Mar 14, 2007

కరణ్ థప్పర్ - వైయస్ రాజశేఖర రెడ్డి

కరణ్ థప్పర్ - వైయస్ రాజశేఖర రెడ్డి
బాగుందయ్య - కొత్త జర్నలిజం, కొత్త పధ్ధతులు.కరణ్ థప్పర్ కళ్ళలో ఒక రకమైన ఇది చూసాను. రెండు ముఖ్య అంశాలమీద చర్చ జరిగింది. ఒకటి రాజశేఖర రెడ్డికి ఉన్న భూములమీద. రెండు మార్గదర్శి, రామోజీ రావు మీద. థప్పర్ ఏమి నిరూపించాడో నాకు అర్ధం కాలేదు.
Karan Thapar: That’s a very dubious sort of explanation for the Chief Minister of a state to say that he didn’t know the facts. But lets leave it there. Let me ask you, are you guilty of intimidating the press. Are you targeting Ramoji Rao and his newspapers because they are exposing corruption in your government and worst still, corruption perhaps in your family?
Both the Opposition and the press believe that you are targeting Ramoji Rao and his company Margadarsi Financiers because his newspaper Eenadu and his television channels have gone out of their way to expose corruption in your government and worst still corruption perhaps amongst your family members. Are you hitting at Margadarsi Financiers out of revenge?

YS Rajashekar Reddy: This is totally unfounded this is totally baseless.

Karan Thapar: Let me prove to you. I am interrupting to do this why it may have some connection. Can you deny that your interest and concern in Margadarsi Financiers as a deposit taker and your claim that they are making losses happened only after Eenadu had spent several weeks pointing out government complicity and perhaps your own family’s complicity in what is called the outer ring road scandal.
YS Rajashekar Reddy: For that matter there is nothing with regard to the government or my family connected with outer ring road at all.
Karan Thapar: Not just Eenadu even Tribune newspaper in Chandigarh has alleged that your family members and what are called your own men have wrongly made money.
Karan Thapar: Are you the right person to act in this instance or is it for the RBI to act? The RBI had already taken cognisance; they had given a clean record, yet you stepped in. And there was no need for you.
Karan Thapar: Well, that’s what you say. Let me quote you The Hindu newspaper, a paper that supports the Congress party, writing on the 23rd in the editorial, they say, “The party of Jawaharlal Nehru, a great defender of press freedom, should be ashamed of what’s its government in Andhra Pradesh is doing.


I would say press should be ashamed of having news producers like eenadu which has open relationships with a political party.

ప్రతిపక్షాల గొడవ అర్ధం లేకుండా ఉంది.నారా చంద్రబాబు గారికి యెక్కడ సెంటు భూమి కూడాలేదా? పాపం ఆయన కానీ, తెలుగుదేశం లో ఎవ్వడు కానీ అస్సలు భూముల్ని కొనలేదు (అస్సైండు) ఆక్రమించలేదు. పాపం ఏరాజకీయ నాయకుడికీ అంటే వెంకయ్యనాయుడుకి గానీ, దేవేద్రగౌడ్ గారికి గానీ అస్సలు భూమి అంటె యేంటొ తెలియదు. ఈనాడు రామోజీ రావు గారికి అస్సలు తెలియదు. నారా గారికి మాదాపూర్ అంటే, అక్కడ ఉన్న జయభేరి అంటే, మురళీ మోహన్ అంటె యెవరో కూడా తెలియదు.థప్పర్ గారు చెప్పినట్టు, మన స్వతంత్ర భారత దేశ చెరిత్రలో ఎన్ని సార్లు ఎంతమంది ముఖ్య మంత్రులు, లేక ప్రధాన మంత్రులు, లేక ఎవరైనా మంత్రి, యం యల్ ఏ,ఇలా ప్రతీ విమర్శకి రాజీనామా చేసారా? అతను అడిగే ప్రశ్నలకీ రాజశెఖర రెడ్డికే కాదు, నాకుకూడా నవ్వు వచ్చింది. ఇక మార్గదర్శి విషయం. అతను అడిగిన ప్రశ్నలకి అర్ధం లేదు. తెలుగు దేశం పరిపాలన లో ఉన్న 9 సంవత్శరాలలో ఒక్క చీటింగు కేసు కానీ, ఒక్క అధికార దుర్వినియోగం కానీ, లంచం తేసుకోవటం కానీ జరగలేదా? ప్రపంచమ్లో ప్రతీఒక్కడికి తెలుసు రామోజీరావు తెలుగుదేశం వైపు అని ఒక్క థప్పర్ కి తప్ప. ఆ పరిపాలనలో ఒక్క మాట కూడ ఎత్తని ఒక బాధ్యతగల వార్తా పత్రికగా, ఇప్పుడు అది ఇది అంటూ రాసి, అస్సెంబ్లీ లో చర్చకి కరణం కావటం, క్షమించరాని నేరం. పత్రికా స్వాతంత్రం అంటె అర్ధం ఇదేనా? నేను నాకు ఇష్టం వచ్చినట్టు రాస్తాను అంటే ఎలా?మార్గదర్శి విషయంలో మీరు ఎందుకు వేలు పెట్టారు? ఇది థప్పర్ గారి ప్రశ్న - ఒక ముఖ్యమంత్రికి ఉన్న హక్కులు యెంటో తప్పర్ గారే చెప్పాలి. సరే ముందు, మార్గదర్శికి crysil రాటింగు ఉందా? దాంట్లో పెట్టినపెట్టుబడులకి నమ్మకం ఏంటి? రామోజీరావు గారు నష్టాలలో ఉన్నారని అందరికి తెలుసు. మరి అలాంటప్పుడు ఇంక అస్సలు చర్చ దేనికి.
ప్రతీదానికి మీడియా ముందుకి వస్తున్నది. మంచి పరిణామమే. ఐతే దీనివల్ల మనకి మంచి జరుగుతున్నదా? అస్సలు మనకి కావాల్సిన వాటిమీద దృస్టి ఎక్కడ? కులం - మతం - డబ్బు - రాజకీయాలు వీటన్నిటికీ అతీతమైన మీడియా అనేది ఒక కలేనా?

Mar 7, 2007

అంకితం

"రామరాజు రమాకాంతరావు" మా స్వర్గీయ నాన్న గారి పేరు. ఆయన ఒక టీచరు. యెందరికో మార్గదర్శకులు, యెందరికో విద్య అనే వెలుగుని ప్రసాదించినవారు. ఒక లెక్కల మాష్టారు (School Asst) గా చాలా ఖ్యాతి గడించారు.ఆయన మొట్టమొదట దాచేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో లెక్కల బి.ఇడి గా, అటుతర్వాత పిడుగురాళ్ళ, మోర్జంపాడు, సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో లెక్కల బి.ఇడి గా పని చేసారు.చివరిగా నిడమర్రు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల కి ప్రధానోపాధ్యాయుడు గా పని చేసి, 2000 లో స్వచ్ఛెంద పదవీవిరమణ చేసారు. 2005 ఆగష్టు లో పరమపదించారు.ఒక ఉపాధ్యాయుడుగానేకాకా ఒక విశాల ధృక్పదంగల వ్యక్తిగా ఆయన కమ్యునిజం వైపు మొగ్గుచూపి కమ్మ్యునిష్టు పార్టీ అనుభందసంస్థ ఐన United Teachers Fedaration లో చేరి ఉపాధ్యాయ కులానికి సేవలు చేసారు.యెన్నో ఉపాధ్యాయ పోరాటాల్లో పాల్గొన్నారు.ఆయన నాకు తండ్రి, గురువు, దైవం.
ఈ బ్లాగు మా నాన్నగారికి అంకితం