Dec 17, 2008

సింహావలోకనం

ఒక్కసారి వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూస్కుంటే, ఎన్నో ఓడుదుడుకులు, ఎన్నో మైలురాళ్లు, ఎన్నో గోతులు, ఎన్నో బొక్కలు, ఎన్నో అబద్ధాలు, అన్నో పచ్చి నిజాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, మరెన్నో కష్టాలు, కన్నీళ్లు.
ప్రతీ మనిషీ తెలిసి కొన్ని తప్పులు చేస్తాడు, తెలియక కొన్ని తప్పులు చేస్తాడు, తప్పటడుగులు వేస్తాడు. ఐతే తెల్సిచేసిన తప్పులు ఈష్టు తెలియక చేసిన తప్పుల నిష్పత్తి చాలా ముఖ్యం. నేనూ చాలా చేసాను, కొన్ని కొన్ని సార్లు తెల్సి చేసాను. కొన్ని తెలియక చేసాను, కొన్ని అడాలసెంట్ వయసు చేయించింది. అలాంటి తప్పుల్లో నా అతిపెద్దద్ది, సిగరెట్టు తాగే అలవాటు. సరదాగా మొదలుపెట్టాను, అందర్లానే. దాన్ని మానటం పెద్ద కష్టమైన విషయం కాదు అనికూడా తెల్సు మొదలెట్టిన రోజున, కాని, దేనికో అసంబద్ధమైన కారణాలు నాకు నేనే చూపుకుంటూ అలా తాగుతూనే వచ్చా. ఓ రోజున ఠకా మని మానేసా, కొన్ని నెలల క్రితం. అది ఎప్పుడో చేసుండాల్సింది.
ఎంతైనా ప్రతీ మనిషికీ సమాజం కొన్ని పాఠాలు నేర్పిస్తే, జీవితం కొన్ని నేర్పుతుంది. నేనూ నాజీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా.
ఐతే, నా జీవితమ్లో నాకు జరిగిన అతిపెద్ద నష్టం, మా నాన్నని కోల్పోవటం. ఆనందాలు -పెళ్లి, నేనంటే ప్రాణం అనే శ్రీమతి, సూరిగాడు పుట్టటం, ఇప్పుడు పాప పుట్టటం. ఐనా ఏదో వెలితి. మా అమ్మ ఒక్కతే దేశంలో ఉందే అని. కోరి అమెరికా రావడం నిజంగా నా జీవితంలో పెద్ద తప్పటడుగు. మనం కొన్నిటికి వేదాంతంతో మూసేసుకుంటాం "డెస్టినీ ఎవ్వర్ని ఎటు తీకెళ్తుందో కదా" అని. చూద్దాం ఇక ముందు ముందు ఎలా ఉంటుందో.
కానీ అమెరికా కి వచ్చి నేను ఎన్నో నేర్చుకున్నా. నేను ఎన్ని బ్లాగులు రాస్తున్నా, నా పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలా. Bhaskar is the pillar for the projects అని అనిపించుకున్నా. Bhaskar, Problem Solver అనే అనిపించుకున్నా. I am happy for that.
నాకు చేతైనంతలో నా అనుభవాల్ని నలుగురితో పంచుకుంటున్నా. WebSphere మీద బ్లాగు రాస్తున్నా. నాకు ఎవ్వరైనా మెయిల్ చేసి సహాయం అడిగితే వాళ్లని ఏమాత్రం నిరుత్సాహపరచను. FileNet మీద ఈ ఫోరంలో ప్రశ్నలకి నాకు తెల్సిన సమాధానాలు రాస్తుంటా. నలుగురికీ ఉపయోగపడాలని http://projectsforfuture.blogspot.com రాస్తున్నా.

ఈ గోల దేనికీ అంటే ఈ రోజు నా పుట్టినరోజు.

22 comments:

  1. జన్మదిన శుభాకాంక్షలు అన్నా! :)

    ReplyDelete
  2. పుట్టిన రోజు శుభాకాంక్షలు .

    ReplyDelete
  3. Happy Birthday andi.May ur life be filled with more n more happiness.

    ReplyDelete
  4. మాస్టార్ని కోల్పోవడం మీకే కాదు. మాకు కుడా లోటే. గుంటూరు వెల్తే ఆప్యాయంగా పలకరించె ఆయన ఇప్పటికీ నా కంట్లో మెదుల్తున్నారు.

    ReplyDelete
  5. జన్మదిన శుభాకాంక్షలు భాస్కర్ !!

    ReplyDelete
  6. మాస్టారు,

    Congratulations and all the best in your life.

    ReplyDelete
  7. Many Many Happy Returns of the Day Bhaskar :)

    ReplyDelete
  8. పుట్టిన రోజు శుభాకాంక్షలు !!

    ReplyDelete
  9. many many happy returns of the day..

    May god bless you for all the help u r providing for all of us.

    thanks and once again have a great bday

    ReplyDelete
  10. జన్మదిన శుభాకాంక్షలు భాస్కర్ గారు.

    ReplyDelete
  11. భాస్కర్ గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. wish u will get bundles of happyness in rest of Ur life

    Ananth

    ReplyDelete
  13. అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు.

    ReplyDelete
  14. Many Many Happy Returns of the Day!!

    Wish you all the success in your future part of life.

    -Revathi

    ReplyDelete
  15. Bhaskar gariki, Wish you a very very happy birthday

    ReplyDelete
  16. Wish you Happy Birthday....I really appreciate the thought of helping IT professionals. All the best.

    ReplyDelete
  17. జీవితం అంతే ..కొన్ని కావాలంటే... కొన్ని వదులుకోవాలి...ప్రాధమిక దశలో మనం చేసిన కొన్ని తప్పులే ఇప్పుడు మన అనుభవానికి మెట్లు. అందుకే మన సాంప్రదాయంలో అనుభవానికి పెద్ద పీట వేస్తారు. అందుకే.....
    అదేదో సినిమాలో పాటలాగా......అనుభవించు రాజా.....

    ReplyDelete
  18. భాస్కర్ గారు, జన్మదిన శుభాకాంక్షలు..

    ReplyDelete
  19. అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు.

    ReplyDelete
  20. భాస్కర్ గారు,
    మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కొంచెం లేటుగా! ఊళ్ళో లేను కదా మరి..ఇవాళే చూశా మీ పోస్టు!

    ReplyDelete
  21. @సుజాత గారు: ధన్యవాదాలు అండి. లేటుగా అయినా లేటెష్టుగా చెప్పారు. :):)

    ReplyDelete