Dec 22, 2008

వారాంతపు మంచుతుపాను

నిన్నటి వారం, శుక్రవారం నుండి-ఆదివారం వరకూ ఉత్తర అమెరికా మొత్తం మంచు దిబ్బలు దిబ్బలుగా పడింది. మాకు శుక్రవారం మద్యానం 12 మొదలై, శనివారం రాత్రికి కొంచెంతెరిపిచ్చి, ఆదివారం సాయంత్రం వరకూ కుమ్మేసింది. చికాగోలో జనాలు -24 ఫారెన్హైట్ విండ్చిల్ల్ చూసారని వార్త. జీవితం అంటె అంత సులభం కాదు అనిపిచటంలేదూ?

ఈ తుపాను ఫోటోలు, కొన్ని వీడియోలు ఇక్కడ పెడుతున్నా చూడండి.
మంచుతుపాను

10 comments:

 1. ఫోటోలు చూస్తుంటేనే వణుకొచ్చేస్తుంది.. అసలక్కడ ఎలా ఉండగలరు బాబోయ్!! కానీ తెల్లగా చూడటానికి చాలా బావుంది..

  మాకైతే (మయామి) ఈ వారాంతం కొంచెం వెచ్చబడింది.. అప్పటిదాకా క్లాజెట్ లో కాస్త వెనక్కి పోయిన షార్ట్స్ అన్నీ మళ్ళీ వెలుగుచూశాయి :-)

  ReplyDelete
 2. షికాగొనే మాది. కెనడా నుండి వచ్చాము కదా వణికిపోతే నవ్వుతారు!

  ReplyDelete
 3. @నిషిగంధా గారు: మిమ్మల్ని జూస్తుంటే కుళ్లుగా ఉంది. ఏంసేత్తాం, ఇంకో రెండు స్పెట్టర్లేస్కుని తొంగుంటాం, ఏటిసేత్తాం? పెపంచకం. ఏటీ సెయ్యలేం. :):)
  @శరత్ గారు: షికాగోలో ఎలా ఉంటారు అనేదో పెద్ద ప్రశ్న నాకు. మా అన్నయ్య కూడ అక్కడే ఉంటున్నాడు గత 7 సమచ్చరాలుగా. ఎలా అనేదో పెద్ద ప్రశ్న నాకు. ఆగాలికి, ఆ చలికి..ఉఫ్!!

  ReplyDelete
 4. మేము పోయిన వారం ఫ్లోరిడాలో ఉన్నాం. తిరిగి మా ఇంటికి (డెట్రాయిట్) వచ్చేసరికి మోకాళ్ళవరకు మంచు.

  ReplyDelete
 5. మంచు పడటాన్ని ఆపలేనప్పుడు, మంచు పడటాన్ని ఆనందించాలి. మేము snow చూడాలంటే ఎంతో ఖర్చు పెట్టి Lake Tahoe వెళ్లాలి. ఖర్చు లేకుండా మీ దగ్గరికే మంచు రావటం, మీ అదృష్టం. మీ మంచు చిత్రాలు చూశాక నాకు Mount Shastaa కు ఎప్పుడు వెల్దామా అనిపిస్తుంది.

  -cbrao
  San Jose, CA

  ReplyDelete
 6. భాస్కరా నిన్న ఆదివారం ఉదయం ఎనిమిదిగంటలప్పుడు మా ఇంటి దగ్గర విండ్ చిల్ అక్షరాలా -31F. ఇదే అత్యధికం అనుకుంటా ఈ ఏరియాలో... గాలులు 37 మైళ్ళ వేగంతో వీచాయి. దీని తస్సగొయ్య కొన్ని ఊర్లలో బస్ లు కూడా అంత స్పీడ్ బోవేమో అనిపించింది.

  రావు గారు, మంచు కిటికీలోనుండి చూడటం వరకైతే బాగానే ఆస్వాదించవచ్చండీ :-) కానీ, దాన్లోనే పడి వర్క్ కి, రోజువారీ పనులకి వెళ్ళాలంటే నరకమే.. అదీ మా చికాగో లాంటి చోట విండ్ చిల్ ఉంటుందీ.. ఏ చెవో వేలో మనకి తెలియకుండా ఊడి పడిపోయినా అశ్చర్య పోనక్కరలేదు.

  నిషిగంధ గారు మీ మాటలు వింటుంటే అసూయ మరీ పెరిగి పోతుందండీ :-)

  ReplyDelete
 7. @cbrao:
  >>మంచు పడటాన్ని ఆపలేనప్పుడు, మంచు పడటాన్ని ఆనందించాలి.
  భలే చెప్పారే!! నాకా ఆలోచన రాలేదు. కారు మీద పడిన మంచుని, ఆ గడ్డకట్టుకుపోయే చలిలో చేతులు కొంకర్లుపోతూ శుభ్రం చేస్కునేప్పుడు "ఆనందించాలి" అనే ఆలోచన రాలేదు. పిల్లోడు బయటకి బయటకీ అని ఏడుస్తుంటే తీస్కెళ్లలేని నా నిస్సహాయతకి "ఆనందించాలి" అనే ఆలోచన రాలేదు. ఈ సారి ప్రయత్నిస్తా.
  @వేణు శ్రీకాంత్: ఇదంతా మీ ఇల్లినోయి వాళ్ల కుట్ర. మీరు అటునుండి మా వైపుకు నెట్టారు. :):) Stay Warm Brother.

  ReplyDelete
 8. నిన్న మాకు విండ్ చిల్ -30.ఈ రోజు కాస్త పర్లేదు -8 మాత్రమే.అందుకు పండగ చేసుకుంటున్నాము.భాస్కర్ గారు బాగా చెప్పారు.కారు చక్రాలు స్కేటింగ్ వీల్స్ లా తిరిగిపోతుంటే గుండె జారిపోతుంటే ఆనందిచడం ఎలాగో నాకు అస్సలు తెలీదు.కారి మీద,అసలు కారు బయటకి లాగడానికి చుట్టూ క్లీన్ చేసే సరికి పగలే చుక్కలు కనిపిస్తుంటే అదేంటో అస్సలు ఆనందించలేకపోతున్నాను.పిల్లలకి నెలలో 20 రోజులు జలుబు,2 సార్లు జ్వరాలు వస్తుంటే ఆనందించడం నాకూ తెలియదు.మీరన్నట్టు బయట ఆడుకుందాము అని పిల్లాడు అడిగితే తప్పని పరిస్థితుల్లో కంప్యూటర్ గేంసు చేతికిచ్చి అసహనంగా చూస్తూ ఆనందించలేకపోతున్నాను.ఇంట్లో నువ్వాడొచ్చు కదా అంటారేమో ంత కాదన్నా 3,నాలుగ్గంటలు మించి మనతో ఆడితే బోరెత్తిపోతారు కదా.ఇక్కడికి వచ్చిన కొత్తలో నేనూ మంచు చూసి ముచ్చటపడిన దానినే.ఇప్పటికీ పూలవానలా పడుతూన మంచు ఆనందిస్తాను.కానీ కష్టాలన్ని తరువాతే వుంటాయి.

  ReplyDelete
 9. రాధిక గారు: మంచుకురిసిన, లేక కురుస్తున్న ఆనందంకన్నా, దీంతో జీవించాలి అనే భావన వెయ్యి రెట్లు కష్టంగా ఉంది.మరోవిషయం, మంచుకురిసాక ఉండే కష్టలు. ఆ చలి, నాకు వేళ్లు నొప్పులు వస్తుంటయ్ అప్పుడప్పుడు. గరాజ్లో పార్క్ చేసి, ఆఫీసుకు వెళ్లే 5 నిమిషాల్లో కళ్లల్లోంచి నీళ్లుకారతాయ్ చల్లటి గాలికి. మొహం ఎంతకప్పేసుకున్నా, ఆ గాలికి మొహమ్మీద కత్తిపెట్టి కోసినట్టు చిటచిట లాడుతూ ఉంటుంది. ఈ చలికి ఎంత క్రీమురాసుకున్నా వళ్లంతా పగిలి చెక్కులుకడుతుంది .

  ReplyDelete
 10. ప్రతి వింటర్లోనూ ఛ,ఈ మిషిగన్‌ వదిలేసి ఎక్కడికన్నా దక్షిణం వైపు వలస పోతే బాగుణ్ణనే వైరాగ్యం ఏప్రిల్‌,మే నెలల్లో వసంతం రాగానే ఎగిరిపోతుంటుంది. మేమూ ఓ 10 రోజుల పాటు ఫ్లోరిడా వెళ్ళి నిషి చెప్తున్న మయామీ కూడా దర్శించి రాత్రే ఈ మంచుగుండం లోకి తిరిగొచ్చాము :(

  ReplyDelete