Sep 9, 2008

"ఉచితం" ఎంతవరకు ఉచితం

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కనుచూపు మేఱలోకి వచ్చినై. అందరూ అది ఉచితం ఇది ఉచితం అంటున్నరు.
అస్సలు ఈ "ఉచితం" ఎంతవరకు ఉచితం?
మనం స్వాతంత్రానికి షష్టిపీర్తి జేసాం. ఆనాటి గాంధీ కాడ్నించి ఈయ్యాల్టి గాంధీ వఱకూ, ఆయాల్టి పైం మినిష్టర్ కాడ్నించి ఈయ్యాల్టి పైం మినిష్టర్ వఱకూ, ఆనాటి ముక్యమంత్రి కాడ్నుంచి ఇయ్యాల్టి ముక్యమంత్రి వఱకూ, ప్రతీవోడు పేదరికం నిర్మూలన, పేదరికాన్ని మన దేశంలోచి తరిమేద్దాం, పేదరికం నిర్మూలనకి పెపంచ బాంకు కాడ్నుంచి అప్పుతెద్దాం, శుభ్రంగా మిగుదాం అన్నోడే కానీ పన్జేసినోడు కనబడ్లా.

పైగా మనోళ్ళకి "ఉచిత" వరాలు ఇస్తున్నరు, కర్రేంటు ఉచితం, బియ్యం ఉచితం, గాలి ఉచితం, కాయితకం ఉచితం, తిండి ఉచితం, బట్ట ఉచితం, దొంగనా బట్ట ఉచితం, ఇద్దరాడపిల్లలుంటే సైకిలుచితం, ఇద్దరుపిల్లకాయలుంటే బస్సుపయాణం ఉచితం, ముగ్గురు మూర్ఖులుంటే సిలుమా(సినిమా)ఉచితం, రెండుకాళ్ళుంటే రోడ్డు మీద నడ్సుడుచితం,
రెండుకళ్ళుంటే సూపుచితం, వోటుబాంకు కి అన్నీఉచితం. ....
నీకు ఆయువుంటే బతుకుచితం.....

ఏందో ఈ కత...ఎంతవర్కు ఎన్ని ఉచితాలిస్తరో ఏందో??
అన్నా!! నీకేమైన అర్ధం ఐందా?

పేదోళ్ళు ఎక్కడైనా ఉన్నరు. అమ్రికాలో ఉన్నరు, జపానులో ఉన్నరు, జెర్మనీలో ఉన్నరు. మనకాడ ఎక్కువున్నరు అంతే తేడ.
ఐతే, పేదోనికి ఏంగావాలా? డబ్బిస్తే పేదోన్ని ఇంకా పేదోన్ని జేసినట్టే? మఱేంజేయ్యాల? వానికి కిలో బియ్యం రెండు రూకలకియ్యాల్నా? లేక వాని పొట్ట ఆడుపోసుకునేట్టు జేయ్యాల్నా? ఆడిపొట్ట ఆడుపోస్కునే మార్గం ఏది?
చారిత్రకంగా అణగారిన పెజానీకానికి "రిజర్వేషన్" ఇస్తే మంచిదా? లేక విద్యావిధానంలో మార్పు చేయ్యటం మంచిదా?

అన్నీ పశ్నలే...జవాబులు మాత్రంలేవు.....
సొతంత్రభారత్ లో అన్నీ పశ్నలే జవాబులుండవ్.
మన భారతంలో అన్నీ పశ్నలే...యెవుడయ్యా నువ్వు, ఏందీ పశ్నలేస్తన్నా? కొత్తా? జరుగు జరుగు...అభివృద్ధి బండొస్తోంది..అడ్డులే అడ్డులే...తొలగవయ్యా పక్కకి..అరేయ్ ఆడ్ని పక్కకి గుంజేయ్యాండ్రా...


9 comments:

  1. Baachi,

    Manchiga start chesi, elevation icchi conclude cheyyakunda vadhilesaav. Koddiga badha vesindhi.

    Still a nice one.

    -Srikanth

    ReplyDelete
  2. 'రెండుకాళ్ళుంటే రోడ్డు మీద నడ్సుడుచితం, రెండుకళ్ళుంటే సూపుచితం, వోటుబాంకు కి అన్నీఉచితం. ....' super

    ReplyDelete
  3. chEpalakoorapetti maayacheyatam vachchina naayakatvaaniki, chepalupaTTaTam nErpaalani vumDadu. somaripotulaina janamgooDaa tamastaayini aatmagouravaalanu marachipoyina vainam manajanaraajakeeyam,

    ReplyDelete
  4. మంచిగుందన్న మస్తుగ రాసినవ్

    ReplyDelete
  5. మారాలన్నా ఇయన్ని మారాల . . . అందరు తుడిషిపెట్టుకపోయి మరో మంచితరం రావాల ..

    ReplyDelete
  6. I have just forwarded this link to eenadu news paper.... they may publish it........

    nice one!!

    ReplyDelete
  7. అనంతానంత!! థాంక్సులు. మనకి ఈనాడు కి పడదు. సూద్దాం. ఎట్టా ఉన్నా? ఏంది సంగతులు..ఛాట్ లో కలుద్దాం తర్వాత...
    ఉంటా

    ReplyDelete
  8. Superb!!

    Why don't you publish this article in our "Heart and Soul of Andhrapradesh" i.e one and only one Newspaper "Eenadu"

    Thanks
    Revathi

    ReplyDelete