Aug 31, 2010

మరో పరీచ్చ

అనఘ ఏం చెప్తోందో గెస్సు కొట్టినవారికి
పెద్ద బహుమతి.
ఇక్కడా
http://bhaskar.posterous.com/26996957
లేక
ఇక్కడ వినండి
మన్నమన్నమన్న.యంపి౩

Aug 29, 2010

ఇది దేశీ పత్రికా లేక పాకిస్తాన్ తొత్తా

కొందరు మేతావులకి దెశాన్ని తిట్టటం సంస్కృతి సాంప్రదాయాలపై బుఱద చల్లటం ఫేషనే కాదు పా౨షన్ కూడా ఐకూర్చుంది. అది మన దరిద్రం. నిన్న మొన్నట్లో దళితులను ప్రైవేట్ కార్పోరేట్ వర్ల్డ్‌లో తొక్కేస్తున్నారని ఇదిగో లింకు అని ఓ లింకు కొట్టారు మన ముఖాన. ఆ పత్రిక పేరు ది సండే ఇండియన్. అబ్బో చాలా సేకరించారు సమాచారం ఆ పత్రిక వాళ్ళు.
మీలో ఎవరన్నా ఆ పత్రికని వీక్షించారా? ఆ పరీశోధనా ఫలితాల వివరాలు పక్కన పెడితే, నాన్నాకరిషించిన విషయం ఇదిఈ బొమ్మ చూడండి.
ఒక పక్కన ది సండే ఇండియన్
ఇంకోపక్క ముషరఫ్, బెనాజిర్ భుట్టో.
దేశీ పత్రికా ఇదీ లేక పాకిస్థానీ పత్రికా? వీళ్ళా పరిశోధన జరిపిందీ, ఆ ఫలితాలతోనా బుఱద జల్లటానికొచ్చింది ఓ పెద్దమనిషి.

ఏదో సామెత చెప్పినట్టుంది.

Aug 27, 2010

రిక్రూట్‌మెంట్ ప్రాసెస్

ప్రైవేటు ఇండస్ట్రీలో కులాల కుమ్ములాటంటయ్యా
అవును
నేను ఇంటర్వ్యూ చేసేప్పుడు *బాడీ లేంగ్వేజ్* చూస్తా. చేయి భుజంకన్నా పైకి ఎత్తితే కమ్మ అని, కుడు చూపుడువేలు టింగ్ టాంగ్ అంటే రెడ్డి అని, ముక్కు ఎడమవైపుకి తిప్పు కుడికి కన్ను చూస్తే బేపనోళ్ళు అని నాకు బాగా తెలుసు. కొందరు ఉత్తి పుణ్యానికి ఏడుస్తుంటారు, పక్కనోళ్ళపై పడి, లేక సేతకాక, అట్టాంటోళ్ళు వేరే కులపోళ్ళని నాకు తెలుసు. ముందుగా కార్పోరేట్ ట్రైనింగులో బాగా నేర్పిస్తారు ఇవన్నీ. బాడీలేంగ్వేజ్ మీద రీసెర్చ్ చేసి ఓ ఆట ఆడిన పంతుళ్ళు కొందర్ని రిక్రూట్ చేస్కుంటారు. వారికి ఇదేపని. సెమినార్స్ పెట్టి, ఎవరెవరి బాడీలేంగ్వేజ్ ఏంటి ఏకరువు పెట్టటమే వారి ముఖ్య ఉద్యోగం.
ఇక దళితులు లేక వుత్తులు మత్తులు లోనికి రాకుండా హెచ్‌ఆర్లు ముందుగానే ఫిల్టర్ చేస్తారు రెజూమేలను బయోడేటాలను. దానికీ వారికి ముందుగానే ట్రైనింగు ఉంటుంది. ప్రత్యేకంగా హెచ్‌ఆర్ లను హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక వారం ఉండేట్టు చేస్తారు. తెలుగు వారి ఇంటిపేర్లను బట్టి వెంటనే క్యాండిడేటు కులం ఏది అని టకా మని చెప్పేల చేస్తారు. దానికోసం సెన్సెస్ చారి సహాయం తీస్కుంటారు. ఇంటిపేర్ల ట్రెండ్స్ ఎలా ఉంటాయి. ఏఏ ఊళ్ళలో ఏఏకులపు వాళ్ళు ఉంటారు ఇలా. అలానే తమిళంవాళ్ళ ఇంటిపేర్ల ట్రెండ్ పై ప్రత్యేకమైన కోర్స్ ఉంటుందట.
ఐతేపాపం ఒక్కోసారి తెలియక తప్పులు చేస్తుంటారట. ఉదాహరణకి
మా పెద్దమ్మా వాళ్ళా ఇంటిపేరు మందపాటి. మా పాపారావు ఇంటిపేరూ మందపాటి.
మా మాతామహుల ఇంటిపేరు రావెల, ఇంకెందుకులే గాని. ఇలా ఊళ్ళపేర్లు ఇంటిపేర్లుగా ఉన్నవారిని ఎలా ఫిల్టర్ చెయ్యాలో పాపం అర్థం కావట్లేదట చాలా మందికి.
అలానే తమిళవాళ్ళైతే రామరాజు గోపరాజు ఇలా ఉండవుగా వారి ఇంటిపేర్లు. తండ్రిపేరు కొడుక్కి సర్నేం అవుతుంది. మరి ఎలా నేర్పిస్తున్నారోగాని మొత్తానికి కేవలం బ్రాహ్మణికల్ ఏటిట్యూడ్ ఉన్నవారినే తీస్కుంటున్నారట.
కేవలం అయ్యంగార్స్‌ని మాత్రమే తీస్కోవాలని చూస్తారట తమిళనాటనుండి. అయ్యర్స్ అలుగుతున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

దానిక్కూడా ఓ స్క్రీన్ టెస్టులు ఉన్నాయట. రాత పరీక్షలన్నమాట. బ్రాహ్మణికల్ ఏటిట్యూడ్‌ని పరీక్షిస్తారట.


కాబట్టి అదయ్యా సంగతి. దేశంలో ఇంతటి భావ దారిద్ర్యం ఉంది. ఎట్లా? ఎలాంటి మహానుహావులు మనల్ని కాపాడగలుగుతారూ? మీకేమైనా ఐడియా ఉంటే కాస చెప్పరూ?

Aug 25, 2010

సినీ పరిశ్రమను టార్గెట్‌ చేయలేదు: ఏకేఖాన్

టూకీగా నిన్న మొన్నటి ఈనాడు పత్రికవారి వార్తా నివేదిక ఇదీ -

టంగుటూరికి ఘనంగా నివాళులు అర్పించిన రోశయ్య
హైదరాబాద్‌: టంగుటూరి ప్రకాశం పంతులు 139వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రోశయ్య ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి పాల్గొని టంగుటూరికి శ్రద్ధాంజలి ఘటించారు.

ఘనంగా నివాళులు అర్పించటం అంటే ఏంటో నాకర్థం కాల్యా. ఘనంగా అంటే ఘనపదార్థంగా మారి నివాళులు అరిపించారనా? పాత్రికేయులకే తెలియాలి ఘనంగా నివాళులుర్పించటం అంటే ఏంటో.


వ్యభిచార గృహంపై దాడి... సహాయనటి అరెస్టు
హైదరాబాద్‌: కుందన్‌బాగ్‌లోని ఓ వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సినీ సహాయనటి సైరాభాను, ఉజ్బెకిస్థాన్‌ యువతి సహా మరో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఉజ్బెకిస్థాన్‌ యువతి సబీనాగా గుర్తించారు. సహాయనటీమణులు జ్యోతిలక్ష్మి, నీలమణి కూడా అరెస్టయినవారిలో ఉన్నారు.


అబ్బా ఛా!! ఏకే ఖాన్ భయ్యా, లెక్కలు కుదర్లేదా ఏందీ?

చైనాలో ఆర్థిక నేరాలకు మరణ శిక్ష రద్దు!
బీజింగ్‌: ఏటా అత్యధిక సంఖ్యలో మరణ శిక్షలు అమలు చేసే కమ్యూనిస్టు చైనా ఇక వీటి సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. మరణ దండన వేసే నేరాల జాబితాలోంచి కొన్నింటిని తొలగించనుంది. ఇకపై ఆర్థిక నేరాలకు పాల్పడే వారికి దీనిని విధించకూడదని నిర్ణయించింది.


ఇక రాయపాటి సోదరులు హేప్పీగా చైనా వెళ్ళవచ్చు.

డ్రగ్స్‌ వ్యాపారంలో సినీనటులు!
నైజీరియన్లతో నేరుగా ఒప్పందాలు
దక్షిణాఫ్రికా, ముంబయి నుంచి దిగుమతి
డబ్బు కోసం పబ్బుల్లో ప్రత్యేక పార్టీలు
హైదరాబాద్‌లో ఏటా రూ.500 కోట్ల వ్యాపారం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాల వ్యవహారం హైదరాబాద్‌లో ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు మాదక ద్రవ్యాల వినియోగదారుల జాబితాలో ఉన్నారని స్వయంగా నగర పోలీసు కమిషనర్‌ ఏకేఖాన్‌ వెల్లడించిన గంటల్లోనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హీరోలు, హీరోయిన్లు మత్తుమందులను వాడడమేకాదు.. ఏకంగా వాటి వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఒక ప్రముఖ నటుడు, అవకాశాలు తగ్గిపోయిన మరో హీరో మాదకద్రవ్యాల వ్యాపారులుగా మారినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
డ్రగ్సే ఎందుకు?
సినీపరిశ్రమలో హీరోల నుంచి జూనియర్‌ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల వరకూ వారిదొక ప్రత్యేక ప్రపంచం. గ్లామర్‌, ప్రజాదరణకు పర్యాయపదంగా మారిన ఈ రంగంలో చాలామంది విలువలకు కట్టుబడి ఉన్నా.. యువతరంలో దాదాపు 70% మంది రాత్రుళ్లు పబ్బులకు వెళ్తున్నారు. మరింత మత్తు, కిక్కు కోసం మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు. ముంబయి, చెన్నై నుంచి వచ్చిన మోడళ్లతో మేమూ తక్కువ కాదని నిరూపించుకునేందుకు వీటిని వినియోగిస్తున్నారు.

నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేమీ కొత్త విషయం కాదే. డ్రగ్స్ ప్రపంచంలోకి నిన్ననో లేక మొన్ననో రాలేదే. లేక హైద్‌లో డ్రగ్స్ వాడుక క్కూడా కొత్తేమీ కాదే. మరి ఇప్పుడేందబ్బా?
కొన్నిసార్లు కేప్‌టౌన్‌, డర్బన్‌ల నుంచి నేరుగా ముంబయికి గోప్యంగా దిగుమతి అవుతున్నాయిట.
మరి పోలీసులు దాంట్లో చేతులుపెట్టి హ్యాప్పీగా అందినంత తింటే రేపొద్దున కిళ్ళీషాపుల్లో బాహ్యాటంగానే అమ్ముతారు. ఇక దీనివెనుక చాలా మందే ఉన్నారట. అందరు డబ్బున్న మారాజులట. పలుకుబడి ఉన్నవారట. అందుకే పోలీసులు వెనుకంజ వెస్తున్నారట.
హ్మ్!! మొన్నామధ్య, ఇలియట్ స్పిట్జర్ అని ఓ పెద్దాయన, న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ గా చేసేవాడు. చట్టప్రకారం తప్పులు చెసినవారిపై కఠినంగా ప్రవర్తించాడు. అతను గవర్నర్ గిరీ చేపట్టకమునుపు ఎటార్నీ జెనరల్‌గా ఎనిమిదేళ్ళు గడగడ లాడించాడు. కానీ చివరికి వ్యభిచార నేరంలో ఇరుక్కున్నాడు. పోలీసులు అతనెవరైనా, లెక్క చేయకుండా తమపని తాము చెసారు.
అదీ తేడా.
ఇప్పుడేముంది, ఆ సదరు డ్రగ్స్ సూత్రధారి ఒకవేళ చిక్కేపరీస్థితే వస్తే, ఎవర్నో ఇరికించి వారికి డబ్బో దస్కమో ఇచ్చి హ్యాపీగా మళ్ళీ తన బిగినెస్సు కొనసాగిస్తాడు.
చట్టం డబ్బున్నోడికి చుట్టం. అతను చెప్పినట్టే నడుస్తుంది చట్టం. న్యాయం చట్టానికి తలవంచక తప్పదు.
ఐతే సమస్యేంటంటే ఈ సోకాల్డ్ న్యాయపరంగా నేరస్తులు [చట్టపరంగా కాదు], టీవీలో పొద్దస్తమానం కనిపిస్తారు. స్వాతంత్రదినోత్సవంలో కూడా వీరిదే అప్పర్ హ్యాండ్. వీరే గ్రాండ్ మార్షల్స్, వీరే శుభాకాంక్షలు చెప్పేది. ఏంటీ దుఃస్తితి? ఏంబావుకోవాలని ఈ టీవీవాళ్ళ ఆరాటం? వీళ్ళా సమాజాన్ని ఉద్ధరించే యుగపురుషులు? వీరా నేటి యువతకి ఐడిల్స్?


సినీ పరిశ్రమను టార్గెట్‌ చేయలేదు: ఏకేఖాన్‌ హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సినీ పరిశ్రమ మొత్తాన్ని టార్గెట్‌ చేసుకుని పథకం ప్రకారం తాము దాడులు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఏకేఖాన్‌ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమా తారలంటే తమకు వ్యక్తిగత కక్ష లేదన్నారు. అన్ని రంగాల్లో మంచీ చెడూ ఉన్నట్టే సినిమారంగంలోనూ ఉన్నారని, నేరాలకు పాల్పడుతున్న వారిపైనే దృష్టి సారించామని చెప్పారు. వ్యభిచార నేరం కింద అరెస్టయిన జ్యోతి, సైరాబానులను తాము ట్రాప్‌ చేయలేదని, వారు నేరం చేస్తున్నట్లు అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని వివరించారు. మాదకద్రవ్యాల విక్రయంపై 4 కేసులు నమోదు చేశామని, వాటిని త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు సీసీఎస్‌కు బదిలీ చేస్తున్నామని ఖాన్‌ చెప్పారు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వినియోగం అనూహ్యంగా పెరిగినందువల్లే కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కొందరు సినీ నటులతో పాటు పారిశ్రామిక, ఇతర రంగాలకు చెందినవారు ఎక్కువగా వీటిని వినియోగిస్తూ కొత్తవారికి అలవాటు చేస్తున్నందుకే దాడులు తీవ్రతరం చేశామన్నారు.

సినీమ తారలంటే ఖాన్ గారికి ప్రత్యెక కక్షలేదట. ఇప్పటికి ఎన్నిసార్లు ఎందరు చిన్నాపెద్దా సినీతారలను వ్యభిచారం నేరం క్రింద అరెస్టు చేసారోగాని, వాళ్ళందరూ హ్యాప్పీగా బయటకొచ్చి మళ్ళీ నటిస్తున్నారు, నటన ముసుగులో ఏంమేంచేస్తున్నరో పైవాడికెరుక.
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వినియోగం అనూహ్యంగా పెరిగినందువల్లే కఠినంగా వ్యవహరిస్తున్నారట, అనూహ్యంగా కాకుండా కొంచెం పెరిగిఉంటే పెద్ద పట్టించుకునే వారే కాదట.

అట్టా గుండెలమీనకి తెచ్చుకోకురా నాన్నా

అయ్యో సిన్నా
తప్పురా నాన్నా
అట్టా గుండెలమీనకి తెచ్చుకోకురా నాన్నా
ఇనీ ఇన్నట్టు
సూసీ సూడనట్టు
ఆడీ ఆడనట్టు
ఒదిలెయ్యాల
జాగరత్తరా నాన్నా
అసలే నిన్నగాక మొన్ననే పుట్టిన లేగదూడవిరా నాన్నా
అయ్యో ఎట్టా తట్టుకుంటవో ఏందోరా సోఁవి
నీకు తెల్వదల్లే ఉంది
ఇట్టాంటోళ్ళు నరాల్లోకి అబ్యుదయాన్ని ఎక్కిత్తార్రా నాన్నా
ఇట్టాంటోళ్ళు కళ్ళకి నల్లగుడ్డ సుట్టి ఇదే ప్రపన్చఁ అని సూపిత్తార్రా
సీకటితో నిండుకున్న అబ్యుదయం ఎందుకురా సోఁవి
ద్వేషంతో ఊగిసలాడే ఉద్వేగం ఎందుకురా కన్నా
కపటపు సైన్సుకబుర్లు నీకెందుకురా నాన్నా
లోయల్లోకి లాకెళ్ళే (అ)మానవత్వం నెత్తికెత్తుకోకురా సిన్నా
గుడిసేటి గుణం నీక్కాదురా కన్నా
సిన్న గుండెకాయ ఎట్టా తట్టుకునిద్దీరా నాన్నా
ఎక్కువ కష్టపెట్టుకోమాకమ్మా సిన్నోడా
ఆళ్ళంతేరా
కులం కుపాంట్లో అభ్యుదయ గొట్టంపెట్టి ఊది
నివురుని కళ్ళంతా గుప్పిత్తార్రా
నిప్పు రాజేసి ఆళ్ళు సలిమంటేస్కుంటార్రా నాన్నా
మతం సెంచాతో విషం కిరసనాయలు పోస్తరురా సిన్నా
సిన్నోడా
నిప్పు
రగుల్కుంటుంది
ఎట్టా ఓర్సుకుంటావో
జాగ్రత్తరా కన్నా
నిన్ను నమ్ముకుని నోవోళ్ళు నావోళ్ళు సమాజవ్, దేశం ఉందిరా
కళ్ళల్లో ఆశల ఒత్తులేస్కుని
నీబాటకి వెలుగునిస్తున్నార్రా నీ ప్రజలు
మద్దిన ఈ మంటలు
అంటుకుని నిన్ను ఏరే తీరాలకు ఎత్తుకెళ్తే
ఈ ఆశలు మూగబోతైరా కన్నా
ఈ జీవుల జీవితాలు మసకబారుతై
వద్దునాన్నా
పట్టించుకోకు
వద్దేవద్దు

Aug 19, 2010

ఇది దుఃస్థితా లేక అదృష్టమా?

పై ఈనాడు వార్త *మేడ్ ఇన్ అమెరికా తో వైభవాన్ని సాధిద్దాం* లో నన్ను కలచివేసింది ఈ వాక్యం - "ముంబైలోని ఓ చెప్పుల దుకాంణంలో ఒబామా బొమ్మలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న చెప్పులు. చైనాలో తయారైన వీటి ధర రూ౨౪౮"

ఆకరికి చెప్పులు కూడా తయ్యార్జేస్కోలేక పోతున్నామా కాస్ట్ ఎఫెక్టివ్‌గా?
ఇది మన దుఃస్థితా లేక గ్లోబలైజేషన్ పేరిట వచ్చిన అదృష్టమా?

Aug 18, 2010

సొతంత్ర దినోత్సవమ్

అబ్బా!! ఈ న్యూయార్క్ న్యూజెర్సి ఏరియా వాళ్ళు హెంత అదృష్టవంతులు. వాళ్ళని జూస్తే నా కళ్స్ మంట్స్. ఇక్కడి సొతంత్రతా దినోత్సవ సంరభ సందర్భంగా జెండా వందనానికి సొతంత్ర సమర యోధురాలు కుమారి। మల్లికా శరావత్ వేంచేసారు. ఎంతటి భాగ్యం! ఆలెక్కన ఇక్కడి సొతంత్రతా దినోత్సవాలకు ప్రతీఏడాది ఇలానే సమరయోధురాళ్ళు వచ్చి మన దేశ ఔన్నత్యాన్ని విశదపరచి ప్రవాస భారతీయ యువ కుసుమాలకు జ్ఞానబోధని, వారు దేశంకోసం పడ్డ కష్టాలను త్యాగాలనూ ఏకరువు
పెడుతుంటారు. ఎంత అదృష్టం ఆ సమూహానిదీ? వే వెళ్ళలేక పోయినందుకు కడు చింతిస్తున్నా. ఐనా నేనిప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళా కదా. ఇక ఇక్కడ మా దురదృష్టం, ఇలాంటి వేడుకలు చేయలేకపోవటం, చేసే యోచన లేకపోవటం, ఒకవేళ
ఉన్నా, మల్లికా శరావత్ లాంటి యోధురాళ్ళు ఆల్రెడీ బుక్కైపోయి ఉంటరు కదా.

వీళ్ళలాంటి దేశ భక్తులు చాలా అవసరం. నిద్రాణంగా మరియూ అంతరించిపోయే ప్రమాదంలో పడనున్న మన సంస్కృతి సాంపదాయలను తిరిగి ఆవిష్కరించే దిశగా వీరిలాంటివారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.

నా జ్ఞాపకాల దొంతరలో ఓ చిన్న కదలిక. అప్పట్లో, మా ఊళ్ళవైపు నాటకాలు వేసేవారు. సాంఘీక నాటకాలు. దీనిపై ఓ టపా కూడా కట్టాను ఇంతక ముందు. ఆ నాటకాల్లో హీరోయిన్లుగా వేసేందుకు గుంటూరు నుండి ఓ హీరోయిన్ను బృందం
వచ్చేది. వాళ్ళు చాలా ఫేమస్ నాయికలు. వీళ్ళు నాటకనికి ఒప్పుకుంటే మూణాల్రోజుల ముందే వాలతారు రిహార్సిల్స్ కోసమని. మధ్యాహ్నమంతా రిహార్సిల్స్. మరి డ్యాన్సులు కట్టాలి ఆడాలి కదా. రాత్రిళ్ళు బయట పెద్ద క్యూ. కాస్తడబ్బున్న పోరంబోకులందరూ ఆ క్యూలో కనిపిస్తారు. సంఘసేవ. ఆళ్ళకి మల్లికా శరావత్‌కి పెద్ద తేడా ఏముంది?

ఇక, టీవీ చానెల్స్ తమ దేశభక్తి చాలా అత్భుతంగా చాటుకునే ఉంటాయని నేను ఊహించగలను. దేశభక్తి సినిమాలు ప్రసారం చేసి, మరియూ మధ్యమధ్యన మల్లికా శరావత్ మొమైత్ఖాన్ లేక ఇలియానా లాంటివారిచే "హ్యాప్పీ ఇండిపెన్డెన్స్ డే"
అని చెప్పించి ఉంటారు. టీ.ఆర్.పి రేటింగ్స్ ఎంత పెరిగితే అంత దేశభక్తి ఉన్నట్టు వారికి.

స్టార్ టివీ వారి ఒక కార్యక్రమం, *ఆజాదీ లైవ్* దానిపేరు. ఆ టీవీ సీరియళ్ళలో పనిచేసే హీరో హీరోయిన్ విలన్ యాట యాట యాట అందరూ వచ్చారు. ఒక్కోకరు ఒక్కో థీంత్‌తో ఆడి అలరించాం అనుకున్నారు. ఒక్కోక్కరు తమతమ అభిప్రాయాలను తెలియజేసారు. ఈనాటి పరీస్థితులపై తమ తమ గొంతులను వినిపించారు. చాలా మంది హింస వద్దు, మిలిటెంట్లు సాధించేదేమీ లేదు, అందరికీ బతికే హక్కుంది అని ముక్తకంఠంతో చెప్పారు. కొందరు ఆడవాళ్ళు కొన్ని కదిలించే మాటలు చెప్పారు. మనకి స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళు దాటినా, ఆడదానిపై అత్యాచారాలు ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయనేది పచ్చి నిజం అని, అవి అమాయక ఆడపిల్లపైనే కాక విదేశీ వనితలను కూడా బలితీస్కుంటున్నాయని, ఇవి చాలా స్పూర్దిదాయకంగానే కాక ఆలోచింపతగ్గ మాటలే కదా.

ఇక మధ్యమధ్యలో రోడ్డున పోయే వారిని ఆపి స్వతంత్రతా దివశ్ అంటే మీకేంటీ? మీ దృష్టిలో ఏంటీ లాంటివి కొన్ని చూపించారు.

ఒకతన్ని జై జవాన్ జై కిసాన్ అని ఎవరన్నార్రా నాన్నా అంటే దిలీప్ కుమార్ అని సెలవిచ్చాడు గుట్కా నములుతూ. జాతీయ గీతం ఏంట్రా అంటే ఊంచీ హై బిల్డింగ్ లిఫ్ట్ తేరీ బంద్ హై అన్నాడు. పాపం. వాడికి తెలియదులా ఉంది మనకి స్వతంత్రం వచ్చిందని. ఆ *నేలబారు* [గొల్లపూడివారి కాపీరైటు మాట] జీవితాలకి అర్ధం కాకపోయి ఉండొచ్చు స్వాతంత్రం అంటే ఎంటో. తప్పేమీ లేదు. ఆలెక్కకొస్తే ఈడ్చి తంతే ఎందరు సోకాల్డ్ చదువు కొంటున్న యువతకి స్వతంత్ర పోరాటం గురించి తెలుసూ?

నాకేం అనిపిస్తుందంటే - స్వతంత్రపోరాటం లేక యోధులు లేక గీతాలు తెలియకపోవటం ఓ పెద్ద నేరం కాదూ అని. దేశభక్తి అనేది కేవలం ఓ అందమైన మాటే అని. దేశభక్తి కన్నా ముందు, కుటుంబం, సమాజం, తర్వాత జిల్లా రాష్ట్రం అటుపై దేశం..ఈ వరసలో ముందు కుటుంబం ఎడల భక్తి, బాధ్యత కలగలని నా ఉద్దేశం. ఆ తర్వాత తనుండే సమాజం. ఇవి లేని వాడికి *నే దేశభక్తిపరుణ్ణి* అని ఓ బోర్డ్ తగిలించుకుని తిరిగినంత మాత్రాన ఓపెద్ద ఒరిగేదేమీ లేదు. కావాల్సింది సామాజిక బాధ్యత.

స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకు తీరాలి. ఎందుకంటే ఎవడో వచ్చి మనల్ని చేతిలో పెట్టుకుని మన సంపదనంతా దోచేసి మనల్ని కట్టుకునేందుకు కేవలం ఓ బెత్తడు గుడ్డతో మిగిల్చేస్తుంటే, పోరాడి ఎదురించి సాధించాం స్వాతంత్రాన్ని. ఆవేళ స్వాతంత్రం రాకుండా ఉండిఉంటె ఇప్పటికి ఏమీ మిగిలి ఉండేది కాదు. అందుకొరకు, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకు తీరాలి. ఆరోజున
తమతమ ప్రాణాలని పోరాటం కోసం త్యాగం చేసిన త్యాగ మూర్తులను కనీసం ఏడాదికొక్క మారు స్మరించాలి. ఐతే, అక్కడితో ఐపోతుందా తతంగం, మర్రోజు నుంచీ తిన్నామా లేచామా తొంగున్నమా తెల్లారిందా.

ఇక నిన్న మన గురూగారు స్వాతంత్రతా దినోత్సవ శుభాకాంక్షలు పంపించారు అందర్కీ, నేనూ ఆ లిస్టులో ఉన్నా. ఆ మెయిల్ కి ఇంకో పెద్దాయన ఎదో రిప్లై కొట్టారు. దానికి ఒక మేతావి వెంటనే ఎవరి ఎద్దు పెంట ఇదీ, మీకసలు స్వాతంత్ర పోరాటం అంటే ఏంటో తెలుసా? మీకసలు పార్టీషన్ అంటే ఏంటో తెలుసా అని దద్దించారు, గాండ్రించారు. మాకెలా తెలుస్తుంది? నిశానీగాళ్ళం మరియూ స్వతంత్ర పోరాటంలో పాలు పెరుగు పంచుకోని వాళ్ళం. చదువు కొన్న వాళ్ళం. అసలు పార్టీషన్ అంటే ఏంటో వారిలాంటి మేతావులు చెప్తే నా లాంటి ఛాందసులు విని తరించాలి. లేక ఏ రంగనాయకమ్మ [పాపము సమించుగాక, రంగనాయకమ్మ గారూ
అనాలి] విరచితమైన గ్రంధమో లేక అరుంధతీ రాయో రప్పో లేక రోమిల్లా థప్పర్ చేతినుండి జాలువారిన *నిజమైన చారిత్రాత్మక ఉత్గ్రంధ*మో ఉటంకిస్తే నాబోటి భావవైశాల్యంలేని కుంచితపాదులు తెలుసుకుని, తరించి పాకిస్థానీయులనూ లేక పార్టీషన్కు కారణభూతులైన సత్‌జనులను పేరుపేరునా పూజిస్తారు.

Aug 12, 2010

ఏంటీ ఈ ఘోరం సూట్కేస్లో మృతదేహం

విచ్ఛలవిడిగా పెరుగుతున్న శృంగార వాంఛలు
లొంగిపోతున్న అబలలు
పేట్రేగిపోతున్న మగ మృగాలు
తమపని తాము చేసుకు వెళ్ళే గ్యాడ్జెట్లు (ఎలక్ట్రానిక్ పరికరాలు)
వీడియోలతో బెదిరించే రాక్షసులు
కోరినప్పుడల్లా కోరిక తీర్చమనే ద్రోహులు
ఉఫున పోయే ప్రాణాలు
మౌనంవహించే చట్టాలు
ఇదేనా నా భారతం?
నాది కర్మ భూమని చెప్పగలనా ఇక?
నాది పుణ్యభూమని చాటాగలనా ఇక?
నాది వేదాలకు పుట్టినిల్లని చెప్పుకోగలనా ఇక?
నా గుండెమీద చేయివేసుకు నిద్రపోగలనా ఇక?

ఫ్లిప్ సైడ్-
ఇలాంటి వార్తలు అలా వస్తాయ్
ఇలా సదూతాం
వార్తాపత్రికని మడుస్తాం
కాయితకాల బీరువాలోకి చేరుస్తాం
ఏమీ ఎరగనట్టు మర్రోజులోకి జారుకుంటాం
మళ్ళీ వార్తాపత్రిక వస్తుంది
కొత్త డేటుతో
కొత్త వార్తతో
మళ్ళీ నరాలు పోటెత్తుతాయ్
మానవాత్వాన్ని ప్రశ్నిస్తాయ్
గోడలు కదలిక లేకుండా ఆ అరుపుల్ని మింగుతాయ్
మళ్ళీ వార్తాపత్రిక వస్తుంది
కొత్త డేటుతో
కొత్త వార్తతో
పాత వార్తకి పొడిగింపు ఊసూ ఉండదెక్కడా
కొత్త డేటులో
మన మనసులో.........................................

Aug 6, 2010

Aug 5, 2010

ప్రణవ్ మంత్రపాటం

ప్రణవ్ ఎవురయ్యా కొత్తగా?
అనుకుంటున్యారా?
లక్ష్మీ నృసింహ సాయి సూర్య ప్రణవ్ అ.క.అ సూరిగాడు.
ఆడు విండియాకెళ్ళి ఆంగ్లము మరసితిని తెలుగు నేర్సితిని అయ్యాడు.
వచ్చినాక,
ఆ సెవనప్ గాడు
మహేష్
ఏంట్రా
ఒరేయ్
రారా
పోరా
పేస్టులో ఉప్పు ఉంద్యా
మై లవ్ ఈస్ గాన్
నమో నమో వెంకటేశా
ఇదీ సంగతి
ఏబీసీడీలు చెప్పరా అంటే
ఏ డీ సి బీ
కాన్సొనెణ్ట్స్ అంటే ఏంటిరా అనడిగితే
ఏంటీ, బాబోయ్, అసలేంటా మాటా కాన్ఫిడెన్సా?
ఈ పాటం మాత్రం బాగా వచ్చింది, హనుమాన్ చాలీసా. ఇక్కడ వినండి -
http://bhaskar.posterous.com/25004016
లేక ఇక్కడ

Aug 3, 2010

ఓ సిన్న పరీచ్చ మీకు

ఈ రాగం ఏంటో చెప్పినవారికి బహుమానం
ఇదిగో ఇక్కడ
http://bhaskar.posterous.com/24821736
లేక ఇక్కడ వినండి