Showing posts with label పుటోబులు. Show all posts
Showing posts with label పుటోబులు. Show all posts

Dec 8, 2024

గెలుపు ఓటమి

 ఆటలో గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు

ఒక పరిణితిచెందిన క్రీడాకారుడికి

గెలుపునుండి ఏమి నేర్చుకున్నావు

ఏటమి ఏమి నేర్పింది అనేది ముఖ్యం

ఆడిన ప్రతీసారీ ఏదోకటి నేర్చుకోక పోతే ఆడటం అనవసరం

చచ్చిన చేపతో సమానం 



May 19, 2018

Windshield

మొన్నోరోజు HOV లైన్లో నా మానాన నేను ఇంటికి కారు నడుపుకుంటూ రేడియో వింటూ వెళ్తున్నా. US 290 expansion గత పదేళ్ళుగా నడుస్తున్నది. సూరిగాడికి పెళ్ళై పిల్ల్లు పుట్టేప్పటికి తప్పక రెడీ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. సరే, మొన్న అలా వెళ్తున్న నేను నా పక్కనే ఓ పెద్ద ట్రైలర్ వెళ్ళటం గమనించాను. అది వెళ్ళిన ఒక నిమిషానికి ఓ పెద్ద శబ్దం. బెలూన్ పగిలిన శబ్దం వినిపించింది. ఏదో ట్రైరో ఏదో బ్లాస్ట్ అయుంటుందని అనుకుని నా మాన నేను ఇంటికొచ్చి, కారాపేసి, తాళం తీస్తూ Windshield right corner వైపుకి అనుకోకుండా చూశాను. రెండు అరచేతుల మేర అద్దం పగిలిపోయుంటాన్ని గమనించి గుండె గతుక్కుమంది. అదే అద్దం మొత్తం పగిలి షాటర్ అయి కళ్ళల్లోనో ముఖంమీదనో పడుంటే అనిపించింది.

ఈ దేశంలో క్రాక్ కొట్టిన అద్దాలతో కార్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎందరో.
పగిలిపోయినా నెర్రె కొట్టిన అద్దంతో తిరగటం ఏమాత్రమూ మంచిది కాదు. సెక్యూర్ అసలు కాదు.
ఈ దేశంలో ప్రతీదానికి బీమా ఉండాలి. ఇండి తీరాలి. బీమా సర్వ రక్ష అనుకుంటాం. కానీ కాదు. బీమా ప్రతినిధి కాలికేస్తే ఏలుకేస్తాడు. ఏలికేస్తే కాలికేస్తాడు. చివరాకరికి డిడక్టబుల్ అంటాడు. అక్కడే మనకి గొళ్ళెం పడుతుందని తెలియని బీమా గొర్రెలం మనం.

వెంటనే బీమావారికి కాలు చేస్నినాను. అమ్మా అయ్యా ఇదీ పరీస్థితి అని. అయ్యోపాపం ఔనా! అరె! అలా అయ్యిందా? సారీనే! బాధపడకు మరి. ఇవన్నీ సహజం...ఎన్నిమాటలు చెప్పిందో ఆమె. మా పెదనాన్నగారి బాబాయి కూతురు కూడా అంత ఇదిగా మాట్టాడుండదు.

అక్కా! సరేకానీ, ఏవన్నా సహాయం చేస్తావా? అన్నాను చివరికి ఆశతో దింపుడు కళ్ళతో.
తమ్మీ! హనీ! నేనిక్కడుంది ఎందుకనుకున్నా! భలేవాడివే! సేఫ్లైట్ అని ఓ కంపెనీతో మనకి మాంచి రిలేషన్ ఉంది. వాడికి చెప్పి నీ అద్దం బిగించేయిస్తా. అయితే నీ డిడక్టబుల్ #$500 కదా! ఏటి? అలా బేలగా చూడకు. అద్దం ఖరీదు #$299 అవుతుంది. వాడొస్తాడు. ఆడబ్బులిచ్చి చక్కగా వేయించుకో అంది ఆమె హుందాగా గొప్పగా పెద్దగా ఓ అక్కలా ఓదార్చుతూ.

కర్మరా బాబూ అనుకుని వాడితో అపాయింటుమెంటు తీస్కుని నిట్టూర్చాను.

ఓ సాయంత్రం వాడొచ్చాడు, సేఫ్లైట్ అని వ్యాన్ వెస్కుని. హహహ! ఏవిటి! హహహ అద్దం పగిలిందే హహహ అంటాడు. అన్నాయ్! నవ్వకు! నీ డబ్బు నాజేబుకి చిల్లు. ఏంచేస్తాం అని వాడికి కారు అప్పగించాను.

కానీ వాడు బాగనే చేసాడని నా అభిప్రాయం.

Dec 14, 2012

కొత్త కెమేరాలు

క్రిస్మస్ సీజన్ వచ్చింది. ఎలక్స్ట్రానిక్స్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో ఏ కెమెరా బెస్టూ అని ఒక మిత్రుడడిగాడు.
ఇంతక ముందు నేను కెమెరాలపై ఒక టపా వ్రాసినా మళ్ళీ ఓమారు వ్రాస్తున్నా.
కెమేరాలు ఇప్పుడు మూడు రకాలనుకోచ్చేమో
1. పాయింట్ అండ్ షూట్
2. మిర్రర్ లెస్
3. డిజిటల్ యస్.యల్.ఆర్

పాయింట్ అండ్ షూట్ కెటగిరీలో కేనన్ వాడు కొత్తగా యస్.యక్స్ ఫిఫ్టీ హెచ్‌యస్ రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు కేనన్ సైట్లో
http://www.usa.canon.com/cusa/consumer/products/cameras/digital_cameras/powershot_sx50_hs
Inline image 1
మొన్న నా మిత్రుడు కెమేరా కొందాం రా ఆని పిలిస్తే బెస్ట్ బై అనే షాపుకి వెళ్ళినప్పుడు చూశాను ఈ కెమేరాని. దీని ముందరి వెర్షనుకీ దీనికీ పేద్ద తేడా లేదనుకుంటాను. దీని ముందరి వెర్షన్ యస్.యక్స్ వార్టీ. ధరలో ఐతే పేద్ద తేడా లేదు
Inline image 2
జూం లో తేడా ఉన్నది, ఐ.యస్.ఓ ఆప్షన్స్ కొత్తదాంట్లో ఎక్కువున్నాయి. చూస్కుని వీటిల్లో ఏదోకటి కొనుక్కోచ్చు
మిర్రర్ లెస్ కెమెరాలని కొత్తగా విపణిలోకి కొన్ని కెమేరాలొచ్చాయి.
వికీవిక్కయ్య ఏవంటాడంటే
The Mirrorless interchangeable-lens camera (MILC) is a popular class of digital system cameras. Unlike a compact digital camera, a MILC is equipped with an interchangeable lens mount and unlike a digital single-lens reflex camera, a MILC does not have a mirror-based optical viewfinder.
నైకాన్ 1
Inline image 3
పానసానిక్ లూమిక్స్ GF5
Inline image 4
ఇంకా శాంసంగ్ వారి NX 200

Inline image 5
కేనన్ వాడి ఈ.ఓ.యస్. యం
Inline image 6
ఇంకా సోనీ, ఒలింపస్ ఇత్యాదివారివి కూడా ఉన్నాయి.
ఇవి పాయింట్ అండ్ షూట్ లాంటివే కానీ లెన్స్ మార్చుకోవచ్చన్న మాట.
ఇక మిగిలింది డిజిటల్ యస్.యల్.ఆర్.
కేనన్ వాడి T4i బాగుంది.
Inline image 7
ఐతే కొనేప్పుడు రివ్యూలు గట్రా చూస్కొని కొనుక్కుంటే మంచిది.
ధర పాయింట్ అండ్ షూట్ 300-400 ఉంటే మిర్రర్ లెస్ 500-800 ఉంటే T4i వచ్చి 800-900 ఉన్నది కిట్ లెన్సుతో కలిపి

May 24, 2012

డిజిటల్ యస్.యల్.ఆర్ లెన్స్

ఈమధ్య మిత్రులు చాలా మంది డిజిటల్ యస్.యల్.ఆర్ కెమెరాలు కొంటున్నారు లేక కొందామనుకుంటున్నారు.
ఐతే, కెమెరా కొనంగనే సంబడం కాదు, దానికి తగ్గ లెన్స్ కూడా ఉండాలోయ్ అని కామేశ్వర్రావ్ అన్నట్లు, ఔను! నిజమే. దానికి తగ్గ లెన్స్ కూడా ఉండాలి. ఉండి తీరాలి. బాడీ ఓన్లీ కొన్నవారికి ఇంతక ముందరివి కొన్ని లెన్స్ ఉండే అవకాశం ఉన్నది. బండిల్ కొన్నవారికి కొన్ని లెన్స్ వచ్చి కలెక్షనులో చేరే అవకాశం ఉన్నది.
పెద్ద కెమెరాలు కొంటే వాటితో బండిల్ అయి వచ్చే లెన్స్ ఒక కేటగిరీ ఐతే, చిన్న కెమెరాలతో వచ్చే బండిల్ లెన్స్ వేరే.
Canon EF-S 18-55mm f/3.5-5.6 IS SLR Lens చిన్న కెమేరాలతో ఇది బండిల్ లెన్స్గా వస్తుంది.
కొంచెం పెద్ద కెమేరాతో ఐతే 18-135mm f/3.5-5.6 IS UD వస్తుంది బండిల్ లెన్సుగా

ఐతే, సధారణంగా ఒక కెమెరాకి ఏఏ లెన్స్ అవసరం అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నే! దీన్ని ఇలా వర్గీకరించవచ్చు
రోజువారి అవసరానికి
ల్యాండ్‌స్కేపింగుకి
పొట్రైట్స్ తీయటనికి
స్పోర్ట్స్ అవసరాలకి

రోజువారీ అవసరాలకీ అంటే? కెమెరా చంకనేస్కుని బయటకి వెళ్ళామనుకుంటే, కసక్కున రోడ్డుమీద ఏదో తీయాలనిపించింది, లేక పార్కుకి వెళ్ళాం, ఓ పూ పొదని తీయలనిపించింది....ఇత్యాదివి రోజువారీ అనుకోచ్చు.
ల్యాండ్స్కేపింగ్ అనేది మనం పనిగట్టుకుని ఏ దుర్గం చెరువు దగ్గరకో వెళ్ళి కొండనెక్కి సూర్యాస్తమయాన్ని తీద్దామనుకున్నపుడు ఇది అవసరం.
పోట్రైట్స్ అంటే ఇంట్లో, పిల్లల్ని లేక టైమర్ పెట్టి కుటుంబాన్ని తీస్కోవాలనుకోటానికి
స్పోర్ట్స్ అవసరాలు అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని కసక్కున లాగాలంటే.


1. Everyday lens - Canon EF-S 17-55 f2.8 IS - Costs $1099

2. Landscape lens - Canon EF-S 10-22mm f/3.5-4.5 USM SLR Lens for EOS Digital SLRs - Costs Price:     $799.00

3. Portrait lens/Prime lens - Canon 85 f1.8; Canon 50mm and so on

4. Sports lens - Canon EF 70-200mm f/2.8L USM Telephoto Zoom Lens costs Price:     $1,329.40

Canon 35mm f/1.4 L USM Lens పిల్లల్ని తీయటానికి పుట్టిన్రోజు పార్టీలకీ బాగుంటుందని చెపుతుంటారు. దీని ధర $1,379.00.

చూడాల్సింది యఫ్-నెంబర్
పైవాటిల్లో కొన్ని f2.8, కొన్ని  f/3.5-4.5  కొన్ని f1.8.
f/number పెరుగుతున్న కొద్ది ధర తగ్గుతుంటుంది.

http://upload.wikimedia.org/wikipedia/commons/8/87/Aperture_diagram.svg
Inline image 1
[గమనిక :- ఇవన్నీ నేను అక్కడా ఇక్కడా సంపాదించిన విషయాలు. నాకన్నా బాగా తెలిసిన వారు పైన నే చెప్పిన విషయాలపై అవగాహన ఉన్నవారు సలహాలు ఇవ్వ ప్రార్థన. ఇది కేవలం సమాచారం కొరకే అని గమనించ గలరు.]
లెన్సుల రివ్యూ కొరకు http://www.the-digital-picture.com/Reviews మంచి సైటు

Mar 8, 2011

సంబరాల రాంబాబు

సూరిగాడి ముఖంలో వెయ్యి కాం౨డిల్ బల్బులు కనిపించటంలేదా?

Oct 4, 2010

పిల్లల్లో ఆలోచనాత్మకత, సృజనాత్మకత, పరిశీలనాత్మకత

ఈనాటి చదువుల మీదా, విద్యా అవసరాల మీదా, విద్యా సంస్థల మీదా, విద్య తీరుతెన్నుల మీద ఇప్పటికే అనేకానేక గొంతులు అనేకానేక టపాలు చూసాం, చూస్తూనే ఉంటాం, చదూతూనే ఉంటాం. ఐతే, అవి మరుక్షణం మహా అయితే స్మృతిపథంలోకి వెళ్తాయి. అంతకన్నా పెద్ద జరిగేదేంలేదు. పిల్లల్లో ఆలోచనా స్పూర్తిని, పరిశీలనాత్మకత పెంపొందించాలంటే ఒక్క బడే సరిపోదు. పుస్తకాల్లో ఉన్న విజ్ఞానం మాత్రమే సరిపోదు. వారిలోకి ఎగబాకేలా వారి మనుస్సుకి హత్తుకునేలా, వారిని పరిశీలన పరిశోధన వైపుకి అడుగుడు వేయించేలా ఒక వేదిక కావాలి. ఆ వేదిక పిల్లలున్న సమాజానికి అనుసంధానంగా ఉండాలి. ఆ వేదిక పిల్లల్కు అనుదినం స్పూర్తిదాయకంగా ఉండలి. వారికి అతి చేరువగా ఉండాలి.


నిన్న పిల్లాజెల్లాలతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళా. ఎప్పట్లానే రిటర్నింగు పుస్తకాలు ఇచ్చేసి, కొత్తవి తీస్కుందామని పిల్లల విభాగంవైపుకి అడుగులేసాం. దారిపొడవునా కొత్త కొత్త బొమ్మలు గట్రా పెట్టున్నాయి. హడావిడిగా ఉంది. చాలా మంది పిల్లలు, తల్లులూ వచ్చారు. అక్కడక్కడా బల్లలు వేసి ఉన్నాయి. ఏవేవో అమరుస్తున్నారు వాటిపై హడావిడిగా, పిల్లలు తీవ్రమైన ఏకాగ్రతతో. పిల్లల విభాగంలోకి వెళ్ళాం. అక్కడా అదే తంతు. తను సూరిగాణ్ణి వెంటబెట్టుకుని లెవల్ త్రీ రీడింగ్ పుస్తకాల అరలవైపుకి వెళ్ళింది. నేను పిల్లను తీస్కుని చేపెల పెట్టెవైపుకు వెళ్ళా. పిల్ల చేపలను జూసి కేరింతలు కొడుతోంది. నేను అటు పక్కగా వేసిన బల్ల దగ్గర జరుగుతున్న తంతుని గమనిస్తున్నా.

ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలతో ఎదో సర్దుతూ సర్దిస్తోంది. ప్రజెంటేషన్ అట్టలు పెడుతున్నారు.
From library

పెద్దమ్మాయికి బహుశా ౧౨-౧౪ వయసు ఉండవచ్చు. చిన్నపిల్లకి ౧౦ అలా ఉండుండవచ్చు. నాలోని బ్లాగరు, సమాచార హరుడు ఊర్కోడుగా, వెళ్ళి గెలికా. యాండీ, ఏం జరిగుతోందిక్కడా అని. చిన్నపిల్ల అనర్గళంగా ఓ ఉపన్యాసం ఇచ్చింది. అర్థంకాలేదు.
From library
తల్లి వచ్చి చెప్పుకొచ్చింది. వాళ్ళది ఒక ఆర్గనైజేషన్ అట. దానిపేరు ఫోర్-ఎచ్ అట.

4-H Mission
4-H empowers youth to reach their full potential, working and learning in partnership with caring adults. 

4-H Vision
A world in which youth and adults learn, grow and work together as catalysts for positive change.

ఒక ఇదీ వాళ్ళ మోటో అట.

నాకర్థం అయ్యిందేంటంటే పిల్లల్లో ఆలోచనా శక్తిని జ్ఞాన్నీ పెంపొందించేట్లు చేయటం వీరి ముఖ్య ఉద్దేశం అని.

ఆ పిల్ల చక్కగా ఒక అట్టమీద ఎదో రాసుకొచ్చింది. ఎదోకటి. దాని గురించి చిన్నపిల్లలకు చెప్పటం. ఆ ఏదోకటి ఎలా? సమాజం, తను చూసేది, తను గమనించేది, ఏదోక సమాచారం. దాన్ని ఒక ప్రాజెక్టులాగా తీర్చిదిద్దగలిగేందుకు అవసరమైయ్యే శక్తి తల్లితండ్రులిస్తే, దాన్ని ముందుకుతీసుకెళ్ళే స్థోమతని ౪-ఎచ్ ఇస్తోంది. ఆ తల్లిని అడిగాను. మీరేమన్నా ఒక బడిని రిప్రజెంటు చేస్తున్నారా అని. లేదు అంది. మరి ఫండ్స్ ఎలా అన్నా? ౪-ఎచ్ ఇస్తుంది అంది. మరి ప్రాజెక్టులు ఎవరు ఇస్తారూ అన్నా. మీటింగ్స్ ఉంటాయట. ప్రతీ వారమో ఏదోకరోజున. ఇది జాతీయ స్థాయి ఆర్గనైజేషనట. లోకల్ విభాగం ఒక కౌంటీ స్థాయిలో ఉంటుందట. లోకల్గా మీటింగ్స్ జరుగుతాయట. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారట. అనేకానేక విభాగాల్లో పిల్లలకు స్పూర్తినిస్తారట. ఫటాగ్రఫి, రిసైక్లింగ్, ఫుడ్, న్యూట్రిషన్, సైన్స్, ఇలా ఏదైనా.

వాళ్ళ వెబ్సైట్లో వారి గురించిన ఒక చిన్న వాక్యం -

Preparing young people to make a positive impact in their communities and the world.

వారి వెబ్సైట్

http://www.4-h.org

ఆ బల్ల దగ్గరకి అనఘ వెళ్ళింది. తనకి క్రేయాన్స్, డిస్నీ ప్రిన్స్ ఇచ్చారు రంగులెయ్యమని. పిల్ల మహదానందంగా తీస్కుని కూర్చుంది.

From library

ఇక సూరిగాడు వచ్చాడు. ఆడికి టాయ్‌స్టోరి పజిల్ ఈస్ ఇచ్చి రంగులేసి పజిల్స్ పెట్టు అని చెప్పారు.

From library
అట్లా వాళ్ళు బల్ల తెరిచిన ఐదు నిమిషాల్లో పది-పదిహేనుమంది గుమిగూడారు.


నాకు ఎప్పటినుండో ఒక ఆలోచన బుఱ్ఱలో ఉంది. అఫ్‌కోర్స్ నిద్రావస్థలోకి వెళ్ళిందనుకోండి. అది, భారతావనిలో పిల్లలకి రిసైకిల్ అనేదానిపై అవగాహన రావాలి. దానికి సంబంధించిన స్పూర్తిని వారిలో కలుగజెయాలంటే వారినే ఇన్వాల్వ్ చేస్తూ ఒక కాం౨పైన్ తయ్యారు జేయాలి. పై పద్ధతి ద్వారా అది సాధ్యమే అనిపిస్తుంది. కానీ, ఇక్కడి పిల్లలకు గ్రంధాలయం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడి పిల్లలకు ఆఫ్ ది స్కూల్ లైఫ్ లేదు. ఒక మీటింగ్ ప్లేస్ లేదు. అథవా ఉన్న, వారి జీవితాల్లో బడి అయ్యాక ఉన్న సమయం ఎంత? బడికి వెళ్ళటం వచ్చి ఎల్.కే.జి నుంచే ఐ.ఐ.టి కోచింగులు, లేక హోంవర్కులు. తల్లితండ్రులు అనుకుంటే ఈ పరీస్థితిలో మార్పు తీసుకురాగలరు. పిల్లలకి ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వండి. వాళ్ళకి చుట్టుపక్కల ఏంజరుగుతుందో చూపండి. 

దారిపొడవునా ఉన్న, అక్కడక్కడా డిస్ప్లేలలో ఉన్న కొన్ని బొమ్మలను ఇక్కడ పెడుతున్నా

గెలికితే ఏటౌద్దీ?

ఓ ఇదేం పెద్ద ప్రశ్నకాదు. గిలికితే ఏటౌద్దీ? రెండు విధాలు -
తెలిసి గెలికవా?
తెలియక గెలికావా?
అబ్బే అట్టా కాదబ్బా, తెల్సీ తెలియకుండా కూడా గెలకచ్చూ అన్నాడంట నాబోటిగాడు.
ఏంకత అంటే, పోయినేడాది మాయమ్మకు ఓ ల్యాపీ అంపించా. ఎచ్.పి పవీలియన్, డివి-౭ సిరీస్. నాలుగు జిబి రా౨ము..గట్రా.
ఇంటరునెట్టుకి తగిలించింది మితృల సహాయంతో...మొదటినాల్రోజులు బెమ్మానంగా పని సేసింది. దెన్ స్టార్ట్స్ స్ట్రగుల్. ఏందివయ్యా అంటే క్రా౨ష్ అవుతున్నది పావుగంట-అఱగంట కాంగనే.
మొన్నీమద్దిన అన్నయ్య గుంటూరెళ్ళినప్పుడు కొత్తదెత్తుకెళ్ళి దాన్ని తెచ్చి నా సేతిలో పెట్టాడు.
అవున్రొరేయ్ ఎందుకు క్రాషౌతున్నదంటా అన్నాడు అన్న. ఏమోరా అన్నా. పంఖా పని సేస్తల్లేదేమో దుమ్మో మట్టో దారవో వడ్డం పడుండిద్దేమో సూద్దామా అన్నాడు జంకుతా. మనం బుస్సున పైకిలేసి, స్క్రూడ్రైవర్ పట్రా అన్నా. జంకుతా జంకుత తెచ్చాడు. లా౨ప్టాప్ సెడగొట్టం అనే ఓ బృహత్తర కార్యక్రమానికి తెరదీసాం. మొత్తానికి ఊడదీసాం. పంఖా పనిసేయట్లేదని అరదం అయింది. సరే బిగించేద్దాం పంఖా కొని తర్వాత ఏయొచ్చు అనుకున్నాం. తిరిగి పెడతా ఉంటే జిఫ్ కనెక్టర్ ఊడిపోయింది. హమ్మనీ ఎన్కమ్మ నుకున్నాం. ఆయాల బీరుకొట్టి తొంగున్నాం.

ఇది తెరతీయటం పేర్లుపట్టం పటుకే అని తెలియజేస్కుంటన్నా. ఇప్పుడు వసలు కతలోకొస్తే -
రెండువారాలక్రితం
శనోరం మద్దేనం
జిఫ్ కనెక్టర్ని సోల్డరింగ్ గన్ తో అంటిద్దాం అనుకున్నా. మళ్ళీ ల్యాపీని ఊడదీసా....సోల్డర్ సేయటానికి రాలా. మదర్బోర్డ్ పైన జిఫ్ కనెక్టర్ పెట్టడానికి టైనీటీనీగా ఉండి, నాకు రాలేదు. సరే బంకపెట్టి అతికిద్దాం అని ప్రయత్నించా. అహా!! అతుక్కుందిగానీ, కనెక్టివిటీ పోయింది.


ఇంతకీ జిఫ్ కనెక్టర్ అంటే ఏంటీ అంటారా?
ల్యాపీలో కీబోర్డ్, డిస్ప్లే, పవర్, ఇత్యాదివి మదర్బోర్డ్ కి కనెక్ట్ చేసే కార్డ్స్ కొన్నుంటాయి. నేచెప్పేది పవర్/ఆడియో కంట్రోల్స్ ని మదరబోర్డ్ కి కనెక్టు చేసే కనెక్టర్ గురించి. ఇది పోతే పవర్ రాదు.

http://en.wikipedia.org/wiki/Zero_Insertion_Force

అదీ కథ....

Jul 27, 2010

అన్నదాతా సుఖీభవ

ఇవ్వాళ్ళ చాలా తలనొప్పిగా ఉంది పొద్దుణ్ణుంచి. లేవటమే ఆలశ్యంగా లేచా. తల లాగిలాగిపెట్టింది. మా అన్నయ్య నాకో బహుమతి పంపాడు. అది మా అపార్టుమెంటు మేనేజరు వద్ద వదిలి వెళ్ళాడు తపాలా బంట్రోతు. పొద్దున పొద్దున్నే అదెత్తుకుని ఆపీస్కి చేరుకున్నా నిద్ర మొహంతో.
ఓవైపు తల లాగటం ఇంకోవైపు అన్న పంపిన గిప్టు.
పనికెళ్ళంగనే డబ్బా ఓపెన్ చేసి రీసెర్చీ మొదలెట్టా. ఇంతలో ఓ నాలుగు కాళ్ళు అదేనండీ కాల్స్. తల అటుఇటు తిప్పేప్పటికే పన్నెండున్నర. రొట్టెముక్కలు నోట్టోఏస్కుని సల్లబువ్వ అనగా మజ్జిగ అన్నం మింగి సల్లగా మంచీళ్ళు తాగి మనిలో పడ్యా.
ఇంతకీ అన్న పంపిన గిఫ్ట్ -
కేనన్ రెబల్ ఈ.ఓ.యస్ డిజిటల్ ఎస్.ఎల్.ఆర్; ౨౮-౩౦౦యంయం ఆ.ఫో లెన్స్.
ఇదిగో అ కెమెరా రాజం -


ఓ ఉదాహరణ పుటోబు -


తలనొప్పి ఎంతకీ తగ్యల. కాళ్ళీడ్చుకున్టా ఇంటికిజేరా. సల్లగా నిమ్మకాయ నీళ్ళు తాగి ఓ ఏడ్విల్ కుమ్మి కళ్ళూకాళ్ళూ ముడుసుకుని కూసన్త అట్టా ఎనక్కి వాలా.
ఆరున్నరకి భార్యాబిడ్లు నిద్రల్లేపారు.
ప్రెష్షుగా మొకం కడుక్కొచ్చేపాలికి, బువ్వ రెడీ తిన్ట్యావా అన్నారు భార్యాబిడ్లు. వలాగే అని కూకున్నా. తలనొప్పి ఓకొలిక్కి వచ్చిందాపాటికే.
అయ్యా -
కోసుగడ్డ + గాజర గడ్డ కలిపి ఇగురు సేసిన్ది. ఏడిఏడి అన్నం పైన ఇగురు. ఓ పీకుడు పీకిన్యాక అయ్యా, ప్రిజ్జీలోంచి ఓ పొట్లం తీసి, పళ్ళెమ్లో ఓ రొంత కుమ్మింది.
ఇదిగో ఆ పొట్లరాజం

అన్నా ఏంటో ఎరుకనా ఆ పొట్లరాజం - పండుమిరపకాయల కారం
వేడివేడి అన్నం, పొడిపొడిగా, దాంటోకి పండుమిరపకాయల కారం. ఏం చెప్పను బాసూ. నోట్లోనీళ్ళూ ఓ నాలుగు బక్కెట్లు ఊరి లోనికి ఎళ్ళిపోయినయి. తలనొప్పి గిలనొప్పి దానెక్క దేక్కున్టా పోయింది.
తిన్నాక, కళ్ళముందు ఓ నాలుగు రీళ్ళు గిర్రున తిరిగాయ్. ఆరోజుల్లో - ఓ ఎత్తుడు పండుమిరగాయలు, సరిపోను సిన్తమన్డు, మావిడల్లం, గళ్ళప్పు ఓ బొచ్చెలో ఏసి ఇస్తే, రుబ్బింగు వేయబడును కాడికెత్తుకెళ్ళి, లైన్లో నిల్చుని రిబ్బింగ్ ఏపించుకునిగానీ కదలకున్డా రుబ్బింగోడు ఎళ్ళమన్నా ఎళ్ళాకున్డా ఆణ్ణే ఉన్డి, ఇంటికెత్తుకెళ్ళినాక, ఏడి ఏడి తెల్లబువ్వలో ఎర్రటి పచ్చడి, పైన ఎన్నపూస. నాయనా ఇంక జీబితానికి ఏంగావాలే? ఈ మాత్రం సుఖానికి పేద పెద్ద ఉన్నోడూ లేనోడు అనే బేధం లేదు. తేడా అంతా తినే కంచంలోనే. పేదోడు అల్యూమినియం సిబ్బిరేకులో తిన్టే ఉన్నోడు ఎన్డి పళ్ళెంలో తింటాడు. అంతే తేడా.
పండు మిరపకాయలు కకోయటానిక్కూడా ఓ ఇధానం. కోతకొచ్చిన సేనుకి ముందు బాగా నీళ్ళు పెడతారు. మిరగాయకి నీళ్ళు పట్టి బాగా నవనవలాడుతున్నప్పుడు కోస్తారు.
సెప్పొచ్చేదేంటన్టే -
సెమటోడ్చి మనకి ఇట్టాంటి పంటల్ని అందించే రైతు - అన్నదాత - సుఖీభవ
పండుమిరగాయల్ని కమ్మని పచ్చళ్ళా పెట్టే అమ్మతల్లులు - అన్నదాతలు - సుఖీభవ

Mar 18, 2010

ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్ దినం అంట

సోదరా, ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్కు దినం అంట. మాఊళ్ళో రోడ్లమీన ఏదో పెరేడంట. గూగులోడు కూడా వచ్చిండయ్యా. నేను ఆపీసు పైనుండి ఈ పుటోబులు లాగించినా. బాగుండయా?


ఏందో తిక్కనాయాళ్ళు!!
ప్యాట్రిక్కు దినం, పూసల దండలు ఇసరటం, స్క్లేట్లు ఇసరటం..పిల్లలకి పుల్లు ఆనందం దొరికినట్టుంది. ఎవురానందం ఆరిది. ఏతంతావు? నానేతంతానూ! నువ్వేదంటే నానదే అంతానంటావా?

Mar 15, 2010

ఇయ్యాల రగతం కళ్ళజూసా !!

నాయాల్ది రగతం కళ్ళజూసా పొద్దున పొద్దున్నే
అహా!! ఎవుర్దీ?? అదీ సోంవారం, మటన్కొట్టెట్టావా? ఎంతకమ్ముతున్నావేంది కిలో ఇట్టా అడుగుతారని తెల్సు.
పొద్దునపొద్దున్నే, తలకిబోస్కుని, అడ్డగుడ్డ సుట్టేస్కుని ఓ డెగిశాలో పాలుపోసి కారన్ ఫ్లేక్స్ దాంట్లో ఏస్కుని కారన్ ఫ్లేక్సు అల్పాహారం బోంచేద్దాం ఇయ్యాళ అనుకుని, డేగిశని మైక్రోవేవ్లో పెట్టి, కొలువులో *కత్తి* లేదు కమలాలు గట్రా కోస్కోటానికి అని నిన్నకొన్న సిన్న *కత్తి*ని కాయితకంలో సుట్టి ఎనకమాల్నేసుకునే సంచిలో పెట్టుకుందాం అని *కత్తి*ని తీస్కున్నా. దీనెక్క సానా పదునుగా ఉంది, కాయితకం యాడుందబ్బా అన్జూస్తే పక్కమ్మెట ఓ పొట్లంలో కాయతకం ఓటుంది. ఆ పొట్లం *కత్తి*తో కోసి అవ్వతల్నూకి ఆ కాయితకం బయటకి తీద్దాం అని కోసా, అది కుడిసేతి చూపుడేలుని కొట్టేసింది కస్సుక్కున, సెక్కేసినట్టయింది. ఓ ఆరు లీటర్ల రగతం కారి వృధా అయిపోయింది. సిరన్జీవి బ్లెడ్డుబ్యాంకీకి ఇచ్చినా పుణ్యం వచ్చునే అనుకున్నా. అది సోదరా ఇయ్యాల్టి యవ్వారం.
ఎంత *కత్తుల్తో* ఆడుకునేవోడికైనా *కత్తి* తెక్క మానదు!!

ఏందీ!! అట్టుందీ ఏలూ!! ఏంపెట్టావూ ఏలుమీన అనుకోమాక. పసుప్పెట్టా!
ఇదిగో ఇదే ఆ *కత్తి*!! కొత్త *కత్తి*!! పదునైన *కత్తి*!!!

ఏటిసేత్తాం సోదరా. తప్పు *కత్తి*ది కాదు. దాన్ని ఉపగోగింసుకున్న నా ఎడం సేత్తిద్ది. అదేటి, *కత్తి*కి కేవలం నరకటమో తెగ్గొయ్యటమో మాత్రమే తెల్సు కద!! మరి దాన్ని కూసిన్త జాగరత్తగా వాడకపోతే సూసేవా ఎన్ని అనర్ధాలు జరిగిపోతయో!!
చివరాకరుగా సెప్పేదేంటన్టే!! *కత్తుల్తో* జాగ్రత్త.

Jul 18, 2008

మీ ఇంట శుభకార్యాలకూ, పెళ్ళిళ్ళకూ

ఫోటోగ్రాఫర్ కావాలా...
సంప్రదించండి......
భాస్కర్ రామరాజు (అంటే నేనే :))

నా ఈ ఫోటో ని తీసినవాడు..
మా బుడ్డోడు...
వాడి ఫోటోగ్రఫిని ఇక్కడ చూడండి.