Dec 31, 2009

ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు..

నేను రూటుమార్చా. అసలు రూటుకొచ్చా. ఇకపై న్యూఇయర్ చేస్కోను. కొత్తసంవత్సరం అంటే ఉగాది అని మాత్రమే నమ్ముతున్నా ఇకపై.
సరే ఇక న్యూ ఇయర్ చేస్కునే వాళ్ళతో నాకేమీ పగలు ప్రతీకారాలూ లేవు కనుక, వాళ్ళందరికీ ఓ సారి -
నూతన సంవత్సర శుభాకాంక్షలు

2009 ఇంకొన్ని ఘడియల్లో ముగియబోతున్నది. ఇంకో సమచ్చరం కాలగర్భంలోకి జారిపోతుంది. మనంకూడా అయ్యిందోయ్ పోయ్యిందోయ్ అనుకుంటాం, డిశెంబరు ముప్పైఒకటి అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడతాం, పన్నెండుకాంగనే ఆవేశంతో ఊగిపోతాం. మర్రోజు అనిపించిన ప్రతీవోడికీ ఆంగ్లంలో ఏప్పీ న్యూ ఇయర్ అనిజెప్పేసి ఆరోజుని ముగించేస్తాం. ఆమర్రోజు, షరా మమూలే తిన్నామా పడుకున్నామా లేచామా....అంతకాడికి రెండ్రోజుల ముందుదాకా నిద్రెగ్గొట్టి అర్ధరాత్రిదాకా ఉండుడెందుకూ, మందుకొట్టుడెందుకూ, ఉన్న నాలుగు డబ్బులూ గుండు గీకించుకోటం ఎందుకూ??

నాకైతే ఈ న్యూ యియర్ ఎందుకుజేస్కోవాలీ అనిపిస్తోంది...కారణం
మన రాజకీయనాయకులు రాజేసి రగిలించిన రావణకాష్టంలో సమిధలైన మూగ పదార్ధాలు, నోరులేని జీవుల విలువ కళ్ళముందు కదులుతోంది. ఆం.ప్ర.రా.రో.ర.సం కి ఇప్పటికి ఐదువందల కోట్లు నష్టం.
మొన్నటి వరద భీభత్సంలో కొన్ని వేలకోట్లు నష్టం. ఇలాచెప్పుకుపోతే బ్లాగు చాలదు.
ఏమైనా గతం గతః..అయ్యిందేదో అయ్యింది. ఈ సమచ్చరాంతం సివరి నిమిషాల్లో ఓ సారి ఏంచేద్దాం అనుకున్నాం ఈ సమచ్చరం మొదట్లో ఓపాల్జూసుకుని, ఆటిని గోడామీద *వచ్చే ఏడు* అనిరాస్కుని, మురిసిపోదాం.
వచ్చే ఏడాదన్నా మనం అనుకున్నవి జరక్కపోతాయా, గుఱ్ఱం ఎగరకపోద్దా...
ఎప్పట్లానే ఉషారుగా కుషీకుషీగా ఉంటానికి, గతాన్ని గమ్మత్తుగా మర్సిపోటానికి ఈ కిందిపాటల్ని అంమృతంలా సేవించండి మరి -
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే..
నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వుల నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ...
................

పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే .
.పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే ..
ఓ చెలీ ..... ఓ చెలీ .....
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరైనీవు నాలోన సాగెవు
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ ..... ఓ చెలీ .....
ఎన్నో జన్మల బంధము మనది
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిది
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ ..... ఓ చెలీ .....

...........
ఓహో చెలీ ఓ నా చెలీ
ఇది తొలి పాట
ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట ఆ పాట
ఇది తొలి పాట
ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట ఆ పాట
ఎదుట నీవు ఎదలో నీవు ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్ని పాటలై మధువులొలుకు మమతే పాట
నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే నిలుపుకున్న వలపీపాట
పరిమళించు ఆబంధాలే పరవసించి పాడనా పాడనా పాడనా...ఓహో చెలీ ఓ నా చెలీ
ఇది తొలి పాట
ఒక చెలి పాట
వినిపించనా ఈ పూట ఆ పాట

చీకటిలో వాకిట నిలచీ దోసిట సిరిమల్లెలు తొలిచి
నిదురకాచి నీకై వేచీ నిలువెల్లా కవితలు చేసీ
కదలి కదలి నీవొస్తుంటే
కడలిపొంగుననిపిస్తుంటే
వెన్నెలై నీలో అలనై....
................
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ పెరుగును అనురాగం....
........
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే//

ఎలదేటిపాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే // సిరిమల్లె నీవే //

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే//
..................
నా ప్రేయసీ ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
(బాల సుబ్రహ్మణ్యం గారు తప్ప ఈపాటని ఇంకెవ్వరూ పాడలేరై నా ఘట్టి నమ్మకం, ముఖ్యంగా పాట మొదలయ్యేప్పటి గమకాలు).
..............
కలహంస నడక దానా
కమలాల కనులదానా
నీకనులు నీలికురులు నను నిలువనీకున్నవే...

.........
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో
మధుమాస వేళలో మరుమల్లె తోటలో

ఆడింది పూలకొమ్మ పాడింది కోయిలమ్మా
అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగేవేళా ప్రణయాలు పొంగేవేళా
నాలో రగిలే ఏదో జ్వాలా
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో

ఉదయించె భానుదీపం వికసించలేదు కమలం
నెలరాజు వ్రాతకోసం లేచింది కన్నెకుముదం
వలచింది వేదనకేనా వలచింది వేదనకేనా
జీవితమంతా దూరాలేనా

మధుమాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో
మధుమాస వేళలో మరుమల్లె తోటలో
................

మల్లెలు పూసే వెన్నలకాసే ఈ రేయి హాయిగా...

..............
అహో అందాలరాశి ఓహో అలనాటి ఊర్వశి ఆగలేడు నీ మందు ఏ ఋషి
.................
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎఱ్ఱచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చచీర కట్టుకుంటే పంటచేను సిరివమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
నేరేడు పళ్ళరంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగస్సుల్లూ
వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
.........................

నేనోక ప్రేమ పిపాసిని నీవోక్క ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హౄదయం కదలనిది
నెనొక ప్రెమ పిపాసిని
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్న
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వేలుతున్న
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్న
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వేలుతున్న
నా దాహం తీరనిది నీ హ్రుదయం కదలనిది
నెనొక ప్రెమ పిపాసిని
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సేగరేగిన గుండేకు చేబుతున్న నీ చేవిన పడితే చాలు
నీ గ్న్యపకాల నీడలలో నన్నేపుడో చూస్తావ్వు
నను వలచావని తేలిపేలోగ నివురై పోతాను
నెనొక ప్రెమ పిపాసిని
.............................
నవ్వవే నాచెలి చల్ల గాలి పిచేను మల్లు పులు నవ్వేను మమతలు పొంగే వేళలో..

................

సన్నాజాజికి గున్నమామికి పెళ్ళికుదిరింది
నాదేగెలుపని మాలతీలత నాట్యమాడింది..
..............
నికోసం యవ్వనమంతా వేచాను దాచాను మల్లెలలో
నీకోసం జీవితమంతా వేచాను సందెలలో
........
మెరుపులా మెరిసావు వలపులా కలిసావు..కన్నుమూసి తెరిచి చూసేలోగా మిన్నలలో నిలిచావు...
...............
నిన్నుమరచిపోవాలనీ అన్ని విడిచివెళ్ళాలనీ ఎన్నిసార్లు అనుకున్నా మనసురాక మానుకున్నా
......


ఇలారాస్కుంటూపోతే పేజీలు చాలవు...కమ్మని ఈపాటలు ఇక్కడ వింటూ...రాబోయే సమచ్చరం జీవితాల్లో అంమృతాన్ని నింపాలని ఆసిద్దాం....

Dec 30, 2009

కన్నడ నటుడు విష్ణువర్ధన్

ఆరోజు పంజాగుట్ట కేఫ్ కాఫీడే దగ్గర, బయట నిల్చుని కాఫీ తాగుదాం అని నేనూ నా మితృడు కౌంటర్ దగ్గరకి వెళ్ళాం. ఒకతను మా కన్నా ముందు కౌంటర్ దగ్గర నిల్చుకోని ఉన్నాడు. కాపీ ఆర్డర్ జెస్తున్నాడు. తెల్ల చొక్క తెల్ల ప్యాంటు, తలకి ఏదో ఓ టోపి పెట్టుకుని ఉన్నాడు. ఉన్నట్టుండి ఎనక్కి తిరిగాడు. అతను విష్ణువర్ధన్. బయట, మామూలు మనిషిలా, నిల్చుని కాఫీ ఆర్డర్ చేయ్యటం నాకు ఆశ్చర్యం వేసింది. మీరు చాలా మంచి నటులండి అని కరచాలనం చేసాం నా మితృడు నేనూ. మాకూ తనే కాఫీ ఆర్డర్ చేసాడు వద్దంటున్నా వినకుండా.
బుధవారం, డిశెంబర్ ముఫైన అయన స్వర్గస్తులయ్యారని వార్త చూసేప్పటికి ధిగ్భ్రాంతికి గురయ్యా.

ఇక ఇంకోవార్త *రుచిక మోలెస్టేషన్ కెసు* -
The school had claimed that Ruchika Girhotra, who was molested by former Harayana top cop S P S Rathore and later committed suicide, was removed on grounds of not paying the school fees in time, but her family was not convinced.

ఛీఛీ...ఇదీ మన భారతం.
http://timesofindia.indiatimes.com/city/chandigarh/Ruchika-molestation-case-PIL-against-school-for-expulsion/articleshow/5387266.cms

Dec 27, 2009

జ్ఞాపకాల దొంతర - వైకుంఠ ఏకాదశి

మనం పరమబేవార్సుగా తిరిగే రోజుల్లో, ఇంట్లో అప్పటికి మా నాయన నాస్తికత్వ చొక్కాని ఇంకా ఏసుకుతిరిగే రోజుల్లో, మాయమ్మ హిందూ సనాతన ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తూ మహానైవేద్యాలు పెట్టేరోజుల్లో, ఒకానొక రోజున మా సందు సివరాకరున్న శ్రీ బడబానల వీరప్రతాప ఆంజనేయస్వామి వారి భక్తులు కొందరు, మా పక్కింట్లోని వెంకటేశ్వర రావు మాష్టరు *శ్రీ విష్ణుసహస్రనామ అహోరాత్రపారాయణ* ఏర్పాటుచేసారు. ఓ పెద్ద ఏర్పాటు, జనాలు, అట్టఇట్టా అని అందరూ అంటుండగా విన్నా. ఇక రేపు పొద్దున మొదలెడతారనంగా మాష్టారుగారు నన్నోకేకేసి పిలిచి అబ్బాయి, నువ్వు నీమిత్రబృందం అందరూ పాల్గోవాలి అని చెప్పారు. వాకే దాందేముంది అన్నాం అందరం. అప్పటిదాకా విష్ణుసహస్రనామం అనే పేరు ఇనటమేగానీ అదేంది, ఆ కధేంది మనకసలేం తెల్వది.
సరే, వెంకటేశ్వర రావు గారు, అబ్బాయిలూ రేపు అహోరాత్రపారాయణ, అచ్చేయండా అంటే - వాకే అన్నాం. ఆయన అలాక్కాదు బాబూ, ఇదీ ఇదిఇదానం అని ఇవరణ చెప్పారు.
అహోరాత్ర పారాయణ - పొద్దున ఆరుకి మొదలు, ఆపకుండా మర్రోజు పొద్దున ఆరుదాకా సదవాల. బువ్వ తినకూడదీ, సుట్ట బీడీ తాక్కూడదీ, బయటకి పోకూడదీ, నో ఔట్ గోయింగ్, నో ఇన్కమింగ్, నో పార్కింఎటాల్ అనిజెప్పారు.
వోరినాయనో పొద్దుగాలపొద్దుగాల ఆర్కి మొదలెట్టి మర్రోజు పొద్దున ఆరుదాకా సవినమంటే గొంతుకాస్తా బొంతవదా సోవీ అని సందేహం ఎలిబుచ్చాం. ఓరిపిచ్చిసన్నాసి అదా నీ సందేహం అని - నువ్వు మొదలెడతావు, ఇంతలో ఇంకోడందుకుంటాడు, అలా తర్వాత ఇంకోడు..అలా ఆపకన్డా మర్రోజు పొద్దుటిదాకా అనిజెప్పి కళ్ళు తెరిపించాడా మగానుభావుడు.
ఇంకేముంది, మర్రోజు పొద్దుగాల్నే లెగిచేసి బావికాడ ఓ నాలుగు బుంగలు నెత్తినపోస్కుని, ఓ తెల్లపంచ గోచిపెట్టుకుని సలికి గజగజ లాడుకుంటా ఎళ్ళి కూకున్నాం.
హా వచ్చావా ఇంద ఈ బొక్కు తీస్క్కూర్చో, మొదలెట్టు అన్నారాయన. అప్పటికే ఓ పాతికమంది చేరుకున్నారు. హడావిడిగా ఉంది.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం...
ఇంతవరకూ సురిగాడిక్కూడా వచ్చు.
పూర్వపీఠిక మొదలయ్యింది. ఎబ్బే నోరు తిరగట్లా. అందరు పండితుల్లా సదివేస్తున్నారు. మనకేమో నొక్కులు. మన పక్కనకూకున్నాయన ఓ పెద్దమగానుభావుళ్ళా ఉన్నాడు, ఇసుగ్గా సూట్టం మొదలెట్టాడు. అలా అచ్చరం అచ్చరం కూడబలుక్కుని మొత్తానికి ఒకరౌండు లాగించి వెంకటేశ్వర రావుగారి వైపు జూసా అయ్యా ఓపాల్జదివా ఇక ఎళ్ళొచ్చా వల్లోతల్లేమరి, ఏంజెయ్యాలే అని. ఆయన, మొదటి రౌండు మూడుగంటలు తమ్మీ. కూకో, మూడు గంటల్లో ఎన్నిసార్లో సదువతరో అన్నిసార్లు సదువహే అనిసెలవిచ్చారు. మూడుసార్లవరకూ కుంటుతూ నడిచబండి నాలుగోసారికి పర్లేదు, ఐదోసారికి ఇంకాస్తమెరుగైయ్యింది. మొత్తానికి మన మూడుగంటల ప్రహసనం అయ్యింది. ఆరోజు సాయంత్రం మళ్ళీ ఓ మూడుగంటలు కూకున్నాం. మర్రోజు పొద్దున, ఆరుకల్లా వచ్చేమన్నారు. ఎళ్ళాం. ఈసారి నిన్నపొదుణ్ణుండి సదివన అందరూ వచ్చారు. చివర్స్సారి చదివింది అత్భుతంగా అనిపించింది. అయ్యాక అందరికీ ఉల్ల్స్, మిరగాయలు గట్రా ఎయ్యకుడా చేసిన గోధుమఉప్మా భిక్ష పెట్టారు.
అయ్యాక ఒక పెద్దాయన పిలిచాడు, ఆయన సేతిలో ఓ పెద్దనోటుబుక్కు. అబ్బాయి నీపేరు గోత్రం గట్రా చెప్పుకో అన్నాడు. ఎందుకో అనుకుని చూస్తే అప్పుడు కనిపించింది అక్కడో బ్యానరు *శ్రీ విష్ణు సహరనామ పారాయణా సంఘం, బ్రాడీపేట* అని. ఈపెద్దయన దానికి ప్రెసినెంటు. సదవటానికిచ్చిన బొక్కు ఈళ్ళు అచ్చేయ్యించిందే. అబ్బాయి ఈసారి ఏకాదశికి మళ్ళీ అహోరాత్రపారాయణ ఇంకోరింటో. నీకు ఓకార్డుముక్క ఏస్తాం, తప్పకుండా రావాలి అని సెలవిచ్చారా పెద్దాయన.
అలా మొట్టమొదటిసారి శ్రీ విష్ణుసహస్రనామ పరిచయం అయ్యింది.
ఇక తర్వాత యం.యస్ సుబ్బులక్ష్మిగారు *శ్రీ విష్ణుసహస్రనమం* అనేదొకటుంటుందని తెల్సుకుని, క్యాసెట్టు చేయింద్చుకుని అప్పుడప్పుడు సదవటం మొదలెట్టా.
అది అప్పుడప్పుడు నుండి ప్రతీరోజు కి మారింది ఒకానొక సీజనులో.
ఇప్పుడు తప్పులు లేకుండా చదవగలిగేంత రేంజికి వచ్చింది కధ.

అస్సలేందయ్యా అంటే - ఇంతదూరాభారంలో, అహోరాత్రపారాయణలు జరగటం కాదు, కనీసం చదివే భాగ్యం దొరకటమే కష్టం.
ఈ రోజు మా ఊళ్ళో వైకుంఠఏకాదశి చేస్తున్నారు. సాయంత్రం గుళ్ళో శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ. గమ్మత్తేంటంటే ఈ పారయణ సామూహికంగా చేస్తే భలే ఉంటుంది.

మీ అందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు. ఆ భగవానుడు అందరినీ సదా కాపాడుగాక.

Dec 25, 2009

మీ సెలవలు ఆనందకరమగుగాక.....

Whether the weather be fine,
Or whether the weather be not,
Whether the weather be cold,
Or whether the weather be hot,
We'll whether the weather
Whatever the weather
Whether we like it or not.


HAPPY HOLIDAYS TO ALL......

Dec 22, 2009

శనిభగవానుడు సదా రక్ష్మించుగాక

మొన్న శనివారం, పొద్దున్నపొద్దునే గుడికెళ్ళా. ఇక్కడ పొద్దున్నే గుడి అంటే తొమ్మిది అని అర్ధం, సాధారణ పరీస్థితుల్లో. శనివారం, కాస్త తెల్లజుట్టువచ్చినోళ్ళ దగ్గర్నుండి ముగ్గుబుట్టైన జనులందరూ సాధారణంగా గుడిని విధిగా దర్శిస్తుంటారు. శనివారం పొద్దునే అలా వచ్చి, చక్కగా కూర్చుని, అందరూ కలసి సుప్రభాతం, సూక్తాలు (నారాయణ, శ్రీ, దుర్గా, పురుష), లక్ష్మీ/శ్రీ విష్ణు/లలితా సహస్రనామాల్లో వారానికొకటి చదువుకుని వెళ్తుంటారు. మరి మనకీ జుట్టు తెల్లబడుతోందికదా అందుకే, మరీ ప్రతీవారంకాదుగానీ అప్పుడప్పుడూ వెళ్ళి మనగొంతుని ఆళ్ళతో కలిపి ఆలపించి అదీఇదీజేసి వస్తుంటా. సరే, మొన్న మన సమయంలో వెళ్ళా, హాశ్చర్యం గుడి ఖాళి. నగ్రహాలవద్ద పండిట్ సిమ్మాగారు, మనకి తెలిసిన ఓ పెద్దవారు నవగ్ర్హార్చన చేస్తున్నారు. వెళ్ళి నిలుచున్నా. సిమ్మాజీ చేతులు కలుపు అని నువ్వుల నూనె చేతికిచ్చి అభిశేకం చేయమన్నాడు, మొదలెట్టా. ఆయన, పక్కనున్న వారు ఇద్దరూ మంత్రోఛారణ చేస్తున్నారు. నువ్వు చదవవయ్యా భాస్కరా అన్నారు సిమ్మాజి. అదేంమంత్రం అంటే -
శన్నో దేవీ రభిష్టయే | ఆపో భవంతు పీతయే” | శమ్యో రభిస్ర వంతునః ||.
అనగా - ఆ శనిభగవానుడు, సదా కాపాడుగాక, అభీష్టాలు నెరవేర్చుగాకా అని.
కరెష్టుగా మనం ఎళ్ళిన టయానికి ఆయన అభిషేకం చేస్తూండతం, మనల్నీ భాగస్వామిగా పిలవటం, పై మంత్రం..కొంచెం ఆనందం వేసింది.
ఆటుపిమ్మట, ఏటి సావీ ఈ రోజు గుడి నిశబ్దంగా, ఖాళీగా ఉంది, జనులెరీ అంటే, ఓరీ, బిడ్డా, ఇది ధనుర్మాసం కావున, పొద్దున ఆరుకే గుడి తెరవబడుతోంది, పొద్దున్నే తిరుప్పావై, సుప్రభాతం, అవీవి కార్యక్రమలు ఐపోతున్నాయి అని తెలిపారు.
అదీ కధ

Dec 17, 2009

పుత్రోత్సాహం...

మావోడు నిన్న ఏదోబెరికి ఓ కవర్లో పెట్టి నిన్ననే తెరిచ్చూడమని తెరిచిందాకా పీకలమీన కూకున్నాడు. ఏట్రా అంటే ఇదిగో ఇది -
ఇది ముఖపత్రం -


ఇది సివరాకరి పత్రం అనగా ఎనకమాల కాయితకం -ముఖపత్రం -
అక్వేరియం.
సున్నాలు సున్నాలు రంగురంగుల నీటి బుడగలు. కొన్ని సేపలు సొరసేపలు, కొన్ని ఆక్టోపస్లు, ఓట్రేండు తిమింగళాలు [యాడా సూపీ అనమాక], కింద ఓ ముత్యంసిప్ప, అందులొ ఓ ముత్యం, పక్కనే ట్రేజర్ ఛెస్ట్ అనగా భోషాణం పెట్టె, అడుగున సీవీడ్స్.
ఎనకమాల -
సెట్టు, ఉయ్యలలు సెట్టుకి.
మొట్టమొదట ఆడు, తర్వాద్ది నేను, నాఎమ్మట ఆళ్ళమ్మ, సివరాకర్న సెల్లి.
ఓ పువ్వు...
ఐనాక లైటెనింగ్స్, లైటేనింగ్ మెక్వీన్. నెంబరు తొంబ్బైయ్యైదు.
సివరాకర్న గ్లోబు కాదంటయ్యా, అది కాలి బంతంట. నేనూ ఆడు ఆడుతున్నట్టూహించుకోవాలంట.

Dec 12, 2009

నాకూ ఓ బస్సు కావాలి

ఇందాక సూరిగాడు ఓ బొక్కు తెచ్చుక్కూర్చుని సదివి ఇనిపించమన్నాడు.
ఇంతలో సంటిదొచ్చి ఆ బొక్కుని లాగేస్కుళ్ళింది. ఆడు దాన్ని ఇటు గుంజను, పిల్ల అటు గుంజనూ. ఛీఛీ నాకర్జెంటుగా ఓ ఎఱ్ఱబస్సుకవాలి పగల్నూకటానికి.
[సమైక్యాంధ్రా జెయెసి అంట ఇరవై కోట్లకి పగల్నూకితే, ఇట్టాజరగాల్సిందే అనెజెప్పిన తెలంగాణా సవరయ్యలు యాభైకోట్లకి పగల్నూకారు బస్సుల్ని, ఆళ్ళఆళ్ళ బాబుల సొమ్ములు కదా]

Dec 10, 2009

లాస్ ఏంజలస్ లో

లాస్ ఏంజలస్ లోని బర్బ్యాంక్ (Burbank) లో ఎవరైనా తెలుగు బ్లాగ్ జనులున్నచో తెలుపగలరు.

Dec 6, 2009

వేణుశ్రీకాంత్ కి ...

ఆర్యా
ఇయ్యాలనీ పుట్టిన్రోజు.
సరే, శుభాకాంక్షలు అందజేస్కుంటన్నాం...
ఇంతవరకూ బానే ఉంది. ఈ కత ఇనుకో...
మా ఇంటి ఎనకమాల బెండకాయ మొక్కలేఏసాం. బెమ్మాండంగా కాపొచ్చింది. లేతోటిని కోసి మార్కెట్టుకేసినం, మాంచి రేటొచ్చింది.
ఒట్రెండు ముద్రిపొయినై. రేటు పడిపోయింది.
మరింక సెప్పేదేముంది.
మోస్టు ఎలిజబుల్లు బేచిలర్ అనే టేగు...ఇంక మింగుడుబడట్లా.

సోదాపి ఇషయానికొత్తే -
పప్పనం ఎప్పుడూ?
ఇది నా ప్రశ్నే కాదు, మా సూరిగాడు, సివరాకరికి మా సంటిదిక్కూడా అడగమంది.

మరదీ కత

మళ్ళోస్సారి -
పుట్టిన్రోజు శుభాకాంక్షలు.

గూగుల్లో బింగ్

ఇయ్యాల పొద్దుగాల్నే పొద్దుగాల్నే లాండ్రోమార్ట్ కెళ్ళి పాయింటులు సొక్కాలు ఉతికేద్దాం సమచ్చరానికోసారన్నా అని నిర్ణయం తీస్కున్నా.
ఇప్పటిదాంకా ఎప్పుడూ లాండ్రోమార్ట్కి పోలే. ఇంటికాణ్ణే ఉతుక్కున్నం.
గోగులుకెళ్ళినా లాండ్రోమార్ట్ అనికొట్టినా...
మ్యాప్ ఇచ్చిండు. మస్తుంది. పక్కనే స్పాన్సర్డ్ లింక్స్ అని వచ్చింది.
బింగ్ లింక్ ఉంది.
ఆశ్చర్యం వేసింది నాకు. స్పాన్సర్డ్ లింక్స్ లో గూగుల్కి పోటీదారు బింగ్ లింక్.
సమఝ్ గాలే.

Dec 2, 2009

తెలంగాణా పోరగాడా!! సిగ్గుసిగ్గు!!!!

అయ్యా కేసీఆర్ - ఖుద్ మర్నాహై తో మరో!! దూస్రోంకో కైకూ వాట్ లగాతేహో...
ఎదవనాకొడక సస్తే సావు. బస్సుల్ని, జనాల్ని దేనికి సంపటం - అచ్చతెలుగులో సెప్పాల్సొస్తె ఇదీ కత.

ప్రతీ ఎదవకీ బస్సులంటే, రోడ్డెంమ్మటెళ్ళే జనాలంటే, జబ్బుజేసిన ముసలిముతకంటే, నోరులేని మద్దెతరగతి మనుషుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. థూ!!

తెలంగాణా రాష్ట్రం వస్తే ఏంపీకుతారు, అరవైఏళ్ళ దేశాన్నే ఏంపీకలేని ఈ రాజకీయనాయకులు. ధూ!!!

సంపండి, కొట్టండి. ఇదీ ఈనాటి విద్యార్ధుల చరిత్ర. ఇదీ ఈనాటి యువత ఘనత. వీరులారా! కొనసాగించండి మీ లూటీలను, అల్లల్లాడించండి సామాన్య ప్రజలను, కొనసాగించండి మీ అరవీర భయంకర ఆవేశాలను సామాన్యులపై.
అడ్డేముంది, పోయేదేముంది!!!

బస్సులు, బళ్ళు, ఆశుపత్రులు, డిపోలు, పొట్టి శ్రీరాములు విగ్రహాలు, పిల్లలు, ఆటోలు ఈటిమీద చూపాలి ప్రతాపం. అందుకేగా మనకి ఈ చదువులు. విద్య నేర్పింది అదేగా.

గ్రేటర్ ఎన్నికల్లో నుంచోటానికి ధైర్యంలేదు. పోయిన ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయ, నేనైతే దీన్ని దేశద్రోహం అనే అంటా. మరి మీరేమంటారూ?
కొసమెరుపు - కెసీఆర్ ఆరోగ్యమ్ క్షీణించింది. సరే, దానికి ఆంధ్రావాళ్ళు డౌన్ డౌన్!! కెవ్వు కేక. మెదడు మోకాల్లోకి కాదు అరికాల్లోకి దిగినట్టుంది. ఇంక వీళ్ళకి ప్రత్యేక రాష్ట్రం గావాల్నంట. కెవ్వుకేక.

Dec 1, 2009

ఝాన్సీరాణి

ఝాన్సీరాణి గుఱ్ఱంపై పరుగులు తీస్తూ స్వైరవిహారం చేస్తే, ఇంకేముంది శతృవర్గాలు చెల్లాచెదురై మట్టికరవకుండా ఎలా?