Nov 30, 2008

ఎన్నో ప్రశ్నలు

౧. టెర్రరిష్ట్లు హైజాక్ చేసిన పోలీస్ వ్యాన్ ఏమైంది?
౨. రూమ్ సర్వీస్ చేసేవాళ్లు తీవ్రవాదులు బసచేసిన గదుల్లో సర్వీసు చేసేప్పుడు ఎటువంటి తేడాని గమనించలేకపొయ్యారా?
౩. ౪ నెలలనుండే ప్లాన్ చేసి స్టూడేంట్లుగా వచ్చినప్పుడు హోటళ్లలో చెక్-ఇన్ క్రైటీరియా ఏంటి?
౪. ఇంత పెద్ద పెద్ద హోటళ్లలో సిసిటీవీలు ఉండవా?
౫. రూమ్ ౬౮౦ కి చాలామంది జనాలు వచ్చేవాళ్లు - ఎంత విలువైన సమాచారం ఇది. సమాచారం ఉపయోగం లేకుండాపోయినట్టేగా ఎవడొచ్చాడు అని ప్రూఫ్ లేదు.
౬. పాకిస్థాన్ యొక్క పాత్రని నిరూపించే ఆధారాలు ఏవి?
౭. సి.యన్.యన్ లో చర్చించినట్టు - జనాలు ఇలాంటి ఆపరేషన్ జరుగుతుంటే - తాజ్ లో లోపలి లాబీదాకా వెళ్లి రాగలిగారు, గుంపులు గుంపులుగా చేరితే అది ఎంతవరకు సమంజసం?
౮. పోలీసులుకూడా జనాల్ని ఒక పరిధివరకూ ఆపేయలేకపోతే ఎలా. దీనివల్ల క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ట్యాంపర్ అయ్యే అవకాసం కూడా లేకపోలేదుకదా?

Nov 29, 2008

నేను హైదరబాదీని -మాకు హైదరబాద్ ప్రత్యేక దేశం కావాలి

http://www.eenadu.net/story.asp?qry1=16&reccount=45
ఈ వార్త సారాశం నన్ను ఆశ్చర్యపరిచింది. "నేను హైదరాబాదీని, మాకు హైదరబాద్ ప్రత్యేక దేశం కావాలి". ఇంతకముందెన్నడూ విన్లా ఈ కోరికని. కొత్తగా ఉంది! ఈళ్లెవరయ్యా అడగటానికి? ఎదో సరదాగా మా పల్నాడు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే, కొంచెసేపు నవ్వుకోవచ్చు. కాని ఇదేందిది? ఇలాంటి పరీస్తితుల్లో హైదరాబాదు నగరం ఎంతవరకు సురక్షితమైన ప్రదేశం?
హైదరాబాదీయులారా: అటూ ఇటూ ఓ కన్నేసి ఉండండి, పొరపాటున ఎవ్వడైనా అటు ఇటుగా ఉన్నాడాంటే ఆ పాట బాదొదిలిపెట్టండి.
ఐనా హైదరాబాదు ప్రత్యేక దేశం కావాల్సొస్తే పాకిస్థాన్కి వెళ్లటం దేనికి? ముంబైలో మారణ కాండ జెయ్యటం దేనికి?
కొడుకులకి పిల్లాటాలా ఉన్నటుందే. మొత్తం 20 మంది తీవ్రవాదుల్లో ఏడుగ్గురు హైదరాబాద్ నుండే. సిగ్గుచేటు. హైదరాబాదులో ముస్లిం తీవ్రవాదానికి చారిత్రాత్మక కారణాలున్నాయ్ - బొంగు భోషాణం. మనకి బతకటమా సావటమా అనే ప్రశ్న వచ్చినప్పుడు చారిత్రకం లేదు బొంగులేదు.
జనాల్లారా - ఈయ్యాల్టి రోడ్డు షోలు ఎంతవరకూ మిమ్మల్ని కాపాడగలవు? ఆలోచించుకోండి. చిరంజీవైనా, రాజశేఖర్ రెడ్డి ఐనా, సెం.బా ఐనా ఆళ్ల రక్షణ ఆళ్లు జూస్కుంటారు, బలైయ్యేది జనాలే.

కె.సి.ఆర్ విన్నవా వీళ్లు ఏమంటున్నరో? గిప్పుడేంజేస్తవ్?
Added on 29th Nov, 9 AM EST -

Nov 28, 2008

మీడియాకి విజ్ఞప్తి

ఎంత మంది చచ్చారు, ఎంత మంది ఉన్నారు, మన పోలీసుల వ్యూహం ఇది, యన్.యస్.జి ఇది చేయబోతోంది, ఢిల్లీ నుండి వైమానిక దళం రావటానికి కొన్ని గంటలు పట్టింది, వాళ్లకి మ్యాపులు, సమాచారం సరిగ్గాలేదు - ఇన్ని అవసరం లేని, మాట్టాడకూడని విషయాలు కూపీలాగి మరీ తెరకెక్కిస్తున్నారు.
ఐతే, ఇస్లాం తీవ్రవాదం రూట్స్ ఏంటి, ఇస్లాం యూత్ దేనికి తీవ్రవాదం వైపుకు వెళ్తున్నారు, వాళ నిజమైన, న్యాయమైన సమస్యలు ఏంటి? వీటి మూలాలు ఎక్కడ? ఒక మీడియగా మీ "కంక్లూజన్" ఏంటి? అసలు ఇస్లాం కుర్రాళ్లు పాకిస్తాన్ ఎలా వెళ్లగల్గుతున్నారు? - వీటిపై మీరు మాకు వార్తలందిస్తే మేమూ తెల్సుకుని మాలో లోపాలను సరిదిద్దుకుని "వసిధైకం" కోసం పాటుపడతాం.

నా రక్తం మరుగుతోంది

ఏమి చెయ్యాలి?
దేనికంటే -

(మూలం:ఈనాడు)
౧. ఐతే ఇంతవరకూ ఎంత ఆస్తి నష్టం జరిగింది? ఆ డబ్బుతో మనం ఒక "గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా" కట్టుకుని ఉండేవాళ్లం.
౨. ఒకానొక నాడు ఇందిరాగాంధీని చంపేస్తే సిక్కు ప్రజల్ని ఊచకోత కోసారు. అలాచెయ్యటానికి వచ్చిన చైతన్యం మన జాతిని నిలువునా నిలబెట్టిమరీ ఛీరేస్తోంటే రాదేం?
౩. ఒకానొక రోజున రంగాని చంపితే జనం రగిలిపోయి మారణకాండ చేసారే, యం.టీ.ఆర్ పోయినప్పుడూ, చివరకి పరిటాల రవి పోయినప్పుడుకూడా. మరీ ఈరోజున ఇంతమందిపోతే కనీసం చైతన్యం కూడాలేకపోతే!! సిగ్గు సిగ్గు.
౪. హిందు టెర్రరిష్టులు బొంగు అని రాసినోళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు?
౫. నీకు అవమానం జరిగింది, సరే, ఒప్పుకున్నా, దానికి వేరే దేశం వాడు వచ్చి చెప్తేకానీ అర్ధం కాలేదా? నీకు అవమానం జరిగితే నువ్వే నిలదీయ్, పాకిస్థాన్ దేనికి మధ్యలో? ఇక్కడే నువ్వూ సమాజాన్ని ఎలా ఎదురించాలో నేర్చుకో, ఎదురించు. నీ హక్కులకోసం పోరాడు. నీ హక్కులకోసం పోరాడే హక్కు నీకుంది ప్రజాస్వామ్య పరంగా. జనాల జీవించే హక్కుని కాలరాసే హక్కు ఆ భగవంతుడికి కూడా లేదు.
౬. ఎవ్వని సహాయం లేకుండా కరాచీ నుండి ముంబైకి రాగలిగారు అంటే మా సూరిగాడు కూడా నమ్మడు.
౭. మనలో ఉన్న కొందరు కొజ్జాల కక్కుర్తి వల్ల ఏవత్ జాతికే ప్రమాదం అనిపిస్తే, నేనూ నాభారతాన్ని రక్షించుకునే, నా దేశాన్ని కాపాడుకునే, నా జీవించే హక్కు కోసం టెర్రరిష్టుగా మారటానికి వెనుకాడను.


శోభాడే అన్నట్టు - అయ్యా రాజకీయనాకులూ - మీరు అటు మీమీ రంగులు తీస్కుని వెళ్ళకండి. అక్కడ పోరాడుతున్న మన రక్త నాడుల్ని పోరాడనివ్వండి. దిగజారిన మా ధైర్యాన్ని నిలబెట్టనివ్వండి. దయచేసి మీరటు మీ రంగుల్తో వెళ్లకండి.

Nov 27, 2008

ముంబై లో మళ్లీ బాంబుపేలుళ్లు 25 మంది మృతి

ఎందుకిలా జరుగుతోంది? ఎటుపోతున్నాం మనం? మనంవీటిని ఎదురించలేమా? అంత బిజీ అయిపొయ్యామా మనచుట్టూ ఏంజరుగుతోందో తెలియనంత, తెలుస్కోలేనంత?
చనిపోయిన కుటుంబాలకి నా హృదయం అట్టడుగు నుంచి సానిభూతి తెల్పుతున్నా.
ముందు దీనెమ్మ ప్రభుత్వం అంటాం! కాని ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఇట్టాంటోళ్లకి సహాయం చేస్తున్నది మనలో ఒకరే, మనం ఎన్నుకున్న ప్రభుత్వమే.

http://www.ndtv.com/convergence/ndtv/default.aspx
http://www.rediff.com/news/2008/nov/26-firing-in-cst-station.htm
http://news.bbc.co.uk/2/hi/south_asia/7751160.stm
Firing, blasts in city

Fresh blast at Taj and Trident hotels
Attacks at Oberoi, Taj and Trident hotel
ATS team arrives at the Taj Hotel
Encounter on between police and terrorists at Taj, Oberoi: A N Roy, Dy Police Commissioner
Two types of attacks: Blasts, AK-47
Prime Minister Office confirms five blasts
Terror attack outside CST Station
CST Station cordoned off by the police
2 blasts reported in Napean Sea Road area
Oberoi hotel lobby on fire after attack
Trains on the central line stopped
2 terrorists said to be holed up at CST station armed with guns, grenades


- జై హింద్

Nov 26, 2008

నేను హైదరాబాదులో ఎందుకు పని చెయ్యొద్దు అనుకుంటున్నా?

నేను 2001-2003 దాకా హైదరబాద్లో ఉన్నా. ఆ రోజున చందా నగర్ నుంచి బంజారా హిల్ల్స్కి వైయా హైటెక్ సిటీ - 15 కి.మి - ఇరవై నిమిషాలు పట్టేది. ఈ రోజున ఎంత పడుతుందో?
మరిక నేను హైదరబాద్లో దేనికి పనిచెయ్యాలి?
అద్దె - 10000 తక్కువ ఏమైనా దొరుకున్నయా ఇళ్లు?
రోడ్డులు - 1 గంటలో ఇంటికి చేరగలనా?
పిల్లలు ఆడుకోటానికి పార్కులు ఉన్నాయా?
నేను ఉండబొయ్యే ఏరియాలో మంచి బడి ఎక్కడా? అసలు మంచి బడి అంటే?
నీళ్లు వస్తాయా?
కూరగాయలు మంచివి దిరుకుతాయా?
బస్సు సౌకర్యం ఉందా?

అన్నిటికి సమాధానాలు "లేదు/లేవు/తెలియదు". మరిక నేను హైదరబాదులో దేనికి పని చెయ్యాలి?

Flipside-

ఆరకిల్ - హైదరబాద్ లోనే దేనికి?
సత్యం - హైదరబాద్ లోనే దేనికి?
అంతా కట్టకట్టుకుని హైదరబాద్లోనే దేనికి కంపెనీలు పెట్టడం?

నా ఆలోచన -
సత్తెనపల్లి, లేక పేట, లేక మిర్యాలగూడ లాంటి ఊళ్లని ఒక పద్ధతి ప్రకారం అభివృధి చేసి - IT అని తరలిస్తే "PLANNED GROWTH" కి ఒక బాటలా ఉంటుంది.

నా కల -
మోర్జంపాడులోనో లేక, దాచేపల్లిలోనో ఒక రెండెకరాలు పొలం చూస్కుంటూ ఇంట్లోంచి నేను ఐ.బి.యం లాంటి కంపెనీకి పని చెయ్యాలి అని.

I mean, not necessarily living in Mumbai/Hyderabad/Chennai/BlaBla and getting frustrated with the living standards and life style, cannot we have a strong infrastructure and make it as "IT to Village" concept?
Added On November 28th - After Mumbai Blasts: If Something happens in Hyd like what happened in Mumbai, are we going to sustain such a loss financially, resources wise?

మా గుళ్లో కార్తీక మాసం చివరి సోమవార పూజ

మా గుళ్లో నిన్న, కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. నేనూ 108 వొత్తులేసి దీపం పెట్టాను. ఆ పూజ mp3 ఇదిగో. దీంట్లో నాగొంతుకూడా ఉంది.
రుద్రం మరియూ మంత్ర పుష్పం

Nov 21, 2008

గూగుల్ సెర్చ్ లో మార్పులు

గూగుల్ సెర్చ్ లో ఇప్పుడు ప్రతీ సెర్చ్ రిజల్ట్ లింక్ కి రెండు కొత్త ఆప్షన్స్ వచ్చినై. "ప్రొమోట్" మరియూ "రిమూవ్" అని.
"ప్రొమోట్" నొక్కితే ఆ లింక్ పైకి జరిగుతుంది.
"రిమూవ్" నొక్కితే ఆ లింక్ అక్కడనుండి తొలగింపపడుతుంది, అది మీ సెర్చ్ పుటలో కిందకి నెట్టివేయబడి, మీరు తొలగించిన లింకులు అనేలిస్ట్కి జతచేయబడుతుంది.

ఉదాహరణకి


రిమూవ్:

ఆనందించండి:):)

Nov 20, 2008

జీమెయిల్ థీంస్

జీమెయిల్లో కొత్తగా థీంస్ వచ్చినై చూసారా? అద్భుతంగా ఉన్నాయి. నేను పెబుల్స్ థీం పెట్టుకున్నా :):)
ఆనందించండి :):)


November 21st: I have switced to Planets. You know what, to my surprise, When setting to Planets, It asked my zip code. I could see the planets position changing.
This is something interesting. :):)

ప్రభుత్వం భూమి లాక్కోవటం

ఇప్పుడే ఎక్కడో చదివా, మీభూమికూడా ప్రభుత్వం లాక్కుంటే ఇలా చెయ్యండి అని. ఇదేంటిది? భూమి ఎవ్వడిదీ? ప్రభుత్వానిదా? లేక ప్రజలదా?
నాగార్జున సాగర్ కట్టినప్పుడూ ఇలానే అయిందిగా? శ్రీశైలం కట్టినప్పుడూ ఇలానే అయిందిగా? హైటెక్ సిటీ కట్టినప్పుడూ ఇలా అయిందా? పక్కనే ఉన్న జయభేరి కట్టినప్పుడూ ఇదే జరింగిందా?


SEZ లు వద్దు,
సంస్కరణలు వద్దు,
TAX కట్టొద్దు,
కట్టినోడికి లెక్కలు అడిగే సొతంత్రం లేదు,
అప్పుజేయ్ 20,00,000 కోట్లు,
మూరెత్తు రోడ్లు వేస్కో,
నీళ్లకోసం డ్యాం వద్దు,
నీళ్లే లేవురా బగమంతుడా అంటే డ్యాం ఇక్కడ వద్దు అని అరువు,
పేదోళ్లకోసం అప్పుజేయి - మింగు,
రిజర్వేషన్లు పొడిగించు,
కిలో రూపాయ్ బియ్యం - బయట బస్తా 2400,
కూరగాయలు పండించే స్థలం లేదు,
పంటల భూములు రియల్ ఎష్టేటోనికి అమ్మేయి,
అడదిడ్డంగా ఇళ్లు కట్టు,
అడ్డదిడ్డంగా రోడ్లేయ్,
డబ్బున్నోడి ఇంటిముదు ముగ్గులెయ్యి,
డబ్బున్నోడి దేశమ్ముందు మన బట్టలిప్పేయ్,
1930 నాటీ లారీలు బండ్లు నడుపు - వద్దూ అంటే బందుజెయ్,
కోపంవస్తే రాయుచ్చుకో - ఆర్ టీ సీ మీద ఇసురు,

- హా!!దీన్నే అభివృద్ధి అంటారు డింగ్ డాంగ్

Nov 19, 2008

కొత్తపాళీ గారి మంచు సందేశం

కొత్తపాళీ గారి మంచుసందేశం నాకు నిన్న అందింది. మాకు నిన్న రాత్రి మంచు కురిసింది. ఈ పొద్దున్నే ఫోటో తీసి ఇక్కడ పెడదాం అనుకున్నా కాని కార్లమీద కానీ, మరెక్కడా కానీ మంచు జాడలు కనబళ్లా చిన్న చిన్న తుప్పల మొదళ్లలో తప్ప.


Y'All!! Stay Warm :):)

- బాస్కర్ రామరాజు

Nov 18, 2008

దీనిమీద ఓ కధ రాయగలరా?నాకిలా అనిపించింది:-
1. మా ఊరు పట్నానికి 100 కిలోమీటర్ల దూరమ్లో ఉంది. మాది ఓ చిన్న పల్లె. మొత్తం 1000 గడప. చిన్న సన్నకారు రైతులు, రోజువారి కూలీలు - అది మా కధ. మాకు వైద్యం అంటె నాటు వైద్యమే. ఆకులు నులిమి పసరు నోట్టో ఏస్కోటమో లేదా కళ్లల్లోనో ఏస్కోటం మాకు మామూలే. ఓ రోజున మా ఊళ్లోని సత్తెయ్యకి గుండెనొప్పి రావటం మొదలైంది. అతని వయ్యసు 76. కనా కష్టం మీద దగ్గర్లో ఉన్న ఆశుపత్రి కి నెట్టుకెళ్లాం, ట్రాట్టరు మీదనో, కిందనో పడి. అక్కడి ఆర్.యం.పి పట్నం తీస్కెళ్లండి అని చెప్పాడు సాధ్యమైనంత తొందరగా. ఎలా ఎలా అని ఆలోచిత్తాఉంటే, అక్కడ పనిజేసే ఎంకయ్య "ఆంబులెన్స్" అని ఓటుంటది, దాన్ని మాట్టాడుకోండి అనిజెప్పాడు. ఆ ఆంబులెన్సోడు ఇంత అంతా అని డిమాండు జేసాడు. పేదోని ప్రాణం, ముసలోడు, ఎవని ఇలువ వానికుంటది. సరేఅన్నరు ఆ ముస్సలోడి తరుపోళ్లు అన్నిటికి. ముసలోడ్ని దాంటోకి ఎక్కించారు. ఇక బండి కదుల్తుందనంగా, ఓ పెద్దాయన రయ్ మనుకుంటా వచ్చి ఆ "ఆంబులెన్స్" నడిపేవానితో ఏదోజెప్పాడు. ఒకైపు గుండె జబ్బు మనిషి, ఇంకోఐపు పోవాల్సింది సానా దూరం, మద్దలో ఈడెవుడురా అని జనాలు జూత్తుంటే, ఆ పెద్దోడి మడుసులొచ్చి సత్తెయ్యని కిందకీడ్చబొయ్యారు.
ఆ పెద్దోడు గొఱ్ఱెలేకదా పడిఉంటాయ్ అనుకున్నాడు. అట్ట ఇట్టా పోయే బండ్లు అన్నీ పోగై, ఆ పెద్దోడ్ని, "ఆంబులెన్స్" ని నిలదీసారు.
తర్వాత ఏంజరిగిందో అనవసరం.
2. "ఆంబులెన్స్" కుయ్యో కుయ్యో అనుకుంట రయ్ రయ్ మని వెళ్తా ఉంది. జనాలు అడ్డం తప్పుకుంటా పాపం ఎవుడున్నాడో లోన, ప్రాణాపాయమ్లో ఉన్నాడేమో అనుకుంట ఉన్నారు. ఇంతలో ఎవుడో జూసాడు లోన భాగోతం. ఓ డబ్బున్న దొరబాబు లోన కులుకుతా ఉన్నాడు. మరి ఇక జనం ఆగుతారా ఇలా నిలదీయ్యక.
3. "ఆంబులెన్స్" గుంటూరెళ్లాల, మాచారం నుంచి. బయల్దేరింది బండి, లోన ఎవుడో మనిషి కాలో సెయ్యో అనుకుంటా, ఇరిగినట్టుంది. రక్తం కారతంది. మరి బయల్దేరాక, కొండమోడుకాడికొచ్చేతలికి ట్రాఫిక్కు జామంట, అన్నీ బళ్లూ ఆగిపోయినయ్. నకెరికల్లైపు తిప్పడు "ఆంబులెన్స్" తోలేటోడు. ఎటుపోవాల్నో తెలీక బండి ఆపేసి అటెమ్మటెల్లేఓళ్లని అడుగుతుంటే సూడండి ఎంతమంది అట్టా గుంపుగూడారో.

Nov 14, 2008

ఏంటీ ఈ గందరగోళం?

ఒకళ్లమీద ఇంకొకళ్లు ఇలా బురద జల్లుకోవడం ఎంతవరకూ భావ్యం?
నా ఉద్దేశంలో బ్లాగటం:
1.నా బ్లాగు - నా ఇష్టం, నా బ్లాగుగికి నేనే వై.యస్.ఆర్, నా బ్లాగుకి నేనే మహరాజ్. కాదని ఎవడూంటాడు. ఐతే - బ్లాగు శరీరం లాంటిది. నా శరీరం నాఇష్టమని బట్టలిప్పుకుని తిరిగితే జనాలు రాళ్లేస్తారు.
2. సెన్సిటివిటి - నా బ్లాగు నా ఇష్టం అని కొన్ని సున్నితమైన విషయాల మీద రాయడం అవివేకం. నేనేమి సంఘ సంస్కర్తని కాను. నేనూ సోర్దజీవినే.
3. మన సమాజమ్లో ప్రతీది ఓ దారంతో అల్లబడి ఉంటుంది - మన సంబంధాలు, కులాలు, మతాలు, మనస్సులు, ఆలోచనా విధానాలు - టెంపర్మెంట్లు, ఎదురుతిరిగే తత్వం అన్నీ - తెగిందాకా లాక్కోవటం దేనికి?
4. నీతులు గోతులు అనవసరం. ప్రతీవోడు సదువుకున్నోడే. ప్రతీవోడూ ఆలోచిస్తాడు. నేను కొత్తగా మన సరిత్ర ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు నా చరిత్రతోనే తెల్లారుతోందిగాబట్టి.
5. నా కాల్లో ఉన్న ముల్లు తీస్కోనీయండి ముందు, పక్కనోడి కాల్లో ముల్లులు తర్వాత దింపొచ్చు.
6. రాసేవోనికి సదివేవోడు తక్కువ ఏమాత్రంకాదు. నేను రాసింది ఇంకోడుచదువున్నాడు అంటే వానిది పెద్ద మనసు అని. అంతే కాని నాయ్యాల, నేను కోడిపియ్య తొక్కా, వాశ్సనజూసిపో అంటే, కాకొచ్చి నెత్తిమీద రెట్టేసిపోతుంది.
7. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమ్మన్నా.
సివరాకరిగా
8. ఎదవగోల ఆపేస్తా (ద్దాం)

Nov 13, 2008

కావలెను - ఈ క్రింది ఉద్యోగానికి

పదవి : ముఖ్యమంత్రి
విద్యార్హతలు : ఏమీలేవు (ఓపెన్)
కనీస అర్హతలు:
1. పగటి కలలు కనటం
2. ఆత్మస్తుతి
3. పరనింద
4. పరులను ప్రశ్నించే తత్వం
5. సినిమా హీరోగా పని చేసి ఉంటే మంచిది లేదా రాయలసీమ అయిఉంటే పెద్ద ప్లస్
6. లాబీయింగ్ చేయగల్గి ఉండాలి
7. హైజాకింగు తెలిస్తే మరీ పెద్ద ప్లస్
8. అయితే నందమూరి వంశం అన్నా అయిఉండాలీ, లేదా రాయలసీమ రెడ్డి ఐనా అయిఉండాలి లేదా మెగాస్టార్ అయినా అయిఉండాలి
9. పొత్తులుకు పై పొత్తులు పెట్టుకోగలగాలి
10.కులదీపకుడు, కుల ప్రకాశకుడు అయిఉండాలి
11.మంచి మాటల రచయిత దోస్తై ఉండాలి
12."మీతో పొత్తుపెట్టుకుంటే ఏమిస్తారు, మాతోపొత్తుపెట్టుకుంటే ఏంతెస్తారు" అనే తత్వం ఉండాలి
13."నేను ఏంచేసాను" కన్నా "నువ్వు ఏమిచెయ్యలేదు" గురించి మార్కెటింగు చెయ్యగల్గి ఉండాలి
14.చెట్టుపేరుజెప్పి కాయలు అమ్ముకోగల్గి ఉండాలి.
15.కులాల మధ్య కుమ్ములాట పెట్టగల్గి ఉండాలి.
16.అఱచేతిలో వైకుంఠం చూపగల్గి ఉండాలి.
17.ఘట్టి కాళ్లు ఉండలి (కొంతమందిని తొక్కుకుంటూ ముందుకుపోవాలిగాబట్టి)
..
..
..
..

Nov 11, 2008

సంపన్న దేశాలు - అభివృద్ధి చెందుతున్న దేశాలు

నిన్న మా స్నేహితుడు టోనీతో మాట్లాడుతుంటే ఓ ఆసక్తికరమైన విషయం జెప్పాడు. అమెరిక ఆర్ధిక వ్యవస్థ మునిగిపోతున్నది కదా, ఇప్పుడు వచ్చే కొత్త రాష్ట్రపతి మొట్టమొదటి కదం ఏమైఉంటుంది అనే మాటల్లోవాడు ఇలా చెప్పుకొచ్చాడు:ప్రంపంచ ద్రవ్య నిధి (ఐ.యం.యఫ్) లాంటి సంస్థలకి అమెరికా లాంటి సంపన్నదేశాలు డబ్బునిచ్చి భారత్ లాంటి గెఱ్ఱె దేశాలకి ఇవ్వమని చెప్తుంటాయి. ఇక్కడ రహస్యం ఏంటాంటే
1. సంపన్న దేశాలకి మంచి వడ్డీ రేటు లభిస్తుంది
2. ఎగవేత ఉండదు. ఉంటే సాంక్షన్స్ పేర్యుమీద తొక్కేయొచ్చు.
3. ముఖ్యమైనది - లాబీయింగు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదే ట్విష్టు. అభివృధి పేరుతో మన లాంటి దేశాలకి సంపన్న దేశాలు "టెక్నాలజీ సొల్యూషన్స్" ని సరఫరా చేస్థాయ్. దీనివల్ల టెక్నాలజీ కాంట్రాక్ట్స్ ఈ సంపన్న దేశాల కంపెనీలకి వెళ్తాయ్. అంటే బుష్ బాబాయ్ ని నమ్ముకున్న బిజినెస్ లాబీ బాగా డబ్బు గడిస్తుంది.
4. ఎక్కువసార్లు మనకి ముఖ్యమైన, కావాల్సిన వాటిని పక్కనబెట్టి అవసరంలేని వాటిమీద ఎక్కువ ఖర్చు చేయించేలా చేస్తాయ్ ఈ "టెక్నాలజీ సొల్యూషన్స్". దీని వాల్ల మన బ్యూరోక్రాట్స్కి, రాజకీయ నాయకులకీ ధనవరద చేరుతుంది.
5.ఈ సంపన్న దేశాలకి మార్కెట్ ఏర్పడుతుంది. దాని వల్ల మనలాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థ వీళ్ల చేతిలోకి వస్తుంది లేదా వీళ్లు చెప్పినట్టు నడుచుకుంటుంది.
6. ఇలా రాజకీయ/అనుయాయులకి లభించిన ధన - వరద, నల్ల ధనమ్లా స్విస్ బ్యాంకులకి చేరి, అటునుంచి మళ్లీ సంపన్న దేశాలకి లోనులా వెళ్లి అధిక వడ్డీతో మళ్లీ మనకే వస్తుంటుంది.
.. .. ..ఇత్యాదివి
వీటివల్ల మనకి కొన్ని లాభాలు కూడా ఉంటాయ్:
1. ఉద్యోగావకాశాలు పెరుగుతాయ్
2. ఫండ్స్ ఫ్లో పెరుగుతుంది
3. పురాతన టెక్నాలజీ ని అప్గ్రేడ్ చేస్కునే అవకాశం లభిస్తుంది.
4. గ్లోబల్ మార్కెట్ - ప్రపంచ మార్కెట్ లోకి మన ఉత్పత్తుల్ని అమ్ముకోటానికి ఒక మార్గం దొరుకుతుంది (GATT/WTO లాంటి ఒప్పందాలద్వారా - వీటిల్లో కూడా సంపన్న దేశాలకి అణువైన ప్రతిపాదన్లే ఉంటాయ్ అది వేరే విషయం)
5. హ్యూమన్ క్యాపిటల్/రిసోర్సెస్ కి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయ్.
.. .. ..ఇత్యాదివి
ఏది ఏమైనా ఇలా సంపన్నదేశాలమీద ఆధారపడటం వల్ల అవి మునుగుతున్నప్పుడు మనం కూడా మునుగుతూ ఉంటాం.

Nov 7, 2008

యేంటి యాభైకే రివ్యూఆ?

"ఏంది కత?"
"యాభై?"
"ఏందీ?"
"అదే!! యాభై పోష్టులు రాసా ఇప్పటికి. రెండొందల ఎనభై వ్యాఖ్యలు పడినై ఆటికి."
"ఓహో!! అక్కడ! ఏదీ అక్కడ!! ఐదు వందలు రాసినోళ్ళు ఉన్నారు."
"తెలుసు కానీ"
"నకరాలు వద్దు"
"అదేలే ఈయ్యాల్టి యాభయ్యే రేపటి ఐదువందలు"
"ఏంది రేపటికల్లా ఐదొందలు రాసిపడేస్తావా ఏంది. ముందేజెప్పు (ముందే/ మందే కాదు - ఎప్పుడూ మందేకాదు జీవితంలో)"
"ఎకసెక్కాలు ఆపి...విను...ఇప్పటికి యాభై. చూద్దాం మునుముందు ఎన్ని రాయగలనో."
"సరే!! మంచోడివే!! నీకు నచ్చిన పోష్టు ఏది?"
"యో!! నేను తొక్కిన కోడిపియ్య కూడా కమ్మటోసన, తెల్సా. నేను రాసిన ప్రతీ అచ్చరం నాకు నచ్చిందే."
"నచ్చని పోష్టు?"
"మర్యాద!! థర్టి ఇయర్స్ ఇండష్ట్రీ"
"ఇంకేమైనా జెప్పాలా?"
"నేటి ఉపాధ్యాయులూ చదువులూ అనేపోష్టుమీద వ్యాఖ్యలు బాగా వస్తాయి అనుకున్నా. పెద్దగా లేవు. ఐతే వ్యాఖ్యానించిన నలుగురూ గట్టి మాటలే జెప్పారు."
"చివరగా?"
"రాసినోడికి చదివినోడి వ్యాఖ్యలే మందు. సునిసిత విమర్శని నేను ఆశ్వాదిస్తా. నా ఆలోచనల్ని అందరితో పంచుకోవాలి అని ఎప్పుడూ కోరుకుంటా. ఐతే నేనుజెప్పిందే వప్పు అనే వితండవాదం నాకు లేదు. రకరకాల నా ఆలోచనలని, నా ఆనందాన్నీ, ఇలా పంచుకుందామనే ఉద్దేశ్యంతో మరిన్ని బ్లాగులు రాస్తున్నా.
నా బ్లాగులు
పాతపాటలు
http://paatapaatalu.blogspot.com
వెబ్స్పియరు గురించి నా టెక్నికల్ బ్లాగు
http://javagongura.blogspot.com
జావా గురించి నా టెక్నికల్ బ్లాగు
http://verbosegc.blogspot.com
ప్రాజెక్టువర్క్స్
మన తరం నుంచి ముందుతరానికి మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వాలి? లంచగొండి ప్రభుత్వాల, ప్రభుత్వోద్యోగుల ఆగడాలని అరికట్టి సమూలంగా లంచాన్ని రూపుమాపాలంటే? మన మౌళిక అవసరాల్ని మనమే నిర్మించుకోవాలంటే? మనకి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త రక్తం కావాలి. అలాంటి ఒక్కో ఆలోచన ఒక్కో కొత్త ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుల్ని ముందుకుతేవటమే నా ఈ బ్లాగు లక్ష్యం. యువతకి మార్గనిర్దేశమే ప్రాజెక్టుల లక్ష్యం
http://projectsforfuture.blogspot.com/
నల భీమ పాకం
నా ఈ బ్లాగు పెళ్ళికాని బాచిలర్లకి, పెళ్ళైన బాచిలర్లకి వంట సలహాలకోసం అంకితమిస్తున్న. "ఈయ్యాల్టి బాచిలరే రేపటి సంసారి"
http://nalabhima.blogspot.com/
నా యస్.యల్.ఆర్ కన్ను
నేనూ మార్గదర్శిలో చేరా, ఒక ఫిల్మ్ యస్.యల్.ఆర్ కొన్నా. నైకాన్ యన్ 75. ఈ బ్లాగులో నా ప్రపంచం నా యస్.యల్.ఆర్ కన్నులోంచి
http://nasitralu.blogspot.com/
వేదసంహితం
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే। పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ -ఈశోపనిషత్
http://vedasamhitam.blogspot.com/
"
- జైహింద్

Nov 6, 2008

పాలిథిన్ బ్యాగ్/క్యారీ బ్యాగ్

ఎప్పటినుంచో రాద్దాం అనుకున్న పోష్టు ఇది.
నేను అమెరికాలో గమనించిన మంచి విషయాలల్లో ఇదీ ఒకటి.వాల్మార్ట్కెళ్లాం అనుకోండి. లోపలకి అడుగుబెట్టంగనే డబ్బాలు పెట్టి ఉంటాయ్ "Please Return Your Plastic Bags Here" అని.

మనం!!! ఈ క్యారీ బ్యాగుల్ని విసిరి, కాలవల్లో పడేసి, నానా రకాలుగా హింసిస్తున్నాం మన నేలతల్లిని.

ఎవడుకనిపెట్టాడోగాని, ఇవిలేకుండా మన జీవితం నడవదా అన్నట్టు ఉంది. కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్తుంటే బొల్లారం టర్నింగు దగ్గర పెద్ద డంపుయార్డ్, అక్కడనుంచి ఈ సంచులు గాలికి ఎగిరి బళ్లు నడిపేవాళ్ల మొహాల మీద పడటం, యాక్సిడెంట్లు కావటం. ఎన్నోజూసా. ప్రాణాలు పోయినోళ్లుకూడా ఉన్నారు. అలా గాలికి వదిలెయ్యడం మన సాంప్రదాయమా? ప్రభుత్వం చెప్పిందా? మీ టీచెరుజెప్పాడా? ఎవుడుజెప్పాడు అలా ఇస్సిర్నూకమనీ? ఒక్కసారి ఆలోచిద్దాం?

ఒకానొక రోజున గుడ్డ సంచులు, జనపనార సంచులుఉండేవి. ఇప్పుడు అంతా ఫ్యాషన్. ఆ సంచులు తీస్కెళ్లాలి అంటే నామోషి.

ప్రభుత్వం వీటిని బ్యాన్ చెయ్యాలి!! ప్రభుత్వమా వీటిని తీస్కొచ్చింది? కాదే? మనమే!!! ఎవుడో డబ్బున్నోడు తెచ్చాడు, అమ్ముకున్నాడు, ఆ సంచులు అలా, విశాఖ నుంచి గాలికి ఎగురుకుంటూ గుంటూర్ కి వచ్చి అక్కడనుంచి యన్.హెచ్ 5 మిదగుండా హైదరాబాద్ చేరి..హైదరబాదువి అలా చెన్నై చేరి ఇదీ మన సంగతి.

హైదరబాద్ లాంటి మహానగరమ్లో రోజుకి సరాసరి ఎన్ని ఇలాంటి సంచులు ఖర్చు అవుతాయి? కనీసం ఒక్క కేంద్రం ఐనా ఉందా మనకి ఇలా ఇట్టాంటి సంచుల్ని సేకరించేది? ఓ డబ్బా పడేసి, బాబులూ మీ సంచుల్ని ఇక్కడ దీంట్లో దొబ్బండి అని పెట్టటానికి కోట్లు ఖర్చేమీ కాదుగా?


నేను ఈ రోజునుంచి ఈ సంచుల్ని వాడను, అధవా వాడినా వాల్మార్ట్ లాంటి కేంద్రాలల్లో ఉన్న డబ్బాల్లో పడేస్తా. మీరు అలానే చేయండి. దయచేసి.

Nov 4, 2008

6.20 ఛా:(:(

ఆమిర్ ఖాన్, నేనూ ఓ విషయమై తీవ్రంగా ఆలోచిస్తుంటే, సందట్లో సడేమియాలా అలారం 6.20 a.m కే మోగింది రోజుట్లానే,ఎప్పట్లానే.ఛా:(:(:(

మోతబఱువులు

ఇప్పుడే ఓ ఛానెల్లో చెప్తుంటే చూసా
ఈరోజున 80-90 శాతం పిల్లలు బ్యాక్ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. సరిగ్గా వాడాటం తెలియకపోతే వీటితో మెడ, భుజాలు, నడుము నొప్పులు రావొచ్చుఅని చెప్తున్నారు.

బ్యాక్పాక్ని సరిగ్గా మోస్తున్నప్పుడు పొట్ట, వీపు కండరాలు దానిబఱువుని సప్పోర్ట్ చేస్తాయ్. అలా కాకుండా ఒంటిచేత్తోనో లేక, సరిగ్గా తగిలించుకోకపోతేనో, లేక ఒక భుజం మీద వేస్కుంటేనో వీపులోని మెత్తని కండరాలు స్ట్రైన్ అవుతాయి. ఇలా ప్రత్రోజు అడ్డదిడ్డంగ వేస్కుంటే స్పైనల్ కాలం డ్యామేజి అయ్యి కండరాల సమతౌల్యం దెబ్బతింటుంది.

1. మొత్తం బ్యాక్ప్యాక్ బఱువు, మోస్తున్న మనిషి బఱువులో 10-15% కన్నా మించకూండా చూస్కోండి
2. బ్యాక్ప్యాక్ నడుముకి 2-3 ఇంచులకన్నా కిందకి దిగకుండా బ్యాక్ప్యాక్ చెవుల్ని భుజాలమీదకి సరిచేకోండి.
3. కిందనుంచి భుజాలమీదకి వేస్కోటానికి తీస్కునేప్పుడూ, భుజాలమీదనుండి దింపినాక కిందపెట్టేప్పుడూ మోకాళ్ల మీద వంగి, కాళ్లమీద బఱువుపడేట్టు చేస్కోండి. (ఢభా అని వంగితే నడుము పట్టేస్తుంది బాసు)
తల్లితండృలకి టిప్పు:
Educate your children about the importance of postural awareness and proper lifting techniques. Prevention of an incorrectly carried backpack will lead to your child's healthy spine today and in the future.

Nov 3, 2008

ఈ ప్రపంచం ఇస్లాం రాజ్యం కావటం తధ్యం - ఓ గొఱ్ఱె

ఈ మధ్య కత్తి మహేష్ కుమార్ బ్లాగులో ఈ పోష్టు చదివా. హిందూ తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం అని. దానికోసం ఇక్కడ నొక్కొచ్చు
దాంట్లో ఎవడో ఇలా వ్యాఖ్యానించాడు.

ప్రాణాలను తేగించే ధైర్యం ఒక్క ఇస్లామ్ కే సొంతం.
ఇక ప్రపంచం మేత్తం ఇస్లామ్ రాజ్యం తధ్యం ఒక్క ముస్లిం చావుకు వంద మంది కాఫిర్ల రక్తం తొ బదులు తీర్చుకుంటాము.

ఇస్లామ్ ని అపే శక్తి ఈ ప్రపంచంలొ ఎవరికి లేదు,అమీన్
లాఇలా హ ఇల్లాలా హు

ఈ ప్రపంచం ఇస్లామ్ రాజ్యం రావడం తధ్యం.దినిని ఎ కాఫిర్ అపలేడు.అమిన్.
ఇక పాకిస్తాన్ మత్రమే ముస్లిం దేశం అనుకుంటున్న ని వంటి వారికి ...........బావి లొని కప్ప కధ గుర్తుందిగా
వాహ్!! వాహ్!! నాకు చాలా ఆనందంగా ఉంది, కనీసం వాళ్ల మక్సద్ ఇదీ అని తెల్సినందుకు. ఇవ్వాల్టికి వీళ్ల అసలు రంగు బైటపెట్టుకున్నారు.
ఐతే ఇలా బాంబులు గట్రా దేనికి? ఓ పని చేస్తే పోలా. ముస్లింలు ఓ వైపు, హిందువులు ఓ వైపు నిల్చోని యుద్ధం చేస్కుంటే ఓడిపోయినోడు తనవాళ్లనందరినీ అంతం చేస్కుని తనని తాని కప్పేస్కుంటే ఇక ప్రపంచెంలో గెల్చినోడి మతం ఒక్కటే మిగుల్తుందిగా. ఇక ఇంత పీక్కోవటం లాక్కోవటం, అక్కడ బాంబులు ఇక్కడ బాంబులు, తెలియని వాళ్లని చంపటం, పసిపిల్లల్ల్ని తునా తునకలుగా పేల్చెయ్యటం, తెలియకుండా చంపుకోవటం చావటం దేనికి?
ఇలా పిచ్చి టపాలు రాయటం కొంతమందికో సరదా, అలా మతం మీద ఓ రాయి వేసి ఏదో గొప్పగా. దానికి ఇట్టాంటోళ్ల కామెంట్సు.