Aug 27, 2009

కొంతమంది కోరిక తీర్చా(రింది)

కొందరు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గున్డెలమీన సేతులేస్కుని.
కొన్దరు అయ్యో పాపం అనుకోవచ్చు, తప్పునేదు.
కొన్దరు ఆచ్చర్యపోవచ్చు ఎలా? అని.
ఇన్కొన్దరు మిత్రులు ఇదెలాగ? ఎట్టేట్టా ఏడే ఉండాలిగా, ఎనివిదెట్టున్నై అనుకోచ్చు.
ఎవ్వుని లెక్కలు ఆళ్ళయి. ఏంపర్లేదు. ఎట్టాకావాలంటే అట్టా అనేస్కొన్డి.
ఎదవనా@#@$#%$#%!! ఛీఛీ!! ఇంతబతుకూ బతికి ఛాఛా!!

[%$‌$‌#%@#$@#$$%&‌*()&*(‌&(ఓ&%‌&% - ఇది దిస్టిసుక్క]

Aug 23, 2009

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కలాధరావతంసకం విలాసి లోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ||1||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||2||

సమస్త లోక శఙ్కరం నిరస్త దైత్య కున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ||3||

అకిఞ్చనార్తి మర్జనం చిరన్తనోక్తి భాజనం
పురారిపూర్వనన్దనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపఞ్చనాశ భీషణం ధనఞ్జయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ||4||

నితాన్త కాన్త దన్తకాన్తిమన్తకాన్తకాత్మజం
అచిన్త్యరూపమన్తహీనమన్తరాయ కృన్తనమ్ |
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదన్తమేకమేవ చిన్తయామి సన్తతమ్ ||5||

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రగాయతి ప్రభాతకే హృదిస్మరన్ గణేస్వరం |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ||6||

జయగణేశ జయగణేశ జయగణేశ పాహిమాం
జయగణేశ జయగణేశ జయగణేశ రక్షమాం
జయగణేశ జయగణేశ జయగణేశ పాహిమాం
జయగణేశ జయగణేశ జయగణేశ రక్షమాం




అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

- భాస్కర్, హరి, సూర్యా మరియూ అనఘ

"ముదాకరాత్త మోదకం" ఇక్కడ వీక్షిస్తూ వినండి


అలానే నా పోస్టెరస్ లో శ్రీ సిద్దివినాయక స్తోత్రం ఆడియో పెట్టా విని ఆనందించండి -
http://bhaskar.posterous.com/2427226
http://nalabhima.posterous.com/2441686

Aug 22, 2009

సాధించా ఈ రోజు

నిన్ననే సాధిద్దాం అనుకున్నా. ఐదు మైళ్ళు నడిచా, అంతే, నడుము కలుక్కు మంది.
ఈ రోజు సంకల్పించా. ఇయ్యాల శుక్రవారం, రేపొద్దున లేటుగా లేచినా పర్వాలేదు, ఏసేయ్ అనుకున్నా!! పట్టుదలగా వాన మబ్బులు కమ్ముకొచ్చినా లెక్క చేయకుండా ఏసేసా!!
6.2 మైళ్ళు, అనగా పది కిలోమీటర్లు నడిచా!!!!!
Name: iMapMyRun Aug 21, 2009 10:56 PM
Type: Regular Walk
Date: 08/21/2009
Start: 21:06:57
End: 22:52:08
Time Taken: 01:45:10

Workout Route: iMapMyRun Aug 21, 2009 10:55 PM
Total Distance: 6.26 mi.
Workout Stats
Pace: 16:48 (avg)
Speed: 3.57 (mi/hr) (avg)
MapMyFitness.com - Regular Walk: iMapMyRun Aug 21, 2009 10:56 PM on 08/21/2009

Aug 19, 2009

మా దేశంలో స్వాతంత్రదినోత్సవ వేడుకలు

మా వైపు స్వాతంత్రదినోత్సవ వేడుకలు అంగరంగవైభోగంగా జరిగినై.
ఏటి కొత్తా!! సరే ఇనుకో.
మా ఊళ్ళో పండగలు పబ్బాలు సొతంత్రదినాలు అన్నీ మేంచేసుకున్నప్పుడే. అంటే వారాంతానికే ఏదైనా. పంద్రా గస్టైనా, దసరా ఐనా, దసరా ఏషం గట్టినా, దీపావళి ఐనా ఏదైనా. కానీ కానీ, కొన్ని చోద్యాలు జరుగుతుంటై. ఎందుకు అని మాత్రం అడక్కూడదు. అదంతే.

ఊళ్ళో అంటే ఊళ్ళో కాదులేండి, మా వైపు అని. మాకు ఇక్కడ సెలబ్రిటీ రీజియన్ అంటే న్యూయార్క్/జెర్సి అన్నమాట.

ఆగస్టు మదిహేను, శనివారం అయ్యిందా? మేము ఆరోజు జెయ్యం. ఆగస్టు తొమ్మిదిన కొందరు జేసారు. దానికి గ్రాండ్ మార్షల్ అబ్బో చాలాపెద్ద సంఘ సంస్కర్త, పేదల పాలిట పెన్నిధి, నిజమైన సాఘీక సేవకురాలు ఐన శ్రీమతి మందిరా బేడీ గారు భారతదేశం నుండి వేంచేసారు. ఇంకో గుంపు ఆగస్టు పదహారున చేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెరేడ్ *వరల్డ్స్ లార్జెస్త్ ఇండియా డే పెరేడ్* అట ఇది, దీనికి గ్రాండ్ మార్షల్, ఈమె అతిరధి మాహారధి దురంధరురాలు. ముంబై నగరంలో స్లం డ్వెల్లర్స్ కి బంగారు గొలుసులు చేయించింది. పేదలకు గుడ్డ పంచటం కోసం ఈమె పాపం తన బట్టల సైజు తగ్గించేస్కుంది. ఆమెపేరే షిల్పాషెట్టి.


ఇక ఇంకో గుంపు ఆగస్టు పదిహేను రాత్రికి ఒక బ్యాష్ ని నిర్వహించినట్టున్నారు. దానిపేరు డ్యాన్సింగ్ దివా నైట్. దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ [అంటే రికార్డు డ్యాన్సర్లు] గా నల్గురు అతివలు వేంచేసారు. ఆ నల్గురూకూడా భయంకరమైన ప్రజాసేవ చేస్తున్నారు. అలాంటివారు న్యూజెర్సీ న్యూయార్క్ వైపుకి అడుగెట్టడం మా ట్రైసిటీ జనాల అదృష్టం. వారే *కొయినా మిత్ర* *ప్రీతి ఝింగ్యాని* *రాఖీ సావన్త్* మరియూ *తనూశ్రీ దత్తా*.
Description:
Bollywood Divas Nite with Rakhi Sawant, Koena Mitra, Tanushree Dutta and Preeti Jhangiani performing live in New York

When:
Saturday, August 15, 2009
@ 8:00 PM

Where:
Colden Center
65-30 Kissena Blvd
Flushing, NY 11367

Admission:
$25, $35 and VIP (100)

Aug 17, 2009

డబ్బు, యవ్వనం క్షణికాలు!! दौलत और जवानी, एक दिन खो जाती है!!

పాటలు రాయడం అనేది పూర్వజన్మ సుకృతం. ఈ క్రింది పాటల్లాంటివి రాసిన ఆ కవులందరికీ నా వందనాలు. ఈ క్రింది రెండు పాటలు రాసింది ఆనంద్ బక్షి. ఆయన్ని ఓ సారి స్మరించుకుందాం.
నడకకి వెళ్ళినప్పుడు నా ఐఫోన్ లో ఈ ప్లేలిస్టులు మోగుంటాయ్. ఒకటి కె అంటే కిషోర్, మరియూ బ అంటే బాలసుబ్రహ్మణ్యం.
కిషోర్ కుమార్ పాటల్లో ఇది బెస్ట్ అని చెప్పలేనన్ని ఉన్నాయ్. కొన్ని హత్తుకుంటాయ్. కొన్ని పొద్దస్తమానం మనసులో ప్లే అవుతూనే ఉంటాయ్. అలానే బాలసుబ్రహ్మణ్యం పాటలు.
అలాంటి పాటల్లో ఎందుకో ఈ రెండు పాటని ఇక్కడ పెట్టాలని పించింది.
ఒకటి - దియె జల్తే హై.
రెండు - దివానా లేకే ఆయాహై దిల్ కా తరానా


* Movie: Namak Haraam
* Singer(s): Kishore Kumar
* Music Director: R D Burman
* Lyricist: Anand Bakshi
* Actors/Actresses: Amitabh Bachchan, Rajesh Khanna
* Year/Decade: 1973


दिये जलते हैं, फूल खिलते हैं
बड़ी मुश्किल से मगर, दुनिया में लोग मिलते हैं

जब जिस वक़्त किसीका, यार जुदा होता हैं
कुछ ना पूछो यारों दिल का, हाल बुरा होता है
दिल पे यादों के जैसे, तीर चलते हैं
दिये ...

दौलत और जवानी, एक दिन खो जाती है,
सच कहता हूँ, सारी दुनिया
दुश्मन बन जाती है
उम्र भर दोस्त लेकिन, साथ चलते हैं
दिये ...
డబ్బు, యవ్వనం ఏదోరోజుకి పోతాయ్.
ప్రపంచం మొత్తం శతృవులౌతారు,
కానీ, జీవితాంతం మితృలు మనతో ఉంటారు.
इस रँग-धूप पे देखो, हरगिज नाज़ ना करना,
जान भी माँगे, यार तो दे देना, नाराज़ ना करना
रँग उड़ जाते हैं, धूप ढलते हैं
दिये ...


* Movie: Mere Jeevan Saathi
* Singer(s): Kishore Kumar
* Music Director: R D Burman
* Lyricist: Anand Bakshi
* Actors/Actresses: Tanuja, Rajesh Khanna
* Year/Decade: 1972

दीवाना लेके आया है, दिल का तराना -२
देखो कहीं यारों, ठुकरा ना देना, मेरा नज़राना
दीवाना लेके ...

आज का दिन है, कितना सुहाना, झूम रहा प्यार मेरा
पूरी हों दिल की, सारी मुरादें, खुश रहे यार मेरा
हो हो, चाँद सा जीवन साथी मुबारक
जीवन में आना
दीवाना लेके ...

अपने भी हैं कुछ, ख्वाब अधूरे, कौन अब गिने कितने
सच तो ये है के मेरे, दोस्त के सपने भी, हैं मेरे अपने
हो हो, उसकी खुशी अब, मेरी खुशी है
ऐ दिल-ए-दीवाना
दीवाना लेके ...

Aug 13, 2009

వసంతోత్సవ శుభాకాంక్షలు

వసుదేవ సుతం దేవం
కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం
కృష్ణంవందే జగద్గురుం||

చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారుమొలత్రాడు పట్టుదట్టి, సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు. చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు

మా చిన్నప్పుడు మా ఊళ్ళో కృష్ణాష్టమికి వసంతాలాడేవాళ్ళు.
ఊరి కూడళ్ళలో పెద్ద పెద్ద స్థంబాలు పాతి, అడ్డంగా కర్రలు కట్టి ఉట్టుకొట్టేవాళ్ళు.
ఇక్కడ కూడళ్ళలో పెద్ద పెద్ద స్థంభాలు ఉన్నాయ్, కానీ వాటికి ట్రాఫిక్కు లైట్లు ఏళ్ళాడుతున్నాయ్.

ఏమైనా
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Aug 12, 2009

నా నడక

ఈ మధ్య నా నడకని జి.పి.యస్ ద్వారా లాగ్ చేస్తున్నా. నా ఐ.ఫోన్ లో ఒక ఉచిత అప్లికేషన్ ఉంది. దానిపేరు మ్యాప్ మై రన్. ఇది, మన నడకని జి.పి.యస్ ద్వారా ట్రాక్ చేస్తుంది. అంటే కూకట్పల్లి నుండి వివేకానందనగర్ వరకూ నడిచాం అనుకోండి, ఏరోడ్డుమీద, ఎంత వేగంతో, లాంటి విషయాలని పట్టేస్తుందన్నమాట.


<-------------------<<<<<<
ఒక్కసారి పై బాణం చివరాకి చూడండి. నా నడక. ఇక్కడ నా నడక మ్యాపులని పెడుతున్నా. సరదాకి మాత్రమే. ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని.
ఈ అప్లికేషన్ ని జూన్ 17 న నా ఫోన్ లోకి ఎక్కించా. అప్పటినుండి దాదాపు నడచిన ప్రతీసారి ట్రాక్ చేసా దాదాపు. కొన్ని కొన్ని సార్లు చెయ్యలేకపొయ్యా అనుకోండి అది వేరే విషయం.
నా నడక గణాంకాలు -

Stats

Member Since: 06/17/2009
Total Maps: 26
Total Workouts: 23
Total Distance: 72.98 mi.
Total Burned: 0 (kcal)

Workout Summary
Walk: 23
Green Stats
Total Workout Days: 23
Distance Traveled: 72.98 mi.
Gas Saved: 4.05 gallons
Money Saved: $14.11
Carbon Offset: 78.5 lbs. of CO2
Recent Workouts
08/11/2009 - iMapMyRun Aug 11, 2009 10:11 PM
Walk: Regular Walk
Regular Walk | 3.54 mi.

08/10/2009
- iMapMyRun Aug 10, 2009 10:34 PM
Walk: Regular Walk
Regular Walk | 4.01 mi.

08/09/2009 - iMapMyRun Aug 9, 2009 10:05 PM
Walk: Regular Walk
Regular Walk | 4.44 mi.

08/08/2009 - iMapMyRun Aug 8, 2009 9:43 PM
Walk: Regular Walk
Regular Walk | 1.99 mi.

08/07/2009 - iMapMyRun Aug 7, 2009 10:49 PM
Walk: Regular Walk
Regular Walk | 4.47 mi.


నోట్ -
mi = మైళ్ళు.
ఒక మైలు = 1.6 కిలోమీటర్లు.
ఇప్పటికి 72.98 మైళ్ళు అనగా 117.449 కిలోమీటర్లు నడిచా.
అదేదో కధ గుర్తొస్తుందా? మధురాంతకం రాజారాం గారి తపాళా బంట్రోతు కధ. అదేం కధ అంటే, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, గుర్తున్నంతవరకూ ఇది - ఒక టీచరు, అతని విద్యార్ధులతో అతని చిన్ననాటి జ్ఞాపకాలని పంచుకుంటూ ఇలా చెప్తాడు - మా ఊళ్ళో ఓ తపాళా బంట్రోతు. అతను ప్రతీరోజు దగ్గర్లో ఉన్న పట్టణానికి వెళ్ళి వాళ్ళ ఊరికి, ఆ ఊరి తపాలా కార్యాలయ పరిధిలోకి వచ్చే అన్నీ ఊళ్ళ ఉత్తరాలను తెచ్చేవాడు. వచ్చిన ఆ టపాలను ఊరూరు తిరిగి ఇచ్చి, తిరుగుటపాలను కలెక్టు చేస్కుని, మర్రోజు వెళ్ళినప్పుడు అవి ఇచ్చి ఇలా...అతని జీవితంలో ముఫైమూడు సంవత్సరాలు తపాళా బంట్రోతుగా పనిచేస్తే ఎన్ని కిలోమీటర్లు తిరుంటాడో తెలుసా - సమచ్చరానికి 280 పనిదినాలు వేస్కుంటే
33 (అతని సర్వీసు కాలం) * 280 * 10 (సరాసరి 10 కిలోమీటర్లు రోజుకి అనుకుంటే) = 92400 కిలోమీటర్లు. ఇది కేవలం అతని పనికి సంబంధించి. ఇంటికి వెళ్ళుట, వచ్చుట, పొలానికి వెళ్ళుట వచ్చుట, ఇవి కలపకుండా.
చాలా బాగుంటుంది ఆ కధ

Aug 7, 2009

చెల్లెమ్మా!!!!!!

ఆ రోజు (మొన్న) రక్షా బంధన్!!
మావిడాయ్ ముందుగానే ఓ రక్షాబంధనం తెచ్చిపెట్టింది.
పిల్ల దాన్నిచూసి సూరిగాడివైపు చూసి కిచకిచ అంది.
సూరిగాడు అడిగాడు అదేంటి అని.
దీన్ని రాఖీ అంటారు బ్లాబ్లాబ్లా అని చెప్పింది వాళ్ళ అమ్మ.
నే ఆపీస్ నుండి ఇంటికెళ్ళంగనే ప్రతీరోజు, దాన్నితెచ్చి, నాన్న ఇది కీరా, చెల్లి నాకు నిన్న కడుతుంది అని రోజు సొద పెడుతున్నాడు. [మనం రివర్సు గేరు, అన్నీ వెనకనుండి ముందుకి]
పౌర్ణమి రానే వచ్చింది.
మనం కార్యాలయం నుండి ఇంటికెళ్ళేప్పటికి కట్టించుకున్నాడు.
చూపించాడు. బ్లాబ్లాబ్లా.
వాడు అది కట్టించుకున్నప్పటి డయలాగు -
"అమ్మా!! పెద్దయ్యాక నీకు చెల్లికి చీర కొనిపెడతా"
ఆ తల్లి సెంటీ అయి, తర్వాత ఏమైందో మీ ఊహకే వదిలేస్తున్నా!!!

Aug 4, 2009

అన్వర్ గారికో లేఖ

అద్దెచ్చా!! (ఛీ ఛీ - స్టడీ)
అయ్యా అన్వర్ గారూ (వై.యస్.ఆర్ స్టైల్లో)
నేనూ రంగుల ట్యూబులు కొన్నా
నేనూ ఓ ఇడ్లీ ప్లేటు కొన్నా
రంగుల ట్యూబులకి బొక్కలెట్టా
ఇడ్లీ ప్లేటులో పోసా
నీళ్ళు పోసా
ఓ కుంచె కొన్నా
కుంచెతో ఆ రంగుల్ని నీళ్ళలో కలిపా కాదు కాదు రంగులో నీళ్ళని కలిపా
కుంచెని ముంచా
తెల్ల కాయితకం మీన రంగు కుంచెని కదిపా
రంగుని పులిమా
కింద గడ్డి
పైన మబ్బులు
From కుంచె

From కుంచె

From కుంచె

From కుంచె


మరినన్ను మీ శిష్యుడిగా ఎప్పుడు తీస్కుంటారూ?
- నా పేరు సూర్యా
నాకు నాలుగెళ్ళు. నాకు ఫోర్ ఇయర్స్ (చెవులు పట్టుకున్నా మీకు కనిపించట్లా). ఐతే టూ ఇయర్స్ (చెవులు) మాత్రమే కనిపిస్తున్నాయ్.
బాయ్!!
అన్వర్ అంటే ఎవరూ అని అడగవచ్చు!!
క్లుప్తంగా ఆయన బ్లాగు ఇది
దిస్ ఈజ్ అన్వర్

Aug 3, 2009

సరటోగా ఆటోమొబైల్ సంగ్రహాలయం

నిన్నటి శనోరం, సూరిగాడి గోల తట్టుకోటానికి సులభమైన మార్గం ఏంటా అని ఆలోసించి, బయటకి తోల్కెళ్తే మస్తు అని నిర్ణయించాం. యాడికి? అని బుఱ్ఱగోక్కున్నాం. నేకొన్ని వెబ్ కాయితకాలు తిరగేసా. ఏదో ఓ లింకు తలిగింది. గేంద్వయా ముచ్చటీ అంటే మాఊరి దగ్గర్లోని గుఱ్ఱప్పందేల ఊరు సరటోగ స్ప్రింగ్స్ లో ఆటోమోబైల్ సంగ్రహాలయం ఉందనీ, అది ఇరవైమూడు నిమిషాల డ్రైవ్ అని, మనోడికి కార్లంటే తిక్క సమించండి పిచ్చి అని, ఆడకి తోలకెళ్తే మనోడానందిస్తాడానీ అనుకున్నాం. అన్నీ దులిపాం, కారు నింపికున్నాం. ఇస్టార్టు అయ్యాం. ఓ మైలు బోంగనే పిల్ల కేర్ కేర్ మని మొదలెట్టింది. మావిడ మీరెళ్ళండి, ఇంట్లో పిల్లని పడుకోబెడతా అని ఓ చారిత్రాత్మక నిర్ణయం తీస్కుంది.
నాయనా వెళ్ళాం బాబూ. ఇవిగో కొన్ని పుటోబులు ఇక్కడ పెడతన్నా. ఆనందించు.
ఒక అంతస్థులో కన్వర్టిబుల్స్ పెట్టారు. ఇంకో అంతస్థులో న్యూయార్క్ రేసింగ్ కి సంబంధించిన కొన్ని రేసింగ్ కార్లు పెట్టారు.
రోమాంచ కలిగించిన కార్లు రెండు - ఒకటి ఫెరారి, రెండు మసెరాతి (1921). 1901, 1902, 1910, 1920 ల కార్లు కూడా పెట్టారు.
ఆస్టిన్, లింకన్, బెంజ్, షెవి, లాంటి కన్వటిబుల్స్ అలరించాయి.
ఒక్కడ చూడండి -
మసెరాతి -
From Car_Museum

ఫెరారి
From Car_Museum

గ్రేట్ రేసర్ సూర్యా 2009 సీజన్
From Car_Museum

మిగతావి ఇక్కడ చూడండి -

సంగ్రహాలయం = మ్యూజియం