Sep 29, 2008

నేటి ఉపాధ్యాయులూ చదువులూ

నేననుకుంటుంటాను, ఈరోజున ఆంగ్ల పాఠశాలల్లో చదువు ఎంతవరకు విలువైన చదువూ? అని.
కారణం, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ఒక ప్రవేశ పరీక్ష రాసి, ఒక సెలెక్షను ప్రాసెస్ తో వస్తారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవాళ్ళు? జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయులకి ఒక బోధనా పద్ధతి, ఇన్స్పెక్షను గట్రా, మరి వీళ్ళకి? ఏంటి ప్రమాణాలు?
ఇన్ని ఇంగ్లీషు బడులు రాకమునుపు స్టేటు ర్యాంకులు తెలుగు మీడియం వాళ్ళకే వస్తుండేవి, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల పాఠశాలలకి ఎక్కువ వస్తుండేవి, కొడిహినగళ్ళి, తాడికొండ ఇలా.
ఈ ప్రైవేటు పాఠశాలలు వచ్చాక వీళ్ళు డబ్బుబెట్టికొనుక్కోటం మొదెలుబెట్టారు అన్నీ.
అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే ,ఈరోజు ఎంతమంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పిల్లల్ని అదే బడిలో జేరుస్థున్నారు?
ఇంగ్లీషు మీడియం చదువే చదువా? మిగతావి బడులే కావా?
పిడుగు రాళ్ళలో బడి ఒకప్పుడు చాలా పేర్ప్రఖ్యాతులు గడించింది. మానాన్న దాంట్లో పని చేసేప్పుడు ఆయన, సహ ఉపాధ్యాయులు, పోటీలుపడి పాఠాలు చెప్పే వాళ్ళు (Quality). ఆ బడికి పెద్ద గ్రౌండు. మేము (నా సోదరుడు, నేను) తండా బడిలో చదువుకున్నాం, అది మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల. మా ఉపాధ్యాయులు తాట తీసేవారు. ఎఱ్ఱంశెట్టి సీతారామయ్య మాష్టారు, సీతారామయ్య మాష్టారు, ఆంజనేయులు మాష్టారు, రామిరెడ్డి మాష్టారు, రామస్వామి మాష్టారు, విజ్యలక్ష్మి టీచరుగారు ఒక్కొక్కళ్ళూ డెడికేటెడ్గా పనిచేసేవారు. నేను 8-10 చదువుకున్న మోర్జంపాడు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల చాలా పెద్దది. అసలు బడికి వెళ్తే ఒక రకమైన భావన రావాలి. ఇరుకు గదుల్లో, ఆటస్థలంలేకుండా, ఎవుడుపాఠాల్జెప్తున్నాడో తెలియదు, దేనికిజెప్తున్నారో తెలియదు, ముక్కునబెట్టుకోటం పరీక్షల్లో ఛీదటం. మర్కులు బానే వస్తాయ్..కాని?
మోర్జంపాడు ఎత్తుబడికి బెస్ట్ బడి అవార్డ్ కూడా వచ్చింది. 1000-2000 చెట్లు నాటాం. రకరకాల చెట్లు. బళ్ళో మగ్గాలుండేవి. క్రాఫ్ట్స్ మాష్టారు ఒకాయన, ఒకక్రాఫ్ట్స్ పిరీడు. మగ్గాలమీద నవారు నేసే వాళ్ళం. సంవత్సరానికోసారి వాటిని పాటపెట్టి అమ్మేవాళ్ళం. బళ్ళో పెరిగిన గడ్డికోస్కుంటానికి పాట ఉండేది. బళ్ళో టమాటా, వంకాయా గట్రా కూరగాయలు పండించేవాళ్ళం. చదువు ఎంతవరకూ వచ్చింది అనేది పెద్ద విషయం కాదు. అది విద్యార్ధి మీద ఉంటుంది. ఒక పద్ధతి ఉందా లేదా అనేది ముఖ్యం.
ఈరోజున జి.ప్ర.ప.ఉ పాఠశాలలు బోసిపోతున్నయి.

6 comments:

  1. మీరన్నట్టుగానే ఏమాత్రం నైపుణ్యం లేనివారు ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తున్నారు. చదువుకునటం పోయి చదువు'కొనటం' ఎక్కువయ్యింది. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మౌళిక వసతులు ఎక్కువగా కల్పిస్తే ఉపాధ్యాయుల పిల్లలు కూడా వాటిలోనే చదవడానికి మొగ్గుచూపుతారు...

    ReplyDelete
  2. నేను జిల్లా పరిషత్ పాఠశాలలో నే చదువుకొన్నవాడిని. మీరు చెప్తున్నది కొంతవరకు నిజమే. కాకపొతే మనం చదువుకొన్న రోజులలొ వున్నట్లు జిల్లా పరిషత్ పాఠశాలలు ఇప్పుడు లేక పోవడమే, పల్లేటూర్లులో కూడ ఈ కాన్వెంట్ చదువులకు జనాలు ఎగబడటానికి కొంత కారణం.

    అప్పటి లాగ పోటీలు బడి పేరు కోసం, కష్టబడి పాఠాలు చెప్పే ప్రబుత్వ ఉపాధ్యాయులు తగ్గి పోతున్నారు అనేది నిజం. అంతవరకు ఎందుకు వాళ్లలో చాలామంది వాళ్ల పిల్లలనే ఈ బోడి కాన్వెంట్ లకు పంపిస్తున్నరంటే, వాళ్లు చెప్పే పాఠశాలల మీద వాళ్ల నమ్మకం ఎంతవరకో అర్ధం అవుతుంది.

    బాగా పాఠాలు చెప్పగలిగి జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్లు పాఠాలు చెప్పక పోవడానికి కొంత మారిన సామాజక పరిస్థితులు కూడా కారణం. అంతకమునుపు బాగా పాఠాలు చెప్పే టీచర్లను కులాలు, మతాలు, ప్రాంతాలల్తో సంబంధం లేకుండా జనాలు గౌరవించేవాళ్లు. ముఖ్యంగా పల్లెటూర్లులలో అయితే నెత్తిన పెట్టుకొని చూసుకొనే వాళ్లు. ఇప్పుడు క్రొత్త టీచరు స్కూల్ కు వస్తే ముందు చూస్తుంది ఆయనది మన కులమేనా అని.
    ఇక స్కూళ్లలో పెరిగిన రాజకీయాల గురించి ఎంత చెప్పుకొంటే అంత తక్కువ. Head Master ప్రమోషన్ వస్తే వద్దనుకొని వదిలేసుకొన్న వాళ్లు నాకు చాలా మంది తెలుసు. Head Master మాట వినే టీచర్లు పెద్దగా ఎవరూ వుండటం లేదు. గట్టిగా ఎమయినా మాట్లాడితే Head Master ని బెదిరించే (s.c/s.t కేసు పెడతాము అనో, పలానా రాజకీయనాయకుడు మావాడే ననో) వాళ్లే ఎక్కువ.

    ఇలాంటి, చాలా కారణాల వల్ల ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రబుత్వ పాఠశాలలు ఇప్పుడు, పెద్దగా qualified కాని టీచర్లు చెప్పే బోడి కాన్వెంట్ ల ముందు వెల వెల పోతున్నాయ్యి. బాధాకరమయిన విషయం ఏమిటి అంటే, అప్పటి టీచర్ల కంటే, ఇప్పటి టీచర్లకు జీతాలు బాగా పెరిగినాయి. కాని చెప్పటం మాత్రం తగ్గి పోయింది. పొరపాటున ఎవరయినా చెబ్తామనుకొన్నా వాళ్లకు ఆదరణ కరువు అవుతుంది.

    ReplyDelete
  3. విద్యాబోధనలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకున్నది. ఇంతకు మునుపు మన పాఠశాలల్లో డిటెన్షన్ విధానం ఉండేది. ఇప్పుడు నాన్ డిటెన్షన్ విధానం వల్ల విద్యార్ధి 220 పని దినాలకు గాను ఏవో కొన్ని రోజులు పాఠశాలకు హాజరయితే వాణ్ణి పాస్ చేయమని ప్రభుత్వ సలహా ఉత్తర్వులు. విద్యార్ధికి బోధన చెయ్యడానికి కూడా సాధ్యంకానంత రికార్డు వర్కు ఉపాధ్యాయులు చేయవలసి వస్తుంది.రేపు అక్టోబరు 15న ఉపాధ్యాయులంతా కలసి విద్యార్ఝులను ఊరేగింపుగా గ్రామంలోనికి వీధివీధీ తిరుగుతూ టాయిలెట్ కు వెళ్ళిన తరువాత " చేతిని సబ్బుతో కడుక్కోవాలి "అని ప్రచారం చేయాలట.
    హైస్కూళ్ళలో కూడా పదవతరగతి పైనే అధికారుల వొత్తిడి వుంటుంది రిజల్ట్స బాగా రావడంకోసం. ఎక్కువమందిని పాస్ అయ్యేలాగా చూస్తున్నారేగానీ , ప్రయివేటు స్కూళ్ళలోలాగా ఎక్కువమార్కులు పొందే పోటీ పెట్టడంలేదు.విద్యార్ధి ఎక్కువ మార్కులు పొందే పోటీలో లేకపోతే వాని భవిష్యత్తు బాగుండదు. కనుకనే ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రయివేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. వాళ్ళని చూసి అందరూ అదే దారిలో పోతున్నారు.తల్లిదండ్రుల ఆశలకు , ప్రభుత్వ ఆకాంక్షలకు తేడాలు సమసినరోజున ...అది అంత వీజీకాదు.

    ReplyDelete
  4. కర్ణుడి చావుకి వందకారణాలన్నట్లు,మన స్కూళ్ళు ఇలా తగలడ్డానికి అన్నికారణాలున్నాయి.

    ప్రాధమిక, మాధ్యమిక విద్యలకు స్వతంత్ర్యానంతరం ఇవ్వవలసిన ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వకపొవడంతోబాటూ, బతకలేక బడిపంతులనే ఛందంలో ఉపాధ్యాయవృత్తిని ఆదాయం లేని ఉద్యోగంగా చెయ్యడంతో, యోగ్యతా,కోరికా ఉన్నవాళ్ళుకూడా దూరతీరాలకు బ్రతుకుతెరువుకోసం వెళ్ళేలా చేసింది.
    ఇక ప్రస్తుతం ఉన్న పోకడలకు ఇదే ప్రభుత్వ నిరాసక్తత కారణమయ్యింది.

    ReplyDelete
  5. @ మహేష్ గారు:>>బతకలేక బడిపంతులనే ఛందంలో ఉపాధ్యాయవృత్తిని ఆదాయం లేని ఉద్యోగంగా చెయ్యడంతో, యోగ్యతా,కోరికా ఉన్నవాళ్ళుకూడా దూరతీరాలకు బ్రతుకుతెరువుకోసం వెళ్ళేలా చేసింది.
    ?? ఈనాటి బీ.ఈడి కి బేసిక్ ఎంతో తెలుసా మీకు? బతకలేక బడిపంతులు ఒకానొక కాలమ్లో. వాళ్ళకీ పే రివిజన్లు బాగనే జరిగాయ్. ఇది తల్లితండ్రుల అవివేకం, ఒకడ్నిజూసి ఇంకోకడు వాతపెట్టుకోవటం. ఆడు పలాని బడికి పంపిస్తున్నాడు, నేను పంపుతా.
    ప్రభుత్వాం ఏంజేస్తుంది? బాడికెళ్ళండయ్యా అనేజెప్తుంది. నువ్వు పలాని బళ్ళోపనిజేస్తున్నవ్ కాబట్టి అదేఊళ్ళో ఉండూ అంది. ఎవుడుంటున్నాడూ? దెగ్గర్లో ఉన్న సిటీలో ఉండి రోజూ తిరిగుతా అనేవాడే కానీ!! సరే పార్వతీ పురమ్లో పోష్టింగేస్తే, అక్కడా వసతుల్లేవ్, డాక్టరు లేడు, అది లేదు ఇదిలేదు. మరి అక్కడ బతికేవాళ్ళు కూడా జనాలేగా??
    ప్రభుత్వ పాఠశలల్లో చదువు వెనుకబడిన తరగతులకి మాత్రమేనా (సామాజికంగా/ఆర్ధికంగా)?
    @వర్మ: మౌళిక వసతులు? ప్రైవేటు పాఠశాలల్లో ఆమాత్రం వసతులు కూడా లేవు కదా?
    @కృష్ణ:
    >>అప్పటి లాగ పోటీలు బడి పేరు కోసం, కష్టబడి పాఠాలు చెప్పే ప్రబుత్వ ఉపాధ్యాయులు తగ్గి పోతున్నారు అనేది నిజం.
    -100% నిజం.
    >>ముఖ్యంగా పల్లెటూర్లులలో అయితే నెత్తిన పెట్టుకొని చూసుకొనే వాళ్లు. ఇప్పుడు క్రొత్త టీచరు స్కూల్ కు వస్తే ముందు చూస్తుంది ఆయనది మన కులమేనా అని.
    -100% నిజం.
    అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు మాధ్యమం అంటే అదేదో ఒక వర్గం ప్రజలకి మాత్రమే అనే భావన.
    @అజిత్:
    >> రేపు అక్టోబరు 15న ఉపాధ్యాయులంతా కలసి విద్యార్ఝులను ఊరేగింపుగా గ్రామంలోనికి వీధివీధీ తిరుగుతూ టాయిలెట్ కు వెళ్ళిన తరువాత " చేతిని సబ్బుతో కడుక్కోవాలి "అని ప్రచారం చేయాలట.
    తప్పేంటి? పిల్లలకి సామజిక స్పృహ కల్గుతుంది.
    ఈనాటి విద్యార్ధులు తల్చుకుంటేనే మన సామాజిక ఋగ్మతల్ని రూపుమాపగలం. అదొక విప్లవమ్లా కావాలి. ప్రతీఒక్క విద్యార్ద్ధిస్పందించాలి.

    ReplyDelete
  6. భాస్కర్ గారు, మీ టపా చదివానండి.పిల్లల మీద చాలా వత్తిడి పెరిగిపోతొంది ఈ మధ్య కాలంలో.నేనేతే పిల్లలకు ఉపయోగపడేదే విద్య అంటాను. అంతే గాని ఇలా బలవంతంగా నేర్పించేది కాదు.ప్రతి పిల్లవాడికి అన్నిటి మీద ఇష్టం వుండకపోవచ్చు. నా ఉద్దేశం అయితే పిల్లలకు ఇష్టం అయిన వాటిని నేర్పించడానికి మనం సహయం చేస్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు.జీవీతం లో వాళ్ళకు ఇష్టమైన వాటిని చేస్తూ సంతోషం గా వుంటారు.మన విద్యావిధానం పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేదిగా వుండాలి.
    ఇక మీ ప్రాజెక్ట్ వర్క్స్ బ్లాగ్ గురించి చాలా రోజులుగా ఒక విషయం చెప్దామనుకున్నాను. అందులో విషయాలు మన రోజువారి జీవితాల్లో మార్పు ను తెచ్చేవిగా వుంటే బాగుంటుంది. ఉదాహరణకు మీ హోం ఎనర్జీ స్టేషన్ టపా తీసుంటే నాకైతే అది ఎంతవరకు మనం చేసుకోవచ్చొ తెలీదు. దాని బదులు అందరికి అర్థం అయ్యేవి ఆలోచింపచేసేవి, మన జీవితాల్లో ఉపయోగించగలిగే ప్రత్యామ్నాయా విధానాలు తెలియజేస్తే మేలెమో అనుకుంటున్నాను.

    ReplyDelete