Oct 6, 2008

నానమ్మలు ఏడుస్తున్నారు

నిజంగా
ఇదేదో ఆడవాళ్ళమీదకోపంతోనో, లేక స్త్రీద్వేషంతోనో రాయటమ్లేదు.

ఈరోజున, మగపిల్లోడు, ఇంజనీరింగో లేక, యం.సి.ఏ నో చెయ్యటం దెగ్గర్నుంచి ఇంటికి దూరంగనే ఉంటున్నడు. వాడు చదువు పూర్తిజేసి, ఉద్యోగం వచ్చి, సెటిల్ అయ్యి, బంగళూరో పాటిబండ్లో ఎదోచోట బ్రహ్మచారిలా మిగతా మూకల్తో కల్సి ఉంటూ, మొత్తమ్మీద ఇంటికి దూరంగనే ఉంటాడు. ఈలోపల ఆన్-సైట్ అది ఇదీ. ఈలోపల ఏదో టీకొట్టోడు (అదేనండీ మన కన్సల్టెన్సీలు - అమెరికాలో అవి చాయ్ దుకాణాల్లానేగా) పట్టేస్తడు. హెచ్-1. మనోడు అమ్రికాలో వాల్తడు. ఈలోపల పెళ్ళి. పెళ్ళికాంగనే ఆ పిల్లకి అత్త మామల్తో కల్సి ఉండి, వాళ్ళ టెంపర్మెంట్సు తెల్సుకునే అవకాశం, సమయం లేవు. పెళ్ళి అవ్వటం అమెరికా ప్రయాణం. ఇక్కడకి రాంగనే ఐసోలేటెడ్ జీవితం. దాంతోటి, పెద్దోళ్ళు ఎవ్వరూ లేకపొయ్యేసరికి, మనం ఏది ఆలోచిస్తే అదే కరెక్టు. మొండితనం, పంతం, పట్టుదల పెరిగి మఱ్ఱిచెట్టంత అయితై. ఈలోపల కడుపు కాకరకాయ. ఇన్వైటేషన్ లెటర్సు ఎవరికి పంపాలి? పిల్ల తల్లికే!!! కానుపు ఐంది. ఇక్కడా పిల్లాడి తల్లితండ్రులకి దిగులు, పేపర్లు పంపిస్తా రండీ అన్నా ఒక రకమైన అభిమానం, కానుపు మమ్మల్ని పిలవలేదు కదా అని. ఈలోపల ఆ పిల్లకి మొదలే దూరమైన అత్త మామలు ఇంకా దూరమై, భారంగా కూడా కనబడ్తారు. అప్పటిదాకా గుర్తురాని "పేరెంట్స్ రావాటానికైయ్యే ఖర్చు" అప్పుడు గుర్తొస్తుంది. మొత్తానికి నాయనమ్మలు, అటు కొడుకూ దూరమై, ఇటు కొడుక్కి పుట్టిన నలుసునీ కూడా చూస్కోలేక ఏడుస్తున్నారు.

16 comments:

 1. నేను ఈ వ్యాఖ్య ఎవరి పైనా కోపంతో రాయట్లేదు. మీరు చెప్పినట్లే అబ్బాయిల తల్లిదండ్రులు నిజంగానే బాధపడతారు. కానీ నేను గమనించిన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను.
  1. ఇండియాలోనే ఉన్నా సరే ఎంత మంది అత్తమామలు కోడలికి ప్రెగ్నన్సి టైంలో సహాయం చేయటానికి రెడీగా ఉంటారు? మనవళ్ళపైన ఉన్న శ్రద్ధ, ప్రేమ కోడలి పైన ఎంత మంది చూపిస్తారు?
  http://everythingisprecious.wordpress.com/

  2. పోని ఊహించుకోవటం వదిలేద్దాం. ఇంతకు మునుపు పెద్ద కుటుంబాలే ఉండేవి కదా. అప్పుడెందుకు అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళిపోయేవారు? అప్పుడు అవగాహనకి ఎక్కువ ఆస్కారమే ఉండేది కదా?

  3. పోని ఇప్పుడైనా అమ్మాయిల తల్లిదండ్రుల బదులు సహాయం చేయటానికి అబ్బాయిల తల్లిదండ్రులు ముందుకొస్తారా?

  4. అమ్మాయిలు కాదనేసినందుకే తల్లిదండ్రులను ఆహ్వానించని కొడుకులుంటే అది వాళ్ళ తప్పే అవుతుంది కానీ అమ్మాయిలదెలా అవుతుంది? వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించటం వాళ్ళకే తెలియదన్నమాట.

  5. కోడలకు సేవ చేయటం అటుంచండి. వాళ్ళ కొడుకు పెళ్ళిని వాళ్ళ డబ్బుతో కూడా చేయించేవారెక్కడైనా ఉన్నారా?

  ఇన్ని చేశారని వాళ్ళని ఇలా బాధపడమని శపించట్లేదు. కానీ అమ్మాయిలదే అంతా తప్పు అని అంగీకరించలేక....ఇలా. అంతే.

  ReplyDelete
 2. sorry. Thought of pasting my blog address at the end. But accidentally pasted after the first point.

  ReplyDelete
 3. @భవాని గారు: నేను కేవలం అమ్మాయిలదే తప్పు అనలా.
  1. ఇండియాలోనే ఉన్నా సరే ఎంత మంది అత్తమామలు కోడలికి ప్రెగ్నన్సి టైంలో సహాయం చేయటానికి రెడీగా ఉంటారు?
  ఎంతమందిని చూపించమంటారు? ఇక్కడ విషయం, ఎంతమంది తమ అత్త మామల్ని కనీసం అర్ధం చేస్కోటానికి ట్రై చేస్తున్నారు అని.
  2. పోని ఊహించుకోవటం వదిలేద్దాం. ఇంతకు మునుపు పెద్ద కుటుంబాలే ఉండేవి కదా. అప్పుడెందుకు అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళిపోయేవారు?
  ఆటవిడుపు కోసం. రెష్టుకోసం.
  మీరు అత్తకూడ ఒకఆడదే అనేవిషయాన్ని దేనికి మర్చిపోతున్నారు? రాపో నిర్మించుకోలేరా? 1970 లలోనో లేక 1980/90 లలోనో పుట్టినోళ్ళే బ్రోడ్ గా ఆలోచించలేకపోతే 1940/50 లల్లో పుట్టినోళ్ళు ఎలా ఆలోచిస్తారు?
  3. పోని ఇప్పుడైనా అమ్మాయిల తల్లిదండ్రుల బదులు సహాయం చేయటానికి అబ్బాయిల తల్లిదండ్రులు ముందుకొస్తారా?
  మీరు రానిస్తారా? మీరు రానిస్తున్నారా?
  4. అమ్మాయిలు కాదనేసినందుకే తల్లిదండ్రులను ఆహ్వానించని కొడుకులుంటే అది వాళ్ళ తప్పే అవుతుంది కానీ అమ్మాయిలదెలా అవుతుంది?
  ఇక్కడ పాయింటు అదేకదా!! ఈనాటి మొగాడు ఒక ఏ.టి.యం, వెన్నెముకలేని ప్రాణి.
  5. కోడలకు సేవ చేయటం అటుంచండి. వాళ్ళ కొడుకు పెళ్ళిని వాళ్ళ డబ్బుతో కూడా చేయించేవారెక్కడైనా ఉన్నారా?
  నాకు అర్ధం కాలా

  >>ఇన్ని చేశారని వాళ్ళని ఇలా బాధపడమని శపించట్లేదు. కానీ అమ్మాయిలదే అంతా తప్పు అని అంగీకరించలేక....
  అమ్మాయిల ఆలోచనా విధానం మారలా అఖర్లేదా? తప్పు అస్సలు లేదా?
  మీరు లేదని చెప్పండి, ఇంక డిస్కషనే అఖర్లేదు. మగాడి బతుకింతే అనేసి ఊరుకుందాం.

  ReplyDelete
 4. there are problems. problems లేని జాతేలేదు. ఐతే ఈ ఋగ్మత కేవలం డైయలాగ్ తో తుడిపేస్కోవచ్చు, రూపుమాపుకోవచ్చు. ఇద్దరు అన్నదమ్ములే సమానంగా అలోచించలేనప్పుడు, ఒక అమ్మాయి, తనకంటూ ఒక ధృకపధం ఏర్పచుకున్నాక ఇంకోఇంటికెళ్ళి మనగలాగాలంటే ఛాలెంజ్ గానే ఉంటుంది. ఐతే ఒకానొక శాతం అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అదీ నాబాధ.
  ఎంతమంది కోడళ్ళు వేరుకుంపటి పెట్టించలేదు? తల్లా పెళ్ళామా అనే మానసిక పోరాటంలో మగాడు కళ్ళుండి గుడ్డోడవుతున్నాడు.
  భారతంలో ఉంటూనే ఇలాచేసేవాళ్ళుంటే, అమెరికాలో, నాలుగు గోడల మధ్య, విచిత్రమైన పరీస్థితుల్లో మగ్గుతూ, అత్తమామల్ని కాలరాస్తున్న కోడళ్ళని ఎంతమందిని చూపమంటారు?

  ReplyDelete
 5. భాస్కర్ రాజు గారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. నాయనమ్మలదేదో పాతతరం చాదస్తం!! విశాలంగా ఆలోచించవలసిన అవసరం నేటితరానిదే.

  ReplyDelete
 6. అత్తమామలను అస్సలు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించకపోవటం ముమ్మాటికీ తప్పే. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఆ మాటను నేను అస్సలు కాదంటంలేదు. కానీ ర్యాపో లేకపోవటానికి వాళ్ళే కారణం కాదు అని చెప్తున్నాను. తప్పు వేరొక వైపు నుండి కూడ ఉండొచ్చు అని చెప్తున్నాను.అంతే.
  ఇక్కడ ఏ సంవత్సరంలో పుట్టారని కాదు. ఎవరైనా మనల్ని బాధపెడితే(ఏ రూపంలోనైనా.....మన రాష్ట్రంలో పెళ్ళిళ్ళ సమయంలో అమ్మాయిలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎదురయ్యే అవమానాలు మీకు తెలుసనుకుంటున్నాను), దానికి ఎలా రియాక్ట్ అవుతాము? అమ్మాయిలు కూడా మనుషులే కదా. వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. అయినప్పటికీ అత్తమామలు బాగా చూసుకుంటే వాళ్ళతో మంచిగా ఉండేవారిని ఎంత మందిని చూపించమంటారు?
  ఇవన్నీ వదిలేసిన అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ కిచ్చే ఇంపార్టెన్స్ని బట్టి కూడా అత్తమామలని గౌరవించే అమ్మాయిలను ఎంతమందిని చూపించమంటారు?
  మీ మూడవ ప్రశ్నకి సమాధానం - నేను మా అత్తమామలను రానిస్తాను. నాకేమీ సమస్య లేదు. కానీ వాళ్ళకున్నాయి. కానీ మా అమ్మగారు వస్తున్నారంటే ఆవిడకు ఏ సమస్యా లేదనుకుంటున్నారా? మా నాన్నగారొక హార్ట్ పేషంట్. ఆరు నెలలు అతనిని వదిలి వస్తున్నారు. మా అక్క వాళ్ళ బాబుని చూసుకోవటానికి మా పెద్దమ్మ ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ వచ్చారు. కానీ వాళ్ళ అత్తగారు రాలేదంటే మీరు నమ్ముతారా?

  ReplyDelete
 7. రామరాజు గారు మంచి విషయం లేవనెత్తారు. మీతో నేను పుర్తిగా ఏకీభవించలేను, మీరు చెప్పేవాళ్లలాంటి వాళ్లు కూడా లేకపోలేదు...

  అసలు ఇక్కడ సమస్య అమ్మాయి తల్లిదండ్రులా, అబ్బాయి తల్లిదండ్రులా అన్నది కాదు..అమ్మమ్మలు, నాయనమ్మలు ఇద్దరూ NRI పిల్లలతో సఫర్ అవుతున్నారు.

  @భవానీ గారు, మీరు మరీ ఏకపక్షంగా అంటున్నారేమో...

  1. ఇండియాలోనే ఉన్నా సరే ఎంత మంది అత్తమామలు కోడలికి ప్రెగ్నన్సి టైంలో సహాయం చేయటానికి రెడీగా ఉంటారు? మనవళ్ళపైన ఉన్న శ్రద్ధ, ప్రేమ కోడలి పైన ఎంత మంది చూపిస్తారు?

  ఎందుకు లేరండి. ప్రెగ్నన్సి టైంలోనే కాదు ఎప్పుడు అవసరం వచ్చినా వచ్చి సేవలు చేసే అత్తగార్లు చాలామంది ఉన్నారు. ఎవరికో కాదు, నా విషయంలోనే, నాకు ఒక ఆరునెలలు ఆరోగ్యం బాగోలేకపోతే మా అమ్మ, మా అత్తయ్య, ఇద్దరూ చెరొక నెల రోజులుండి సేవలు చేసారు.

  2. పోని ఊహించుకోవటం వదిలేద్దాం. ఇంతకు మునుపు పెద్ద కుటుంబాలే ఉండేవి కదా. అప్పుడెందుకు అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళిపోయేవారు? అప్పుడు అవగాహనకి ఎక్కువ ఆస్కారమే ఉండేది కదా?

  వెనకటి రోజులలో పురిటికి పుట్టింటికి వెళ్లటం అనేది ఒక ఆచారంగా ఉండేది. ఆ రోజులలో ఉమ్మడి కుటుంబాలలో ఆడవారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది, ఇలా అన్నా వారికి కాస్త విశ్రాంతి దొరుకుతుందని ఇలాంటి ఆచారం పెట్టి ఉంటారు. ఇప్పుడు కూడ పురిటికి పుట్టింటికే వెళతారు (ఇండియాలో ఉంటే), అమెరికా వాళ్లు పిల్లలకి సిటిజెన్ షిప్ కోసం అని రావటం లేదు అంతే.

  3. పోని ఇప్పుడైనా అమ్మాయిల తల్లిదండ్రుల బదులు సహాయం చేయటానికి అబ్బాయిల తల్లిదండ్రులు ముందుకొస్తారా?

  ఎందుకు ముందుకు రారండి. నాకు తెలిసిన ఒక కుటుంబంలో అమ్మాయి డెలివరీ టైముకి వాళ్ల అత్తగారే రెండుసార్లు వెళ్లి వచ్చారు. ఇక్కడ ఇంకో విశేషమేమంటే ఆ అమ్మాయి తల్లిదంద్రులు కూడా అమెరికాలో సెటిల్ అయినవాళ్లే.

  4. అమ్మాయిలు కాదనేసినందుకే తల్లిదండ్రులను ఆహ్వానించని కొడుకులుంటే అది వాళ్ళ తప్పే అవుతుంది కానీ అమ్మాయిలదెలా అవుతుంది? వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించటం వాళ్ళకే తెలియదన్నమాట.

  కొందరి విషయంలో గౌరవం లేకపోవటం కాదు గౌరవం ఉన్నా ఎందుకొచ్చిన తలనెప్పని దూరంగా ఉండే కొడుకులు ఉంటారు.

  ఇక మీ మూడో వ్యాఖ్యకి వ్యాఖ్య:

  మీరు చెప్పేలాంటి అత్తలు కూడా ఉంటారు, కానీ అందరూ అలాంటి వాళ్ళే ఉండరు. అత్త కూడా ఒక అమ్మే కదా. మీరు ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న--మీకు అన్నదమ్ముళ్లు ఉన్నారా? ఉంటే మీ అమ్మ గారు మీ ఇంటికి వచ్చి సేవ చేసినట్లు వాళ్లింటికి కూడా వెళ్లి చేస్తారా?

  ఏదైనా వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి కొండొకచో పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉండేది ఆడవారి మధ్య ఈగో సమస్యలే, ఇందులో మగవారి పాత్ర చాలా చాలా తక్కువ (పాపం మద్యలో నలిగిపోవటం తప్ప).

  ఇక ఈ చర్చకి NRI మహిళామణులు ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం, వారి దృక్కోణం కూడా తెలుస్తుంది.

  ReplyDelete
 8. @సిరిసిరిమువ్వ
  నాది ఏకపక్షవాదనని ఒప్పుకుంటున్నాను.
  కానీ, కేవలం ఈ టపాలో ఉన్న జనరలైజేషన్స్ కి ఇంకో సైడ్ చూపించటమే దాని ఉద్దేశ్యం. అంతే.
  అతను చెప్పిన సంఘటనల్లోని ఆడవాళ్ళ ప్రవర్తనను నేను సమర్ధించటంలేదు. అలాంటి వాళ్ళను తప్పకుండా వ్యక్తిరేకిస్తాను. కానీ, కొన్ని సంఘటనలను మాత్రమే చూసి జెనరలైజ్ చేసారని ఫీల్ అయ్యాను. నాకెందుకలా అనిపించిందంటే మొదటి లైన్ నుండే అలా ఉండటం చేత(ఈ రోజున... నుండి).
  అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ విషయంలో భార్యలని సంభళించుకోలేరు. వాళ్ళు ఏ రిస్కూ తీసుకోరు. కానీ అమ్మాయిలు మాత్రం మొత్తం వాతావరణాన్ని పాజిటివ్గా మార్చేయాలి. అమ్మాయిలకేమైనా మహిమలుంటాయా? అలా మార్చేసుకోగలిగితే ఇంకేముంది?
  మీరు చాలా సంఘటనలు చెప్పారు. కానీ అవి జనరల్గా జరుగుతాయా?
  అత్తమామలు పేరెంట్స్ లాంటి వాళ్ళు. దానిని నేను కాదంటంలేదే. కానీ వాళ్ళు అలా ప్రవర్తించనప్పుడు ఒక స్థాయికి మించి సహనం వహించి జీవితాన్ని ప్రేమమయం చేసే బాద్యత కేవ్లం అమ్మాయిల పైన మాత్రమే పెట్టటం సమంజసం కాదు. చప్పట్లు ఒక్క చేతితో కొట్టలేం కదా.
  తల్లిందండ్రులు అబ్బాయిలను పోగొట్టుకుంటున్నారని రాసారు. మరి అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులకు దూరం కావటం లెదా?
  forgot to type in the answer for your last question. My brother has not been married. But i am sure my mother won't go to look after her daughter-in-law. People are verymuch used to this dirty system.

  ReplyDelete
 9. నిజంగానే ఏడ్చే నానమ్మలు నాకు తెల్సు.మనవడు పుట్టాడటగా? అని ఎవరైన అడిగినప్ప్పుడూ మనవడి గురించి మురిసిపోతు చెప్పడానికి ఆ నాన్నమ్మ దగ్గర పాపం ఏ కబుర్లూ వుండవు.అదే అమ్మమ్మని అడిగిచూడండీ,
  గుక్కతిప్పుకోకుండా అరగంట చెబుతుంది.మనవడి ముద్దుముచ్చట్టు వర్నించి చెప్పే తీరిక కొడుక్కి వుండదు. (మరే రోజంతా కబుర్లాడీతే కుటుంబ పొషణ ?) ఆడవాల్లు మాత్రం ఎక్కడ వున్న తమవాళ్ళతో మంచి కమ్యునికేషన్ కలిగి వుంటారు.
  పెళ్ళిళ్ళు, కాపురాలు కూడా ఈ దేసంలోనే జరిగే రోజుల్లో ,కొడుకు వేరు కాపురం వున్నకూడా కోడలు చంటిపిల్లడితో కొన్నళ్ళు అత్తవారింటిలో వుండేది.ఆ సమయంలో చంటిబిడ్డకి స్ననం చేయించడం ,ఏ అర్దరాత్రొ పిల్లడు గుక్కపెట్టీ ఏడుస్తుంటే ఏదో చిట్కా వైద్యంతో వాడి ఏడుపు ఆపి కోడలికి ధర్యం చెప్పడం .... ఇలా కొన్నళ్ళయినా, కొంతైనా పసిబిడ్డతో సాన్నిహిత్యం నాన్నమ్మ్మలకి వుండేది. కొడుకులు విదేసాల్లోవున్న వారికి మనుమలు వున్న, ముచ్చట్లు మాత్రం 0000 .కారణాలు ఏవైనా ఈరొజుల్లో మాత్రం, నాన్నమ్మ పాత్రకన్న అమ్మమ్మ పాత్రే ఎక్టివ్ గా వుందని ఒప్పుకొనితీరాలి.ఒకప్పుడు ఎంతో హుందాగా వుండే నాన్నమ్మ కొడుకుని విదేసానికి పంపి, ఒకప్పటి పేదరాసిపెద్దమ్మ లా కేవలం కధలకే పరిమితమైపొతుందేమో అని బాధగావుంది.

  ReplyDelete
 10. భవానీ గారు: నాకు మీ భావం అర్ధంఅయింది. మీరు చెప్పదల్చుకున్న విషయం కూడా అర్ధంఅయింది.
  ఐతే మీకు నేను చెప్పదల్చుకున్నది అర్ధంఅయిందా? ఐందనే భావిస్తున్నా.
  >>కానీ ర్యాపో లేకపోవటానికి వాళ్ళే కారణం కాదు అని చెప్తున్నాను.
  నేనొప్పుకుంటున్నా. ఎంతమంది అత్తలు తమ కోడళ్ళని కొడుకుల చేత తగలబెట్టించలేదు. ఎన్నోజూసాం. ఐతే, ఎంతమంది కోడళ్ళు అత్తల్ని ఇంట్ళోంచి వెళ్ళగొట్టించలేదూ? అదికూడా చర్చించాల్సిన విషయమేగా?
  The important thing here is, In US, being an exposed woman to so called Modern/Western Civilization, being masked with American Culture, Cannot Indian Women treat their in laws as nutral as possible? Cannot Indian Women understand that in laws are also "HUMANS"? Parents means only girls parents? Thats my concern.

  ఒక చిన్న సంఘటన. నాకళ్ళారాచూసింది చెప్త. ఒకడికి పిల్లాడు పుట్టాడు. బారసాల, అతని అమ్మ, ఆమె అమ్మ వచ్చారు. పూజారి కార్యక్రం చేయిస్తూ పిల్లాడికి నగనట్ర ఏమైన తెచ్చారా, పెట్టండి అన్నాడు. ఆ అమ్మాయి తల్లి వెంటనే ఆ బుజ్జోడి మెళ్ళొ, చేతులు నింపేసింది. బుజ్జాడి నానమ్మ వెయ్యటానికి మొత్తంమ్మీద ముందుకొచ్చింది, వెయ్యటానికి ఖాళీలేదు. ఆమెకళ్ళలోకి చూశా. రక్తం లేదు!! నా పాయింటు, నానమ్మె ముందువెయ్యాలి అని కాదు, మీరు పెడతారా అని దేనికి ఒకళ్ళనొకళ్ళు కనుక్కోలేదు అని.
  అత్తా కోడళ్ళ కుమ్ములాట తరతరాలుగా ఉన్నదే.
  సైకోలొజీ ప్రకారం, "నేను పడిన కష్టాలు నావాళ్ళు మాత్రమే పడకూడదు, మరి మిగతా వాళ్ళో, నేను ఎన్ని కష్టాలు పడి ఈస్థితికి వచ్చానో, అవన్ని నా కిందవాళ్ళూ అనుభవించాలి" అంటే, అత్తకూడా ఒకప్పుడు కోడలే, ఆమె కాపురానికి వచ్చినప్పట్నుంచి ఎన్నైతే కష్టాలు పడిందో అంతకన్నా ఎక్కువ తన కోడలికి కలుగజేయ్యాలి. కాబట్టి ఇది కేవలం మానసిక సమస్య.

  @భవానీ గారు:
  అమ్మాయిలు కాదనేసినందుకే తల్లిదండ్రులను ఆహ్వానించని కొడుకులుంటే అది వాళ్ళ తప్పే అవుతుంది కానీ అమ్మాయిలదెలా అవుతుంది? వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించటం వాళ్ళకే తెలియదన్నమాట.
  -Well Said. True.

  @సిరిసిరిమువ్వ గారు:
  >>ఏదైనా వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి కొండొకచో పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉండేది ఆడవారి మధ్య ఈగో సమస్యలే, ఇందులో మగవారి పాత్ర చాలా చాలా తక్కువ (పాపం మద్యలో నలిగిపోవటం తప్ప).
  - అదిరింది.
  @లలిత గారు:
  >>ఒకప్పుడు ఎంతో హుందాగా వుండే నాన్నమ్మ కొడుకుని విదేసానికి పంపి, ఒకప్పటి పేదరాసిపెద్దమ్మ లా కేవలం కధలకే పరిమితమైపొతుందేమో అని బాధగావుంది.
  -చాలా లలితంగా చెప్పారు.

  ReplyDelete
 11. హుహ్, ఈ టపా పై కామెంటడానికి ఎన్నో విషయాలు బుర్రలో తిరుగుతున్నాయి. here's my Two cents -
  1.20ప్లస్ సంవత్సరాల అనుబంధమూ, తద్వారా ఏర్పడిన చనువు వల్ల అమ్మ నయితే ఏదన్న అడిగి చేయించుకోడానికి మొహమాటముండదు, అత్తగారి మీద ఎంత ప్రేమ,అభిమానమున్నా 'గౌరవం' పెచ్చు స్థాయిలో ఉండి post-partum stageలో కావల్సినంత ralaxation ఊండదేమోనన్న భయంవల్ల అమ్మని prefer చేస్తారేమో. 2.మనవల ముచ్చట్లకి అమ్మమ్మ, నానమ్మలిద్దరికీ 'equal opportunity' ఇచ్చే బాధ్యత డెఫినెట్ గా కోడలిదే. అమ్మమ్మ,నానమ్మ friends అయితే పిల్లలకీ బావుంటుంది.

  Like a lot of issues in life, this topic has a lot of gray zones/variables and can not be distinguished in Black& white.
  మంచి hot&debatable issue.

  ReplyDelete
 12. " The important thing here is, In US, being an exposed woman to so called Modern/Western Civilization, being masked with American Culture, Cannot Indian Women treat their in laws as nutral as possible? Cannot Indian Women understand that in laws are also "HUMANS"? Parents means only girls parents? Thats my concern."

  ప్రతిదానికీ అమెరికన్ కల్చర్ నెందుకండీ ఆడిపోసుకోడం.
  american couples పట్టించుకోని vALLu రెండు వైపులా parents నీ equal గా పట్టించుకోరు. కాస్త close-knit families ఉన్న వాళ్ళు రెండు sets of parents నీ సమానంగానే visit చేస్తారు, పిల్లల B'days , soccer /football games, graduation etc సందర్భాలకి సమానంగా పిలుస్తారు.ఈ అత్తా కోడళ్ళ polarity అమెరికన్లలో చా..లా తక్కువ. వాళ్ళ నించి నేర్చుకోవల్సిన మంచి విషయాలొదిలేసి, మనకేది convenient గా ఉంటే దాన్నే adoptచేసుకోడం indians తెలివి.

  ReplyDelete
 13. @teresa:
  #1. మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా అమెరికా, అమెరికన్ కల్చర్ అని
  #2. అమెరికా ని దేనికి ఆడిపోస్కోవటం. ఎందుకంటే మన జీవితాల్తో చదరంగం ఆడుతున్నందుకు. One or the otherway. అమెరికాలో నాస్డాక్ 100 పాయింట్లు పడితే మనకి 600,000 కోట్లు మునుగుతున్నాయ్. మన ఖర్మ, అలా ఉంది.
  #3. వాళ్ళ నించి నేర్చుకోవల్సిన మంచి విషయాలొదిలేసి, మనకేది convenient గా ఉంటే దాన్నే adoptచేసుకోడం indians తెలివి.
  -ఇక్సాత్తో...I mean exactly.
  Well said.

  ReplyDelete
 14. బాగా చెప్పారు కాని మరీ కొడళ్ళని విలన్లని చెసారు.మీరు అత్తలని చూడని కొడళ్ళనె చూసినట్టున్నారు.ప్రెగ్నన్సికని వచ్హ్హి సెవ చెయ్యక పొగా తిన్డి పెట్టక ఏడిపించె వాల్లు ఉన్నారు.రేపు మనవడు అని వస్తామన్టె కోడళ్ళు రానివ్వరు మరి.
  రాపొ ఒక్కరి వల్ల పెరగదు అని నా అభిప్రాయం.పెళ్ళై ఇంటికి వచ్హిన కొడలిని కొడుకుని యెగరెసుకుపొటానికి వచ్హిందని,వచ్హాక కొడుకు మారిపొయాడన్న ఆలొచనతొ మాటలు అని తర్వాత చూడలెదనుకొవటం మన్చిది కాదు.
  అత్త ఒకప్పటి కొడలె,కొడలు రెపటి అత్తె.ఇది ఇద్దరు గుర్తుంచుకొవాలి.
  మగవాళ్ళు నలిగిపొతున్నరా?నలిగిపొకన్డి.తల్లిని,భార్యని సమానంగా చూస్తు యెవరొ ఒకరినె సమర్ధించకున్డా బాలెన్శ్ చెసుకొన్డి.ఇద్దరిలొ ఏ ఒక్కరు అల్లమైనా కష్టమె మరి!

  ReplyDelete
 15. @హరిత గారు:
  కోడళ్ళని నేను విలన్లని చేసేదేంటండి? వాళ్ళు వాళ్ళనే విలన్లని చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దేనా ఈ పోష్టు. This is the wrong, dont do that అనేకదా...You guys have introspect.

  ReplyDelete
 16. నమస్కారం..
  నేను ఒక పోస్ట్ రాసాను..
  ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్
  ధన్యవాదాలు..
  లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html

  ReplyDelete