Dec 24, 2008

ఎవ్వడు చూడొచ్చు,ఎవ్వడు చూడకూడదు

ఇప్పటికి చాలామంది, చాలాసార్లు, చాలారకాలుగా రాస్కొచ్చారు, రాసారు, చదివాం, చదువుతూనే ఉంటాం - టీవీ వార్తల, టీవీ సీరియళ్ల తఢాకా గురించి, ఎలక్ట్రానిక్కు మీడియా గురించి. కొన్ని కొన్నిసార్లు వళ్లు జలదరిస్తుంటుంది టీవీల వాళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలకి. ఓ రోజునా నాకు బాగా గుర్తు, టీవీ 9 లో(అప్పుడప్పుడే వచ్చింది ఈ టీవీ9, రవిప్రకాశ్, బ్లాబ్లా వల్ల మా నాన్నా నేను తెగ చూసే వాళ్లం) ఓ వార్త ఒంగోలు జిల్లాలో చాపకిందనీరులా అర్ధరాత్రులు జరుగుతున్న "నగ్న నృత్యాలు" అని. సరే, బానే ఉంది, మన సమాజ దిగజారుడుతనం, వెంటనే ప్రత్యక్షం ఆ నృత్యం దృశ్యాలు. షాక్ అయ్యాం. కనీసం బ్లర్ కూడా చేయకుండ వేసేసాడు. ఇంకోరోజున, ఎక్కడో హైదరాబాద్లో ఓ మస్సాజ్ సెంటరు, వాడు మస్సాజు చేస్తు చేసిన అకృత్యాలని టీవి9 బయటకిలాగింది. సరే బానే ఉంది. మస్సాజు చెసేవాడు దొంగతనంగా తీసిన వీడియోలు గట్రా ప్రసారం జేసేసాడు నిస్సంకోచెంగా. ఇంకోసారి ఏదో ఇంటర్నెట్ సెంటర్లో జరిగిన కామక్రీడ అని ఆ వీడియోని ప్రసారం జేసేసాడు. ఇదిజాలదన్నట్టు పొద్దుణ్ణుండి సాయంత్రం దాకా అదే వార్త సూపించిందే సూపించి జనాల్ని రెచ్చగొటేస్తున్నారు, హింసించేస్తున్నారు.
మనలో ఎంతమంది ఎన్నిసార్లు ఇలా అనుకోలేదు, చిన్నపిల్లల ముందీ పాడు/ పాడు నాటాకాలు /పాడు సినిమాలు చూడలేకపోతున్నాం అని, ఛీఛీ ఏంటీ వీళ్ల కార్యక్రమాలు అనీ.
మన ప్రసారభారతి, బ్రాడ్క్యాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు విధిగా ప్రతీ టీవీ ఛానెల్కీ ఈ క్రిందతెలిపిన లోగోలని ప్రతీ కార్యక్రమంలో ప్రసారం చేసి తీరాలి అని ఎందుకు చెప్పరూ?
TV-Y (Youth Television) (All children)
రెండు నుండి ఆరు సంవత్సరాల వయసు వాళ్లకి
TV-Y7/TV-Y7-FV (Directed to older children) (Youth-7 Television)
ఏడేళ్లు మరియూ అంతకన్నా ఎక్కువ వయసు వాళ్లకి
FV - అంటే ఫాంటాసీ వయొలెన్సు అని.
TV-G (General audience)
ఎవుడైనా జూడొచ్చు అని
TV-PG (Parental guidance)
ఈ కార్యక్రమాల్ని తల్లితండ్రుల పర్యవేక్షణాలో మాత్రమే చూడాలీ అని అర్ధం.
దీంట్లో
V - కొంచెం వయొలెన్స్
S - సజెస్టివ్ కౄడ్ హ్యూమర్. అంటే కుళ్ళుజోకులు అని అనుకోవచ్చేమో. ఉదా!! ఆంటినడుగూ ఏదైనా ఇస్తది (భగవాన్ డైలాగు - దేన్ని మన వెన్నెముకలేని తెలుగు జనాలు పంచ్ అంటారు - బొంగు భోషాణం)
L - స్వల్ప కారు కూతల, పిచ్చి భాష (డబల్ మీనింగు వచ్చేలా ఉండే భాష)
D - పిచ్చి పిచ్చి డైలాగులు
TV-14 (Recommended for people 14 or older)
పధ్నాలుగు ఏళ్లు మరియూ అంతకన్నా ఎక్కువ వయసు వాళ్లకి
V భయంకరమైన కౄరత్వం, చంపుకోడాలు, నరుక్కోడాలు
S కామప్రక్రియలు, అంటే ముద్దులు, వాటేస్కోడాలు అవి ఇవీ.
L బూతులు
D బూతికూతలు
TV-MA (intended for mature audiences)
పదిహేడు ఏళ్లకన్నా ఎక్కువ వయసువారికి మాత్రమే. అంటే పెద్దలకి మాత్రమే అని.
V భరించలేనంత కౄరత్వం
S కామక్రీడలు
L దారుణమైన బూతిమాటలు

వివరాల పట్టిక
దీని ప్రకారం చిన్నపిల్లలకి ఇవి చూపరాదు, వినబడనివ్వరాదు, కనబడనివ్వరాదు
#౧. ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే రా
#౨. పందినాకొడుకులు, సచ్చారు
#౩. నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి, అదివినబడుతుంటే జారుతుంది మిడ్డీ.
#౪. భగవాన్ పంచులు
#౬. వార్తల్లో బూతు బొమ్మలు
#౭. తొడకొడతా, జడపడతా
అట్.అల్ (et. al)

5 comments:

 1. Very well written. They (Government) should enforce these rules strictly. And the TV channel guys must follow some ethical standards on their own.

  ReplyDelete
 2. ప్రసార భారతి వాళ్ళు మీరు చెప్పిన్న లోగో లను ప్రసారం చేయమని చెప్పినా విధిగా పాటించేవాళ్ళు ఎంతమంది ఉంటారో మరి. హింసాత్మక సినిమాలకు పిల్లలను తీసుకు వచ్చే దేశీలు చాలా మందే ఉన్నారు. ఇవన్ని చూస్తుంటే మా పనే మేలు అనిపిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా మా ఇంట్లో టి.వి లేదు.టి.వి లేకపోవడం వల్ల ఇంకో లాభం ఏంటంటే మా బాబు కి బాట్మాన్, స్పైడర్ మాన్ , థామస్ ఇలాంటివి తెలీదు. చలిలో, మంచులో (మేము డెట్రాయిట్ లో వుంటాం)బయట ఆడుకోవడం కుదరక పొయినా ఎదో ఒకటి చేస్తూ వాడిని వాడు బిజీ గా వుంచుకోగలుతాడు.
  snehamolakatalla.wordpress.com

  ReplyDelete
 3. ratings penchukovadaniki tv9 etc.. channels vallu chupinche chandalam idhi.

  vyaparam kosam nonsense chupistu merugina samajam kosam ani self dabba kotte channels ante naku asahyam.

  naku baga gurtu sari mumaith khan ki heroine chances vastunnai ani cheppalsina news ki 15 minutes malayalam masala scenes chupinchi ilanti patralu vese mumaith khan ki heroine veshalu vastunnai ani cheppi malli avida chesina konni cinimallo nonsense scenes inko 5 min chupaaru oh 3 rojula patu.

  ReplyDelete
 4. @Srinivas మాష్టారూ: అవునండి. ప్రభుత్వం కనీస కొలతల్ని ప్రవేశపెట్టాలి. టీవీ వాళ్లకి కనీస సామాజిక బాధ్యత ఉండాలి
  @స్నేహ గారు: మీరు అన్నదీ నిజమే.
  >>ప్రసార భారతి వాళ్ళు మీరు చెప్పిన్న లోగో లను ప్రసారం చేయమని చెప్పినా విధిగా పాటించేవాళ్ళు ఎంతమంది ఉంటారో మరి.
  నిజమే, కాని, అసలు వీళ్లు ఎలానూ పాటించరు కాబట్టి ఇక రూల్స్ అవసరంలేదు అని కాదుగా. This is the tradeoff between చట్టం మరియూ న్యాయం. చట్టప్రకారం విధిగా పాఠించు అనే విధులు ఉండితీరాలి. పాటిస్తున్నావా లేదా అనేది flipside.
  @అమర్: నిజమే. కానీ ఓ రకంగా మనం చాలా అదృష్టవంతులం. మా ఇంట్లో నాకు పదో తరగతి వరకూ అసలు టీవీయే లేదు. మనకు అసలు అంత టైము ఎక్కడ, ఆ ఉప్పు దువ్వలో పడి ఆడుకోడమేగా.

  ReplyDelete
 5. ప్రతి దానికీ విదేశీ సంస్కృతి అంటూ తప్పు విదేశీయుల మీదకి నెట్టేస్తారు కొందరు. విదేశాల్లో - ఇటువంటి విషయాల్లో - ఉన్న నియమాల అమలు పకడ్బందీగా ఉంటుంది. మనకి నియమాలున్నట్లే ఎవరికీ తెలీదు, ఇక అమలు మాటేం చెబుతాం.

  ReplyDelete