Nov 13, 2008

కావలెను - ఈ క్రింది ఉద్యోగానికి

పదవి : ముఖ్యమంత్రి
విద్యార్హతలు : ఏమీలేవు (ఓపెన్)
కనీస అర్హతలు:
1. పగటి కలలు కనటం
2. ఆత్మస్తుతి
3. పరనింద
4. పరులను ప్రశ్నించే తత్వం
5. సినిమా హీరోగా పని చేసి ఉంటే మంచిది లేదా రాయలసీమ అయిఉంటే పెద్ద ప్లస్
6. లాబీయింగ్ చేయగల్గి ఉండాలి
7. హైజాకింగు తెలిస్తే మరీ పెద్ద ప్లస్
8. అయితే నందమూరి వంశం అన్నా అయిఉండాలీ, లేదా రాయలసీమ రెడ్డి ఐనా అయిఉండాలి లేదా మెగాస్టార్ అయినా అయిఉండాలి
9. పొత్తులుకు పై పొత్తులు పెట్టుకోగలగాలి
10.కులదీపకుడు, కుల ప్రకాశకుడు అయిఉండాలి
11.మంచి మాటల రచయిత దోస్తై ఉండాలి
12."మీతో పొత్తుపెట్టుకుంటే ఏమిస్తారు, మాతోపొత్తుపెట్టుకుంటే ఏంతెస్తారు" అనే తత్వం ఉండాలి
13."నేను ఏంచేసాను" కన్నా "నువ్వు ఏమిచెయ్యలేదు" గురించి మార్కెటింగు చెయ్యగల్గి ఉండాలి
14.చెట్టుపేరుజెప్పి కాయలు అమ్ముకోగల్గి ఉండాలి.
15.కులాల మధ్య కుమ్ములాట పెట్టగల్గి ఉండాలి.
16.అఱచేతిలో వైకుంఠం చూపగల్గి ఉండాలి.
17.ఘట్టి కాళ్లు ఉండలి (కొంతమందిని తొక్కుకుంటూ ముందుకుపోవాలిగాబట్టి)
..
..
..
..

6 comments:

 1. చాలా బావుంది.
  నాలుగు రోజుల క్రితం తారకరత్నను
  ఫోన్ చేసి ప్రశ్నలడిగే కార్యక్రమం
  చూశాను. సుమారు వంద సార్లైనా
  తాతగారు అనుంటాడేమో. నందమూరి
  క్లాన్ అని కూడా అన్నాడు.
  ఇంకొకతను ఫోన్ చేసి చంద్రబాబు
  నాయుడిని పి.ఎం చేసి బాలక్రిష్ణని సీ.ఎం
  చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు.
  ఇటు జనాలూ అంతే. అటు వీళ్ళని మోసం
  చేసేవాళ్ళు అంతే.

  ReplyDelete
 2. కేక భాస్కర్ గారు, చాలా బాగుంది.

  ReplyDelete
 3. అయితే చాలా పోటీ ఉందండి !

  ReplyDelete
 4. అయ్యా..నా బయోడేటా అందిందాలేదా? ఇటలీ లో కూడా పనిచేసిన అనుభవం ఉంది నాకు..

  ReplyDelete
 5. @bhavani గారు: నాకు చాలా ఆశ్చర్యం వేసే విషయాల్లో ఇదోటి: కాంగ్రేస్ పొద్దుగూకులూ రాజీవ్ జపం, ఇందిరా జపం చేస్తుంది అని ఒక వర్గం ఆరోపణ, మరైతే వీళ్లు పొద్దుగూకులూ చేసే జపం ఏంటి? దీన్నే సోత్కర్ష అంటారేమో. నేను సిగరెట్టు తాగుతా, నువ్వు మాత్రం తాగొద్దు అని చెప్పినట్టు ఉంది.
  @చైతన్య - ధన్యవాదం
  @సుజాత గారు: పోటి పైకి ఎంత ఉందో లోపలకి అంతకన్నా ఎక్కువ ఉంది. దాన్ని పోటీ అనకూడాదేమో - కులాల కుమ్ములాట, ఈర్ష్య, మంట. తింటే నాకులపోడే తినాలి, మునిగితే మిగతావాళ్లే మునగాలి.
  @పప్పు యార్: పుచ్!! నీ అనుభవం చాల్దల్లే ఉందోయ్!! అరుణోదయం చూస్తే ఆకాశమ్లో మర్డర్ జరినట్టు అనిపిస్తుందా? పక్కనోడ్ని గొంతు చూస్తే "అబ్బా!! ఎంత బాగుందిరా వీడి మెడ, పట్టుక్కోసేయాలి" అనిపిస్తున్నదా? అలా అనిపించకపోతే మీ రెజూమే గోస్ టో చెత్తబుట్టడాట్కోడాటిన్

  ReplyDelete
 6. ఒక పేపర్ కాని , ఒక టి.వి చానల్ కాని లేదంటే ఒక "యువసేన" అయిన ఉండాలి ...దీని పైన మీ అభిప్రాయం ఏంటి.

  ReplyDelete