చిన్నప్పుడు విపరీతంగా, అత్యంత ఉత్సుకతతో, అత్యంత తక్కువ ఖర్చుతో ఆడుకున్న ఆటల్లో ఇదొకటి.
దీనికి కావాల్సింది,ఐసుపుల్లలు. ఎన్ని? ఎన్నైనా. ఒక 11 అనుకోండి. 11లో ఒకటి తీసి పక్కనబెట్టి, మిగతా 10 ని గుప్పిట పెట్టి నేల మీద ఒక జానెడు ఎత్తులోంచి నిలువుగా జారెయ్యాలి. పుల్లలు ఒక దాని మీద ఒకటి ఇష్టంవచ్చినట్టు పేరుకుంటయ్. అప్పుడు ఇందాక పక్కనబెట్టిన పుల్లతో ఒక్కోపుల్లని, మిగతా పుల్లలు కదలకుండా తియ్యటం. ఎవరు ఎక్కువ తీస్తే ఆళ్ళు గెల్చినట్టు.
ఈ ఆట "ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్" మరియూ "కాన్సంట్రేషన్" ని పెంచుతుంది.
టిప్: ఐసుపుల్లలు లేకపోతే? వెదురు పుల్లలు ఐసుపుల్లంతవి. అవికూడాలేకపోతే, చీపురుపుల్ల. అవికూడా లేకపోతే...అరెయ్ అరెయ్ అరెయ్..నాకింకో పేరు కూడా ఉంది..బాషా బాషా బాషా..ఆడితే ఆడులెకపోతే వెళ్ళి క్రిక్కెట్టుజూస్కోపో....
Oct 8, 2008
Subscribe to:
Post Comments (Atom)
మీ పుల్లాటతో నన్ను నంద్యాలలో స్కూలులో చదివిన రోజులకు తీసుకుపోయారు.మేము interval లో icecream తిని పుల్లాట అడేవాళ్ళం.మధురమైన ఆ రోజులను గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదములు.
ReplyDeleteహ హ నాకింకో పేరు కూడా ఉంది... బావుంది :-)
ReplyDeleteఅప్పట్లో 7 వ తరగతి చదువుతున్నప్పుడు, సాయంత్రం ఇంటికెళ్ళనిచ్చేవారు స్కూల్లో, అప్పుడు టీచర్స్ వచ్చేదాక ఈ ఆట ఆడేవాళ్ళము. చాలా ఏకాగ్రతతో ఆడేవాళ్ళము. కొన్నిసార్లు చింతపిక్కలతో కూడా ఆడేవాళ్ళమిలా. బాగా గుర్తు చేసారు. ఇప్పుడంతా వీడియో గేంస్ అంటూ కళ్ళు పాడుచేసుకొంటున్నారు.
ReplyDelete@విజయమోహన్ భాయ్: థాంక్సు
ReplyDelete@వేణూ శ్రీకాంత్: Keep smiling always :):)
@రమణి గారు: నాబ్లాగ్పోష్ట్ చదివినందుకూ, వ్యాఖ్యానించినందుకూ ధన్యవాద్.
anna jabbardast rasave ani telugulo rayalni vundhi...but i dont know how to type in telugu here...so english lo adjust ayyipondi...
ReplyDeletenenu e game eppudu adaledhu khani......but bagha chusey vadini...so i rember the days when i am looking very concetrating on the game while others palying....
thanks annayi......