నిన్న మా స్నేహితుడు టోనీతో మాట్లాడుతుంటే ఓ ఆసక్తికరమైన విషయం జెప్పాడు. అమెరిక ఆర్ధిక వ్యవస్థ మునిగిపోతున్నది కదా, ఇప్పుడు వచ్చే కొత్త రాష్ట్రపతి మొట్టమొదటి కదం ఏమైఉంటుంది అనే మాటల్లోవాడు ఇలా చెప్పుకొచ్చాడు:ప్రంపంచ ద్రవ్య నిధి (ఐ.యం.యఫ్) లాంటి సంస్థలకి అమెరికా లాంటి సంపన్నదేశాలు డబ్బునిచ్చి భారత్ లాంటి గెఱ్ఱె దేశాలకి ఇవ్వమని చెప్తుంటాయి. ఇక్కడ రహస్యం ఏంటాంటే
1. సంపన్న దేశాలకి మంచి వడ్డీ రేటు లభిస్తుంది
2. ఎగవేత ఉండదు. ఉంటే సాంక్షన్స్ పేర్యుమీద తొక్కేయొచ్చు.
3. ముఖ్యమైనది - లాబీయింగు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదే ట్విష్టు. అభివృధి పేరుతో మన లాంటి దేశాలకి సంపన్న దేశాలు "టెక్నాలజీ సొల్యూషన్స్" ని సరఫరా చేస్థాయ్. దీనివల్ల టెక్నాలజీ కాంట్రాక్ట్స్ ఈ సంపన్న దేశాల కంపెనీలకి వెళ్తాయ్. అంటే బుష్ బాబాయ్ ని నమ్ముకున్న బిజినెస్ లాబీ బాగా డబ్బు గడిస్తుంది.
4. ఎక్కువసార్లు మనకి ముఖ్యమైన, కావాల్సిన వాటిని పక్కనబెట్టి అవసరంలేని వాటిమీద ఎక్కువ ఖర్చు చేయించేలా చేస్తాయ్ ఈ "టెక్నాలజీ సొల్యూషన్స్". దీని వాల్ల మన బ్యూరోక్రాట్స్కి, రాజకీయ నాయకులకీ ధనవరద చేరుతుంది.
5.ఈ సంపన్న దేశాలకి మార్కెట్ ఏర్పడుతుంది. దాని వల్ల మనలాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థ వీళ్ల చేతిలోకి వస్తుంది లేదా వీళ్లు చెప్పినట్టు నడుచుకుంటుంది.
6. ఇలా రాజకీయ/అనుయాయులకి లభించిన ధన - వరద, నల్ల ధనమ్లా స్విస్ బ్యాంకులకి చేరి, అటునుంచి మళ్లీ సంపన్న దేశాలకి లోనులా వెళ్లి అధిక వడ్డీతో మళ్లీ మనకే వస్తుంటుంది.
.. .. ..ఇత్యాదివి
వీటివల్ల మనకి కొన్ని లాభాలు కూడా ఉంటాయ్:
1. ఉద్యోగావకాశాలు పెరుగుతాయ్
2. ఫండ్స్ ఫ్లో పెరుగుతుంది
3. పురాతన టెక్నాలజీ ని అప్గ్రేడ్ చేస్కునే అవకాశం లభిస్తుంది.
4. గ్లోబల్ మార్కెట్ - ప్రపంచ మార్కెట్ లోకి మన ఉత్పత్తుల్ని అమ్ముకోటానికి ఒక మార్గం దొరుకుతుంది (GATT/WTO లాంటి ఒప్పందాలద్వారా - వీటిల్లో కూడా సంపన్న దేశాలకి అణువైన ప్రతిపాదన్లే ఉంటాయ్ అది వేరే విషయం)
5. హ్యూమన్ క్యాపిటల్/రిసోర్సెస్ కి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయ్.
.. .. ..ఇత్యాదివి
ఏది ఏమైనా ఇలా సంపన్నదేశాలమీద ఆధారపడటం వల్ల అవి మునుగుతున్నప్పుడు మనం కూడా మునుగుతూ ఉంటాం.
Nov 11, 2008
Subscribe to:
Post Comments (Atom)
హన్న ఇంత కుట్ర జరుగుతోందా మనలాంటి అభివృధ్దిచెందిన దేశాలమీద.
ReplyDeletebagundi
ReplyDeleteమీరు తరచుగా ఇలాంటి సమాచారాత్మకమైన టపాలు రాస్తూ ఉండాలి సర్!
ReplyDeleteచాలా విలువైన విషయం చెప్పారు. టెక్నలాజికల్ సొల్యూషన్స్ వెనక కూడా ఒక మాయ ఉందన్నమాట.
ReplyDelete@యామజాల సుధాకర్: తెల్లదొర ఏమైనాజేస్తడు :)
ReplyDelete@రమ: థాంక్సులు
@సుజాత గారు: ఇలాంటివి రాస్తూనే ఉన్నా అండి. నా ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్ లో చూడండి. http://projectsforfuture.blogspot.com
Please pay a look and you are always welcome to make a comment.
Thanks again.
@సీతారాంరెడ్డి గారు: అంతామాయే. :) మనకోసం మనం మేల్కోకపోతే మనకి స్వాతంత్రంవచ్చి ఉపయోగంలేదు.