Oct 30, 2008

నా మరొక బ్లాగు

ప్రాజెక్టువర్క్స్
మన తరం నుంచి ముందితరానికి మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వాలి? లంచగొండి ప్రభుత్వాల, ప్రభుత్వోద్యోగుల ఆగడాలని అరికట్టి సమూలంగా లంచాన్ని రూపుమాపాలంటే? మన మౌళిక అవసరాల్ని మనమే నిర్మించుకోవాలంటే? మనకి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త రక్తం కావాలి. అలాంటి ఒక్కో ఆలోచన ఒక్కో కొత్త ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుల్ని ముందుకుతేవటమే నా ఈ బ్లాగు లక్ష్యం. యువతకి మార్గనిర్దేసమే ప్రాజెక్టుల లక్ష్యం
http://projectsforfuture.blogspot.com/
మీరూ నాలాగా ఆలోచిస్తున్నారా? మీకు నాలా మన సమాజం, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఇలా ఎందుకు ఉండకూడదూ అనిపిస్తున్నదా? మీకూ నా దేశంలో ప్రజలకి ఇవి ఎందుకులేవు అనిపిస్తున్నదా? మీరూ సమాజంలో మార్పు కోరుకుంటున్నారా? నాతో మీ ఆలోచనల్ని పంచుకోండి. నా ఈ-పోష్టు projectsforfuture@gmail.com

3 comments:

  1. మంచి ఆలోచన.
    కానీ, నా అనుభవం .. ఇలా లోతుగా ఆలోచిచాల్సిన విషయాల గురించి మనమో బ్లాగు తెరిచి, అమ్మలారా నాయనలారా మీ ఆలోచనలు పంచుకోండి అన్నంత మాత్రాన జనాలు పంచేసుకోరు. అటువంటి పార్టిసిపేషను రాబట్టడానికి, దువ్వాలి, బెల్లించాలి, బెదిరించాలి, ముఖ్యమంత్రి అవడానికి కావల్సినంత రాజకీయం చెయ్యాలి :)

    ReplyDelete
  2. @విజయమోహన్: ధన్యవాదం
    @అన్నగారు: మీ వ్యాఖ్య ఒక మంచి మందులాంటిది. మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. That gives lot of enthusiam and at the sametime critic view too.
    అవును మీరన్నట్టు, గుఱ్ఱాన్ని చెఱువుదాకా తీస్కెళ్లగలం కానీ నీళ్లుతాగించెలేము. అలానే మన గొఱ్ఱెలకి మరీ గొఱ్ఱెల్లా ఉండకండిరా అని చెప్పగలమేకాని మార్చలేము, దేనికంటే మార్పు అనేది virtual. ఎవ్వడికి ఆడు మారాలి.
    ధన్యవాదాలు గురుగారు

    ReplyDelete