Nov 7, 2008

యేంటి యాభైకే రివ్యూఆ?

"ఏంది కత?"
"యాభై?"
"ఏందీ?"
"అదే!! యాభై పోష్టులు రాసా ఇప్పటికి. రెండొందల ఎనభై వ్యాఖ్యలు పడినై ఆటికి."
"ఓహో!! అక్కడ! ఏదీ అక్కడ!! ఐదు వందలు రాసినోళ్ళు ఉన్నారు."
"తెలుసు కానీ"
"నకరాలు వద్దు"
"అదేలే ఈయ్యాల్టి యాభయ్యే రేపటి ఐదువందలు"
"ఏంది రేపటికల్లా ఐదొందలు రాసిపడేస్తావా ఏంది. ముందేజెప్పు (ముందే/ మందే కాదు - ఎప్పుడూ మందేకాదు జీవితంలో)"
"ఎకసెక్కాలు ఆపి...విను...ఇప్పటికి యాభై. చూద్దాం మునుముందు ఎన్ని రాయగలనో."
"సరే!! మంచోడివే!! నీకు నచ్చిన పోష్టు ఏది?"
"యో!! నేను తొక్కిన కోడిపియ్య కూడా కమ్మటోసన, తెల్సా. నేను రాసిన ప్రతీ అచ్చరం నాకు నచ్చిందే."
"నచ్చని పోష్టు?"
"మర్యాద!! థర్టి ఇయర్స్ ఇండష్ట్రీ"
"ఇంకేమైనా జెప్పాలా?"
"నేటి ఉపాధ్యాయులూ చదువులూ అనేపోష్టుమీద వ్యాఖ్యలు బాగా వస్తాయి అనుకున్నా. పెద్దగా లేవు. ఐతే వ్యాఖ్యానించిన నలుగురూ గట్టి మాటలే జెప్పారు."
"చివరగా?"
"రాసినోడికి చదివినోడి వ్యాఖ్యలే మందు. సునిసిత విమర్శని నేను ఆశ్వాదిస్తా. నా ఆలోచనల్ని అందరితో పంచుకోవాలి అని ఎప్పుడూ కోరుకుంటా. ఐతే నేనుజెప్పిందే వప్పు అనే వితండవాదం నాకు లేదు. రకరకాల నా ఆలోచనలని, నా ఆనందాన్నీ, ఇలా పంచుకుందామనే ఉద్దేశ్యంతో మరిన్ని బ్లాగులు రాస్తున్నా.
నా బ్లాగులు
పాతపాటలు
http://paatapaatalu.blogspot.com
వెబ్స్పియరు గురించి నా టెక్నికల్ బ్లాగు
http://javagongura.blogspot.com
జావా గురించి నా టెక్నికల్ బ్లాగు
http://verbosegc.blogspot.com
ప్రాజెక్టువర్క్స్
మన తరం నుంచి ముందుతరానికి మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వాలి? లంచగొండి ప్రభుత్వాల, ప్రభుత్వోద్యోగుల ఆగడాలని అరికట్టి సమూలంగా లంచాన్ని రూపుమాపాలంటే? మన మౌళిక అవసరాల్ని మనమే నిర్మించుకోవాలంటే? మనకి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త రక్తం కావాలి. అలాంటి ఒక్కో ఆలోచన ఒక్కో కొత్త ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుల్ని ముందుకుతేవటమే నా ఈ బ్లాగు లక్ష్యం. యువతకి మార్గనిర్దేశమే ప్రాజెక్టుల లక్ష్యం
http://projectsforfuture.blogspot.com/
నల భీమ పాకం
నా ఈ బ్లాగు పెళ్ళికాని బాచిలర్లకి, పెళ్ళైన బాచిలర్లకి వంట సలహాలకోసం అంకితమిస్తున్న. "ఈయ్యాల్టి బాచిలరే రేపటి సంసారి"
http://nalabhima.blogspot.com/
నా యస్.యల్.ఆర్ కన్ను
నేనూ మార్గదర్శిలో చేరా, ఒక ఫిల్మ్ యస్.యల్.ఆర్ కొన్నా. నైకాన్ యన్ 75. ఈ బ్లాగులో నా ప్రపంచం నా యస్.యల్.ఆర్ కన్నులోంచి
http://nasitralu.blogspot.com/
వేదసంహితం
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే। పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ -ఈశోపనిషత్
http://vedasamhitam.blogspot.com/
"
- జైహింద్

12 comments:

  1. good show
    అప్పుడప్పుడూ ఇలాంటి పునరావలోకనమూ ఆతమపరిశీలనా మంచిదే. ఎట్నించి వచ్చామో ఎటెల్తున్నామో తెలుస్తుంది.

    ReplyDelete
  2. baagu baagu mee blaagu review

    ReplyDelete
  3. వోయ్ రామరాజు,శానుందె యవారం నీకాడ :)
    ఇన్ని బ్లాగులెట్టా రాస్తన్నావురా నాయనా,నువ్ సామాన్నుడివి కాదయ్యోయ్ రాయ్ రాయ్ యాబై ఐదొందలవటం ఎంత సేపంటా కానీయ్

    ReplyDelete
  4. భాస్కర్ గారు,
    అభినందనలు!

    "థర్టీ ఇయర్స్, ఇండస్త్రీ" సూపర్ గా పేలింది, జనానికి తట్టిందో లేదో కాని! మీకు నచ్చిన పోస్టేదంటే అంత వీర పల్నాడు స్టైల్లో చెప్పారే!

    సరే కానీండి, యాభై ఐదొందలవడం ఎంత సేపంట!

    ReplyDelete
  5. @విజయమోహన్: అయ్యో నా కాళ్లు లాగమాక. సకల కళలా బొంగా. ఉత్తిదే. Thanks.

    @కొత్తపాళీ అన్నగారు: I feel like, People like you have visited my blog, left comments - Thats a Great Achievement for me. Thanks again.

    @లచ్చిమి: థంక్సులు

    @రాజే: అన్నాయ్. "పల్నాటి ప్రభంజనం!! మొదలైతే ఆగదు". సరే నీకో రసహ్యం తూచ్ రహస్యం జెప్పనా, పల్నాటోళ్లు అంతే.:):)
    Thanks for the comments Brother.

    @సుజాత గారు: :):) కోపంవస్తే అదేజేస్తం, కాని రోషం వస్తే రోలు ఎక్కుతాం - పల్నాడూడాట్కోడాటిన్. Thanks again for your comment.

    ReplyDelete
  6. నేను తొక్కిన... ee line chadavagane ela navaauochindante... telugu bhasa prasa power chupettarulendi.

    keep writing..i have gone through almost all your blogs..but bit lazy on posting comments yaar..waiting for Ur half K th blog.

    Regards
    Anantha Reddy

    ReplyDelete
  7. అనంతా, థాంక్సులు బ్రదర్ :)

    ReplyDelete