Jun 30, 2010

మా పల్నాడు

దుప్పలు దుప్పలు,
దుప్పలు దుప్పులు
చిన్న చిన్న గుబురులు,
రేగుల పొదలు,
ముళ్ళకంచెలు,
రాళ్ళు బళ్ళూ,
అడవి మనుషులు,
కొండలు కోనలూ
ఎండిన దారులు,
గుట్టలు గుట్టలు
నాపరాళ్ళు
మండే ఎండలు
ఎండే గుండెలు
నాగులేటి నీళ్ళు
పారిపోయిన లేళ్ళు
వెంటాడే పోలీసోళ్ళు
ఎఱ్ఱని కొడవళ్ళు
అడ్డంగా కంకులు
లేచిన పిడికిళ్ళు
చిన్న చిన్న మిరగాయలు
అద్దరగొట్టే కారాలు
ఎక్కడచూసినా గోగులు
పసుప్పచ్చ గోగిపూలు
నీళ్ళదారుల్లో
నానబెట్టిన గోగికాడలు
నల్లరేగడ్లో తెల్ల బంగారం
రాళ్ళగుట్టల్లో జానకాయలు
ఇళ్ళచూరుల్లో జానకఱ్ఱలు
గడ్డివాముల్లో తాచుపాములు
కోడిపందాలు
పొటేళ్ళ పోరాటాలు
బయనీడు వాయిద్యాలు
డప్పుల సవ్వళ్ళు
అర్ధంలేని అభిమానాలు
వికారమైన పంతాలు
టిపినీ డబ్బాల్లోంచి పెలే బాంబులు
కోరుటుల సుట్టూ జీవితాలు
వెరసి పల్నాడు
మా పల్నాడు

Jun 28, 2010

జ్ఞాపకాల దొంతర - ఏరువాక

మది పల్లెప్రాంతమైనా మాకు పొలాలు లేవు. ఎకరం భూమికూడా లేదు. ఐతే, చుట్టుపక్కలున్నవారికి ఉన్నాయి పొలాలు. గొడ్డుగోదా. ఆవూ గేదే అన్ని.
ఏరువాక పండగ అనేది కేవలం ఓ పండుగలాగనే నాకు తెలుసుగానీ మేమెప్పుడూ అందులో పాల్గోలేదు.
అలాంటిది ఓ ఏడాది నా మితృడు ఆహ్వానించాడు. నా జ్ఞాపకాలదొంతరలో అలా భద్రంగా ఉండిపోయిందా పండుగ.
ఆరోజు పొద్దున పొద్దునే వెళ్ళాను వాళ్ళింటికి. కోలాహలంగా ఉంది. రెండెడ్లనీ శుభ్రంగా కడిగాం. ఒకటి మహా కోపంగా ఉంటుంది. అది కేవలం మా మితృడి నాన్న మాటను మాత్రమే వింటుంది. ఆయన వచ్చారు, శుద్ధి కార్యక్రమం ముగిసింది. ఇంతలో మా మితృడి వాళ్ళ అమ్మగారు వంటలు ముగించారు. ఎడ్లను బండికి కట్టాము. పసుపుకుంకుమలు పెట్టారు బండికీ ఎద్దులకీ. బొట్లుపెట్టారు, హారతులిచ్చారు. గొఱ్ఱు కూడ ఎక్కించారు బండిలోకి.
ఇక మూటలు ముల్లెలు అన్నీ వేస్కుని పొలానికి బయల్దేరాం.
అక్కడకెళ్ళినాక, పొలం మధ్యలో బండిని నిలిపి, ఎడ్లను తీసేసి గొఱ్ఱుకి కట్టి, గొఱ్ఱుకి పసుపుకుంకుమ పెట్టి, హారతిచ్చి చదునుచేసారు. నా మితృడి నాన్న నన్ను కేకేసేడు. భాస్కరా రా నువ్వు చేయి అని. మొట్టమొదటిసారి, గొఱ్ఱు మీద కూర్చుని, పగ్గాలు పట్టుకుని, వంకరటింకరగా చాలు చేసాను. అలా కాదు ఇలా అని చూపించారు ఆయన. రెండూ లైని వంకలు లేకుండా మొత్తానికి లాగించా.
అప్పుడు మొదలైంది ప్రసాదాల కార్యక్రమం. పెద్ద డబ్బాలోంచి పరమాన్నం వేడివేడిగా, ఇంకో డబ్బలోంచి ఉత్తిపప్పు, చిన్న ముంతలోంచి నెయ్యి. పళ్ళెంలో పరమాన్నం పెట్టి, పైన పప్పేసి గుంట చెసి నిండుగా నెయ్యి పోసి ఇచ్చింది ఆ మహా తల్లి. ఇదేందిదీ అన్నా. పరమాన్నంలో పప్పా అన్నా అర్ధంకాక. నే ఎప్పుడూ అలా తినలా మరి. తినిచూడు అన్నారందరూ. పరమాన్నంలో పప్పు కలుపుకుని నెయ్యి కుమ్మి తినటం ఎప్పటికీ మర్చిపోలేను.
పొట్టనిండా తిన్నాక పక్కనే కాలవలో చల్లగా నీళ్ళు తాగి బండి కట్టుకుని బయల్దేరాం. నన్ను తోలమన్నారు బండిని. టయరు బండి తోలటం శులభమే కాని పెద్ద చెక్రాల బండి చాలా కష్టం అనిపించింది. ఆయన సహాయంతో మొత్తానికి లాగించా.

తరగని ఆ జ్ఞాపకాలు అతి మధురాలు.

Jun 11, 2010

జెర్సి నెంబరు 10

ఒకతను ఇరవై ఏళ్ళ క్రితం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రపంచకప్ హీరో, దేశం అర్జెన్టీనా, జెర్సి నెంబరు 10, పేరు మారడోనా, ఎడమకాలి ఆటగాడు.
ఇంకోతను ఇరవై ఏళ్ళ లోపు ప్రపంచకప్ ని గెలిచిన యువ ఆటగాడు, దేశం అర్జెంటీనా, జెర్సి నెంబరు 10, పేరు మెస్సి, ఎడమకాలి ఆటగాడు.
వీరిద్దరిలో ఎన్నో సారూప్యాలు.
ఇద్దరూ అత్భుతమైన ఆటగాళ్ళు.
ఇద్దరూ అత్యంత వివాదాస్పత గోల్స్ ఒకే రకంగా వేసారు (చేత్తో)

చేత్తో గోల్ - ఇద్దరూ ఒకేరకంగా -



viva el futbol

Jun 9, 2010

వేడి పెరుగుతోంది రోజు రోజుకీ

ఇలా తెరవెనుక నడుస్తుంటే మన కళ్ళుగప్పి, ఎందుకు పెరగదూ వేడి రోజు రోజుకీ సంవత్సరం సంవత్సరానికీ.

సోకాల్డ్ మీడియా, పొలిటికల్ బిజినెస్ పర్సనల్స్ దేశాన్ని దోచుకుంటుటే, ఏంపర్లేదు, రేపు ఎల్ల దొరలొస్తారూ మనకి మంచిసేస్తారని ఎదురుచూస్తాం. కానీ, మన మట్టిని, మన్నుని, గాలినీ నీటిని అన్ని విధాలా కలుషితం చేస్తుంటే కిం అనకుండా చోద్యం చూస్తున్నాం.

http://en.wikipedia.org/wiki/E-waste

Increased regulation of electronic waste and concern over the environmental harm which can result from toxic electronic waste has raised disposal costs. The regulation creates an economic disincentive to remove residues prior to export. In extreme cases, brokers and others calling themselves recyclers export unscreened electronic waste to developing countries, avoiding the expense of removing items like bad cathode ray tubes (the processing of which is expensive and difficult).

Defenders of the trade in used electronics say that extraction of metals from virgin mining has also been shifted to developing countries. Hard-rock mining of copper, silver, gold and other materials extracted from electronics is considered far more environmentally damaging than the recycling of those materials. They also state that repair and reuse of computers and televisions has become a "lost art" in wealthier nations, and that refurbishing has traditionally been a path to development. South Korea, Taiwan, and southern China all excelled in finding "retained value" in used goods, and in some cases have set up billion-dollar industries in refurbishing used ink cartridges, single-use cameras, and working CRTs. Refurbishing has traditionally been a threat to established manufacturing, and simple protectionism explains some criticism of the trade. Works like "The Waste Makers" by Vance Packard explain some of the criticism of exports of working product, for example the ban on import of tested working Pentium 4 laptops to China, or the bans on export of used surplus working electronics by Japan.

Opponents of surplus electronics exports argue that lower environmental and labor standards, cheap labor, and the relatively high value of recovered raw materials leads to a transfer of pollution-generating activities, such as burning of copper wire. In China, Malaysia, India, Kenya, and various African countries, electronic waste is being sent to these countries for processing, sometimes illegally. Many surplus laptops are routed to developing nations as "dumping grounds for e-waste".[2] Because the United States has not ratified the Basel Convention or its Ban Amendment, and has no domestic laws forbidding the export of toxic waste, the Basel Action Network estimates that about 80% of the electronic waste directed to recycling in the U.S. does not get recycled there at all, but is put on container ships and sent to countries such as China.[9][14][15][16] This figure is disputed as an exaggeration by the EPA, the Institute for Scrap Recycling Industries, and the World Reuse, Repair and Recycling Association[citation needed].

Guiyu in the Shantou region of China, Delhi and Bangalore in India as well as the Agbogbloshie site near Accra, Ghana have electronic waste processing areas.[9][17][18] Uncontrolled burning, disassembly, and disposal can cause a variety of environmental problems such as groundwater contamination, atmospheric pollution, or even water pollution either by immediate discharge or due to surface runoff (especially near coastal areas), as well as health problems including occupational safety and health effects among those directly involved, due to the methods of processing the waste. Thousands of men, women, and children are employed in highly polluting, primitive recycling technologies, extracting the metals, toners, and plastics from computers and other electronic waste. Recent studies show that 7 out of 10 children in this region have too much lead in their blood.[citation needed]

Proponents of the trade say growth of internet access is a stronger correlation to trade than poverty. Haiti is poor and closer to the port of New York than southeast Asia, but far more electronic waste is exported from New York to Asia than to Haiti. Thousands of men, women, and children are employed in reuse, refurbishing, repair, and remanufacturing, sustainable industries in decline in developed countries. It is held that denying developing nations access to used electronics denies them affordable products and internet access.

Opponents of the trade argue that developing countries utilize methods that are more harmful and more wasteful. An expedient and prevalent method is simply to toss equipment onto an open fire, in order to melt plastics and to burn away unvaluable metals. This releases carcinogens and neurotoxins into the air, contributing to an acrid, lingering smog. These noxious fumes include dioxins and furans.[19] Bonfire refuse can be disposed of quickly into drainage ditches or waterways feeding the ocean or local water supplies.[16][20]

In June 2008, a container of electronic waste, destined from the Port of Oakland in the U.S. to Sanshui District in mainland China, was intercepted in Hong Kong by Greenpeace.[21] Concern over exports of electronic waste were raised in press reports in India,[22][23] Ghana,[24][25][26] Ivory Coast,[27] and Nigeria.[28]


http://en.wikipedia.org/wiki/Ship_breaking

Health and environmental risks

In addition to steel and other useful materials, however, ships (particularly older vessels) can contain many substances that are banned or considered dangerous in developed countries. Asbestos and polychlorinated biphenyls (PCBs) are typical examples. Asbestos was used heavily in ship construction until it was finally banned in most of the developed world in the mid 1980s. Currently, the costs associated with removing asbestos, along with the potentially expensive insurance and health risks, have meant that ship-breaking in most developed countries is no longer economically viable. Removing the metal for scrap can potentially cost more than the value of the scrap metal itself. In the developing world, however, shipyards can operate without the risk of personal injury lawsuits or workers' health claims, meaning many of these shipyards may operate with high health risks. Protective equipment is sometimes absent or inadequate. Dangerous vapors and fumes from burning materials can be inhaled, and dusty asbestos-laden areas are commonplace.

Aside from the health of the yard workers, in recent years, ship breaking has also become an issue of major environmental concern. Many ship breaking yards in developing nations have lax or no environmental law, enabling large quantities of highly toxic materials to escape into the environment and causing serious health problems among ship breakers, the local population and wildlife. Environmental campaign groups such as Greenpeace have made the issue a high priority for their campaigns

Jun 3, 2010

జ్ఞాపకాల దొంతర - 1986

అప్పటికి ఈ చెత్తడబ్బా (అనగా టీవీ) ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. మా ఊళ్ళలాంటి చిన్న ఊళ్ళు/పల్లెల్లో రేడియోనే ప్రధానమైన ప్రసార మాధ్యమం. అప్పళ్ళొ నేను ఎత్తుబడివైపుకి అడుగులేస్తున్ననన్న మాట. ఎత్తుబడి అనగా ఆం.ప్ర.రా.జి.ప్ర.ప.ఉ పాఠశాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల.
ఓ రోజు అర్థరాత్రి మా నాయన రేడియోపెట్టుకుని తెగ ఉద్రేకపడుతూ మొఖం తీవ్రమైన ఏకాగ్రతగా పెట్టి అంతలోనే ఆవేశపడుతూ అంతలోనే ఎగిసిపడుతూ ఓ విచిత్రమైన వాలకంతో మమేకమై విటూ ఉంటాన్ని గమనించా. ఏట్రా బగమంతుడా అనుకున్న. మా నాయనకు అప్పుడు నలభై ఏళ్ళే. ఇది జరిగిన మర్రోజు బళ్ళో నాయనా, తె.మా, డ్రి.మా, హె.మా, సై.మా అందరూ ఓసోట రచ్చబండకాడ సెర్చ మొదలెట్టారు. బళ్ళో రచ్చబండ = స్టేఫ్ రూం అన్నమాట. ఇక సాయంత్రం ఉండబట్టలేక, ఏటి గురూ ఏటి సంగతీ అని అడిగా. డియేగో మారిడోనా అని చెప్పి ఓ చిరునవ్వు సిలికించాడు. మనకి అప్పుడు వర్ధం అవ్వలా. తర్వాత్తర్వత వర్ధం కావటం మొదలైంది. డియేగో మారడోనా. హ్మ్!! ఏం ఆటగాడు. ఎన్నిసార్లు చూసినా అదే ఉద్వేగానికి లోను చేస్తాడు. ఎలా ఆడతారు అలా అనుకుంటూ ఉండేవాణ్ణి. ఒకడు బంతిని ఇటు తంతే కరెక్టుగా వాడి వైపు వాడికే ఎలా అందుతుందీ అని తెగ ఆశ్చర్యపోయేవాణ్ణి. ఇలాంటివి ఏ ఆటలోనైనా ఆటగాళ్ళకి నేర్పే సంగతులు అబ్బే గుణాలు అని మన మట్టి బుఱ్ఱకు పెద్దోణ్ణైయ్యాక అంటే ఇప్పుడిప్పుడే వర్ధం అవుతూ వస్తోంది. మరి అట్టా ఐతే ప్రతీ కాలిబంతి ఆటగాడూ డియేగో మారడోనా కావాలిగా? ప్రతీ క్రికెట్ట్ ఆటగాడూ సచిన్ టెన్డూల్కర్ కావాలిగా? కాడు. ఎలా అవుతాడు? కేవలం సచిన్ మాత్రమే సచిన్ లాగా ఆలోచింప గలుగుతాడు. మారడోనా మాత్రమే మారడోనాలా ఆలోచింప గలుగుతాడు. అది అంతే. ఆ వాళ్టి మానాయన సంఘటన నాకు సాకర్ ని పరిచయం చేసింది. తర్వాత కొన్నాళ్ళకు నే ఏదో దేశం వెళ్ళినప్పుడు, ఓ టీషర్ట్ కొందామని ఓ స్పోర్టింగ్ స్టోర్ కి వెళ్ళా. ఓ వైపు మొత్తం ఓ ఆటగాడి బొమ్మలతో ఉన్న టీ షర్టులు చూసి ఆశ్చర్యపొయ్యా. నైకీ టీ షర్ట్, ముందు పౌలో మాల్దిని, వెనక 3 అంకె వేసున్నది కొన్నా. నాకు పౌలో మాల్దిని అంటే ఇష్టం. ఈ.యస్.పి.యన్ లో యుఫా లీగ్ మ్యాచులు బాగనే చూసేవాణ్ణి. ఏసీ మిలాన్, జువెన్టస్, లివర్పూల్, మాన్చెస్టర్ యునైటెడ్, రియల్ మాద్రిద్ లాంటి టీములంటే బాగా ఇష్టంగా ఉండేది. ఏసీ మిలాన్ అంటే బాగా ఇష్టం. పానుచ్చి, తొత్తి, బాగ్గియో లాంటి వాళ్ళు ఆడేవాళ్ళు కదా. తర్వాత్తర్వాత ౨౦౦౨, ౨౦౦౬ ప్రపంచకప్పులను టీవీయందు వీక్షించా. అత్భుతమైన ఆనందం అది. ౨౦౦౨ ఫైనల్ ఇంకా కళ్ళముందు మెదుల్తూనే ఉంది. బ్రజిలియన్ టీం లోని ఆర్ త్రయం అత్భుతంగా రాణించారు. ఆర్ త్రయం అనగా రోనాల్డో, రోనాల్డినో, రివాల్డో. వాళ్ళ టీంలో మార్కోస్, కాఫు, రొబెర్తో కార్లోస్, దిదా, కాకా అందరూ నచ్చిన వాళ్ళే నాకు. ఆ ఏటి బెస్ట్ గోల్ కీపర్ ఆలివర్ కహ్న్ (జెర్మని). నాకెందుకో జెర్మనీ వాళ్ళ ఆట చాలా డిస్ట్రక్టివ్ గా అనిపిస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళలా అనిపిస్తారు. ఏది చేసైనా గెలవాలి అనేలా ఉంటుంది వాళ్ళ స్వభావం. ఆ ఏడాది జెర్మనీ కోచ్, ౧౯౮౬ వెస్ట్ జెర్మనీ టీం లోని ఆటగాడు. వాడి పేరు Rudi Völler. వీడు ౧౯౯౦ నాటి ఫైనల్లో మారడోనా కాళ్ళు విరచటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ౨౦౦౨ ప్రపంచకప్పులో కొరియా ఆశ్చర్యంగా చాలా బాగా రాణించింది. టర్కి సెమీస్ కి వెళ్ళింది. క్రియేషియా, పోర్చుగల్, కోస్టారికా, సెనెగల్ ఇత్యాది దేశాల టీములు బాగా ఆడాయి, ఆకట్టుకున్నాయి.
ఇక ఈ ఏడాది జూన్ ౧౧ నుండి జూలై ౧౧ వరకు మరోసారి ప్రపంచాన్నంతటినీ కాలిబంతి ప్రపంచ పోరాటం ఊపేయనుంది, కనువిందు చేయనుంది, ప్రేక్షకవీక్షకులకు ఆనందావేశాలతో పాటు నిరాశా నిస్పృహలకు గురిచేయనుంది.Fifa_world_cup_org.jpg

సౌత్ ఆఫ్రికా ఈ పోరాటానికి వేదిక.
ఇవీ ఈ సారి గుంపులు.

నాకు ఇలా అనిపిస్తోంది -
గుంపు ఏ నుండి ఫ్రాన్స్ మెక్సికో గెలవచ్చు
గుంపు బి నుండి అర్జెంటీనా, కొరియా. గ్రీకులను తక్కువ అంచనా వేయకూడదు.
గుంపు సి నుండి బ్రిట్ మరియూ అమ్రెకా
గుంపు డి నుండి జెర్మని, మిగతా టీములు కూడా గట్టివే
గుంపు ఈ నుండి జపాన్, రెండోది చెప్పలేను
గుంపు ఎఫ్ నుండి ఇటలి, రెండోది చెప్పలేను
గుంపు జి నుండి బ్రసిల్ అ.క.అ బ్రజిల్, పోర్చుగల్
గుంపు ఎచ్ లేక హెచ్ నుండి స్పెయిన్, స్విస్

ఇప్పటికే హాట్ ఫేవరేట్లు జనాలకి స్పెయిన్ మరియూ బ్రజిల్.


హోగా బొనీతో