Apr 22, 2009

బాబుల్ తుం బగియా కే తరువర్

ఈ మధ్య దేనికోసమో గూగులదేశంలో వెతుకుతుంటే ఇది దొరికింది.
ఇది చదువుకుని ఆడోళ్ళు!! ఏడవద్దు.

బాబుల్ తుం బగియా కే తరువర్, హం తరువర్ కి చిడియా రే
దానా చుగ్తె ఉడ్ జాయే హం, పియా మిలన్ కి ఘడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కీ లడియా రే
బాబుల్ తుం బగియా కే తరువర్, హం తరువర్ కి చిడియా రే
ఆంఖోం సే ఆసూ నిక్లె తో పీఛే టకే నహీ ముడ్కే
ఘర్ కీ కన్యా బన్ కె పంఛీ, ఫెరె నా డాలీ సే ఉడ్కే
బాజీ హారీ హుయీ త్రియా కీ
జనం-జనం సౌగాత్ పియా కీ
బాబుల్ తుం గూంగే నైన, హం ఆసూ కి ఫుల్ఝడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
హంకొ సుధ్ న జనం కె పెహ్లె, అప్ని కహ అతారి థీ
ఆంఖ్ ఖోలి తో నభ్ కె నీఛే, హం థ గోద్ తుమ్హారీ థీ
ఐస థ వహ్ రైన్-బసెర
జహా సాంఝ్ భి లగే సవేర
బాబుల్ తుం గిరిరజ్ హిమలయ, హం ఝరోన్ కి కడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
ఛిత్రాయె నౌ లఖ్ సితారే, తేరి నాభ్ కి ఛాయ మే
మందిర్-మూరత్, తీరధ్ దేఖే, హమ్నె తెరీ కాయ మే
దుఖ్ మే భీ హమ్నే సుఖ్ దేఖా
తుమ్నే బస్ కన్య ముఖ్ దెఖా
బాబుల్ తుం కులవన్ష్ కమల్ హో, హం కోమల్ పంఖుడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
బచ్పన్ కె భోలెపన్ పర్ జబ్, ఛిట్కె రంగ్ జవనీ కే
ప్యాస్ ప్రీతి కి జాగి తో హం, మీన్ బనె బిన్ పానీ కే
జనం-జనం కె ప్యాసె నైన
ఛాహే నహిన్ కున్వారే రెహ్న
బాబుల్ ఢూండ్ ఫిరో తుం హంకో, హం ఢూండే బవారియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
ఛఢ్తి ఉమర్ బఢీ తో కుల్-మర్యద సే జా టక్రాయీ
పగ్డి గిర్నె కె డర్ సె, దునియ జ డోలి లే ఆయి
మన్ రొయా, గూంజీ షెహ్నయీ
నయన్ బహే, ఛునరీ పెహ్నాయీ
పెహ్నాయీ ఛునరీ సుహాగ్ కీ, యా డాలి హత్కడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
మంత్ర పఢే సౌ సాదీ పురానే, రీత్ నిభయీ ప్రీత్ నహి
తన్ కా సౌదా కర్ కె భీ తో, ప్రియా మన్ కా మీత్ నహీ
గాన్ ఫూల్ సా, కాంటే పగ్ మే
జగ్ కె లియే జియే హం జగ్ మే
బాబుల్ తుం పగ్డీ సమజ్ కే, హం పథ్ కీ కంకడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
మాంగ్ రచీ ఆసూ కే ఊపర్, ఘూఘత్ గీలి ఆంఖం పర్
బ్యాహ్ నాం సే యహ్ లీల జాహిర్ కర్వాయీ లాఖోన్ పర్
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
దేఖ జో ససురాల్ పహుంచ్కర్, తో దునియా హి న్యారీ థి
ఫూలోన్ స థ దేష్ హర, పర్ కాంటో కి ఫుల్వారీ థి
కెహ్నె కొ సారె అప్నె థె
పర్ దిన్ దొపహర్ కె సప్నె థె
మిలీ నాం పర్ కోమల్తా కే, కేవల్ నరం కంకడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
వేద్ శాస్త్ర థె లిఖె పురుష్ కె, ముష్కిల్ థ బచ్కర్ జాన
హారా దానవ్ బచ్ లెనె కొ, పతీ కో పర్మేష్వర్ జాన
దుళన్ బంకర్ దియా జలయా
దాసీ బంకర్ ఘర్ బార్ చలాయా
మా బంకర్ మంతా బాంతీ తో, మహల్ బనీ ఝొపడియ రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
మన్ కి సేజ్ సుల ప్రియతం కో, దీప్ నయన్ క మండ్ కియా
ఛుడా జగత్ సే అప్నే కో, సిందూర్ బిందు మే బంద్ కియా
జంజీరోన్ మే బాంధా తన్ కో
త్యాగ్-రాగ్ సే సాధా మన్ కో
పంఛీ కే ఉడ్ జానె పర్ హీ, ఖోలి నయన్ కివాదియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
జనం లియా తో జలే పితా-మా, యౌవన్ ఖిలా ననద్-భభీ
బ్యాహ్ రచా తో జలా ముహల్లా, పుత్ర హువా తో బంధ్య భి
జలే హృదై కే అందర్ నారీ
ఉస్ పర్ బాహర్ దునియా సారీ
మర్ జానే పర్ భీ మర్ఘత్ మే, జల్-జల్ ఉఠీ లకడియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే
జనం-జనం జగ్ కే నఖ్రే పర్, సాజ్-ఢాజ్కర్ జాయే వారి
ఫిర్ భి సంఝే గయే రాత్-దిన్ హం తాడన్ కే అధికారి
పెహ్లె గయె పియ జొ హంసే
అధం బనే హం యహన్ అధం సే
పెహ్లె హి హం ఛల్ బసే, తొ ఫిర్ జగ్ బాతే రెవాదియా రే
ఉడ్ జాయే తో లౌట్ న ఆయే, జో మోతీ కి లడియా రే

Apr 17, 2009

అంత్యాక్షరీ మొదలైయ్యింది

ఈరోజు కూడలిలో ఎక్కడ చూసిన పాటలే. ఈ సందర్భంగా నే మొదలుపెట్టిన అంత్యాక్షరీ http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.htmlలో పాల్గున ప్రార్ధన.
అసలు ఐడియా ఇది :-
ఎక్కడో చదివా - వాళ్లు మహమ్మద్ రఫి - కిషోర్ కుమార్ అంత్యాక్షరీ ఆడుతున్నారు. అంటే, ఓ రఫీ పాట - దాని అంత్యాక్షరంతో ఓ కిషోర్ పాట. మనమూ మొదలు పెడదామా?
ఓ ఘంటసాల పాట - అంత్యాక్షరంతో ఓ యస్.పి.బి పాట.
ప్రతీ పాటకీ తప్పనిసరిగా ఇవి ఉండాలి: పాడినవారు, ఏ చిత్రం, రాసింది ఎవరు, సంగీతం ఎవరు, మొట్టమొదటి చరణం (ఒకవేళ పాటకి ముందు ఇంట్రో ఉంటే అంత్యాక్షరం దానితో మొదలుకావాలి).


మొదలైంది ---
ఇప్పటికి నేను గారు ( :):):) ఈ మధ్య మావాడికి పెదనాన్న గారు, నానమ్మ గారు ఇలా నేర్పిద్దామని గారు పెట్టరా చివర్న అని చెప్పా. ఇక మొదలు పెట్టాడు, కారు గారు, పిల్లి గారు, చెల్లి గారు, కుర్చీ గారు, గుర్రం గారు ఇలా), చిన్నీ గారు, భవాని గారు, "కాళాస్త్రి" శ్రీ భాయ్, భా.రా.రె, యోగి, జ్యోతి గారు, "నా బ్లాగు" సునీత గారు, రాజే అన్నా, శృతి గారు తలా ఓ చెయ్యి వేసారు...మీరూ వెయ్యండి.

ఇక్కడ నొక్కండి - అంత్యాక్షరీ http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html

Apr 10, 2009

కొన్ని కార్టూన్లు

ఈ లింకెక్కడో దొరికింది. వెంటనే ఇక్కడ పెట్టాలనిపించింది.
ఏందయ్యా అంటే గత జమానా కార్టూన్లు.
సరే ఇదీ లింకు http://www.sdphadnis.com/sdphadnis_p_cartoons.html
ఉదాహరణకి కొన్ని
1951 -

1954 -

1965 -

1968 -


1969 -మిగతావి అక్కడే చూస్కోండి
కామెంటు మాత్రం ఇక్కడే వెయ్యండేం...

Apr 7, 2009

మువ్వాగోపాలుడే...

ఆ రోజుల్లో (1991 నాటి మాట), గర్తపురి యందున్న బ్రాడీపేట 5/17 లో మిన్నెకంటి గుర్నాధశర్మ గారింట్లో అద్దెకి ఉండే వాళ్లం. మిన్నెకంటి గుర్నాధశర్మ గారు గత జమానాలో ప్రఖ్యాత వ్యాకరణ పండితులు. మా ఇంటిముందు తంగిరాలవారి ఇల్లు. మా ఇటు పక్కన డా। ఇంగ్. పి. వేమురి రావ్, ఎడ్వైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పి.హెహ్.డి సస్ట్రెస్ అనాలిసిస్ వెస్ట్-జెర్మని .. ఈయన మహా పండితుడు భౌతిక శాస్త్రంలో. వీళ్ల ఇంటి ముందు ఎ.వి.వి.పి. ప్రసాదరావ్ గారు. అంటే మా ఇంటికి డైయాగ్నల్గా ఉంటారు వీరు. ఈయన మానాన్నా వాళ్లు హిందూకాలేజిలో చదివే రోజుల్లో (1960-63) లెక్కల డిమాన్ష్ట్రేటర్ గా చేరారట. మేము హిందూ కాలేజీలో చదివే రోజుల్లో ఈయన రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్నట్టు ఉన్నారు. మొదటి సంవత్సరం మాకు వచ్చారు లెక్కలకి. ఏమండి, డిఫరెంషియల్ ఈక్వేషన్స్ కదండి, బెస్సల్స్ ఈక్వేషన్స్ కదండీ ఇలా చెప్పేవారు. ఇక ఈ నా కధలో ఈయన హీరో తండ్రి. ఈయన పుత్రరత్నం గురించే నే చెప్పబొయ్యేది. వాడిపేరు మారుతి. అప్పట్లో వాడి వయ్యస్సు ఏ పదమూడో పదునాలుగో. మొత్తానికి సార్ధక నామధేయుడు. మహా గోలగాడు. వెయ్యని వేషాల్లేవు. చెయ్యని పనుల్లేవు. మా వీధినుండి రెండువీధుల చివర్లో వాళ్ల బడి. పేరు శ్రీయస్విబీకే అ.క.అ శ్రీ వేంకటేశ్వరా బాల కుటీర్. ఆంగ్ల మాధ్యమ పాఠశాల. ఈ బడి పిల్లల్లు కొంచెం గాల్లో నడిచేవారు. ప్రంపంచ ప్రఖ్యాత గాయని సునీత ఉపద్రష్ట గారు ఇక్కడే సతికారు. ఎందుకింత వ్యగ్యం అంటే ఇక్కడి పిల్లల క్లౌడ్ నైన్ వేషాలు. ఈ పాఠశల విద్యార్ధినులను లోబరుచుకొనుటకు, కొంతమంది రౌడీ షీటర్లు (ఈ పాఠశాలకి దగ్గర్లో కోబాల్ట్పేట అని ఒక చిన్న పేట, అది చాలా ప్రఖ్యాతి గాంచిన పేట రౌడీషీటర్లకి, మన సినిమా నటుడు జీవా ఈ పేటవాడే) ఆ పాఠశాలకి జతచేరు వీధుల్లో తిష్ట వేసేవాళ్లు. మగపిల్లకాయల్ని చేరదీసి రౌడీయిజంను హీరోయిజంలా ప్రొజెక్టు చేసేవారు. మన మారుతేశ్వర్రావ్ వాడి మిత్రబృందం కూడా అలా ఓ రౌడీగాడి చేతికి చిక్కారు. లాగులు పోయి ప్యాంట్లయ్యాయి. ఆ ప్యాంట్ల జేబుల్లో గుట్కా ప్యాకెట్లు చేరుకున్నాయి. నడుముకి సైకిల్ చైన్స్ వచ్చిచేరాయి. పెదాలు నల్లబడటం మొదలైయ్యింది. గుంపుగా రౌడీగాడి చుట్టూ చేరటం, వచ్చేపొయ్యేవాళ్ళని ఆపటం, బెదిరించటం ఇలా.
సరే ఈ మారుతి ఎంత మారుతైనా, వీడిదగ్గర మహా మంచి విద్య ఒకటి ఉంది. అది వేణువు ఊదటం/వాయించటం. పిల్లప్పటినుండే నేర్చుకుంటున్నాడులా ఉంది. అప్పట్లో సాయంత్రాలు ఎనిమిది నుండి తొమ్మిది వరకూ ఒక గంటపాటు విద్యుత్తు నిలిపివేసేవారు (తర్వాత తర్వాత అది పెరిగి ఒక గంట మాత్రమే ఇచ్చేవారనుకోండి - పిల్లాట) సర్కారువారు. అటు విద్యుత్తు పోవుట, మనవాడు మేడపైకి చేరుట, వేణువు వాయించుట. అదేదో సినిమాలోలాగా, అందరం సిద్ధంగా ఎండేవాళ్లం వాడి వేణుగానం వినటానికి.
వాడు ఎక్కువగా వాయించే పాట - సాగర సంగమం సినిమాలోని "మువ్వాగోపాలుడే మా ముద్దూ గోవిందుడే". అత్యంత అత్భుతంగా ఉండేది వాడి ప్రావీణ్యత. వాడు వాయించటం వల్లనో లేక ఆ పాటే అంత మధురమో (ఈ వాయిద్యంలోంచి జాలువారుట). సర్వం మరచి వినేవాళ్ళం. చెవులకు పట్టిన తుప్పు గట్రా దెబ్బకి వదిలేది.
అప్పుడప్పుడూ అనిపిస్తింటుంది, ఇలాంటి పాటలు రాయటం అనేది, రాసిన కవియొక్క పూర్వజన్మ సుకృతం అని. ఈ పాటని రాసింది శ్రీ వేటూరివారు అనుకుంటా.
రాగం - మోహన

వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే....
మా ముద్దూ గోవిందుడే
మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల
వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే....
మా ముద్దూ గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
మా ముద్దూ గోవిందుడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
ఆ హహహవేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దూ గోవిందుడే

ఎవ్వరికైనా ఎక్కడైనా వేణువుపై ఈ పాట దొరికినచో ఆ లింకును నాతో పంచుకొందురుగాకా!!

Apr 5, 2009

మా ఊళ్లో శ్రీ సీతారామ కళ్యాణమహోత్సవం

మా ఊరి కోవెలలో శ్రీ సీతారామ కళ్యాణమహోత్సవం ఏప్రిల్ నాలుగు, రెండువేలా తొమ్మిది, పొద్దున, పదకొండు గంటలకి మొదలుపెట్టాలని నిర్ణయించారు.
మరి మనం సకుటుంబ సపరివార సమేతంగా శ్రీ సీతారామ కళ్యాణం జరిపిద్దాం/పాల్గొందాం అని వేంచేసాం. పోయినేడాదంత వైభవంగా జరుగలేదీ సంవత్సరం. పోయినేడాది లగ్న పత్రిక చదివించారు, ఆడపెళ్ళివారో వైపు మగపెళ్ళివారో వైపు కూర్చుని తాంబూలాలు తీస్కోడం దగ్గర్నుండి అన్నీ వేడుకగా చేసారు. ఈ ఏడాది అవన్నీ లేవు. పోయినేడాది తలంబ్రాలప్పుడుకూడా కళ్యాణానికి విచ్చేసిన అందరినీ భాగస్వాములుగా చేసారు. ఈ ఏడాది అవేమీ లేవు. సరే కళ్యాణం! అమ్మవారినీ, అయ్యవారినీ చూసి తరించటం అనేది ముఖ్యం కాబట్టి, కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించి, రామనామం జపించి, కోవెలవారందజేసిన అన్నపానాదులను స్వీకరించి తరించాం.
కొన్ని ఫోటోలు -

Apr 3, 2009

శ్రీ రామనవమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామనవమి మనకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లోని భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా ఆంధ్రులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

ఉత్సవంలో విశేషాలు

* ప్రతీ ఆలయంలో పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
* బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
* ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
* దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
* భద్రాచలంలో భక్త రామదాసుచే కట్టింపబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు

ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో విజవవాడ కేంద్రం నుండి, శ్రీ ఉషశ్రీ ప్రత్యక్ష ప్రసారం ఉండేది. ఉషశ్రీ వ్యాఖ్యానం ఇక్కడ వినండి
రేడియోలో వింటూ కూడా తాళిబొట్టు అందరికీ చూపుతున్నారు వశిష్టులవారు అనంగనే లేచి నుంచుని దండం పెట్టుకునేవాళ్లని చాలామందినే చూసా.
శ్రీరామనవమి అంటే ముందు మనకి గుర్తుకి వచ్చేది - వీధి వీధినా తాటాకు పందిళ్లు. వాటిల్లో పానకం పంచేవాళ్లు. అలానే ప్రతీ పందిర్లో ఓ మైకు. లవకుశ పాటలు, సీతారాముల కళ్యాణం పాటలు.

సీతారాముల కళ్యాణం చూతమురారండి

శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంప జవ్వాజి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంప జవ్వాజి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

ఈ పాట లేకుండా ఏ పందిరీ ఉండదు.
దీని తర్వాత లవకుశ పాటలు -
రామ కధను వినరయ్యా - ఇహపర సుఖముల నొసగె సీతా
రామ కధను వినరయ్యా
అయోధ్య నగరనికి రాజు దశరధ
మహారాజు, ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య
సుమిత్ర, కైకేయి నోము ఫలములై వారికి
కలిగిరి కొమరులు నల్వురు - రామ - లక్ష్మణ - భరత - శతృఘ్నులు
గడియనేని రఘురాముని విదిచి గడుపలేదు ఆ భూజా
కౌశికయాగము కాచి రమ్మని పనిచెను నీరదశ్యాముని
రామ కధను వినరయ్యా - ఇహపర సుఖముల నొసగె సీతా
రామ కధను వినరయ్యా

తాటకి దునిమి జన్నముగాచి తపముల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున చనియెను మిధిలకు
దాశరధీ - మదనకోటి సుకుమారుని గనుగొని మిధిలకు
మిధిలయే మురిసినదీ - ధరణి మనలో విల్లు మెరిసిన
మోదము కన్నుల వెన్నెల విరిసినదీ హరుని విల్లు రఘు
నాధుడు చేకొనిఒ ఎక్కిట ఫెల ఫెళ విరిగినదీ - కళ కళ
సీతారాముల కన్నులు కరములు కలసినవీ
రామ కధను వినరయ్యా - ఇహపర సుఖముల నొసగె సీతా
రామ కధను వినరయ్యా

అయ్యాక ఈ పాట -
ఓ ఓ ఓ .....

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
.....
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథా
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా .....

శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని .....
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని ..... మంథర మాట విని

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని ..... కూలే భువి పైని

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోసమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి
వనవాస దీక్షకు సెలవు కోరి పినతల్లి పదాల వ్రాలి

ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా .....
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా
గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది
వీడకుమా మనలేనని వేడుకొన్నది
అడుగులబడి రాఘవా .....
అడుగులబడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది .....
అడలి అడలి కన్నీరై అరయుచున్నది .....

అలానే ఈ పాట
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా .....
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా .....
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

రాము గని ప్రేమ గొనె రావణు చెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయె మాయలు పన్ని

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

ఆ ఆ ఆ ..... నాథా ..... ఆ ..... రఘునాథా ..... ఆ ..... పాహి పాహి .....

పాహి అని అశోకవనిని శోకించే సీతా .....
పాహి అని అశోకవనిని శోకించే సీతా
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని .....
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా

దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి .....
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికె
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా .....
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత .....
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి సాధించెను మాట .....
కుతవాహుడు చల్లబడి సాధించెను మాట
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా .....
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా ..... వినుడోయమ్మా

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి

నాకనిపిస్తుంటుంది. ఈపాటల వల్ల ఈ సినిమాలు హిట్ అయ్యాయా అని.

ఇవిగాక రేడియోలో భక్త రామదాసు కీర్తనలు వచ్చేవి. అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇక్ష్వాకుకుల తిలక, పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో, సీతమ్మకు చేయిస్తీ, ఇవి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గొంతులో అత్భుతంగా ఉండేవి.
[అన్నమాచార్యులవారికి దక్కినంత ప్రాచుర్యం భక్త రామదాసుకి దక్కపోవటం లోటే. అవునులే అన్నమాచార్యులవారిని తి.తి.ది వారు తమ భుజస్కంధాలపై మోసి ప్రాచుర్యం చేసారు. సంగీతం నేర్పే వారికి, నేర్చుకునే పిల్లల తల్లితండ్రులకూ భక్త రామదాసు కీర్తనలు కూడా నేర్పిస్తుండండి. తప్పేమీ లేదు.]
చివరగా పై పాటలు ఇక్కడ వినొచ్చు.


చివరగా -
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే |
సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే ||

Apr 2, 2009

వినే వాడికి చెప్పేవాడు లోకువ

ఈరోజు పొద్దున మా బాబ్ గాడికి సూరిగాడి పుట్టినరోజు సిత్రాలు చూయిస్తుంటే, బాగున్నాయ్ ఐతే ఇది ఎప్పుడైనా చూసావా అని వెంటనే గూగుల్లో "cake fail" అనికొట్టి ఓ లింకు ఓపెన్ చేసి చూపించాడు.
దాని సారాంశం, ఒకామె కేకు ఆర్డర్ చేసింది. బాసు, కేకు మీద ఒలంపిక్ రింగ్స్ కావాలని చెప్పింది. ఆ మగానుబావుడు/మగానుబావురాలు ఓ అదేంపెద్ద బిషయం కాదని కేకు తయ్యారుజెసి అవతలనూకి పైన ఇలా ఒలంపిక్ రింగ్స్ని వేసి ఇచ్చింది.


అలానే ఇంకొకామే బాసూ కేకు మీద పుట్టినరోజు శుభాకాంక్షలు కింద బుల్లబ్బాయ్ అని చెప్తే వాడు ఇలా చేసిచ్చాడుఅప్పుడనిపించింది, పెపంచకంలో మనకన్నా తెలివైనోళ్లు సానా మందున్నారూ అని.....