Jun 28, 2012

దేవుడా శక్తిని ఇవ్వు

జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
నూరేళ్ళ ప్రయాణంలో
కలసి అడుగులో అడుగులు వేస్తూ
శ్వాసలో శ్వాసౌతూ
సగంలో సగం అవుతూ
దేవుడు కలిపే పాత్రలు
కొన్ని
అర్థాంతరంగా ముగిసిపోతాయి
కలసి నూరేళ్ళు నడవాల్సిన రెండో పాత్రకో?
ఆ లోటు తీరనిది
ఆ లోటు తీర్చలేనిది
ధైర్యమే తోడు
ముందుకు వెళ్ళితీరాల్సింది
అదే ప్రకృతి తీర్పు
జీవత ప్రయాణం కొనసాగాల్సిందే
దేవుడా శక్తిని ఇవ్వు
లేత హృదయానికి
ప్రేమించిన హృదయానికి
తట్టుకునే శక్తినివ్వు
నీ లీలనీ
నిలచిన కాలాన్ని
తట్టుకునే శక్తినివ్వు

[ప్రమాద వశాత్తూ మరణించిన నా సోదర సమానుడు, మిత్రుడు, శ్రేయోభిలాషికి అశృనయనాలతో]

Jun 26, 2012

'మంత్రాలయం'లో అగ్నిప్రమాదం

పిల్ల పెళ్ళి
రిటైర్మెంట్ బెనిఫిట్
తడిసిన చేతులు
అరిగిన కాళ్ళు
కాలిన ఫైళ్ళు
దీనిపై ఓ సినిమా తీస్తే బావుంణ్ణు ఎవరైనా....

[మహారాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం 'మంత్రాలయం'లో అగ్నిప్రమాదం]

Jun 7, 2012

వందేమాతరం

మా బళ్ళో పొద్దున్నే వందేమాతర గీతాన్ని ఆలపించటం, ప్రతిజ్ఞ చేయటంతో రోజు మొదలైయ్యేది. జన గణ మన అధినాయక జయహే గీతంతో రోజు ముగిసేది. బహుశా మా అజ్ఞానమో లేక ఖర్మమో ఎవ్వళ్ళూ ఇదేం పాట? అర్థం ఏంటీ అని అడిగిన పాపాన పోలేదు. అయ్యా! నే చదువుకున్నది జి.ప్ర.ప ప్రాథమికోన్నత పాఠశాల, మరియూ జి.ప్ర.ప ఉన్నత పాఠశాలల్లో. బడిలో లంబాడీలు మరియూ యస్.టి యస్సిలు, బీసీలు మరియూ ఓసీలు. ఎవ్వరూ ఏనాడూ వందేమాతరానికి అర్థం వెతకలేదు. అనాటి ఆ సమాజంలో కూడా ఎవ్వరూ వందేమాతరానికి అర్థం వెతకలా. కారణం? పిల్లలు ఆడుకోటంలో బడిలో పాఠాలు నేర్చుకోటంలో బిజీ. తల్లితండ్రులు పొట్టపోసుకోటంలో బిజీ. రెక్కాడితేకానీ డొక్కాడేది కాదు. ఏదోక పనికి వెళ్ళితీరాలి. ఊర్కనే కూర్చున్నోడికి పొయ్యిలో పిల్లి లెగిచేటిది కాదు.
ఐతే! వందేమాతరం అనే ఓ పేరాగ్రాఫ్ సైజున్న పాట, [మొత్తం పాట పాట్టానికి అది బడా లేక పాటలపోటీనా?] పాట్టానికి పది నిమిషాలో ఏమో పట్టేది, ఆ పాటలో ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసేంత అర్థం ఉందా?
ఓమారు చూద్దాం!సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
నాకు తెల్సిన పాట, మేము బళ్ళో ఆలపించిన పేరా పంక్తులు ఇవే.
ఇందులో ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో నాకైతే అర్థం అవ్వలేదు.
అసలు విషయం ఏవిట్టా?
ఈ సంవత్సరం నుంచి ఆంధ్రరాష్ట ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోంచి వందే మాతరం గీతాన్ని తొలగించారు. ఆ గీతాన్ని ఆలపించడం తమ తమ మతవిశ్వాసాలకు విరుద్ధమని ముస్లిమ్ క్రైస్తవ సంఘాలు (కనీసం స్థానిక సంఘాలు కూడా కాదు, ఏ.పి.కి బయటివి) వ్యతిరేకించిన నేపథ్యంలో తొలగించారని వార్త.
ఈ వేళ ఈ వార్త నిజం అవ్వచ్చు అవ్వకపోనూవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నిజం అయితీరుతుంది.
కారణాలు అనేకం. పొట్టపొస్కునే స్థితిలో బిజీగా ఉన్న మనుషుల జీవితాల్లోకి డబ్బు దయ్యం ఇప్పటికే ప్రవేశించి ఆవహించేసింది. దాంతో పురసతే పురసతు. చెదపట్టిన ఖాళీమైండుకి అన్నీ తప్పులేగా. ఓటు వరాలు ఇంకా కుమ్మరిస్తే సరి, ఉచిత బియ్యం ఉచిత సరుకులు ఉచిత జీతం ఉచిత భత్యం ఉచిత జీవితం అని. ఇంకేవుంది హాయిగా తీరిగ్గా కూర్చుని బెత్తెబెత్తెలో తప్పులు వెతుక్కోచ్చు. భావవైశాల్యాలను మనోభావాలుగా చిత్రీకరించి వక్రీకరించి దేశ స్పూర్తిని వమ్ముచేసేస్తే సరి.

ఒకనాడు గాంధీకి ఊతపదం వందేమాతరం
ఆయన పేరులో తప్ప మరెక్కడా కనిపించకుండా భూస్థాపితం చేయబడ్డాడు
ఆయన నిజ వారసులు ఏ చెట్టుకింద ఉన్నారో ఎవరికీ తెలియదు
ఆయన పేరు దత్తత తీస్కున కుహానా గాంధేయులు ఆయన్ని జండాలోకి నెట్టేసి
ఆయన వాడిన వందేమాతరాన్ని కాళ్ళకింద తొక్కేసి
తమ సోషలిజాన్ని సెక్యులిరజాన్ని
ఇలా బట్టలిప్పిన ఆడదానిలా చూపుకుంటున్నారు సొగసుని సోయగాన్ని శృంగారం ఒంపుకుంటూ వ్యభిచరిస్తూ

జయ హో సోనియా గాంధీ
జయ హో ఇటాలియన్ మాతా
నువ్వే గెలిచావ్

Jun 5, 2012

ఏమి ఎండలు! ఐతే?

మా అమ్మ నిన్న మాటల మధ్యలో, ఎండలు తలలు పగులగొడుతున్నాయిరా అన్నది.
నిజమే. ఎండలు తలలే కాదు జవజీవాలను ఎండగొడుతున్నాయి.
దీనిపై టీవీల్లో జనాల్లో పేద్ద చర్చలు జఱగవచ్చు, ఐతే
ఎందుకు ఎండలు పెరుగుతున్నాయి, వేడిని తగ్గించటానికి మనచేతుల్లో ఏవుందీ, మనం ఏం చేస్తున్నాం, మనం ఏంచేసాం, మనం ఏంచేయాలి అనేవాటిపై ఎంఫసిస్ ఎక్కడా?
పిల్లలకి రిసైకిలింగు నేర్పుతున్నామా?
కాంక్రీటు వనాలను కొనకుండా ఆపుతున్నామా?
కాంక్రీటు వనంలో ఒక చెట్టన్నా నాటుతున్నామా?
పర్వావరణాన్ని అధోగతిపాలు చేయకుండా ఈనాటి మనిషి చేస్తున్న ఒక్క మంచిపని చూపండీ?
ఇప్పుడే ఇలా ఉంటే రేపటిరోజున ఎలా ఉండబోతున్నదీ?

చెట్లను కొట్టివేయుట ఆపండి
మీ బండి ఇంజన్ ఆపివేయండి
చెట్లు నాటండి
మిమ్మల్ని మీరు కాపాడుకోండి
ప్లాస్టిక్ వాడవద్దు
దోచుకొనుటలో బిజీగా ఉన్న ప్రభుత్వాలను గద్దె దింపండి
పర్వావరణ రక్షణకై నడుం బిగించండి
మీ ఆయుస్షుని పెంచుకోండి