Dec 22, 2020

గ్రేట్ వాల్ ఆఫ్ అమెరికా

ఒక వైపు కోవిడ్ విఝృంభణ
మరోవైపు మృత్యుహేల
పిట్టల్లా రాలిపోతున్న జనం
కిం అనని ప్రభుత

అలా పక్కన పెడితే
మాస్క్ పెట్టుకోం అని వాదించే మూర్ఖులు

అలా పక్కనపెడితే
రోజురోజుకీ పెరుగుతున్న నిరుద్యోగం
ఉద్యోగాలు కోల్పోతున్న కార్మికులు

నెలాకరుకి అద్దె కట్టలేక రోడ్డున పడనున్న బతుకులు
ఇప్పుడే ఇలా చేయాలా అనిపించేలా వణికిస్తున్న చలి తీవ్రత

అబ్బెబ్బే కోవిడ్ అంతా ఉత్తిదే అంటు జనాన్ని చీకట్లోకి నెట్టి
టికా రాంగనే సేనని పక్కకి నెట్టి పొడిపించుకుంటున్న రాజకీయ రాబందులు 

పక్కనపెడితే 
జనానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షంతో *స్టిమ్యులస్ డీల్*

ఒక పక్కన జనాలు ఫుడ్ సెంటర్స్ దగ్గర గంటలు గంటలు బారులుతీరి నిల్చుంటున్నారు

జనాలు నీ ముఖాన్ని గెలిపించలేదంటే
కోర్టుల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పటానికి $207 బిలియన్ డాలర్లు సేకరించిన అధ్యక్షుడు

అన్నార్తుల ముఖాన $600 స్టిమ్యులస్ చెక్ కొట్టటనికి డీల్

మరోవైపు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఇనుప గోడకి $1.375 బిలియన్ డాలర్ల ఉద్దీపన

ఎవరి కన్నీళ్ళు తుడవటానికీ?
ఎవరి జేబులు నింపుకోటానికీ?

Dec 13, 2020

మాస్క్ పెట్టుకోవటం అనేది హక్కు

ముఖానికి మాస్క్  పెట్టుకుంటే కోవిడ్ సంక్రమించ కుండా ఆపలేమేమో కానీ కనీస జగ్రత్తకీ ఉపయోగపడచ్చు. ఈవిషయాన్ని చెప్పటానికి పి.హెచ్.డి చెయ్యాల్సినా పని లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని మనం కపాడుకోటానికి ఉపయోగపడతాయి అని చెప్పటానికి డా||ఫౌచి ఇంటింటికి వెళ్ళో లేక ప్రతీ మనిషికీ ఫోన్ చేసో చెప్పల్సిన పనిలేదు.


ముఖానికి మాస్క్ వేసుకోటం అనేది ఒక మనిషి తనకు తనుగా స్వచ్ఛందంగా చేయ్యాల్సిన ఆచరించాల్సిన సమాజిక బాధ్యత కనీసం ఈ రోజుల్లో.


మాస్క్ పెట్టుకోవటం అనేది హక్కు.


ఘోరం ఏవిటంటే మాస్క్ పెట్టుకోవటాన్ని పెట్టుకోండని చెప్పటాన్ని పెట్టుకోకపోతే ఏదోలా పెట్టుకునేలా చేసే ఆలోచననీ రాజకీయం చేసేశారు కొందరు. దానికి కొన్ని వార్తా సంస్థలు వత్తాసు.


నిన్న రాత్రి వాషింగ్‌టన్ లో జరిగిన సంఘటన - కార్లో వెళుతూ మాస్క్ పెట్టుకున్నారని ఆపారు ప్రౌడ్ బాయిస్ అనే ఒక ట్రంప్‌ని మోసే గుంపు. వీళ్ళ దృష్టిలో మాస్క్ పెట్టుకున్నవాళ్ళు ట్రంప్ ని వ్యతిరేకించేవాళ్ళు.


భయంగొలిపే సంఘటన.


Dec 8, 2020

ట్రంపిజం

ఆనాడు డ్యూటీలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి అందునా ఒక స్త్రీ మీద చేయిచేసుకుని పదవని కోల్పోయి తన ఉనికినే కోల్పాయాడు ఒక మంత్రి. 

ఈనాడు తన బాధ్యతను తాను నిర్వర్తించినందుకు ఈమె ఇంటి మీదకు తుపాకులతో వేళ్ళారు దుర్మార్గులైన కొందరు.

ఒక దొంగ పుట్టుకతో దొంగ కాడు, ఒక దొంగ తయ్యారు కాబడతాడు.

ఒక దేశాధ్యక్షుడు పుట్టడు, తయ్యారుకాబడతాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో. (మన కర్మ మనదేశంలో ఇంకా కుటుంబ పాలనలో మగ్గుతున్న రాజకీయ కుటుంబాలున్నాయనుకోండి)


ఈమె పేరు జోసిలిన్ బెన్‌సన్, మిషిగన్ రాష్ట్రానికి సెక్రెటరి. రాష్ట్ర సెక్రెటరి ఇంటి మీదకే వేళ్ళారంటే వీళ్ళు ఎంతలా ప్రేరేపితం కాబడ్డారో?

వీళ్ళు ట్రంపిజాన్ని మోస్తున్న సైనికులు అని వేరేగా చెప్పాల్సిన పనిలేదు. తప్పు వీళ్ళదా? వీళ్ళని ప్రేరేపిస్తున్న వ్యవస్థదా?

తప్పు చేసేవాడిదే చేయించేవాడిదా?

తప్పు గొఱ్ఱెదా కాసేవాడిదా? 

ఇంత జరిగినా రిపబ్లికన్ పార్టీ నుంచి గానీ, దేశాధ్యక్షుడి నుంచి గానీ దీన్ని ఖండిస్తూ ఎక్కడా ఒక్క స్టేట్మెంట్ లేదు.

Jocelyn Benson just released a statement: “As my four year old son and I were finishing up decorating the house for Christmas on Saturday night ... dozens of armed individuals stood outside my home shouting obscenities and chanting into bullhorns in the dark of night.”