Jul 29, 2020

కిన్నెత్ కథ

సాక్షి నాటకం మూడు భాగాలుగా ఆకాశవాణి రేడియోలో ఇప్పటికి అనేక సార్లు ప్రసారం అయ్యింది, అనేక సార్లు విన్నాను కూడా.
ఈ నాటకంలో జంఘాల శాస్త్రిగా కీశే సుత్తివేలు
సాక్షి రంగారావు కూడా నటించారు.
ఎందరో గొప్ప నటులు. వారందరికీ వందనాలు.
వీళ్ళు గొప్ప నటులంటే.
సుత్తివేలు, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాదు, గొల్లపూడి, రావు గోపాల రావు, కైకాల, కాకరాల ఇలాంటివాళ్ళు గొప్ప నటులు.


ఏవైనా సాక్షి మూడో భాగంలో కిన్నెత్ కథ ఎంతో ఆసక్తిగా అనిపించింది.
ఇది కథే కావచ్చు. కాని ఒక కోణాన్ని ఆవిష్కరించారు రచయిత పానుగంటి.
ఇందులో షాజహాన్ ముంతాజ్ ల మధ్యలోకి ఇంకోక స్త్రీ భార్యగా రావటాన్ని ముంతాజ్ సహించకపోవటం, అసూయతో ఆమెని అంతమొందించటానికి పరిచారిక అయిన రోషనారతో ఒక పధకం రచించటం, షాజహాన్ ఆ పధకంలోకి లాగబడటం, వెరసి కిన్నెత్ బలి కావటం.

కథని పక్కనపెడితే, షాజహాన్ కి ముంతాజ్ అంటే అంత ప్రేమా? వీడికి బహు భార్యలు. ఇందర్లో ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడంటే ఎక్కడో ఓ పెద్ద డిస్కనెక్ట్.

PN Oak లాంటి వాళ్ళు ఎన్నో రాసుకొచ్చారు ఈ అంశం మీద.

నిజానిజాలు దేవుడికెరుక.

https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF_%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B0%B5_%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%82/%E0%B0%85%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81

Jul 27, 2020

అనఘ రేడియో జాకీ

మిత్రుడు వెంకట్ Telugu NRI Radio లో guest RJ రోల్ చేయగలదా అనఘా అని అడిగాడు.
మా మంచికోరే మిత్రుడు అడిగిందే తడవు ఆనందంగా నేను ఒప్పేసుకుని అనఘ గారికి వివరించాను రేడియో జాకీ అంటే ఏంటీ దానివల్ల జరిగే మంచి, అలాంటి వేదిక దొరకటం అన్నీ.
"యా చేస్తా" అన్నది అనఘ.

తను ఒప్పుకోవటం కార్యక్రమం తయ్యారు కవటం చకచకా జరిగిపోయాయి

బ్లాగ్ మిత్రులు తన  కార్యక్రమాన్ని తప్పక వినాలని కోరుతున్నా



ఈ అవకాశాన్నిచ్చిన మిత్రుడు వెంకట్ కి కృతజ్ఞతాంజలులు అనఘ తరపునుంచి.

Jul 25, 2020

చలం పురూరవ


నేను చలాన్ని చదవలేదు అంతకన్న పూసుకోలేదు
చలాన్ని చలం కళ్ళతో చూసే స్పూర్తి లేదు మత్తి లాంటి వాళ్ళు చలాన్ని మోయటం ఒక కారణం కావచ్చు.

ఈ మధ్య ఆకాశవాణిలో అలనాటి సవ్య  సౌరభాలు నాటకాలు - రేడియో శబ్ద భాండాగారం నుండి అలనాటి నాటకాలు ప్రసారం అవుతున్నాయి.

అందులో విన్నది ఈ నాటకం.
చలం రచించిన పురూరవ.

నన్ను కట్టివేసింది ఊర్వశి పాత్ర. ఈ నాటకంలో రెండే పాత్రలు. ఊర్వశి, పురూరవుడు. 
ఊర్వశిగా నటించినామె శారదా శ్రీనివాసన్. పురూరవుడిగా K చిరంజీవి.

ఊర్వశి:
నీ జ్ఞాపకాన్ని తీసేయనా? పూర్వం వలే సుఖంగా జీవింతువుగాని.
పురూరవుడు:
నీ జ్ఞాపకం లేకుండానా?
వద్దు? ఇట్లానే ఆశతో నీ విరహంతో కాలనీ
ఊర్వశి:
చూశావా మరి ఈ వియోగం, బాధ ఎందుకని ఏడుస్తావు గాని, వాటివల్ల కలిగే అశాంతే లేకపోతే ఏం అందుకో గలరు మీరు? అన్నీ సహించు. విధిని ప్రార్థించు. దిక్కులదిరేట్టు "ఊర్వశీ" అని ప్రణించు. సాధించు, నీ కోసమే కాచుకుని ఉంటాను. నేను చాలా సత్యం. నీదాన్ని. నీజీవితం ఒక్క క్షణం. ఊర్వశితో అనుభవం అనంతం.


గొప్ప నాటకం. 

ఆర్కైవ్స్ లో పుస్తకం దొరికింది

ఆకాశవాణి వారు ఈ నాటకాన్ని యూట్యూబ్ లో ఉంచారు. ఇక్కడ వినవచ్చు


Jul 18, 2020

డి వి నరసరాజు

డి వి నరసరాజు


శ్రీ డి.వి నరసరాజు శతజయంతి అని శ్రీ ంభ్ఖ్ ప్రసాద్ గారి వ్యాసం ఒకటి చదివాను.

నరసరాజు గారు గొప్ప వ్యక్తి. ఆయన సినిమా వ్యాసంగం గొప్పది. సంభాషణల రచయితాగా ఎంతో ఆకట్టుకున్నారు. కథారచయితా గొప్ప రచనలు చేశారు.

తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాయి - రంగులరాట్నం. ఈసినిమకి మాటలు అందించింది రాజుగారే.

ఇక ఈయన ఎన్ని సినిమలకు రాశారు అనే ఊదర కబుర్లు పక్కన పెడితే - ఒక రచయిత మీద అతని సమాజం యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది. దాన్ని ప్రస్ఫుటంగా బయటపెట్టడానికే రచయిత ప్రయత్నిస్తాడు.

స్వతహాగా రాజుగారు హేతు వాది. ఆ నేపథ్యం నుండి వచ్చిందే పెద్దమనుషులు కథ.
రాజు గారు ంణ్ ఋఒయ్ అనుచరుడు. తప్పులేదు. మనకు తెలిసి ఈ భావజాలంతో ఉన్న వ్యక్తులు అనేకులు మన బ్లాగ్ లోకంలోనే ఉన్నారు. ఇన్నయ్య గారి దగ్గరనుంచి...అలా కిందకు వెళ్తే మత్తి కహేశ్..ప్రవీణ్ శర్మ....ఇత్యాదులు అనేకం.

అయితే ఈయన రాసిన ఒక సినిమా ఈయన మీదనున్న గౌరవభావన్ని కాస్త కదిలించెదే అవుతుంది.
సదరు సినిమా రాజం - యమగోల.

పలానీ వ్యక్తి చిత్రగుప్తుడి తప్పువల్ల పోతాడు.
భటులు స్వర్గానికి తీసుకెళ్ళి వదుల్తారు
"ఎవిటి! నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారూ?"
"స్వర్గానికి"
"నేనింత పుణ్యం చేశానని నాకే తెలియదు"
"అంత సంతోషించకు. ఇక్కడా - కొన్నళ్లే. తర్వాత మేమె వచ్చి నరకానికి తీసుకెళ్తాం"
"అలా ఎందుకూ? ముందే నరకానికి తీస్కెళ్ళి తర్వాతే ఇక్కడ దింపొచ్చుగా. చెడి బతికినట్టు ఉంటుంది"
"అలా కుదరదు!
పుణ్యం తక్కువవ చెసి పాపం ఎక్కువ చెస్తే - ముంది స్వర్గానికి తర్వాత నరకానికి.
పపం తక్కువ చెసి పుణ్యం ఎక్కువ చేస్తే - ముంది నరకానికి తర్వాత స్వర్గానికి"
"ఓహ్ ఇదొకటుందా"...
స్వర్గంలోకి ఎంట్రీ..
అక్కడ అందరూ అప్సరసల నాట్యాన్ని అనిభవించటనికి సమాయత్తం అవుతుంటారు. అంతలో మాకు హిందుస్తానీ వద్దు అని దక్షిణాది వాళ్ళు, ఎందుకొద్దని ఉత్తరాది వాళ్ళు కొట్టుకుంటుంటారు.
ప్రాంతీయతత్వం కులం - స్వర్గానికి పోయినా పోలేదని
ఇక్కడే దర్శకుడి ప్రతిభ. దర్శకుడు - తాతినేని రామారావు.
దక్షిణ భారతీయులందరూ బేపనోళ్ళే.
అంతలో హీరోగారు - హీరోయిజం. ఆడవె అందాల సురభామిని. సినారె రచన. ఆయన ఆలోచన ఎంత గొప్పదో అనిపిస్తుంది ఈ పాట వింటే. ఈపాట రాసింది వేటూరని కొందరు సినారె అని కొందరు. చరణం మాత్రమే వేటూరిదని కొందరి ప్రతిపాదన.


సరే ఏవైన హీరోగారి పాటని నిలువరిస్తారు దక్షిణభారతీయ బేపనోళ్ళు.
"ఎవరు నువ్వు?" అహంకారం
"మీలాగే చచ్చినవాణ్ణి, స్వర్గానికి వచ్చినవాణ్ణి" హాస్యం
"ఛస్తే మాత్రం నీకూ మాకూ పోటీయా!" అదే బెదిరింపు అహంకారంతో, పిలక జుట్టు ముడివేస్తూ
"ఆరి నీ దుంప తెగ! సర్వమానవ సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్న మాట"
"నువ్వెవరో అప్రాచ్యుడివి"
"మరి మీరు నాయనా?"
"మేం పండితులం" పొగరు
"అబ్బా!" వ్యంగ్యం
"వేదాలను అవపోసన పట్టిన ప్రచండులం" "నేను 25 దేవాలయాలను కట్టించాను"
"కమీషను ఎంత కొట్టేశావ్?"
"నేను 12 యజ్ఞాలను చేయించాను"
"దేవాలయాలు కట్టించిందీ, యజ్ఞయాగాదులు చేయించిందీ స్వర్గంలో మేజువాణి చూట్టంకోసమా?"
"యజ్ఞయాగాదుల పరమార్థం - స్వర్గలోక నివాసం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి"
"ఆరి మీ అహంకారం పొయ్యిలోపెట్టా! మీరు చచ్చినా మీ అహంకారం చావలెదు. స్వర్గనికి వచ్చినా కులతత్వాలూ భాషా భేదాలు పోలేదు"
..

రచయితా వ్యంగ్యం హాస్యం అంతా బాగుంది. కేవలం బ్రాహ్మల్నే ఎంచుకోవటం ఆయన హేతువాద తత్వానికి ప్రతీక అవ్వచ్చు. కాసేపు నవ్వుకోటానికి సామాన్య నేలబారు మనిషికి ఇది బాగనే ఉంటుంది. ఇది పండింది కూడా.

కానీ - తాత్వికంగా చూస్తే - స్వర్గం అనేది ఎక్కడా ఎక్కడా అని ఎతికాట్ట ఒకతను. ఎతుక్కుంటూ ఎతుక్కుంటూ గురువుగారి దగ్గరకెళ్ళి గురువుగారూ - స్వర్గం ఎక్కడా అని వెతికానండీ, ఎక్కడా కనిపించలేదూ అన్నాట్ట. గురువుగారు - అరే బాబూ -స్వర్గం ఎక్కడో లేదు నీలోనే ఉందీ అన్నాట్ట.

స్వర్గం రాగ ద్వేషాలకి అతీతం. ఎప్పుడైతే రాగద్వేషాలు మొదలౌతాయో - స్వర్గం మాయం.
సింపుల్ లాజిక్.

దీన్ని పక్కన పెడితే హేటువాదులు కేవలం బ్రాహ్మణులనే అపహాస్యం చెస్తారు. ఎందుకో తెలియదు. సదరు హేతువాది ఎంత చుదువుకున్నవాడైనా సరే - అదే మూస.

అంతేలే! ఈ చదువులు మనిషిని ఇజానికి బనిసని చేసేవే గానీ జ్ఞానాన్ని  ఇచ్చేవి కావుగా!

ఏవైనా డివి నరసరాజుగారి శతజయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరిద్దాం.

Jul 11, 2020

NTR కి భారతరత్న

శ్రీ పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే ఓ ఆలోచన రావటానికి ఆయన సుదీర్ఘమైన రాజకీయ/సాహిత్య ప్రయాణం మాత్రమే కాకుండా ఆయన ఆలోచించిన తీరు, సంస్కరణలు మొదలైనవి అనేక కారణాలలో కొన్ని.

NTR కి ఎందుకు ఇవ్వాలి భారతరత్న?
ఆమాటకొస్తే ప్రకాశం పంతులుకి ఎందుకివ్వలేదు?
ఎల్లాప్రగడ సుబ్బారవుకి ఇవ్వొచ్చుగా?

భారతరత్న అనేది కేవలం మోసేవాళ్ళ బలాన్నిబట్టేనా?

క్యాండిడేట్ ప్రతిభకి సంబంధం లేదా?

భారతరత్న - కేవలం ఒక తంతు మాత్రమే. ప్రభుత్వ ప్రాపగాండానే. మోసేవాళ్ళ బలప్రదర్శన మాత్రమే.

Jul 5, 2020

అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ఖర్చు చేయక్కరలేదు -చంద్రబాబు


అమరావతికి రు.9000 కోట్లు ఖర్చుచేశాం, మరో లక్షకోట్లు కావాలని చెబుతున్నారు. రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు
-చంద్రబాబు



పైసా ఖరు లేకుండా అమరావతి నిర్మించవచ్చా?
ఎలా?
అలా అయితే తన 5 సంవత్సరాల పాలనలో బాబు రాజధాని నగరానికి పెట్టిందెంతా? how to get that information?

గూగులించాను. వికీపీడియాలో ఈ కొంత సమాచారం దొరికింది. అది నిజం కావచ్చు, కాకపోనూ వచ్చు.

Economy and infrastructure
The state government originally initiated the Singapore-based Ascendas-Singbridge and Sembcorp Development consortium for the city's construction. The city's infrastructure was to be developed in 7–8 years in phases, at an estimated cost of ₹33,000 crore. ₹7,500 crore from the Housing and Urban Development Corporation Limited (HUDCO), $500 million from the World Bank and ₹2,500 crore from the Indian Government, of which ₹1,500 crore has been granted.

As of July 2019, the World Bank dropped funding for Amaravati. As of September 2019, the Ascendas-Singbridge and Sembcorp Development consortium have also withdrawn from the project. With only state government allocated budget of ₹500 crore in 2019, the Amravati project has substantially slowed, with no deadline in sight.

Nine themed cities consisting of Finance, Justice, Health, Sports, Media, and Electronics; including Government buildings designed by Norman Foster, Hafeez Contractor, Reliance Group, and NRDC-India will be built within the city. Pi Data Centre, the fourth largest of its kind in Asia with an investment of ₹600 crore (US$84 million), and Pi Care Services, a healthcare BPO, were inaugurated at Mangalagiri IT park. HCL Technologies, an IT firm would set up one of its centres in Amaravati.

BRS Medicity with an investment of $1.8 billion is to come to Amaravati. Mangalagiri Sarees and Fabrics produced in Mangalagiri mandal, a part of the state capital, were registered as one of the geographical indications from Andhra Pradesh.

దీన్ని ఎలా అర్థం చెస్కోవాలో నాకు అర్థం కావట్లేదా? లేక బాబుకి అర్థం అవ్వలేదా లేక జగన్‌కి అర్థం కావట్లేదా?

ఎవరన్నా సుదీర్ఘంగా వివరణ ఇస్తే బాగుండు.