Sep 25, 2008

యాపిల్ తోట

పోయిన వారాంతానికి మళ్ళీ యాపిల్ పికింగ్ కి వెళ్ళాం. దేనికెళ్ళాం అంటే మా బుడ్డోడ్ని గుఱ్ఱం ఎక్కించొచ్చని. మావోడికి గుఱ్ఱాల పిచ్చి పట్టుకుంది. ఆవు కధలా, ప్రతీదాన్ని గుఱ్ఱానికి లింకు పెడతాడు. నాన్నా ఆవు ఏంటుంది? భారత్ లో అంబా అంటుంది, ఇక్కడ మూ. మరి గోట్ ఏంటుంది? మా మా. మరి గుయ్యం? హీహా. గుఱ్ఱం బొమ్మ తెస్తాడు వెంటనే, నాన్నా నాన్నా నాన్నా దీన్ని గుఱ్ఱం అంటారు. "ఏంటమ్మ!! గడ్డితిన్నావా" అను అను అనూ, అన్నా, ముక్కు మీద రుద్దు. రుద్దా. అలా వచ్చి మోకాళ్ళ మీద పడుకో.. దేనికి? నేను నీ వీపు మీద ఎక్కి హార్స్ రైడ్ చేస్తా...
స్నానం చేయించేప్పుడు, నాన్నా హార్స్ ఏమంటుంది. ఇదే గోల.
అందుకని వీలునప్పుడు అలా వెళ్ళి గుఱ్ఱం ఎక్కిస్తాం. ఇదిగో ఇలా ఆనందిస్తాడు,
From againbowmans

ఈ ఫాం,పేరు బౌమన్ ఆర్చిడ్స్, లో పందులు, గొఱ్ఱెలు (అవి నన్ను అదోలాజూస్తాయి - దేశి గొఱ్ఱె హి హి హి అని నవ్వుకున్నట్టు ఉంటుంది) మేకలు గట్ర తోపాటు పెద్దా చిన్నా గుఱ్ఱాలు చానానే ఉన్నయి. మచ్చుకి ఈ గుఱ్ఱాల్నిజూడండి
From againbowmans


వాడి 90 ఎకరాల తోటలో రకరకాల యాప్పిల్స్, పీచ్, స్ట్రాబెర్రి, పెద్ద గుమ్మడి కాయలు, స్క్వాష్, మొ|| ఉంటాయి. పోయిన వీకెండ్కి వెళ్ళినప్పుడు జనం తిర్ణాలకొచ్చినట్టు వచ్చారు. లోనకెల్టాకి 20 ని. పట్టింది.
అక్కడ తీసిన ఒక చిన్న సరదా వీడియో.
From againbowmans

5 comments:

  1. గుర్రం కన్నా బుడ్డోడు బాగున్నాడు

    ReplyDelete
  2. @వర్మ గారు
    గుఱ్ఱం ముసిల్దైంది :)

    ReplyDelete
  3. ha ha .. cool.

    మీ బుడ్డోణ్ణి మేకినా దీవి కి తీసుకెళ్ళండి. పందగ చేసుకుంటాడు. అక్కడ అన్నీ గుర్రాలే. కార్లూ గీర్లూ బంద్!

    ReplyDelete
  4. @ కొత్త పాళి గారు:
    తప్పకుండా అండి.

    ReplyDelete