Dec 20, 2008

ఫెర్రారి

నిన్న దేశి షాపుకి వెళ్లాం, వస్తుంటె, ఓ చోట సిగ్నలు పడింది, ఆగాను, పక్కనే సిమెట్రీ, అదేంటి అని అడిగాడు సూరిగాడు,
"సిమెట్రి"
"ఎందుకది?"
"చనిపొయ్యాక అక్కడ బూడ్చిపెడతారు"
"చనిపోవటం అంటే"
"యం&యం తిను అరవకుండా"
"its dark out there, its spooky out there, hello"
"ఎవరికిరా హెల్లొ?"
"చెయ్యిఫోను లో మాట్లాడుతున్నా?"
"చెయ్యిఫోనా? అంటే?"
"చేతిని చెవిదగ్గర పెట్టుకుని మాట్లాడితే చెయ్యిఫోను, కాలుని చెవిదెగ్గర పెట్టుకుని మాట్టాడితే కాలు ఫోను"
"ఇంతలో నాకు call, మా మితృడు, ఎదో install చెయ్"
"Install అంటే ఏంటి?"
"నీకు తెలియదులే నాన్నా"
"install కాదు, అది బ్యాడ్, చిన్నపిల్లల దెగ్గర అనకూడదు"
ఇంతలో పోలీస్ కార్ పక్కనుంచి కుయ్యో కుయ్యో
"పోలీస్ పోలీస్"
"అవునమ్మా, గోల చేస్తే నిన్ను ఇచ్చేస్తా"
"అతను గుడ్ పోలీస్, నన్ను తీస్కెళ్లి అమ్మకి ఇచ్చేస్తాడు సూర్యా గుడ్ బోయ్ అని. పోలీస్కి కూడా పోలీస్ బేబి ఉంటుంది, ఆ బేబి పోలీస్ కార్ సీట్లో కుర్చుంటుంది. మోన్స్టరేమో కేజ్ లో ఉంటుంది."
"సరే నాన్నదేం కారు?"
"నిస్సాన్ ఆల్టిమా, నాన్నా నీకారు బాగలేదు"
"ఏమిరా ఏమి దీనికి"
"నా షూస్ లైటెనింగ్ మెక్వీన్, క్యాప్ లైటెనింగ్ మెక్వీన్, గ్లొవ్స్ లైటెనింగ్ మెక్వీన్, జాకెట్టు లైటెనింగ్ మెక్వీన్, టీ షర్టు లైటెనింగ్ మెక్వీన్, కార్ లైటెనింగ్ మెక్వీన్! ఫెర్రార్రీ కొను రెడ్ ఫెర్రారీ, 95 వ్రూం వ్రూం వ్రూం!!"
"హా!!!!!@#@#$!$%%^!#$^!^&^&*&*()*)"
Note : Vroom = side exhausts, 95 is the car number for ferrari in famous pixar movie called "CARS"

8 comments:

 1. ""అతను గుడ్ పోలీస్, నన్ను తీస్కెళ్లి అమ్మకి ఇచ్చేస్తాడు సూర్యా గుడ్ బోయ్ అని. పోలీస్కి కూడా పోలీస్ బేబి ఉంటుంది, ఆ బేబి పోలీస్ కార్ సీట్లో కుర్చుంటుంది. మోన్స్టరేమో కేజ్ లో ఉంటుంది.""

  :) :) మోన్స్టర్ కి కూడా బేబీస్.... పెద్దోళ్ళు ఇలా ఆలోచించలేరు కదా... As we grow older, we learn out of creativity

  ఈ వీడియో చూడండి..

  http://www.youtube.com/watch?v=iG9CE55wbtY

  ReplyDelete
 2. మొన్న మా చిన్న పాప అమ్మలు కూడా అడిగింది - చావు అంటే ఫిక్షనా అని. కాదని చెప్పి వివరిస్తే చావు ఎప్పుడూ నిజంగా (సినిమాలు, కథలలో తప్ప) చూడలేదు కదా అంది. తరువాత పుట్టుకల మీదికి వెళ్ళింది విషయం. అక్క కంటే ముందే తను ఎందుకు పుట్టలేదు/పుట్టించలేదు అని ఒహటే గొడవ!!

  ReplyDelete
 3. మా వర్షిత కి 16 నెలలే ...ఇప్పుడిప్పుడే ..అమ్మ, నాన్న, అమ్మమ్మ అంటుంది......!
  భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సిరావచ్చు......!

  ReplyDelete
 4. మొన్నే మావారి నానమ్మ గారుపోయారు.మావాడి ప్రశ్నల పరంపర ఇలా కొనసాగింది.
  వై డాడ్ ఈస్ సేడ్?
  నాన్న గ్రామీ దేవుడి దగ్గరకెళ్ళింది.అందుకే సేడ్.
  ఎందుకెళ్ళింది?వెకేషన్ కా?
  కాదు ఫరెవర్ వెళ్ళింది.ఇంక రాదు.
  దేవుడు ఏ కాంటినెంట్ లో వుంటాడు?
  కాంటినెట్ లేదూ తలకాయా లేదూ...నాకు తెలీదు ఎక్కడుంటాడో
  మరి గ్రామీ ఎలా వెళ్ళింది.ఆవిడని అడొగొచ్చుగా ఎక్కడవుంటాడో?
  నోరుమూసుకుని కుర్చోపోతే మోన్స్టర్ ని పిలుస్తా
  కాల్ ఐ వాంటూ సీ
  ఇఫ్ యు విల్ బి క్వైట్ యు విల్ గెట్ ఎ మెక్వీన్ స్టిక్కర్....అంతే ప్రశ్నల స్రవంతి ఆగిపోయింది.
  మా ఇంట్లోనూ మెక్వీన్ పిచ్చోడువున్నాడు.మీవాడికి నాలుగు లేక ఐదేళ్ళుంటాయా?

  ReplyDelete
 5. యోగి: మంచి వీడియో. ధన్యవాద్
  శ్రావ్య, వంశి: ధన్యవాదాలు
  శరత్ గారు: ఇప్పటిపిల్లలకి, కావాల్సిన దానికన్నా ఎక్కువ సమాచారం అందుతోంది. కాబట్టే ఇన్ని ప్రశ్నలు. మేము పల్నాడు అనే ప్రాంతం నుండి. కొన్ని కొన్ని ఊళ్లలో "రైలు బండి"ని వాళ్ల జీవితంలో చూడని వాళ్లు, "టూహ్ బ్రష్" అంటే తెలియను కోకొల్లల్లు ఉండే వాళ్లు ఆరోజుల్లో.
  @వేణుగోపాల్: సిద్ధంగా ఉండు. ఎన్నో ప్రశ్నలు. మరెన్నో సవ్వాళ్లు.
  @రాధిక గారు: ప్రతీదీ ఓ ప్రశ్నే. ట్యాప్ తీపితే ఏమౌతుంది, నీళ్లొస్తాయ్, నీళ్లొస్తే? బక్కెట్టు నిండుతుంది, నిండితే? నా తలకాయ్.
  ఒక్కసారి ఇది చదవండి http://projectsforfuture.blogspot.com/2008/11/blog-post_02.html.
  మావాడికి ఇంకో నాలుగు నెలల్లో నాలుగు వస్తుందండి.

  ReplyDelete
 6. పిల్లలు ఎన్ని ప్రశ్న లడిగినా ఓపికగా వివరించాల్సిన బాధ్యత తలితండ్రులది. నా చిన్నప్పుడు మ ఊర్లో నేను ప్రశ్నలు అడగడములో ప్రసిద్ధి అంట. నేను అడిగే ప్రశ్నలు, మా నాన్న ఇచ్చే జవాబులూ చూసి ఊర్లో అందరూ విస్మయం చెందుతూ వుండేవారట. మా నాన్న నాగం గారు హేతువాది - అందుకే ఓపికగా జవాబులు ఇచ్చేవారు - అలా నాలో హేతువాదం అభివృద్ధి అయ్యింది.

  ReplyDelete