Jul 31, 2010

కేసీఆర్ గెలుపా లేక మిగతా పార్టీల ఓటమా?

తెలంగాణ అమరవీరులకే ఈ విజయం అంకితం: కేసీఆర్‌
హైదరాబాద్‌: ఉప ఎన్నికల విజయం తెలంగాణ అమరవీరులకే అంకితమని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఈ సాయంత్రం ఆయన ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ ఫలితాలు ప్రతిబింబించాయని తెలిపారు. తెలంగాణ సాధనకు ఈ విజయం ఓ మెట్టని అన్నారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ వచ్చే దాకా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్‌, తెదేపాలకు ఈ విజయం చెంపపెట్టని అన్నారు. తెరాస ఓటమి కోసం రూ.200 కోట్లు ఖర్చుపెట్టారని విమర్మించారు. లెక్కింపు జరుగుతున్న స్థానాల్లోనూ విజయం తమదేనని చెప్పారు. కేంద్రం ఈ ఎన్నికలను ఓ రెఫరెండంగా తీసుకోవాలని... శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన బలిదానాలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయని విమర్శించారు.సందట్లో సడేమియా -

ఓటమికి ఆంధ్రా కాంగ్రెస్‌ వాళ్లదే బాధ్యత: కాకా
హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో ఓటమికి ఆంధ్రా కాంగ్రెస్‌ వాళ్లదే బాధ్యతని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటమిపై డీఎస్సే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.


కాకా ఆపునీ బాకా

వార్తా పుత్రికలను పక్కనబెడితే -
నా దృష్టిలో పై ఫలితాల విశ్లేషణ ఇలా ఉంది :
ఇది కేసీఆర్ గెలుపు కాదు, తెదేపా ఓటమి. అదేందదీ అనుకుంటున్నారా? ఎందుకంటే, కాంగ్రేస్ చరిత్ర రా.శే.రె తోనే ముగిసిపోయింది. అలా ముగిసే సమయంలో తెదేపా జనాల నాడిని తనవైపుకి తిప్పుకోలేక పోయింది. ఎందుకంటే అత్యధిక మెజారిటీతో రెండోస్థానంలో నిల్చున్నది తేదేపానే కదా. బాబు బాబ్లి గోలతో పొయ్యిరాజేసి తెలంగాణ వంటవండుకుందాం అనుకున్యాడు. కానీ అంత పొలిటికల్ ముమెంటం సాధించినట్టు నాకైతే కనపళ్యా. ఈ వంటకి ఎలచ్చన్ల మసాలా నూరదాం అనుకున్యాడు. పాపం ఏమాత్రం కుదరకపోగా మొదటికే మోసం వచ్చింది. తెరాస గెలిచింది.
కొన్ని వేల ప్రజాసమస్యలు ముందుంచుకుని, కొన్ని కోట్ల ఖర్చుని వృధాగా పెట్టించిన తెరాసా పై ఎవ్వరూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) ఫైల్ చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇది రెండోసారి ఇలా జరగటం. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే *కాంగ్రెస్‌, తెదేపాలకు ఈ విజయం చెంపపెట్టని అన్నారు. తెరాస ఓటమి కోసం రూ.200 కోట్లు ఖర్చుపెట్టారని విమర్మించారు*. మరి కేసీఆర్ ఎంత ఖర్చుచేసి ఉంటాడో గెల్వటానికి అని నే అడగను. మొత్తంమీద నల్లధనం ఎంత ఖర్చై ఉండిఉండవచ్చో కూడా నాకనవసరం. ఆ డబ్బుని తెలంగాణా సోకాల్డ్ అభివృద్ధికి వెచ్చించి ఉంటేనో అని కూడా నే అడగా.
ఇక ఇప్పుడేంటీ?
కాంగ్రేస్ కథ ముగింపు దశకి వచ్చింది అని నాకనిపిస్తోంది.
జగన్ తెలివితేటలు తెల్లారినట్లే ఉన్నాయన్నట్టుంది.
రేపు జగన్ కాంగ్రేస్ ని చీల్చితే కాంగ్రేస్ కన్నా జగన్ కే నష్టం అని నా అభిప్రాయం.
తెదేపా మరోసారి ఆత్మపరిశీలన చేస్తే బెటర్. ఇకనైనా వన్ మ్యాన్ షో షాడో నుండి బయటకొస్తే తేదేపాకి కనీసం ఉనికైన నిలుస్తుంది. ఎటూ తెలంగాణా వస్తుంది, ఇక ఆంధ్రాలో సత్తా చూపుదాం అన్నట్టుంది బాబు వైఖరి. కాంగ్రేస్ కి ప్రత్యమ్నాయం ఏ పార్టీ? అనేది పెద్ద ప్రశ్నే అని నా అభిప్రాయం. ఇటు చిరంజీవి పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాడు. కాంగ్రేస్ చిరంజీవి కలిస్తే కొంచెం ఏమన్నా ఉపయోగ పడవచ్చు రెండుపార్టీలకి.

చివరగా రెండు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.
కేసీఆర్ గెలుపు తెలంగాణాకి రెఫరెండమా?
కాంగ్రేస్ కి ప్రత్యామ్నాయం ఏంటి?

Jul 30, 2010

ఎచ్.యఫ్.సి.యస్

ఏంటా ఇదీ అని చూస్తున్నారా.
నిన్నటి నా పోస్టు డా॥ పెప్పర్ చూసారు కదా.
ఒకసారి దాని న్యూట్రిషన్ ఫాక్ట్స్ చూద్దాం -
ఇదిగో ఇక్కడా చూడండి -


కింద గీత కీసిన ముక్కలు ఓసారి గమనించారా?
సుగర్స్ ౨౭ గ్రాములు
మరియూ దీంట్లో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉందట.
ఎచ్.యఫ్.సి.యస్ = హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్
దీన్ని పంచదారకి ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు.
ఒక్కసారి ఇదేంటో చూద్దాం - తప్పదు కనక వికీపీడియాలో గెలికితే -
http://en.wikipedia.org/wiki/High-fructose_corn_syrup

High-fructose corn syrup (HFCS) – also called isoglucose,[1] maize syrup, or glucose-fructose syrup[2][3] in the UK, and glucose/fructose[4] in Canada – comprises any of a group of corn syrups that has undergone enzymatic processing to convert its glucose into fructose and has then been mixed with pure corn syrup (100% glucose) to produce a desired sweetness. In the United States, consumer foods and products typically use high-fructose corn syrup as a sugar substitute. In the United States, it has become very common in processed foods and beverages, including soft drinks, yogurt, industrial bread, cookies, salad dressing, tomato soup[5] and ketchup.

Health effects

Critics of HFCS point out a correlation between increased usage of HFCS in foods and obesity rates in the United States over three decades.[40] Some allege that HFCS is in itself more detrimental to health than table sugar (sucrose); others claim that the low cost of HFCS encourages overconsumption of sugars. The Corn Refiners Association has launched an aggressive advertising campaign to counter these criticisms, claiming that high-fructose corn syrup "is natural" and "has the same natural sweeteners as table sugar".[41] Both sides point to studies in peer reviewed journals that allegedly support their point of view.

Liver disease

A March 18, 2010 Duke University Medical Center study found that "increased consumption of high fructose corn syrup was associated with scarring in the liver, or fibrosis, among patients with non-alcoholic fatty liver disease (NAFLD)."[57] Another study which compared HFCS to sucrose in rats found that both caused fatty liver.[58]

Apiculture

In the United States, high-fructose corn syrup has become a sucrose replacement for honey bees. In 2009, a study by Leblanc et al. found that at temperatures above 45 °C (113 °F) HFCS rapidly begins to form hydroxymethylfurfural, which is toxic to the honey bees being fed HFCS.[59]

కొందరు చెప్పటం ఏంటంటే HFCS వల్ల పెద్ద నష్టాలు లేవని. కొందరు ఉన్నాయని.


What is HFCS?

HFCS is not the run of the mill corn syrup found on the grocery store shelf, nor is it the fructose naturally found in fruits and honey. HFCS is a highly refined clear liquid derived from corn starch. Food manufactures love to use it because of its long shelf life an it's relative low cost.

Why is HFCS Bad for us?

Since HFCS's widespread introduction in the 1980's North American obesity rates have skyrocketed. Obesity has been linked to may heath issues including heart disease and many forms of cancer. When HFCS is ingested, it travels straight to the liver which turns the sugary liquid into fat, and unlike other carbohydrates HFCS does not cause the pancreas to produce insulin; which acts as a hunger quenching signal to the brain. So we get stuck in a vicious cycle, eating food that gets immediately stored as fat and never feeling full.

Where is HFCS found?

HFCS is found in almost everything we eat today. However, the worst culprit has to be soft drinks. A single 12 oz can of cola has up to 13 tsp of sugar, most of it fructose from HFCS. There is HFCS hidden in many of our other food as well, like ketchup, relish, cookies, and most alarmingly in low-fat diet foods. Manufactures substitute HFCS for the fat in food like mayo and salad dressings, then mark them as diet foods.

How Can We Avoid HFCS?

Avoiding HFCS will take a lifestyle change for the better. The first food to go has to be the soft drinks; this includes fruit punch, fruit cocktails, and Kool-Aid since they are all laden with HFCS.

Second, eat more meals at home. Restaurant foods are mostly prepackaged foods reheated and served to you. Use of HFCS in these foods is wide spread because of their increased shelf life.

Third, diet while you shop. Since you are going to be eating most of your meals at home, you're going to want to fill your cupboards with the best foods. While shopping, read the labels, if HFCS, fructose, or modified corn starch appears within the first five ingredients place it back on the shelf an move on. Sounds easy right? Wrong. As you make your way through the store you will begin to realize just how much of what you have been eating on a daily basis contains HFCS.

Reducing HFCS will not alway be easy, but the health benefits are well worth it. You will feel stronger and more vital, it will lift your mood and give you increased concentration. Limiting your intake of HFCS will not only shrink your midsection but also do wonders for your over all health.

Update Aug 13 2009: 

New studies have shown HFCS and regular sugar are nutitionaly identical and your body reacts the same to them.  The advice in this article still holds true.  If you reduce your HFCS you will be reducing your overall sugar and calorie intake.  This will lead to weight loss and weight loss will lead to better health

. it is the obesity that is the problem not the HFCS inparticular.  I know its a minor point, I'm just striving for accuacy.


ఇంకొంత సమాచారం -

ఒక్కసారి ఇక్కడ నొక్కండి -
http://www.diabeteshealth.com/read/2008/08/20/4274/the-dangers-of-high-fructose-corn-syrup/

Understanding Glucose and Fructose

Since HFCS is a blend of glucose and fructose, it's important to understand the role each plays in your body. All sugars, indeed all carbohydrates, have four calories per gram.

But that is just part of the story.

Glucose (dextrose) is a monosaccharide (basically, a simple sugar), which is the form of sugar that is transported in the blood and is used by the body for energy. This is what you measure when testing your blood glucose or blood "sugar."

Fructose is also a monosaccharide and is often referred to as "fruit sugar," because it is the primary carbohydrate in most fruits. It's also the primary sugar in honey and half the carbohydrate in sucrose (table sugar). However, fructose does not stimulate insulin secretion or require insulin to be transported into cells, as do other carbohydrates.

The Fate of Fructose in the Body

Fructose requires a different metabolic pathway than other carbohydrates because it basically skips glycolysis (normal carbohydrate metabolism). Because of this, fructose is an unregulated source of "acetyl CoA," or the starting material for fatty acid synthesis. This, coupled with unstimulated leptin levels, is like opening the flood gates of fat deposition.

Should Fructose Be Eliminated From the Diet?

It's not that you should eliminate fructose from your diet, but you should be aware of how much you're consuming. After all, fructose is the primary sugar found in fruits, which provide valuable nutrients. In this case, a little fructose is fine. It becomes a problem only when someone consumes high levels of fructose or HFCS, which is now present in virtually all commercial foods (see below).

Check the Food Labels

While there is no way of knowing exactly how much HFCS is in a given product, you can read the food labels to gauge sugar levels. So, for example, if HFCS is one of the first ingredients listed (in soft drinks or syrup, for example), it is safe to assume there's a lot in the product. If HFCS is in the products you buy, make sure it is either low on the ingredient list or that the products list very few total grams of sugar (which is how HFCS is shown on ingredient labels).

What Does It All Mean?

If HFCS is one of the first ingredients listed on a food label, don't eat it. Make a mental list of the worst culprits, such as regular soft drinks and many highly sweetened breakfast cereals. HFCS alone won't make you fat, but when HFCS is high on the ingredient list, the food is not the best choice. As part of a lifestyle that has many of us eating too much and moving too little, we're putting our health at risk if we don't choose our foods carefully.

So what's the answer? It's easy. Avoid HFCS by reading food labels and shopping the grocery store's perimeter: Produce is on one side, seafood, meat and poultry on another, and dairy products, eggs and bread on the third. Avoid the center aisles, which are mostly stocked with highly processed foods.

The more you stick to fresh whole foods and avoid commercial and highly processed foods, the less HFCS you will consume.


Common Foods High in HFCS

 • Regular soft drinks
 • Fruit juice and fruit drinks that are not 100 percent juice
 • Pancake syrups
 • Popsicles
 • Fruit-flavored yogurts
 • Frozen yogurts
 • Ketchup and BBQ sauces
 • Jarred and canned pasta sauces
 • Canned soups
 • Canned fruits (if not in its own juice)
 • Breakfast cereals
 • Highly sweetened breakfast cereals

Problems Caused by Too Much HFCS

 • It can lead to higher caloric intake
 • It can lead to an increase in bodyweight
 • It fools your body into thinking it's hungry
 • It increases the amount of processed foods you eat, thereby decreasing your intake of nutrient-dense foods
 • It may increase insulin resistance and triglycerides
ఇప్పుడర్థం అయ్యిందా పంతొందల తొంభైతొమ్మిల వరకూ మనోళ్ళకు ఒబేసిటీ అంటే ఏంటో తెలియదు [అతి తక్కువ కేసులు]. ఇప్పుడు ఇండియాలో ఎనిమిది మందిలో ఒకళ్ళకి సుగర్ ఉందని తేలింది. కారణం? ఫాస్ట్ ఫుడ్స్. మరియూ - ఇంపోర్టెడ్  *సోడా డ్రింక్స్* మరియూ *సాఫ్ట్ డ్రింక్స్*.

లెట్స్ గివప్ సాఫ్ట్ డ్రింక్స్.
దేశవాళీ లస్సియే ముద్దు, ఈ అమెరికన్ డ్రింక్స్ వద్దేవద్దు

జై హింద్

Jul 29, 2010

డా॥ పెప్పర్

మా కొలీగ్ ఓడు(ఒకడు) డా॥ పెప్పర్ తాగుతుంటే, నేనూ తాగుదాం అని ఓ సీసా కొని, సీటుకాడికొచ్చి, మూత్తీసి గొంతులో కూసింత ఒంపుకున్నా.
దేవుడా!! విధి ఇంత బలీయమైందా? అప్పుడే తిన్న వన్నం బైటికి రాబోయింది.
కాబట్టి అబ్బాయ్, ఏటయ్యా అన్టే, నీకు తెల్సింది తాగు. తెలవంది, తెలవకున్డా తాగమాక. తెలవంది, తెల్సుకుని తాగు.

Jul 27, 2010

అన్నదాతా సుఖీభవ

ఇవ్వాళ్ళ చాలా తలనొప్పిగా ఉంది పొద్దుణ్ణుంచి. లేవటమే ఆలశ్యంగా లేచా. తల లాగిలాగిపెట్టింది. మా అన్నయ్య నాకో బహుమతి పంపాడు. అది మా అపార్టుమెంటు మేనేజరు వద్ద వదిలి వెళ్ళాడు తపాలా బంట్రోతు. పొద్దున పొద్దున్నే అదెత్తుకుని ఆపీస్కి చేరుకున్నా నిద్ర మొహంతో.
ఓవైపు తల లాగటం ఇంకోవైపు అన్న పంపిన గిప్టు.
పనికెళ్ళంగనే డబ్బా ఓపెన్ చేసి రీసెర్చీ మొదలెట్టా. ఇంతలో ఓ నాలుగు కాళ్ళు అదేనండీ కాల్స్. తల అటుఇటు తిప్పేప్పటికే పన్నెండున్నర. రొట్టెముక్కలు నోట్టోఏస్కుని సల్లబువ్వ అనగా మజ్జిగ అన్నం మింగి సల్లగా మంచీళ్ళు తాగి మనిలో పడ్యా.
ఇంతకీ అన్న పంపిన గిఫ్ట్ -
కేనన్ రెబల్ ఈ.ఓ.యస్ డిజిటల్ ఎస్.ఎల్.ఆర్; ౨౮-౩౦౦యంయం ఆ.ఫో లెన్స్.
ఇదిగో అ కెమెరా రాజం -


ఓ ఉదాహరణ పుటోబు -


తలనొప్పి ఎంతకీ తగ్యల. కాళ్ళీడ్చుకున్టా ఇంటికిజేరా. సల్లగా నిమ్మకాయ నీళ్ళు తాగి ఓ ఏడ్విల్ కుమ్మి కళ్ళూకాళ్ళూ ముడుసుకుని కూసన్త అట్టా ఎనక్కి వాలా.
ఆరున్నరకి భార్యాబిడ్లు నిద్రల్లేపారు.
ప్రెష్షుగా మొకం కడుక్కొచ్చేపాలికి, బువ్వ రెడీ తిన్ట్యావా అన్నారు భార్యాబిడ్లు. వలాగే అని కూకున్నా. తలనొప్పి ఓకొలిక్కి వచ్చిందాపాటికే.
అయ్యా -
కోసుగడ్డ + గాజర గడ్డ కలిపి ఇగురు సేసిన్ది. ఏడిఏడి అన్నం పైన ఇగురు. ఓ పీకుడు పీకిన్యాక అయ్యా, ప్రిజ్జీలోంచి ఓ పొట్లం తీసి, పళ్ళెమ్లో ఓ రొంత కుమ్మింది.
ఇదిగో ఆ పొట్లరాజం

అన్నా ఏంటో ఎరుకనా ఆ పొట్లరాజం - పండుమిరపకాయల కారం
వేడివేడి అన్నం, పొడిపొడిగా, దాంటోకి పండుమిరపకాయల కారం. ఏం చెప్పను బాసూ. నోట్లోనీళ్ళూ ఓ నాలుగు బక్కెట్లు ఊరి లోనికి ఎళ్ళిపోయినయి. తలనొప్పి గిలనొప్పి దానెక్క దేక్కున్టా పోయింది.
తిన్నాక, కళ్ళముందు ఓ నాలుగు రీళ్ళు గిర్రున తిరిగాయ్. ఆరోజుల్లో - ఓ ఎత్తుడు పండుమిరగాయలు, సరిపోను సిన్తమన్డు, మావిడల్లం, గళ్ళప్పు ఓ బొచ్చెలో ఏసి ఇస్తే, రుబ్బింగు వేయబడును కాడికెత్తుకెళ్ళి, లైన్లో నిల్చుని రిబ్బింగ్ ఏపించుకునిగానీ కదలకున్డా రుబ్బింగోడు ఎళ్ళమన్నా ఎళ్ళాకున్డా ఆణ్ణే ఉన్డి, ఇంటికెత్తుకెళ్ళినాక, ఏడి ఏడి తెల్లబువ్వలో ఎర్రటి పచ్చడి, పైన ఎన్నపూస. నాయనా ఇంక జీబితానికి ఏంగావాలే? ఈ మాత్రం సుఖానికి పేద పెద్ద ఉన్నోడూ లేనోడు అనే బేధం లేదు. తేడా అంతా తినే కంచంలోనే. పేదోడు అల్యూమినియం సిబ్బిరేకులో తిన్టే ఉన్నోడు ఎన్డి పళ్ళెంలో తింటాడు. అంతే తేడా.
పండు మిరపకాయలు కకోయటానిక్కూడా ఓ ఇధానం. కోతకొచ్చిన సేనుకి ముందు బాగా నీళ్ళు పెడతారు. మిరగాయకి నీళ్ళు పట్టి బాగా నవనవలాడుతున్నప్పుడు కోస్తారు.
సెప్పొచ్చేదేంటన్టే -
సెమటోడ్చి మనకి ఇట్టాంటి పంటల్ని అందించే రైతు - అన్నదాత - సుఖీభవ
పండుమిరగాయల్ని కమ్మని పచ్చళ్ళా పెట్టే అమ్మతల్లులు - అన్నదాతలు - సుఖీభవ

Jul 19, 2010

జగన్నాథ రథయాత్ర

జూలై ౧౮, కేన్సస్;

ఈరోజు మా గుళ్ళో జగన్నాథ రథయాత్ర కన్నులపండుగ్గా జరిగింది.


జగన్నాథ్ మహరాజ్ కి జై

Jul 16, 2010

కుండీ వ్యవసాయం

అన్నగారు పలుగూ పారా చేతబుచ్చుకుని ఏరువాక కెళ్లొచ్చా అని ఓ టపా రాసారు.
http://kottapali.blogspot.com/2010/07/blog-post_15.html
అదే స్పూర్తితో.....
ఇది పుదీనా వృక్షం

మెంతికూర మడిచెక్క (కుండీ)

ఇది కొంచెం ట్రిక్కి. ఇందులో ముందు ఓ మామిడి టెంకె పెట్టా. ఏమీ కదలిక లేదను మా మేడాంగారు ధనియాలు కుమ్మేరు హిప్డు రెండూ వచ్చాయ్.

ఇక ఇదీ మా గోగిచెక్క

ఇక ఇది - ముందు కాకర గింజలు ఓ రెండు కుమ్మేరా మేడం. అవి రావులే అని తోటాకు అదే తోటకూర కుమ్మారు. రెండూ వచ్చాయ్.

Jul 11, 2010

ల ఫినాల్

ఆరంజెస్ వెర్సెస్ ఇస్పాన్యా

ఎవరు గెలవచ్చూ?

అయ్యా!! అదిగో!! అటు చూడండీ.
రెండు జట్ల ఆటగాళ్ళు బయటకి వస్తున్నారు..ఆహా కన్నులపండుగ్గా ఉందీ.
ఆటగాళ్ళు వాళ్ళ దేశగీతాన్ని ఆలాపిస్తున్నారు

Jul 9, 2010

బాడ్ టెస్టింగ్ కి ఓ ఉదాహరణ

నాకు మైన్ స్వీపర్ అనే ఆట అంటే భలే ఇష్టం. ఆ ఇష్టం ఐఫోన్ చేతికొచ్చాక కూడా తగ్గలా. ఐస్టోర్ లో వెతికా. మైన్ స్వీపర్ ఉచితంగా దొరికింది. దింపాను.
ఈ మధ్య ఆ ఆట అప్డేట్ వచ్చింది. సరే అని దింపాను. ఈ కొత్త అప్డేట్ తర్వాత చాలా కాలానికి ఈ మధ్యెప్పుడో దులిపా ఆడదాం అని.
బూతు అనిపించింది పై సిచ్యువేషన్
కార్నర్ లో నాలుగు మైన్స్ ఉన్నట్టు చూపింది.
కార్నర్ కి మూడే మైన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది బ్యాడ్ టెస్టింగ్ కి ఓ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు కదూ?
సరే, నేను మొట్టమొదటా ఈ కార్నర్ ని ఓపెన్ చేసా కాబట్టి నాలుగొచ్చింది అనుకుందాం. నాలుగుపైన నొక్కా ౧ వచ్చింది. అది ఇంకా బూతు.

ఇంకోచిన్న ఉదాహరణ.
అప్పుడెప్పుడో నేను ఓ పోస్టేసా. గంట మీటింగు ఇరవి సెకెండ్లలో పూర్తి అని - http://ramakantharao.blogspot.com/2009/03/blog-post_26.html
మా టోనీగాడి దగ్గర ఓ కెమేరా ఉంది. దాంట్లో ప్రతీ పదినిమిషలకో బరెస్ట్ ని సెట్ చేసి పెడితే అలా తీసూ ఉంటుంది అది. పై మీటింగ్ కి ముందు కెమేరాని ఫిక్స్ చేసాడు. ప్రతీ పది నిమిషాలకోసారి బరెస్ట్ ని సెట్ చాసాడు. మీటింగ్ లో కూర్చున్నాడు. మీటింగ్ అయ్యింది. వచ్చి చూస్తే కెమేరా ఆఫ్ అయి ఉంది. ఎక్కడ సమస్య? ఏమన్నా ఆలోచించగలరా?
కెమేరాలో ఐడిల్ టైం ఉంటుంది. అది రీచ్ కాంగనే ఆటోమేటిగ్గా ఆగిపోతుంది.
మఱ్ఱోజు జరిగిన మీటింగ్లో ఆ ఐడిల్ టైమర్ ని వాయిడ్ చేస్తే సరిగ్గా అనుకున్నట్టు పని చేసింది.
పై సిచ్యువేషన్లో టెస్టింగ్ బ్లండర్ ఏంటీ?
అన్-మాన్న్డ్ బరెస్ట్స్ మోడ్ లో ఉన్నప్పుడు అడిల్ టైం ఫ్లాగ్ ని అన్ సెట్ చేయాలి అనే టెస్ట్ కేస్ ని రాయలేకపోవటం. కాదంటారా?

Jul 3, 2010

ఆట మొదలైంది

జెర్మని - అర్జెంటీనా
జెర్మని గోల్స్ - ముల్లర్ - మూడో నిమిషం

ఇది అర్జెంటీనా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది

అమెరికాలో ఈ మ్యాచ్ ఎబిసి ఛానెల్ లో లభ్యం

Match STATS

Jul 2, 2010

పోయే పోయే మ్యాచే పోయే

పోయే పోయే మ్యాచే పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ బ్రాసిల్ మ్యాచ్ ఈజ్ గాన్

పోయే పోయే కప్పే పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ వర్ల్డ్ కప్ ఈజ్ గాన్

బ్రాసిల్ మ్యాచ్ ఈజ్ గాన్


బ్రాసిల్ నెదర్లాండుపై ఓడిపోయింది.
హిప్డు లోతుగ సూస్తే -
బ్రాసిల్ ఓ గోలు డచ్ గాళ్ళు ఓ గోలు. మరదేట్రా అని పరికించి సూత్తే హప్డు కనిపిస్తాయ్ బ్రాసిల్ సెల్ఫ్ గోల్

ఐఫోన్ లో చక్కటి చిక్కటి తెలుఁగు


సోడ్రసోడ్రీమణులారా
నిన్న రాత్రి నా ఐఫోన్ని ఛార్జింజ్ కోసం కంప్యూటర్ కి తగిలించా. వేంటనే ఐట్యూన్స్ "బాబాయ్!! ఐఫోన్ ఓ.యస్ ౪ వచ్చిందంట. దింపనా?" అని అడిగింది. సర్లే కుమ్ము అని డౌన్లోడ్ కి పెట్టి పడ్ కున్నా. పొద్దున పొద్దున లెగంగనే బాత్రూంకి ఫోన్ ఎత్తుకెళ్ళి మెయిల్స్ గట్రా గెలకటం అల్వాటు కదా, అట్టా ఫోన్ ని తెరిచా. మెయిల్స్ అని కొడితే, మెయిల్ ఇంటర్ఫేస్ కొత్తగా అనిపించింది. వార్నీ ఇదేదో బాగుందే అని జిమెయిల్లోకి ఎంటారవ్వంగనే నన్నిట్టే లాగేసిన ఇషయం - గీతాచార్య బజ్ రిప్లై చక్కటి తెలుగు రెండరింగుతో. ఎప్పుడూ తెలుఁగు ఫాంట్ విచిత్రమైన రెండరింగ్ తో ఉండేది ఇవ్వాళ్ళ చక్కగా కొట్టొచ్చినట్టు తన్నొచ్చినట్టు గుద్దొచ్చిన్నట్టు కనిపించింది. వరేవా అనుకున్నా.
ఇకపై ఐఫోన్నే వాడుకోవచ్చు తెలుఁగులో చక్కగా రిప్లై ఇచ్చేందుకు.

Jul 1, 2010

బెట్టింగ్ బంగార్రాజు

ప్రపంచ కప్పు ఓ చుట్టు దాటి ఇంకో ఘట్టంలోకి అడుగుబెట్ట బోతోంది.
ఇప్పటికి జరిగిన గుంపు స్థాయి ఆటల్లో కొన్ని మాత్రమే అనూహ్య మలుపులు కాగా మిగతా అన్నీ అనుకున్నట్టే జరిగాయి.
ఫ్రాన్స్, ఇటలీ జట్లు గుంపు స్థాయిలోనే  తిరుగుముఖం పట్టగా, అమెరికా స్యూపర్ పదహారుకి చేరుకుంది.
స్యూపర్ పదహారు స్థాయిలోకి రాంగనే అమెరికా, ఇంగ్లెండు, మెక్సికో లాంటి జట్లు ఇకచాల్లే అని ఓడిపోయి వెనుతిరిగారు. జపనీయులు పోరాడి ఓడారు. హాన్డా బాగా ఆకట్టుకున్నాడు. పోర్చుగీసువారు గ్రూపు స్థాయిలో రాణించినా స్యూపర్ పదహారు మాచిలో పాపం రాణించలేకపొయ్యారు. ఆ జట్టు లోని స్టార్ ఆటగాడైన క్రిస్టియానో రొనాల్డో ఏమాత్రం ఆకట్టుకోలేకపొయ్యాడు. ఆ దేశం ఈ టోర్నమెంటులో ఆడిన నాలుగు ఆటల్లో అతను ఓ కీలక ఆటగానిలా ఉన్నాడేకానీ కేవలం ఒకే గోల్ ని చేయగలిగాడు.
క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్న జట్లు -
జెర్మని
ఉరుగ్వే
పరాగ్వే
స్పెయిన్
అర్జెంటీనా
బ్రాసిల్
నెదర్లాండు
ఘన

స్వల్ప విరామం తర్వాత, జూలై రెండునుండి తుది సమరానికి తెరలేవనుంది
ఉరుగ్వే - ఘన
బ్రసిల్ - నెడర్ల్యాండెన్
పోరు జూలై రెండున జరగనుంది
జెర్మని - అర్జెంటీనా
ఇస్పాన్య - పరాగ్వే
పోరు జూలై మూడున జరగనుంది

దీంట్లో జెర్మని - అర్జెంటీనా పోరు అత్యంత ఉత్సుకత కలిగించే పోరూ అని చెప్పవచ్చు. కారణం రెండు జట్లు ఇప్పటికి కనీసం ఒకసారి ప్రపంచకప్పుని గెలిచన జట్లే. అర్జెంటీనా ఇప్పటికి రెండుసార్లు రెండోస్థానం మరియు రెండుసార్లు కప్పు గెలిస్తే, జెర్మనీ ఇప్పటికి నాలుగు సార్లు రన్నర్స్ అప్, మూడు సార్లు కప్పు గెలిచింది. ప్రేక్షకవీక్షకులకు ఈ రెండు జట్లు క్వార్టరు ఫైనల్స్ లో తలపట్టం కొంచం నిరుత్సాహ పరిచే విషయం. ఏ సెమీస్ లోనో ఫనల్స్ లోనో తలపడాల్సిన జట్లు ఇవి.
ఇక మిగతా జట్లలో బ్రాసిల్ ఇప్పటికి ఐదు సార్లు కప్పు కొట్టింది. ఉరుగ్వే ఇప్పటికి రెండు సార్లు కప్పు కొట్టింది. ఘనా అనే నల్లవజ్రాల దేశం మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చింది. అలాగే పెరాగ్వే కూడా. ఇస్పాన్యా ఇంతవరకూ ఒక్కసారి మాత్రం నాలుగో స్థానం వరకూ రాగలిగింది. అంటే ఒక్కసారి సెమీస్ కి చేరగలిగింది. ఇక మిగిలింది నెడర్ల్యాండెన్ - ఈ జట్టు ఇప్పటికి ఒకసారి సెమీస్ ఆడగలిగితే రెండు సార్లు రన్నర్ అప్ గా నిలిచింది.

ఎతావాతా, బ్రాసిల్ నెదర్ల్యాండ్ పోరు కూడా ఆసక్తిగా ఉండొచ్చని పండితుల అంచనా. కానీ అర్జెంటీనా జెర్మనీల పోరు వీక్షకులను అల్లాడించవచ్చని నా ఊహ.
ఇక బెట్టింగ్ బంగార్రాజు [అంటే నేనే] ప్రకారం -
క్వార్టర్స్ -
జెర్మని - అర్జెంటీనా : అర్జెంటీనా గెలుస్తుంది
ఉరుగ్వే - ఘన : ఉరుగ్వే గెలుస్తుంది
నెదర్ల్యాండ్స్ - బ్రాసిల్ : బ్రాసిల్ గెలుస్తుంది
ఇస్పాన్యా - పరాగ్వే : ఇస్పాన్యా గెలుస్తుంది

సెమీస్ -
ఉరుగ్వే - బ్రాసిల్ - బ్రాసిల్ గెలుస్తుంది
అర్జెంటీనా - ఇస్పాన్యా - అర్జెంటీనా గెలుస్తుంది

టట్టడాయ్ - ఫైనల్స్ -
బ్రాసిల్ - అర్జెంటీనా
ఎవ్రు గెలుస్తురూ? నా బెట్ - అర్జెంటీనా

ఇక వీరి మెఱుపులు ఎలా మఱవనున్నాయో చూడాలి -
మెస్సి - ఇతను ఎక్కువ గోల్స్ చేయనప్పటికీ అర్జెంటీనా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు
గొన్జాలో - ఇతను ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటాగాడు
కార్లోస్ తెవేజ్ -  ఇప్పటికి రెండు గోల్స్ కొట్టాడు
ముల్లెర్ - ఇప్పటికి మూడు కొట్టాడు
ఫాబియానో - మూడు గోల్స్ వీరుడు
క్లోజ్ మరియూ పొడోల్స్కి - ఇద్దరూ చెరి రెండు గోల్స్ చేసారు
అసమో గ్యాన్ - ఇప్పటికి మూడు గోల్స్ చేసిన నల్ల వజ్రం
ఇక చెలరేగి ఆడాల్సిన వ్యక్తి మాత్రం కాకా