Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Jun 28, 2020

పీవీ నరసింహారావు గారికి భారతరత్న

కీ|శే|| శ్రీ పి.వి.నరసింహారావు (28 జూన్ 1921 – 23 డిశెంబర్ 2004) 

పీవీ గారి గురించి రాసేంత గొప్పవాణ్ణి కాదు.

ఆయన గొప్పతనం ఇప్పటికే అనేకులు ప్రచురించారు. నేను కొత్తగా ఇన్‌వెన్‌ట్ చెయ్యటంలేదు.

కానీ పీవీ గారిలో ఓ నాటక కర్త ఉన్నాడనీ, ఆయన రాసిన నాటకం ఒకటి ఎప్పుడో ఎక్కడో విన్నట్లు నాకు జ్ఞాపకం.

ఎవరికైనా పీవీ గారి నాటకాలు కానీ నాటికలు కానీ దొరికితే పంచమని ప్రార్థన.

KCR గారు పీవీ గారి శతజయంతి ఉత్శవాలు జరిపించటం KCR ఔన్నత్యానికి నిదర్శనం.

KCR పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే నినదించటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.

ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ ఈవిషయాన్ని గట్టిగా ప్రస్తావించలేదు.

అయితే - ఈ ప్రస్తావనని కేవలం KCR మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏక కంఠంతో నినదిస్తే తప్పక నెరవేరుతుందని నా అభిప్రాయం.

పీవీని కేవలం తెలంగాణాకి పరిమితం చేయటం అర్థరహితం. 

దేశప్రధాని అందరికీ ప్రధాని అని గుర్తుంచుకోవాలి.
దేశప్రధానికి ప్రాంతీయతని అంటగట్టటం అవివేకం.

[తెలుగులకు ఉన్న దరిద్రం ఏవిటంటే - గిరిగీసుకుపోయి దాంట్లోనే మగ్గటం.
కూపస్తః మండూకః అని సామెత.
ఎందుకంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తెలుగు వాడు. ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వాలని కోరింది తమిళ్నాడు ప్రభుత్వం. అంధ్ర ప్రభుత్వం కాదు.
ఇలాంటివి అనేకం.]

Aug 9, 2011

తండ్రి జాడ కోసం కుమార్తెల వేడుకోలు

తండ్రి జాడ కోసం కుమార్తెల వేడుకోలు
తూప్రాన్‌, న్యూస్‌టుడే: 'ఎందుకు నాన్నా ఇలా చేశావు..? తెలంగాణ అందరికి కావాలె.. కానీ నువ్వు మాకు కావాలె.. ఎట్లాగైన నువ్వు రావాలి.. మరణ లేఖ రాశావని.. తిరిగి రానన్నావని వింటుంటే బాధేస్తుంది..' తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ప్రాణత్యాగం చేసుకుంటానని, ఇంటి నుంచి వెళ్లిపోయిన మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనింటి రమేశ్‌ కుమార్తెలు సోనీ (15), సంఘవి (12) వేడుకోలు ఇది. వచ్చే నెల 1వ తేదీలోగా తెలంగాణ ఇవ్వాలని కోరుతూ రమేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మేరకు నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి బస్టాండ్‌లో శనివారం లేఖ వదిలారు. ఆదివారం ఆ లేఖ పోలీసులకు అందింది. అదే రోజు రాత్రి తూప్రాన్‌లో గాలించినా వివరాలు లభ్యం కాలేదు. సోమవారం పాఠశాలలు తెరిచాక విషయం బయటకొచ్చింది. రమేశ్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. మెదక్‌ ఎంపీ విజయశాంతి ఫోన్లో మాట్లాడారు. రమేశ్‌ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి ఫోన్‌ చేశారు. కుమార్తెలతో మాట్లాడారు. ఎక్కడున్నారోఅడుగుతుండగానే కట్‌ చేశారు. సిగ్నల్స్‌ ఆధారంగా యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్నట్లు తెలిసి బంధువులు వెదికారు. దొరకలేదు.

తెలంగాణ రాష్ట్రం తెలంగాణ జనాలకు ఎమ్తో అవసరం. తెలంగాణ ఇవ్వాల్సిందే. తెలంగాణ రావాల్సిందే. కానీ తెలంగాణ రావాలంటే ఇదికాదు పోరాడే విధానం. ఇంకా ఎందరు తండ్రులను బలిస్తారో అటు ప్రభుత్వం వారూ ఇటు కేసీఆరు. పోరాడండి, ప్రాణాలు తీయకండి. ఆ బలిపశువుకి పెండ్లై ఉండచ్చు, పిల్లలుండచ్చు, నువ్వు వెళ్ళి ఓ పాలి చూసొచ్చి, విజయశాంతి ఫోన్లో మాట్టాడినంత మాత్రాన వీళ్ళ జీవితాలు తెల్లారవు. తెలంగాణ తెస్తాం లేకుంటే ప్రాణాలు ఇస్తాం అంటూ రెచ్చగొట్టటాన్ని అటు ప్రభుత్వం గానీ ఇటు చట్టసభలు గానీ న్యాయాస్థానాలు గానీ ఇంతవరకూ తప్పుబట్టకుండా జనాల మానాన ఆత్మహత్యలు చేస్కుంటుంటే నడీనడుమ మనకెందుకనీ, రెచ్చగొట్టేటోడు మన కేసీఆరేగా సాయంత్రం ఐతే అందరికీ  సుక్క పోపిస్తడు, మనోడేలే అని ఒదిలేయటం అచేతన వ్యవస్థకి సంకేతం, మన దురదృష్టం

చచ్చి సాధించేటిది ఏమీ లేదు

జై హింద్

Jul 22, 2011

అది హత్యా ఆత్మహత్యా ??

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన యాదిరెడ్డి తెలంగాణ కోరుతూ ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, కేకే, వీహెచ్‌, బలరాంనాయక్‌, వివేక్‌, రాజయ్య, మధుయాష్కీ, రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, సారయ్య, జూపల్లి, తెదేపా ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, భాజపా నేతలు నిర్మలా సీతారామన్‌, లక్ష్మణ్‌ తదితరులు గురువారం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.


ఇదేందిదీ? ఏపి భవన్లోకి అనుమతించలేదు. అప్పుడు మార్చురిలో పెట్టారు. అదేదో ముందే చేయొచ్చుగా? అసలు శవాన్ని మార్చురీలో ఉంచాలా ఏపిభవన్లో ఉంచాలా అనేది పోలీసులు పోస్టుమార్టం చేసినాక కదా?

ఎపి భవన్లో ఉంచితే మర్యాద ఇచ్చినట్టు అని ఓ పెద్ద మనిషి అంటా ఉన్నాడు. అంటే మార్చురిలో పెట్టే శావాలన్నిటికీ అవమానం చేసినట్టా?



అయ్యా! నాదొక ఫండమెంటల్ ప్రశ్న
సదరు యాదిరెడ్డి గారు ఆర్మహత్య చేస్కున్నాడని వార్తాపుత్రికలు రాసుకొస్తున్నాయి. అది ఎవరు ధృవీకరించారు?
అది హత్యా ఆత్మహత్యా అని ఎవరు పరిశోధన జరిపారు? రిపోర్టెక్కడా? ఎపి భవన్లో ఉన్న వ్యక్తి చెట్టుకి ఉరేస్కున్నాడంటే ఎలా వేస్కోగలిగాడు? తాడుని ఎలా తీస్కెళ్ళ గలిగాడు. కొమ్మకి ఎలా కట్టగలిగాడూ? చెట్టుపైకి ఎక్కి తాడు కట్టుకున్నాడా? లేక బెంచి వేస్కుని తాడు కట్టాడా? బెంచి వేస్కుని ఎక్కితే అక్కడ బెంచి దొరికిందా?

చెట్టు కొమ్మకి తాడు కట్టిన వ్యక్తి ఉరిని మెడకు ఎలా ధరించగలడూ? ఎలా ఉరిపోస్కోగలడూ? తాడు మెడకేస్కుని కిందకి దూకాడా? అలా దూకితే చెట్టు కదల్లేదు, ఎవరూ చూళ్ళేదా?

తెలంగాణ రావాల్సిందే!! దానికి ఇవి కాదు మార్గాలు.
అమాయకుల ప్రాణాలను హరించి, శవాలపై తెలంగాణ పోరాట ఏనుగలును నడిపించి ఇదే పోరాటం అంటానికి తె పోరాట కర్తలు ఛెంగీజ్ ఖాన్లు బాబరు అక్బర్లు కారు. ఇది వెయ్యేళ్ళక్రితం సమాజం కాదు. ఇకనైనా ప్రాణాలతో చెలగటాలను ఆపి, సక్రమమైన మార్గంలో పోరాటం చేస్కోండి. విలువైన ప్రాణాలను కాపాడండి. సామాన్యుల ఆస్థులను కాపాడండి. ప్రభుత్వ ఆస్థులను కాపాడండి.

జై హింద్
జై జన్మభూమి

[గమనిక - పిచ్చి పిచ్చి అసందర్భ కమెంట్లు ప్రచురింపబడవు]

Jul 21, 2011

దున్నపోతా!! సిగ్గులేదూ?

ఏపీ భవన్‌ ఘటనపై విచారం వ్యక్తంచేసిన హరీష్‌
న్యూఢిల్లీ : ఏపీ భవన్‌లో జరిగిన ఘటనపై తెరాస శాసనసభ్యుడు హరీష్‌రావు విచారం వ్యక్తం చేశారు. చందర్‌రావుకు క్షమాపణ చెప్పానని దీన్ని మరింత రాద్దాంతం చేయడం తగదని ఆయనన్నారు.

http://timesofindia.indiatimes.com/videos/news/Drama-at-AP-Bhavan-TRS-MLA-beats-up-official/videoshow/9311399.cms
ఇందులో వీడియోలో క్రిస్టల్ క్లియర్గా హరీష్ రావ్ ఓ వ్యక్తిని కొట్టడం చూపించారు. హరీష్ రావు ఒప్పుకున్నాడు.
మరో వ్యక్తిపై చేయి చేస్కోటం నాకు తెలిసైతే నేరం. ఇతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు?
మరింత రాద్ధంతం చేయడం తగదా?

దున్నపోతా!! సిగ్గులేదూ?

Jun 1, 2011

పోరాడాలె, నిజ్జం! పోరాడకపోతే మెత్కుదొర్కని దినాలు!

ఒక ప్రసంగం
ఒక మాట
ఒక పాట
ఒక బాట
మడుసుల్ని గుడ్డోళ్ళను సేస్తాయంటే
నే నమ్మలా
తెలంగాణా వచ్చుడుకీ
పంట బీడుపోటానికీ
మోకాలుకీ
బోడిగుండుకీ
యాడా సంబందం?
పోరాడాలె
నిజ్జం
పోరాడకపోతే
మెత్కుదొర్కని
దినాలు
ఆ మెత్కులు
దోసే రాజకీయ నాయకులు
రాజకీయ నాకొడ్కులు
నిన్ను కరెంటు బుగ్గకి
ఏల్లాడదీస్చాన్నారు
రాజకీయ బలిమితో
రాజకీయ సొర్థంతో
రాజకీయ కుట్రలతో
రాజకీయం కోసరం
ఆవేశపు
ప్రసంగం
మాట
పాట
బాట
రాపిస్చన్నారు
లెగు లెగు, పోరాడు
సొర్థపు రాజకీయ నాకొడుకుని
సంపేసేయ్
నీలోని
సమాజామ్లోని
మడిసిలోని
సోర్థపు రాజకీయనాయకున్ని
సంపేసేయ్
వెయ్యి తెలంగాణాలు ఒస్తై
వెయ్యి భారతదేశాలు ఒస్తై
అవే ఒస్తై
ఏ తమ్ముళ్ళానూ బలిచ్చే పనిలా
ఏ అన్నలనూ సంపేసే పనిలా
ఏ బస్సులనూ తగలనూకే పనిలా
ఏ జీవితాలనూ కాలరాచే పనిలా
లెగు లెగు.......

Apr 1, 2011

ఎవడబ్బ సొమ్మని కూలస్తారు

ఎవడబ్బ సొమ్మని కూలస్తారు
మా జాతి విగ్రహాలు
ఎవడబ్బ సొమ్మని కూలుస్తారు
మా జాతి సౌధాలు
మా కాయకష్టపు పెట్టుబడులు
ఎవడబ్బ సొమ్మని కూల్సుస్తారు
ప్రజల డబ్బుతో కట్టిన సౌధాలను
ఎవడబ్బ సొమ్మని కూలస్తారు
లేచిన గడ్డపారలను
ప్రజలసొమ్ము తినే
రాజకీయ రాక్షసుల గుండెల్లో
దింపలేని కుజాతి మీది
రాజకీయ నాయకులను
నిలదీయలేని దైన్యత్వం మీది
అవినీతిమీద పోరాటం చేయలేని
పిరికితనం మీది
కొత్త రాజ్యాన్ని నిర్మించాలంటే
ఉన్నవాట్ని కూలగొట్టుడు
ఆనాడు చెల్లిందేమో
ఉన్నవాటిను కూలగొట్టి
ఉన్న రాజ్యాలను మట్టుపెట్టి
అణువణువూ కాజేసి
ప్రాణాలు తోడేసి
మడిసి దట్టాలపై
ఎముకల బజారులో
కట్టిన తురుష్క సామ్రాజ్యపు
దుర్గంధం ఇంకా కొడుతోంది నీ ఆలోచనలో
నీ దిగజారిపోయిన ఆలోచనలో
నీ మతిలేని ఛాందసవాదంలో
పసలేని నీ కవితా ఇదిలింపులో
లేపిన పలుగులు నీ గుండెల్లో దింపే రోజు
అవి నీ గుండెల్లో దిగేరోజు
ఎంతో దూరంలో లేదు
ఎత్తిన పలుగుకు
గమ్యం ఒక్కటే తెలుసు
చేపకన్ను ఒక్కటే అగుపిచ్చి
ఆ కన్నులోన పలుగు నాటినరోజున
కన్నులోనుంచి గుండెలోకి దిగబడే
ఒకే పోటు............................
ఒకే పోటు వేసే సమయం వచ్చింది
వేసే చేతులు
వెయ్యగలిగే గుండెలు
గుండెల్లో మంటలు
రగుల్కొన్నాయ్
మంటలు రగుల్కొన్నాయ్
ఖపడ్దార్ కొడకా
రగతం మరుగుతా ఉది
గుండెలు ఎగసి పడతా ఉన్నాయ్
పలుగులు సేతిలో ఉన్నాయ్
ఖపడ్దార్

Mar 4, 2011

బ్లాగ్ సహాయనిరాకరణ

తెలంగాణ గావాల అని గోలెబెట్టే తెలంగాణ వాదులు, దస్కం ఇరజిమ్మి మూకల్నెగేసి రోడ్లెమ్మట తోలి రాష్ట్ర రాజధాన్నే నిర్భంధించి, అదిరించి, బెదిరించి, *సహాయ నిరాకరణ* అని పేరెట్టి ప్రజానీకం నోట్లో మట్టిపెడ్డలు కొడతన్నారు, రోడ్లెమ్మట నడిచేటోళ్ళ మీద పేడముద్దలు కొడతా ఉన్నారు. ఇట్టా గావాల్సిందే. కానీ, హైదరబాదులో పెట్టుబళ్ళు పెట్టిన తెలంగాణేతరుల ఇష్యం తేలకుండా సహాయనిరాకరణ జేస్తే ఏమౌద్దీ? అని ఎవురికైనా అనుమానం రావొచ్చు. ఏమౌద్దీ? మర్సిపో సిన్నా అని జెప్పు అంటాడు ముక్కోడు. ఆడిదేం బోయింది.
ఇంక పై సంత గాళ్ళ పక్కన డప్పుగొట్టుకుంటా తిరిగే సెంచా గాళ్ళకి ఇదేగా సందు. తెగ వాయిస్తా ఉన్నారు ఢమాఢమా అని. అందులో ఓ మోత *తెలుగు సాహిత్య సహాయ నిరాకరణ*.
ఓర్నీయమ్మ అట్టా సేయమాకండ్రా, ఓఐపు ముక్కోడు పెట్టిన మంటతో నోట్టోకి రెండేళ్ళెల్లటమే కష్టంగుంటే, మూలిగే నక్కమీన తాటికాయ పడ్డట్టు, *సాహిత్య సహాయ నిరాకరణా* సేస్తే మా పొట్టలు నిండాల్నా వద్దా?
మడుసుల పైనుండి ముక్కోళ్ళు
కిందనుండి ఇట్టా సాహిత్య రంగపోళ్ళు ఎనకమాలనుండి మిగతా కుంకలు దాడి సేస్తాఉంటే జీవితాలు ఎళ్ళేదెట్టా? బతుకులు తెల్లారేదెట్టా?
సందట్లో సడేమియా నేనూ ఓ కేక పెడతాఉన్నా, ఓ రంకె ఏస్తాఉన్నా.
ఇట్టా అగుపించిన ప్రతీఓడు నిరాకరణ అంటాఉంటే తెరమీనకి కొన్ని నిరాకరణల్ని లాక్కొస్తాఉన్నా.
౧. *లంచం* (అ)*సహాయ* నిరాకరణ -
ఇంక ఎప్పుడైనా, ఎవుడన్నా లంచం అడిగితే నిరాకరణ సేయ్యాల. లంచం అడిగోఓళ్ళన్నా కనీసం ముక్కోణ్ణి సూసి లంచం అందుకునేంటందుకు నిరాకరించాల.
౨. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నంత కాలం నిరాకరణ సేసే ఓళ్ళు, యావత్ రాష్ట్ర ప్రజల పన్నుతో ఇచ్చే జీతాలు నిరాకరించాల. అందాకెందుకు నిరాకరణ సేసేవోళ్ళు అస్సలు ఉగ్యోగాలకు రాజీనామాలిచ్చి నిరాకరణ సెయ్యాల
౩. నా తరఫున, బ్లాగు సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నా. ఎట్టా?
మరో బ్లాగు సదవను
యాడా వ్యాఖ్య బెట్టను
మాలిక కూడలి మావిడితాండ్ర హారం ఏట్నీ తెరవను
తలో సెయ్యి కాలు బ్లాగు సహాయ నిరాకరణలో ఎయ్యాలని గుంపులు గుంపులుగా పాలు కొనాలనీ పెరుగట్టుకెళ్ళాలనీ కేక రంకె అరుపు అరుస్తా ఉన్నా.

జై పోరాటం
జై జై పోరాటం

గమనిక - హేటుగాళ్ళా కామెంట్లు నిర్దాచ్చిన్యంగా నరికేయబదతై. సహాయ నిరాకరణ. అరదం సేస్కోవాల. కావాలంటే ఎవురి బ్లాగులో ఆళ్ళు హేటు టపాలు కుమ్ముకోండహే. సహాయ నిరాకరణ, గురుతుకు బెట్టుకోవాల.

Feb 24, 2011

బంద్ సంపూర్ణం

23pan18a.jpg
వరంగల్‌ జిల్లాలో మణుగూరు ప్యాసింజర్‌ రైలుకు ఆందోళనకారులు నిప్పంటించటంతో ఒక బోగి పూర్తిగా, రెండు పాక్షికంగా కాలిపోయాయి.

Integral Coach Factory -
Production began in a modest manner in 1955 with the manufacture of seven third class coach shells. Today the coach factory produces more than 1600 coaches of more than 170 varieties. In the year 2007-08, ICF created a milestone by producing 1291 railway passenger coaches, coaches per annum. It employs about 13,000 persons. Nearly 1336 coaches are manufactured every year, and 6 coaches are manufactured per day.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పదమూడువేల మంది పనిచేస్తూ సంవత్సరానికి పదమూడొందల బోగీలను‌లను తయ్యారు చేస్తారు ఉజ్జాయింపుగా. ఎంత శ్రమ సమయం సదుపాయాలు వనరులు అవసరం అవుతాయీ బోగీలను తయ్యారు చేయాలంటే? అలాంటిది ఒక్క అగ్గిపుల్లతో భగ్గున బూడిద చేస్తే బంద్ సంపూర్ణమైనట్లా?
ఆపండయ్యా మీగోల. ఇప్పటికి కొన్ని వందల బస్సులు ధ్వంసం. రైళ్ళు ధ్వంసం, పట్టాలు ధ్వంసం, చదువులు ధ్వంసం, ప్రాణాలు ధ్వంసం.
రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇతర పార్టీలకు నా అభ్యర్థన. పొలిటికల్ ప్రాసెస్ తో తేల్చుకోవాల్సిన సమస్యలు ఇవి. తొందరగా తేల్చండి. ఎంతకాలం నానుస్తారు? మరెంత నష్టం మానెత్తిన రుద్దుతారూ? మరెన్ని విద్యా సంవత్సరాలు నాశనం చేస్తారూ? మరెందరి లేత జీవితాలను బలితీస్కుంటరూ?

Jul 31, 2010

కేసీఆర్ గెలుపా లేక మిగతా పార్టీల ఓటమా?

తెలంగాణ అమరవీరులకే ఈ విజయం అంకితం: కేసీఆర్‌
హైదరాబాద్‌: ఉప ఎన్నికల విజయం తెలంగాణ అమరవీరులకే అంకితమని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఈ సాయంత్రం ఆయన ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ ఫలితాలు ప్రతిబింబించాయని తెలిపారు. తెలంగాణ సాధనకు ఈ విజయం ఓ మెట్టని అన్నారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ వచ్చే దాకా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్‌, తెదేపాలకు ఈ విజయం చెంపపెట్టని అన్నారు. తెరాస ఓటమి కోసం రూ.200 కోట్లు ఖర్చుపెట్టారని విమర్మించారు. లెక్కింపు జరుగుతున్న స్థానాల్లోనూ విజయం తమదేనని చెప్పారు. కేంద్రం ఈ ఎన్నికలను ఓ రెఫరెండంగా తీసుకోవాలని... శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన బలిదానాలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయని విమర్శించారు.



సందట్లో సడేమియా -

ఓటమికి ఆంధ్రా కాంగ్రెస్‌ వాళ్లదే బాధ్యత: కాకా
హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో ఓటమికి ఆంధ్రా కాంగ్రెస్‌ వాళ్లదే బాధ్యతని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటమిపై డీఎస్సే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.


కాకా ఆపునీ బాకా

వార్తా పుత్రికలను పక్కనబెడితే -
నా దృష్టిలో పై ఫలితాల విశ్లేషణ ఇలా ఉంది :
ఇది కేసీఆర్ గెలుపు కాదు, తెదేపా ఓటమి. అదేందదీ అనుకుంటున్నారా? ఎందుకంటే, కాంగ్రేస్ చరిత్ర రా.శే.రె తోనే ముగిసిపోయింది. అలా ముగిసే సమయంలో తెదేపా జనాల నాడిని తనవైపుకి తిప్పుకోలేక పోయింది. ఎందుకంటే అత్యధిక మెజారిటీతో రెండోస్థానంలో నిల్చున్నది తేదేపానే కదా. బాబు బాబ్లి గోలతో పొయ్యిరాజేసి తెలంగాణ వంటవండుకుందాం అనుకున్యాడు. కానీ అంత పొలిటికల్ ముమెంటం సాధించినట్టు నాకైతే కనపళ్యా. ఈ వంటకి ఎలచ్చన్ల మసాలా నూరదాం అనుకున్యాడు. పాపం ఏమాత్రం కుదరకపోగా మొదటికే మోసం వచ్చింది. తెరాస గెలిచింది.
కొన్ని వేల ప్రజాసమస్యలు ముందుంచుకుని, కొన్ని కోట్ల ఖర్చుని వృధాగా పెట్టించిన తెరాసా పై ఎవ్వరూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) ఫైల్ చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇది రెండోసారి ఇలా జరగటం. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే *కాంగ్రెస్‌, తెదేపాలకు ఈ విజయం చెంపపెట్టని అన్నారు. తెరాస ఓటమి కోసం రూ.200 కోట్లు ఖర్చుపెట్టారని విమర్మించారు*. మరి కేసీఆర్ ఎంత ఖర్చుచేసి ఉంటాడో గెల్వటానికి అని నే అడగను. మొత్తంమీద నల్లధనం ఎంత ఖర్చై ఉండిఉండవచ్చో కూడా నాకనవసరం. ఆ డబ్బుని తెలంగాణా సోకాల్డ్ అభివృద్ధికి వెచ్చించి ఉంటేనో అని కూడా నే అడగా.
ఇక ఇప్పుడేంటీ?
కాంగ్రేస్ కథ ముగింపు దశకి వచ్చింది అని నాకనిపిస్తోంది.
జగన్ తెలివితేటలు తెల్లారినట్లే ఉన్నాయన్నట్టుంది.
రేపు జగన్ కాంగ్రేస్ ని చీల్చితే కాంగ్రేస్ కన్నా జగన్ కే నష్టం అని నా అభిప్రాయం.
తెదేపా మరోసారి ఆత్మపరిశీలన చేస్తే బెటర్. ఇకనైనా వన్ మ్యాన్ షో షాడో నుండి బయటకొస్తే తేదేపాకి కనీసం ఉనికైన నిలుస్తుంది. ఎటూ తెలంగాణా వస్తుంది, ఇక ఆంధ్రాలో సత్తా చూపుదాం అన్నట్టుంది బాబు వైఖరి. కాంగ్రేస్ కి ప్రత్యమ్నాయం ఏ పార్టీ? అనేది పెద్ద ప్రశ్నే అని నా అభిప్రాయం. ఇటు చిరంజీవి పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాడు. కాంగ్రేస్ చిరంజీవి కలిస్తే కొంచెం ఏమన్నా ఉపయోగ పడవచ్చు రెండుపార్టీలకి.

చివరగా రెండు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.
కేసీఆర్ గెలుపు తెలంగాణాకి రెఫరెండమా?
కాంగ్రేస్ కి ప్రత్యామ్నాయం ఏంటి?

Feb 21, 2010

ఏంటీ ఈ అపోహలు? ఎవరు నేర్పుతున్నారిలా?



ఎవరు నేర్పుతున్నారిలా? రాజకీయ స్వార్ధాల కోసం ఇంతలా దిగజారిపోతున్నారా రాజకీయ నాయకులు?

*ఆత్మ త్యాగాలు* అని ఒక అందమైన అర్ధంకాని పదాన్ని అమాయకప్రజలపై ఉసికొల్పి, వేడెక్కించి, ముందుకునెట్టి పబ్బంగడుపుకునే ఈ ఎదవ రాజకీయ నాయకులు, దీని గురించికూడా మాట్టాడితే ఎంతబాగుంటుందీ -



పోయిన ప్రతీ ప్రాణం,
తగలబెట్టే ప్రతీ బస్సు,
నిప్పట్టించే ప్రతీ వస్తువూ,
గడచిపోయిన ప్రతీ నిమిషం,
కూలగొట్టిన ప్రతీ ప్రభుత్వ కార్యాలయ గోడా
- ప్రతీదీ విలువైందే.

మన తెలివితేటల్నీ, ఆవేశాల్నీ, ఆందోళనల్నీ, ప్రాణాల్నీ, ఆలోచనల్నీ, కన్స్ట్రక్టివ్ ప్రగతి కోసం వాడాలని కోరుకుంటా

Jan 19, 2010

మరో కేసీఆర్నౌతా - అమర్ సింగ్

మరో కేసీఆర్నౌతా - అమర్ సింగ్!!!
:):)
అబె గధె! ఫిర్ గధ కైకు బన్నాహై?
ఐనా, కేసీఅర్ *ఒకే ఒక్కడు*. మేం ఒప్పుకోం. సెరిత్రలో ఒకే కేసీఆర్ ఉండాలే

Jan 13, 2010

ఆంధ్రా వస్తు భహిష్కరణ -

ఆంధ్రా వస్తు భహిష్కరణ -
పొద్దున్నే దందధావనం దేంతో?
కోల్గేట్ పామోలివ్
స్నానం ఏ సబ్బుతోజేస్తా?
డోవ్
తలకి నీళ్ళు ఏ షాంపూతో పోస్కుంటా?
హెడ్ అండ్ షోల్డర్స్
బట్టలు ఏంకట్టుకుంటా?
లోన జాకి
సొక్కా వ్యాన్ హ్యూసన్
పాయింటు అల్లెన్ సాలి
బూట్లేమేస్కుంటా?
నైకి, లేక రీబాక్
ఏబండి నడుపుతా?
హాండా, లేక సుజుకి
ఏ కార్ నడుపుతా?
సుజుకి, లేక హాండా లేక ఫోర్డ్, లేక మిట్సిబిషి
ఏందమ్ముకొడతా?
ఎచ్.డి విల్స్
ఏంకళ్ళజోడు పెడతా?
రేబాన్

ఇప్పుడేందీ గోల, ఆంధ్రా వస్తు బహిష్కరణ
నాకో విషయం అర్ధం కావట్లా ... ఆంధ్రలో కూడా ఇదేకదా తంతు ...
కొత్తగా ఈ బహిష్కరించుడేందో!!! దేన్ని బహిష్కరించాల్నో సంఝైతల్లే....

Dec 2, 2009

తెలంగాణా పోరగాడా!! సిగ్గుసిగ్గు!!!!

అయ్యా కేసీఆర్ - ఖుద్ మర్నాహై తో మరో!! దూస్రోంకో కైకూ వాట్ లగాతేహో...
ఎదవనాకొడక సస్తే సావు. బస్సుల్ని, జనాల్ని దేనికి సంపటం - అచ్చతెలుగులో సెప్పాల్సొస్తె ఇదీ కత.

ప్రతీ ఎదవకీ బస్సులంటే, రోడ్డెంమ్మటెళ్ళే జనాలంటే, జబ్బుజేసిన ముసలిముతకంటే, నోరులేని మద్దెతరగతి మనుషుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. థూ!!

తెలంగాణా రాష్ట్రం వస్తే ఏంపీకుతారు, అరవైఏళ్ళ దేశాన్నే ఏంపీకలేని ఈ రాజకీయనాయకులు. ధూ!!!

సంపండి, కొట్టండి. ఇదీ ఈనాటి విద్యార్ధుల చరిత్ర. ఇదీ ఈనాటి యువత ఘనత. వీరులారా! కొనసాగించండి మీ లూటీలను, అల్లల్లాడించండి సామాన్య ప్రజలను, కొనసాగించండి మీ అరవీర భయంకర ఆవేశాలను సామాన్యులపై.
అడ్డేముంది, పోయేదేముంది!!!

బస్సులు, బళ్ళు, ఆశుపత్రులు, డిపోలు, పొట్టి శ్రీరాములు విగ్రహాలు, పిల్లలు, ఆటోలు ఈటిమీద చూపాలి ప్రతాపం. అందుకేగా మనకి ఈ చదువులు. విద్య నేర్పింది అదేగా.

గ్రేటర్ ఎన్నికల్లో నుంచోటానికి ధైర్యంలేదు. పోయిన ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయ, నేనైతే దీన్ని దేశద్రోహం అనే అంటా. మరి మీరేమంటారూ?
కొసమెరుపు - కెసీఆర్ ఆరోగ్యమ్ క్షీణించింది. సరే, దానికి ఆంధ్రావాళ్ళు డౌన్ డౌన్!! కెవ్వు కేక. మెదడు మోకాల్లోకి కాదు అరికాల్లోకి దిగినట్టుంది. ఇంక వీళ్ళకి ప్రత్యేక రాష్ట్రం గావాల్నంట. కెవ్వుకేక.

Oct 8, 2009

పిన్నీ!!!

నేను నిఖార్సైన తెలుగు బిడ్డని.
నేను వోల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తరపున మాట్టాడుతున్నా.
తెలుగు తల్లి అందరు తెలుగోళ్ళకు తల్లి.
[మరి తెలంగాణా తల్లి?]
౪%@#%@&‌%&‌‌
తెలంగాణా తల్లి కాదు!
[మరి?]
పిన్ని

- కెసిఆర్.