Nov 30, 2008

ఎన్నో ప్రశ్నలు

౧. టెర్రరిష్ట్లు హైజాక్ చేసిన పోలీస్ వ్యాన్ ఏమైంది?
౨. రూమ్ సర్వీస్ చేసేవాళ్లు తీవ్రవాదులు బసచేసిన గదుల్లో సర్వీసు చేసేప్పుడు ఎటువంటి తేడాని గమనించలేకపొయ్యారా?
౩. ౪ నెలలనుండే ప్లాన్ చేసి స్టూడేంట్లుగా వచ్చినప్పుడు హోటళ్లలో చెక్-ఇన్ క్రైటీరియా ఏంటి?
౪. ఇంత పెద్ద పెద్ద హోటళ్లలో సిసిటీవీలు ఉండవా?
౫. రూమ్ ౬౮౦ కి చాలామంది జనాలు వచ్చేవాళ్లు - ఎంత విలువైన సమాచారం ఇది. సమాచారం ఉపయోగం లేకుండాపోయినట్టేగా ఎవడొచ్చాడు అని ప్రూఫ్ లేదు.
౬. పాకిస్థాన్ యొక్క పాత్రని నిరూపించే ఆధారాలు ఏవి?
౭. సి.యన్.యన్ లో చర్చించినట్టు - జనాలు ఇలాంటి ఆపరేషన్ జరుగుతుంటే - తాజ్ లో లోపలి లాబీదాకా వెళ్లి రాగలిగారు, గుంపులు గుంపులుగా చేరితే అది ఎంతవరకు సమంజసం?
౮. పోలీసులుకూడా జనాల్ని ఒక పరిధివరకూ ఆపేయలేకపోతే ఎలా. దీనివల్ల క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ట్యాంపర్ అయ్యే అవకాసం కూడా లేకపోలేదుకదా?

2 comments:

  1. 1. మంత్రి గారి మనవడ్ని స్కూల్ దాకా దిగబెట్టి రావడానికి వెళ్ళింది.
    2. తేడాలు గమనించు కుంటూ కూర్చుంటే టిప్పులు రావు మరి.
    3. టారిఫ్ లే కాని క్రేటేరియాలు అంటూ ఉండవు మాకు.
    4. ఉంటాయి కాని పని చేయవు. (connections లేవు మరి)
    5. అదంతా మాకు అనవసరం. occupancy % వివరాలు చాలు.
    6. గతంలో ఇటువంటివి చాలా చాలా జరిగాయి. అప్పుడు చూపించామా. మరి ఇప్పుడూ అంతే.
    7. మరల మరల ఇటువంటి చాన్స్ వస్తుందా మరి??
    8. ఆపడానికి మా దగ్గిర కనేసం పెద్ద తాళ్ళు కాదు కదా.. కనీసం పురికొస కూడా లేదు మరి.

    ReplyDelete
  2. hi i saw your post on our site www.linq.in which featured in the top 10 recently added blogs. We at linq locate the best of indian blog posts and list them in order of popularity. To
    know your blog statistics please Click here.

    There are various tools offered by us to popularize blogs and make monetary benefits out of it.

    Alpesh
    alpesh@linq.in

    ReplyDelete