Feb 21, 2012

మాతృభాషా దినోత్సవం(ట)

మాతృభాషా దినోత్సవమ్
భలే ఉంది కదూ
మాత, భాష, దిన, ఉత్సవం
అంతా సంస్కృతమే.
సరే!! మాతృభాషాదినోత్సవ సందర్భంగా ఏంచేసావ్? అని ఓ ప్రశ్న.
నా ముచ్చట చెబుతా విను.
ఇయ్యాల్నే మొట్టమొదటిసారి ఇంటా ఉన్నా ఈ దినోత్సవాన్ని. ఇంక ఏంజేసినా ఈయ్యాల?
మామూలుగానే లేచినా,
పండ్లు తోమినా
బువ్వ తిన్నా
పిల్కాయల్తో మాట్లాడినా
ఆడినా
పాడినా
పనికొచ్చినా
పనిజేసినా
....
....
.....

ఇంకేంజేయాలే?
మాతృభాషాభివృద్ధికి ఏం జేసినా అనా నీ ప్రశ్న. మరట్టాజెప్పు.
కిం.ప.దొ.న.
భాషాభివృద్ధికి మనం ఏంజేయాలా? ఏం జేసేపనిల్యా. తెలుగులో మాట్టాడు, అదే నిల్చిద్ది.
భాషని రక్షించాలంటే
నెట్లో తెలుగులో టైపించినంతమాత్రాన భాష బతకదు. భాష అనేటిది ఓలటైల్. మాట్లాడాల. మాట్లాడకపోతే భాష పోయిద్ది. భాషని నిల్చుకోబెట్టాల్నంటే, ఆ భాషలో మాట్లాడాల. ఆంగ్ల మాధ్యమాన్ని పక్కనపెట్టాల. టింగ్లిష్ బందుజేయాల. టీవీలల్లో తింగరి తెలుగు ఆపేయాల. సినిమల్లో పిచ్చి తెలుగుని ఆపేయాల. పిల్లల్తో తెలుగులోనే మాట్లాడాల. తెలుగు మాట్లాడమని వాళ్ళకి ప్రోత్సహించాల.
నిన్న సూరిగాడి కరాటే క్లాసులో ఓ పెద్ద కుటుంబాన్ని చూసా. వాళ్ళ పిల్లలు నలుగురు కరాటే నేర్చుకుంటుంన్నారు. వాళ్ళంతా కమ్మగా స్పానిష్లో మాట్లాడుకుంటున్నారు. పిల్లల్తో కూడా స్పానిష్లోనే. ఆపిల్లలూ స్పానిష్లోనే జవాబిస్తున్నారు. మిగతా జనాలతో ఆంగ్లంలో జవాబు ఇస్తున్నారు. మన తెలుగువాళ్ళో? పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడతారు.
సమస్య ఎక్కడా?
సమస్య తల్లితండ్రులే. ఎందుకూ?
పిల్లలకు భాష అనేది లెర్నింగ్ బై ఇమిటేషన్ ద్వారా వచ్చేస్తుంది. అంటే విను నేర్చుకో, చూసి నేర్చుకో, అనుకరణ స్వారా నేర్చుకో. భార్యా భర్తా తెలుగులో మాట్లాడుకుంటారు. పిల్లల్తో ఆంగ్లంలో మాట్లాడితే, అది లెర్నింగ్ కర్వ‌ని బ్రేక్ చేయటంలేదా? ఆలోచించండి.
భాషని బ్రతికించుకోవాలంటే ఇలాంటివి మానేసి, చక్కగా తెలుగులోనే మాట్లాడుకోవాలి. పిల్లల్తో తెలుగులోనే మాట్లాడాలి. వారినీ తెలుగులో జవాబివ్వమని చెప్పుకోవాలి.
ప్రింట్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా తెలుగు అచ్చువేసినా ఉపయోగం లేదు. భాష మాట్లాడితేనే నిలిచేది. దాని లోతు తెలిసేది. భావాన్ని అర్థవంతంగా చెప్పగలిగేది.

సరే, ఇషయానికొస్తే, ఈయ్యాల రోజుట్లాగనే మా పిల్కాయలతో తెలుగులోనే మాట్లాడినాను. వాళ్ళూ తెలుగులోనే సమాధానం చెప్పినారు. ప్రత్యేకంగా మాతృభాషా దినోత్సవాన్ని నేనేతే ఏం చేస్కోలేదు, చేయలేదు.

Feb 14, 2012

అనఘ ఆర్ట్

ఇది అనఘ గీసిన బొమ్మ
ఏం అర్థమైందీ?
సరే సెప్తా ఇనుకో!!
౧. వాడబ్బా!! అర్థం అవ్వలేదా? మబ్బులు
౨. ఇల్లు
౩. గాలి. ఏటి? గాలిని గీసిందా అనుకోమాక. మా ఇష్టం. దేన్నైనా గీస్తాం.
౪. చెట్లు
౫. గడ్డి

Feb 8, 2012

జగన్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్లు

జగన్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్లు, రాళ్లు
నకరికల్లు, రొంపిచర్ల, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో జగన్‌ ఓదార్పు యాత్ర ఉద్రిక్తత నడుమ సాగింది. కుంకలగుంటలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు, రాళ్లను విసిరారు.
[ బుధవారం, ఫిబ్రవరి 08, 2012 ఈనాడు]

కొంతకాలం క్రితం తాత ఇలా చెప్పుకొచ్చాడు -

దేశంలో 42శాతం మంది పిల్లలు బరువు తక్కువగా ఉండటం దేశానికే సిగ్గుచేటు. పౌష్టికాహారలోపం సమస్య పరిష్కారానికి కేవలం ఐసీడీఎస్‌పైనే ఆధారపడలేం. పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్న జిల్లాలు, అందుకు కారణమవుతున్న పరిస్థితులున్నజిల్లాలపై మనం దృష్టిసారించాలి
-తాత [ప్రధానమంత్రి]

కాబట్టి,
బాబులూ, రాజకీయ దురంధరులూ, రాజకీయ వి-నాయకులూ, డబ్బిస్తే ఏవైనా చేసే కుంకలూ, దగుల్బాజీలూ!!
ఒక్కమారు ఆలకించండి. మీ చుట్టూతా చూడండి. తిండికిలేక మలమల మాడుతున్న జనారరణ్యపు చేతగాని ప్రాణులను చూడండి. కారుమీద గుడ్లు వేస్తే వచ్చేదేవీలేదు. సదరు కారుకే తగిలేది. అవి ఆ కారులోని వ్యక్తికి తగిలినా పేద్ద జరిగేదేవీలేదు. మీరు ఇండ్లకెళ్ళి ఈ పనికిమాలిన పనితో సమ్పాదించిన డబ్బుతో మందుకొడతారు. సదరు వ్యక్తి ఇంటికెళ్ళి గుడ్లు కడిగేస్కుని మందుకొడతాడు
ఎనుబోతు మీద వాన కురిస్తే ఏటౌద్దీ?
ఎక్కడా మార్పు రాదు
ఎవడూ మారడు
ఇంత మాత్రం దానికి గుడ్లు వృద్ధా చేస్తారా?
వాటిని అన్నార్తులకు పంచండి

దయతో!!!

Feb 3, 2012

వేదంలో ఏవుంది ఇన్నయ్యగారూ?

ఇన్నయ్య గారి పుస్తకంట అబద్ధాల వేట నిజాల బాట
http://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/
అందులోండి ఓ తుంపర-

వేదాల్లో ఏముంది?
ఇక వేదాల్లో ఏముంది? అనే వ్యాసంలో ప్రాచీన కాలంలో ఎందరో ఆలోచనాపరులు (మన భాషలో రుషులు) ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసినవే వేదాలు. ఇవి సంప్రదాయ బద్ధంగా, గురువునుంచి శిష్యునికి అలా… అలా… గుర్తున్నంత వరకూ ఆనోటా, యీనోటా నాని ప్రజలలోకి ప్రచారంలోకి వచ్చాయి. దీనికి మూల రచయిత ఫలానా అని చెప్పలేము. అలాంటి రచనలకు దివ్యత్వాన్ని ఆపాదించారు. ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు – ఏదో ఉజ్జాయింపుగా చెప్పటమే. ప్రతిదానికీ దేవుడే కారణమని నమ్మారు అప్పటివారు. దయానందుడు సైతం కులాన్ని కాదన్నా వేదాలలోని వర్ణ వ్యవస్థకు వత్తాసు పలికాడు.వేదాలు నరబలిని అంగీకరించాయి. ఆ తరువాత వచ్చిన బ్రిటీషు పాలకులు దీనిని నిషేధించారు. వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా సృష్టించాయి. శూద్రులు వారికి సేవ చేయాలన్నారు. వీరికి యజ్ఞం చేసే అర్హత లేదు. దయానందుడు ఎంత సంస్కరణ వాది అయినా శూద్రులు పితికిన పాలు కూడా అపవిత్రమన్నాడు. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలతో వ్యభిచరించవచ్చు. ఆ పని శూద్రులు బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు. ఇలాంటి తారతమ్యాలు జుగుప్సాహకర విషయాలు వేదాలలో ఉన్నట్లు ఈ వ్యాసంలో వివరించటం మనం చూస్తాం.

అహా!! ఎంతగొప్పగా ప్రశ్నించారండీ ఇన్నయ్య గారూ మరియూ వారి వకాల్తా పుచ్చుకుని బ్లాగులో వాక్రుచ్చినవారు.
వేదాల్లో ఏముందీ? ఔను మంచి ప్రశ్న. ఏవుందేవిటీ ఇన్నయ్యగారూ? తమరు ఎన్ని వేదాలు చదివారేవిటీ?

ప్రాచీన కాలంలో ఎందరో ఆలోచనాపరులు (మన భాషలో రుషులు) ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసినవే వేదాలు.
ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసారంటానికి మీవద్ద సాక్ష్యాలెంటీ?
ఏడుస్తూ కఠస్థం చేసుండాచ్చుగా? నిరూపించండి చూద్దాం!!
ఐతే! కఠస్థం చేసినవారు ఆలోచనాపరులు అంటారు.
మనభాషలో వాళ్ళు ఋషులు అన్నమాట.
అంటే ఋషులు ఆలోచనాపరులు. ------------------------------------ ౧ [దీన్ని అలా పెట్టుకుందాం. ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు]

ఇవి వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదు – ఏదో ఉజ్జాయింపుగా చెప్పటమే.
వెలుగు చూసిన కాలం నిర్ణయం కాలేదా? నోటిమీదకొస్తే వెలుగు చూసినట్టుకాదా?
సరే, 1000 BC అనుకుందాం, తమరి కుదృష్టిలో వెలుగు చూట్టం = ప్రింట్ కావటం, ఓహో అప్పటికి ప్రింట్ అవ్వలేదంటారా? మరి మీరు వాషింగుటన్ను పోస్టులో జాతకాలు వేసి మీ పుత్ర రతనమ్ ద్వారా సంపాదించిన ధనంతో అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ పెట్టలేదుకదా. అది మీ తప్పు.

వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలను అగ్రవర్ణాలుగా సృష్టించాయి. శూద్రులు వారికి సేవ చేయాలన్నారు.
భలే భలే. ఏ వేదంలో చెప్పారండీ ఇది. ఒక్కమారు రిఫరెన్స్ చూపండి.
దయానందుడు ఎంత సంస్కరణ వాది అయినా శూద్రులు పితికిన పాలు కూడా అపవిత్రమన్నాడు.
దయానందుడు ఒంగోమన్నాడు. దానికీ వేదాలకీ సంబంధం ఎక్కడా?
బ్రాహ్మణుడు శూద్ర స్త్రీలతో వ్యభిచరించవచ్చు. ఆ పని శూద్రులు బ్రాహ్మణ స్త్రీతో చేస్తే నరికేయాలన్నారు.
ఎవరన్నారుటా? మీరా? వేదాలా? ప్రూఫ్ ఏవిటీ? మీది నోరా మునిసిపాలిటీ పాయిఖానానా? ఏవయ్యా? బ్రాహ్మణులు అనకుండా ఒక్కలైను వ్రాయగలవా? థూ!
ఇలాంటి తారతమ్యాలు జుగుప్సాహకర విషయాలు వేదాలలో ఉన్నట్లు ఈ వ్యాసంలో వివరించటం మనం చూస్తాం.
ఇలాంటి జుగుప్సాకరమైన విషయాలు వేదాల్లో కాదు ఉంది, మీ ఇరుకైన మనసుల్లో.