ఈరోజు బియ్యం కొంటానికి వెళ్ళా. లక్ష్మి బ్రాండ్ సోనా మసూరి బియ్యం, 20 lb సంచి ముఫైఎంది డాలర్లు. పోయినేడాది ఇదే సీజన్లో అదే సంచి తొమ్మిది డాలర్లు. 20lb=8.93 kg. అంటే ఒక్కో కిలో 4.26 డాలర్లు. అంటే డాలరు ఒక్కింటికి 46 రూపాయలు వేస్కుంటే కిలో బియ్యం తస్సదియ్య 196 రూపాయలు. ఇడ్లీలోకి, దోశెల్లోకి బియ్యం కావాల్సిందే.
ఉద్యోగానికీ భరోసాలేదు. ఎప్పుడు ఏ పుట్టిమునుగుతుందో తెలీదు. బైల్ ఔట్ అంటారు, అదేదో రన్ ఔట్లా. షేర్లు అరవైల్నుంచి వందశాతం తగ్గినై. ఏందీగోల. సచ్చిన పావుని ఎంతమంది ఎన్నిసార్లు సంపుతారో.
అటైపు సూద్దాం అంటే తెలంగాణా అంటాడొకడు, కిలో బియ్యం ఉచితం అంటాడింకోడు, నీకు పూరా జీవితం ఉచితం అంటాడింకొకడు.
రేపటికి నా ఉద్యోగం ఉంది. చూద్దాం ఎల్లుండి ఎలా ఉంటుందో?
Oct 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
పీతకస్టాలు పీతవి సీత కస్టాలు సీతవి అన్నట్లు, బహుసా ఇది ప్రపంచ వ్యాప్త మాంద్యం లా కనిపిస్తుంది. కేజీ 16 రూపాయిల చొప్పున కొన్న బియ్యం 28 రూపాయిలకి కొనటానికి ఇక్కడ చుక్కలు కనపడుతున్నాయి. కూరగాయల పరిస్థితి అంతే ఎంత చెప్పుకున్నా తరగదు. బడ్జెట్ సరిపోక సంత సంచి బరువు వారం వారానికి చిక్కిపోతూ ఉంది.
ReplyDeleteగొర్రె తోక బెత్తెడు. దానికి తోడు నెత్తిన పడే ఈ తాటికాయలు.
మీ బోటి వారందరూ (డార్విన్ భాషలో పోటీజీవులు) విదేశాలలో ఉండటం వల్ల, ప్రస్తుతానికి బెయిల్ అవుట్ వంటి పరిస్థితులు ఇంకా రాలేదు. అంత వరకూ గొప్ప అదృష్టం గానే అనుకుంటున్నాం. చూడాలి రేపెలా ఉంటుందో.
బొల్లోజు బాబా
నీళ్ళు ఇవాళ్ళో రేపో భారతాన్నీ తాకుతాయ్ అండీ...ఆ పరీస్థితి రాకూడదని కోరుకుంటున్నా..
ReplyDeleteభాస్కర్
Pls post such kind of information on blogs, which will help us to know the current situvation there, which will help us plan further.
ReplyDeleteTkank You.