Sep 29, 2008

నేటి ఉపాధ్యాయులూ చదువులూ

నేననుకుంటుంటాను, ఈరోజున ఆంగ్ల పాఠశాలల్లో చదువు ఎంతవరకు విలువైన చదువూ? అని.
కారణం, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ఒక ప్రవేశ పరీక్ష రాసి, ఒక సెలెక్షను ప్రాసెస్ తో వస్తారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవాళ్ళు? జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయులకి ఒక బోధనా పద్ధతి, ఇన్స్పెక్షను గట్రా, మరి వీళ్ళకి? ఏంటి ప్రమాణాలు?
ఇన్ని ఇంగ్లీషు బడులు రాకమునుపు స్టేటు ర్యాంకులు తెలుగు మీడియం వాళ్ళకే వస్తుండేవి, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల పాఠశాలలకి ఎక్కువ వస్తుండేవి, కొడిహినగళ్ళి, తాడికొండ ఇలా.
ఈ ప్రైవేటు పాఠశాలలు వచ్చాక వీళ్ళు డబ్బుబెట్టికొనుక్కోటం మొదెలుబెట్టారు అన్నీ.
అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే ,ఈరోజు ఎంతమంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పిల్లల్ని అదే బడిలో జేరుస్థున్నారు?
ఇంగ్లీషు మీడియం చదువే చదువా? మిగతావి బడులే కావా?
పిడుగు రాళ్ళలో బడి ఒకప్పుడు చాలా పేర్ప్రఖ్యాతులు గడించింది. మానాన్న దాంట్లో పని చేసేప్పుడు ఆయన, సహ ఉపాధ్యాయులు, పోటీలుపడి పాఠాలు చెప్పే వాళ్ళు (Quality). ఆ బడికి పెద్ద గ్రౌండు. మేము (నా సోదరుడు, నేను) తండా బడిలో చదువుకున్నాం, అది మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల. మా ఉపాధ్యాయులు తాట తీసేవారు. ఎఱ్ఱంశెట్టి సీతారామయ్య మాష్టారు, సీతారామయ్య మాష్టారు, ఆంజనేయులు మాష్టారు, రామిరెడ్డి మాష్టారు, రామస్వామి మాష్టారు, విజ్యలక్ష్మి టీచరుగారు ఒక్కొక్కళ్ళూ డెడికేటెడ్గా పనిచేసేవారు. నేను 8-10 చదువుకున్న మోర్జంపాడు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల చాలా పెద్దది. అసలు బడికి వెళ్తే ఒక రకమైన భావన రావాలి. ఇరుకు గదుల్లో, ఆటస్థలంలేకుండా, ఎవుడుపాఠాల్జెప్తున్నాడో తెలియదు, దేనికిజెప్తున్నారో తెలియదు, ముక్కునబెట్టుకోటం పరీక్షల్లో ఛీదటం. మర్కులు బానే వస్తాయ్..కాని?
మోర్జంపాడు ఎత్తుబడికి బెస్ట్ బడి అవార్డ్ కూడా వచ్చింది. 1000-2000 చెట్లు నాటాం. రకరకాల చెట్లు. బళ్ళో మగ్గాలుండేవి. క్రాఫ్ట్స్ మాష్టారు ఒకాయన, ఒకక్రాఫ్ట్స్ పిరీడు. మగ్గాలమీద నవారు నేసే వాళ్ళం. సంవత్సరానికోసారి వాటిని పాటపెట్టి అమ్మేవాళ్ళం. బళ్ళో పెరిగిన గడ్డికోస్కుంటానికి పాట ఉండేది. బళ్ళో టమాటా, వంకాయా గట్రా కూరగాయలు పండించేవాళ్ళం. చదువు ఎంతవరకూ వచ్చింది అనేది పెద్ద విషయం కాదు. అది విద్యార్ధి మీద ఉంటుంది. ఒక పద్ధతి ఉందా లేదా అనేది ముఖ్యం.
ఈరోజున జి.ప్ర.ప.ఉ పాఠశాలలు బోసిపోతున్నయి.

Sep 26, 2008

అంతిరించిపోతున్న కొన్ని ఆటలు

ఒకానొక కాలంలో ఆడపిల్లలూ ఈడపిల్లలు, అంటే అబ్బాయిలూ ఈ ఆటలాడేవాళ్ళు:
బిళ్ళంగోడు/గూటి బిళ్ళ
కబడ్డి
ఖోఖో
బాడ్మెంటెన్
వాలీబాల్
అంజనం
పెద్ద అంజనం
అష్టా చెమ్మ
గిల్లాలు
వంగుళ్ళు దూకుళ్ళు
బెచ్చాలు
ఓకులు
గోలీలు
కోతికొమ్మచ్చి
నాలుగు స్థంభాలాట
ఉడుం
వీధీ వీధీ గుమ్మడిపండు
కాళ్ళాగజ్జాకంకాళమ్మ
పుల్లాట
పులి మేక
రాముడు సీత
దీనిపేరు నాకు తెలియదు. ఒకడు చేతులు పైకెత్తి ఒక కర్రని రెండుచేతుల్తో పట్టుకుంటాడు. దాన్ని ఇంకొకడు ఇంకో కర్రతో తియ్యాలి.
గుడుగుడు గుంజం
అందరూ గుండ్రంగా కూర్చుని ఉంటే ఒకడు వాళ్ళ వెనక పరిగెత్తుతూ ఖర్చీఫ్ వేస్తాడు. అదేదో ఆట.
నేల బండా
ఏడుపెంకులాట

ఇప్పుడు ఒకటే ఆట - క్రికెట్టు. లేకపోతే కంప్యూటరు ఆటలు.
పైన పేర్కొన్న ఆటలన్ని కనుమఱుగైపోతున్నాయి..
కొత్త నీరొచ్చి పాతనీరుని ఆక్రమించేస్తుంది, సృష్టి సహజం. కాని ఆ పాతవాటి విలువ కొత్తతరానికి తెలిపేదెలా?

Sep 25, 2008

యాపిల్ తోట

పోయిన వారాంతానికి మళ్ళీ యాపిల్ పికింగ్ కి వెళ్ళాం. దేనికెళ్ళాం అంటే మా బుడ్డోడ్ని గుఱ్ఱం ఎక్కించొచ్చని. మావోడికి గుఱ్ఱాల పిచ్చి పట్టుకుంది. ఆవు కధలా, ప్రతీదాన్ని గుఱ్ఱానికి లింకు పెడతాడు. నాన్నా ఆవు ఏంటుంది? భారత్ లో అంబా అంటుంది, ఇక్కడ మూ. మరి గోట్ ఏంటుంది? మా మా. మరి గుయ్యం? హీహా. గుఱ్ఱం బొమ్మ తెస్తాడు వెంటనే, నాన్నా నాన్నా నాన్నా దీన్ని గుఱ్ఱం అంటారు. "ఏంటమ్మ!! గడ్డితిన్నావా" అను అను అనూ, అన్నా, ముక్కు మీద రుద్దు. రుద్దా. అలా వచ్చి మోకాళ్ళ మీద పడుకో.. దేనికి? నేను నీ వీపు మీద ఎక్కి హార్స్ రైడ్ చేస్తా...
స్నానం చేయించేప్పుడు, నాన్నా హార్స్ ఏమంటుంది. ఇదే గోల.
అందుకని వీలునప్పుడు అలా వెళ్ళి గుఱ్ఱం ఎక్కిస్తాం. ఇదిగో ఇలా ఆనందిస్తాడు,
From againbowmans

ఈ ఫాం,పేరు బౌమన్ ఆర్చిడ్స్, లో పందులు, గొఱ్ఱెలు (అవి నన్ను అదోలాజూస్తాయి - దేశి గొఱ్ఱె హి హి హి అని నవ్వుకున్నట్టు ఉంటుంది) మేకలు గట్ర తోపాటు పెద్దా చిన్నా గుఱ్ఱాలు చానానే ఉన్నయి. మచ్చుకి ఈ గుఱ్ఱాల్నిజూడండి
From againbowmans


వాడి 90 ఎకరాల తోటలో రకరకాల యాప్పిల్స్, పీచ్, స్ట్రాబెర్రి, పెద్ద గుమ్మడి కాయలు, స్క్వాష్, మొ|| ఉంటాయి. పోయిన వీకెండ్కి వెళ్ళినప్పుడు జనం తిర్ణాలకొచ్చినట్టు వచ్చారు. లోనకెల్టాకి 20 ని. పట్టింది.
అక్కడ తీసిన ఒక చిన్న సరదా వీడియో.
From againbowmans

Sep 24, 2008

తాను మునుగుతూ..

తాను మునుగుతూ పక్కనోళ్ళని ముంచేదేది?

అర్ధం కాలా?

ఆలోచించండి..

బుర్రకి పదును పెట్టండి..

ఇప్పటి ప్రపంచ కాలమాన పరీస్తితుల్లో..

ఎలిగిందా లేదా?

సరే, నేనేజెప్తా....

తనుమునుగుతూ పక్కనోళ్ళని ముంచేది..

"అమెరికన్ ఎకానమి"

Sep 23, 2008

పోరాటం:నీతి

యుద్ధంలో కూడా నీతి ఉంటుంది. అంటే పోరాట యోధుడు కిందపడితే వాడ్ని చంపకూడదు అనో, లేక, రధం ఇరుసు ఇరిగిపోతే బాగుజేస్కునే వానిమీద బాణం వెయ్యకూడదనో, లేక, తెల్లజెండా ఎగరేసినోడిమీద ప్రతాపంజూపకూడదనో ఇలా.ఈనాటి యుద్ధాల్లో మరి ఇలా ఉన్నాయో లేదో తెలీదుకాని కొంతమందికి కనీస నీతి న్యాయాలు ధర్మాధర్మాలు లేవనిపిస్తుంది. ఈళ్ళెవరయ్యా అంటే మతంపేరుతో కుతికెలు కోసేవాళ్ళు. వాళ్ళు అహమ్మదాబాదు అల్లర్లుజేసినోళ్ళు కావొచ్చు, లేక దేశమ్లో పలుచోట్ల బాంబులుబెట్టి జనాన్ని జంపినోళ్ళు కావొచ్చు.తుపాకితో ఏదో చేద్దాం అనేటోళ్ళల్లో నక్సలైట్లకి కూడా నీతి ఉంది. అదేంటంటే, మేము పలానోడ్ని జంపాం, ఇదీ కారణం. ఆడు ఉత్తి ఎదవ ,లంచగొండి, జనాల్ని పీల్చి పిప్పిజేస్తున్నడు అని.
ఇండియన్ మొజాహద్దీన్ అనే యదవనాకొడుకుల్కి, కనీస నీతి లేదు. మేము బాంబులు పెట్టాం అని ఈనాకొండిగాళ్ళు రొమ్ములుజింపుకుని, కాస్ట్ అవే సిన్మాలో టాం హాంక్స్ నిప్పుని రాజేసి రొమ్ములు గుద్దుకున్నట్టు, "మేమేజేసాం!! చూడంద్రా ఎంత మంది సచ్చారో" అని జబ్బల్జర్సుకున్నరే, "ఇదిగో ఇందుకు జేసాం. మా సమస్యలివి" అని ఎక్కడైనజెప్పరా? చిన్న చిన్న పిల్లల్ని, ఆడోళ్ళని, ముస్లోళ్ళని, ముతకోళ్ళని జంపమని జెప్పిందా పోరాట అజెండా?

పోరాటం అనేది టెస్టింగు లాంటిది. మేము టెస్టింగు జేస్తున్నం అంజెప్తే, ఏమి టెస్టింగు జేస్తున్నరు? మీ టెస్టింగు అజెండా ఏంది? మీ టెస్టింగు గోల్సు ఏంది? అని అడగాలె. అవిలేకుండ టెస్టింగుజేస్తున్నం అంటే నీళ్ళల్లోకి రాయేసినట్టే. అట్టానే పోరాటం జేస్తున్నం అంటే ఎవ్వనిమీద జేస్తున్నం? అజెండా ఏంది? గోల్స్ ఏంది? దేనిగురించి పోరాటం? అవిలేకుండా మేం పోరాటం జేస్తున్నం. డబ్బులున్నై, సంపాయించాం, మందుగుండు సామాగ్రి కొన్నాం బాబులు పెట్టాం, పేల్చాం....ఏందిది?

Sep 22, 2008

నా ఆవేదన, ఆందోళన, రోదన, మౌనం.....

నేనీరోజు దేనికోసమో గూగుల్లో వెతుకుతుంటే ఈ బ్లాగు http://teluguplaty.blogspot.com/2007/11/blog-post.html, http://www.venuvedam.com/ కనపడింది. నా కళ్ళు చెపర్చాయి.

మనిషి పుట్టుకేంటో, పోవటమేంటో. అస్సలు ఎందుకుపుడతామో?
చావంటే నాకు భయం లేదు. మా నాన్న నా చేతుల్లోనే పొయ్యాడు. మా తాతయ్య నా కళ్ళా ముందే పొయ్యాడు. ఇక్కడ నా రోదన ఏంటంటే:
మనం ఐటీ రంగం అది ఇది, అభివృద్ధి, 2020, చదువు సట్టిబండలు, అమెరికా, జపాను, జెర్మనీ అని రొమ్ములు ఇరగదీసి బాదుకుంటాం. ఐతే, గుంటూరులో, బ్రాడీపేటలో మానాన్నకి గుండె నొప్పి ఎక్కువైతే, ఇంట్లోచి కిందకెళ్ళి ఆటో ని పిల్చుకొచ్చి ఆశుపత్రికి తీస్కెళ్ళేలోపు ఆయన ప్రాణం పోయింది. ఇన్ని ఉండి, ఇంత జ్ఞానం ఉండి, విజ్ఞానం ఉండి మనం మన కనీస అవసరాల్ని దేనికి పట్టించుకోము అని?
మన డైయాగ్నైజు ఇలా ఉంది: మా నాన్నకి 1999 లో గుండే పెరిగింది. ఆ సమయంలో అది గుండె పెరగటం అని మేము కనిపెట్టలేక పొయ్యాం. ముందు జ్వరం వచ్చేది. ఒక పెద్దాయన దెగ్గరకి వెళ్ళాం. ఆయన ముందు మలేరియా అని క్వినైన్ ఇచ్చాడు. 10 రొజుల తర్వాత ఇంకా తగ్గక పోతే మళ్ళి వెళ్ళాం. ఈసారి యంటై బాక్టోరియల్ ఇచ్చాడు. ఇంకో 10 రోజులు గడిచినై. ఈలోపల మా నాన్న 10 కిలోలు బరువు తగ్గిపోయాడు, పేల్ గా అయిపోయాడు.
అప్పూడు నా సొంత తెలివితేటల్తో, నా డాక్టరు స్నేహితులతో చర్చించి, కంప్లీటు చెకప్పు చేయిద్దాం అని నిర్ణయించి అరుండేల్ పేటలో అమరావతి డైయాగ్నోస్టిక్స్ కి వెళ్ళాం.
Dr. Srinivasa Reddy MD అక్కడ ఇన్-ఛార్జ్. వెళ్ళాం, ఎక్స్-రే అవి ఇవి అయ్యాయి. స్కాన్ తీయించుకోటానికి రమ్మన్నారు, వెళ్ళాం. వాడు, ఆ స్కాన్ తీసేవాడు, ఒక కంప్యూటరు స్క్రీను మీద చూస్తున్నాడు, దాంట్లోనే ఇంకో విండో, దాంట్లో సిటికేబుల్లో సినిమాజూస్తున్నాడు. అలా మల్టై ప్రొసెస్సింగు జేస్తూ గుండే దెగ్గర స్కాన్ తీస్తూ, పేషంటుతో అంటాడూ "మీ గుండె పెరిగింది!! చాలా సీరియస్గ ఉంది" అని. వెంటానే వాడి రెక్క పట్టుకులాక్కొచ్చా బైటికి "ఎవుడ్రా నువ్వు, రోగికి చెప్తార్రా, పక్కన్నేనున్నది దేనికి" అని కొట్టినంత పనిజేస్తే అప్పుడొక "సారీ"ని నామొహాన కొట్టి రిపోర్ట్స్ చేతిలోపెట్టాడు. తర్వాత మొత్తనికి పోరాడి కొంతకాలం బతికించుకున్నాం మా నాన్నని అది వేరే సంగథి.
బ్రాడీపేటలో ఉన్న ఒక రోగి, ఎక్కడో కొత్త పేటకి ఆటోలో వెళ్ళాటానికి కనీసం 30 నిముషాలు పడుతుంది, ఆయువుంటే బతుకు, లేకపోతే? అసలు అన్నీ ఆస్పత్రులూ ఒకేచోట దేనికి? ఇదేమైయినా కూరగాయల మార్కెట్టా? బ్రాడీపేట కాడ్నించి కొత్తపేట కాడికిబోటానికి ౩౦ ని పడితే, మోర్జంపాళ్ళో గుండెనొప్పొచ్చినోడిని గుంటూరు ఎత్తుకెళ్ళాలంటే? రేగులగడ్డ కాడ్నించో? ౨౦ లక్షల కోట్లు అప్పుజేసాం ఇప్పటిదాకా. ఆడబ్బుని ఏంజేసాం? మన్లో కొంతమంది ఎదవలు అప్పుజేస్తే తప్పేంటి అన్నారు, కొంతమంది కాంగ్రేస్ అప్పుజేయకూడన్నారు. కొందరు టీడీపీ మాత్రమే అప్పుజేయ్యాలన్నారు. ఒకడు ప్రపంచ ఎకనమిక్ ఫోరం కెళ్ళొస్తడు. ౫౦ మంది ఎంపిలు అమెరికాకెళ్ళొస్తరు. అది చూసాం, ఇది చూసాం. ఎక్కడ వాటి ఫలాలు?
మనకి బతుకు విలువ ఎప్పటికి తెలుస్తుంది? చిన్న పిల్లలు ఇలా అర్ధం కాని ట్యూమర్లతో పోతుంటే? ఏంటో నాకు ఆవేశం తో పాటు ఆవేదన, ఆందోళన కల్గుతోంది.
ఒక ఎమర్జన్సి మెడికల్ సిస్టం ఎందుకని మనం పెట్టుకోలేకపోతున్నాం? మండలానికి ఒక ఎమర్జెన్సీ, ట్రౌమా కేంద్రం ఏర్పాటుచెయ్యటానికి ఆటంకాలేంటో?
పైన పేర్కొన్న బ్లాగులో ఆ తల్లితండ్రులు ఎంత హృదయవిదారకంగ కుమిలిపోయి(పోతూ) ఉంటారో?
ఇశాన్ తండ్రి ఇలా రాసాడు "వాడు మాకు చాలా జీవిత సత్యాలు నేర్పాడు. మరణం అనేది కేవలం ఒక మార్పు మాత్రమే అని చెప్పాడు. ఇక ముందు మాకు ఎటువంటి కష్టాలైనా చిన్నవిగానే కనిపించేటట్లు చేశాడు. డబ్బు ఎందుకు పనికిరాదు అని విడమార్చి బోధించాడు. (అమెరికా లో చికిత్స చేయించగల స్థోమత ఉండి కూడా అందుకు వ్యవధి లేని పరిస్థితి)."
అంత చిన్న పిల్లోడి ఆర్గాన్స్ డొనేట్ చేసారంటే వాళ్ళకి నేను శిరస్సు వంచి పాదాభివందనం జేస్తున్న. ఇలా అర్ధాంతరంగా మనల్నందర్ని వదిలేసి నిజంలో ఐక్యం ఐన వాళ్ళందరికోసం రెండునిమిషాలు మౌనం పాఠిస్తున్న.

ఇందాకనే నా మితృడొకడు మొహం ఏళ్ళాడేస్కుని నా డెస్కు దెగ్గరకొచ్చాడు. ఏందిరా అన్నా, మనసేం బావోలేదు. ఏం? మా స్నేహితుడి కొడుకు రెండున్నరేళ్ళు, పోయాడూ!! ఎలా? ఎక్కడా? ముంబయ్ లో ట్యూమర్. నాకు కళ్ళలో నీళ్ళుతిరిగినై. మనసంతా వికలమైంది. నాచిట్టికన్నల్లారా!! పుట్టిపుట్టంగనే ఇలా ఎళ్ళిపోతే ఎలా???? అందరూ ముందుకి రండి. మనకోసం, మన ఊరుకోసం ఎదోకటిజేద్దాం...దయచేసి.

కాంగ్రేసును బొందపెడతాం: కె.సి.ఆర్

కాంగ్రేసును బొందపెడతాం: కె.సి.ఆర్
పిచ్చివాగుడు ఆపకపోతే నీ గోరీ నీచేతే కట్టిస్తాం: జనం

Sep 17, 2008

ఎన్ని "కల"లో "ఎన్నికల"లో

కల కంటం మానవ హక్కు.
ఐతే కలల్ని సాకారం చేస్కోటం సానా కష్టం.
కలల్ని కని ఆటిని కష్టపడి సాకారం సేసుకున్నోళ్ళు సానా పైకెళ్ళారు. అంబాని, బిర్లా ఇలాంటోళ్ళు.
మనం ఇప్పుడు మాట్టాడుకునేది అట్టాంటోళ్ళ గూర్చి కాదు.

"డాడీ" అస్సలు కష్టం, నరకం, బాధ ఇలాంటివి ఉంటాయనికూడ తెలవని, పట్టు పఋపులమీద, వాతావరణానుకూల గదిలో, చుట్టూ పెద్ద పెద్ద మెత్తని బొమ్మల మధ్యలోంచి అఱిచిందో పద్దెందేళ్ళ పాప కంఠం
"వస్తున్నా తల్లి" (సాగర సంగమం సినిమాలో ఫోటోస్టూడియో ఓనర్లా) అని వెళ్ళిందో ఖద్దరు ఆకారం
"డాడీ, నోవాట్, ఐ హాడ్ అ డ్రీం లాష్ట్ నైట్"
"అవునా తల్లి!! నువ్వుకాక ఇంకెవరు కంటారు కలలు. కలలు కనే హక్కు, అధికారం మనకిమాత్రమే ఉన్నాయి. కలల హక్కులు (పేటెంట్స్) మన హస్థగతం చేస్కోటాకి సెగెట్రిని పురమాయించా!!! ఇంతకీ ఏమి కల కన్నావ్?"
"డాడీ!!! ఇట్సే డ్రీమ్ అబౌట్ స్పేండింగే ఎ డే"
"??"
"డాడీ!!గాట్ టు గెట్టప్ ఇన్ సింగపూర్, బ్రేక్ఫాష్ట్ కౌలాలంపూర్, షాపింగ్ ద్యూబై, లంచ్ మ్యూనిక్, కాండిలైట్ డిన్నర్ వెనీస్, స్లీప్ ఇన్ సిడ్ని"
"ఓసంతేనా!! నేన్జఊస్కుంటా"
..
"సెగెట్రి!! గుత్తేదార్లుని పిలువ్, గుత్తే౧: ఇరవైలచ్చలు, గుత్తే౨:నువ్వో ౫౦లచ్చలుతే. .... ..."
...
మనం మాట్టాడబోయేది ఇట్టాంటోళ్ళగురించి.

ఇట్టాంటోళ్ళూ కలలు కంటారు, కల్లో పక్కన భామల్తో (ఐదు నుంచి నూటాఅయిదు వయస్సు వరకు ఎవతైనా పర్లేదు) స్కాచ్ కొడుతూ, బూతుబొమ్మల్జూస్తూ విహరిస్తున్నట్టు.....అంతే ఠకామని లేచి, మనలాంటి గొఱ్ఱెలమందకి "గొఱ్ఱెల్లారా!! నేనొక కల కన్నా.. మీగుఱించి. భవిషత్తులో మీకు ఎట్టాంటి రాష్ట్రం గావాలి, గుడ్డూ గూసు"
గొఱ్ఱెలు "అహా ఓహో!! అయ్యోరు మనకోసం సరిగ్గా నిద్రకూడా పోకుండా, ఒకేళ పోయినా మనకోశం కలలు కంటున్నడు!! అహా ఓహో"
"కాబట్టి గొఱ్ఱెల్లారా!! నేను కన్న కలలు నిజం కావాలంటే, మీరు కలలుకన్న(కలలు వీళ్ళ ట్రేడ్మార్కులు కదా, పొరబాటున కలలు కంటే సూ జేస్తడు జాగర్త), మీరు కోరుకున్న (కోరికలా బొంగా - గొఱ్ఱెలక్కూడా కోర్కెలుంటాయా) జీవితం రావాలంటే నాకేఓటేయ్యాల"
ఓట్లేసినై మన గొఱ్ఱెలు.
మనోడు తన కలల్ని సాకారంజేసుకున్నడు. గుత్తేదార్లు డబ్బు పంచారు, పంచుకున్నరు. గొఱ్ఱెలు అరవకుండా కులాల, మతాల కుమ్ములాట పెట్టి, మొజాహద్దిన్ లాంటోళ్ళని అణగతొక్కకుండా ఏదోక రావణకాష్టం రగులుస్తూనే ఉంచి, కొన్ని గొఱ్ఱెల్ని బలి ఇచ్చి, గొఱ్ఱెలని మళ్ళీ గొఱ్ఱెల్నిజేస్తరు.

గొఱ్ఱెలు తమ బెత్తెడు తోకతోటి, మళ్ళీ కలలగురించి ఎవుడుజెప్తాడా అని అట్టా ఎదుర్సూస్తునే ఉంటై.

దీన్సిగదరగ - ఎన్నికల్లో నెగ్గటం కోసం ఎన్ని కలలు కంటారో ఈనాకొడుకులు.


నేపధ్యం:
కేసిఆర్ - దేవేందర్తో కల్సినడవటాకి సిద్దం
చిరంజీవి - నాకు బెంజి తెల్సు గంజి తెల్సు
వైయస్సార్ - కిలో బియ్యం రెండుకే"
చంద్రబాబు - తొమ్మిదేళ్ళలో నేను టెక్నాలజీలోనే డబ్బుందనుకున్నా, ఇయ్యాల అగ్రికల్చర్లో కూడా డబ్బుందని వైయస్ని జూసినేర్చుకున్న. నన్నుగెల్పించండి. మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ
కరుణానిధి - ఇంటికో టీవీ, కిలో బియ్యం రెండ్రూపాయలు (ఎదురిచ్చి) - అంటే కిలో బియ్యంకొను, బియ్యంతో రెండ్రూపాయలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
అద్వాని - మాకు పగ్గాలివ్వండి - ఎనభై రోజుల్లో ఉగ్రవాదం ఖతం.

చివరాకరికి ఈపాటవిందాం.
"నిదురపో...నిదురపో..నిదురపోరా తమ్ముడా"
ఎందుకంటే కనీసం నిద్రలైనా మన బెత్తెడు తోకని మర్చిపోవచ్చుకదా....

Sep 15, 2008

ఇండియన్ మొజాహద్దిన్? ఎవుడయ్య ఈడు?

నాకొడుకుల్ని నాలుగు కుమ్మి అవతలెయ్యక. ఏమ్ది ఈ లాగుడు పీకుడు. ఎంతమంది ఉన్నారేంది దాంట్లో? ౮౫ (85) కోట్లమందైతే లేరుగా. బొంగు, ఒక్కోక్కడ్ని ఈడ్చి గోడకేసి దెం*కుండా, ఏంది ఆలోచించేది అంట?
ఈళ్ళెమ్మ రాజకీయనాయకులు, ఈళెక్క ఓటుబాంకు రాజకీయాలు. ఒక్కోనాకొడుక్కి వట్ట కొట్టాలి.

మనం మళ్ళి సిగ్గుతో తలదించుకుందాం. ఇలాంటి శక్తుల్ని మన సమాజంలో పెరగనిస్తున్నందుకూ, అలాంటోళ్ళని పెట్టి పోషిస్తున్నందుకూ, సహాయసహకారాలు అందిస్తున్నందుకూ.

ఐతే, నాదొక Fundamental Question. ఇలాంటోళ్ళకి పేలుడుపదార్ధాలు, ఎక్కడ్నుంచొస్తున్నయి? పాకిస్థాన్ నుంచి అనినాకూ తెల్సు. నా ప్రశ్న, మన సైన్యం ఏంజేస్తుంది అని?

ఇక్కడ పిల్లి పిత్తినా, పాకిస్థాన్ అని అరవటం మాని, మన డాష్ కింద ఉన్న నలుపుని రూపుమాపుకుంటే మంచిది.

ఇంతమంది అటో ఇటో పోయి తీవ్రవాదం మీద ట్రైనింగ్ తీసుకుని హాప్పీగా వెనక్కి వచ్చేస్తున్నారు అంటే, మన ఇంటి కాపలా ఏంతగట్టిగా ఉందో అర్ధమౌతోంది...

సరే, బాంబులు పేల్నై. ౨౦ మంది పొయ్యారు. వార్తా ఛానెళ్ళు, పత్రికలు రాసినై, చదివాం, పడుకున్నాం, మళ్ళీ షరా మాములే, మర్చిపోతాం, మర్చిపోదాం. రేపు మళ్ళీ ఎక్కడ బాంబులేస్తారో చూద్దాం. అంతకన్నా మనం ఏంజేయగలం. మనం దున్నపోతులం కదా.

చివరగా ఇది చదువుదాం.
మనదీ ఒక బతుకేనా సందుల్లో పందులవలే..

Sep 13, 2008

నాకు నచ్చిన కొన్ని మంచి సూక్తులు, మాటలు

अधिगत्य गुरोः ज्ञानं छात्रेभ्यो वितरन्ति ये |
विद्या वात्सल्य निधयः शिक्षका मम दैवतं ||
తాత్పర్యం:
अधिगत्य - by acquiring
गुरोर्ज्ञानं - the knowledge from the teacher
छात्रेभ्यो - to students
वितरंती - distributes
ये - who
विद्यावात्सल्यनिधयः - Source of knowledge and love
शिक्षका - teacher
मम - my
दैवतम - god
The teachers who distribute knowledge among the students after getting it from their gurus, and who are storehouses of love and knowledge, are indeed like God to me.

************
अन्नदानम् महादानम् विद्यादानमतःपरम्
अन्नॆन क्षणिकातृप्तिर्यावज्जीवम् च विद्यया

************

(ఈ కింది వాక్యం మా మేనమామోపాఖ్యానం)
అవశ్య మనుభోక్తవ్యం కృతంకర్మ కృతాకృత:
మనం ఏం చేసినా దాని ఫలితం అనుభవించక తప్పదు అని
************
బుద్ధి కర్మాణుసారే!!
************
मात्रा समं नास्ति शरीरपोषणं
चिन्तासमं नास्ति शरीरशोषणं !
मित्रं विना नास्ति शरीर तोषणं
विद्यां विना नास्ति शरीरभूषणं !!
************

ఇంకోసారి మరికొన్ని...

Sep 11, 2008

సంస్కృత వార్తా పత్రిక సుధర్మ

సంస్కృత వార్తా పత్రిక కోసం ఇక్కడ నొక్కండి సుధర్మ
సంస్కృతంలో వార్తలందించే పత్రిక ఇదొక్కటే. ఈ పత్రిక గత ౩౯ (39) సంవత్సరాలనుండి మైసూరు నుండి వెలువడుతూ వార్తలందిస్తోంది.

Sep 9, 2008

"ఉచితం" ఎంతవరకు ఉచితం

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కనుచూపు మేఱలోకి వచ్చినై. అందరూ అది ఉచితం ఇది ఉచితం అంటున్నరు.
అస్సలు ఈ "ఉచితం" ఎంతవరకు ఉచితం?
మనం స్వాతంత్రానికి షష్టిపీర్తి జేసాం. ఆనాటి గాంధీ కాడ్నించి ఈయ్యాల్టి గాంధీ వఱకూ, ఆయాల్టి పైం మినిష్టర్ కాడ్నించి ఈయ్యాల్టి పైం మినిష్టర్ వఱకూ, ఆనాటి ముక్యమంత్రి కాడ్నుంచి ఇయ్యాల్టి ముక్యమంత్రి వఱకూ, ప్రతీవోడు పేదరికం నిర్మూలన, పేదరికాన్ని మన దేశంలోచి తరిమేద్దాం, పేదరికం నిర్మూలనకి పెపంచ బాంకు కాడ్నుంచి అప్పుతెద్దాం, శుభ్రంగా మిగుదాం అన్నోడే కానీ పన్జేసినోడు కనబడ్లా.

పైగా మనోళ్ళకి "ఉచిత" వరాలు ఇస్తున్నరు, కర్రేంటు ఉచితం, బియ్యం ఉచితం, గాలి ఉచితం, కాయితకం ఉచితం, తిండి ఉచితం, బట్ట ఉచితం, దొంగనా బట్ట ఉచితం, ఇద్దరాడపిల్లలుంటే సైకిలుచితం, ఇద్దరుపిల్లకాయలుంటే బస్సుపయాణం ఉచితం, ముగ్గురు మూర్ఖులుంటే సిలుమా(సినిమా)ఉచితం, రెండుకాళ్ళుంటే రోడ్డు మీద నడ్సుడుచితం,
రెండుకళ్ళుంటే సూపుచితం, వోటుబాంకు కి అన్నీఉచితం. ....
నీకు ఆయువుంటే బతుకుచితం.....

ఏందో ఈ కత...ఎంతవర్కు ఎన్ని ఉచితాలిస్తరో ఏందో??
అన్నా!! నీకేమైన అర్ధం ఐందా?

పేదోళ్ళు ఎక్కడైనా ఉన్నరు. అమ్రికాలో ఉన్నరు, జపానులో ఉన్నరు, జెర్మనీలో ఉన్నరు. మనకాడ ఎక్కువున్నరు అంతే తేడ.
ఐతే, పేదోనికి ఏంగావాలా? డబ్బిస్తే పేదోన్ని ఇంకా పేదోన్ని జేసినట్టే? మఱేంజేయ్యాల? వానికి కిలో బియ్యం రెండు రూకలకియ్యాల్నా? లేక వాని పొట్ట ఆడుపోసుకునేట్టు జేయ్యాల్నా? ఆడిపొట్ట ఆడుపోస్కునే మార్గం ఏది?
చారిత్రకంగా అణగారిన పెజానీకానికి "రిజర్వేషన్" ఇస్తే మంచిదా? లేక విద్యావిధానంలో మార్పు చేయ్యటం మంచిదా?

అన్నీ పశ్నలే...జవాబులు మాత్రంలేవు.....
సొతంత్రభారత్ లో అన్నీ పశ్నలే జవాబులుండవ్.
మన భారతంలో అన్నీ పశ్నలే...యెవుడయ్యా నువ్వు, ఏందీ పశ్నలేస్తన్నా? కొత్తా? జరుగు జరుగు...అభివృద్ధి బండొస్తోంది..అడ్డులే అడ్డులే...తొలగవయ్యా పక్కకి..అరేయ్ ఆడ్ని పక్కకి గుంజేయ్యాండ్రా...


Sep 8, 2008

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
తల్లి తండ్రులతర్వాత గురువే ప్రత్యక్ష దైవం.
"ప్రిన్సిపాలు కుక్కలా తిరుగుతున్నాడు" అనే సంస్కృతినుంచి మళ్ళీ గురువుని పూజించే రోజులు రావాలని ఆశిస్తూ, ప్రపంచెమ్లో ఉన్న ఉపాధ్యాయులందిరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న.
నాకు ఈరొజున నా నాలుగు వేళ్ళు నోట్టోకి వెళ్ళేందుకు సరిపడా జ్ఙానాన్ని ప్రసాదించిన అందరు గురువులను(కూ), నా తండ్రీ, గురువు ఐన మా నాన్న(కి) ఒక్కసారి తల్చుకుంటు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

Sep 4, 2008

మాఇంట వినాయకుడు

మా ఇంట(టి)వినాయక వ్రతం,ఫోటోలు...


ఇంకొన్ని ఫోటోలు..
మా బుడ్డాడు బడికి తాయారు...మీరు తాయారా?


మా ఇంటి ఎనక


గుఱ్ఱాల పిచ్చోడు!!, ఒకానొక గుఱ్ఱపుశాల దగ్గర


ఛల్ ఛల్ గుఱ్ఱం ఛలాకి గుఱ్ఱం


తోటలో నారాజు ఆడిపాడెను నేడు...

ఇప్పటికి ఇంతే.. ధన్యవాదాలు చిత్తగించవలెను..

Sep 2, 2008

తెల్లోడు, నల్లోడు, దేశి, తమిళోడు, బెంగోలి, మళాయాళీ, నేను

ఏటి, అర్ధంకాలా? సదవండి

అమ్రికాలో
తెల్లోడు తెల్లోడు మితృలు
నల్లోడు నల్లోడు మితృలు (సాధ్యమైంతవరకు)
తెల్లోడు నల్లోడు శతృవులు
తెల్లోడు మెహికన్ అటుఇటు (కొంచెం శతృవు కొంచెం మితృడు)
దేశి దేశి మితృలు (పైకి లోపల శతృవు)
ప్రమపంచమ్లో ఎక్కడకిపోయినా ...
తమిళోడు తమిళోడు మితృలు
బెంగోలి బెంగోలి మితృలు
మళాయాళీ మళాయాళీ మితృలు
మఱి నేను...నేనో తెలుగోడ్ని
కాబట్టి
నేనూ నేను శతృవు..బుఱ్ఱ గోక్కోవద్దు.. ఐ మీన్ తెలుగు తెలుగు శతృవు అని అండ్ అండ్ అండ్
బెంగోలి తెలుగు శతృవు
తమిళ్ తెలుగు శతృవు
మళయాళి తెలుగు శతృవు
నా ఉద్దేశం ఏంటంటే
నాకు నేను శతృవు అనికాదు కాదు..కింది పాయింట్లు
1. దేశి దేశి శతృవులు
మనోళ్ళు ఆడే చీపు ఆటంత కంపు మూశీనది కొట్టదేమొ. వీటిల్లొ అత్యంత పేరుగడించిన ఆట "కాళ్ళులాగుట" అనేఆట. ఈ ఆట చాలా గమ్మత్తుగా ఉంటుంది. దీనికి ప్రమాణాలు ఉండవు. ఆడేవాడి మానసిక స్థితే దీనికి ప్రమాణం. ఈ ఆట ఆడేవాడు ఎంత దిగజారితే అంత ఫలితం. బాసుకి సిగరెట్టు కొంపిచేవాడొకడు, వాడ్ని ఖుషీ చేయ్యటం కోసం సిగరెట్టు అలవాటు చేసుకున్నట్టు నటించి వాడిచేత కదిల్తే తాగించి వాడికి కాన్సరు పెంపొందించటం అదొక milestone ఈ ఆటలో.
అలానే, బాసుకి కాఫీ పొయిచటం. బాబా (అంటే బాసు బాసు అని)!! ఏంది, ఇంకా కాపీ తాగలా, ఎవురు తెచ్చిపెట్టేవాళ్ళూలేరా, నేనెమన్న సచ్చా అనుకున్నావా, చూడు పని జేసి పనిజేసి బుఱ్ఱ ఎలా వంకరపోయిందో (దీన్నె పంపు కొట్టటం అంటారు - ఆటలో ఇదొక చిన్న టెక్నిక్కు, దీనివల్ల milestones ని తొందరగా చేరొచ్చు) ..ఇదిగో ఇప్పుడే తెస్త, ఏంది చిన్నలోటా నా, సా..ఇంతబతుకు బతికి చిన్నలోటా ఏంది నీకు పెద్ద లోటా తెచ్చిపెడత, బయట మంచు పడుతుందా, అవన్ని మనకి అలవాటేలే, మంచులో పుట్టి పెరిగినోడ్ని కాదూ(మనోడు ఏ రెంటచింతల నుంచో వచ్చుంటాడు, లేక చెన్నైయ్యో)..ఆరో అంతస్థు నుంచి దూకి మంచులోబడి ఈదుకుంటూ తెచ్చిపెడతాడు.బాబా అలా కాపీ ఇస్సు ఇస్సు అని లాగుతుంటే మనోడు, బాబా!! సూడు ఆ బాసిగాడు ఆడికేమి రాదు, వాడ్ని గమనించావా ఆడే ఆ ఎదవ సూరిగాడు వాడు ఇండియాలో బజ్జిలమ్ముకునేవోడు ఆడు, ఈడు బుస్సు ఆడు బుస్సుఈ పెపంచకమ్లో నేనొక్కడ్నే మంచోన్ని, నీకు కాపి తెచ్చిపెట్టేదెవడు? నేనేనా? నువ్వు పని జేస్తున్నవ్ అని గుర్తించేదెవరు? నేనేనా?..కాపీ కాంగనే బాబా ఒకలుక్కేస్తాడు (అంటే ఇంకసాలు ఆపహే నీ ఎదవగోల అని), ఏసి, సర్లే పని చూడుపో ఆళ్ళసంగతి తర్వాత సూద్దాం అంటాడు. మనోడు హమ్మ, దానెక్క ఒక పొడుగు కాపి (టాల్)పోయినా సెప్పాల్సింది సెప్ప అని మనసులో ఉప్పింగింపోతాడుమనోడు
ఇంకోఆటుంది ... దాన్ని "సెంటిమెంటు మీద గుద్దు" అంటారు. అంటే ఎదుటొడి సెంటిమెంట్లమీద కాష్ చేసుకోవటం.
ఇంకోటి "మానసికస్థితి తో చెడుగుడు". అంటే సచ్చినపాముని ఇంకా సంపటం, దెబ్బ మీద దెబ్బ కొట్టటం ఇలా.
2. తమిళోడు తెలుగోడు శతృవులు
ఒక తమిళోడు ఒక తెలుగోడు సచ్చిన కలిసుండలేరు (పనిలో... రూమ్లలో కాదు). దీనికి నేను, తెలుగోడి అత్తెలివే కారణం అనుకుంటుంటా. తమిళోడూ తక్కువేమీ కాదు. వాడికి అన్ని అతే.
ఒక చిన్న సంఘటన చెప్తా. తమిళోడి మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పటాకి.
మా ఆఫీసులో ఒకానొక తం (తమిళుడు ఫర్ షార్ట్) ఉన్నాడు. వాడికి వాడు అబ్బో నేను చీఫ్ (చీప్) ఆర్కిటెక్టు అనుకుంటుంటాడు (వాడు ఇలా అనుకుంటుంటాడు అని అనుకునేవాడే తెలుగోడు - అంటే తెలుగోడు ప్రతీఒక్కడ్ని చిన్న సూపు, తక్కువగా ఊహిస్తాడు, మఱ్ఱినేను 34 అణాల తెలుగోడ్నేగా). తప్పులేదు. అనుకోనీ అనుకున్న. ఒకానొక రోజున మా పెద్ద తలకై ఒక అత్యంత ముఖ్యమైన వెబ్బు ఆప్ప్లికేషను ఒకటి బిల్డు జేసి పబ్లిక్ ఫేసింగుకి పెట్టామన్నాడు. ఇచ్చిన టైము ఆరు గంటలు. ఏందయ్య అంటే ఒక టేబిలు, దాంట్లో కొన్ని ఫీల్డ్స్, కింద ఒక "కలుపు" బట్టను, బట్టను నొక్కితే టేబిల్లో ఇంకో రో సృష్టించాలి. అవి పూర్తిచేసినాక "డన్ను" అని నొక్కితే డేటాబేసులోకి నెట్టి తర్వాతి పేజీలో సమ్మరీ సూపించాలి. దానికి మనోడు తిప్పలు పడ్డాడు, ఏడవలేక మద్దెలమీద పడినట్టు నన్ను ఇరికించటానికి చూసాడు. డేటాసోర్శ్ క్రియేటుసేసా వాడుకో అన్నా, ఉదాహరణ ఇవ్వు అన్నాడు. ఇప్పుడు అంత టైము లేదు అన్నాడు. నేనే రాశుకుంటా కనెక్షను సెట్టింగులు గట్రా కోడులో అన్నాడు. సరే మొత్తానికి ప్రొడక్షను కి వెళ్ళిందిఅప్ప్లికేషను.
నాకు ఓరోజు పొద్దున్నే ఫోంజేశాడు.
"ఏంది"
"బగ్గు"
"ఎక్కడా?"
"నీ యాప్ సర్వర్లో"
"ఏంకత"
"జేయస్పీ థ్రెడ్సేఫ్ కాదు, నేను రాసిన జేయస్పీ నేనూ అనుకున్నట్టు ప్రవర్తించటమ్లేదు. ఇది ఐతే జేయస్పీ లేక వెబ్స్పియర్లో బగ్గు"
"ఏంజేయమంటా?"
"ఐ.బి.యం తో పి.యం.ఆర్ క్రియేట్ జేయ్"
"నువ్వే జేసుకో"
"సరే"
ఇది అయ్యాక నేను దొంగతనంగా వాడి జెయస్పీ చూసా. మనోడు డేటాబాసు కన్నెక్షను పేజీలో క్రియేటు జేస్తున్నడు.
అలా తెలిసింది మనోడి అసలు రంగు.
ఇంకో ఝలక్కు:
వాడి ఫోను
"యో!! నీ సర్వరు సచ్చింది"
"ఏమైంది?"
"ఎవుడికీ పేజి రాటల్లా"
"సరిగ్గ సెప్పు సర్వెర్ సచ్చింది ఇవన్ని ఎందుకు, నేను సూసి చెప్త"
నేను సర్వర్లో జూశా..ఏమి యర్రరు లేదు. ఈలోపల పెద్దోడి ఫోను

"Can some one promise me that app will up and running by 4 pm"
మనోడు 4 కే దొబ్బుకెళ్ళాడు ఇంటికి.
తీరాజూస్తే, ప్రాడ్ యాప్ డెవ్ డేటాబేసుకి పాయింటౌతున్నది.

ఇంకో ఝలక్కు

మనోడికి లాగులు (ఏసుకునేవి కాదు - అప్ప్లికేషను రాసేవి) సూట్టానికి ప్రొడక్షను మీద యూఐడి కావాలని నన్ను అడిగాడు. నేను అది మంచి పధతి కాదు అని జెప్ప. అంతే రగిలిపొయ్యాడు. వాళ్ళ మేనేజరు దెగ్గర ఏడ్సినట్టు ఉన్నాడు, ఆడు నాకు ఫోను

"What the heck is this UID?"
"What u guys (gays) want?"
"TAMIL PAYYA is weaping, he wants an account on prod"
"Why U guys want uid?"
"I dont know, this ass sitting on the top my head and weaping, he may need it for logs, or to set some crontabs"
"here are the logs, for cron give me the script, I will add 'em to crontab, in general uid for developer as a matter of discussion even to an architect cannot be given, but to have it, talk to sys admin not me" (రాజు తల్సుకుంటే దెబ్బలకి కొదవా - ఎఱ్ఱినాకొడకా.. ఆడు ఏడ్సాడు, ఈడు తుమ్మాడు- సిసి ఎదవలు)
"click" - disconneted

సివరాకరికి వాడికి యూఇడి వచ్చింది. నేను నా ఏరియా పెర్మిషన్స్ ని 744 కి మార్చేసా. ఖేల్ ఖతం.
3. తెలుగోళ్ళు తెలుగోళ్ళు శతృవులు
ఇదెలా? మనం కాకుల్లాంటోళ్ళం. ఇంకోళ్ళని తిననీయ్యం. తెలుగోడు తెలుగోడు తెలుగులో మాట్టాడుకోరు. వీడుట్టి ఎదవ అనుకుంటారు పక్కనోళ్ళగురించి. సహాయమా? అంటే అంటారు!! మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏమితెస్తారు అంటారు. మీ ఇంటిపేరేంటి? ఇలా నడుస్తుంది మన గోల.