లేక అగ్ని.
ఈరోజు మా కార్యాలయంలో అగ్గి సైర్రన్లు కుయ్ కుయ్ కుయ్ అని మోగినై. అందరం కిందకి వెళ్లాం, అగ్నిమాపక యంత్రం వెంటనే వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది లోపలకి వెళ్లారు. వాళ్లు మొత్తం చూసి మొత్తానికి ఆ అలారం అఱుపులు అపేసి, మేము మళ్లీ తిరిగి మామా సీట్లలోకి వచ్చేసరికి అరగంట పట్టింది. మా కార్యాలం ఓ పెద్ద ఆకాశ హార్మ్యం కాదు. ఆరు అంతస్థులు ఉంటాయ్ మొత్తం. మేము నాలుగో అంతస్థులో ఉంటాం. మాకు మా వింగులో మొత్తం ఇద్దరు అగ్ని మార్షల్స్ ఉంటారు. వీళ్లు అగ్ని అలారం మోగంగనే రంగమ్లోకి దిగి ఇటు వెళ్లండి, అటు దూకండి అని చెప్తారు, దారి చూపిస్థారు. మరియూ అందరూ ఖాళీ చేసారా లేదా, రెష్ట్ రూముల్లో, డెస్కుల కిందా లేక మూలల్లో ఎవరైనా మిగిలిపొయ్యారా అని చూసే బాధ్యత వీళ్లదే. అప్పుడప్పుడు డ్రిల్లు కూడ చేస్తారు. అంటే ఫాల్స్ అలారం వీళ్లే ఇచ్చి, అందర్నీ కిందకి పంపించి ఇదిగో ఇలా అలారం మోగంగనే కిందకి రావాలి, ఆ అగ్ని మార్షల్స్ చెప్పినట్టు చెయ్యాలి అని చెప్తారు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటె, నేను కొంతకాలం క్రితం చెన్నై లో పనిచేసేవాడిని. మా కార్యలయం క్యాపిటాలే టవర్సు, అన్నా సాలై, తెయినంపేట. ఈ బిల్డింగులో మొత్తం 11 అంతస్థులు ఉంటాయ్. నిల్చోబెట్టిన అగ్గిపెట్టెలా ఉంటుంది ఈ కట్టడం. దీంట్లో మావి 8,9,10,11 అంతస్థులు. రెండు లిఫ్ట్లు. లిఫ్టుకి రెండువైపులా మెట్లు. ఇది అమెరికన్ పద్ధతిలో కట్టబడింది. అంటే తెల్సుగా, ఫ్లోర్లు పైకిలేపటం, చుట్టూ అద్దాలతో మూసేయ్యడం. ప్రతీ ఫ్లోరుకి అగ్ని అలారమ్లు ఉన్నయ్.
ఇంతకీ సంగతేంటంటే, అప్పుడప్పుడూ అగ్ని అలారం మోగేది. మనోళ్లు పొరబాటున కూడా లేచే వాళ్లు కాదు సీట్లలోంచి. అలారం మోగంగనే సెక్యూరిటీ వచ్చి దాన్ని ఆపేసి వెళ్ళిపొయ్యేవాడు. దీంట్లో పెద్ద రాయటానికేముంది అనుకుంటున్నారా. చెప్తా! నిజంగనే అగ్ని పుట్టింది, అలారం మోగింది. కిందకి ఎలా వెళ్లాలి? ఫ్లోరు మొత్తానికి ఒక్కటే ద్వారం. ఎంతమంది పడతారు దాంట్లోంచి? ఎప్పుడైనా ఒక డ్రిల్లు జరిగిందా ఇదీ పద్ధతీ నిజంగా అగ్ని రాజుకుంటే - మిమ్మల్ని మీరు బయటపడేస్కునే విధానం ఇదీ అని ఎప్పుడూ ఎవ్వడూజెప్పలా. ఒక్క వాలంటీరు కూడా లేడు. కనీసం అగ్ని అలారం మోగినప్పుడు ఇలా చెయ్యండి అనే బొమ్మలు కూడా లేవు. మీరు ఇక్కడ ఉన్నారు అనే ఒక లేఅవుట్ పెట్టినంత మాత్రాన సరిపోదుకదా?
ఓ బిల్డింగులు కట్టేస్కుంటాం, అమెరికా ఎక్కడోలేదు ఇక్కడే మన కళ్లముందే ఉంది అనేట్టు ఆర్భాటం చేస్కుంటాం. కానీ కనీస వసతులు మర్చిపోతాం. మీ కార్యాలయంలో కూడా ఇలానే ఉంటుందా? జనాలకి తెలియజెప్పండి. మీ మేనేజిమెంటుకి తెలియజేయండి, కనీసం ఆరు నెలలకోసారి డ్రిల్లు ఏర్పాటు చెయ్యమని. మార్షల్స్ ని తయ్యారు జేస్కోండి, ఆళ్లకి శిక్షణ ఇవ్వమని తెలియజేయండి.
Dec 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
last year నేను upatate NY లో పనిజేసినప్పుడు 6వారాలకో సారి జరుపుతుండే వారు ఈ తంతు,సరిగ్గా morning scheduleలో లాస్ట్ పేషంట్ ని చూస్తుండగా. పోలోమంటూ అందరం మళ్ళీ ఆఫీసుల్లోకి, పేషంట్లు రూముల్లోకీ చేరే సరికి లంచవరు మాయం. ఈ చలిలో భలే రోజు ఎన్నుకున్నారుగా!!
ReplyDeleteMock drills are necessary for commertial buildings and hirise resident flats.
ReplyDeleteEven we can have a emergency plan for our own home.We can discuss with our family members how to react in case of emergency.
How many of you know first aid in your office?.First aid training is very much useful.
Good and useful post bhaskar.
నేను చికాగోలో డబ్ల్యు హోటలో 42 వ రూములో వున్నపుడు అలారం మోగింది.అప్పట్లో నాకు డ్రిల్లులది తెలియవు.నిజం ప్రమాదమనుకుని మూడునెలల మా అబ్బాయిని ఎత్తుకుని ఆయాసపడుతూ ఒక పది అంతస్తులు దిగేసరికి డ్రిల్లు అయిపోయిందని అందరూ పైకి రావడం మొదలుపెట్టారు.కానీ ఆ భయాన్ని ఇప్పటికీ మర్చిపోలేను.దిగిన మెట్లకన్నా ఎక్కువ ఆలోచనలు. ఇంత చిన్న పిల్లోడిని ఎలా కాపాడాలని ఎంత ఆరాటపడిపోయానో.నన్నెన్నిసార్లు తిట్టుకున్నానో.ఎందుకంటే నేనే ఏరి కోరి పై అంతస్థు తీసుకున్నాను.ఇప్పటికీ నాకు పై అంతస్థులంటే భయమే.ఇక్కడ కాబట్టి గైడెన్సు వుంది కాబట్టి సరిపోయింది.
ReplyDeleteమా ఆఫీసోళ్ళు బాగా రొమాంటిక్... ఈరోజు మాక్-డ్రిల్ ఉందని చెప్పిమరీ కండక్ట్ చేస్తారు. మాక్ అని తెలిస్తే ఎవరు సీరియస్ గా చేస్తారు చెప్పండి, తాపీగా వాష్‍రూమ్ కి వెళ్ళొచ్చి, పాంట్రీలో కోక్ తీస్కుని కిందకి దిగేసరికి పావుగంట పడుతుంది. నిజంగా ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో తెలియదుగానీ, మాక్-డ్రిల్ ని మాత్రం మా అందర్నీ మాక్ చేస్తున్నట్టే ఉంటుంది.
ReplyDelete@teresaగారు: నిన్నటి ప్రహసనం డ్రిల్లు కాదు. ఏదో సాంకేతిక లోపం. అవును, నిన్న మాకు ఐస్ కూడిన వాన, చలి. ఎన్నో తిప్పలు మనిషికి. పుచ్!!
ReplyDelete@అరుణాంక్: నిజమే బ్రదర్ నువ్వు చెప్పేది. వందల సంఖ్యలో ఉన్న అపార్ట్మెంటులు, ఒక వరస పాడూ ఉండదు. ముంబై లాంటి ఘోరకలి జరిగితే ఏంటి దిక్కు?
@రాధిక గారు: మీరు పడిన "పిల్లాడ్ని రక్షించుకుందాం" అనే తపన నాకు అర్ధం ఐంది. మన మానసిక ఆందోళనలతో కొంతమంది ఆటలాడాతారు. ఇలాంటివి ముందుగానే చెప్పాలి. ఇది కేవలం డ్రిల్లు మాత్రమే అని. లేకపోతే కొందరు పానిక్ అయ్యే అవకాసాలు ఉన్నాయ్, పిల్లలు ఉన్నవాళ్ల గతి ఏంటి? హోటళ్లలో రకరకాల మనుషులు, ముసలోళ్ల సంగతి ఏంటి? హై బి.పి ఉన్నవాళ్లు అక్కడికక్కడే కూలబడిపోరా ఇలా చేస్తే? నిజమే!! అలాంటి యస్టాబ్లిష్మెంట్ యాజమాన్యం సరైన మార్గాన్ని ఎంచుకుని తీరాలి..
@మోటరోలన్: వాళ్ల రొమాంటిసిజం ఏమో కాని, అసలు ఇలాంటివి కనీసం చేస్తున్నారా లేదా అనేది కూడా ముఖ్య విషయమే. వ్యాఖ్యకు ధన్యవాదాలు.
నాలుగేళ్ళుగా ఈ డ్రిల్లులు చేసి చేసి ఇప్పుడు నేనే శిక్షణ ఇచ్చే స్థాయి కి చేరుకున్నాను. పాత కంపెనీ లో అందరూ సిన్సియర్ గా వచ్చేవాళ్ళు. ఇక్కడ కొత్త కంపెనీలో జనాలకి తూ తా తెలియదు. అయినా ఏదొ పెద్ద టైం వేష్ట్ అన్నట్టు తెగ ఫోజు పెడతారు. ఏంటో పిచ్చి జనాలు. దేనికి importance ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదొ తెలిసి ఏడవదు.
ReplyDelete