్మలూ! నే ఆడతా రా
అనఘ: నో! దట్స్ నాట్ ఫెయిర్
అనఘ కి మా: నేనాడతా రావే!
అనఘ: నో!
అనఘ: కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ ప్లే విత్ మి.
సూర్య:..
అనఘ:ఐ యాం బోర్డ్...
సూర్య:..
అనఘ: కెన్ ఎ సెవెన్ ఇయర్ ఓల్డ్ బోయ్ ప్లే విత్ మి.
....
...
..
.

Aug 16, 2012

అమ్మ మనసు

పుట్టిన్నాటినుండి ఆలనాపాలనా చూస్తూ పిల్లలే లోకంగా ఉంటూ
వారికి అడుగులు నేర్పుతూ మాటలు నేర్పుతూ పాటలు నేర్పుతూ
జీవిత పాటాలు నేర్పుతూ వారి అడుగులో అడుగులు వేస్తూ
అన్నీ వారై అన్నిటా తానైన అమ్మ మనసు
నాలుగో ఏడున బడికి పంపిన పూట
ఒక్కసారిగా ఏర్పడే ఆ నిశ్శబబ్దాన్ని ఎలా తట్టుకుంటుందీ?
ఎలా తీస్కుంటుందీ?
వళ్ళంతా కళ్ళై తన పిల్లలు ఇంటికి ఎప్పటికొస్తారా అని
నిమిష నిమిషానికీ గోడ గడియారం వైపు చూస్తుంటుందా?
అప్పటిదాకా పరుగెత్తిన నిమిషాల ముల్లులు
ఒక్కసారిగా ఆగిపోయాయేంటా అని అవాక్కవుతుందా?
ప్రతీక్షణం తన వెనుక తిరిగే పిల్లల అడుగులకోసం
వెనక్కి వెనక్కి తిరిగి చూస్కుంటుందా?


ఈ పిల్లలే రేపు పెద్దై ఇంటినుండి గూటినుండి
ఎగిరిపోతే, ఏ ఏడాదికో చూట్టానికొచ్చే పక్షుల కోసం
ఆ గూటిపక్షి ఎలా ఎదురుచూస్తుంటుండో?
పుట్టిననాటి నుండి పిల్లల స్మృతులను
తలచుకుని తలచుకుని ఆనందంతో ఏడుస్తుందా?
స్మృతులు కరిగిపోతాయేమో అని భారంగా దాచుకుంటుందా?
[కండ్లలో నీళ్ళు ఇక రాయనివ్వటంలేదు]

Aug 8, 2012

అనఘ తెలుగు అనుకరణ

అనుకరణ ద్వారానే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు.
నిన్న టివి5 చూస్తూఅనఘ స్క్రోలింగ్ వార్తలు చూసి ఇలావ్రాసింది



Aug 7, 2012

చైనాలో ఒలంపిక్స్ మెడల్స్ కోసం...

చైనాలో, ఒలంపిక్స్ మెడల్స్ కోసం అనే ఓ స్వార్థంకోసమన్నా పిల్లలని హింసిస్తున్నారు. మరి భారతావనిలో ఏంజరుగుతున్నదీ?
ఆడ పిల్ల పుట్టిందని పుట్టగానే చంపేస్తున్నారు గోడకేసి బాత్తున్నారు పసికందుని చెత్త కుప్పలోకి కుక్కలకు కాకులకు ఆహారంగా విసిరేస్తున్నారు.


యల్.కె.జి నుండే ఐఐటి కోచింగులు
యల్.కె.జి నుండే పది కిలోల పుస్తకాల సంచులు
ఎందరు తల్లితండ్రులు పిల్లలకిష్టమైన ఆటలను ఆడిస్తున్నారూ?
వారికిష్టమైన కథలను చెప్తున్నారూ?
ఎందరు వారి మనస్సుని తెలుసుకుని వారిలో ఉన్న కళని ప్రోత్సహిస్తున్నారూ?

బలవంతంగా ఇంజనీరింగు అనో డాక్టరు అనో నెత్తిన రుద్దటంకన్నా చైనా చేస్తున్నది ఎంతపెద్ద తప్పూ?
పతకాలకోసం చైనా తల్లితండ్రుల కోరికలకోసం ఇక్కడి పిల్లలు. ఆట్టే తేడా లేదని నా అభిప్రాయం.

Jul 26, 2012

లెగొ క్రియేటర్

సూరిగాడికి పజిల్స్ పిచ్చి. ఒక వంద పీసెస్ ఉన్న పజిల్ ఇస్తే చాలు. అది అయ్యిందాకా లేవడు. మొన్నీమధ్య సమ్మక్క కాడ లెగొ స్టార్ వార్స్ కొన్నాడు. ఇక కుమ్ముకున్నాడు దాన్ని ఓ యాభైసార్లు తీసిపెట్టి తీసీ పెట్టి. ఇక లెగొ మీదపడ్డాడు. కొత్తవి కొను కొత్తవి కొను అని గోల. సరే ఆడుతున్నాడుగా అని ఇప్పటికి ఓ నాలుగో ఐదో కొని పెట్టినాను అప్పుడొకటి అప్పుడొకటి. ఒక్కోటి ఇరవై డాలర్లు మరి.
ఎండ్లకాలం సెలవుల్లో చెప్పినట్టు విని బుద్ధిమంతుళ్ళా తయ్యారయ్యాడు. పెట్టింది తినటం చెప్పింది వినటం ఇలాంటివి చేస్తున్నాడు. టెయ్క్‌వాండోలో ఫోకస్ పెరిగింది. ఇంట్లోకూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాళ్ళ గురువు "మీవాడికి ఫోకస్ బాగా పెరిగిన్! మీవాడికి బెస్ట్ ఫామ్స్ ఇన్ ది క్లాస్! హి విల్ బి మై డైమండ్" లాంటి పలుకులు పలికితే బ్రహ్మానందంలాగా కిందపడి దొర్లా.
అసలు వీరపల్నాటివాడిలాగా స్వీట్ ముట్టనివాడు ఈ మధ్య సున్నుండలు రుచి చూస్తున్నాడంటే మరి మనకి ఆశ్వర్యంతో ఉబ్బై తబ్బిబ్బై మబ్బై చినుకై వానై వరాలు కురవవా.
అరేయ్! నువ్విలానే చెప్పినమాటా వింటుంటే నీకో గిఫ్ట్ అని ఓ రోజు మబ్బులు పట్టినరోజు చెప్తే మొన్న పదా పదా అని గోలపెడితే వెళ్ళాం ఓ దుకాణానికి.
వాడికి త్రీ ఇన్ వన్ లెగొ క్రియేటర్ కొనిపెట్టాను
[రేసుకార్ల పిచ్చిగా మరి]


ఇప్పటికి ఓ పది సార్లు మార్చి మార్చిపెట్టాడు.
ఐతే ఓ సమస్య.
ఇవి పెట్టేప్పుడు వాడికి హెల్పింగ్ హ్యాండ్ కావాలి. ఇవి చాలా టైని టీనీ బ్లాక్స్ అవటంవల్ల
"అమ్మాఆఆఆఆఆ! ఇది కనిపించటంలేదు వెతికివ్వు".
"అరేయ్ వంట చేయాలా వద్దా?"
"వంట తర్వాత! ప్లీజ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్ అమ్మాఆఆఆఆఆఆఆఆఆఅ"
తీరా చూస్తే అక్కడే ఉంటుందా పీసు.
అంతలో పిల్ల
"సూర్యా నాతో ఆట్టంలేదూఊఊఊఊఊఊఊఊఊఉ"
"పోవే నేను బిజీ"
"సూర్యాఆఆఆఆఆఆఆఆఆఆఅ యూఆర్ సో మీన్"
"‌%&%#‌$%‌$%౬౪౩౩#@$%#@%$"
"$#%$‌‌%&‌&*&(*&)*()"

అలా ఉంది కథ

Jul 21, 2012

మళ్ళీ పేలిన తుపాకులు

అమెరికాలోని కొలరాడోలో మరో మారు తుపాకులు పేలినాయి
మన్నెండు మంది నేలకొరిగినారు
వాడెవడో మెడికల్ స్టూడెంటు. నాలుగు తుపాకులు కార్లోవేస్కొని థియేటరుకి వెళ్ళి, ఫైర్ ఎమర్జెన్సీ లోనించి దూసుకెళ్ళిమరీ కాల్చాడు మనుషుల్ని పిట్టల్లాగా.

Police said the gunman entered through an exit door and appeared at the front of the theater in Aurora and released a canister, thought to be tear gas, that let out a hissing sound.

He then started shooting into the crowd, sparking pandemonium.

Witnesses said the shooter was wearing a bullet-proof vest and dressed entirely in black. Some also said he was wearing a gas mask or goggles.

"He had no specific target. He just started letting loose," the witness added.

Witnesses told reporters that the gunfire erupted during a shootout scene in the "The Dark Knight Rises."

Aurora Police Chief Dan Oates said it was established that the apartment had been booby-trapped with sophisticated explosives or flammable material and officers were trying to determine how to defuse the device or devices.

౧. హ్మ్! ఎన్టర్టైన్మెంట్ అనేది మనిషి మానసిక స్థితిపై ఇంతలా ప్రభావం చూపే పనైతే దాన్ని ఒకదగ్గర ఆపగలగటం మంచిది అని నా అభిప్రాయం.

౨. అమెరికాలో షూటింగ్ కొత్త కాదు. ఐతే, అమెరికాలో తుపాకులు దొరకటమూ కష్టం కాదు. తప్పెవరిదీ? మొన్నటికి మొన్న ఒకడు కొత్త గన్ కొని సోఫా మధ్యలో పెట్టాట్ట. వాడి మూడేళ్ళ కొడుకు ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ నొక్కాట, తూటా పిల్లాడికే తగిలింది. తర్వాత ఏవైందో చెప్పాల్సిన పనిలేదు. తప్పెవరిదీ? ప్రస్థుత సంఘటనలో ఇరవైనాలుగేళ్ళ హోమ్స్ అనేవాడికి తుపాకులు అందజేసిన వ్యాపారానిదా తప్పు లేక, స్పైడర్మాన్ లాగా డ్రస్ వేసి క్యాన్స్ థియేటర్లోకి వదిలి కనిపించిన వాడ్నల్లా సినిమాలోల్లాగా కాల్చివేయటం అనే ఓ స్థితిని కలుగజేసిన సినిమా మాధ్యమానిదా లేక, తుపాకులను అడ్డుకోలేని ప్రభుత్వ పాలసీలదా?

౩. లేక, సదరు హోమ్స్ అనేవాడి మానసిక స్థితిని దిగజార్చిన కఠోరమైన మెడికల్ విద్యదా? అమెరికాలో మెడికల్ విద్యార్థుల కష్టాలు చెప్పనలవి కావని చాలా మందే చెప్పగా విన్నాను.

౪. గత పదిహేనేళ్ళుగా పబ్లిక్ షూటింగ్ అనేది కొత్త విషయం కాదు. అందునా షూటింగ్ చేస్తున్న వాళ్ళలో స్టూడెంట్ కుర్రాళ్ళే ఎక్కువ అన్నదీ కొత్తవిషయం కాదు. కానీ ఇంతవరకు ఎవరూ ఏఏ అడుగులు ముందుకి వేశారో నాకైతే తెలియదు.

౫. తల్లితండ్రులు తమ భద్రపరచుకోవాలి పిల్లలకి విలువలు నేర్పాలని ఇందాక ఎవరో రేడియోలో చెప్పగా ఇలా అనిపించింది -

"తుపాకులు బీరువాల్లో దాచిపెట్టినా, అందనిది ద్రాక్షా అవుతుంది. దాన్ని తాకాలనీ, జేబులో పెట్టుకోవాలని, గిర గిరా తిప్పాలనీ, పలానీ హీరోలాగా చేయాలనీ ఫ్యాంటసీసుని క్రియేటు చేస్తున్న మాధ్యమం, క్రియేటు చేస్తున్న వ్యవస్థా ఉన్నంత కాలం బీరువాలు ఉట్టి బీరువాల్లాగనే మిగుల్తాయి"

౬. కాపీక్యాట్ అయిన మన దేశంపై ఇలాంటి గన్ కల్చెర్ యొక్క ఇంపాక్ట్ ఏవిటీ అని ఆలోచిస్తుంటే వళ్ళు జలదరించక మానదు. తుపాకీని చూపని సినిమా చూపండి, ఒక్కటన్నా [దాదాపు లేవు అని నా అభిప్రాయం]. చట్టం నిద్రపోతూ న్యాయవ్యవస్థ కుళ్ళిపోతూ ఉన్న మన సమాజంలో తుపాకీని పొందటం ఎంత తేలికో ఆలోచించండి.

ఎలా? వీటిని ఆపటం ఎలా?

-ఆపలేము

Jul 19, 2012

రాహు డిఫెన్స్ మినిష్టరుగా రాబోతున్నాడా?

నాకే పదవులూ వద్దు అన్నాడు జస్ట్ మొన్ననే.
ఉత్తర ప్రదేశులో కాంగ్రేసుని గెలిపిస్చా అన్నాడు, బోర్లాపడ్డాడు.
ఆం.ప్రలో కాంగ్రేసు గెలుకుదామనుకున్నాడు సతికలపడ్డాడు.
వీడికి డిఫెన్స్ మినిష్ట్రీ ఏంటీ?
ఇంత వెంపర్లాట ఎందుకూ దేశాన్ని దోచటానికీ?
కాంగ్రేసు వారికి మతి అరికాల్లోంచి మరింత కిందకి జారినట్టుంది
దేశం ఎటు పోతే వాళ్ళకేం పట్టిందీ?
అంతా తాత నెత్తిన తోసేసి సంచులు షిప్పుకేసి
ఆబగా అందినకాడికి ఇటలీ పంపుకోచ్చు, ఎంచక్కా అని ఆశ

ఐతే! ఇదంతా పధకం ప్రకారం నడుస్తున్నట్టుగా ఉంది. డిఫెన్స్ మినిష్టరుగా చేసి మరిన్ని వేల కోట్లను ఇటలీ పంపుకునే ప్రయత్నంగా ఉంది. ఏవో, ఎవుడికి తెలుసు వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ నెత్తిన తెల్ల గుడ్డ పడితే ఈమాత్రం అవకాశం కూడా రాదుగా అన్న తొందర కనిపిస్తున్నది.

బెంగొలి తాత పొజీషనుతో పాటు డిఫెన్స్ మినిష్టరీ కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఢిల్లీ వర్గాల భోగట్టా అట.

ఏవైనా రాహు డిఫెన్స్ మినిష్టర్ ఐతే, దేశానికి తూట్లే అని బాధగా మూలుగుతున్నా, ఆపలేను కాబట్టి.

Jul 18, 2012

खिज़ा के फूल पे आती कभी बहार नहीं

मैं बनके आँसू खुद अपनी, नज़र से गीर जाऊं

రాజేష్ ఖన్నా గారికి నా నివాళి

Jul 17, 2012

అనఘ ఆర్ట్ - గణేశ



అయ్యా
అదన్నమాట
తన ఊహల్లోని గణేశుడిలా ఉన్నాడన్న మాట



పింక్ గణేశ్ అన్నమాట
చెల్లిని చూసి అన్న స్పూర్తిపొంది ఇప్పటికిప్పుడు ఇలా వేసినాడు

 
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

Jul 14, 2012

గౌహతి మొలెస్టేషన్

ఇరవై మంది మగాళ్ళు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయటం దాన్ని వీడియోతీయటం, యూట్యూబుకి ఎక్కించటం
థూ!!
ఎటుపోతున్నాం మనం? మనదీ ఓ సమాజమేనా? మనం మనుషులమేనా? మానవత్వం అనేది అసలు ఏడ్చిందా అనే ప్రశ్నలను అడగలేక అడిగినా బదులు రాక గోడల్తో మాట్లాడినట్టుగా అనిపించి, గొంతులోనే ఆపుకున్నాను.

థూ!! నాకు మాటలు రావటంలేదు.

పిల్లలు ఎటు పోతున్నారో కూడా పట్టించుకోని తల్లితండ్రులదా తప్పు? పుట్టినరోజు పండక్కి బారుకెళ్ళే సంస్కృతిదా తప్పు?

తప్పెవరిదీ అనేకన్నా మన సిస్టం ఎంతలా కుళ్ళిపోయిందో అనాలనిపిస్తున్నది

ఎందుకంటే  -
ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండు పుట్టిన్రోజు పండగ సెలబ్రెషన్సు కోసరం బార్ కి వెళ్ళింది.
మైనర్ బాలికని బారులోకి ఎలా అనుమతించారూ?
అనేది కూడా ఓ మౌళిక ప్రశ్న.
ఏవైనా సిగ్గుపడాల్సిన సంఘటన
సదరు వ్యక్తులకు కఠిన శిక్ష పడాలని కొనఊపిరితో ఉన్న న్యాయవ్యవస్థని ప్రార్థిస్తున్నా

Jul 12, 2012

తలకి గాయం - రెండో కేసు

మా బావగారు! అరవై ఏళ్ళ వయసు. భారత ప్రభుత్వానికి తనవంతు సేవ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు.
మా అక్కగారికి[పెద్దమ్మ కూతురు] భర్త, మా నాయనమ్మ వైపు బంధువులు కూడా. వీరికి ఒక్కతే కూతురు. బిటెక్ చదివి ఎదో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఈమధ్యనే పెండ్లి కుదిరింది పిల్లకు. ఈనెల చివర్లో పెండ్లి. పెండ్లి పిలుపులు కూడా అందరికీ అందినాయి. పిల్లాడు కూడా మాకు బంధువే.
నిన్న బావగారు స్నానాలగదిలో జారిపడ్డారుట. తలకి తీవ్రమైన దెబ్బ. కోమాలోకి వెళ్ళారుట.

ఏంటీ ఈ స్థితి?
పిల్ల పెండ్లి ఓవైపు
మరోవైపు ఇలా

మా అక్కయ్యకి పైవాడు ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను.

Jul 11, 2012

ఆమె తల్లేనా?

కేన్సాసులో నిన్నటి ఓ వార్త
ఓ తల్లి, తాను వ్యభిచారం చేస్తూ, తన ఇద్దరు పిల్లలలి వ్యభిచారం చేయిస్తున్నదిట. ఆ పిల్లలకి పెద్దఅమ్మాయికి పదునాలుగు, చిన్న పిల్లకి పదకుండేళ్ళు.
మధ్యాహ్నం మూడు నాలుగింటి నుండి పొద్దున ఏడింటివరకూ డ్యూటీ అట ఈ పిల్లలకు.
హ్మ్! సదరు తల్లికి ఏమి శిక్ష పడింది ఇత్యాదివి పక్కన పెట్టి, తను నరక కూపంలోకి వెళ్తూ తనవాళ్ళని కూడా లాగటం, తెలిసి తెలిసీ....ఆమె తల్లేనా? అనిపించేలా చేసింది.
స్టాటిస్టిక్స్ ప్రకారం, అసలు వ్యభిచారానికి కారణాలలో అతిముఖ్య కారణం *డ్రగ్స్* అట. పై సంఘటనలో కూడా, సదరు తల్లి కూతుళ్ళ రక్తాన్ని డ్రగ్స్ కోసమే అమ్మింది.

Jun 28, 2012

దేవుడా శక్తిని ఇవ్వు

జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
నూరేళ్ళ ప్రయాణంలో
కలసి అడుగులో అడుగులు వేస్తూ
శ్వాసలో శ్వాసౌతూ
సగంలో సగం అవుతూ
దేవుడు కలిపే పాత్రలు
కొన్ని
అర్థాంతరంగా ముగిసిపోతాయి
కలసి నూరేళ్ళు నడవాల్సిన రెండో పాత్రకో?
ఆ లోటు తీరనిది
ఆ లోటు తీర్చలేనిది
ధైర్యమే తోడు
ముందుకు వెళ్ళితీరాల్సింది
అదే ప్రకృతి తీర్పు
జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
దేవుడా శక్తిని ఇవ్వు
లేత హృదయానికి
ప్రేమించిన హృదయానికి
తట్టుకునే శక్తినివ్వు
నీ లీలనీ
నిలచిన కాలాన్ని
తట్టుకునే శక్తినివ్వు

[ప్రమాద వశాత్తూ మరణించిన నా సోదర సమానుడు, మిత్రుడు, శ్రేయోభిలాషికి అశృనయనాలతో]

Jun 26, 2012

'మంత్రాలయం'లో అగ్నిప్రమాదం

పిల్ల పెళ్ళి
రిటైర్మెంట్ బెనిఫిట్
తడిసిన చేతులు
అరిగిన కాళ్ళు
కాలిన ఫైళ్ళు
దీనిపై ఓ సినిమా తీస్తే బావుంణ్ణు ఎవరైనా....

[మహారాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం 'మంత్రాలయం'లో అగ్నిప్రమాదం]

Jun 7, 2012

వందేమాతరం

మా బళ్ళో పొద్దున్నే వందేమాతర గీతాన్ని ఆలపించటం, ప్రతిజ్ఞ చేయటంతో రోజు మొదలైయ్యేది. జన గణ మన అధినాయక జయహే గీతంతో రోజు ముగిసేది. బహుశా మా అజ్ఞానమో లేక ఖర్మమో ఎవ్వళ్ళూ ఇదేం పాట? అర్థం ఏంటీ అని అడిగిన పాపాన పోలేదు. అయ్యా! నే చదువుకున్నది జి.ప్ర.ప ప్రాథమికోన్నత పాఠశాల, మరియూ జి.ప్ర.ప ఉన్నత పాఠశాలల్లో. బడిలో లంబాడీలు మరియూ యస్.టి యస్సిలు, బీసీలు మరియూ ఓసీలు. ఎవ్వరూ ఏనాడూ వందేమాతరానికి అర్థం వెతకలేదు. అనాటి ఆ సమాజంలో కూడా ఎవ్వరూ వందేమాతరానికి అర్థం వెతకలా. కారణం? పిల్లలు ఆడుకోటంలో బడిలో పాఠాలు నేర్చుకోటంలో బిజీ. తల్లితండ్రులు పొట్టపోసుకోటంలో బిజీ. రెక్కాడితేకానీ డొక్కాడేది కాదు. ఏదోక పనికి వెళ్ళితీరాలి. ఊర్కనే కూర్చున్నోడికి పొయ్యిలో పిల్లి లెగిచేటిది కాదు.
ఐతే! వందేమాతరం అనే ఓ పేరాగ్రాఫ్ సైజున్న పాట, [మొత్తం పాట పాట్టానికి అది బడా లేక పాటలపోటీనా?] పాట్టానికి పది నిమిషాలో ఏమో పట్టేది, ఆ పాటలో ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసేంత అర్థం ఉందా?
ఓమారు చూద్దాం!సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
నాకు తెల్సిన పాట, మేము బళ్ళో ఆలపించిన పేరా పంక్తులు ఇవే.
ఇందులో ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో నాకైతే అర్థం అవ్వలేదు.
అసలు విషయం ఏవిట్టా?
ఈ సంవత్సరం నుంచి ఆంధ్రరాష్ట ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోంచి వందే మాతరం గీతాన్ని తొలగించారు. ఆ గీతాన్ని ఆలపించడం తమ తమ మతవిశ్వాసాలకు విరుద్ధమని ముస్లిమ్ క్రైస్తవ సంఘాలు (కనీసం స్థానిక సంఘాలు కూడా కాదు, ఏ.పి.కి బయటివి) వ్యతిరేకించిన నేపథ్యంలో తొలగించారని వార్త.
ఈ వేళ ఈ వార్త నిజం అవ్వచ్చు అవ్వకపోనూవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నిజం అయితీరుతుంది.
కారణాలు అనేకం. పొట్టపొస్కునే స్థితిలో బిజీగా ఉన్న మనుషుల జీవితాల్లోకి డబ్బు దయ్యం ఇప్పటికే ప్రవేశించి ఆవహించేసింది. దాంతో పురసతే పురసతు. చెదపట్టిన ఖాళీమైండుకి అన్నీ తప్పులేగా. ఓటు వరాలు ఇంకా కుమ్మరిస్తే సరి, ఉచిత బియ్యం ఉచిత సరుకులు ఉచిత జీతం ఉచిత భత్యం ఉచిత జీవితం అని. ఇంకేవుంది హాయిగా తీరిగ్గా కూర్చుని బెత్తెబెత్తెలో తప్పులు వెతుక్కోచ్చు. భావవైశాల్యాలను మనోభావాలుగా చిత్రీకరించి వక్రీకరించి దేశ స్పూర్తిని వమ్ముచేసేస్తే సరి.

ఒకనాడు గాంధీకి ఊతపదం వందేమాతరం
ఆయన పేరులో తప్ప మరెక్కడా కనిపించకుండా భూస్థాపితం చేయబడ్డాడు
ఆయన నిజ వారసులు ఏ చెట్టుకింద ఉన్నారో ఎవరికీ తెలియదు
ఆయన పేరు దత్తత తీస్కున కుహానా గాంధేయులు ఆయన్ని జండాలోకి నెట్టేసి
ఆయన వాడిన వందేమాతరాన్ని కాళ్ళకింద తొక్కేసి
తమ సోషలిజాన్ని సెక్యులిరజాన్ని
ఇలా బట్టలిప్పిన ఆడదానిలా చూపుకుంటున్నారు సొగసుని సోయగాన్ని శృంగారం ఒంపుకుంటూ వ్యభిచరిస్తూ

జయ హో సోనియా గాంధీ
జయ హో ఇటాలియన్ మాతా
నువ్వే గెలిచావ్

Jun 5, 2012

ఏమి ఎండలు! ఐతే?

మా అమ్మ నిన్న మాటల మధ్యలో, ఎండలు తలలు పగులగొడుతున్నాయిరా అన్నది.
నిజమే. ఎండలు తలలే కాదు జవజీవాలను ఎండగొడుతున్నాయి.
దీనిపై టీవీల్లో జనాల్లో పేద్ద చర్చలు జఱగవచ్చు, ఐతే
ఎందుకు ఎండలు పెరుగుతున్నాయి, వేడిని తగ్గించటానికి మనచేతుల్లో ఏవుందీ, మనం ఏం చేస్తున్నాం, మనం ఏంచేసాం, మనం ఏంచేయాలి అనేవాటిపై ఎంఫసిస్ ఎక్కడా?
పిల్లలకి రిసైకిలింగు నేర్పుతున్నామా?
కాంక్రీటు వనాలను కొనకుండా ఆపుతున్నామా?
కాంక్రీటు వనంలో ఒక చెట్టన్నా నాటుతున్నామా?
పర్వావరణాన్ని అధోగతిపాలు చేయకుండా ఈనాటి మనిషి చేస్తున్న ఒక్క మంచిపని చూపండీ?
ఇప్పుడే ఇలా ఉంటే రేపటిరోజున ఎలా ఉండబోతున్నదీ?

చెట్లను కొట్టివేయుట ఆపండి
మీ బండి ఇంజన్ ఆపివేయండి
చెట్లు నాటండి
మిమ్మల్ని మీరు కాపాడుకోండి
ప్లాస్టిక్ వాడవద్దు
దోచుకొనుటలో బిజీగా ఉన్న ప్రభుత్వాలను గద్దె దింపండి
పర్వావరణ రక్షణకై నడుం బిగించండి
మీ ఆయుస్షుని పెంచుకోండి

May 25, 2012

సెవ్వాకు లెట్టుకుంది సిరి సిరి మువ్వా

కోక కట్టుకుంది - సె
వ్వాకు లెట్టుకుంది - కొత్త
దాకలంబ లెట్టుకోని
తాళ్ళరేవు వోడమీదా
సిరి సిరి మువ్వా - బల్
తళుకు సీరలంపినానే
సిరి సిరి మువ్వా
అందినట్టు తెలపవేమే
సిరి సిరి మువ్వా - నా
అందగత్తెవీవు గావ
సిరి సిరి మువ్వా
అద్దాల మేడలోన
సిరి సిరి మువ్వా - నీతొ
సద్దులాడ నోచనైతి
సిరి సిరి మువ్వా
కాని కాల మౌటచేత
సిరి సిరి మువ్వా
కడకు నీకు దూరమైతి
సిరి సిరి మువ్వా॥
చల్లని వెన్నెలనాడు
సిరి సిరి మువ్వా - వేయి
కళ్ళా నిన్ను చూడాల
సిరి సిరి మువ్వా
తెల్లని దేహమువాడు
సిరి సిరి మువ్వా
ఎల్ల సిరుల నివ్వాలి
సిరి సిరి మువ్వా॥
జోడు కొయ్యల వోడా మీదా
సిరి సిరి మువ్వా - జోడి
పావురా లంపినానే
సిరి సిరి మువ్వా
అందిందో అందలేదో
సిరి సిరి మువ్వా నాకు
తిరుగు టపా రానేదే
సిరి సిరి మువ్వా

- కళా ప్రపూర్ణ డా॥ అనసూయా దేవి గారి "జానపద గేయాలు" నుండి
http://archive.org/details/janapadagayyaalu020440mbp

May 24, 2012

డిజిటల్ యస్.యల్.ఆర్ లెన్స్

ఈమధ్య మిత్రులు చాలా మంది డిజిటల్ యస్.యల్.ఆర్ కెమెరాలు కొంటున్నారు లేక కొందామనుకుంటున్నారు.
ఐతే, కెమెరా కొనంగనే సంబడం కాదు, దానికి తగ్గ లెన్స్ కూడా ఉండాలోయ్ అని కామేశ్వర్రావ్ అన్నట్లు, ఔను! నిజమే. దానికి తగ్గ లెన్స్ కూడా ఉండాలి. ఉండి తీరాలి. బాడీ ఓన్లీ కొన్నవారికి ఇంతక ముందరివి కొన్ని లెన్స్ ఉండే అవకాశం ఉన్నది. బండిల్ కొన్నవారికి కొన్ని లెన్స్ వచ్చి కలెక్షనులో చేరే అవకాశం ఉన్నది.
పెద్ద కెమెరాలు కొంటే వాటితో బండిల్ అయి వచ్చే లెన్స్ ఒక కేటగిరీ ఐతే, చిన్న కెమెరాలతో వచ్చే బండిల్ లెన్స్ వేరే.
Canon EF-S 18-55mm f/3.5-5.6 IS SLR Lens చిన్న కెమేరాలతో ఇది బండిల్ లెన్స్గా వస్తుంది.
కొంచెం పెద్ద కెమేరాతో ఐతే 18-135mm f/3.5-5.6 IS UD వస్తుంది బండిల్ లెన్సుగా

ఐతే, సధారణంగా ఒక కెమెరాకి ఏఏ లెన్స్ అవసరం అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నే! దీన్ని ఇలా వర్గీకరించవచ్చు
రోజువారి అవసరానికి
ల్యాండ్‌స్కేపింగుకి
పొట్రైట్స్ తీయటనికి
స్పోర్ట్స్ అవసరాలకి

రోజువారీ అవసరాలకీ అంటే? కెమెరా చంకనేస్కుని బయటకి వెళ్ళామనుకుంటే, కసక్కున రోడ్డుమీద ఏదో తీయాలనిపించింది, లేక పార్కుకి వెళ్ళాం, ఓ పూ పొదని తీయలనిపించింది....ఇత్యాదివి రోజువారీ అనుకోచ్చు.
ల్యాండ్స్కేపింగ్ అనేది మనం పనిగట్టుకుని ఏ దుర్గం చెరువు దగ్గరకో వెళ్ళి కొండనెక్కి సూర్యాస్తమయాన్ని తీద్దామనుకున్నపుడు ఇది అవసరం.
పోట్రైట్స్ అంటే ఇంట్లో, పిల్లల్ని లేక టైమర్ పెట్టి కుటుంబాన్ని తీస్కోవాలనుకోటానికి
స్పోర్ట్స్ అవసరాలు అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని కసక్కున లాగాలంటే.


1. Everyday lens - Canon EF-S 17-55 f2.8 IS - Costs $1099

2. Landscape lens - Canon EF-S 10-22mm f/3.5-4.5 USM SLR Lens for EOS Digital SLRs - Costs Price:     $799.00

3. Portrait lens/Prime lens - Canon 85 f1.8; Canon 50mm and so on

4. Sports lens - Canon EF 70-200mm f/2.8L USM Telephoto Zoom Lens costs Price:     $1,329.40

Canon 35mm f/1.4 L USM Lens పిల్లల్ని తీయటానికి పుట్టిన్రోజు పార్టీలకీ బాగుంటుందని చెపుతుంటారు. దీని ధర $1,379.00.

చూడాల్సింది యఫ్-నెంబర్
పైవాటిల్లో కొన్ని f2.8, కొన్ని  f/3.5-4.5  కొన్ని f1.8.
f/number పెరుగుతున్న కొద్ది ధర తగ్గుతుంటుంది.

http://upload.wikimedia.org/wikipedia/commons/8/87/Aperture_diagram.svg
Inline image 1
[గమనిక :- ఇవన్నీ నేను అక్కడా ఇక్కడా సంపాదించిన విషయాలు. నాకన్నా బాగా తెలిసిన వారు పైన నే చెప్పిన విషయాలపై అవగాహన ఉన్నవారు సలహాలు ఇవ్వ ప్రార్థన. ఇది కేవలం సమాచారం కొరకే అని గమనించ గలరు.]
లెన్సుల రివ్యూ కొరకు http://www.the-digital-picture.com/Reviews మంచి సైటు

May 23, 2012

గే ఆత్మహత్య


ఇందాక కేన్సాస్ యఫ్.యంలో ఓ డిస్కషన్
ఎవడో కాలేజీ కుర్రాట్ట, వాడి సహచరుడు గే అట, క్లోజెట్లో మరొక గేతో గీకే కార్యక్రమంచేస్తుంటే వీడు దాన్ని ఫోనుద్వారానో షూట్ చేసి లీక్ చేసాట్ట. సగరు గే, అవమానంగా భావించో బ్రిడ్జిమీద నుండి దూకి ప్రాణత్యాగం చెస్కున్నాట్ట.
ఈ షూట్ చేసిన వాడికి నెలరోజులు శిక్ష పడిందట.
౧. ఈ శిక్ష సరైనదెనా?
౨. ఈ గే కార్యక్రమంలో గే గాళ్ళు గీక్కోకుండా ఓఆడది మొగాడుంటే ఏవిటి స్థితి?
౩. లా ఎలా వీటిని డీల్ చేయలి
౪. తల్లితండ్రుల పాత్ర ఏవిటీ?

మీ మీ అభిప్రాయలు తెలియజేయండి

May 21, 2012

హంతకుడికి రాష్ట్రపతి క్షమాభిక్ష

హంతకుడికి రాష్ట్రపతి క్షమాభిక్ష

న్యూఢిల్లీ: ముగ్గురు వ్యక్తులను దారుణంగా హతమార్చిన ఓ వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు. డెహ్రాడూన్‌లో 18 ఏళ్ల క్రితం ఓం ప్రకాశ్‌ అనే నౌకరు పదవీ విరమణ పొందిన ఓ బ్రిగేడియర్‌, అతని కుటుంబసభ్యులు ఇద్దరిని హత్య చేశాడు. అతనికి ఉరిశిక్ష విధిస్తూ సూప్రీంకోర్టు...ఇటువంటి వ్యక్తి సమాజానికి ప్రమాదకారని పేర్కొంది. ఈ కేసులో అతనికి మరణశిక్షే సరైనదని తెలిపింది. హత్యకు పాల్పడే సమయానికి ఓం ప్రకాశ్‌ యువకుడని ఈ నేపథ్యంలో అతనికి ఉరిశిక్ష వద్దన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చివరకు ఓం ప్రకాశ్‌ కేసు క్షమార్హమైనదని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ గుర్తిస్తూ ఏప్రిల్‌ 29న అతని శిక్షను మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభా పాటిల్‌ తన హయాంలో మొత్తం 27 క్షమాభిక్ష కేసులపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు బిల్వారాకు చెందిన సమాచార హక్కు(ఆర్‌టీఐ) కార్యకర్త ఎస్‌.ఎస్‌.రాణావత్‌ చేసిన దరఖాస్తుకు వచ్చిన సమాధానం ద్వారా తేటతెల్లమైంది.

అసలు ఎంత పెద్ద నేరం చేసినా ఒకే శిక్ష వేస్తే పోలా?
రెండేళ్ళ ఫైవ్ స్టార్ శిక్ష ఏ నేరానికైనా!
ఎందుకింత తతంగం ప్రయాస న్యాయస్థానాలు న్యాయవాదులు జడ్జులు వాదనలు పోలీసులు గోల
ఇంత జరిగీ కోర్టులో తేలీ సదరు న్యాయమూర్తులు వాదనలను విని తమ అనుభవసారం నుండీ పుస్తకాల నుండీ న్యాయాన్నీ శిక్షలను కలిపి రంగరించి శిక్షవేస్తే
చివరికి, ఒక పొలిటీకల్లీ అపాయింటెడ్ వ్యక్తి, ఏ మాత్రమూ న్యాయం తెలియక, ఏమాత్రం దాని లోతు తెలియక కేవలం వార్తల్లో మిగిలిపోవాలనే స్వార్థంతో ఆ శిక్షను రద్దు చేయటం న్యాయాన్నే అపహాస్యం చేయటం సదరు శిక్షను రద్దుచేయటం..............

Apr 24, 2012

వాషింగ్‌టన్ పరిసర ప్రాంతాలలోని మిత్రులకు ఆహ్వానం


మా గురువుగారు, శ్రీశ్రీశ్రీ అనంత కృష్ణన్ గారి ఆధ్వర్యంలో, "అనంత్ వేద గ్రూప్" వారిచే ఏప్రిల్ ౨౭(27) నుండి ౨౯(29) వరకు "మహారుద్రం", లాన్‌హమ్ నందలి శ్రీ శివ విష్ణు దేవాలయమునందు జరుగనున్నది, కావున, మీరంతా పాల్గొని ఆ మహాశివుని సేవలో తరింపగోరతాను
http://www.maharudram2012.org/



ఓం నమః శివాయ

Apr 20, 2012

అనఘ సరుకుల జాబితా


మొన్న ఆదివారం శామ్స్ క్లబ్బుకి వెళ్ళబోతూ, హోము గారిని హింటినాను "లిస్టు రాస్కున్నరానే" అని.
టట్టడాయ్ అని అనఘ కొంచేపు జంపింగు జాక్స్ చేసి హడావిడిగా ఓ కాయితకం సింపుకొచ్చింది నోటుబొక్కులోంచి. పెన్నేది, అబ్బ ఒక్క పెన్నూ రాయదు అనుకుంటా ఓ పెన్ను లాక్కుచ్చుకుని ఎదో రాస్తాఉంది.
ఏటమ్మలు ఏటి రాస్తన్నా అంటే
సరుకుల లిస్ట్ రాస్తన్నా, ఏవేం కొనుక్కోవాల్నో అని
లిస్టు రాసి నాకిచ్చింది. జోబిలో ఎట్టుకో నాన్నా అని.

సర్లెమ్మని జోబిలో దోపుకిని ఎళ్ళినాం దుకాణానికి.
లోనకిబోంగనే, లిస్ట్ ఇటివ్వు అనింది
ఇచ్చినా
అంతలో హోము గారు పాలు తీస్కోవాల అనింది.
నే అది లిస్టులో రాసినా నాన్నా అనింది అనఘ
అనఘ లిస్టులో మీకేం అగుపిస్తా ఉన్నాయో సెప్పాల!!
అన్నో ఎవుళ్ళకాళ్ళు కొనుక్కుని బిల్లు కూడక మీరే కట్టెస్కుని, ఓ మూట మిఠాయిలు ఇటంపండి!!

Apr 19, 2012

నా మనసు మౌనంగా రోదిస్తున్నది

అమ్మ కాల్ చేసింది.
దుర్గారావు మాష్టరు గారి ఇద్దరు కొడుకుల్లో ఒకరు కేన్సర్ వ్యాధితో పోయారట.
పెద్ద పిల్లాడు యంటెక్ చేసాడనుకుంటా, ఎక్కడో ఉద్యోగం చెస్తున్నాడు.
రెండోవాడు వర్చ్యూసాలో చేరాడు ఆరేళ్ళ క్రితం. అమెరికా వచ్చాడు, మిల్వకిలో చాలా నెలలు ఉన్నాడు.
మరి ఇద్దరిలో ఎవరు పోయారో? కిరణ్ ట రా అన్నది అమ్మ.
కిరణ్ అంటే రెండోవాడు. భలే తెలివైన పిల్లాడు, చలాకీగా ఉంటాడు.
నా మనసు ఎంతో బాధతో మునిగిపోయిందీ వార్త విని.
ఇంకా ఇరవైల్లోనే ఉన్నాడే!! అయ్యో!! బ్లడ్ కాన్సర్!! నా మనసు మౌనంగా రోదిస్తున్నది. ఐ యాం స్పీచ్‌లెస్

Apr 17, 2012

అవర్ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ - ఆర్ట్ బై అనఘ

ఇందులో అందరూ ఉన్నారట!!
అనఘ అండ్ ఫ్యామిలీ అనగా, నేనూ, వాళ్ళ అమ్మ, తనూ, అన్న...ఆమ్మ పెదనాన్న అన్న, మిగతా అంతా ఫ్రెండ్స్ ట.

నువ్వు ఉన్యావా ఇందులో?
వెతుక్కో!!

Apr 12, 2012

డా॥ రమణ గారి *కోటయ్య కొడుకు*

నిన్నటి మా డాట్రుబాబు రమణ గారి టపా, నాన్న పొదుపు - నా చిన్ని కష్టాలు! సదివినాంక, ఈ కింది పేరా
కోటయ్య కొడుకు వైపు దృష్టి సారించాను. అడుగు బద్దలా బక్కగా, పొట్టిగా ఉన్నాడు. డిప్ప కటింగ్. చీమిడి ముక్కు. మిడి గుడ్లు. తన లూజు నిక్కర్ జారిపోకుండా ఒక చేత్తో పట్టుకుని.. ఇంకో చేత్తో తండ్రి చెయ్యిని గట్టిగా పట్టుకుని బిడియంగా నాకేసి చూస్తున్నాడు. మాసిన తెల్ల చొక్కా మోకాళ్ళ దాకా లూజుగా వేళ్ళాడుతుంది. చొక్కా గుండీలకి బదులు రెండు సేఫ్టీ పిన్నులు. ఇంజెక్షనేమన్నా పొడిచేస్తానేమోనన్న బెదురు చూపులు. ఈ ఆకారాన్ని ఎక్కడో చూశాను. ఎక్కడ? ఎక్కడ? ఎక్కడబ్బా? ఎక్కడో ఏమిటీ! అది నేనే!!

బాగా నచ్చి......శ్రీ అన్వర్ గారికి ఓ మెయిల్ పెట్టాని.
పై డిస్క్రిప్తన్తో అన్వర్ గారు ఓ బొమ్మగీయాలని ప్రార్థన అని. వారు వెంటనే స్పందించి ఇలా గీసి పంపించారు.


అన్వర్ గారికి కృతజ్ఞతలతో
డా॥ రమణగారికి అభినందనలతో

Mar 28, 2012

తెలుగు నేర్పకపోతే ఎలా?

మాతృభాష నేర్పకపోతే పిల్లలకి ఎలా?
పిల్లలు అవసరానికి ఏవైనా నేర్చుకోగలరు, వారి లెరనింగ్ కర్వ్స్ హైగా ఉంటాయని గుర్తించకపోతే ఎలా?
పిల్లలు *లెరనింగ్ బై ఇమిటేషన్* అనే ప్రక్రియ ద్వారా పదహారు భాషల దాకా అవలీలగా నేర్చుకోగలరనీ, అంచేత మాతృభాషని ముందు నేర్పుకుంటే, అవసరానికి మిగతా భాషలు నేర్చుకోగలరనీ ఎందుకు గుర్తించరూ అమెరికాలోని భారతీయులు, అందునా తెలుగువాళ్ళూ?
నాల్గు గోడలమధ్య, అదే ప్రపంచం అనుకుని, ఆ నాల్గు గోడల రాజ్యానికి తనే అధికారినని విర్రవీగుతూ, తీస్కునే నిర్ణయాలలో తప్పొప్పులు చెప్పే మహానుభావులు లేక, సరిచేసే పెద్ద హస్తంలేక చేసే పనులవల్ల, మన సంస్కృతి భూస్తాపితం అవుతుందని గుర్తించు!!
ఒక మెక్సికన్ తన పిల్లలతో స్పానిష్ లోనే మాట్లాడతాడు
ఒక మెక్సికన్ తన సహ మెక్సికనులతో స్పానిష్ భాషలోనే సంభాషిస్తాడు
ఒక పనామా వాసి తన పిల్లలతో స్పానిష్ లోనే మాట్లాడతాడు
ఒక బ్రజీలియన్ తన పిల్లలతో పోర్చుగీసులోనే మాట్లాడతాడు
ఒక తెలుగువాడు తన పిల్లలతో ఆంగ్లంలో ఎందుకు మాట్లాడాలీ?

Mar 23, 2012

ఉగాది ముగ్గులు

ఏ పండక్కైనా హైందవ స్త్రీలు ముందు చేసేది, ఇల్లు అలికి ముగ్గులు వేయటం.
మరి మా హోము గారు కూడా అదేబాటలో ముగ్గులు వేద్దామని పూనుకున్నారు. పిల్లలిద్దరికీ ఈ ముగ్గు, చుక్కలు, మెలికలు భలే నచ్చాయి. కేరింతలు పెట్టారు. వావ్!! అమ్మా!! నువ్వు డిజైనర్వి, ఆర్టిస్టువి అని పొగిడి, మేవూ వేస్తాం మెవూ వేస్తాం అని చెరొక నోటుపుస్తకం లాక్కొచ్చుక్కుని కూర్చున్నారు. పాపం అనఘకి ఇంకా అంత రాలేదు కావున ఇలా వేసింది


సూరిగాడు తల్లి గీసిన ముగ్గుని ఇలా వేసి *నఖలు పిల్లి* అనిపించుకున్నాడు


వాళ్ళ అమ్మ వేసింది ఇది


ఏదేవైనా
యావత్ తెలుఁగు దేశానికి
నందన ఉగాది మేల్తలపులు

Mar 22, 2012

ఏది నిజం? ఏది మాయ?

వేదాంతి వెంట ఒక ఏనుగు తరుముతుంటే, అతడు తప్పించుకోడానికి పరిగెడుతున్నాడు. అప్పుడు అతనికి ఎదురైన ఒక సామాన్యుడు. :
స్వామీ అంతా మాయ అన్నారుగదా మరి ఏనుగు మిథ్య అయితే తమరు పరుగెత్తడం దేనికి అని సందేహం వెలిబుచ్చాడు. గోచీ చేతబుచ్చుకుని రొప్పుతూ, పరిగెత్తడం కూడా మిథ్యే నాయనా అన్నాడట !
ఇంతకూ ఏది నిజం ? ఏది మాజిక్ ?


అదన్నమాట!! ఏనుగు తరువుతున్నది కేవలం వేదాంతినే, ఏనుగులు సామాన్యుడిని తరవవు. అంచేత, ఏనుగు తరువుకుంటూ వస్తున్న వేదాంతిని, నింపాదిగా, హాయిగా అలా నిల్చుని ఏటి వేదాంతీ అని అడుగుతున్నాడన్న మాట సామాన్యుడు.
తరువుతున్నది ఏనుగు - భౌతికాంగా కనిపిస్తున్నదా?
*మరి ఏనుగు మిథ్య అయితే?* అంటారేవిటీ ఇన్నయ్యగారు?
ఫండమెంటల్స్ లోనే తప్పటడుగులు వేసి ఇదే జీవితం అనే మిథ్యా ప్రపంచంలో విహరిస్తూ ఏనుగులు కేవలం వేదాంతులనే వెంటాడతాయనుకుంటూ అనువాదాలు పుంఖానుపుంఖాలు గోచీ ఊడగొట్టుకుని మరీ ప్రచురించి ప్రయోజనం ఏవిటీ?
సరీసృపాలు అంటే డైనోసార్లా?
ఉన్నదంతా నిజం అని ఎలా చెప్తారూ?

మరి మాజిక్, మాయ సృష్టి సంగతేమిటి.. వేదాంతులు చెప్పే సంగతులేమిటి?
మాజిక్కుకీ వేదాంతానికి సంబంధం ఏవిటయ్యా ఇన్నయ్యా?
ఆధ్యాత్మిక వ్యాపారమా? భలే ఉందే!! నక్షత్రాలు జ్యోతిషాలూ అంటూ మీ సంతతి వార్తాస్రవంతుల్లో కాలమ్స్ వ్రాయటం వ్యాపారం కాదు. ఆధ్యాత్మికత, వేదాంతాం మాత్రం వ్యాపారం అవుతుంది.

మరికొందరు ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా తీసుకొని, దైవం, ఆధ్యాత్మిక శక్తి, యిత్యాదులు అల్లేస్తారు. క్రమంగా మోసాల గూడు కడతారు. అది మానవ ద్రోహం.

చదువరుల బలహీనతలను ఆసరాగా తీస్కుని వార్తాపత్రికలలో జ్యోతిషాలను వ్రాయటం కూడా మోసమే కదా? మానవ ద్రోహమే కదా? ఎందుకు ఇలా ద్రోహం చేస్తున్నారు ఇన్నయ్యగారూ?

సైన్స్.లో ఎంతో మాజిక్, మాయవుంది. దానిని పొరలుగా విప్పి చూపుతుంది. అది మానవ ప్రయోజనం. ప్రకృతిలో జరిగిన జరుగుతున్న క్రమ మార్పుల్ని గ్రహించిన ఛార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పాడు. సహజంగా ఎంపిక చేసుకుంటూ మార్పులు జరిగే తీరు ఓపికగా గ్రహించి, చూపాడు. దీని వెనుక దైవసృష్టి వున్నదంటూ, పవిత్ర గ్రంథాలు రాసి, జనాన్ని మానసిక దాసులుగా మార్చేశారు.
ఆహా!! ఎన్నాళ్ళకు ఒక్క నిజాన్ని ఉటంకించారు. నిజ్జం. డార్విన్ దేశపు పవిత్ర గ్రంథాలు జనాన్ని మానసిక దాసులుగా చేసాయి, చేస్తున్నాయి. అంతటితో ఆగక, హైందవ రాజ్యాన్ని ధనాశతో మార్చేస్తున్నాయి, తమవైపుకి తిప్పుకుంటున్నాయి. మీబోటివాళ్ళు దాన్ని అడ్డుకోక, సహకరిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ నిజాలు ఆ భ్రమల్ని మాయల్ని తొలగిస్తూ పోతున్నది. దీనికి మరెంతో కాలం పట్టొచ్చు.
ఎక్కడదకా వచ్చిందేవిటీ? వాషింగుటన్ను దాకా వచ్చెనా?
http://innaiahn.blogspot.com/2012/03/blog-post_20.html

Mar 17, 2012

ఐప్యాడు మూడు


అదన్నమాట సంగతి. ఈపొద్దు ఉర్కుతాబోయి ఐప్యాడు కొనక్కొచ్చినా. రాంగనే ముందర ఈనాడు.నెట్, రమాకాంరతావు.బ్లాగుస్పాటు.కాము అని కొట్టుచూసినా. క్రిస్టల్ క్లియర్ గా ఉంది కథ

ఫోటో చెప్పలేనంత క్లియర్గా ఉంది
హోము గారితో ముఖసమయం (బుర్ర తిరిగిందా? అనగా! ఫేస్ టైం అని, అదియునూ తెలవదు తమకు...) ద్వారా మాట్లాడినాను, ఐఫోనుకి కాలు చెయ్యి చేసి. ఎక్సలెంటుగా ఉంది కథ.

ఇట్టా తీసింది నన్ను ఐప్యాడు ఈప్యాడు పుటోబు కసక్కున

Mar 10, 2012

రాట్నంవడికేటి సేతుల్ల టీవీ రిమోట్లొచ్చె

మితృడు లక్ష్మీ నరేష్ ఇట్టా ఓ టపా ఏసినాడు
మీలో ఎంత మందికి వ్యవసాయం చెయ్యాలని ఉంది....ఈ జీవితానికి దూరం గా, పచ్చని పొలాల మద్య సేద తీరుతు, అలిసిపోఏంత పని చేసి చద్దన్నం ఆవురావురు మంటూ తిని...మద్యాన్నం కాగానే మర్రి చెట్టు కింద ఓ కునుకు తీసి పొద్దు వాలేప్పుడు ..బారులు తీరిన పక్షులతో పాటు మనము ఇంటికి చేరి, వేడి వేడి అన్నం లో రోట్లో తొక్కినా పచ్చడి, నెయ్యి పప్పు ...గడ్డ పెరుగుతో ముగించి...ఆరు బయట మంచం వేసుకొని ఎద్దుల కట్టిన మువ్వల సవ్వడి వింటూ...పుచ్చ పువ్వుల విరిసిన వెన్నల్లో లేదా చుక్కలు నిండిన ఆకాశాన్ని చూస్తూ రేపటి కోసం ఆలోచిస్తూ నిదురలోకి జారుకుంటే...ఉదయాన్నే తొలి కోడి మీకు మేలు కొలుపు పాడి మిమ్మల్ని నిద్ర లేపి సూరిడోచ్చే వేళకి బద్ధకం ఆమడ దూరం పారిపోయి...ఇది మనకి దేవుడిచ్చింది...మరి మనం దేనికోసం వెతుకుతున్నాం....ఉన్నారా మీరంతా, మీ EMI అన్ని తీర్చేయండి, మనలా మన పిల్లల్ని మండల ప్రాధమిక పాఠశాలా లో చేర్పించండి.....అందరం కల్సి ఎడ్లు కట్టి , పొద్దునే పొలం పోదాం...ప్రతి వారం టౌన్ కెళ్ళి రెండో ఆట చూద్దాం...ప్రతి ఏడు జరిగే తిరునాళ్ళ కెళ్దాం...మన ఊర్లో ఆటలా పోటీలు పెడదాం...మళ్ళి పల్లెల్ని బ్రతికిద్దాం..మనం బ్రతుకుదాం....ఏముంది ఈ జీవితం...ప్రకృతి ఇచ్చిన చల్ల గాలిని AC తో నింపాం,కలుషితం చేసాం ...పారే ఏటిని కలుషితం చేసాం....భూ జలాలు లేకుండా తూట్లు పొడిచాం..ఎం చేస్తే మనకి శాంతి ...మీలోకి ఓ సరి తొంగి చూడండి...మీరు ఎక్కడో ఓ మూలాన బిక్కు బిక్కు మంటూ కూర్చుని ఉంటారు...ఓ సారి నోరు తెరిచే అవకాశం ఇస్తే ఇదే చెప్తారు....మరి మీరేమంటారు....నాకు సమాధానం కావాలి...చేయలేమా అలా...

నా సమాధానం

గిప్పుడా మఱ్ఱిచెట్లూపాయే
గాలీ పాయే
మువ్వలూపాయే
పట్టెడగంటలూ పాయే
యాడ్జూసినా కలుస్జితం
నీళ్ళులేవు
సెట్లు లేవు
అన్నీ కొట్టేసిన్రు తుక్కునాకొడుకులు
కరెంటుగావాల పెద్దానికి
డీజిలుగావాల దున్ననీకి
ఎడ్లు ఎవునింట ఉన్యాయీ? సీపెట్టూ?
పొలాలగొట్టిన యూరియా దెబ్బకి నీళ్ళంతా ఎరువుకంపే కొడతాఉన్యాది
సెట్టు పుట్ట ఇల్లూ వాకిలి ఎరువుకంపు
పెతోడు ఎరువుకంపు
పాడి పాడెక్కనే ఎక్కినాది
సిక్కంకట్టిన దూడలు కలల్లోనే మిగిలె
రాట్నంవడికేటి సేతుల్ల టీవీ రిమోట్లొచ్చె
రోట్లో పోటేసే సేతులు ఊరక కూసోబట్టినై
తిరగలి సిరామిక్ టైల్స్ కిందకిబాయె
బావుల గిలకలు తుప్పుబట్టిపాయె
సేంతాళ్ళు ఎవునికి తెలుసూ
ఎద్దులకు గట్టే ముక్కుతాళ్ళను నేసిన చేతులు ట్రాక్టరు స్టీరింగు తిప్పుతన్నయి
యాభై బుంగలు నీళ్ళు తోడి కాగులు మోసిన గూడలు మోటరు స్పిచ్చులు ఏస్చన్నయి
బగమంతుడా, ఏంసిచ్చరా నాయనా
పొట్టసేతపట్టుకుని పట్నాలకు అంపించినావు మమ్ముల్ని
థూ!! ఎదవబతుకైపోయనే!! దేవుడా

Mar 6, 2012

పా౨స్టల్ ఆర్ట్ బై అనఘ

నిన్న మధ్యాహ్నం ఓ అరగంట ఎక్కువ నిద్రపోయినందుకు రాత్రి పదిన్నరదాకా ఆడింది అనఘ. పదింటప్పుడు కార్పెట్ మీద కూర్చుని, ఏదో పాడుకుంటూ సూరిగాడి ఆయిల్ పా౨స్టెల్ తీస్కుని ఇలా గీసింది.
వాటి డిస్క్రిప్షన్స్ గట్రా పక్కనపెడితే, పిల్లల బుల్లి బుల్లిచేతుల్లో ఇంత సృజనాత్మకత ఉంటుందా అనిపిస్తుంది, అలానే ఆ సృజనత్మకతకి మూలమైన వారి చిన్న బుల్లి మైండు. అబ్బురపరుస్తాయ్ ఒక్కోమారు.

Mar 2, 2012

రోడ్డెమ్మట, గోడలనిండా సుట్టూతా నా వాళ్ల రక్తం సాక్ష్యంగ.......

వాడు నవ్వుతున్నడు
ముక్కలైన జన దేహం
పగిలి వక్కలౌతున్న కుటుంబాలు నా కళ్ళల్లో

పొద్దున్నే లేచి బువ్వ డబ్బాకెత్తుకుని
ఎప్పట్లాగనే అదే దారిలో
పనికోసం పొట్టకోసం
రోడ్డంతా నా వాళ్ళ రక్తం

చెల్లాచెదురైన దేహఖండాల మధ్య నిలబడ్డ మృగం
చేతిలోని రిమోటుని ఎగరేస్తూ గర్వంగా నవ్వుకుంటూ
ముఖాన చిందిపడ్డ రక్తాన్ని నిర్లక్ష్యంగా తుడుచుకుంటూ
కాలిన దేహాల్లోంచి వచ్చే పొగని ఆశ్వాదిస్తూ

నిర్లక్ష్యం
జిందగీ పొడుగూతా...

వాడు నవ్వుతున్నడు
అస్మంటోళ్ళు అందరూ నవ్వుతున్నరు
సందు సివర బాంబుపెట్టిన ప్రతోడు నవ్వుతున్నడు
అమాయకుల ప్రాణాలు తునాతునకలుజేసిన ప్రతోడు
గర్వంగా హేయంగా విలాసంగా జేబులనిండిన బలంతో నవ్వుతున్నడు
రోడ్డెమ్మట, గోడలనిండా సుట్టూతా నా వాళ్ల రక్తం సాక్ష్యంగ.......

(నా గుండె లోతులనుండి ఈ మంట)

Mar 1, 2012

నా రగతం మరగదా?

నేను ఈ దేశంలోనే పుట్టినా
కొన్ని వేల ఎండ్లుగా ఇక్కడ్నే
బతికి బట్టకట్టింది నా జాతి
నల్దిక్కులా నమ్మిన మతానికి
కన్పడని ఓ బలాన్కి గుళ్ళు కట్టింది నా జాతి
ఎక్కడ్నుండి ఊడిపడిండో తెల్వదు
కొడుకు, వంకర కత్తుల్తో
శాంతితో
ప్రశాంతంగా
వెల్గుతున్న నా ఇండ్లలోనికి
కుశాలుగా వెళ్తున్న జీవితాల్లోకి
బలవంతంగా సొచ్చుకుని ఒచ్చినాడు కొడుకు
కత్తి చేతబూని
రక్తం మరకల కత్తి
నా నమ్మకాలను నేలకంట కూలగొట్టిండు
ఎందర్ని సంపిండో కొడుకు
వచ్చినోడు కన్పడ్డ కుతికని
తెగ నరికిండు
జాలిలా
దయలా
పిల్లలని జుడలా
పెద్దలని జూడలా
కన్పించిన ఆడదాన్ని చెరిచిండు
కన్పించిన ప్రాణాన్ని నరికిండు
తెగ నరికిండు
నా మతంల మారు అన్నడు
నా మతం కానోడు కాఫిర్ అన్నడు
నా గుళ్ళను కూల్చిండు
నా జాతి మానాన్ని దోచిందు
నా జాతి ప్రాణాలను దోచిండు
అరె, ఇప్పుడేమైందిబై?
మతం మారిన కొడుకు
మరో దేశం గావాలె అన్నడు
నా దేశాన్ని ముక్కలుజేపించిండు
సరే, పో!! ఫైసల్. ఖతం అనుకుంటి
లే!! అప్పట్నుండి ప్రతేళ
పక్కలో బల్లెం
పొడుస్తనే ఉన్నడు
రైల్ల పోతుంటే, నిప్పుపెట్టిండు
కాలికట్టైన ప్రాణాలని జూసి
నే కన్నెర్ర జేయగూడదు
కిందా పైన సేపెట్టి మూస్కుని కూకోవాలె
ఏం? ఎందుకు?
నే మనిడిసిని కాదా?
నాలో రగతం లేదా?
న రగతం ఎరుపెక్కదా?
నేను నీకూ, ఎన్నెముకలేని ప్రభుత్వానికి వెట్టోణ్ణా?
నా రగతం మరగదా?
నా ప్రాణం ప్రాణం గాదా?
నా జనం ప్రాణం ప్రాణం గాదా?


'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా
దూస్రీబార్ బచీ జాన్‌
తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా'
                               - గుజరాత్ గోడ మీది వాక్యాలు

Feb 21, 2012

మాతృభాషా దినోత్సవం(ట)

మాతృభాషా దినోత్సవమ్
భలే ఉంది కదూ
మాత, భాష, దిన, ఉత్సవం
అంతా సంస్కృతమే.
సరే!! మాతృభాషాదినోత్సవ సందర్భంగా ఏంచేసావ్? అని ఓ ప్రశ్న.
నా ముచ్చట చెబుతా విను.
ఇయ్యాల్నే మొట్టమొదటిసారి ఇంటా ఉన్నా ఈ దినోత్సవాన్ని. ఇంక ఏంజేసినా ఈయ్యాల?
మామూలుగానే లేచినా,
పండ్లు తోమినా
బువ్వ తిన్నా
పిల్కాయల్తో మాట్లాడినా
ఆడినా
పాడినా
పనికొచ్చినా
పనిజేసినా
....
....
.....

ఇంకేంజేయాలే?
మాతృభాషాభివృద్ధికి ఏం జేసినా అనా నీ ప్రశ్న. మరట్టాజెప్పు.
కిం.ప.దొ.న.
భాషాభివృద్ధికి మనం ఏంజేయాలా? ఏం జేసేపనిల్యా. తెలుగులో మాట్టాడు, అదే నిల్చిద్ది.
భాషని రక్షించాలంటే
నెట్లో తెలుగులో టైపించినంతమాత్రాన భాష బతకదు. భాష అనేటిది ఓలటైల్. మాట్లాడాల. మాట్లాడకపోతే భాష పోయిద్ది. భాషని నిల్చుకోబెట్టాల్నంటే, ఆ భాషలో మాట్లాడాల. ఆంగ్ల మాధ్యమాన్ని పక్కనపెట్టాల. టింగ్లిష్ బందుజేయాల. టీవీలల్లో తింగరి తెలుగు ఆపేయాల. సినిమల్లో పిచ్చి తెలుగుని ఆపేయాల. పిల్లల్తో తెలుగులోనే మాట్లాడాల. తెలుగు మాట్లాడమని వాళ్ళకి ప్రోత్సహించాల.
నిన్న సూరిగాడి కరాటే క్లాసులో ఓ పెద్ద కుటుంబాన్ని చూసా. వాళ్ళ పిల్లలు నలుగురు కరాటే నేర్చుకుంటుంన్నారు. వాళ్ళంతా కమ్మగా స్పానిష్లో మాట్లాడుకుంటున్నారు. పిల్లల్తో కూడా స్పానిష్లోనే. ఆపిల్లలూ స్పానిష్లోనే జవాబిస్తున్నారు. మిగతా జనాలతో ఆంగ్లంలో జవాబు ఇస్తున్నారు. మన తెలుగువాళ్ళో? పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడతారు.
సమస్య ఎక్కడా?
సమస్య తల్లితండ్రులే. ఎందుకూ?
పిల్లలకు భాష అనేది లెర్నింగ్ బై ఇమిటేషన్ ద్వారా వచ్చేస్తుంది. అంటే విను నేర్చుకో, చూసి నేర్చుకో, అనుకరణ స్వారా నేర్చుకో. భార్యా భర్తా తెలుగులో మాట్లాడుకుంటారు. పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడితే, అది లెర్నింగ్ కర్వ‌ని బ్రేక్ చేయటంలేదా? ఆలోచించండి.
భాషని బ్రతికించుకోవాలంటే ఇలాంటివి మానేసి, చక్కగా తెలుగులోనే మాట్లాడుకోవాలి. పిల్లల్తో తెలుగులోనే మాట్లాడాలి. వారినీ తెలుగులో జవాబివ్వమని చెప్పుకోవాలి.
ప్రింట్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా తెలుగు అచ్చువేసినా ఉపయోగం లేదు. భాష మాట్లాడితేనే నిలిచేది. దాని లోతు తెలిసేది. భావాన్ని అర్థవంతంగా చెప్పగలిగేది.

సరే, ఇషయానికొస్తే, ఈయ్యాల రోజుట్లాగనే మా పిల్కాయలతో తెలుగులోనే మాట్లాడినాను. వాళ్ళూ తెలుగులోనే సమాధానం చెప్పినారు. ప్రత్యేకంగా మాతృభాషా దినోత్సవాన్ని నేనేతే ఏం చేస్కోలేదు, చేయలేదు.

Feb 14, 2012

అనఘ ఆర్ట్

ఇది అనఘ గీసిన బొమ్మ
ఏం అర్థమైందీ?
సరే సెప్తా ఇనుకో!!
౧. వాడబ్బా!! అర్థం అవ్వలేదా? మబ్బులు
౨. ఇల్లు
౩. గాలి. ఏటి? గాలిని గీసిందా అనుకోమాక. మా ఇష్టం. దేన్నైనా గీస్తాం.
౪. చెట్లు
౫. గడ్డి

Feb 8, 2012

జగన్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్లు

జగన్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్లు, రాళ్లు
నకరికల్లు, రొంపిచర్ల, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో జగన్‌ ఓదార్పు యాత్ర ఉద్రిక్తత నడుమ సాగింది. కుంకలగుంటలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు, రాళ్లను విసిరారు.
[ బుధవారం, ఫిబ్రవరి 08, 2012 ఈనాడు]

కొంతకాలం క్రితం తాత ఇలా చెప్పుకొచ్చాడు -

దేశంలో 42శాతం మంది పిల్లలు బరువు తక్కువగా ఉండటం దేశానికే సిగ్గుచేటు. పౌష్టికాహారలోపం సమస్య పరిష్కారానికి కేవలం ఐసీడీఎస్‌పైనే ఆధారపడలేం. పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న జిల్లాలు, అందుకు కారణమవుతున్న పరిస్థితులున్నజిల్లాలపై మనం దృష్టిసారించాలి
-తాత [ప్రధానమంత్రి]

కాబట్టి,
బాబులూ, రాజకీయ దురంధరులూ, రాజకీయ వి-నాయకులూ, డబ్బిస్తే ఏవైనా చేసే కుంకలూ, దగుల్బాజీలూ!!
ఒక్కమారు ఆలకించండి. మీ చుట్టూతా చూడండి. తిండికిలేక మలమల మాడుతున్న జనారరణ్యపు చేతగాని ప్రాణులను చూడండి. కారుమీద గుడ్లు వేస్తే వచ్చేదేవీలేదు. సదరు కారుకే తగిలేది. అవి ఆ కారులోని వ్యక్తికి తగిలినా పేద్ద జరిగేదేవీలేదు. మీరు ఇండ్లకెళ్ళి ఈ పనికిమాలిన పనితో సమ్పాదించిన డబ్బుతో మందుకొడతారు. సదరు వ్యక్తి ఇంటికెళ్ళి గుడ్లు కడిగేస్కుని మందుకొడతాడు
ఎనుబోతు మీద వాన కురిస్తే ఏటౌద్దీ?
ఎక్కడా మార్పు రాదు
ఎవడూ మారడు
ఇంత మాత్రం దానికి గుడ్లు వృద్ధా చేస్తారా?
వాటిని అన్నార్తులకు పంచండి

దయతో!!!

Feb 3, 2012

వేదంలో ఏవుంది ఇన్నయ్యగారూ?

ఇన్నయ్య గారి పుస్తకంట అబద్ధాల వేట నిజాల బాట
http://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/
అందులోండి ఓ తుంపర-

వేదాల్లో ఏముంది?
ఇక వేదాల్లో ఏముంది? అనే వ్యాసంలో ప్రాచీన కాలంలో ఎందరో ఆలోచనాపరులు (మన భాషలో రుషులు) ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసినవే వేదాలు. ఇవి సంప్రదాయ బద్ధంగా, గురువునుంచి శిష్యునికి అలా… అలా… గుర్తున్నంత వరకూ ఆనోటా, యీనోటా నాని ప్రజలలోకి ప్రచారంలోకి వచ్చాయి. దీనికి మూల రచయిత ఫలానా అని చెప్పలేము. అలాంటి రచనలకు దివ్యత్వాన్ని ఆపాదించారు. ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు – ఏదో ఉజ్జాయింపుగా చెప్పటమే. ప్రతిదానికీ దేవుడే కారణమని నమ్మారు అప్పటివారు. దయానందుడు సైతం కులాన్ని కాదన్నా వేదాలలోని వర్ణ వ్యవస్థకు వత్తాసు పలికాడు.వేదాలు నరబలిని అంగీకరించాయి. ఆ తరువాత వచ్చిన బ్రిటీషు పాలకులు దీనిని నిషేధించారు. వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా సృష్టించాయి. శూద్రులు వారికి సేవ చేయాలన్నారు. వీరికి యజ్ఞం చేసే అర్హత లేదు. దయానందుడు ఎంత సంస్కరణ వాది అయినా శూద్రులు పితికిన పాలు కూడా అపవిత్రమన్నాడు. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలతో వ్యభిచరించవచ్చు. ఆ పని శూద్రులు బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు. ఇలాంటి తారతమ్యాలు జుగుప్సాహకర విషయాలు వేదాలలో ఉన్నట్లు ఈ వ్యాసంలో వివరించటం మనం చూస్తాం.

అహా!! ఎంతగొప్పగా ప్రశ్నించారండీ ఇన్నయ్య గారూ మరియూ వారి వకాల్తా పుచ్చుకుని బ్లాగులో వాక్రుచ్చినవారు.
వేదాల్లో ఏముందీ? ఔను మంచి ప్రశ్న. ఏవుందేవిటీ ఇన్నయ్యగారూ? తమరు ఎన్ని వేదాలు చదివారేవిటీ?

ప్రాచీన కాలంలో ఎందరో ఆలోచనాపరులు (మన భాషలో రుషులు) ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసినవే వేదాలు.
ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసారంటానికి మీవద్ద సాక్ష్యాలెంటీ?
ఏడుస్తూ కఠస్థం చేసుండాచ్చుగా? నిరూపించండి చూద్దాం!!
ఐతే! కఠస్థం చేసినవారు ఆలోచనాపరులు అంటారు.
మనభాషలో వాళ్ళు ఋషులు అన్నమాట.
అంటే ఋషులు ఆలోచనాపరులు. ------------------------------------ ౧ [దీన్ని అలా పెట్టుకుందాం. ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు]

ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు – ఏదో ఉజ్జాయింపుగా చెప్పటమే.
వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదా? నోటిమీదకొస్తే వెలుగు చూసినట్టుకాదా?
సరే, 1000 BC అనుకుందాం, తమరి కుదృష్టిలో వెలుగు చూట్టం = ప్రింట్ కావటం, ఓహో అప్పటికి ప్రింట్ అవ్వలేదంటారా? మరి మీరు వాషింగుటన్ను పోస్టులో జాతకాలు వేసి మీ పుత్ర రతనమ్ ద్వారా సంపాదించిన ధనంతో అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ పెట్టలేదుకదా. అది మీ తప్పు.

వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా సృష్టించాయి. శూద్రులు వారికి సేవ చేయాలన్నారు.
భలే భలే. ఏ వేదంలో చెప్పారండీ ఇది. ఒక్కమారు రిఫరెన్స్ చూపండి.
దయానందుడు ఎంత సంస్కరణ వాది అయినా శూద్రులు పితికిన పాలు కూడా అపవిత్రమన్నాడు.
దయానందుడు ఒంగోమన్నాడు. దానికీ వేదాలకీ సంబంధం ఎక్కడా?
బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలతో వ్యభిచరించవచ్చు. ఆ పని శూద్రులు బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు.
ఎవరన్నారుటా? మీరా? వేదాలా? ప్రూఫ్ ఏవిటీ? మీది నోరా మునిసిపాలిటీ పాయిఖానానా? ఏవయ్యా? బ్రాహ్మణులు అనకుండా ఒక్కలైను వ్రాయగలవా? థూ!
ఇలాంటి తారతమ్యాలు జుగుప్సాహకర విషయాలు వేదాలలో ఉన్నట్లు ఈ వ్యాసంలో వివరించటం మనం చూస్తాం.
ఇలాంటి జుగుప్సాకరమైన విషయాలు వేదాల్లో కాదు ఉంది, మీ ఇరుకైన మనసుల్లో.

Jan 26, 2012

అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్ష: సెంద్రబాబు

అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్ష
కృష్ణా జిల్లా పోరుబాటలో చంద్రబాబు హామీ
మచిలీపట్నం, ఏలూరు- న్యూస్‌టుడే

పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి రూ.లక్ష కేటాయిస్తాం

బాగుంది. ఎన్ని పేదల ఇళ్ళు ఉన్నాయీ ఆం.ప్ర లో?
పది = 10 లక్షలు
వంద = కోటి
వెయ్యి =
10 కోట్లు
పదివేలు = వంద కోట్లు
లక్ష = వెయ్యి కోట్లు
పదిలక్షలు = పదివేల కోట్లు
యాభై లక్షలు = యాభైవేల కోట్లు
ఎన్నేళ్ళిస్తావూ?
గెలిచిన ఏడాది?
పాలించినంత కాలం?

Jan 20, 2012

సేవ చేయండి... మతం గోల వద్దు

సేవ చేయండి... మతం గోల వద్దు
* మిషనరీలకు జైరాం రమేష్‌ సూచన
న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ క్రైస్తవ మిషనరీలకు పిలుపునిచ్చారు. అయితే... మతపరంగా ఎవరినీ ప్రభావితం చేయరాదని, లక్ష్మణరేఖ దాటరాదని ఆయన సూచించారు. ''దైవ ప్రేమను పొందిన వారు (కారిటాస్‌) మతమార్పిడి దిశగా ప్రయత్నించరనే అనుకుంటున్నాను'' అని రమేష్‌ వ్యాఖ్యానించారు. క్యాథలిక్‌ సంస్థ 'కారిటాస్‌ ఇండియా' స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించారు. ''ప్రభుత్వానికీ, గిరిజనులకూ మధ్య నమ్మకాన్ని ప్రోది చేయడమే మీ బాధ్యతకావాలి'' అని హితవు పలికారు.
ఈనాడు: 1/20/2012
ఇది జైరాం రమేశ్ మాటా? లేక కాంగ్రేస్ యోచనా? లేక మావోయిస్టుల సూచనా? లేక కమ్యూనిస్టుల యాచనా?

Jan 18, 2012

మార్టిన్ లూథర్ కింగ్ బర్త్‌డే!! - సూరిగాడి లెక్చర్

పోయిన శుక్రవారం బడినుండి ఇంటికి రాంగానే, నాన్నా! నీకు మార్టిన్ లూథర్ కింగ్ గురించి తెలుసా అని అడిగినాడు సూర్యా. తెల్సులేరా అన్నను. ఆయన గురించి తనకు తెల్సినవి చెప్పకొచ్చాడు. ఆశ్చర్యం వేసింది. జనవరి పదహారు సాయంత్రం వాడిచేత మళ్ళి చెప్పించి ఈసారి రికార్డు చేసాను.
ఇక్కడ వినచ్చు
http://bhaskar.posterous.com/94844773

Jan 13, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు


భోగి మంటలు, రంగవల్లులు, రథం ముగ్గులు, గొబ్బిళ్ల పాటలు,
మంగళ స్నానాలు, మామిడాకు తోరణాలు,
గంగిరెద్దు మేళాలు, హరిదాసు కీర్తనలు,
నిండు ధాన్యం తో గాదెలు, నోరేరె గారెలు, డబ్బాల్నిండా నేతి అరిసెలు,
కోడి పందెములు పోయిన రాజ్యాలు
వెరసి సంక్రాంతి సంబరాలు

-ఈ సంక్రాంతి మీ ఇంట నవ్వుల సంక్రాంతి కావాలని ఆశిస్తూ

మీ అందరకీ మా సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ ఇంట సంక్రాంతిలక్ష్మి "ధన లక్ష్మి" గా అవతరించాలని కోరుకుంటూ,


భాస్కర్, హరిత, సూర్య, అనఘ


సంక్రాంతి అంటే?
సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలాగే... మకరరాశిలో సూర్యుడు ప్రవేశించినపురోజుని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు శాస్త్ర, పురాణాల వాక్కు.
సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుందని శాస్త్ర వచనం

అందుచేత ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది... కాబట్టి.. దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతి సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే... ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. అంతే కాదు దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం దక్షిణాయనం లో మరణిస్తే ఉపాసన చేసుకునే అవకాశం పోతుందని పెద్దలు ఊర్ధ్వ ముఖ రేతస్సు కలవారు తమ మరణాన్ని ఉత్తరాయణంలో పొందేవారు. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంధ మరణాన్ని కోరుకున్నాడు.

రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టి ఆధ్యాత్మికంగా అందరూ పై పై మెట్లు ఎక్కాలని ఆశిస్తూ.
సర్వే జనాః సుఖినోభవంతు
[ధర్మస్థలం బ్లాగునుండి http://dharmasthalam.blogspot.com/2012/01/blog-post_13.html]

Jan 10, 2012

అనుసరించతగ్గ జాబితా (అజెండా)

మా గురువుగారు పంపిన మెయిలు.

* LIFE BOOK- AGENDA 2012 *

Health:

1. Drink plenty of water
2. Eat breakfast like a king, lunch like a prince and dinner like a beggar
3. Eat more foods that grow on trees and plants, and eat less food that is manufactured in plants (factories)
4. Live with the 3 Es -- Energy, Enthusiasm, and Empathy
5. *Make time for prayer*
6. Play more games
7. Read more books than you did last year
8. Sit in silence for at least 10 minutes each day
9. Sleep for 7 hours
10. Take a 10 to 30 minutes' walk every day - and while you walk, SMILE!


Personality:

11. Don't compare your life to others.' You have no idea what their journey is all about.
12. Don't have negative thoughts or things you cannot control. Instead invest your energy in the positive present moment.
13. Don't overdo; keep your limits
14. Don't take yourself so seriously; no one else does
15. Don't waste your precious energy on gossip
16. Dream more while you are awake
17. Envy is a waste of time. You already have all you need.
18. Forget issues of the past. Don't remind your partner with his/her mistakes of the past. That will ruin your present happiness.
19. Life is too short to waste time hating anyone. Don't hate others.
20. Make peace with your past so it won't spoil the present or future
21. No one is in charge of your happiness except you
22. Realize that life is a school and you are here to learn. Problems are simply part of the curriculum that appear and fade away like algebra class
but the lessons you learn will last a lifetime.
23. Smile and Laugh more
24. You don't have to win every argument. Agree to disagree.

Community:

25. Call your family often
26. Do a random act of kindness without expecting anything in return
27. Forgive everyone for everything
28. Spend time with people over the age of 70 & under the age of 6
29. Try to make at least three people smile each day
30. What other people think of you is none of your business
31. Your job won't take care of you when you are sick. Your family and friends will. Stay in touch.

Life:

32. Do the right things
33. Get rid of anything that isn't useful, beautiful or joyful
34. GOD heals everything
35. However good or bad a situation is, it will change. Nothing stays forever.
Everything is subject to change. Change unavoidable
36. *No matter how you feel, get up, dress up and show up ! *
37. The best is yet to come
38. When you awake alive in the morning, thank GOD for it
39. Your Inner most is always happy. So, be HAPPY!