Showing posts with label పచ్చిమం. Show all posts
Showing posts with label పచ్చిమం. Show all posts

Jan 6, 2021

ఓ జాత్యహంకారీ

 



ఓ జాత్యహంకారీ -

ఎటూ నీ పయనం?

నేటి నలగగొట్టబడ్డ నల్ల బిడ్డడు

రేపు ఎల్లదొరై నీ దేశాన్ని పాలించవచ్చు

ఒక్కసారి నీ కర్మ ఎలా కాలుతుందో ఆలోచించు ఆనాడు


ఎవరి రోడ్డులూ

ఎవరి దేశం అంటూ విర్రవీగుతున్నావు

ఈ దేశం నీయబ్బ సొమ్ము కాదని నీ అంతరాత్మకు తెలుసు


ఓ జాత్యహంకార-ఇజానికి బానిసా

నీ ఆత్మని అమ్ముకొకిలా

నిజాన్ని తెలుసుకుని బతుకు మనిషిలా

బతకనివ్వు మానవజీతినిలా 

Feb 11, 2018

చిన్న వయసులో స్మోకింగ్ చేయటం

యధాప్రకారం స్కూల్ బస్సు దగ్గరకి వెళ్ళిన సూరిగాడు, అయిదునిమిషాల్లోపే మెసేజ్ పెట్టాడు. వాడికీమధ్య ఫోన్ (ఫోన్ అనటం మోటు ఈరోజున తెలుగు అందునా ఈనాడు ప్రపంచంలో. చరవణి అనాలి ట. ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉవాచ. అదికూడ చఱవాణి కాద ట) కొనిపెట్టాను. అవసరం అనిపించింది. లేట్ ఈవెనింగ్ క్లాసులు గట్రా. ఫోన్ చేతిలో ఉంటం మంచిది అనిపించింది. life360 అని ఒక అప్లికేషన్. అది వేస్తే, ఫోన్ ట్రాక్ చేయొచ్చు. ఏవైనా, వీడు బస్ స్టాండుకి వెళ్ళగానే మెసేజ్. అమ్మా! ఇక్కడ ఒకడు సిగరెట్ తాగుతున్నాడు అని. బడికెళ్ళినాక టీచరుకి చెప్పనా అంటాడు. ఏంచెప్పాలో పాలుపోలేదు.
రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి మనసులో.

వద్దన్న పని చేయటం ఒక ఆనందం ఇవ్వచ్చు. ఆ పిల్లాడి తలితండ్రులు ఆ పిల్లాడు ఈక్వేషన్ అతన్ని ప్రేరేపించి ఉండచ్చు.

సిగరెట్టు తాగటం ఒక హీరోయిజం అని  అతన్ని ఎవరో లేక అతను ఆరాధించే ఓ వ్యక్తి ప్రేరేపించి ఉండచ్చు.

తల్లో తండ్రో అతను తాగేలా ప్రేరేపించి ఉండచ్చు.

సూరిగాడు మెసేజ్ చూసినాక బడికి కాల్ చేసినాను. "మీకు ఇలా కంప్లైంట్ చేయొచ్చో లేదో తెలీదు, మీ దృష్టికి తేవటం నా కర్తవ్యం అని మీకు కాల్ చేస్తున్నాను. మా పిల్లాడు బస్సు ఎక్కే దగ్గర ఎవడో ఇలా స్మోక్  చేస్తున్నడట." అని చేబితే ఆమె ఒక పాయింట్ చెప్పింది "బడిలోగానీ, బడి పరిసరాల్లోగానీ, లేక బస్సులోగానీ స్మోక్ చేస్తే అప్పుడు మేమేమన్నా చేయగలుగుతాం."
కరెక్టే
బడివాళ్ళు చెప్పింది కరెక్టే!
ఒక్కసారి నా యంసియే రోజులు గుర్తుకొచ్చాయి. నిజాయితీగా చెప్తే బస్సులో సిగరెట్ తాగిన సందర్భాలు కోకొల్లలు. అవన్నీ హీరోయిజంకోసం అనుకుందాం. కాని ఇంత చిన్నవయసులో తాగటం - అనారోగ్యం అని నా భావన అలా ఉంచితే మిగతా పిల్లల మీద ఆ ప్రభావం పడుతుందేమో అని ఇంకో భయం.

Feb 9, 2018

స్లీపోవర్

పిల్లలీమధ్య  పిల్లలున్న వాళ్ళు ఎవరు ఇంటికొచ్చినా స్లీపోవర్కి ఉంటారా అని అడుగుతున్నారు. ముఖ్యంగా అనఘ. తన మిత్రురాళ్ళ బృందంలో ఎవరొచ్చినా స్లీపోవర్కి ఉండండి, ఉండనివ్వండీ అని వచ్చిన తల్లితండ్రుల్ని, ఉండమని చెప్పండి అని మమ్మల్ని పోరుతున్నారు.

బాగనే ఉన్నా ఇది ఎక్కడన్నా వికటిస్తుందేమో ఎక్కడో ఓ భయం. ఆ భయానికి మూలం ఓ మితృడి ద్వారా విన్న ఒక సంఘటన!

ఒక దేశీ తెలుగు కుటుంబం
ఇద్దరే పిల్లలు
పన్నెండేళ్ళ అమ్మాయి
చిన్న పిల్లాడు

ఒకానొక రోజున అమ్మాయి తన స్నేహితురాలింటికి స్లీపోవర్కి వెళ్ళింది. సదరు స్నేహితురాలు తెల్ల వాళ్ళు.

ఎలా జరిగిందో తెలీదు
ఏమైందో తెలీదు
కొంతకాలానికి స్లీపోవర్కి వెళ్ళిన తెలుగమ్మాయి గర్భవతి అయ్యింది... ఎవరు అని ఆరాతీస్తే తెల్లమ్మాయి తండ్రి అని తెలిసింది

తర్వాత ఏవైంది అనేది అనవసరం....


Jan 10, 2016

F*** వర్డ్

మొన్నీమధ్య ఏకస్థలబహుళసముదాయంలో ఓ దేశీ పిల్లాడు, సూరిగాడికన్నా ఓ ఏడాది పెద్దవాడు, పిల్లలతో ఆడుతూ ఓ బూతుకూత అలవోకగా కూసినాడు. వెనువెంటనే కొందరు పిల్లలు ఆ పిల్లాడి తల్లికి ఆ విషయాన్ని మోసుకెళ్ళినారు. సదరు తల్లిగారు ఇలా వాక్రుచ్చినారు"ఓహ్! అవునా! తప్పుకదూ! కానీ, కావలని అన్నాడా లేక ఊతపదంలా అన్నాడా? ఓహ్! ఊతపదంలా అన్నాడా! అయితే తేలిగ్గా తీసుకుని వెళ్ళి ఆడుకోండి పోండి".

అదే పిల్లాడు మరోరోజు ఇంకో పెద్ద కార్యక్రమంలో కలిసినప్పుడు ఇంకాస్త ముదిరిపోయి అబ్బాయిలంతా ఓ గదిలో ఆడుకోవాలన్నట్టుగా అబ్బాయిలందర్నీ ఓ గదిలోచి చేర్చి లోపల గడియబెట్టి ఆట్టం మొదలెట్టినారు. ఆడపిల్లలంతాజేరి ఆగదిలోకి వెళ్ళబోతే తలుపు తీయడు, తీసి నెట్టేస్తూ మళ్ళీ బూతికూత కూయనే కూసినాడు. ఈసారి వాడి సహవాసగాడు కూడా అదే పదం వాడట్టంతో ఆడపిల్లలంతా సదరు సహవాసగాడి తల్లికి చెప్పినారు.
సదరు పిల్లవాడి తల్లిగారు ఉత్తరభారతీయ వనితగారు ఇలా వాక్రుచ్చినారు "వాళ్ళు మగపిల్లలు. ఏవైనా అంటారు. ఆడపిల్లలు ఎందుకు అక్కడికి వెళ్ళినట్టూ?"
ఆశ్చర్యపోయాను. అవాక్కయ్యాను. బూతుపదం ఊతపదంగా మారటాన్ని ఆపని తల్లితండ్రులు కూడా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశంలో ఉంటూ ఆడపిల్ల మగపిల్ల అని తేడా చూపించే తల్లితండ్రులు కూడా ఉన్నారు.
నా పక్కన కూర్చునే ఓ తెల్లవాడితో ఈ విషయం చర్చకుతెస్తే, వాడు వాడి పిల్లలు స్టుపిడ్ అనే పదాన్ని కూడా వాడటానికి వీలులేదంటూ చెప్పుకొచ్చాడు.
బూతుమాటని మాట్టాడకూడదని పిల్లవాణ్ణి సరిచేయాల్సిన అవసరం లేదా?


Sep 16, 2013

మీరేవంటారూ?

ప్రవాసభారతీయుల మనసుల్లో  ఎన్ని ప్రశ్నలో. సరిగ్గా సమాధానం దొరక్కా, మింగలేక కక్కలేక లాక్కోలేకా పీక్కోలేక మానసికంగా  ఎన్ని అవస్థలుపడతారో. అసలు అమెరికా  ఎందుకెళ్ళాలటా అంటారు కొందరు, అది వాళ్ళు వెళ్ళనంతవరకే. అదే  అవకాశం వారికొస్తే వెళ్ళటానికి వెనుకాడరు. అదలా ఉంచితే ఒకతని ప్రశ్నలు దానికి మరొకతని సమాధానం ఇక్కడ పెడుతున్నా. మీరేవంటారో చెప్పండి?
Question by someone
Sorry to post this here, but since there are many knowledgeable people here wanted to get some honest feedback. I am planning to move back to india by next year (no hope of GC anytime soon) and with one salary (Wife doesn't work) it is getting pretty tough to get by. I also have one daughter who is 2 yrs old. I have around 30 lakhs in savings which i plan to save in an indian bank and settle down with the interest i receive for monthly expenses. I do not plan to work a 9 - 6 job in india but open up some kind of small business and work part time. The point being to spend more time with my daughter and parents who are getting old.

My questions are

1) Is 30 lakhs savings in a bank enough initially to survive for 6 - 12 months without work. I have my own house in india so rent will not be an issue. What kind of average monthly expenses can i expect including education fees etc.
2) What kind of small business would you recommend opening in india. I am thinking of something like a travel agency or a taxi service. At some point if business does well i can employ some people to run it.
3) In future if i plan to return back to US, and if the dates are beyond my PD would i be able to apply for my GC even though i had left my employer?
4) Will education expenses be a problem for my kid since she is a US citizen?
5) Can i withdraw all the money from my 401k before leaving and should i close all my bank accounts and credit cards before i leave or is it ok if i just leave them as it is after clearing all balances and dues?

This is a big decision for me and i have given myself one year to clear out any issues before leaving for good. Are there any other things i need to do before i leave?

Thanks

ANSWER from someone
I completely agree with other about all the factors of going back to India is practically impossible. I am not saying you can't do it, but Maybe only 1 in 1000 can do that. I also would like to add few things:

1. getting things done like license, bank stuffs etc is so inconvenient, you will start missing US.
2. If you are from bombay, pune, banglore, you will end up spending 3-4 hours in commute only. How will you spend your time with family?
3. Trust me I am not exaggerating but if you have already spend enough years here, you will hate summer in India.

The only key factor for which I will support " the questioner" is his aging parents. There is no better pleasure in life then staying with your aging parents specially when they need you. If this is the case never think twice of going back to India, just go with open mind. If that was not the case, I would have never recommend to go back

Also people always have bad attitude about India (unfortunately includes me also ;)) but I want to point out some good sides also.
1. If you have a big family in India and you are social person, India is the place.
2. Who doesn't miss food of India :)
3. If you work in IT company, you will enjoy the food whole day. I remember one of my friend mentioned, he gets served hot tea and biscuits in the morning, ;) then the lunch and snacks ;) wowww. better than crapy subs and sandwiches here ;)
4. Things are expensive thee days but at the same time you get good pay also. One of my friends has a package of 22 lakhs which be believes is good enough specially he doesn't have any PMI ;)
5. You get maid to do everything ;) Here we fking spend our weekends on grocery, laundry, etc ;)

Bottom-line, if your parents are old and sick and needs you, just go.
If not think twice, thrice before going ;)

Sep 5, 2013

తల్లీతండ్రీ తర్వాత గురువే అన్న సంస్కృతి మనది

తల్లీతండ్రీ తర్వాత గురువే అన్న సంస్కృతి మనది. తల్లీతండ్రులు దేవుళ్ళు అని అంతటితో ఆగలేదు, గురువుకూడా దేవుడితో సమానం అన్నారు. గురువుకి అంతటి గొప్ప స్థానాన్ని ఇవ్వగలిగిన, ఇచ్చిన సంస్కృతులు ఇతరదేశాలలో ఉన్నాయోలేదో  మరి నాకైతే తెలియదు. గురువుకి శుశ్రూష చేసి గురువు చల్లని చూపులద్వారా  తృప్తిపొందిన రోజులు ఈకాలంలో లేకపోయినా, ఒక మంచి ఉపాధ్యాయుడు బజారులో వస్తుంటే ఊరి అరుగుల మీద కూర్చున్న చిన్నా పెద్దా  అందరూ  లేని నిలబడి గౌరవమివ్వటం నాకింకా గుర్తుంది. అసలు పల్లెల్లో  ఆనాడు చదువుకున్న, జ్ఞానాన్ని మూటగట్టుకుని మోసిన, నలుగురికీ మంచిని పంచిన, విప్లవాత్మక ఆలోచనలను చేసినవారెవరయ్యా అంటే  ఉపాధ్యాయుడే అని చెప్పకతప్పదు.
గురుపూజా  దినోత్సవంసందర్భంగా ఆకాలంలో మా పాఠశాలలో పావలాకి ఒక టికెట్ అమ్మేవారు. దానిమీద డా॥ సర్వేపల్లి గారి బొమ్మ ముద్రించి ఉండేడి. అలా  వచ్చిన డబ్బుని ఏంచేసేవారోమరి నాకైతే  గుర్తులేదు కానీ, మంచిపనికే వాడేవాళ్ళనుకుంటాను. ఎంత బీదరికంలో  ఉండావాళ్ళో  ఉపాధ్యాయులానాడు. తొంభైలదాకా స్కూల్ అసిస్టెంట్ అయినా  స్వర్గీయ మా నాన్నగారికి వెయ్యి వచ్చేదనుకుంటా  జీతం. మారుమూల గ్రామాలకు ట్రాన్సఫర్లు అవి ఇవీ, ఎన్ని కష్టాలో. అన్ని కష్టాల్లోనూ తమ బాధ్యతలను తాము నిర్వర్తించేవాడే  ఉపాధ్యాయుడంటే. కానీ! కాలం మారుతున్నదన్న నెపంతో ప్రైవేటు పాఠశాలలమత్తులో ఉపాధ్యాయవృత్తి కేవలం  ఓ వృత్తిలా మిగిలిపోయింది ఈనాడు. ఉపాధ్యాయులకూ విద్యార్థులకూ  మధ్య ఉండాలసిన బంధం ఏర్పడాల్సిన అనుబంధం బ్రొకెన్ అయ్యింది అని నాకనిపిస్తున్నది.
అటు ఉపాధ్యాయులూ  అంతే  ఉన్నారు ఇటు విద్యార్థులూ  అంతే  తయ్యారౌతున్నారు.
ఏవైనా, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవాడిగా  ఒక ఉపాధ్యాయకుటుంబం నుండి వచ్చినవాడిగా ఉపాధ్యాయులంటే  ఎంతో గౌరవం ఉన్నవాడిగా, ఈవేళ్ళటి పరీస్థితిని చూసి బాధపడకుండా ఉండలేకపోతున్నాను.

యావత్ ఉపాధ్యాయులందరికీ *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*

Dec 15, 2012

కనెక్టికట్ షూటింగ్

కనెక్టికట్ అనే రాష్ట్రంలోని న్యూటౌన్ అనే ఊళ్ళోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో కొద్దిసేపటి క్రితం షూటింగ్ జరిగింది.
దాదాపుగా ఇరవైఏడుమంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలో. వారిలో దాదాపు ఇరవైమంది పిల్లలే.

షూటింగ్ గరుతున్నప్పుడు లోపలే ఉన్న ఒక పేరెటంట్ చెప్పటం, దాదాపుగా వంద రౌండ్ల కాల్పులు చేసాట్ట సదరు షూటర్.

షూటర్ దొరికాడు. వాణ్ణి గన్ డౌన్ చేశారు. వాడికి పాతికేళ్ళుట. ఇంకొక షూటర్ ఉండొచ్చని అనుకుంటున్నారు. షూటర్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేస్కొని వచ్చాట్ట. నాలుగు తుపాకులు తెచ్చుకున్నాట్ట. ఒక ఆటోమెటిక్ ఎసాల్ట్ గన్ కూడా ఉన్నదట అందులో.

చిన్నారుల అర్థాంతర మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మౌనం పాటిస్తున్నాను. ఏంజరుగుతున్నదో తెలియకుండానే ప్రాణాలు కోల్పోయిన వారి భీతితో నిండిన ఆత్మలు శాంతి పొందాలని ప్రార్థిస్తున్నాను.

నాకు మాటలు రావటంలేదు. ఏదో బాధగా ఉన్నది. మనిషి ఎందుకిలా తయ్యారౌతున్నాడో?
కూలంకుషంగా చర్చ జరగాలి మనిషి యొక్క మానసిక స్థితిగతులపై.



Nov 20, 2012

ఓ సంఘటన

ఈ మధ్య మా ఏకస్థలబహుళగృహ సముదాయంలో జరిగిన ఓ సంఘటన.
మొన్నోరోజు ఆఫీసునుండి ఇంటికి వెళ్తూ పోస్ట్ చూద్దామని పోస్ట్ డబ్బావైపుగా వెళ్తున్నా. పాత్ వే మీద ఇద్దరు పిల్లలు, నల్లవాళ్ళు కూడా పోస్ట్ బాక్స్ వైపుగా వెళ్తున్నరు.
వారిని క్రాస్ చేస్కుని ముందికి వెళ్ళి నేను కారు పార్కింగ్ చేసి సూరిగాడికి పోస్ట్ బాక్స్ తాళంచెవి ఇచ్చాను వెళ్ళి చూసిరారా అని. వాడు కార్ దిగాడు. అప్పుడు ఆ నల్ల పిల్లలవైపు చూశాను. అందులో ఒకడు నాతో ఏదో చెప్తున్నాడు. నేను అద్దాన్ని కిందకి దింపి ఏంటీ అని అడిగేలోపు వాడు చేబులోంచి తుపాకీ తీసి వేలుమీదగా కిందకి వేళ్ళాడేసి, ఇది బీబీ గన్ (బొమ్మ తుపాకీ) అని చెప్తున్నాడు. నాకర్థం అవ్వలేదు. నాకెందుకు చెప్తున్నాడు? అని. ఓకే వాటెవర్ అన్నాను. నా కారుని దాటుకుంటు పోస్ట్ బాక్స్ వెనక ఉన్న ప్లే ఏరియాలోకి వెళ్ళిపోయారిద్దరు పిల్లలూ. అంతలో సూరిగాడు పోస్ట్ చూసొచ్చి కార్లో కూర్చున్నాడు. నేను క్రీగంట వాళ్ళెంచేస్తున్నారా అని గమనిస్తే, నావైపే చూస్తున్నారు. నేను వారివైపు తల తిప్పేలోపు మాయం అయ్యారు.
నాకు ఆశ్చర్యం వేసింది. ఆ గన్ పుల్ చేసిన పిల్లాడు సూరిగాడు వెళ్ళే బడికే వెళ్తాడు. అంటే ఇంకా ఎలిమెంటరీ స్కూలుకే అన్నమాట. అంటె పట్టుమని టీనేజి కూడా కాదు. ప్రతీరోజూ మా ఇంటి ముందునుండే వెళ్తాడు బడికి, ఇంటికీ. రోజూ చూస్తూనే ఉంటాను వాడ్ని. నాకే ఎందుకు చెప్పాడా అని ఒక పాయింటు.
ఇక నాకు కొంత భయం కూడ వేసింది. ఎందుకంటే సూరిగాడు కూడా వాడితో పాటు ఒకే బస్సులో వెళ్తాడు. ఇలాంటి పెద్ద పిల్లలు ఉన్న బస్సులో ఎలాంటి వెధవ వేషాలు వేస్తే అవి పిల్లలకు ఎలా అంటుకుంటాయా ఆని కొంత భయం.
ఇక వాడు చూపింది బొమ్మ తుపాకీనే అవ్వచ్చు గాక. కానీ బడి అయ్యాక ఇంటికొచ్చినాక దాన్ని బయటకు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందీ? ఏ శనివారమో పిల్లలంతా జేరి బొమ్మ తుపాకులతో ఆడుకోవటం ఒక పార్శ్వం. కానీ బడి ఉన్న రోజున. సాయంత్రం ఇద్దరే అలా తుపాకీతో తిరగాల్సిన అవసరం ఏంటీ? వాడు నాకు దాదాపు ముప్ఫై అడుగుల దూరంలోంచి చూపించాడా తుపాకిని. నల్లగా ఉన్నది. పిస్టల్ అనుకుంటా. అది నిజం తుపాకీనే అయే సంభావ్యత ఎంతా?
ఇలా పలు ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చెస్తుండగా మర్రోజు రెంటల్ ఆఫీస్కి వెళ్ళాను. మేనేజర్ తో మాట్లాడాను. ఇలా జరిగింది అని వివరించాను. కావాలంటే నేను వాళ్ళని గుర్తుపట్టగలను కానీ పట్టను. నా ఉనికిని నేను కాపాడుకోవాలి కదా. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిద్దామని చెప్తున్నా అని చెప్పకొచ్చాను. ఆ సదరు పిల్లల మీద నాకెలాంటి ఇదీ లేదు కానీ, నా సేఫ్టీ నా కుటుంబం సేఫ్టీ అపార్టుమెంటు సేఫ్టీ కూడా ముఖ్యమనే భావనతోనే మీదృష్టికి తీస్కొస్తున్నాను అని వివరించాను. ఇలాంటివి మరికొన్ని సార్లు పునరావృతం అయితే ఈ అపార్టుమెంటుకి ఎవరొస్తారో మీరే ఊహించుకుని తగు సేఫ్టీ చర్యలు తీస్కుంటే బాగుంటుందని నొక్కి చెప్పొవచ్చాను.
ఐతే, చివరికి ఇలా అనిపించింది నాకు.
ఆ పిల్లాడు తుపాకీ చూపుతున్నప్పుడు నేను కార్లోనే కూర్చొనున్నాను. ఒకవేళ అది నిజం తుపాకీ అయుండి, నేను నా దురద్రుష్టం కొద్దీ కారు దిగివారివద్దకు వెళ్ళే ప్రయత్నం చేసుంటే ఏవైయుండేదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సో! మన అదృష్టం బాగుండి అలా చేయలేదు....
ఆ నల్లపిల్లాడి అదృష్టం బాగుండి నాదగ్గర తుపాకీలేదు. ఇలాంటి పరీస్థితుల్లో మరొకడో మరొకడో అయుంటే వెంటనే తుపాకి తీసి షూట్ చేసుండే అవకాశాలున్నాయి. అది బొమ్మ తుపాకీనే అయున్నప్పటికీ. పిల్లాడు నాకు తుపాకీని చూపించాడేకాని ఎక్కుపెట్టలేదు. అయినా!

మిత్రులారా! గమనిస్తూ ఉండండి. ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే మీ గృహసముదాయ కార్యాలయంలో చెప్పండి. సెక్యూరిటీని టైట్ చేయమని చెప్పండి. పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు బయటకు తెవద్దని మనవి చెయవచ్చు కూడా.

Nov 7, 2012

ఒబామానా రామ్నీనా?

కడపటి వార్తలందేప్పటికి ఇదీ టాలీ
రామ్నని 158
ఒబామా 147
మరొక రెండు మూడు గంటల్లో ఓ స్పష్టమైన దృశ్యానికి రాగలమేమో
రామ్నీ యొక్క బృందం అన్నిరకాలుగా ఒబామా మీద బురదచల్లారు. అది నాకు నచ్చలేదు. ఒకానొక రేడియో ఛానెల్లో రష్ లింబా అనొకడు ఎంత దుష్ప్రచారం చేశాడంటే అంత. అదే రేడియోలో నిన్నటికి నిన్న పార్క్స్ అనేవాడు "రిపబ్లికన్స్ అందరూ మంగళవారం ఓటేయండి, డెమొక్రాట్స్ అందరూ బుధవారం ఓటేయండి" అని పదే పదే చెప్పుకొచ్చాడు. ఎలక్షను జరిగేది మంగళవారం, బుధవారం ఓటేయటానికి ఆస్కారంలేదని వాడి వెధవ హ్యూమర్. దాన్ని నిజంగా తీసుకునే వాళ్ళు కొందరుండచ్చు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. అంతలో ఎలక్షన్ కమీషనర్ స్వయంగా రేడియో స్టేషనుకి కాల్ చేసి వార్న్ చేశాడు. తప్పు అను. ఐనా వాడు తగ్గలేదు.
ఇక మరొక టాక్ షోలో "ప్రియ మిత్రులారా! మీమీ బ్యాంక్ ఎకౌంట్లనుండు డబ్బు డ్రా చేసేస్కొండి, ఏం జరుగుతుందో చెప్పలేం" అని చెప్పుకొచ్చాడు మరొక కుంక. అదే రేపొద్దున రామ్నీ గెలిస్తే ఏంచేస్తారూ? బొక్కసంలో ధనం లేకుండా ఏంపతకాలు అమలు చేయగలరూ?
సో! వీరి నెగెటివ్ పబ్లిసిటీ ఒబామాకి వరం కానున్నదా?
మీరేమంటారూ?

Sep 14, 2012

సిగరెట్టు కాల్చే వాళ్ళు

సిగరెట్టు కాల్చే వాళ్ళు ఇట్టే మిత్రులైపోతారు. దీనివల్ల రోజుకి రెండు తాగేవాళ్ళు దానికన్నా ఎక్కువసార్లు తాగుతారు. ఎంచేతనంటే ఒకడు రెండోవాణ్ణి లాక్కెళ్తాడు, నే ఎలల్తన్నా వస్తావా అని. సరే అని వెళ్తారా, ఇద్దరూ తాగుతారు. అలా. దీనివల్ల సిగరెట్లు ఎక్కువ కాల్చటమే కాదు జబ్బులు కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇద్దరు పంచుకుంటారు. వాడు సగం వీడు సగం.
మా కార్యాలయంలో ఇలాంటి బ్యాచిలు అనేకం. అందులో మా గ్రూపులోని ఇద్దరు మహిళలు. రోజుకి ఆరు సార్లు తాగుతారు. తాగొచ్చి తమ తమ డెస్కులవైపుకి వెళ్ళేముందు తలుపు దగ్గర ముచ్చట్లు. ఏందయ్యా మాట్లాడుకునేదీ అంటే నా బార్బిక్యూ సరిగ్గా రాలేదని ఒకామె అంటే ఔనా, నాదీ సరిగ్గా రాలేదు అనో, మా అబ్బాయి లాగులో ఉచ్చ పోసుకుంటున్నాడని కుర్రామె అంటే నా మనవడు కూడా అంతే చేస్తున్నాడని ముసలావిడ.
ముసలావిడ సీటు పక్కనే ఇంకో ముసలావిడ, ఆమె వీరి బ్యాచ్ కాకపోయినా దమ్ము కొట్టే బ్యాచే. ఆమె ఈ మధ్యన నెత్తికి కర్చీఫ్ కట్టుకుని వస్తుంటే నా పక్కనోడ్ని అడిగా, ఏవిట్టా అని. కేన్సర్ వస్తే కిమొ థిరపీ చేయించుకుంటున్నది అన్చెప్పాడు.
ఆమెని చూసైనా వీళ్ళు మారరు.
మనిషి మారడు!

ఐతే ఈమధ్య అనేకసార్లు అనేక మందిని గమనించిందేవిటంటే, కార్లో కూర్చుని దర్జాగా దమ్ము కొడుతుంటారు. భార్యా భర్తలిద్దరూ. భేష్! మెచ్చుకు తీరాలి వారి సౌభాత్రుత్వానికి, మిత్రత్వానికీ. కానీ వెనుక సీట్లో పిల్లలుంటారు. వారేం చేశారని వారు సెకెండ్ హ్యాండ్ స్మోకర్స్ అవ్వాలీ?
వారి లంగ్స్ పింక్ నుండి నల్లగా మాడిపోయినట్లుగా చిన్నవయసులోనే ఎందుకవ్వాలి?
చిన్నప్పటినుండే సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల ఆస్తమాకి ఎందుకు గురి అవ్వాలి?
అలా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడే హక్కు సదరు తల్లితండ్రులకు ఎవరిచ్చారూ?
ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఉండవు. ఉండబోవు కూడా.

Jul 21, 2012

మళ్ళీ పేలిన తుపాకులు

అమెరికాలోని కొలరాడోలో మరో మారు తుపాకులు పేలినాయి
మన్నెండు మంది నేలకొరిగినారు
వాడెవడో మెడికల్ స్టూడెంటు. నాలుగు తుపాకులు కార్లోవేస్కొని థియేటరుకి వెళ్ళి, ఫైర్ ఎమర్జెన్సీ లోనించి దూసుకెళ్ళిమరీ కాల్చాడు మనుషుల్ని పిట్టల్లాగా.

Police said the gunman entered through an exit door and appeared at the front of the theater in Aurora and released a canister, thought to be tear gas, that let out a hissing sound.

He then started shooting into the crowd, sparking pandemonium.

Witnesses said the shooter was wearing a bullet-proof vest and dressed entirely in black. Some also said he was wearing a gas mask or goggles.

"He had no specific target. He just started letting loose," the witness added.

Witnesses told reporters that the gunfire erupted during a shootout scene in the "The Dark Knight Rises."

Aurora Police Chief Dan Oates said it was established that the apartment had been booby-trapped with sophisticated explosives or flammable material and officers were trying to determine how to defuse the device or devices.

౧. హ్మ్! ఎన్టర్టైన్మెంట్ అనేది మనిషి మానసిక స్థితిపై ఇంతలా ప్రభావం చూపే పనైతే దాన్ని ఒకదగ్గర ఆపగలగటం మంచిది అని నా అభిప్రాయం.

౨. అమెరికాలో షూటింగ్ కొత్త కాదు. ఐతే, అమెరికాలో తుపాకులు దొరకటమూ కష్టం కాదు. తప్పెవరిదీ? మొన్నటికి మొన్న ఒకడు కొత్త గన్ కొని సోఫా మధ్యలో పెట్టాట్ట. వాడి మూడేళ్ళ కొడుకు ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ నొక్కాట, తూటా పిల్లాడికే తగిలింది. తర్వాత ఏవైందో చెప్పాల్సిన పనిలేదు. తప్పెవరిదీ? ప్రస్థుత సంఘటనలో ఇరవైనాలుగేళ్ళ హోమ్స్ అనేవాడికి తుపాకులు అందజేసిన వ్యాపారానిదా తప్పు లేక, స్పైడర్మాన్ లాగా డ్రస్ వేసి క్యాన్స్ థియేటర్లోకి వదిలి కనిపించిన వాడ్నల్లా సినిమాలోల్లాగా కాల్చివేయటం అనే ఓ స్థితిని కలుగజేసిన సినిమా మాధ్యమానిదా లేక, తుపాకులను అడ్డుకోలేని ప్రభుత్వ పాలసీలదా?

౩. లేక, సదరు హోమ్స్ అనేవాడి మానసిక స్థితిని దిగజార్చిన కఠోరమైన మెడికల్ విద్యదా? అమెరికాలో మెడికల్ విద్యార్థుల కష్టాలు చెప్పనలవి కావని చాలా మందే చెప్పగా విన్నాను.

౪. గత పదిహేనేళ్ళుగా పబ్లిక్ షూటింగ్ అనేది కొత్త విషయం కాదు. అందునా షూటింగ్ చేస్తున్న వాళ్ళలో స్టూడెంట్ కుర్రాళ్ళే ఎక్కువ అన్నదీ కొత్తవిషయం కాదు. కానీ ఇంతవరకు ఎవరూ ఏఏ అడుగులు ముందుకి వేశారో నాకైతే తెలియదు.

౫. తల్లితండ్రులు తమ భద్రపరచుకోవాలి పిల్లలకి విలువలు నేర్పాలని ఇందాక ఎవరో రేడియోలో చెప్పగా ఇలా అనిపించింది -

"తుపాకులు బీరువాల్లో దాచిపెట్టినా, అందనిది ద్రాక్షా అవుతుంది. దాన్ని తాకాలనీ, జేబులో పెట్టుకోవాలని, గిర గిరా తిప్పాలనీ, పలానీ హీరోలాగా చేయాలనీ ఫ్యాంటసీసుని క్రియేటు చేస్తున్న మాధ్యమం, క్రియేటు చేస్తున్న వ్యవస్థా ఉన్నంత కాలం బీరువాలు ఉట్టి బీరువాల్లాగనే మిగుల్తాయి"

౬. కాపీక్యాట్ అయిన మన దేశంపై ఇలాంటి గన్ కల్చెర్ యొక్క ఇంపాక్ట్ ఏవిటీ అని ఆలోచిస్తుంటే వళ్ళు జలదరించక మానదు. తుపాకీని చూపని సినిమా చూపండి, ఒక్కటన్నా [దాదాపు లేవు అని నా అభిప్రాయం]. చట్టం నిద్రపోతూ న్యాయవ్యవస్థ కుళ్ళిపోతూ ఉన్న మన సమాజంలో తుపాకీని పొందటం ఎంత తేలికో ఆలోచించండి.

ఎలా? వీటిని ఆపటం ఎలా?

-ఆపలేము

Jul 11, 2012

ఆమె తల్లేనా?

కేన్సాసులో నిన్నటి ఓ వార్త
ఓ తల్లి, తాను వ్యభిచారం చేస్తూ, తన ఇద్దరు పిల్లలలి వ్యభిచారం చేయిస్తున్నదిట. ఆ పిల్లలకి పెద్దఅమ్మాయికి పదునాలుగు, చిన్న పిల్లకి పదకుండేళ్ళు.
మధ్యాహ్నం మూడు నాలుగింటి నుండి పొద్దున ఏడింటివరకూ డ్యూటీ అట ఈ పిల్లలకు.
హ్మ్! సదరు తల్లికి ఏమి శిక్ష పడింది ఇత్యాదివి పక్కన పెట్టి, తను నరక కూపంలోకి వెళ్తూ తనవాళ్ళని కూడా లాగటం, తెలిసి తెలిసీ....ఆమె తల్లేనా? అనిపించేలా చేసింది.
స్టాటిస్టిక్స్ ప్రకారం, అసలు వ్యభిచారానికి కారణాలలో అతిముఖ్య కారణం *డ్రగ్స్* అట. పై సంఘటనలో కూడా, సదరు తల్లి కూతుళ్ళ రక్తాన్ని డ్రగ్స్ కోసమే అమ్మింది.

May 23, 2012

గే ఆత్మహత్య


ఇందాక కేన్సాస్ యఫ్.యంలో ఓ డిస్కషన్
ఎవడో కాలేజీ కుర్రాట్ట, వాడి సహచరుడు గే అట, క్లోజెట్లో మరొక గేతో గీకే కార్యక్రమంచేస్తుంటే వీడు దాన్ని ఫోనుద్వారానో షూట్ చేసి లీక్ చేసాట్ట. సగరు గే, అవమానంగా భావించో బ్రిడ్జిమీద నుండి దూకి ప్రాణత్యాగం చెస్కున్నాట్ట.
ఈ షూట్ చేసిన వాడికి నెలరోజులు శిక్ష పడిందట.
౧. ఈ శిక్ష సరైనదెనా?
౨. ఈ గే కార్యక్రమంలో గే గాళ్ళు గీక్కోకుండా ఓఆడది మొగాడుంటే ఏవిటి స్థితి?
౩. లా ఎలా వీటిని డీల్ చేయలి
౪. తల్లితండ్రుల పాత్ర ఏవిటీ?

మీ మీ అభిప్రాయలు తెలియజేయండి

Mar 28, 2012

తెలుగు నేర్పకపోతే ఎలా?

మాతృభాష నేర్పకపోతే పిల్లలకి ఎలా?
పిల్లలు అవసరానికి ఏవైనా నేర్చుకోగలరు, వారి లెరనింగ్ కర్వ్స్ హైగా ఉంటాయని గుర్తించకపోతే ఎలా?
పిల్లలు *లెరనింగ్ బై ఇమిటేషన్* అనే ప్రక్రియ ద్వారా పదహారు భాషల దాకా అవలీలగా నేర్చుకోగలరనీ, అంచేత మాతృభాషని ముందు నేర్పుకుంటే, అవసరానికి మిగతా భాషలు నేర్చుకోగలరనీ ఎందుకు గుర్తించరూ అమెరికాలోని భారతీయులు, అందునా తెలుగువాళ్ళూ?
నాల్గు గోడలమధ్య, అదే ప్రపంచం అనుకుని, ఆ నాల్గు గోడల రాజ్యానికి తనే అధికారినని విర్రవీగుతూ, తీస్కునే నిర్ణయాలలో తప్పొప్పులు చెప్పే మహానుభావులు లేక, సరిచేసే పెద్ద హస్తంలేక చేసే పనులవల్ల, మన సంస్కృతి భూస్తాపితం అవుతుందని గుర్తించు!!
ఒక మెక్సికన్ తన పిల్లలతో స్పానిష్ లోనే మాట్లాడతాడు
ఒక మెక్సికన్ తన సహ మెక్సికనులతో స్పానిష్ భాషలోనే సంభాషిస్తాడు
ఒక పనామా వాసి తన పిల్లలతో స్పానిష్ లోనే మాట్లాడతాడు
ఒక బ్రజీలియన్ తన పిల్లలతో పోర్చుగీసులోనే మాట్లాడతాడు
ఒక తెలుగువాడు తన పిల్లలతో ఆంగ్లంలో ఎందుకు మాట్లాడాలీ?

Dec 24, 2011

నీ యబ్బరేయ్!! గూగులుగా!!!

ఓరి గూగులు ఎదవా!!!
ఇదేట్రా? ఇట్టా సీపెడతన్నా నా దేశాన్ని?
ఎవరైనా గమనిమ్చారా? బ్లాగు ఎనలిటిక్స్ లోకెళ్తే, గూగుల్ భారతదేశాన్ని ఎట్టా సీపెడతన్నాడో?

భారతదేశ పటం తమకి తెలియక పోతే అడిగి తెలుసుకోవలి. అంతేకానీ ఇలా రెండర్ చేస్తారట్రా గూగులు ఎదవా!! గూగులు పెట్టి కొడితే గూగుల్లో కనిపించకుండా పోతావ్, ఎదవా!

Dec 6, 2011

లాంగ్ డ్రైవ్స్ - నా అనుభవాలు

ఆల్బెనీలో ఉన్నప్పుడు ప్రతీ రెండో మూడో నెలలకోమారు జెర్సి వెళ్ళొచ్చేవాళ్ళం. అక్కడ్నుండి జెర్సి 135 మైళ్ళ దూరం. 135 మైళ్ళు రెండున్నర గంటలు లేక మూడు గంటలు పట్టేది. పెద్ద డ్రైవ్ చేసినట్టు ఉండేది కాదు. కానీ ఒకసారి మాత్రం సిన్మా కనిపించింది.
అది అగస్టు, 2007. ఆల్బెనీ నుండి షికాగో వెళ్దాం అని అనుకున్నాం. డ్రైవ్ చేయాలంటే కష్టమే కదా అని విమానావకాసాలు చూసాం. ఆల్బెనీ నుండి షికాగోకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఐతే చాలా ఖరీదు. వేరే మార్గం? నెవార్క్ నుండిగానీ లేక జె.యఫ్.కె నుండిగానీ బుక్ చేస్కుంటే తగ్గుతుందని జె.యఫ్.కె నుండి చేసాను. సాయంత్రం ఏడుకి ఫ్లైట్. మధ్యానం బయల్దేరాం ఆల్బెనీ నుండి. I-87 మీద అలా న్యూయార్క్ వైపు వెళ్తే, జి.యస్.పి వస్తుంది. దానిమీద మరికొంత దూరం వెళ్తే I-95 వస్తుంది. దానిమీద కొంతవెళ్ళి జె.యఫ్.కె కి వెళ్ళాలి. I-95 దాకా బాగనే వెళ్ళాం. I-95 మీద చుక్కలు కనిపించాయి. మొత్తానికి జె.యఫ్.కె కివెళ్ళేప్పటికి ఆరు. ఏడుకి ఫ్లైట్. బ్యాగేజ్ గట్రా చెకిన్ చేసి కూర్చున్నాం. ఇంతలో ఎనౌన్స్మెంట్. ఫ్లైట్ బ్యాడ్ వెదర్ కారణంగా గంట డిలే అని. సరే అని ఏదో మింగి కూర్చున్నాం ముగ్గురం. అప్పటికి పిల్ల ఇంకా పుట్టలేదు. ఎనిమిదైంది. మళ్ళీ ఎనౌన్స్మెంట్. మరో గంట లేట్ అని. తొమ్మిదైంది. మరో గంట లేట్ అని చెప్పారు. అలా పదకుండైంది. ఇక లాభంలేదని వెళ్ళి అడిగితే థండర్‌స్ట్రాం వల్ల మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అని చావుకబురు చల్లగా పదకుండింటికి చెప్పారు. సరే ఐతే మరి మా లగేజీ మాకిస్తే వెళ్ళిపోతాం అని చెప్తే...ఒక్కొకరి లగేజి దింపి ఇచ్చేప్పటికి పన్నెండున్నర. లగేజి తీస్కుని పార్కింగ దగ్గరకి వెళ్ళి కారు వెత్తుక్కుని బయట పడేప్పటికి ఒంటిగంట అయ్యింది తెల్లవారుఝామున. మా స్నేహితునికి కాల్ చేసా వాళ్ళింటికి వెళ్దాం అని. అతను ఫోన్ ఎత్తలేదు. పిల్లాడు కార్లో పడుకున్నాడు. తను కునకు తీయకుండా నాకు నిద్రరాకుండా ఉండేందుకు ఏదోకటి మాట్టాడుతోంది. ఒంటిగంటకి రోడ్డెక్కితే, మా I-87 పట్టుకునేందుకు చుక్కలు కనిపించాయి, ఒక రాంగ్ ఎక్జిట్ తీస్కోడంతో. అష్టకష్టాలు పడి మొత్తానికి I-87 పట్టుకున్నాం. రెండైంది అప్పటికి టయం తెల్లవారు ఝామున. ఒకవైపు తనకి నిద్ర వస్తున్నా ఆపుకుంటూ నాకు నిద్ర రాకుండా ఉంటంకోసం ఏదో మాట్లాడుతోంది. అట్టకాదని నిద్రపొమ్మని చెప్పి, ఓ సర్వీస్ ఏరియాలో ఆగి కాఫీ తీస్కుని ఒక తొక్కుడు తొక్కా పెడల్ని. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఏదివిలో విరిసిన పారిజాతమో దగ్గరనుండి ఇద్దరు భామల కౌగిలిలో స్వామీ వరకు పాడుకుంటూ డ్రైవ్ చెసాను. అయ్యక కె అంటే కిషోర్ పాటలు పెట్టి కుమ్మా౨ను. ఇంటికి రెండు గంటల్లో చేరుకున్నాం. అంటే నాలుగింటికి దిగాం ఆల్బెనీలో.
నేర్చుకున్న నీతి - అంత కష్టపడాల్సిన పనిల్యా. ఎదోక హోటెల్లో ఆగవచ్చు. ఐతే, అది ఆగేంత డిస్టెన్సూ కాదు. ఆగకుండా వెళ్ళేంత ఇదీ కాదు. నీతి పెద్దగా ఏం లేదు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్. డూ ఇట్. అంతే. మనో ధైర్యం కావాలి. అదొక పాఠం అనుకోవచ్చు, బట్ ఎట్ హై రిస్క్.

తర్వాతి లాంగెస్ట్ డ్రైవ్ - ఆల్బెనీ టు షికాగో.
౨౦౧౦ జనవరిలో పిల్లా జెల్లాలను భారతావనికి పంపించాను. కేన్సాసులో ఉద్యోగం దొరికింది. మార్చి మొదటివారంలో జాయనింగు. ఇల్లుగిల్లూ ఖాళీజేసి మార్చి రెండున రోడ్డెక్కా. చివరిసారిగా ఆల్బెనీలోని దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండవెట్టుకుని పొద్దున పదిన్నరకి రోడ్డెక్కా. I-90 వెస్ట్. ఆల్ ది వే షికాగోకి తీస్కెళ్తుంది. ఈసారి కొంచెం తెలివిగా గార్మిన్ నువి కొని కారుకి తగిలించా. ఇంకోతేడా ఏంటంటే, కారు మారింది. ౨౦౦౯ ఆగస్టులో నా నిస్సాన్ ఆల్టిమాని ట్రేడ్-ఇన్ చేసి హాన్డా సిఆర్-వి ఈఎక్స్-ఎల్ తీస్కున్నా. వావ్!! వాటే డ్రైవ్. హాన్డా నన్ను ఎక్కడా నిరాశపరచలేదు. ఫోర్ వీల్ డ్రైవ్. అత్భుతంగా ఉంది. అలా అలా సాగిపోయింది ఐ నైంటి మీద. వెళ్తూ వెళ్తూ సాయంత్రానికి కొలంబస్ ఒహాయో దాటి టొలెడో దాకా వచ్చాను. పది అయ్యింది. రాత్రిళ్ళు అందునా మార్చిలో, కొంత సహనానికి పరీక్షే. ఓ ఎక్జిట్లో ఆపి, గాస్ కొట్టించుకుని, ఆ చలికి, నిద్ర రాకుండా ఉండేందుకు ఏంచేయ్యాలా పొద్దుణ్ణించి ఆగిన చోటల్లా కాఫీలు తాగీ తాగీ నోరంతా కంపైందిగా అనుకుంటూ లోనకి వెళ్ళి చూస్తే, ఏదో స్మూతీ కనిపించింది. ప్రయత్నిద్దాం అని తీస్కున్నా. ఒక్క సిప్పు, వళ్ళంతా కొత్త ఉత్సాహం ఉరకలేసింది, చలిలో చల్లటి జివ్వు అన్నమాట.
మొట్టమొదటి హెచ్చరిక -
మళ్ళీ రోడ్డెక్కి, తొక్కటం మొదలెట్టా. పోలీస్ బాబాయ్ లైటేసాడు. దీనెమ్మ జీవితం అనుకున్నా. వచ్చి లైటేసి లోనకి చూసాడు. ముందు పాసింజరు సీటులో నెత్వర్క్ కేబుల్స్ అవి ఇవి వెనక అంతా ఏవో సామాను టివి గట్రా లతో నిండిపోయి ఉన్నదిగా.
ఏట్రా మాయ్యా!! యాడికీ
షికాగో ఎల్తన్నా
ఏందియ్యన్నీ?
రిలొకేట్ అవుతున్నగా. ఎసన్షియల్స్ అట్టుకెల్తన్నా
నీ డ్రైవర్స్ ఇలాగివ్వు
ఇదిగో

పదినిమిషాలు పోయినాకొచ్చాడు.
అబ్బీ! డెభై లైను మీద ఎనభై ఒకటి ఎల్తన్నావ్. తప్పుకదూ?
పొద్దుననంగా బయల్దేరా బాబాయ్. గమనించలేదు. కావాలని వెళ్ళింది కాదులే
సరే! నీకింత వరకూ ఓక్క టిక్కెట్టు కూడా లేదు కాబట్టీ, ఇదిగో ఈ నోటెడ్ వార్నింగు. పుచ్చుకో
ఇవ్వు
దీన్ని ఏంజేస్తా?
ఏమో
ఏమో కాదు మాయ్యా!! ప్రిజ్జీకి అంటించుకొని రోజూ సూస్చా ఉండు. ఇంక పో!

అలా బయటపడి, మొత్తానికి షికాగో పన్నెండున్నరకి సేరుకున్నా. లాస్ట్ గంట బోరు కొట్టింది. కానీ!! విసుగు అనిపించలేదు.
850 మైళ్ళు. దాదాపు పదమూడు గంటలు, మధ్యలో నాల్గు బ్రేకులు.

షికాగో ఎళ్ళినాక మూడోరోజుకో కాన్సాసుకి చెరాను. షికాగో నుండి కేన్సాసుకి పలు దార్లు. ఒకటి, షికాగో - డిమొయిన్స్ - కేన్సాస్ I-80W తర్వాత I-35S ఎంది గంటల డ్రైవ్. రెండోది I-55S నుండి I-72W కొంత దూరం వెళ్ళినాక ఇది US 36 W లో కలుస్తుంది, ఆనక ఇది I-35S లో కలుస్తుంది. నా జిపియస్ రెండో దారెంబటి ఎళ్ళరా సిన్నా అన్నది.  I-55S మీద కొంత ట్రాఫిక్ ఎక్కువున్నా, వెళ్ళేకొద్దీ తగ్గింది. బ్లూమింగుటన్ను నార్మల్ దాటినాక బాగా తగ్గిపోయింది. స్ప్రింగుఫీల్డు దగ్గరకొచ్చేప్పటికి కొంత పెరిగినా,  I-72W కలిసేప్పటికి అసలు ట్రాఫిక్కు ఉండదు. ఇక హాన్నిబాల్ దగ్గర  అనుకుంటా I-72W US 36 W విడిపోతుంది. ఇక తర్వాతంతా కంట్రీ సైడ్ ప్రయాణం  I-35S దాకా. అస్సలు ట్రాఫిక్ ఉండదు. ఈగలు దోమలు తోలుకుంటూ ఉంటుంది ఈ మార్గం. ఆవేళ్టి నా ప్రయాణం ఎక్కడా తలనొప్పి అనిపించలా. సాఫీగా సాగింది. వింతగా అనిపించింది. ఈశాన్యానికీ మధ్య పశ్చిమానికి ఎంత తేడానో అనుకునేంత తేడా కనిపించింది. ఊర్ల పేర్లు విచిత్రంగా అనిపించింది. హానిబాల్, క్విన్చి, కామెరూన్, చిల్లికొతె ఇలా మిసోరీ రాష్ట్రంలోని ఊళ్ళ పేర్లు.
పోయినేడు ఈఏడు కలిపి దాదాపు  ఆరుఏడు సార్లు వెళ్ళొచాను షికాగో.
మొన్న థాంగ్స్ విగివింగుకి కూడా వెళ్ళొచ్చాను.
ఐతే!! ఈసారి ఓ అనుభవం.
వెళ్ళేప్పుడు చిల్లకొతె దాటినాక అనుకుంటా. కాప్ ఆపా౨డు. అబ్బాయ్, అరవై ఐడు లైను మీద డెభై ఆరు ఎల్తన్నావ్. ఎందుకలాగా అన్నాడు. అయ్యా ఇంటెన్షన్ల్ కాదు. పేద్ద గమనించలేదు అన్నాను.
ప్రత్యేకించి ఈ కాలంలో, సంధ్యవేళ ఇంత స్పీడ్ మంచిది కాదు. ఇది జింకల మేటింగు సీజన్. అవి గుద్దుతాయ్ వచ్చి. వెళ్ళాల్సిన దానికన్నా పన్నెండు మైళ్ళు ఎక్కువ ఎల్తన్నాక్ కాబట్టి ఇదిగో టిక్కెట్టు అని నూటాపది డాలర్లకు టిక్కేటు సింపి ఇచ్చాడు. అయ్యా! నాకింతవరకూ ఏలాంటి చరిత్రా లేదు అన్నాను కన్సిడర్ చేస్తాడేమో అని. అహా!! తెల్లోడు, ఎదవ, పట్టించుకోలా.
ఇదిగో ఇప్పుడే చెక్కు పంపించి వస్తన్నా.


నేనిచ్చే సలహా -
కీప్ లెఫ్ట్, పాస్ రైట్. ముందరున్న వాటిని పాస్ చేస్కుంటా వెళ్తే బోర్ కొట్టదు. అంతేగాక అలసట ఉండదు.
క్రూజ్ పెట్టుకోద్దు. మజా ఉండదు.
పాస్ చెసేప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు. కాప్ ఆపినా, పాస్ చేస్తున్నావు కాబట్టి ఎళ్ళినావని చెప్పుకోచ్చు

Jul 16, 2011

శ్రీరంగం గుడిలో నిధి నిక్షేపాలు

శ్రీరంగం గుడిలో నిధి నిక్షేపాలు
పరిశోధకుడి వెల్లడి చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులోని ఆలయాల్లో కూడా నిధి నిక్షేపాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. పరిశోధన పండితుడు ఎ.కృష్ణమాచారియర్‌ శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని, ఈ విషయంపై తాను 2006లోనే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించానని బుధవారం విలేకరులకు తెలిపారు. తాను ప్రస్తుతం ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. శ్రీరంగనాథ ఆలయ విస్తీర్ణం 37 X 27 అడుగులని తెలిపారు. గరుడ ఆలయం, ద్వారానికి 15 అడుగుల దూరంలో ఉందని తాను గుడి మొత్తం పరిశోధించానని ఆయన వివరించారు. తన పరిశోధనలను 18 సంపుటాలుగా 'శ్రీరంగం ఆలయం, ఆభరణాలు' పేరుతో విడుదల చేశానన్నారు.

ఇలాంటి వార్తల ద్వారా మీడియా మాధ్యమాలు ఏం సాధిద్దామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా? ఇప్పటికే మన చరిత్రని కోల్పోయాం విదేశీ పరిపాలనలో. అరుదైన హైందవ కోవెలలు తునాతునకలు కావించబడి, ఆ స్థానంలో మశీదులు నిర్మింపబడ్డాయి. మన ఎనలేని సందని తురుస్కులు దోచగా, తెల్లవాడు నిల్చోబట్టి బట్టలు కూడా ఊడదీసుకు వెళ్ళిపొయ్యాడు. అడుగుబొడుగు మిగిలున్న మన హైందవ దేవళాలు, చారిత్రక సంపద, దొంగలపాలైంది. గుడి కట్టినప్పుడు, కోటలు కట్టినప్పుడు నవరత్నాలతో శంఖుస్తాపన చేస్తారని కొందరు, విగ్రహప్రతిష్ఠ జరిపేప్పుడు నవధాన్యాలతోపాటు నవరత్నాలతో విగ్రహాన్ని నిలబెడతారని కొందరు మూలమూలలల్లోని ఆలయాలను త్రొవ్వేసారు. పంచలోహ విగ్రహాలను తస్కరించారు. తురుష్కులపై, కిరస్తానీయులపై ఈగైనా వాలనీయని నిరంకుశ ప్రభుత్వం, కిమ్మని కూడా అనలేదు. దేవాలయాలకు దేవాలయాలు పాడుబడిపొయ్యాయి. వాటి సంపద దోచుకోబడ్డది. దేవాలయ భూమి నిరంకుశ ప్రభుత్వపు ఆధీనమైంది. అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్టు, ఈ భూమిని పందేరం చేస్కుంటున్నది ప్రభుత్వం. గుంటూరికి దగ్గర్లోని కొండవీటి కోటలో ఒకనాటి పాలకులు తప సంపదను నిక్షిప్తం చేసారని, ఇప్పటికీ వాటిని తొవ్వాలని ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడులోని అనేక దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు తస్కరించబడ్డాయి. పల్నాటిలోని కోటలు ఏనాడో శిధిలావస్తకు చేరి ఇప్పుడు కేవలం రాళ్ళా దిబ్బల్లా మిగిలాయి.
ఇక ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల వంతు. నిన్న పద్మనాభుని దేవళం. ఇవ్వాళ్ళ శ్రీరంగం.
ఇలాంటివి త్రొవ్వి సంపద ఉందని బయల్పరచి, ఎలాంటి తరంగాలను జనభాహుళ్యానికి అందిస్తున్నారు సదరు పరిశీలకులూ? ప్రభుత్వాలు? వార్తా సంస్థలూ?
బాబులూ, జనాలు, దొంగలూ, దోపిడీదారులూ, రాజకీయ వినాయకులూ, ఇక మీ ఓపిక కనిపించిన ప్రతీ గుడిని తొవ్వుకోడి!! దొరికిన వాడికి దొరికినంత అని చెప్పకనే చెప్తున్నాయి కదా ఈ పరిశీలనలు పరిశోధనలు.

రేపటి తరాలకు ఇప్పటికి *మన చరిత్ర* వెన్నెముక లేకుండా చేస్కున్న ఈ తరాలు, ఇలా చేసి, కనిపించిన ప్రతీదేవళాన్న, అంతిమ దిశకు చేరుకున్న చారిత్రాత్మక కట్టడాలను *నిధి నిక్షేపాల* పేరుతో కూలగొడితే!! మిగిలేది ఏవిటీ?

May 10, 2011

పాప్ అప్ పుస్తకాలు

ఎప్పుడు గ్రంథాలయానికి వెళ్ళినా నాన్నా పాప్ అప్ పుస్తకాలు నాన్నా తీస్కుందాం నాన్నా అంటుంటాడు సూర్య. వద్దులేరా నాన్నా చెల్లి లాగేసి చింపేస్తే కష్టం కదా అని వారిస్తుంటాను. నిన్నటి వారాంతం గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు, పద నాన్నా ప్లీజ్ అన్నాడు. సరేరా పదా అని పాప్ అప్ పుస్తకాల గదికి వెళ్ళాం.
అక్కడి లైబ్రేరియన్
"ఏం కావాలయ్యా"
"పాప్ అప్ పుస్తకాలు కావాల"
"తప్పకుండా. మావద్ద ఓ యాభై దాకా ఉన్నాయి పాప్ అప్ పుస్తకాలు"
"ఓహో ఏవిటీ మీ పాలసీ"
"ఇక్కడ కూర్చుని చక్కగా చూస్కుని తిరిగి ఇచ్చేసి వెళ్ళటమే పాలసి"
"ఓహ్ అలాగా"
సూరిగాడితో
"అరేయ్ ఇంటికి ఇవవ్వరుట, ఇక్కడే చూసి ఇచ్చేయాలట సరేనా"
ఆమెతో "హ్మ్ బాగుంది ఐతే ఏవేం పుస్తకాలున్నాయో చూపండి"
ఆమె పుస్తకాల గదికి దారితీసింది, వెనకాతలే మేమూ వెళ్ళాం
పాప్ అప్ పుస్తకాలు ఒక నిర్బంధ గదిలో ఉన్నాయి. తాళం తీసి లోపలకి ఆహ్వానించింది. ఒక అల్మరా మొత్తం అవే.
మనవాడి కళ్ళు మరి దేవుళ్ళాడే కళ్ళు కదా [సెర్చింగ్ ఐస్] వెనువెంటనే ఓ రెండు పుస్తకాలను ఇట్టే పట్టేసాడు. డైనోసరస్ పాప్ అప్ పుస్తకం, మరియూ అండర్ వాటర్ పాప్ అప్ పుస్తకం.
అన్న రెచ్చిపోతే చెల్లి వెనకడుగు వేస్తాయ్? నెవ్వర్
తింకబెల్ తింకబెల్ అన్నది. లైబ్రేరియన్ వెంటనే ఏదో ప్రిన్సెస్ పాప్ అప్ పుస్తకం ఇచ్చింది.
ఏమాటకామాట, పాప్ అప్ పుస్తకాలు తయ్యారు చేయటం అంత సుళువు కాదు. ఎంతో కళాత్మకత ఓర్పు అవసరం. వాడివద్ద రెండు మూడు పుస్తకాలు ఇంతక ముందే ఉన్నా ఇప్పుడు చూసినవి మాత్రం అత్భుతమైనవిలా తోచాయి
వాడి రెండు పుస్తకాలు కేరింతలు కొడుతూ చూసాడు. అయ్యాక ఇచ్చేసి పిల్లలపుస్తకాల గదివైపుకి నడిచాం అందరం
కొన్ని ఫోటోలు ఇవిగో

Apr 28, 2011

ఆఫీసు కబుర్లు

మా డెవలప్మెంట్ లీడ్ బాబ్ గాడు నా సీటు దగ్గర ఆగి -
"భాస్కర్ ఈ బ్లూబెర్రి పై తింటావా"
"ఏం బెర్రీ? బులుగు బెర్రీయా?"
"ఔను భాస్కర్! బులుగు బెర్రీనే. రెండు ముక్కలే మిగిలాయి. మరింక నీ ఇష్టం"
అంతలో గస్ అగాడు నా సీటు దగ్గర
"బాగుంది బాబ్ పై"
"నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటివి చేస్తుంటుంది. తనకు ఆటిజం ADHD - Attention deficit hyperactivity disorder. తనని తాను బిజీగా ఉంచుకోటం కోసం ఇలా"
"ఇవ్వు నాకూ ఓ ముక్క బాబ్" [నేను]
ఓ కాయితపు సిబ్బిరేకులో పెట్టి ఇచ్చాడు
అందరూ ఎవరి సీట్ల దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయారు.
రుచి చూద్దాం అని నేనూ ఓ ముక్కని నోట్లో వేస్కున్న.
బాగనే ఉంది.
ఆటిజం ఉన్న అతని స్నేహితురాలు నిజీగా ఉంటంకోసం ఇలా వంటలు గట్రాలతో బిజీగా ఉంటున్నది. హ్మ్. ఇంటరెస్టింగ్ అనుకున్నాను.


గస్ అనేవాడికి మొన్న మోకలికి ఏదో చిన్న సర్జరి అయ్యింది. ఈవేళనే వచ్చాడు ఆఫీసుకి పునఃప్రవేశం అన్నమాట. మరి వెళ్ళి పలుకరించాలి కదా? వెళ్ళాను. అడిగాను. ఏవిటి తాతయ్యా ఎలా ఉన్నావూ అని. బాగనే ఉంది అని తతంగం ఎలా జరిగిందీ ఏవిటీ చెప్పకొచ్చాడు. మాటల మధ్యలో నీ లాస్ట్ నేం ఎలా పలకాలీ అన్నాడు. గస్ అంటే వాడు మెహీకన్ అన్నమాట, ఇస్పాన్యుల్. వాళ్ళకి జ=హ అన్నమాట. Jose అంటే హొసె అని. San Jose సాన్ హొసె అని. రామరాహు అనుకుంటున్నాడు పాపం తాతయ్య. కాదయ్యా, మీకులాగా మాకు ఇలా జ ని హ అనటాలు ఉండవు. మా భాష ఇండో యూరోపియన్ భాషలకు మూల భాష అయిన సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది. మకు యాభైఆరు అక్షరాలు ఉన్నాయీ, క్రిస్టల్ క్లియర్ గా ప్రతీ మాటా పల్కుతామూ అని చెప్పకొచ్చాను. రామరాజు అని సుస్పష్టంగా చెప్పాను. మరి మన ఆఫీసులో రాజ్ ఉన్నాడుకదా అతని లాస్ట్ నేం నాకు నోరు నో తిరుగ్స్ అన్నాడు. అతని లాస్ట్ నేం సోమసుందరం అని చెప్పి, తతయ్యా, అతను తమిళ్స్. నేను తెలుగ్స్. మావి పక్క పక్క రాష్ట్రాలు. మాకు యాభైఆరు అచ్చరాలుంటే వాళ్ళకి పట్టుపని ముఫై కూడా లేవు (మొత్తం ముఫై ఒకటి అనుకుంటా). వాళ్ళు మా రాష్ట్రం వస్తే జుట్స్ పీక్స్. మేము వారి రాష్ట్రం వెళ్తే జుట్టు పీక్స్. ఒక్క ముక్క కూడా అర్థం కాదయ్యా అంటే ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాడు. లాస్ట్ నేం పోర్వోత్తరాలు ట్రడిషన్ని బట్టి మారుతుంటాయబ్బా అని చెప్పుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ నేం అనేది మగపిల్లవాడికి స్టాటిక్ అంటే మారదు. కానీ తమిళులకు తండ్రిపేరు లాస్ట్ నేం అవుతుంది నాయనా అని చెప్పాను. అలానే, భారత దేశంలో కులాలను కూడా పేర్లో పెట్టుకుంటారు అని చెప్పకొచ్చాను. ఈ కులాల గొడవేందిరో అన్నాడు పాపం తాతయ్య కదా. తెలియదు కదా. వృత్తుల్ని బట్టి ఏనాడో జరిగిన కేటగొరైజేషన్ అని చెప్పి, అయ్యా, మనుషులు కోతుల జాతికదా. మంకీయింగ్ చేసేసారులే నాయనా అని కూడా చెప్పాను.
కులాలు వర్గీకరణ వాటిపై సరైన అవగాహన లేకుండా వికీలోనో లేక ఏ తెల్ల తొండయ్యో నల్ల నండయ్యో తెలిసీ తెలియకుండా రాసిన సో కాల్డ్ చరిత్రని చదివి మీరు ఇల అటకదా మీరు అలా అట కదా అని కొన్ని రకాల కళ్ళద్దాలతో కొన్నిరకాల ఇజాలను తలకెక్కించుకుని చూస్తారు మాట్లాడతారు చాలా మంది. అలాంటివారు ఇజాలతో మాత్రమే చరిత్రను చూస్తారు. అందుకని చివరికి అతినికి ఇలా చెప్పా చివరికి -
చరిత్రని సాధ్యమైనంత న్యూట్రల్ దృష్టితో చదవాలి. ఏ చరిత్రనైనా. బైయాస్డ్ గా చదివితే చరిత్రలో చదివేవాడి ఇజపు కోణమే కనిపిస్తుంది. ఉదాహరణకు, నిన్న రాత్రి పిబియస్ ఛానల్లో నాజ్సిల యూదు ఊచకోత చూపించాడు. వెర్బ్ మరియూ వెట్జలర్ అనే స్లొవక్ యూదులు నాజ్సిల Auschwitz death camp నుండి ఎలా తప్పించుకున్నారో చూపించాడు. ఆ గాస్ ఛాంబర్స్, వాటిలో చూపిన శవాల గుట్టలు, స్లావెక్ నుండి వచ్చే యూదులను అట్నుండి అటే గాస్ ఛాంబర్లోకి తరలించి మట్టుపెట్టటం ఇట్లాంటివి చూపించాడు. ఐదేళ్ళలో ౫.౬ మిలియన్ అంటే యాభైఆరు లక్షల మంది యూదులను మసిచెసారు నాజ్సీలి.
బయాస్డ్ గా చదివితే జర్మనులను కనీసం స్పృశించను కూడా స్పృశించలేము. వారు చేసిన దమనకాండకు వారితో కనీసం మాట్లాడలేము.  సో, చరిత్రని చూసేప్పుడు యూదుల కళ్ళద్దాలు పెట్టుకు చూస్తే చరిత్ర చదవగలమా? సానుభూతి వేరే. ఏ ఇజమూ లేకుండా చదవాలి అని చెప్పుకొచ్చాను. ఆ మాటకొస్తే అమెరికన్లు చేసిన దమన కాండని కూడా ఉటంకించాను. ఈవేళ అమెరికన్ జనాభాలెక్కల్లో ఒక్కశాతానికి పడిపొయ్యారు నేటివ్ అమెరికన్స్ అని చెప్పకొచ్చాను. అలానే మా హిందూ జాతి, అధోపాతాళంలోకి నెట్టబడింది. కనీసం యూదు ఊచకోత కనుచూపుమేర చరిత్రలో జరిగింది. లెక్కా పత్రం అంటూ పుటల్లోకి ఎక్కించారు. వెయ్యేళ్ళనాడు మాపై దండెత్తిన ఛంఘీజ్ ఖాన్ సంతతి ఎన్ని తలలను కొట్టేసిందో ఎన్ని ప్రాణాలను బలి తీస్కుందో ఎందరు పొయ్యరో ఎన్ని దోపిడీలు జరిగాయో ఎక్కడా ఏ చరిత్రలోనూ లేదు, లిఖింపబడలేదు, లిఖించేవారే లేరు, లిఖించటానికి పుస్తకాలు లేవు. అంతే కాదయ్యా తాతయ్య ఆతర్వాతి బ్రిటీషువారు ఏమాత్రమూ తక్కువకాదు బాబూ. అని చెప్పకొచ్చాను.

అదన్నమాట.

Feb 1, 2011

80 శాతం టీనేజీ యువత పొగరాయుళ్లే

80 శాతం టీనేజీ యువత పొగరాయుళ్లే
అసోచామ్‌
న్యూఢిల్లీ: దేశంలో మెట్రో నగరాల్లోని దాదాపు 80 శాతం మంది టీనేజీ యువత సిగరెట్లకు బానిసయ్యారని 'అసోచామ్‌' సర్వే ఆదివారం వెల్లడింది. గతేడాది నవంబర్‌, ఈ ఏడాది జనవరిలో ముంబయి, గోవా, కొచ్చిన్‌, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, ఇండోర్‌ పాట్నా, పుణె, ఢిల్లీ, చండీగఢ్‌, డెహ్రాడూన్‌ తదితర ప్రధాన నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా 14 నుంచి 19 ఏళ్ల వయస్సున్న 3 వేల మందిని ప్రశ్నించారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రోజుకి 13 నుంచి 15 సిగరెట్ల వూదేస్తునట్లు తేలింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, సిగరెట్లు ఎక్కడైనా సులువుగా లభిస్తుండడం, స్నేహితుల వద్ద నేర్చుకోవడం తదితర కారణాలతో యువతలో పొగతాగే అలవాటు క్రమంగా పెరుగుతోంది. కొందరు పాఠశాల దశలోనే సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. ప్రతిరోజూ దాదాపు 600 మంది టీనేజీ యువత మొదటిసారి పొగతాగుతున్నారు.




పొగతాగటం సరదాగా మొదలౌతుంది. పొగతాగటం నేర్చుకునేది కేవలం *హీరోయిజం* అనుకోవటం వల్ల లేక స్నేహితులు తాగటం వల్ల లేక అభిమాన హీరో తాగటం వల్ల. మొదట పైపైన తాగేవాడు, నెమ్మదిగా లంగ్స్ లోకి పీల్చటం మొదలెడతాడు. లేత ఊపిరితిత్తులు, సచ్చూరుకుంటాయి. కొన్ని కొన్ని ముఖ్య విషయాలు గమనించాలి. మన వెనక తరాలు కూడా చుట్టా బీడీ కాల్చాయి. ఇప్పుడో? సిగరెట్టు కాలుస్తున్నాయి. చుట్ట, శుద్ధ పొగాకు. బీడీ, బీడీ ఆకు. మరి సిగరెట్టో? ప్రాసెస్డ్ పొగాకు. అందువల్ల కెమికల్స్ కలుస్తాయి. పొగాకు వల్ల కలిగే హాని కొంతైతే, ఆ కెమికల్స్ వల్ల కలిగే హాని చాలా ఎక్కువ. రెండో ముఖ్య విషయం, లైఫ్ స్టైల్. ఆరోజుల్లో కనీసం శారీరక శ్రమ ఉండేది. చేతులు కాళ్ళూ ఆట్టం వల్ల హాని కొంతవరకు తగ్గేది. శరీరం తట్టుకోగలిగేది. ఇవ్వాళ్ళ శ్రమ తగ్గింది. బండికో కారుకో అలవాటు పట్టం ఎక్కువైంది. బండి ఓ స్టేటస్ సింబల్ అయ్యింది. సైకిలు తొక్కటం నామోషీ అయ్యింది. నడవటం లేదు. పచ్చిగాలిని పీల్చటం లేదు. బయట లోపలా ఎక్కడచూసినా ప్రాణాంతకమైన కాలుష్యం, పైన దమ్ముకొట్టుట. ఘోరమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ముందరి తరాలవాళ్ళు. ముఖ్యంగా భారతీయ యువత. మనవాళ్ళు పాశ్చాత్య పోకడా అంటూ అంటించుకుంటున్న కొన్ని అలవాట్లు నిజానికి పాశ్చాత్యపోకడలు కావు. వీటిని సూడో పాశ్చాత్యపోకడలు అనవచ్చు. మంచిని గ్రహించటం బహుకష్టంగానూ చెడుని మాత్రమే తీసుకొనుట బహు తీపిగానూ.

నేను పొగ మానేసి మూడేళ్ళు కావొస్తోంది. పొగతాగినందువల్ల కలిగిన కొన్ని విపరీతాలు ఇంకా వెంటాడుతున్నాయి. తొందర్లో వాటిని విజయవంతంగా వదిలిచ్చుకో గలననే నా నమ్మకం.




పొగతాగే వారికోసం -