Apr 24, 2012

వాషింగ్‌టన్ పరిసర ప్రాంతాలలోని మిత్రులకు ఆహ్వానం


మా గురువుగారు, శ్రీశ్రీశ్రీ అనంత కృష్ణన్ గారి ఆధ్వర్యంలో, "అనంత్ వేద గ్రూప్" వారిచే ఏప్రిల్ ౨౭(27) నుండి ౨౯(29) వరకు "మహారుద్రం", లాన్‌హమ్ నందలి శ్రీ శివ విష్ణు దేవాలయమునందు జరుగనున్నది, కావున, మీరంతా పాల్గొని ఆ మహాశివుని సేవలో తరింపగోరతాను
http://www.maharudram2012.org/ఓం నమః శివాయ

Apr 20, 2012

అనఘ సరుకుల జాబితా


మొన్న ఆదివారం శామ్స్ క్లబ్బుకి వెళ్ళబోతూ, హోము గారిని హింటినాను "లిస్టు రాస్కున్నరానే" అని.
టట్టడాయ్ అని అనఘ కొంచేపు జంపింగు జాక్స్ చేసి హడావిడిగా ఓ కాయితకం సింపుకొచ్చింది నోటుబొక్కులోంచి. పెన్నేది, అబ్బ ఒక్క పెన్నూ రాయదు అనుకుంటా ఓ పెన్ను లాక్కుచ్చుకుని ఎదో రాస్తాఉంది.
ఏటమ్మలు ఏటి రాస్తన్నా అంటే
సరుకుల లిస్ట్ రాస్తన్నా, ఏవేం కొనుక్కోవాల్నో అని
లిస్టు రాసి నాకిచ్చింది. జోబిలో ఎట్టుకో నాన్నా అని.

సర్లెమ్మని జోబిలో దోపుకిని ఎళ్ళినాం దుకాణానికి.
లోనకిబోంగనే, లిస్ట్ ఇటివ్వు అనింది
ఇచ్చినా
అంతలో హోము గారు పాలు తీస్కోవాల అనింది.
నే అది లిస్టులో రాసినా నాన్నా అనింది అనఘ
అనఘ లిస్టులో మీకేం అగుపిస్తా ఉన్నాయో సెప్పాల!!
అన్నో ఎవుళ్ళకాళ్ళు కొనుక్కుని బిల్లు కూడక మీరే కట్టెస్కుని, ఓ మూట మిఠాయిలు ఇటంపండి!!

Apr 19, 2012

నా మనసు మౌనంగా రోదిస్తున్నది

అమ్మ కాల్ చేసింది.
దుర్గారావు మాష్టరు గారి ఇద్దరు కొడుకుల్లో ఒకరు కేన్సర్ వ్యాధితో పోయారట.
పెద్ద పిల్లాడు యంటెక్ చేసాడనుకుంటా, ఎక్కడో ఉద్యోగం చెస్తున్నాడు.
రెండోవాడు వర్చ్యూసాలో చేరాడు ఆరేళ్ళ క్రితం. అమెరికా వచ్చాడు, మిల్వకిలో చాలా నెలలు ఉన్నాడు.
మరి ఇద్దరిలో ఎవరు పోయారో? కిరణ్ ట రా అన్నది అమ్మ.
కిరణ్ అంటే రెండోవాడు. భలే తెలివైన పిల్లాడు, చలాకీగా ఉంటాడు.
నా మనసు ఎంతో బాధతో మునిగిపోయిందీ వార్త విని.
ఇంకా ఇరవైల్లోనే ఉన్నాడే!! అయ్యో!! బ్లడ్ కాన్సర్!! నా మనసు మౌనంగా రోదిస్తున్నది. ఐ యాం స్పీచ్‌లెస్

Apr 17, 2012

అవర్ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ - ఆర్ట్ బై అనఘ

ఇందులో అందరూ ఉన్నారట!!
అనఘ అండ్ ఫ్యామిలీ అనగా, నేనూ, వాళ్ళ అమ్మ, తనూ, అన్న...ఆమ్మ పెదనాన్న అన్న, మిగతా అంతా ఫ్రెండ్స్ ట.

నువ్వు ఉన్యావా ఇందులో?
వెతుక్కో!!

Apr 12, 2012

డా॥ రమణ గారి *కోటయ్య కొడుకు*

నిన్నటి మా డాట్రుబాబు రమణ గారి టపా, నాన్న పొదుపు - నా చిన్ని కష్టాలు! సదివినాంక, ఈ కింది పేరా
కోటయ్య కొడుకు వైపు దృష్టి సారించాను. అడుగు బద్దలా బక్కగా, పొట్టిగా ఉన్నాడు. డిప్ప కటింగ్. చీమిడి ముక్కు. మిడి గుడ్లు. తన లూజు నిక్కర్ జారిపోకుండా ఒక చేత్తో పట్టుకుని.. ఇంకో చేత్తో తండ్రి చెయ్యిని గట్టిగా పట్టుకుని బిడియంగా నాకేసి చూస్తున్నాడు. మాసిన తెల్ల చొక్కా మోకాళ్ళ దాకా లూజుగా వేళ్ళాడుతుంది. చొక్కా గుండీలకి బదులు రెండు సేఫ్టీ పిన్నులు. ఇంజెక్షనేమన్నా పొడిచేస్తానేమోనన్న బెదురు చూపులు. ఈ ఆకారాన్ని ఎక్కడో చూశాను. ఎక్కడ? ఎక్కడ? ఎక్కడబ్బా? ఎక్కడో ఏమిటీ! అది నేనే!!

బాగా నచ్చి......శ్రీ అన్వర్ గారికి ఓ మెయిల్ పెట్టాని.
పై డిస్క్రిప్తన్తో అన్వర్ గారు ఓ బొమ్మగీయాలని ప్రార్థన అని. వారు వెంటనే స్పందించి ఇలా గీసి పంపించారు.


అన్వర్ గారికి కృతజ్ఞతలతో
డా॥ రమణగారికి అభినందనలతో