Sep 30, 2010

రక్తపోటు

ఐసొమెట్రిక్ హ్యాండ్ గ్రిప్ ఎక్సర్సైజ్ అనేది రక్తపోటుని తగ్గిస్తుందట.
The relationship between hypertension and hand grip isometrics or isometrics hand grip (IHG) exercise is a  positive one. Isometrics hand grip exercise helps to reduce the level of systolic blood pressure. In fact, high tech isometric hand grip exercises along with medication can significantly lessen high blood pressure.

Numerous studies have proven the effectiveness of hand grip isometrics to lower blood pressure, increase the elasticity of the carotid artery and intensify vasodilatory effects in people taking medication for high blood pressure. One study involved the use of  isometric hand grip exercise three times a week for a period of eight weeks.

The results of the study show that isometric hand grip exercise lead to a decline in the resting blood pressure. Following the isometric hand grip exercise, the systolic blood pressure lessened considerably. But the diastolic blood pressure is not affected by isometric hand grip exercise. Similarly the isometric leg press exercise does not have any significant effect on high blood pressure. 


Usually, hypertension is connected with cardiovascular diseases and endothelial dysfunction. People who were suffering from endothelial dysfunction and were under  anti-hypertensive medication, experienced reduced blood pressure after they carried out the isometric hand grip exercise.  The exercise resulted in widening of the arteries and consequently the reduction of  blood pressure. Thus  hand grip isometrics may cause a  reduction in blood pressure on account of an improvement of the endothelial function.   

Another study is examining the relationship between systolic blood pressure and isometric hand grip exercise. It is seen that patients with  hypertension experience reduction of blood pressure after hand grip isometric exercise. It is also observed that blood pressure increases rapidly during exercise. It however returns to normal after recovery. In patients with hypertension, the blood pressure has been greatly reduced after the exercise on account of the natural downward shift in the blood pressure after the recovery period.

ఏంచేయాలి? ఏంటీ ఈ కథ?
ఒక బెలూన్లో సోడాఉప్పు పోసి బిఱ్ఱుగా కట్టి నొక్కుతుండటమే. You can even make your own stress ball at home by filling a small balloon with baking soda. Be aware, however, that gel or powder stress balls can break, so if you notice any leaks or weak spots that are starting to appear, you should throw it out and get a new one. Because of this danger, avoid squeezing a stress ball over a computer keyboard.

How to Use the Grip Squeeze Ball
You can use a stress squeeze ball just about anywhere, while watching television, riding in a car or sitting in front of your computer at home or work. To find out how hard you should squeeze the ball in general, squeeze as hard as you are able for a second and get a feel for your maximum, or 100 percent, squeeze pressure. Next, try squeezing at about 30 percent of that maximum pressure, which is your target range. To begin your exercise routine, squeeze the ball for 10 to 20 times in succession, and then let your arm rest for a few minutes before repeating with another set of 10 to 20 repetitions. Your current strength level will determine how much you can safely do.

Sep 29, 2010

మరో నాలుగొందల ఎకరాలు మింగొద్దు. మా బతుకులు కొట్టద్దు.



సాగర్‌ వద్ద భారీ ఉద్యానం
వచ్చే ఏడాది 'విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌'!
రూ.1500 కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం: సీఎం రోశయ్య
నేడు కొత్త పర్యాటక విధానం ప్రకటన
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
ర్యాటక రంగంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.1500 కోట్ల పెట్టుబడులు ఆహ్వానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కొత్త పర్యాటక తుది విధానానికి ఆదివారం ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీనిని సోమవారం అధికారికంగా విడుదల చేయనున్నారు. పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీప్రసాద్‌, పర్యాటక కార్యదర్శి జయేష్‌ రంజన్‌లతో సీఎం సమీక్ష నిర్వహించారు. పర్యాటక ప్రోత్సాహం, భారీగా ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. సాహస, తీర్థయాత్ర, సముద్ర తీర పర్యాటక ప్రోత్సాహంతోపాటు, జాతీయ, అంతర్జాతీయ యాత్రికులను ఆకర్షించేందుకు వచ్చే ఏడాదిని 'విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌'గా సంవత్సరంగా జరుపుకోవాలని చెప్పారు.

మైసూరులోని 'బృందావన్‌ గార్డెన్స్‌', బెంగళూరులోని 'లాల్‌బాగ్‌' తరహాలో నాగార్జునసాగర్‌ వద్ద అతిపెద్ద ఆధునిక ఉద్యానాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికోసం అందరికీ అందుబాటులో, రవాణా సౌకర్యాలకు వీలుగా గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగులవరం గ్రామంలో 400 ఎకరాల భూమిని గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పర్యాటక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. 2009-10 ఏడాదిలో యాత్రికుల సంఖ్య విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక అభివృద్ధి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.6.5 కోట్లు పెంచామని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.25 కోట్లు నిధులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా తొలి విడత కింద 13 ప్రాంతాలను ఎంపిక చేశామని తెలిపారు. వీటిలో ఎనిమిది ప్రాంతాల్లో పడవ విహారం సౌకర్యం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కడెం, కండలేరు, సోమశిల, సింగూరు, భావనాసి ప్రాజెక్టుల వద్ద ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయనీ, గుండ్లకమ్మ, బ్రహ్మసాగర్‌, జమ్ములమ్మ చెరువు వద్ద పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త విధానం అమల్లోకి వచ్చేలోగా.. గత విధానం కింద అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులను పరిష్కరిస్తామని వివరించారు. పుట్టపర్తి, నాగార్జున సాగర్‌ వద్ద హెలిప్యాడ్‌, హెలీ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు గీతారెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ వద్ద హెలీపోర్టు ఏర్పాటుకు ఇప్పటికే ఫ్త్లెటెక్‌ ఏవియేషన్‌ ఆసక్తి చూపుతోందని, పుట్టపర్తి వద్ద లేపాక్షి ఫౌండేషన్‌ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. సదరన్‌ స్ల్పెండర్‌ పర్యాటక రైలు ప్రాజెక్టు సమస్యలపై కేంద్రంతో చర్చించనున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.


ముఖ్యమంత్రి మరియూ బృందం గార్లూ

మా మానాన మమ్ము బతుకనివ్వండి. మాకే ఉద్యానాలు వద్దూ, పర్యాటకాలు క్రిమికీటకాలూ వద్దు. సత్తెనపల్లి నుండి మాసెర్ల వరకూ ఒక్కటంటే ఒక్కటి ట్రౌమా సెంటర్, ప్రత్యేక మెడిసిన్ విభాగం, అత్యంత అవసరమైన మెడీకేర్ విభాగం, గుండెకి సంబంధించిన మెడీకేర్ విభాగం, కేన్సర్ లాంటి మహమ్మారులకు ట్రీట్మెంట్ ఇచ్చే విభాగం గల ఆశుపత్రులు ఒక్కటంటే ఒక్కటి లేదు. మోర్జంపాళ్ళో గుండె నొప్పి వస్తే బస్సులో ఏస్కుని గుంటూరు కొత్తపేటకి తెచ్చెలోపు రోగి కన్నుమూసి మరోజన్మ ఎత్తే అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయని ప్రత్యేకంగా సెప్పాల్సిన పనిల్యా. మా అద్దురుష్టమో దురద్దుష్టమో సమచ్చరం సమచ్చరం కొన్ని వేల టీయంసీల నీళ్ళు కిట్టమ్మ మోస్కెళ్ళి సమద్రంల కలిపేస్తంటే, వరదముంపుకు గురుతున్న మా ఊళ్ళకు శాశ్వత పరీష్కారం సూప్పెట్టండి సాలు. పలునాడులో జనాల ముక్యమైన పని పంటలు సేలు. మాకో వ్యవసాయ కళాశాలనివ్వండి. మా పంటనేలల్లో ఎఱువుల ఉపయోగం తక్కువసేస్కునేందుకు సేంద్రీయ ఎఱువల కర్మాగారాలను ప్రోత్సహించండి. స్తానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రోత్సాహాలు ప్రకటించండి.

మా జీవితాలు మార్చండి. మాకెందుకయ్యా ఉద్యానాలు ఉద్యానవనాలు, ఆ పేరు సెప్పి రియల్ ఎస్టేటు ధరలు పెంచటానికా? పొలాలు అమ్మించటానికా? పండే భూమిని తగ్గించటానికా? బువ్వకి పనికిరాని ఉద్యానం మాకెందుకయ్యా. పొట్ట నిండినప్పుడు మేమే ఏర్పటు సేస్కుంటాం ఇంటికో ఉద్యానం. మరో నాలుగొందల ఎకరాలు మింగొద్దు. మా బతుకులు కొట్టద్దు.

ఇందులో కొత్త ఉద్యోగావకాశాల మాటా ఎలా ఉన్యా, సెట్లు పుట్టలెమ్మట తిరిగే ప్రేవజంటలకు సువర్ణావకాశం కలిగించినట్టౌద్ది. అవసరమా? సెట్టు పుట్టలసాటున సాగించే కార్యక్రమాలకి ఇంత తగలెట్టటం అవసరమా అద్దెచ్చా?

Sep 25, 2010

కిరికిటీల మహత్యం - విప్పితిని

మొన్నటి నా సమస్యకు పరిష్కారం దొరికెన్ -
ఒక డైరెక్టరీ లో ఉన్న కేవలం సబ్‌డైరెక్టరీలను మాత్రమే నిర్మూలించే విధానం ఏంటీ?

RMDIR [/S] [/Q] [drive:]path
RD [/S] [/Q] [drive:]path

/S Removes all directories and files in the specified directory in addition to the directory itself. Used to remove a directory tree.
/Q Quiet mode, do not ask if ok to remove a directory tree with /S.

Examples

rmdir c:\test

Remove the test directory, if empty.

rmdir c:\test /s

Windows 2000, Windows XP and later versions of Windows can use this option with a prompt to permanently delete the test directory and all sub directories and files. Adding the /q switch would suppress the prompt.

కావున
ఒక రూట్ యందు ఉండి, అక్కణ్ణుంచి ఒక సబ్‌ డైరెక్టరీ యందలి కంటెంటును మాత్రమే తుడిచెవేయవలెనన్న
ఇదిగో ఇలా ఒక బ్యాచి ఫైలు రాస్కున్యా -
@echo off

@REM 1. goto profile home
set temp_home="C:\Temp\TestFolder"
@REM 2. goto that folder you want to delete the content under it
set top_folder="topfolder"
@REM 3. delete all under top folder
FOR /D %%i IN (%temp_home%\%top_folder%\*) DO (
rmdir /S /Q "%%i"
)


శుభ వారాంతం

Sep 23, 2010

ఊహించని ఆహ్వానం - గణేశ్ నిమజ్జనం

ఈరోజు పొద్దునపొద్దున్నే మా గురూగారు శ్రీ శ్రీనివాసాచార్యులు గారు ఫోన్ చేసారు. ఏమన్నా అతిముఖ్యం ఐతే తప్ప చేయరు. మాష్టారూ చెప్పండీ అన్నా. భాస్కరం ఈ రోజు అనంత పద్మనాభ చతుర్దశి. గణేశ నిమజ్జనం. నువ్వు సకుటుంబ సమేతంగా రావాలి అని ఆర్డరు వేసారు. సాయంత్రం ఆరున్నరకల్లా వాలా౨ను గుళ్ళో, మా గణపతిని తోడుతీసుకుని.

ఒక పెద్ద వేదికపై వినాయకుడిని అలంకరించారు. అదే వేదికకింద భక్తులు తెచ్చిన వినాయకులను ఉంచారు.
పూజ గట్రా అయ్యాక ఋత్విక్కులు (అంటే మేము) ఐదుసార్లు గణపతి అథర్వశిర ఉపనిషత్తు పటిస్తుండగా ఊరేగింపుగా గణపతిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసాం. ఐదుసార్లు పటించాం గణపతి అథర్వశిర ఉపనిషత్తుని.

అదీ సంగతి.

Sep 22, 2010

కిరికిటీల మహత్యం నాయనా

యునిక్స్ లో ఉదాహరణకి
rm -r temp/
అని కొడితే టెంప్ అనే డైరెక్టరీ అడుగున ఉన్నవన్నీ జంప్స్ అవుతాయి
అదే విండోస్లో?
పై డైరెక్టరీలో ఉండి, rmdir or rd /S /Q temp\ అని కొడితే డాస్ తిట్టింది.
నీఎక్క అని
rd /S /Q temp/ అనికొట్టా మళ్ళీ తిట్టింది
దీనెమ్మ అని
rd /S /Q temp\ . అని ఇచ్చా
ఏ డైరెక్టరీ నుండి పై కమాం౨డు ఇచ్చితినో ఆ డైరెక్టరీ యందలి ఫైళ్ళు మొత్తం పాయే....
అందులో పదిహేను ఉపనిషత్తులు తెలుగీకరించినవి కూడా పాయే....undo సేయటానిక్కూడా లేవు..ఆఫైళ్ళు రిసైకిల్ బిన్ ల్ లేవు.
ఇట్టకాదని రెస్టోర్ టు పొద్దున అని కొట్టా. వామ్మో డిలీట్ ఐన డైరెకటరీలను సూపింది
వహ్వా అనుకుని ఒక డైరెక్టరీలోకి సూసినా...ఖాళీ...ఇంకో దాంటో సూసినా..ఖాళీ....
డైరెక్టరీలను నూక్కొచ్చిందిగాని ఫైళ్ళను ఎగర్నూకింది.


అయ్యా విండోస్ మహత్యం మహాప్రభో

Sep 20, 2010

సూరిగాడి సిత్రకళ

 

అయ్యా ఇయ్యల గణేస్ నిమర్జనం..ఇంటికాడ మరి పొద్దునపొద్దున్నే పిల్లాజెల్లా భక్తిపారవశ్యంలో మినిగితేలారు. మనం ఆపీస్ కార్యాలయానికి ఏతెంచాం.
ఆపీస్ కాణ్ణుంచి మిట్ట మద్దానం వింటికి సేరేప్పటికి సూరిగాడు నీకో సర్ప్రైజ్ అన్నాడు. పిల్ల నవ్వింది. ఏట్రాబాబూ అన్న.
బొమ్మలేసే బోర్డేత్తుకొచ్చి సుపించాడు. పైన బొమ్మ.
ఆడి ప్రకారం
౧. ఉండ్రాళ్ళు - పద్దెనిమిదంట.
౨. దానిమ్మ కాయ
౩. గారెలు
౪. పుల్లు పుచ్చకాయ, మరియూ పుచ్చకాయ ముక్కలు
౫. దాచ్చాపళ్ళు
౬. కుడుములు
౭. సాక్లేటు
౮. మామిడి
౯. ఆప్‌పిళ్
౧౦. రాంములక్కాయ
౧౧. అప్పడం
౧౨. సెపాతి రొట్టె
౧౩. అరటిపండు
౧౪. మొక్కజొన్న కంకి అంట
౧౫. ఈ నెంబరు నే పెట్టకపోయినా, కుడైపు, కింద ఉండ్రాళ్ళ పైన సుక్కలు సుక్కలు బూందీ అంట అది.
౧౬. యాణ్ణో జాంగ్రీ ఉందంట.

ఆడికి ఇన్‌స్పైరేషన్ ఇదీ...మా ఇంట వినాయకుడు
From గణేశ


యావత్ జనులకూ గణేశ్ నిమర్జనం సందర్భంగా శుభాకాంక్షలు.


Sep 16, 2010

పాటల పోటీలు - అర్థం లేని కథ

జీటీవీ వారి అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో మొదటివరసలోని కార్యక్రమం సరెగమప.
సోనూ నిగం నిర్వహణలో మే ౧, ౧౯౯౫ లో మొట్టమొదటి ప్రసారం జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమంపేరు సరెగమ. ఇప్పుడు సరెగమప.
అప్పటి నుండి ఇప్పటివరకు చాలా మంది నేపథ్యకాయకులని దేశానికి పరిచయం చేసిందీ కార్యక్రమం.
శ్రెయ ఘోషాల్, శేఖర్, పార్థీవ్ గోహిల్, మొహమ్మద్ వకీల్, అవధూత్ గుప్తె, ఆర్తి కక్కర్, హిమనీ కపూర్, కునాల్ గన్జావాలా లాంటి ఎందరో నేపథ్యగాయకులు ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి పరిచయంకబడ్డారు.
బాగుంది.
ఐతే గత నాలుగేళ్ళుగా వింతపోకడలు పోతోందీ కార్యక్రమం. దీన్ని కాపీకొడుతున్నాయి మిగతా ఛానల్స్.
౨౦౦౬/౨౦౦౭ అనుకుంటా ఆదిత్య నారాయణ్ నిర్వహణలో సరెగమప ఛాలెంజ్ వచ్చింది. దాంట్లో మధ్యప్రాచ్యం నుండి కొందరు, పాకిస్తాన్ నుండి కొందరు వచ్చారు పోటీకి. ఆ మధ్యప్రాచ్యం నుండి వచ్చినవాళ్ళు కూడ తర్వాత పాకిస్తాన్ వారే అని తేలింది. అమానత్ ఆలి ఫైనల్ దాకా వచ్చాడు.
ఇప్పుడు స్టార్ వాడి చోటే ఉస్తాద్ అని ఒక కార్యక్రమం. సగంమంది దేశీయులు మిగతా సగం పాకిస్తానీయులు. జెడ్జులు సోనూ నిగం మరియూ రాహత్ ఫతే ఆలీ ఖాన్.
ఇక ఈ పాకిస్థానీ పిల్లలు పాడితే రాహత్ పాట లేక మౌలా మెరె మౌలా. నాకేం అభ్యంతరం లేదు వాళ్ళేం పాడితే. కానీ! పాటలపోటీల్లో పాల్గొనేందుకు వందకోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఎవరూ దొరకటంలేదా? ఇదేం కర్మం వేరే దేశం వాళ్ళను తెచ్చి మన నెత్తిన రుద్దటం? నాకు మింగుడు పట్టంలేదు.
నాకైతే పాకిస్థానీయుల పాటలు నేనెందుకు వినాలీ అనిపిస్తుంది. రాహత్ ఫతే ఆలీఖాన్ కావచ్చు లేక అద్నాన్ సమి కావొచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు. సరే ఒకజమానా జనాభా బ్రిట్ ఇండియా అవిభక్త భారతం అందరం కల్సి ఉండేటోళ్ళం వాళ్ళకి మనకి రూట్స్ ఒకటే. గులాం అలి ఖాన్, బడే గులాం అలి ఖాన్, నుస్రత్ ఫతే ఆలీఖాన్ సాబ్ యాట యాట యాట. ఆ జమానా ఐపోయింది. ఇప్పటి ప్రపంచంలో ఇదేం గోలయ్యా. మన దేశంలో పోటీదారులు కరవైయ్యారా అంటే అదీలేదు. అసలు ఇట్టాంటి అంతర్‌రాష్ట్ర కార్యక్రమాల్లో కేవలం ఉత్తారిది వాళ్ళనే తీస్కుంటున్నారు.
దక్షిణాది జనాభాని తొక్కుతారు పైకి రానీకుండా ఇట్టాంటి కార్యక్రమాల్లో. కొందరు నా ఈ మాటను వ్యతిరేకించవచ్చు. కానీ ఇది నిజం. ఎలా అంటారా?
ఈ కార్యక్రమాలకి జరిగే ఆడిషన్స్ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. దహేలి, ముంబై, కలకత్తా, కాన్పూర్, ఇండోర్, అహమ్మదాబాదు, అల్లహాబాదు, వాడిబొందబాదు, వాడిబోలెబాదుల్లో జరిగాయి కానీ చెన్నపట్నం, హైదరబాదు, బంగళూరు లేక తిరువనంతవురం లాంటి దక్షిణభారత నగరాల్లో/పట్టణాల్లో జరిగిన దాఖలాలు ఉంటే నాకు చెప్పండి.
ఏం పాకిస్థానీయులు పాడినంత సమ్మగా మా ఊరోళ్ళు పాడలేరా? అసలు రానిస్తేగా తెలిసేది పాడగల్రో లేదో.
సరే నా ఊరోళ్ళని రానివ్వకపోయినా పర్లేదు. పాకిస్థానోళ్ళనేందయ్యా నెత్తికెత్తుకునేదీ అంట. మొన్నామధ్యటి ఎపిసోడ్ ఆగస్టు పధ్నాలుగు. దేశభక్తి గుర్తుకొచ్చి ఆ పాటలు పాడారు. ఏంపాడాలి? రెండు శత్రుదేశాలు ఒకే వేదిక మీద తమ తమ దేశభక్తి గీతాలను పాడితే, నాకైతే రాళ్ళేయాలనిపించింది పాక్తిస్తానీయులపై. నా రక్తం మరిగింది. మరగటానికి కారణాలు లేవంటారా?
టీవీ యాజమాన్యాలకు కావాల్సింది టీఆర్పీ రేటింగ్స్. రెండు దేశాల మధ్య నిజంగా సత్‌సంబాధాలను ఏర్పరుచుదామనే ఈ కార్యక్రమాల రూపకల్పన చేస్తారంటారా?
ఇప్పటి సరెగపపా కార్యక్రమంలో కూడా కుర్రం అని ఒక పాకిస్తానీ ఉన్నాడు. వీళ్ళు ఎలా రాగలుగుతున్నారో అసలు దేశంలోకి?

Sep 15, 2010

ప్రత్యేక పల్నాడూ కావాలి


ప్రత్యేక పల్నాడూ కావాలి

శ్రీకృష్ణ కమిటీకి స్పష్టం చేసిన పల్నాడు ప్రజలు
రింగు రోడ్డుకు వేలకోట్ల ఖర్చు ఆపాలని వినతి
పిడుగురాళ్ల, మాచవరం - న్యూస్‌టుడే
రింగు రోడ్డు.. భూసేకరణ అంటూ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు.. ఆంధ్రా, రాయలసీమ డబ్బంతా తీసుకెళ్ళి ఇంకా అక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నారు.. ఇకనైనా ఆపండి.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే వరకు పైసా ఖర్చు చేయొద్దు.
- రత్నప్రసాద్‌, పిల్లుట్ల
తెలంగాణా వెనకబడింది అంటున్నారు.. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పల్నాడు వెనకబాటుతనం కన్పించడం లేదా..! ఒక్క పి.జి. కాలేజీ కూడా లేదిక్కడ.. తెలంగాణా జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణా అంటూ ఏర్పడితే ప్రత్యేక పల్నాడు రాష్ట్రం ఏర్పడాలి. విజయపురిసౌత్‌ రాజధాని కావాలి.
- కంభంపాటి కోటేశ్వరరావు, న్యాయవాది, పిడుగురాళ్ల

మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడులో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముందు ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించిన తీరిది. కమిటీ సభ్యులు అబూసలేషరీఫ్‌, బి.ఎన్‌.జోషి మంగళవారం సాయంత్రం పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెర్వు, మాచవరం మండలం కొత్తగణేశునిపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా పలువర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత పాలకులు రాజధానిని అభివృద్ధి చేయటానికే ఎక్కువ మొగ్గు చూపారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్పటి నుంచి అభివృద్ధి చేసి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని విశ్వనాథం మాస్టారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులో సగం హైదరాబాద్‌ అభివృద్ధికే ఖర్చు చేశారని.. ఇపుడు కూడా రింగు రోడ్డు పేరుతో వేల కోట్లు ఖర్చు చేయటం ఆపాలని కె.రత్నప్రసాద్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చినందువల్ల మాకేమీ అభ్యంతరం లేదు.. హైదరాబాద్‌ అందరి సొత్తూ అని ఆయన అన్నారు. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు చూపుతున్న బూచి తెలంగాణా. అదే పేరుతో ప్రతిసారీ ప్రత్యేక ప్యాకేజీలు అదనపు నిధులు పొందుతున్నారని న్యాయవాది కంభంపాటి కోటేశ్వరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా ఉంటేనే బాగుంది.. ఇప్పుడే కర్ణాటకతో నీటి గొడవలు పడుతున్నాం. తెలంగాణ విభజిస్తే చుక్క కూడా కిందకు రానివ్వరని తుమ్మలచెర్వుకు చెందిన జానీభాషా చెప్పారు. అనంతరం అబుసలేషరీఫ్‌ వినతిపత్రాలను స్వీకరించారు.
http://eenadu.net/story.asp?qry1=13&reccount=27
----------------------------------------------------------------------------------------------------------
ఔను! పల్నాడు రాష్ట్రం కావాలి. ఏం? ఎందుకు అడక్కూడదూ?
నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా ఎంతనీరు పల్నాడుకి అందుతోందీ?
తాగునీటికి అల్లల్లాడే ప్రజానీకం ఎంతో తెలుసా?
సిమెంటురాయికీ సిమెంటు కర్మాగారాలు పెట్టేందుకు పనికొచ్చే నేల, వాటి కాలుష్యాన్నుండి కాపాడుకోలేకపోతోంది, ప్రభుత్వం చిన్నచూపుతో.
సున్నపురాయి ప్రజల కళ్ళలో కన్నీళ్ళను రప్పిస్తోంది బట్టీల పొగతో.
మిరగాయ పంట, పత్తి, కందులు, శనగలు, నువ్వులు, ఏంతక్కువ మా పల్లెలకు?
ప్రతీ రాయీ సరిత్ర పలుకుతుంది. ప్రతీ సెట్టు సెరిత్ర సెప్తాయి. ఔను, పల్నాటి రాష్ట్రం కావల్సిందే.

Sep 14, 2010

రన్జీత్ రాజ్వడ

ఈ వారాంతపు జీటీవి వారి సరిగమప సూపర్ సింగర్ కార్యక్రమంలో రన్జీత్ రాజ్వడ అనే ఓ కొఱ్ఱాడు ఈ పాట పాడాడు.

कल चौदहवीं की रात थी
शब भर रहा चर्चा तेरा
कुछ ने कहा ये चाँद है
कुछ ने कहा चेहरा तेरा

१) हम भी वहीं मौजूद थे
हम से भी सब पूछा कि ये
हम हंस दिये हम चुप रहे
मंज़ूर था परदा तेरा, कल ...

२) इस शहर में किस से मिलें
हम से तो छूटी महफ़िलें
हर शख्स तेरा नाम ले
हर शख्स दीवाना तेरा, कल ...

३) कूचे को तेरे छोड़कर
जोगी ही बन जाएं मगर
जंगल तेरे पर्वत तेरे
बस्ती तेरी सेहरा तेरा, कल ...

४) बेदर्द सुननी हो तो चल
कहता है क्या अच्छी गज़ल
आशिक़ तेरा रुसवा तेरा
शायर तेरा इन्शा तेरा, कल ...

అత్భుతంగా పాడాడు, అత్భుతమైన ఘజల్.
రన్జీత్ పాటని అత్భుతంగా పాట్టమే కాకుండా హార్మోనియాన్ని అత్భుతంగా వాయించాడు.
ఇక్కడ చూడండి వీడియో...

ఈ పిల్లాడు ఇంతక మునుపటి ఎపిసోడ్లలో కూడా అత్భుతమైన పాటలు ఆలపించాడు
నన్నాకట్టుకున్న ఆ ఘజల్ -

चुपके चुपके रात दिन आँसू बहाना याद है
हम को अब तक आशिक़ी का वो ज़माना याद है

खींच लेना वो मेरा पदर्ए का कोना बफ़-अ-तन
और दुपट्टे में वो तेरा मुँह छुपाना याद है

बेरुखी के साथ सुनना ददर्-ए-दिल की दासताँ
वो कलाई में तेरा कंगन घुमाना याद है

वक़्त-ए-रुख्सत अलविदा का लफ़्ज़ कहने के लिये
वो तेरे सूखे लबों का थर-थराना याद है

चोरी चोरी हम से तुम आकर मिले थे जिस जगह
मुद्दतें गुज़रीं पर अब तक वो ठिकाना याद है

दोपहर की धूप में मेरे बुलाने के लिये
वो छज्जे पर तेरा नंगे पाँव आना याद है

तुझसे मिलते ही वो बेबाक़ हो जाना मेरा
और तेरा दाँतों में वो उंगली दबाना याद है

तुझ को जब तंहा कभी पाना तो अज़्राहे-लिहाज़
हाल-ए-दिल बातों ही बातों में जताना याद है

आ गया अगर वस्ल की शब भी कहिन ज़िक़्र-ए-फ़िरक़
वो तेरा रो रो के भी मुझको रुलाना याद है



మీరూ ఆనందించండి

Sep 8, 2010

సూరిగాడి బడి గోల

సూరిగాడు మళ్ళీ బడిబాటన పడ్డాడీమద్దిన.
ఓరోజు మాయింటికాడి ప్రభుత్వ పాఠశాలకి కాలు చెయ్యి సేసాను, ఇలా మావోణ్ణి బళ్ళో నూకాలా ఎట్టా అని.
రేపే ఎత్తుకొచ్చేయండా అని సెలవిచ్చారా బడోళ్ళు.
ఎప్పుడ్రంమ్మంటా అన్నా
పొద్దునన్నా రండి
లేపోతే సాయన్కాలవన్నా రండీ
పొద్దున్నె సద్ది మూటకట్టుకొత్తా, అద్సరే ఎన్నింటికి రమ్మంటా
ఎనిమిదికి రండి
తొమ్మిదికి రండి
పదికి రండి
పస్కుండికి రండి
పన్నెండు దాటినంక రాకండి
ఒకేళ ఒచ్చేపనైతే పన్నెండు దాటినాక, సాయంకాలం రండి
వలాగే తొమ్మిదికి వత్తా
అన్జెప్పి అప్పాయింటుమెంటూ అయింటుమెంటూ తీస్కున్యా.
ఆఏళ వయ్యగారిని వమ్మగారిని పొద్దున్నే లేపి, ఇస్త్రీ సేసిన బట్టలు కట్టి, పిల్లకీ ఇస్త్రీ సేసిన బట్టలు కట్టి మొత్తానికి ఎత్తుకుళ్ళాం బడికాడికి.
లోనకి బోంగనే ఒకామె ఆడ లేడీస్, ఇస్త్రీ, ఎవురుమీరూ ఏం కత అనడిగింది. ఇట్టా పిల్లోణ్ణి బళ్ళోనూకటానికి ఒచ్చినం అనిజెప్పా. మనోడు ఇంతకు మునుపు ఆంగ్లం ఇంగిల్పీస్ మాట్టాడేవోడుగా. మొన్నిమద్దిన దేశం ఎళ్ళొచ్చాడుగా, మొత్తం మర్సిపాయ. తెలుగు మాట్టాడతా ఉడిన్డు సుబ్బనంగా. ఎవురు కనిపించిన తెలుగులోనే మాట్టాడతా ఉడిన్డు. సరే, మనకత ఇని, ఆ తెల్ల ఇస్త్రీ, మీవోణ్ణి అట్టా తీస్కెళ్తాం, మీరు అటైపు లోనకెళ్ళి అప్లికేసన్ కాయితకాలు నింపుతున్డన్డా అని సెప్పి మనోణ్ణెత్తుకెళ్ళబోయింది. నే కలిపించుకున్జెప్పా, ఓ తెల్ల ఇస్త్రీ మావోనికి నీవేంమాట్టాడతవో అరదం కాకపోవచ్చు, ఎట్టా మరి అని. ఏంపర్లేదు మేంజూస్కుంటాం మీరెళ్ళండ అంది. నాయనా జాగరత్తరా బాబూ అనిమనోడికి జెప్పి అంపించి, మేంలోపలికి జొరబడ్డాం. ఆమె మనోడి సేయి పట్టుకుని ఎళ్ళింది. పదినిమిసాలాగి తిరిగొచ్చి మీవోడు బానేజెప్పాడు అగిందానికి అనేసి ఎళ్ళిపోయింది. అమ్మనీ ఏందిరా వింటర్వ్యూనా అనుకుని, ఏమిరా ఏమడిగిందీ నువ్వేంజెప్పా అన్నా. ఏంలేదులే ఎబిసి తర్వాతేందీ అనింది డి అని జెప్పా, ఓ డబ్బా సూపించి ఇదేంది అనడిగింది స్క్వేర్ అనిజెప్పా. ట్రయాంగిల్ సూపెట్టమంది అక్కడున్న బొమ్మల్లో సూపెట్టా. ఇక పదా అంది. వచ్చినా అన్నాడు. అప్లికేసన్ కాయితకాలు నింపి డబ్బుదస్కం కట్టి ఇంటికిజేరుకున్నాం.
ఆ తరవాతోరం బడి తెరిచారు. మొట్టమొదట్రోజు రానే ఒచ్చింది. మాకు ముందర్రోజునుండే నిద్ర కరువాయ. ఏందిరా అంటే మరి ఆడికి డబ్బా ఏంబెట్టాలా అని ఆడోళ్ళ టెన్చను. ఆళ్ళను జూసి మనకి టెన్చను. మొట్టమొదట్రోజు, ఎదో డబ్బలోకి పెట్టింది, మనోణ్ణి లేపి లేపి లేపితే, ఎంతసేపటికీ లెగడే. మొత్తానికి కరుణ రధం కదిలింది లేగిచాడు, స్నానం గీనం టిపినీ గిపినీ తిన్నాడు. డబ్బా, సన్చి మూట ముల్లే సర్దుకుని బడిబస్సు ఎక్కటానికి లెగిచాడు. ఇంటిఆడోళ్ళు ఎళ్ళారు బస్సెక్కించటానికి. ఏమాత్రం ఏడవకుండా ఎక్కిండు బస్సు. ఆరోజంతా మాకు టెన్చను. బడోళ్ళూ ఫోను జేత్తరేమో మీవోడు కక్కున్నాడనో లేపోతే లాగులో దొడ్డికూకున్నాడనో ఉచ్చపోశ్కున్నాడనో అని. సాయంకాలానికి బస్సుదిగాడు చ్చేమంగా. ఉఫ్ఫు ఉఫ్ఫూ అనుకుంటా ఇంటికిజేరి ఆకలిఆకలి ఒన్నంపెట్టు అని జీవితంలో మొట్టమొదటిసారి అడిగి పెట్టించుకుని తిని, సాల్లేదు ఇంకొంచెంపెట్టు అని పొట్టనిండా తిని కూకున్నాడు నాకోసం.

ఇప్పటికి వారం దాటింది బడికెళ్ళబట్టి.
మొన్న ఓ కాయితకం పంపించారు. మీవోణ్ణి కాలిబంతి టీంలో జేర్పిత్తారా లేక అమెరికన్ కాలిబంతిలో జేర్పిత్తారా ఐస్ స్కేటింగులో జేర్పిత్తారా లేకుంటే ఐస్ హాకీలో జేర్పిత్తారా అని. కాలిబంతి అన్నాడు వాడే. పిల్ల సాకర్ బాల్ సాకర్ బాల్ అని అరిచింది. కిమ్మనకుండా కాలిబంతి అన్జెప్పి పంపించాం.

నిన్న ఇంకో కాయితకం. ఇంటికాడి బాష ఇంగిల్పీస్ కాపోతే అట్టాంటి బిడ్లకు ఏరే కల్లాసులుండాయి. మీవోణ్ణి పంపిత్తారా? పానిక్స్, వొకాబ్యులరీ నేర్పిత్తారు అని రాసుంది.
దీనెక్క, మనోడికి ఏందిరా ఏవన్నా ఇబ్బందిగా ఉందా ఏంది ఇంగిల్పీసు? ఆళ్ళ టిచెరమ్మ సెప్పేది అరదం కావట్లేదా ఏందీ? ఎట్రా అనుకున్నాం. ఆణ్ణే అడిగాం. ఏందిరా నాన్నా అరదం కావట్లేదా ఏందీ? ఆడోళ్ళు మొదలెట్టారు ఇక నెత్తిన కుండకి చిల్లుబెట్టటం. కళ్ళొత్తుకున్టా అట్టాకాదురా ఇనాల సెప్పేది నువ్వు ఇనవు అదిజేయవు ఇదిజేయవు అని. ఆడు అసె నువ్వుండు, ఏంలేదన్నాగా అంటాడు. పదినిమిసాలాగి నాకు ఏం అరదం కాటల్లా అంటాడు. మళ్ళొచ్చి అహే అరదం అవుద్దిగా అంటాడు.
ఇయ్యల ఫోణుజేసి కనుక్కో అనిజెప్పి ఆపీస్కొచ్చా. ఆడోళ్ళు ఫోన్ జేసి ఏందీ సంగతీ అనడిగితే. మీవాడు యా౨క్టివ్, చక్కగా మాట్టాడతాడు, ఏవీ సమస్యల్లేవు. ఆమాటకొస్తే అందరికన్నా ముందున్నాడు. అట్టా ముందున్నోళ్ళకి ప్రత్యేకంగా కల్లాసులుంటై. ఆళ్ళకి ఇంకా బాగా నేర్పిస్తరు. అదే ఆ కాయితకం అన్జెప్పిందంట.

మనోడు కూసింత సదూకుంటే అదే సాలు అనుకున్నాం ఊపిరిపీల్సుకుంటా.

Sep 1, 2010

శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం

అధౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం |
కంసచ్ఛేదనకౌరవాదిహననం కుంతీసుతాః పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం ||

యవత్ హైందవజనులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

 

శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం

 

భజే వ్రజైకమణ్డనం సమస్తపాపఖణ్డనం

స్వభక్తచిత్తరంజనం సదైవ నన్దనన్దనమ్‍ |

సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం

అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్‍ || ౧||

 

మనోజగర్వమొచనం విశాలలోలలోచనం

విధూతగోపశోచనం నమామి పద్మలోచనమ్ |

కరారవిన్దభూధరం స్మితావలోకసున్దరం

మహేన్ద్రమానదారణం నమామి కృష్ణావారణమ్ || ౨||

 

కదమ్బసూనకుణ్డలం సుచారుగణ్డమణ్డలం

వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభమ్ |

యశోదయా సమోదయా సగోపయా సనన్దయా

యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకమ్ || ౩||

 

సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం

దధానముక్తమాలకం నమామి నన్దబాలకమ్ |

సమస్తదోషశోషణం సమస్తలోకపోషణం

సమస్తగోపమానసం నమామి నన్దలాలసమ్ || ౪||

 

భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం

యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకమ్ |

దృగన్తకాన్తభంగినం సదా సదాలిసంగినం

దినే దినే నవం నవం నమామి నన్దసమ్భవమ్ || ౫||

 

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం

సురద్విషన్నికన్దనం నమామి గోపనన్దనమ్ |

నవీనగోపనాగరం నవీనకేలిలమ్పటం

నమామి మేఘసున్దరం తడిత్ప్రభాలసత్పటమ్ || ౬||

 

సమస్తగోపనన్దనం హృదమ్బుజైకమోదనం

నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనమ్ |

నికామకామదాయకం దృగన్తచారుసాయకం

రసాలవేణుగాయకం నమామి కుంజనాయకమ్ || ౭||

 

విదగ్ధగొపికామనోమనోజ్ఞతల్పశాయినం

నమామి కుంజకాననే ప్రవ్రద్ధవన్హిపాయినమ్ |

కిశోరకాన్తిరంజితం దృగంజనం సుశోభితం

గజేన్ద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణమ్ || ౮||

 

యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా

మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతామ్ |

ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన

భవేత్స నన్దనన్దనే భవే భవే సుభక్తిమానమ్ || ౯||

 

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీకృష్ణాష్టకం సమ్పూర్ణమ్ ||

 

శ్రీ కృష్ణార్పణమస్తు ||