Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

Apr 9, 2024

ఉగాదికి స్వాగతం

 లేని వసంతాల వెంట
కానరాని వనాల మధ్య
లేని మామిడి చిగుళ్ళుతినే
వినిపించని కోయిలగొంతు కోసం
ఊహల్లో విహరిస్తూ
లేని కలంలో
కనిపించని సిరా నింపి
ఊహాజనిత కాయితం మీద
రాసే కవిత సాక్షిగా
గతేడాది ఇదేరోజున
పంచాగం వెతికి
రాశీఫలాలు శోధించి
ఛీ ఎప్పట్లానేనా అనుకుని
ఉసూరుమన్న జ్ఞాపకానికి
అప్పుడే ఏడాదయ్యిందనుకుంటూ 
కొత్త ఫలాల కోసం శోధిస్తూ
ఆశతో .... 
ఉగాదిగి స్వాగతం చెప్తూ ...

Jan 13, 2021

భోగభాగ్యాల భోగి

భోగభాగ్యాల భోగి
ఈదేశం వచ్చాక భోగమూ లేదు భాగ్యము లేదు అని గునిసేవాళ్ళు ఉన్నా
భోగం అంటే మానసిక వై-భోగం అనుకుంటే
అదే మహాభోగం వైభోగం భాగ్యం
ఈవేళ్ళటి రోజున అన్నిటి కన్నా బాగ్యం వైభోగం - ఆరోగ్యం
మీరు ఆరోగ్యంగా ఉండండి
మీ చుట్టుపక్కల వాళ్ళని ఆరోగ్యంగా ఉండనివ్వండి
మిత్రులందరికీ భోగి మేలుతలపులు శుభాకాంక్షలు
కళ్ళం కాడినుంచి బండి నిండా కొత్త బియ్యాన్ని ముందిట్లోకి దింపి
వచ్చే దారిలో కనిపించిన చెఱుకు గడలు నాలుగు కొట్టుకొచ్చి
పొద్దున్నే అడవికి వెళ్ళి అడవిరేగి పండ్ల చెట్టుని దులిపి
రాలిన పండు రేగులు తెచ్చి
అంతలో పనికిరాని చెత్తని ఏరుకొచ్చి
ముంగిట మంటవేసి
అంతలో చిక్కుడు ఆకులతో రెండు బొక్కెనలు నెత్తికి పోసుకుని
అప్పుడే పేడతో అలికిన పొయ్యి మీద
దొడ్లోని గొడ్డుపాలతో పరమాన్నం చేసుకుని
నివేదనలు కరపి
మూడురోజుల సంక్రాంతిని ఆహ్వానించటానికీ
మనమేమీ పల్లెలోనో లేము
ఆసామి తనమూ లేదు
చేయతగ్గదల్లా
సంక్రాంతి లక్ష్మికి చేతనైనకాడికి దండమెట్టుకిని
ఎవురి ల్యాపుటపుల్లోకి ఆళ్ళు తలలు కాళ్ళు చేతులు దూర్చేసి
పనిచేస్కోటమే

Jan 6, 2021

ఓ జాత్యహంకారీ

 



ఓ జాత్యహంకారీ -

ఎటూ నీ పయనం?

నేటి నలగగొట్టబడ్డ నల్ల బిడ్డడు

రేపు ఎల్లదొరై నీ దేశాన్ని పాలించవచ్చు

ఒక్కసారి నీ కర్మ ఎలా కాలుతుందో ఆలోచించు ఆనాడు


ఎవరి రోడ్డులూ

ఎవరి దేశం అంటూ విర్రవీగుతున్నావు

ఈ దేశం నీయబ్బ సొమ్ము కాదని నీ అంతరాత్మకు తెలుసు


ఓ జాత్యహంకార-ఇజానికి బానిసా

నీ ఆత్మని అమ్ముకొకిలా

నిజాన్ని తెలుసుకుని బతుకు మనిషిలా

బతకనివ్వు మానవజీతినిలా 

Sep 20, 2020

ఆదివారం పాటలతో ప్రయాణం

ఆదివారం పని చేయటం అంత ఈజీకాదు.

కాస్త ఊరట కోసం ఆకాశవాణి పెట్టాను.

ఒక్కో పాట నన్ను పరుగెత్తేలా చేస్తున్నాయి

"అలుపన్నది ఉందా

ఎగిరే అలకు

ఎదలోని లయకు

అదుపన్నది ఉందా

కలిగే కలకు

కరిగే వరకు

మెలికలు తిరిగే నది నడకలకు

మరి మరి ఉరికే మది తలపులకు


నా కోసమే చినుకై కరిగి

ఆకాశమే దిగదా ఇలకు

నా సేవకే సిరులే చిలికి

దాసోహమే అనదా వెలుగు

ఆరారు కాలాల అందాలు బహుమతి కావా

నా ఊహలకు

కలలను తేవా నా కన్నులకు


నీ చూపులే తడిపే వరకు

ఏమైనదో నాలో వయసు

నీ ఊపిరే తగిలే వరకు

ఎటు ఉన్నదో మెరిసే సొగసు

ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే

తరుణం కొరకు

ఎదురుగా నడిచే తొలి ఆశలకు"


- సిరివెన్నెల

గాయం చిత్రం నుంచి 


తేలిక పదాలతో అల్లిన ఈ పాట మొదలు సిరివెన్నెల మార్క్ ని ఆవిష్కరిస్తుంది. 

ఈ పాటని అనుభవించెలోపు ఇంకోపాట మొదలైంది


ఓ కన్నె పువ్వా కాటేసి పోనా - మొదలులోనే వేటురి బాణి అర్థమైపోయింది.


"ఓ కన్నె పువ్వా కాటేసి పోనా

నా తేనే బువ్వా భోంచేసి పోరా


శివ శివా ఏంటమ్మా నాలో ఇంత కువ కువా

హర హరా అందాలకెందుకింత పెర పెరా

కనుల నిదుర కరువై అది పగటి కలల పరమై

పరువమేమో బరువై అది మరువలేని దరువై

ఎల్లకిల్లా పడ్డదమ్మా ఎన్నెల బిళ్లా

తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా

తొలి చూపులో...

తొలి చూపులో చలి కాచుకో పులకింతల పున్నమి వేళా"

ఇంక చెప్పేదేవుందీ


తేనె బువ్వలు

మల్లె బువ్వలు 

వేటూరి శృంగారంలోచి ఉద్భవించిన ఊహలే కదా?


తర్వాతి పాట గులాబి చిత్రం నుంచి

ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో 

సునీతకి సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని ఇచ్చిన పాట.


"ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది

నీ నీడగా మారి నావైపు రానంది

దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో"


సిరివెన్నెల గారి ఈ ఊహ అద్భుతమైన ఊహ. నా గుండె నీ నీడగా మారిపోయింది. మనిషి నుంచి నిడని వేరు చేయలేం అతను ఆమె దగ్గరకి చేరితే తప్ప.

అబ్బా ఇకచాల్లే ఈపాటల పదనిస అనుకుంటుండగానే తర్వాత మొదలైంది.

పాపం రాజేంద్రప్రసాద్ ని మింగేసిన సినిమా రాంబంటు.

ఇందులోని ఈ పాట - 


"సందమామ కంచమెట్టి, సన్నజాజి బువ్వపెట్టి

సందెమసక చీరగట్టి, సందుచూసి కన్నుగొట్టి"

చెప్పకనే చెబుతుంది ఇది వేటూరి బాణి అని

చందమా కంచంలో సన్నజాజి బువ్వ. మళ్ళీ అదే గోల.

సందె మసక చీకటి అంటే కనిపించీ కనిపించని చీకటిని చీరగా చుట్టిందట శృంగార తార. అతన్ని కవ్వించటానికి అందాలని ఆరబోస్తూ కన్ను కూడా కొట్టిందట పాపం.

కానీ అతనేమో - 

"భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల, సీతలాంటినిన్ను మనువాడుకోవాల

బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల, బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల

ఏడుకొండలసామి ఏదాలుజదవాల, సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల

అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల, సింహాద్రప్పన్న సిరి(జాస?)లివ్వాల"

అంటూ లెక్కలు కడుతున్నాడు ముడుపుల మూటలు చుడుతున్నాడు ఆమెని ఏ మాత్రమూ పట్టించుకోకుండా

ఆమేమో పెదవితేనెలందిస్తే పెడమోములు, తెల్లారిపోతున్న చెలినోములు

పిల్లసిగ్గు చచ్చినా, మల్లెమొగ్గ విచ్చినా

అంటూ వేడి నిష్టూరాలు పోతున్నది.


Apr 5, 2020

విలువలు లేని వెధవలు

విలువలు లేని వెధవలు
డాలరు వలువలు వొలిచి
తొక్కిపట్టి బొక్కసంలో బంధిస్తుంటే
ఇంకా పనిముంగిట్లో
నిండా మునిగి
తలుపుతట్టే అవకాశాలని చేజార్చుకుని
ముందరితరాలకు ఏవిద్దామని
నీ ఆలోచన ఓనేస్తం
(స్వగతం)

మనిషి ఆలోచన

అంతఃస్వభావం
బాహ్య స్వభావం
రెండూ మనిషిని లొంగదీసుకుంటాయి
రెండూ మనిషిని నడిపిస్తాయి
దేని ప్రభావానికి మనిషి బానిసో
కాలం నిర్ణయిస్తుంది
ఎప్పట్లాగానే మనిషి ఆలోచన
కాలానికి బానిస
(కాలం = situation)

నిరాశావాది స్వగతం

నా కలలు
నా ఊహలు
నా ఆశలు
నా ఆలోచనలు
నీ చుట్టూ కోటలు
నీ చుట్టూ తోటలు
నీ చుట్టూ పాటలు
నీ చుట్టూ ఊహలు
నా కలలు
గాలికి కొట్టుకుపోయే ఈకలు
నా ఊహలు
నీటిపై కరిగిపోయే రాతలు
నా ఆశలు
మట్టిలో కలిసిపోయే ఆకులు
- నిరాశావాది స్వగతం

నా గ్రంథాలన్నీ నీ కథలే

నా గ్రంథాలన్నీ నీ కథలే
నా గంథాలన్ని  నీ సువాసనలే
నా ఆలోచనలంతా నీ ఊసులే

ఇక్కడ చదివానో ఎక్కడ విన్నానో జ్ఞాపకం రావట్లేదు.

సుదతి

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా
సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును మరుల విరులు కురియగ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
- సినారె

కొంచెం విచిత్రమైన ఆలోచన ఇది. సాధారణంగా అతను ఆమె శరీరాకృతినో కురులనో కళ్ళనో లేక చెవులనో పొగుడుతాడు. సదరు విషయాలన్ని శృంగార విశేషాలు. కొందరు చెవి ఝుంకాలను నడుముకున్న ఆభరణాలను చేతికున్న వంకీలను కూడా జత చేస్తారు
కాని ఇక్కడ సినారె సుదతి తనువు మదన ధనువు అంటాడు. ఆమె శరీరం మదనుడి విల్లు అన్నాడు కానీ ముందు సుదతి అని వాడాడు.
సుదతి - చక్కని పలువరుస కలది
అప్పుడే డెంటల్ డాక్ దగ్గరకెళ్ళి డీప్ క్లీనింగ్ చేయించుకొచ్చింది.


దీనికి మూలం బహుశా సంస్కృత సాహిత్యం అయుండచ్చు.

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
హరతి దర తిమిరమతిఘోరం

జయదేవ అష్టపది
వదసి
యది
కించిత్
అపి
దంత
రుచి
కౌముది
హరతి
దర
తిమిరం
అతి
ఘోరం

ఎలా అర్థం చేస్కోవాలో - ప్రియా మూతి బిగించుకుని  కూర్చున్నావు, ఒక్క మాట పలకటానికి నోరుతెరువు. తెల్లని నీ పలువరుస నుంచి వచ్చే కాంతి ఈ ఘోర తిమిరాన్ని హరించనీ.

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

చాలా కాలం తర్వాత
ఒక కవి తపన
ఓ గాయకుడు భావగర్భితంగా స్రవించిన ధార

అద్భుతం అనక తప్పదు

నాకం

ఓ మహాత్మా
ఓ మహర్షి

ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం

శ్రీశ్రీ మహాప్రస్థానం
ఆకలిరాజ్యం సినిమాలో ఈ కవితని శ్రీ బాలసుబ్రహ్మణ్యం చాలా భావావేశంతో పాడారు, కమల్ హాసన్ జీవించాడు

శ్రీశ్రీ నవకవితా పితామహుడు ఊరకనే కాలేదు. ఆయన భావాలు గొప్పగా ఉంటం వల్ల అయ్యాడు. ఆయనకి బీజం ఎక్కడ పడిందో తెలియలేదు. ఆయన సాహిత్య స్రవంతికి మూలాలేంటో?
ఆయన పురాణాలు ఉపనిషత్తులు బాగా చదివి ఉంటాడు.

ఉదాహరణకు -
ఏది నరకం ఏది నాకం

నాకం అనే పదం నేను వినలేదు ఈ కవితలో తప్ప.

అకము akamu. [Skt. from ఆ = not & క = happiness.] n. Ache, pain, affliction. Sin. దుఃఖము, పాపము నాకము = న+అకము = heaven, the sinless place.

ఈ పదం ఇక్కడ దొరికింది -
మహానారాయణ ఉపనిషత్

అంభస్యపారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్
అంభః
అపారః
భువనః
అస్య
మధ్యే
*నాకః*
అస్య
పృష్ఠే
మహతో
మహీయాన్

Nov 2, 2013

దీప ఆవళి

నీలోని చీకట్లను
జ్ఞానపు దీప ఆవళులతో
పారద్రోలుకో
నిన్ను నమ్ముకున్న వారి మనసున
దీప ఆవళులను వెలుగించు
కుల దీపకుడివై ప్రజ్వరిల్లు
సత్ సమాజ నిర్మాణానికి
దారులు వేస్తూ
ఆ దారుల వెంట
దీప ఆవళులని జ్వలింపజేయు
అదే నేటి సమాజం
రాబోయే తరానికి
నీవందించే
నిజమైన దీపావళి
దీప ఆవళి

జై హింద్

Aug 8, 2013

రాహు త్యాగరాజు స్టేట్


_వంశపారంపర్య పాలనకు చెక్ చెప్పేందుకు రాహుల్ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారని ఏఐసిసి కార్యదర్శి జీవన్ వాల్మీకి చెప్పార #ట_

రాహు పేరు త్యాగరాజు అనిపెట్టుంటె ఎంత బాగుండేడ్చేదో

వాళ్ళ అమ్మ సాని'యా త్యాగాలు
వాళ్ళ సిస్టరు త్యాగాలు
వాళ్ళ నాన్న త్యాగాలు
వాళ్ళ బావ త్యాగాలు
బాబోయ్
సివరాకరికి వీడు *స్టేటు త్యాగాలు* లేక *త్యాగం అనే  స్టేట్* లో మునిగిపోయాడు.
వయసు గోలపెడుతున్నా
మనసు ప్రేమకోసం మూలుగుతున్నా
సాయంత్రం ఓద్కా గొంతులోకి గదిగుతూ  కోర్కిలను రేపుతున్నా
పక్కనోళ్ళు పెండ్లిళ్ళు సేస్కుని పిల్లల్ని కంటున్నా
సెదరకుంటా
బెదరకుంటా
ఆ  త్యాగం అనే  ఓ  స్టేట్లోకి ఎల్లిపోయి
దేశంకోసం
తన దేశం అనే స్టేట్ కోసం
తన ఎస్టేట్ కోసం
తన స్టేట్ అనే దేశంకోసం
పెండ్లికూడక చేస్కోకుంటా
జీవితాన్ని ధారపోసినాడంటే
అడ్డెడ్డెడ్డెడ్డే!!!!

Jul 30, 2013

ఓట్లకోసం

ఓట్లకోసం రాజ్యాన్ని చీల్చే
దరిద్రపు రాజకీయ రాబందులు
రేపొద్దున నరుణ్ణి చీల్చరనీ
మాంసాన్ని కొట్టి ఇటలీకో చీనాకో అమ్మరనీ
నమ్మకం ఏంటీ?
జాతి నరాలతో ఇటలీలో వీణలు అమ్ముకునే
బేహారులను తరిమికొట్టకుండా
నెత్తినపెట్టుకు పూజించే మనం!
మరోమారు బలౌదాం
మరోమారు వారినే గెలిపిద్దాం
మనల్ని మనం పాతాళానికి తొక్కుకుందాం

Jan 5, 2013

అబే అక్బరుద్దీన్ ఒవైసీ సాలే!

అబే అక్బరుద్దీన్ ఒవైసీ
సాలే!
పదిహేను నిమిషాలు పోలీసుల్ని తీసేయటం ఎందుకురా పిరికినా కొడకా
ఒక్క రెండు నిమిషాలు నీ సెక్యూరిటీని తీసేసి చూడు
కోసి చేతిలో పెడతారు

హైందవులారా ఏకంకండి
మరో అక్బర్ ఈ సమాజంలోంచే పుట్టినాడు
మన హైందవ జాతిని
పదిహేన్నిమిషాల్లో
తునాతునకలు చేయటానికి
మనగడ్డపై
మనక కంట్లో వేలు పెట్టి
పొడిచిమరీ అరుస్తున్నాడు
లేవండి
నోరు తెరవండి
హైందవులారా ఏకంకండి

Jun 28, 2012

దేవుడా శక్తిని ఇవ్వు

జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
నూరేళ్ళ ప్రయాణంలో
కలసి అడుగులో అడుగులు వేస్తూ
శ్వాసలో శ్వాసౌతూ
సగంలో సగం అవుతూ
దేవుడు కలిపే పాత్రలు
కొన్ని
అర్థాంతరంగా ముగిసిపోతాయి
కలసి నూరేళ్ళు నడవాల్సిన రెండో పాత్రకో?
ఆ లోటు తీరనిది
ఆ లోటు తీర్చలేనిది
ధైర్యమే తోడు
ముందుకు వెళ్ళితీరాల్సింది
అదే ప్రకృతి తీర్పు
జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
దేవుడా శక్తిని ఇవ్వు
లేత హృదయానికి
ప్రేమించిన హృదయానికి
తట్టుకునే శక్తినివ్వు
నీ లీలనీ
నిలచిన కాలాన్ని
తట్టుకునే శక్తినివ్వు

[ప్రమాద వశాత్తూ మరణించిన నా సోదర సమానుడు, మిత్రుడు, శ్రేయోభిలాషికి అశృనయనాలతో]

Jun 26, 2012

'మంత్రాలయం'లో అగ్నిప్రమాదం

పిల్ల పెళ్ళి
రిటైర్మెంట్ బెనిఫిట్
తడిసిన చేతులు
అరిగిన కాళ్ళు
కాలిన ఫైళ్ళు
దీనిపై ఓ సినిమా తీస్తే బావుంణ్ణు ఎవరైనా....

[మహారాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం 'మంత్రాలయం'లో అగ్నిప్రమాదం]

Mar 2, 2012

రోడ్డెమ్మట, గోడలనిండా సుట్టూతా నా వాళ్ల రక్తం సాక్ష్యంగ.......

వాడు నవ్వుతున్నడు
ముక్కలైన జన దేహం
పగిలి వక్కలౌతున్న కుటుంబాలు నా కళ్ళల్లో

పొద్దున్నే లేచి బువ్వ డబ్బాకెత్తుకుని
ఎప్పట్లాగనే అదే దారిలో
పనికోసం పొట్టకోసం
రోడ్డంతా నా వాళ్ళ రక్తం

చెల్లాచెదురైన దేహఖండాల మధ్య నిలబడ్డ మృగం
చేతిలోని రిమోటుని ఎగరేస్తూ గర్వంగా నవ్వుకుంటూ
ముఖాన చిందిపడ్డ రక్తాన్ని నిర్లక్ష్యంగా తుడుచుకుంటూ
కాలిన దేహాల్లోంచి వచ్చే పొగని ఆశ్వాదిస్తూ

ఈ నిర్లక్ష్యం
జిందగీ పొడుగూతా...

వాడు నవ్వుతున్నడు
అస్మంటోళ్ళు అందరూ నవ్వుతున్నరు
సందు సివర బాంబుపెట్టిన ప్రతోడు నవ్వుతున్నడు
అమాయకుల ప్రాణాలు తునాతునకలుజేసిన ప్రతోడు
గర్వంగా హేయంగా విలాసంగా జేబులనిండిన బలంతో నవ్వుతున్నడు
రోడ్డెమ్మట, గోడలనిండా సుట్టూతా నా వాళ్ల రక్తం సాక్ష్యంగ.......

(నా గుండె లోతులనుండి ఈ మంట)

Mar 1, 2012

నా రగతం మరగదా?

నేను ఈ దేశంలోనే పుట్టినా
కొన్ని వేల ఎండ్లుగా ఇక్కడ్నే
బతికి బట్టకట్టింది నా జాతి
నల్దిక్కులా నమ్మిన మతానికి
కన్పడని ఓ బలాన్కి గుళ్ళు కట్టింది నా జాతి
ఎక్కడ్నుండి ఊడిపడిండో తెల్వదు
కొడుకు, వంకర కత్తుల్తో
శాంతితో
ప్రశాంతంగా
వెల్గుతున్న నా ఇండ్లలోనికి
కుశాలుగా వెళ్తున్న జీవితాల్లోకి
బలవంతంగా సొచ్చుకుని ఒచ్చినాడు కొడుకు
కత్తి చేతబూని
రక్తం మరకల కత్తి
నా నమ్మకాలను నేలకంట కూలగొట్టిండు
ఎందర్ని సంపిండో కొడుకు
వచ్చినోడు కన్పడ్డ కుతికని
తెగ నరికిండు
జాలిలా
దయలా
పిల్లలని జుడలా
పెద్దలని జూడలా
కన్పించిన ఆడదాన్ని చెరిచిండు
కన్పించిన ప్రాణాన్ని నరికిండు
తెగ నరికిండు
నా మతంల మారు అన్నడు
నా మతం కానోడు కాఫిర్ అన్నడు
నా గుళ్ళను కూల్చిండు
నా జాతి మానాన్ని దోచిందు
నా జాతి ప్రాణాలను దోచిండు
అరె, ఇప్పుడేమైందిబై?
మతం మారిన కొడుకు
మరో దేశం గావాలె అన్నడు
నా దేశాన్ని ముక్కలుజేపించిండు
సరే, పో!! ఫైసల్. ఖతం అనుకుంటి
లే!! అప్పట్నుండి ప్రతేళ
పక్కలో బల్లెం
పొడుస్తనే ఉన్నడు
రైల్ల పోతుంటే, నిప్పుపెట్టిండు
కాలికట్టైన ప్రాణాలని జూసి
నే కన్నెర్ర జేయగూడదు
కిందా పైన సేపెట్టి మూస్కుని కూకోవాలె
ఏం? ఎందుకు?
నే మనిడిసిని కాదా?
నాలో రగతం లేదా?
న రగతం ఎరుపెక్కదా?
నేను నీకూ, ఎన్నెముకలేని ప్రభుత్వానికి వెట్టోణ్ణా?
నా రగతం మరగదా?
నా ప్రాణం ప్రాణం గాదా?
నా జనం ప్రాణం ప్రాణం గాదా?


'పహ్‌లీబార్ సబ్ కుచ్ బచా
దూస్రీబార్ బచీ జాన్‌
తీస్రీబార్ నామో నిషాన్ మిట్ జాయేగా'
                               - గుజరాత్ గోడ మీది వాక్యాలు

Oct 18, 2011

ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది(ట)

గుజరాత్ ముస్లింల నరమేధం సాక్షిగా మోడీని ఎన్నటికీ ఈ దేశ ప్రజాస్వామిక, లౌకికవాదులు అంగీకరించరని ఆశిద్దాం. లేదంటే ఈ దేశం మరెన్నో గుజరాత్‌లను చూడాల్సి వస్తుంది.
- సోనే కీదిన్
వాయ్యాఆఆఆఆఆఆఆఆఅ
వామ్మాఆఆఆఆఆఆఆఆ
భయంగా ఉంది బాబాయ్
ఎవ్వడీయనా, సిన్న పిల్కాయల్నుజేసి బెదిరిస్చన్నాడు
కవిత్వం అంటా రాస్కోమనండి, ఎవడొద్దన్నాడూ
తొక్కేస్చన్నారంట? రాజకీయ నాయకులు జనాలని తొక్కుతాంటే అగుపిస్తల్లేదు కాబోలు.
అణగదొక్కినారంట. ఏందీ? యాడా?
బీదా బిక్కీ
రెక్కాడితెగాని డొక్కాడని పంతుళ్ళు
రెండు గింజలు దెస్తే గాని నిండని కడుపులు
ఇల్లుపట్టని సంతానం
ఎక్కళ్ళేరు బీదలు?
హైందవజాతంతా ఆర్థిక పరిపుష్టి కల్గున్నరా?
ఏందీ వీరి ఏడుపు?
ఎవుర్ని బెదిరిస్తున్నరూ?
మీకు నాల్గు/ఐదు శాతం రిజర్వేషన్ అన్యా ఉన్నాది
మాకేవుందీ?
మా సొత్తంతా ఛెంఘీజ్ ఖాన్ సంతతి దోచిన్రు
మిగతా తెల్ల నా కొడుకులు గుంజకపోయిన్రు


బ్రాహ్మణులు అసంటఅసంట అన్నందుకు హిందువులు ముస్లిములైనరా?
అంతే! ఇంకవరిపై పడి ఏడుస్తరూ?
మిగతా కులాలనంటే దొరికే గుక్కెడు నీళ్ళు దూరమైతై
మిగతా కులాలనంటే దొరికే గుప్పెడు మెతుకులు తినేతానికి చేతులుండవ్
ఇంక ఎవరిమీద పడి ఏడుస్తరూ?
ఉన్యారుగా పంతుళ్ళు. ఊరికొకరు
ఊరికి ఒకరే

ఐతే!! ఇంకో గుజరాతే జూడాల్సొస్తే బిడ్డా!!
ఇదేం వెయ్యేళ్ళనాటి ఛంఘీజ్ ఖాన్ దినాలనుకున్నవా?
హైందవుల ఆస్థులను దోచి
కనిపించిన కుత్తికను తెగనరికి
ప్రాణమున్న ఆడదాన్ని చెరిచి
కట్టుకున్న కోటలనుకున్నవా
మా తలకి వీరపాగాలు
మా నుదుటన వీర తిలకాలు
మా కండ్లలో రగుల్తున్న అగ్నిగోళాలు
మా మూతిమీన మెలేసిన మీసాలు
మా గుండె నిండా ఎగసిపడే పౌరుషాలు
మా కండల్లో పేలుతున్న అగ్ని పర్వతాలు
మా చేతిన ఆరడుగుల పొన్నుకొట్టిన జానకర్రలు
మా బొడ్లో దోపిన బరిసెలు
మా నడుముకి బిగించి కట్టిన పైపంచెలు
పైకి లాగి దోపిన పంచెలు
నరనరాన మిరిమిట్లుకొలిపే విద్యుల్లతలు
మరుగుతూ పొగలు కక్కుతున్న రగతం

మరో గుజరాతు కాదు
ఎన్ని గుజరాతులైనా
నరానికి నరమ్
ప్రాణానికి ప్రాణమ్