Oct 2, 2008

గాంధి ని చంపేసాను

గాంధి ని చంపేసాను
అవును. నేనే. గాంధిని అత్యంత దారుణంగా, హేయంగా, ఆతని అరుపులు ఎవ్వరికీ వినబడనీయకుండా నేనే చంపేసాను. దేనికంటే.. సత్యాగ్రహమంటాడా? అహింసా? ఖాదీయా? ఉపవాసం చేయమంటాడా?
కట్నాలకోసం అమ్మాయిల్ని అతిదాఋణంగా హింసిస్తున్న సమాజాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా అఱవకుండా, తిలాపాపంలో పాలుపంచుకుని గాంధీని చంపేసాను.
అడుగడుగునా లంచాలతో జనాల రాక్తాన్ని పీల్చుకుంటున్న అధికారగణం మీద యుద్ధాన్ని ప్రకటించకుడా, నాకు చేతనైనంతవఱకూ లంచాల్ని ప్రోత్సహిస్తూ గాధీని చంపేసాను.
కులం కులం అని కుచ్చితాలుపెంచుకుంటున్న జనాల్ని సరైన మార్గంలో పెట్టకుండా నేనూ ఒక కుల కుంపట్ని వెలింగించి గాధీ చంపేసాను.
మతం తన పరిధులు దాటి గజ్జిగా మాఱితే నేను దాన్ని కడుక్కోకుండా అందఱికి అంటిస్తూ గాంధీని మళ్ళీ చంపేసాను.
సత్యాగ్రహం అనేపదానికి సమాజం "అ" చేర్చినప్పుడు కిమ్మనకుండా నేనూ అసత్యాగ్రహాన్ని ప్రచారం చేస్తూ గాంధీని అతిదారుణంగా చంపేసాను.
అహింస పరమో ధర్మహ కి బూజు పట్టించి దాన్ని హింస పరమో ధర్మహ లా మార్చినప్పుడు సమాజాన్ని ఎదురించటం మానేసి నేనూఒక కత్తి పట్టి గాంధీని నఱికేసాను.
పేదరికాన్ని రూపుమాపేందుకు అప్పులు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాన్ని ఎదురించటం పక్కనబెట్టి ప్రపంచీకరణ పేరుతో మన సహజ వనరుల్ని అమ్ముకుంటూ గాంధీని చంపేసా.
అభివృద్ధి పేరుతో సంస్కృతినీ సంప్రదాయాన్ని గాలికొదిలేస్తూ గాంధీని మళ్ళి చంపేసా

అవును నేనే, గాంధీని, నాలో ఉన్న గాంధీని చంపేసాను

15 comments:

  1. chala chala baga rasavu annaya...i am very happy to meet a gr8 personality like you in this country.....

    thnks alot to god .......

    ReplyDelete
  2. కాళ్ళు, నాయనా కాళ్ళు, లాగొద్దు. భావం అర్ధం చేస్కో బాబు.
    థాంక్సు

    ReplyDelete
  3. బాగుంది మీ శైలి, చక్కగా వర్ణించారు సమాజం పోకడ, ఇంకా అందులో ఎలా మనం భాగం అవుతున్నామో.

    ReplyDelete
  4. మీ భావం అర్ధమయ్యెలా రాసారు... కాని..
    అన్ని సార్లు గాంధిని చంపెసాను చంపెసాను అంటుంటే... ఎదొరకంగా అనిపించింది...

    ReplyDelete
  5. Good post...


    I know it is not place to give you info, I see you are using Google Apps for your site. To get maximize usage from Google Apps check my blog http://blog.miriyala.in.

    ReplyDelete
  6. @చైతన్య: అర్ధం చేశ్కున్నందుకు ధన్యవాదాలు
    @పార్ధ సారధి: రోజుకి కొన్ని వేలసాలు మనల్ని మనమే చంపేస్కునే పరీస్థితిలోకి వచ్చాం. లేకపోతే బతకలేం.
    @సుజి: ధన్యవాదాలు.
    @కొత్తపాళీ గారు: పోష్టు చదివినందుకు ధన్యవాదాలు.
    @దిలీపు: తప్పకుండా చూస్తా మీ బ్లాగు.

    ReplyDelete
  7. పోస్టు కాన్సెప్టు బాగుంది. కానీ 'నేను' అని వాడిన ప్రతిచోటా 'మనం' అని వాడితే బాగుండేదేమో అని నా అభిప్రాయం..

    ReplyDelete
  8. ఈ ‘నేను’ మనమందరమే! ప్రతిరోజూ హాయిగా చంపుతూనే ఉన్నాం.

    ReplyDelete
  9. చాలా బాగుంది
    బొల్లోజు బాబా

    ReplyDelete
  10. @వర్మాజీ: మహేష్ చెప్పిందే నా సమాధానం
    @మహేష్: బగా చెప్పారు
    @బాబా: ధన్యవాదాలు

    ReplyDelete
  11. excellent ra, chala bagunayi ee blogs anni. keep it up

    ReplyDelete
  12. entha madhana padi em labham....idi aranay rodane

    ReplyDelete