Oct 22, 2008

చలి మొదలైంది

రోజులు గిర్రున తిరుగుతున్నై.
ఇక మేమూ రగ్గులు దులిపాం. ఇక కరెంటు బిల్లు పేల్తుంది, మూలిగే నక్కమీద తాటికాయ పడట్టు.
కారుకి కూడా ఎక్కువ దాహం వేస్తుంది చలికాలంలో. జనాలకి చిరాకులు పెరుగుతయి. పిల్లలు కొంచెం క్రాంకీ గా ఉంటుంటారు. చిన్నపిల్లల్లతో మరీ కష్టం. దయ్యాల పండక్కి పోయినేడాది మావోడు ట్రిక్ ట్రీటు అని మా సందంతా తిరిగొచ్చెప్పటికి న్యుమోనియా వచ్చింది. సచ్చాం. ఈఏడాది ఏంజేస్తడో చూడాలి, ఇక్కడ అప్పుడే జనాలు దయ్యాల్ని, భూతాల్ని, గుమ్మడికాయల్ని గుమ్మాలకి తగిలించేసారు. కొన్ని గుమ్మడి కాయలు కుళ్లికూడా పోయినయి. దయ్యాలపండగేందో నాకర్ధంగాలా. సరే నల్గురితో పాటు నారాయణ.
నిన్న పొద్దున కార్ అద్దాలమీద సీజను మొట్టమొదటిసారి ఐసు లేయరు ఫార్మ్ అయింది. ఆకులు రాలుతున్నాయి.
కాలాలు మారుతున్నా నాలో ఎటువంటి మార్పు లేదు. పని, ఇల్లు, పిల్ల, పీచు, పని, ఇల్లు, పిల్ల, పీచు....చలిప్రదేశమ్లో ఆహారం పాడైపోదు, అట్టానే మనిషిక్కూడా ఆ స్టేట్ వచ్చేస్తుందేమో.
పోయినేడాది స్నో బానే పడింది. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతోందో. సగటు స్నోఫాల్ 64.1 ఇంచులు.
2006-2007 చలికాలమ్లో నా జీవితమ్లో ఒక మోస్తరి నుంచి కొంచెం భయంగొల్పే రెండవ మంచుతుఫాను చూసా. 2003-04 లో అమెరికా వచ్చినప్పుడు మొట్టమొదటి అనుభవం. కాని అప్పుడు నేను డ్రైవింగు గట్రా చెయ్యలేదు.
కానిప్పుడు కుటుంబం, గట్ర, నా సొంత కారు, నేనే డ్రైవరు. తుఫాను మొదలైంది. మరి ఆఫీసుకి ఎళ్లటానికిబయల్దేరా. నెమ్మదిగా నెట్టుకుంట నెట్టుకుంట చేరా మొత్తానికి. ఇక మద్దానం 4 అలా బయల్దేరా తిరిగి ఇంటికి. దారిలో ఒక షవల్ కొన్నా అనుకోకుండా. మా ఇల్లు ఇంకో మైలు దూరమనంగా మంచులో చుక్కికున్నా. పడిన స్నో ని ప్లో చేసే బళ్ళు ఉంటయి. అవి ఒక పారలాంటి ఇనప పళ్లెంతో పడిన మంచుని పక్కకి నెట్టుకుంటూ పోతుంటయి. ఆటి ఎనకమాల పెద్ద పెద్ద ట్రక్కులు ఉప్పు ఏస్కుంటా/జల్లుకుంటా ఎళుతుంటయి. పక్కకి నెట్టి నెట్టి వారెమ్మటి స్నో పేరుకుపొతుటుంది. నాకార్ కొంచెం స్కిడ్ అయి దానిమీదకెక్కింది. ఇంకేముంది, ఇరుక్కుపోయింది నా కారు, కారు ఇరుసు కింద స్నో. నాది నిస్సాన్ ఆల్టిమ, సెడన్. సెడాన్ ఎత్తు 13 అంగుళాలు ఉంటుందేమో, మళ్లా అది ముంగటి గాన్ల డ్రైవు (ఫ్రంట్ వీల్ డ్రైవ్). టైర్లు కింద ఆనట్లా. గ్యాసు (యాక్సిలరేటరు ని ఇక్కడ గ్యాసు అనికూడా అంటారు) ఎంత తొక్కినా టైర్లు తిరుగుతున్నయి కానీ కారు అట్టనే ఉండిపోయిది. కార్లోంచి కిందకి దిగటమే కష్టం ఐపోయింది. డ్రైవ్ వే వైపు ప్లో వాన్లు ట్రక్కులు. నెమ్మదిగా దిగి రెండో వైపు వెల్తే గజ్జల్దాకాదిగిపోయినై కాళ్ళు స్నోలోకి. ఎట్టనో లోపల థర్మల్ ఏస్కున్న కాబట్టి బతికిపోయ్యా. మొత్తానికి ఒక గంటసేపు కుస్తీపడి ఆ పక్కనున్న ఇంటి వాళ్ల దెగ్గర ఒక పెద్ద షవల్ దెచ్చి, ఇరుసు కింద స్నో మొత్తాన్ని తీసి బయటపడేసరికి కాళ్లు దిబ్బలెక్కి, జివ్వు జివ్వు మని లాగటం మొదలెట్టినై. ఎట్టనో కుస్తీపడి ఇంటికిజేరి వెంటనే వేడి వేడి నీళ్లల్లో కాళ్లెట్టుకుని ఒక కప్పు వేడి వేడి కాపీ పీకితేగానీ బండి మళ్లీ లైన్లోకి రాలా. ఇదిచదివినోళ్లు అనొచ్చు, అంత కక్కుర్తి దేనికి, ఆయాల ఇంటిపట్టునే ఉండొచ్చుకదా అని. సీత కష్టాలు పీతకష్టలు నాయనా. సర్వర్ల మీద పని, ఆయాల తప్పకుండా ఎళ్లి తీరాల్సిన రోజు, ఎందుకంటే ఆ ముందురోజు రేత్తిరి మైంటెనెన్సు కిటికీ ఉండింది.
ఆయాలో మర్రోజో నా కారు ఇట్టా ఉంది.
From snow

From snow

స్నోఫాల్ రికార్డుల పట్టిక :
Season    Albany Binghamton Buffalo Rochester Syracuse City With Most Snow
2000-01 77.1     112.6          158.7   133.0       191.9      Syracuse
2001-02 47.4     63.5            132.4   58.1         59.4        Buffalo
2002-03 105.4   117.6          111.3   135.2       153.2      Syracuse
2003-04 65.1     106.4          100.9   125.6       181.3      Syracuse
2004-05 75.9     106.5          109.1   113.6       136.2      Syracuse
2005-06 30.2     74.9            78.2     73.9         124.6      Syracuse
2006-07 45.9     78.6            88.9     107.2       140.2      Syracuse
2007-08 61.1     70.7            103.8   106.0       109.1      Syracuse
(Snow Fall in inches)

8 comments:

 1. నిన్ననే మేము లెదర్ జాకెట్లు, గ్లోవ్స్ గట్రా అన్నీ తీసి రెడీ గా పెట్టుకున్నాము. రాబోయే ఆర్నెల్లు ఇక పండగే పండగ.

  ReplyDelete
 2. ఈ సారి మీ బుడ్డోన్ని సందులెంబడి తిప్పక,శుభ్రంగా మాల్‌కి తీసికెళ్ళండి ఓ మంచి కాస్ట్యూం తొడిగి. పిల్లోడి సంచీ నిండుతుంది, మీకూ ఈ చలికాలం నమలడానికి పంటి కిందకి బోళ్డు చాక్లేట్లు :)

  పాపాయి ఉందిగా బుడ్డోడూ,మీరూ ఫ్లూ షాట్లు కూడా వేయించేస్కోండి మరి. Happy winter!

  ReplyDelete
 3. @ఉమాశంకర్: Happy Winter.. Have ఫన్
  @teresa: True. But know what, we have 2 kids in the next door, another one in the back, two more in the next block. desiguys.co.in. Upon seeing 'em this guy ఊగిపోవటమే..నేను ఎల్తా నేనూ ఎల్తా, పోనివ్వూ..గోల గోల.
  కిమ్మనకుండా పాపాయితో ఆడుకోటమే ఈసారికి...:):)

  ReplyDelete
 4. మీరు మిడ్వెస్ట్ లో వుంటే మీకు వింటర్ స్వాగతం పలుకుతోంది - అప్పుడే ఇక్కడ చలి బాగా మొదలయ్యింది. నీను వున్న స్టేట్ గాలి కి బాగా పేరు పొందినది. (ఇల్లినోఇస్). వున్న చలి కన్నా వీచే గాలి చాలా ప్రమాదము.

  ReplyDelete
 5. మేము అప్స్టేట్ న్యూయార్క్ లో ఉంటాం. ఈరోజు చాలా చలిగా ఉంది ఇక్కడ. బఫ్ఫెల్లో మాకు ౩౦౦ మైళ్లు.

  ReplyDelete
 6. హా..హా..హా..హా..హా (పై వారి (up north లొ ఉండే వారి) పరిస్థితి చూసి ఒక విలన్ నవ్వు)...తర్వాత...[హేరా ఫేరీ లో పరేశ్ రావల్ "జై మహారాష్ట్ర" అన్నట్లు]...జై టెక్సస్/జై డాలస్".

  ఉమాశంకర్ గారూ, మీ కామెంట్ "పండగే పండగ" అంటే గుర్తొచ్చింది. మిన్నెసోటాలొ ఉన్న మా కజిన్ వింటర్లో మాతో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా "ఓ, ఈరోజు మీకు 40 డిగ్రీస్ ఉందా..అయితే మీకు పండగే పండగ" అంటుంటారు. (వాళ్ళకి అప్పుడు -40 wind chill ఉంటుంది).

  ReplyDelete
 7. @k: Yo (కుళ్లుతో, అసూయతో అరిచా)!! నవ్విన నాపచేనే పండుతుంది. తొమ్మిది నెలలు (సెప్టెంబరు - మే)ఆగామంటే మళ్లీ ఎండవస్తుంది మాకు (:(:().. హు!!!

  ReplyDelete
 8. @K: అలా ఐదడుగుల మందాన పరుచుకున్న మంచుని కిటికీ లోంచి చూస్తె ఎంత బాగుంటుందంటారు?? (ofcourse బయటికెళ్ళనంత వరకు).you are misssing that nice view

  ReplyDelete