Nov 26, 2008

నేను హైదరాబాదులో ఎందుకు పని చెయ్యొద్దు అనుకుంటున్నా?

నేను 2001-2003 దాకా హైదరబాద్లో ఉన్నా. ఆ రోజున చందా నగర్ నుంచి బంజారా హిల్ల్స్కి వైయా హైటెక్ సిటీ - 15 కి.మి - ఇరవై నిమిషాలు పట్టేది. ఈ రోజున ఎంత పడుతుందో?
మరిక నేను హైదరబాద్లో దేనికి పనిచెయ్యాలి?
అద్దె - 10000 తక్కువ ఏమైనా దొరుకున్నయా ఇళ్లు?
రోడ్డులు - 1 గంటలో ఇంటికి చేరగలనా?
పిల్లలు ఆడుకోటానికి పార్కులు ఉన్నాయా?
నేను ఉండబొయ్యే ఏరియాలో మంచి బడి ఎక్కడా? అసలు మంచి బడి అంటే?
నీళ్లు వస్తాయా?
కూరగాయలు మంచివి దిరుకుతాయా?
బస్సు సౌకర్యం ఉందా?

అన్నిటికి సమాధానాలు "లేదు/లేవు/తెలియదు". మరిక నేను హైదరబాదులో దేనికి పని చెయ్యాలి?

Flipside-

ఆరకిల్ - హైదరబాద్ లోనే దేనికి?
సత్యం - హైదరబాద్ లోనే దేనికి?
అంతా కట్టకట్టుకుని హైదరబాద్లోనే దేనికి కంపెనీలు పెట్టడం?

నా ఆలోచన -
సత్తెనపల్లి, లేక పేట, లేక మిర్యాలగూడ లాంటి ఊళ్లని ఒక పద్ధతి ప్రకారం అభివృధి చేసి - IT అని తరలిస్తే "PLANNED GROWTH" కి ఒక బాటలా ఉంటుంది.

నా కల -
మోర్జంపాడులోనో లేక, దాచేపల్లిలోనో ఒక రెండెకరాలు పొలం చూస్కుంటూ ఇంట్లోంచి నేను ఐ.బి.యం లాంటి కంపెనీకి పని చెయ్యాలి అని.

I mean, not necessarily living in Mumbai/Hyderabad/Chennai/BlaBla and getting frustrated with the living standards and life style, cannot we have a strong infrastructure and make it as "IT to Village" concept?
Added On November 28th - After Mumbai Blasts: If Something happens in Hyd like what happened in Mumbai, are we going to sustain such a loss financially, resources wise?

9 comments:

 1. హైదరాబాద్ పుట్టినప్పటి నుండీ అలా లేదు కదండీ రాష్ట్ర జనాభా అందరూ ఛలో హైద్ అనేసి చివరాఖరుకి ఇలా చేసేసారు. పల్లెలు కూడా అలాగే అవుతాయ్ కదా. కానీ ఒక లిమిట్ పెట్టి మీరన్నట్లు అభివృద్ది చేస్తే బానే ఉంటుంది అయినా అలాంటి ప్రశాంత వాతావరణం 70 లలోనో లేదా early 80 లలోనో పుట్టిన మన తరం కోరుకుంటుందేమో కాని ఇప్పటి కుర్ర కారుకు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లు, డిస్కోతెక్ లూ, ఖరీదైన రెస్టారెంట్ లూ లేక పోతే రోజు గడవడం కష్టమే...

  ReplyDelete
 2. @వేణు: I agree with you, but, Why are we fitting ourselves in such "మూస" అని నా పాయింటు.
  Thank You.

  ReplyDelete
 3. భాస్కర్ గారు........ఖర్మ కాకపోతే మేము పనిచేయటంలేదు హైదరాబాదు లో......ఎర్రగడ్డ నుండి ఇసిఐయల్ వెళ్ళటానికి 2 గంటలు రావటానికి 2 గంటలు...... వెధవ ఆటోల గోల మరీ ఎక్కువైపోయింది......!

  ReplyDelete
 4. @వేణు శ్రీకాంత్ గారూ.....

  అలవాటైతే అంతే మరి....
  లేత వయసులో ఉద్యోగం..వచ్చే డబ్బుతో విచ్చలవిడితనం..జల్సాలు....సరదాలు....బాగా పెరిగిపోతోంది ఈ మధ్య....

  మనవాళ్ళు అమెరికా వాళ్ళను చూసి ...పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తున్నారు.....ఇప్పుడు ఏమైంది......పులికే వాత పడింది....రేపు మన వంతు.......!

  ReplyDelete
 5. అవును, హైదరాబాదులోనే దేనికి?
  అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవకుండా చిన్న చిన్న పట్టణాలలో కూడా జరగాలి. నా కల కూడా అదే. చక్కగా మా ఊర్లోనో, పొన్నూరులోనో బాపట్లలోనో, మా పిల్లలకి ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుందో..
  అయినా మీరు మీ పల్నాడు దాటి అభివృద్ధి జరగనిచ్చేట్టు లేరుగా!!

  ReplyDelete
 6. @సిరిసిరిమువ్వ గారు: ఎంతమాట అండి..కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు అంతా ఒక్కటే. జస్ట్ ఫర్ ఫన్ అలా పల్నాడు అంటాం అంతే. ఐతే పుట్టిన గడ్డ మీద మమకారం ఎక్కడకిపోతుంది?

  ReplyDelete
 7. వరూధిని గారు, "పల్నాడు దాటి అభివృద్ధి జరగనిచ్చేలా లేరుగా"..కొట్టారు దెబ్బ!

  మేము నాలుగేళ్ళ ముందు కొండాపూర్ కి షిఫ్ట్ అయినపుడు భయం భయంగా ఉండేది. జనాలు లేక. ఇప్పుడు మా మెయిన్ రోడ్లో "విల్షైర్" తో సహా, కార్ల షో రూం లతో సహా సకలం ఉన్నాయి. రోడ్డు దాటడానికి పది నిమిషాలు వెయిట్ చెయ్యాలి. భయంకరమైన రెస్టారెంట్లు! ఇక చందానగర్ నుంచి బంజారా హిల్స్ కి వయా హైటెక్ వెళ్లడానికి గంట పడుతుంది..పది దాటాక. పది దాటక పోతే నేను గ్యారంటీ ఇవ్వలేను. హైటెక్ సిగ్నల్ దగ్గరే మీకు 20 నిమిషాలు రెడ్ లైటు పడుతుంది.

  కానీ ఏమీ చెయ్యలేం, హైదరాబాదు అలవాటైతే తిట్టుకుంటూ అయినా సరే ఇక్కడే ఉండాలనిపిస్తుంది.

  భాస్కర్ గారు, మీకు ఆల్రెడీ పొలం ఉంటే సరే! ఇప్పుడు దాచేపల్లి దగ్గర పొలం కొనాలంటే మనం మన ఇల్లు కాక పక్కింటి వాళ్ళ ఇల్లు, ఎదురింటి వాళ్ళ ఇల్లూ కూడా అమ్మాలి. ఎకరం 60-70 లక్షల పైమాటే!

  ReplyDelete
 8. @సుజాత గారు: అదే నాకు అర్ధం కాని సంగతి. జనాలు ఇంత పెట్టి ఎలా కొనగల్గుతున్నారూ అని? మరి ఇంత డబ్బు ఉంటే ఇరవైలక్షల కోట్లు అప్పు దేనికి చెయ్యాల్సి వస్తోంది అని. ఏంటో సామాన్య మానవునికి అన్ని ప్రశ్నలే.

  ReplyDelete
 9. సుజాత గారు,
  పొలం కొనాలంటే అంత రేటు లేదండి .సైట్ కొనాలంటే మీరు చెప్పిన రేటు కరెక్ట్ .
  సిరి గారు,
  మీఉర్లో (బాపట్ల) సాఫ్ట్ వేర్ జాబు కావాలంటే కష్టం గాని. టిచర్ ,లెక్చరర్ జాబ్స్ వస్తాయి కదా...

  ReplyDelete