Nov 30, 2010

మమేకం కాలేనప్పుడు దీక్షబూననేలా?


జగన్ కాంగ్రేసు నుండి బయటకొచ్చాడు. బానే ఉంది. నిన్నటిదాకా సోనియా దేవత ఇప్పుడో బొమ్మలు చింపేసారు, చెప్పుల్తో కొట్టారు, ఎవరి విలువలు వాళ్ళకి ఉండచ్చు ఉండకపోనూ వచ్చు దిగజారిపోయి ఉండచ్చు అమ్ముడుపోయి ఉండచ్చు. కానీ పై బొమ్మ నాకు కష్టంగా అనిపించటానికి కారణం ఎడమవైపు చివరి వ్యక్తి. మాల వేస్కున్నాడు, బొట్టు పెట్టాడు, కాషాయం కట్టాడు, కానీ, చూడండి ఏంచేస్తున్నాడో?
మమేకం కాలేనప్పుడు దీక్షబూననేలా?

నల్లధనంపై అధ్యయనం!

నల్లధనంపై అధ్యయనం!
Click To See Full Photo దేశంలో నల్లధనం మొత్తం ఎంతుందో తేల్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది ఎలా పుడుతోంది, ఎంత ఉంది అన్నది అంచనా వేసేందుకు అధ్యయనం జరిపించాలని యోచిస్తోంది.

వార్నీ! ప్రణబ్ ముఖర్జీ, ఏందివయ్యా, ఎంత ఉంటే ఏంజేస్తా? ఎలా పుడుతోందీ అంటావా? నువ్వే ప్రశ్నించుకో సమాధానం వచ్చుద్ది. లేకుంటే ఏ యంపీని అడిగిన్యా ఎంఎల్యేని అడిగిన్యా కాదూ వద్దూ లేదూ అంటే వార్డ్ కౌన్సిలర్ని అడిగినా సెప్యాడుగ్యా.

* నల్లధనం ఎలా పుడుతోంది?
* భారత్‌లో ఎంతుంది?
* విదేశాల్లో ఎంత మొత్తం దాచారు?
* దేశంలో నల్లధనం పుట్టుకకు దోహదం చేస్తున్న ప్రధాన రంగాలేవి?
* ఈ సొమ్ముతో దేశ భద్రతకు ఎదురవుతున్న ముప్పు ఏమిటి?
* దేశంలో, విదేశాల్లో మనీ ల్యాండరింగ్‌కు నల్లధనం కారణమవుతోందా?
* లెక్కాపత్రం లేని డబ్బు ఆర్జనకు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు?
* దీనిని చెలామణిలోకి ఎలా తెస్తున్నారు?
* నల్లధనాన్ని గుర్తించడానికి ఉన్న మార్గాలేంటి?
* ఈ సొమ్ముపై పన్నులు వేయడం ఎలా?

ఎవురైనా ఈటికి సమాధానాలు సెప్పగల్రా?

Nov 23, 2010

ఆమె దేశ దేవత, ఓ సంఘ సంస్కర్త - ఆమెనే తిడతార్రా??

సోనియాని తిడితే దాడులు తప్పవు
ఆమె అనుమతితో పెట్టిన పేపర్‌ అది
కాంగ్రెస్‌కు అనుకూలంగానే వార్తలు రాయాలి
ఎంపీ రాయపాటి స్పష్టీకరణ
సోనియాగాంధీని తిడుతూ, కాంగ్రెస్‌ పనైపోయిందంటూ వార్తలు రాస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్వరంతో హెచ్చరించారు. అదే జరిగితే ఎవరిమీదైనా దాడులు తప్పవని స్పష్టం చేశారు.


ఔను, నేనూ ఊర్కోను. అడ్డంగా నరకతా, కండలు కొరకతా. నరాలు పీకతా. సోనియా భారతదేశానికే లైవ్ దేవత. అంటే లివింగ్ దేవత. ఆయ్, ఆమెనే అంటారా? ఆమె అనుమతిస్తేనే సాక్షీ దిన పుత్రిక పుట్టింది [ఆమె నవమాసాలూ మోసి, పాపం కన్నది]. సాక్షే కాదు ఏదైనా ఎవడైనా, నాయాల్ది, బస్తీమే సవాల్. ఔను, ఆమె ఓ దేవతే. ఓ రాణి. ఆమె అనుమతి లేకుండా గాలికూడా వీచదు. ఆమె దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఈరోజున ఐదు వేళ్ళు నోట్లోకెళ్తన్నాయ జనాలకి అంటే ఆమె సలవే.

రాయపాటి అన్నా నువ్వు గంమ్మునుండు, మేం చూస్కుంటాం. నీ [అవినీతిని] పాలనను నువ్వు కొన-సాగించు హ్యాప్పీగా. అటు ఇటు సూడమాక ఓ పాతిక కోట్లు తగ్గతుంది సంపాదనలో.

Nov 22, 2010

మా గురువుగారు పంపిన మెయిల్

A friend of mine sent the following excerpt - enjoy!

"When things in your life seem, almost too much to handle,
When 24 Hours in a day is not enough,
Remember the mayonnaise jar and 2 cups of coffee.

A professor stood before his philosophy class
and had some items in front of him.
When the class began, wordlessly,
He picked up a very large and empty mayonnaise jar
And proceeded to fill it with golf balls.

He then asked the students, if the jar was full.
They agreed that it was.

The professor then picked up a box of pebbles and poured
them into the jar. He shook the jar lightly.
The pebbles rolled into the open Areas between the golf balls.

He then asked the students again if the jar was full. They agreed it was.

The professor next picked up a box of sand and poured it into the jar.
Of course, the sand filled up everything else.
He asked once more if the jar was full. The students responded with a unanimous 'yes.'

The professor then produced two cups of coffee from under the table and poured the entire contents into the jar, effectively
filling the empty space between the sand. The students laughed.

'Now,' said the professor, as the laughter subsided,
'I want you to recognize that this jar represents your life.
The golf balls are the important things - Family,
Children, Health, Friends, and The Lord –
Things that if everything else was lost and only they remained, Your life would still be full.

The pebbles are the other things that matter like your job, house, and car.

The sand is everything else --The small stuff.

'If you put the sand into the jar first,' He continued,
there is no room for the pebbles or the golf balls.
The same goes for life.

If you spend all your time and energy on the small stuff,
You will never have room for the things that are important to you.

So...

Pay attention to the things that are critical to your happiness.
Play With your children.
Take time to get medical checkups.
Take your partner out to dinner.

There will always be time to clean the house and fix the disposal.

'Take care of the golf balls first --
The things that really matter.
Set your priorities. The rest is just sand.'

One of the students raised her hand and inquired what the coffee represented.

The professor smiled.
'I'm glad you asked'.

It just goes to show you that no matter how full your life may seem,
there's always room for a couple of cups of coffee with a friend !!!.'

--
Regards

Hari OM

Nov 17, 2010

సెల్ఫ్ మోటివేషన్

సెల్ఫ్ మోటివేషన్, పంతం, పట్టుదల వీటితో దేన్నైనా సాధించవచ్చు.
ఏమా కథ?
నేనీమధ్య నా నడక ట్రెండ్ లేక పా౨టర్న్ మార్చాను. ఇంతకమునుపు గంటకి 3.5 లేక 3.6 మైళ్ళ వేగంతో నడిచేవాణ్ణి.
ఈ మధ్య ఇలా చేస్తున్నా-
నడిచే అరగంటో లేక నలభైనిమిషాల్లో మొదటి ఐదు నిమిషాలు వార్మ్-అప్. మిగతా ముఫై నిమిషాల్లో, మొదటి పదినిమిషాలు గంటకి 4.1 మైళ్ళ వేగంతో, తర్వాతి పదినిమిషాలు 4.0 మైళ్ళ వేగంతో, చివరి పదినిమిషాలు 3.9 మైళ్ళ వేగంతో నడవటం మొదలెట్టా. ఇన్క్లినేషన్ 1 పెడతా. ఈ పా౨టర్న్ వల్ల నా వర్కౌట్ అయ్యేప్పటికి షుమారుగా 280 కేలరీలు ఖర్చు ఔవుతున్నాయి.
నిన్న ఇలా చేసా
గోల్ 45 నిమిషాలు
మొదటి ఐదు నిమిషాలు వార్మ్-అప్
తర్వాతి పది నిమిషాలు 4.1 మైళ్ళ వేగంతో
తర్వాతి పదినిమిషాలు 3.2 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 10
తర్వాతి పదినిమిషాలు 3.3 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 9
చివరి పదినిమిషాలు 3.4 మైళ్ళ వేగంతో, ఇన్క్లినేషన్ 8
అంటే కొండ ఎక్కిన ఎఫెక్ట్‌తో నడిచాను.
దానివల్ల నా టోటల్ వర్కౌట్ అయ్యేప్పటికి ఖర్చుచేసిన కేలరీలు 420.
బ్రదరూ, కావాల్సింది మోటివేషన్. నీ మీద నీకు నమ్మకం, *నేను నడవగలను* అనే ఓ నమ్మకం, నడవాలి అనే పంతం. మొదటి పదినిమిషాలు బానే అయ్యింది. ఇన్క్లినేషన్ పెంచా. బాడి అబ్బా, ఆపరా, వెళ్దాం ఇక అని గోల మొదలెట్టింది. నీ ఎన్కమ్మ, నడువ్ అని నడిపించా. చెమట కక్కాను. మూడొ పదినిమిషాలు బుద్ధి తన అసలు రూపం చూపింది. ఇక పద అంది. నో అన్నా. మంచీళ్ళు కావాలి నాకు అంది. అరవమాక అన్నా. షూ లేస్ ఊడింది చూసావా ఇక ఆపు అంది. ఏంపర్లేదు నడువ్ అన్నా.
బీట్ ది క్రాప్ బడ్, దేన్నైనా నువ్వు చేయాలి అనుకుంటే, నువ్వు తప్పక చేయగలవు. కానీ ఎప్పుడూ? ఆ కసి, పంతం పెంచుకున్నప్పుడు.
నిజంగా నువ్వు చేయగలవు.
బీట్ ది క్రాప్ బడ్....

Nov 16, 2010

గూ.గోల

బజ్ ని తెలుగులో ఏమంటారు?
అసలు బజ్ అంటే ఒకానొక అర్థం తూనిగ లేక తుమ్మెద లేక చిన్నచిన్న ప్రాణుల రెక్కల కంపనం వల్ల వచ్చేశబ్దం. ఈగ లేక దోమ చెవిపక్కగా వెళ్తే వినవచ్చే శబ్దం బజ్‌జ్‌జ్...
గూగుల్ బజ్
అంటే
గూగుల్లో నీ గోల లేక కంపనం అనుకోవచ్చేమో.

కాబట్టాబ్బాయ్ గూగుల్ బజ్ అంటే గూగుల్ గోల అంటే గూ.గోల

మన సుబ్బులన్నట్టు,
గూగోల వచ్చినాక
కూసింత తగ్గింది బ్లాగోల.
బజ్‌లో బల్లే బల్లే సంగతులు వినిపిస్తున్నాయ్.
గీతాచార్య ఎక్కడున్నాడో ఏంచేస్తున్నాడో గోలడుతుంటాడు. మనోడి ప్రతీ బజ్‌కి తప్పనిసరిగా ఇద్దరు లైకర్స్ అనగా ఇష్టపడువారు ఉంటారు. ఒకరు సృజన, అబ్బే అందులో పెద్ద ఇషయం లేదు. కానీ ఇంకొరెవురూ? అంటే ధనరాజ్ మన్మథ.
ఇక రోజుకో బజ్‌తో గూబ గుయ్ మనిపించే బ్యాచి ఎవుర్దంటే మన కెలుకుడు బ్యాచీదే. నాగ తెగ బజ్‌తాడు. ఇక ఏండి డేండి రోజుకో బజ్. అప్పుడప్పుడు మురిపిస్తుంటాడు మన ఆర్.కె. భరద్వాజ ఎప్పుడన్నా ఓ బజ్జు. మొన్నీమధ్య బజ్‌యొక్క ఓర్పుని పరీక్షింపజేసాడు ప్రవీణ్. అప్పుడు బజ్‌లో కమెంట్ల సంఖ్యకై ఒక పరీక్షకి తెరలేపాడు మన భరద్వాజ. ఆ పరీక్షలో తేలిందేంటంటే ౫౦౦ కమెంట్లుమాత్రమే బజ్‌ తట్టుకోగలదు అని.
అప్పారావుశాస్త్రి అప్పుడప్పుడు మాంచి కెలుకుడుకి వేదికౌతాడు ఏదోక బజ్‌తో.
మన పవన్ బజ్ హాట్ హాట్ బజ్. ఒక బజ్ ‌కి వంద వ్యాఖ్యలు తప్పనిసరి.
మంచుపల్లకి తనదైన శైలిలో బజ్‌తుంటాడు. ఎక్కువగా సెగెట్రీమీద గూబలు గుయ్ మనిపిస్తుంటాడు. చదువరిగారు అప్పుడప్పుడూ కిస్క్ అంటుంటారు బజ్‌లో. అంటే ఒకలైను లేక రెండులైనులు అన్నమాట. ఇక
ఈ మధ్యకాలంలో నేస్తంగారి బజ్ బాగా హిట్టైంది. ఒక్కో బజ్జుకి బుజబుజలాడుతూ వంద వ్యాఖ్యలు కొట్టారు జనాలు. సారీ వీళ్ళని జనాలు అనకూడదు, తమ్ముళ్ళు సెల్లెళ్ళ బృందం అనాలు. రాజ్‌కుమార్, ఏరాజ్యానికీ రాజకుమారుడు కాదు, ఆర్యుడో ద్రావిడుడో కూడా తెలియకపోయినా, సెగెట్రీ పొజీషన్లోకి దూసుకొచ్చాడు. అదే, నేస్తంగారి తమ్ముళ్ళు సెల్లెళ్ళ సంఘానికి సెగెట్రి అన్నమాట. ఇక అప్పుడప్పుడూ మధురవాణిగారు మృదుమధురంగా తమ గాత్రాన్ని టపాలా అందిస్తుంటారు. మ.వా గారి ప్రతీటాపా ఓ హిట్టే.
మా అనుజుల బజ్జులు ప్రతీరోజూ ఏదోక విషయ వడ్దింపు ఉంటుంది. మా సోదరులు శ్రీ అక్కిరాజు ప్రసాద్ గారు కూడా ఓ బ్లాగరే. ఆయన బ్లాగు ఏ సంకలినిలోనూ కనిపించదు. వారి బ్లాగు పేరు *
అంతర్యామి* ఇదిగో లింకు http://prasad-akkiraju.blogspot.com

నా సోదరుడు తన ఛయాచిత్రగ్రాహక ప్రవాహాన్ని పంచుతుంటాడు. అదో మహాప్రవాహంలా అనిపిస్తూ ఉంటుంది.
ఛాయాచిత్రగ్రాహకం = కెమేరా.

ఇక నా గూ.గోల - చెప్పేదేముంది, ఏదోక టపా, వేస్తాను. నల్గురితో పంచుకోవాలనిపించిన ప్రతీది బజ్లో వేసేస్తా.


గూగుల్ మెయిల్ వాడకందారులారా, మీరూనూ బజ్‌ ఖాతా తెరిచి గూబలు గుయ్ మనేలా గోలచేయండి ఇక.

Nov 12, 2010

కోరికతీరెనే

ఇవ్వాళ్ళ పొద్దున్నే -
సమయం ఏడు
లేరా
హా..హూం
లేవరా బడి టయం అవుతోంది.
హా.హూం
[డోర్ కర్టెన్ తీసి చూస్తే వానపడుతోంది]
నాన్నా లేరా వానపడుతోంది, లేటు అవుతావ్ బస్సుకి
[టంటటాయ్...టకాటక్]
[లేచి కూర్చుని]
హా, ఏంటి వానపడుతోందా
ఐతే గొడుగేస్కెళ్ళొచ్చన్నమాట
వాన ఉంటే నువ్వెళ్ళేప్పటికి పడుతుంటే ఏస్కెళ్దువుగాన్లే
ఏంకాదు, పడుతుంది. ఎక్కడా గొడుగు? తీ బయటకి
అరేయ్ నీకు అందదు, స్నానం చేసి రెడీగా ఇస్తాగా
కాదు ఇవ్వు, రెడీగా పెట్టుకుంటా
[నేను] ఇవ్వు తీసి వాడితో గోల దేనికి
[తను] సరేరా ఇదిగో [తీసి ఇచ్చింది]
[ఢమాల్ ఢిమీల్ - పది నిమిషల్లో రెడీ అయి కూర్చున్నాడు.]
[గొడుగు తెరవటం ముడవటం ఆట ఆడుతున్నాడు]
[బస్సు దగ్గర]
నిక్ నా గొడుగు ఇదిగో
అరే టేంకెగా ఇదిగో నా గొడుగు
ఏం రాసుందో చూసావా *రాక్&రోల్ టీం*

ఇంతలో బస్సొచ్చింది.......అలా మాట్లాడుకుంటూ ఎక్కాడు చేతిలో గొడుగుతో, ఓరగ తెరిచిపట్తుకుని. బస్సు డ్రైవర్ కి చూపించి ఏదో చెప్తున్నాడు. నేను నెమ్మదిగా నా కారువైపుకి అడుగులెసాను.

Nov 11, 2010

క్షణం తీరిక లేదు

అలా వేళ్తోంది జీవితనౌక
పిల్లాజెల్లా
జలుబులు
దగ్గులు
కోరికలు
గుఱ్ఱాలు
బళ్ళు
గుళ్ళు
నిద్రలేని రాత్రులు
పిల్లల కలవరింతలు
పిల్లల పలవరింతలు
తీరకలేదా అంటే లేదు
ఉందా అంటే ఉంది
లేనట్టుగా ఉంది
ఉన్నట్టుగా లేదు
క్షణం తీరిక లేదు
ఔను, లేదు
అలా వెళ్తోంది జీవిత నౌక
ఏ గమ్యంవైపుకో
ఇదిమిద్ధంగా తెలియని ప్రయాణాంలో
తెలియని ప్రయాణంతో
ఔను, క్షణం తీరిక లేదు

Nov 10, 2010

పరకాయ ప్రవేశం

నాన్నా నేను ఇప్పుడు పెదనాన్నని.
సరేరా
[ఇంట్లోనే ఓ సివర్న నిల్చుని]
[చేయి చెవిదగ్గరపెట్టుకుని] ట్రింగ్ ట్రింగ్
అలో [నేను]
అలో ఏరా భాస్కర్ నెనే ఉమాశంకర్‌ని
అన్నయ్య చెప్పు
నేను మీఊరొచ్చాను మీ ఇంటికి దారి చెప్పు
ఎడంచేతివైపు తిరిగి కుడికితిరి గిరగిరాతిరిగి మూందుకిరా అక్కడే మా ఇల్లు
[నా దగ్గరకు వచ్చి]
టక్ టక్ టక్ [తలుపుకొట్టినట్టు]
క్లిచక్ [తలుపు తీసాను]
[ముఖంమీద నవ్వుతో]
ఏరా భాస్కర్ నేనేరా ఉమాశంకర్ మీ అన్నయ్యని
అన్నయ్యా బాగున్నావా
బాగున్నా, ఏంచేస్తున్నావ్
టివీ చూస్తున్నా
సూరిగాడేడి
బయటకెళ్ళాడు
పిల్లేది
అక్కడెక్కడో ఆడుతోంది
కార్తికేయ కూడా ఆడుతున్నాడు, కార్తికేయ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయ్. నేనే కొన్నాను బ్లబ్లబ్ల
[ఇంతలో]
నాన్నా
??
నేను సూర్యాని
అలాచెప్పు ఏంటి
నేనిప్పుడు పోస్ట్‌మా౨న్
ఎందుకలా?
ఉండు
టక్ టక్ [డోర్ మీద బాదుట]
హాయ్ సూర్యాకి ఈ డెలీవరి
ఏవిట్టా ఇవి?
తెలియదు, బాయ్
[తిరిగి సూర్యా ఎంట్రీ]
ఎరా
నేను సూర్యాని కాదు
మరి?
పెదనాన్నని
[నాయనో] చెప్పు అన్నయ్యా
ఈ డబ్బా నేనే పంపించా
ఏవిట్టా ఈ డబ్బా
సూర్యాకి టాయీస్, తీసి చూడు
కిచక్లక్మిక్స్ఫ్గ్ద్గ్ త్౫య్[డబ్బా ఓపెనింగ్]
అబ్బో చాలా బొమ్మలే ఉన్నాయే
అవును మొన్న కార్తికేయకి కొన్నా. అప్పుడు సూరిగాడిక్కూడా కొన్నాను.
[అంతలో మరో పరకాయ ప్రవేశం]
నాన్నా ఏంటీ ఈ డబ్బా
నాన్నా?
నేనిప్పుడు సూర్యాని
[కొట్టాడు దెబ్బ అనుకుని] ఇదిగోరా పెదనాన్న నీకో డబ్బా టాయ్స్ పంపించాడు
ఔను ఔను నాకు తెలుసు [టచక్ టిచక్/డబ్బా ఓపెన్ చేసాడు] అబ్బో చాలా ఉన్నాయి బొమ్మలు మొన్న కార్తికేయ దగ్గర చూసాను
నాన్నా నేనిప్పుడు కాశ్యప్ [మళ్ళీ మూలకి వెళ్ళి చెవిదగ్గర చేయి పెట్టుకుని] ట్రిం ట్రింగ్
అలో
బాబాయ్ నేను కాశ్యప్ ని
ఏరా కాశి బాగున్నావా
బాగున్నా బాబాయ్. సూరిగాడేడి.
ఆడుకుంటున్నాళ్ళేరా
అవునా బాబాయ్. మొన్న ఇండియాకి వచ్చినప్పుడు భలే గోల చేసాడు బాబాయ్.
ఔనారా
ఎక్కడ ఉంటున్నావురా ఇప్పుడు
లండన్లో బాబాయ్
మరి ఎలా వచ్చావ్
బైక్ మీద బాబాయ్, ఇలా వచ్చాను
[ఓ డెమో. థంసప్ ప్రకటనలో మహేష్ బాబులా ఊహించుకుంటూ ఓ పేద్ద డెమో]
[అంతలో]
నాన్నా
ఎవర్రానువ్వు అన్నయ్యవా కాశ్యప్వా లేక సూరిగాడివా
సూరిగాణ్ణి
చెప్పు
నేనిప్పుడు బామ్మని
సరే
[అలా మూలకి వెళ్ళి నా వైపు నడుస్తూ]
నాయనా ఎలా ఉన్నావూ
బాగున్నాను
పండ్లు తింటున్నావా
తింటున్నాను
అమ్మని నాన్నని ఏడిపించకుండా ఆడుకుంటున్నావా
న్నాను
నాన్నా
ఎవర్రా బామ్మవా సూరివా పెదనాన్నవా కాశ్యప్వా
సూరిగాణ్ణి
నేనిప్పుడు పెద్ద సూర్యని నాన్నా
పెద్ద సూర్యా అంటే
గ్రోన్‌అప్
అంటే
నాకు పాతికేళ్ళు
ఓహ్
[మళ్ళీ మూలకి, చేయి చెవి ఫోన్] ట్రింగ్ ట్రింగ్
అలో
నేనూ సూర్యాని, బైక్ నడుపుతున్నా అడ్రస్ చెప్పు వస్తా
అటుతిరిగి ఇటు తిరిగి రా
[వచ్చాడు, ముందు నిల్చున్నాడు, తలుపు కొట్టినట్టు యాక్షన్]
క్లికచ్ [తలుపుతీసా]
[ముసిముసి నవ్వుతో] నాన్నా నే ఒచ్చా
రారా, ఏంటి సంగతులు
ఏంలేవు, మా బుజ్జోడికి కడుపులో నొప్పి
బుజ్జోడా వాడెవడూ
నాకు మా౨రేజ్ అయ్యిందిగా ఇడిగో వీడే నా కొడుకు [ఓచిన్న బొమ్మని చుపిస్తూ]
ఓర్నీ పెళ్ళైందా అబ్బోరియబ్బా. ఏమైందంటా నీకొడుక్కి
అన్నం తినటంలేదు, పూప్ కి వెళ్ళటంలేదు, మంచీళ్ళు తాగటంలేదు, పెరుగన్నం తింటంలేదు. అందుకే కడుపులో నొప్పి.
మరేం చేద్దాం
డాక్ కి కాల్ చేద్దాం, నువ్వు ఇప్పుడు డాక్
సరే
ట్రింగ్ ట్రింగ్
అలో
అలో డాక్ చంద్ర
అవూను
నేను సూర్యాని మా అబ్బాయికి కడుపులో నొప్పి
సరే ఎత్తుకొచ్చేయ్
[కొంచెం యాక్షన్ ఎత్తుకెళ్ళినట్టు]
డాక్ [నేనే]
ఏమైంది మీ వాడికి
తినటంలేది తాగటంలేదు కడుపునొప్పి మంచీళ్ళు తాగట్లేదు పెరుగన్నం తినటంలేదు
అయ్యోపాపం ఎదో చూడని
[ఉత్తిత్తి స్టెత్ గాలితో చేసింది సెచిలో పెట్టుకుని బొమ్మ పిల్లాడిమీద పెట్టి]
గాలి పీల్చరా వదులు బోర్లా పడుకో యాటయాటయాట
మీవాడు పెరుగన్నం తినటంలేదు అందుకే ఈ గోల.
[అంతలో నేనూ నేనూ నాదీ బొమ్మ ఇచ్చేయ్ అని పిల్ల]
[చెల్లెమ్మా ఐతె నువ్వు నర్స్, ఇంజెక్షన్ చెయ్యి పిల్లాడికి అని సర్ది చెప్పుట]
ఇమ్జెగ్గ్ఫ్హ్గ్ఫ్హ్థ్ య్హ్య్హ్ర్త్యెర్ ఫ్ఘ్ర్త్ య్హ్ర్త్య్ ఎర్వ్ ఫ్ఘ్య్  [అంది పిల్ల, అని ఇచ్చేసింది బొమ్మని]
థ్యాంక్యు డాక్ [అని చెప్పి వాడు తిరిగి ఇంటికి వచ్చాడు]
నాన్నా డాక్ దగ్గరకి వెళ్ళొచ్చా
[నాన్నా? ఓహో నేను డాక్ నుండి నాన్నకి రూపాంతరం చెందాలా]
ఓహో ఏవన్నాడ్రా నాన్నా తూచ్ డాక్
ఇంజెక్షలు నాలుగు చేసాడు
[ఇంతలో వాళ్ళ అమ్మ బువ్వకి పిలిచింది. కన్ఫ్యూజన్‌తో నే ఈ టపాకి శ్రీకారం చుట్టాను]

Nov 8, 2010

మా గుళ్లో దీపావళి పండుగ

మా గుళ్లో దీపావళి పండుగ బాగా చేసాం. నవంబరు ఆరోతారీఖు రాత్రికి ఫైర్‌వర్క్ కన్నులకు విందుని చేసింది.

Nov 7, 2010

ఆర్ట్ కలాసులో

మొన్నీమద్దిన మనోడేసిన మాడర్న్ ఆర్ట్ ప్రభావం ఇంకా ఉంది సూరిగాడి మీద.
నిన్నటి ఆడి బళ్ళో ఆర్ట్ కల్లాసులో ఇట్టా పులివాడు రంగులు


ఇంతకమునపటి గీత ఇది