Nov 18, 2008

దీనిమీద ఓ కధ రాయగలరా?నాకిలా అనిపించింది:-
1. మా ఊరు పట్నానికి 100 కిలోమీటర్ల దూరమ్లో ఉంది. మాది ఓ చిన్న పల్లె. మొత్తం 1000 గడప. చిన్న సన్నకారు రైతులు, రోజువారి కూలీలు - అది మా కధ. మాకు వైద్యం అంటె నాటు వైద్యమే. ఆకులు నులిమి పసరు నోట్టో ఏస్కోటమో లేదా కళ్లల్లోనో ఏస్కోటం మాకు మామూలే. ఓ రోజున మా ఊళ్లోని సత్తెయ్యకి గుండెనొప్పి రావటం మొదలైంది. అతని వయ్యసు 76. కనా కష్టం మీద దగ్గర్లో ఉన్న ఆశుపత్రి కి నెట్టుకెళ్లాం, ట్రాట్టరు మీదనో, కిందనో పడి. అక్కడి ఆర్.యం.పి పట్నం తీస్కెళ్లండి అని చెప్పాడు సాధ్యమైనంత తొందరగా. ఎలా ఎలా అని ఆలోచిత్తాఉంటే, అక్కడ పనిజేసే ఎంకయ్య "ఆంబులెన్స్" అని ఓటుంటది, దాన్ని మాట్టాడుకోండి అనిజెప్పాడు. ఆ ఆంబులెన్సోడు ఇంత అంతా అని డిమాండు జేసాడు. పేదోని ప్రాణం, ముసలోడు, ఎవని ఇలువ వానికుంటది. సరేఅన్నరు ఆ ముస్సలోడి తరుపోళ్లు అన్నిటికి. ముసలోడ్ని దాంటోకి ఎక్కించారు. ఇక బండి కదుల్తుందనంగా, ఓ పెద్దాయన రయ్ మనుకుంటా వచ్చి ఆ "ఆంబులెన్స్" నడిపేవానితో ఏదోజెప్పాడు. ఒకైపు గుండె జబ్బు మనిషి, ఇంకోఐపు పోవాల్సింది సానా దూరం, మద్దలో ఈడెవుడురా అని జనాలు జూత్తుంటే, ఆ పెద్దోడి మడుసులొచ్చి సత్తెయ్యని కిందకీడ్చబొయ్యారు.
ఆ పెద్దోడు గొఱ్ఱెలేకదా పడిఉంటాయ్ అనుకున్నాడు. అట్ట ఇట్టా పోయే బండ్లు అన్నీ పోగై, ఆ పెద్దోడ్ని, "ఆంబులెన్స్" ని నిలదీసారు.
తర్వాత ఏంజరిగిందో అనవసరం.
2. "ఆంబులెన్స్" కుయ్యో కుయ్యో అనుకుంట రయ్ రయ్ మని వెళ్తా ఉంది. జనాలు అడ్డం తప్పుకుంటా పాపం ఎవుడున్నాడో లోన, ప్రాణాపాయమ్లో ఉన్నాడేమో అనుకుంట ఉన్నారు. ఇంతలో ఎవుడో జూసాడు లోన భాగోతం. ఓ డబ్బున్న దొరబాబు లోన కులుకుతా ఉన్నాడు. మరి ఇక జనం ఆగుతారా ఇలా నిలదీయ్యక.
3. "ఆంబులెన్స్" గుంటూరెళ్లాల, మాచారం నుంచి. బయల్దేరింది బండి, లోన ఎవుడో మనిషి కాలో సెయ్యో అనుకుంటా, ఇరిగినట్టుంది. రక్తం కారతంది. మరి బయల్దేరాక, కొండమోడుకాడికొచ్చేతలికి ట్రాఫిక్కు జామంట, అన్నీ బళ్లూ ఆగిపోయినయ్. నకెరికల్లైపు తిప్పడు "ఆంబులెన్స్" తోలేటోడు. ఎటుపోవాల్నో తెలీక బండి ఆపేసి అటెమ్మటెల్లేఓళ్లని అడుగుతుంటే సూడండి ఎంతమంది అట్టా గుంపుగూడారో.

6 comments:

 1. మా ఊరు పట్నానికి 100 కిలోమీటర్ల దూరమ్లో ఉంది. మాది ఓ చిన్న పల్లె. మొత్తం 1000 గడప.----
  అబ్బాయ్, మొదట్లోనే అడ్డం గొడుతున్నా,అసలు వెయ్యి గడపుండే ఊరు చిన్న పల్లె ఎట్టవ్వుద్ది?ఇంటికి నాలుగు నుంచి ఆరుగురిని లెక్కేసుకున్నా నాలుగు నుంచి ఆరువేల జనాభా ఉన్న మేజరు పంచాయితీ/మండలకేంద్రమౌద్ది గానీ,అట్టాంటి చోట సచ్చినట్టు కనీసం ప్రాధమిక ఆరోగ్యకేంద్రముండాలి...ఒక్కసారి ఈ యాంగిల్ లోకూడా చూడు,
  ఇక కద సంగతా నావల్ల కాదు :)

  ReplyDelete
 2. నాన్నాలూ నిద్దరొస్తోందండీ..బజ్జుంటా

  ReplyDelete
 3. ఈ జర్నలిస్టుల్తో ఇదే తంటా..ప్రతి దాంట్లో వాస్తవికత ఉండాలంటారు.
  రాజేంద్ర గారు,
  PHC ఉంటే సరి పోద్దా, అందులో డాక్టరు తో సహా మిగతావన్నీ ఉండొద్దా!మీరు మరీను, ఏమీ తెలియనట్టు...

  ReplyDelete
 4. పిల్లోళ్ళ బొమ్మలన్నీ పోగేసి మీరు అడేసుకుంటున్నారా!
  నాన్న గారు కాస్తా నానీ గాడు ఐపోయారా ఏంటి?

  ReplyDelete
 5. మరి రాస్తే నాకేంటి అంట ...అహా నాకు ఏంటి అని ???? (పిల్లాట -కిడ్డింగ్)

  ReplyDelete
 6. @రాజే అన్నాయ్: మీకు తెలవదల్లే ఉందే..మాయైపు 5000 గడపలున్న గ్రామాలు కూడా ఉన్నై.:):) సరే పంచాయితీకో PHC, హుం!! I Doubt. ఈమద్దన వచ్చాయేమో.
  @పప్పూ యార్: నిద్దుర పోరా తమ్ముడా
  @సుతాజ: మీరన్నదీ కరెక్టే, డాట్టరు ఉండలిగా PHC ఉన్నా
  @లలిత గారు: :) మా బుడ్డోడికి ఇలా ఎలా పెట్టాలి అనిపించిందో? నేను దఫ్తర్ కి బయల్దేరుతున్నా, ఇలా పెట్టాడు. ఠకా మని ఓ పోటో లాగవతలేసా.
  @చైసా: నాకేంటా??ఏంటబ్బా!! హుం!! మీపేరుజెప్పుకుని మీ కామెంట్ చదువుకుంటాం, పలాని పలాని ఇలా రాసారు అని :):) - పిల్లాట

  ReplyDelete