Oct 31, 2008

ప్రజలు నిజంగానే ప్రత్యేక తెలంగాణాని కోరుకుంటున్నారా?

చిరంజీవి తెలంగాణ పై వ్యాఖ్య. ప్రజలే వెయ్యి గొంతుకలతో అరిస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లాలి.

ప్రజలు నిజంగానే ప్రత్యేక తెలంగాణాని కోరుకుంటున్నారా?
ఒక ప్రత్యేక రాష్ట్రం జనజీవితాల్ని ఎలా మార్స్తుంది? ఆనాడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎవరుకోరుకున్నారు? గోవిందపురంలో ఒక ఎకరం పొలం సేద్యం చేస్కునే వానికి ఇవి అన్నీ నిజంగనే తెలుస్థయా?

కాంగ్రేసును బొందపెడతాం: కె.సి.ఆర్
పిచ్చివాగుడు ఆపకపోతే నీ గోరీ నీచేతే కట్టిస్తాం: జనం
Posted by భాస్కర్ రామరాజు at 4:08 AM
4 comments:
nice said...
ఈయన చెప్పే జనం ఆంధ్రా జనం మాత్రమే. తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. కాంగ్రేస్ ను బొందపెట్టాలంటే ఈ ఆంధ్రా బిడ్డకెందుకో నొప్పి..!! కలిసి ఉండాలనే పాకులాట ఎందుకో...!!

September 23, 2008 7:00:00 AM IST
భాస్కర్ రామరాజు said...
చిచ్చా!! క్యా బోలా!! మంచిగుంది నీ తెలివి. కెసిఆర్ నీ కళ్ళల్ల కారంగొడ్తడు. ముందు గజూస్కుపో పొయ్యి. నేను ఆంధ్ర బిడ్డనో నా తల్లి బిడ్డనో నాకు మంచిగదెల్సు. నాల్గున్నర సమచ్చరాలు బట్టింది కెసిఆర్ గానికి, కాంగ్రేసు బొంద బెట్టాలని తెల్సుకునేటందుకు. కల్సి ఉండాలని పాకులాటెవ్వనికుంది మియా? నాకేంలే. ఐనా కల్సుందాం అనేటందుకు నేనవ్వన్ని? వద్దనేటందుకు నువ్వెవ్వనివి? శతకోటి గొఱ్ఱెల్లో బోడిగొఱ్ఱెవా?

September 23, 2008 7:35:00 AM IST
భాస్కర్ రామరాజు said...
తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. మంచిగ చెప్పినవ్. మరి తెలంగాణ తెస్తమని జనాలకి మాయమాటల్జెప్పిన కెసిఆర్నేజేయాలే?


ప్రత్యేక రాష్ట్రం ఒక బస్తా బియ్యం ఎక్కువ పండిస్తుందా?
కాళ్లల్లో దిగిన ముల్లుతీయ్యండ్రా బాబు అని ఓ వైపు పేదోడు, రైతూ, జనం ఆత్మహత్యలు చేస్కుంటుంటే నాకునీతో కలిసి ఉండటం ఇష్టమ్లేదు, ప్రత్యేకం కావాలి అంటాడొకడు, లేదు లేదు ప్రాజెక్టులు అన్నీ మీకేనా అంటాడు ఇంకొకడూ, ప్రత్యేక రాష్ట్రం వస్తే మతాల కుమ్ములాట అవుతుంది అంటాడు ఇంకొకడు. విడిపోదాం, గౌరవించుకుందాం అంటాడు ఇంకొకడు. సందట్లో సడేమియా బాంబులేస్తాడు ఇంకొకడు. అసలు సామాన్య మానవునికి ఏంగావాలో ఎవ్వనికి పడుతుంది? వాని గురించి వానికే పడతల్లేదు....

3 comments:

  1. ప్రత్యేక తెలంగాణని ఎంతమంది కోరుకుంటున్నారో అనుమానాస్పదమే గానీ, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మూడు ప్రాంతాల్లోను అందఱూ అభిలషించిన మాట వాస్తవమే. అందుచేతనే మనది మొదటి భాషారాష్ట్రం అయింది. అప్పట్లో కేంద్రప్రభుత్వానికి ఇష్టంలేకపోయినా ఏర్పఱచాల్సి వచ్చింది కూడా.

    కార్మికుల్నీ, కర్షకుల్నీ జాతికి సంబంధించిన ఉమ్మడి విషయాల్లో తాదాత్మ్యం లేని, ఆలోచన లేని స్వార్థపరులుగా చూడరాదు.

    ReplyDelete
  2. ఏ జాతినుండైనా అయినా, ప్రాంతంనుండైన స్వతంత్రంగా ఉండాలి, విడిపోవాలి అని ఆలోచన శిష్ట వర్గాలనుండే మొదలౌతుంది. అట్టడుగు వర్గాలనుండి మొదలు కాదు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన స్వాతంత్ర్య పోరాటం. ప్రజలందరూ కోరుకుంటాన్నారా అనే ప్రశ్న సరికాదు.

    ReplyDelete