Dec 27, 2008

కత్తెర

శుక్రవారం మద్యానం మా ఆవిడ ఫోను

"ఏంటి"
"మీవాడు ఘనకార్యం"
"ఏమిజేసాడూ?"
"పిల్లని పడుకోబెట్టి వచ్చేలోపు"
"ఏమిజేసాడూ????"
"కుర్చీలాక్కుని, దానిమీదకెక్కి, గూటితలుపుతీసి, గూట్లోంచి కత్తెర తీసి, పెంగ్విన్ కి బొచ్చు పెరిగిందిటా!!! దానికి కత్తిరించి, తన జుట్టునీ కత్తిరించుకున్నాడు"
"హా!!!!"
"అవును బాబు, వాడికీ పెరిగిందట. మళ్లీ వాడికి క్షురకర్మ జేసి తలంటిపోసి ఇప్పటికి కూర్చుందాం అని వస్తే ఆ పిల్ల లేచింది. అదీ కధ నాయనా"
"హా$%$%@^@%$^"


కొసమెఱుపు:
"ఎందుకు తీసావు కత్తెర?"
"అస్సలునువ్వు నాకు అందేలా ఎందుకు పెట్టావు? కత్తెర్లు అలాంటివి దాచిపెట్టుకోవాలి కదా?"

10 comments:

  1. hahaha....yathA pitA, tathA putrA...mee kAmeDikI taggaTTE dorikADu meevADu

    ReplyDelete
  2. Baagundandi site. Kattera chenuku nizamga baagundi

    http://www.varudhini.blogspot.com

    ReplyDelete
  3. hahahaha.. nijame kada.. enduku peTTaaru andETaTTu?

    ReplyDelete
  4. "కంప్యూటరు మీద చెయ్యి పెడితే తంతా!!"
    "మరి కాలు వెయ్యనా?"
    "౪౫౮౫౫౬౯!!!!!!!*&%$#(_"
    :)

    ReplyDelete
  5. సూరిగాడా మజాకా??
    ఆడ్ని నాల్రోజులు గుంటూరు గాంధీపార్కులో తిప్పు
    తర్వాత్చెప్పు మిగిలినయ్

    :) :)

    ReplyDelete
  6. ha ha ....ayinaa miiru avannii amdelaa enduku pettaaru :) mide tappu.. mide tappu

    ReplyDelete
  7. @రాజే అన్నగారు: గాంఢీ పార్కు ఇప్పుడు బాగా మారిపోయింది. ఎదో బెద్ద బల్లిమి కట్టారు అక్కడ. దరిద్రం. May Be, వాడిని దాచేపల్లి తీస్కెళ్లి ఓ సారి నాగులేటి నీళ్లు తాగించాలి. లేక పొందుగుల తీస్కెళ్లి కృష్ణా నదిలో మునకలు ముంచాలి.
    @వేణు: మీ ఊరుపంపిస్తా అన్నాయ్. తట్టుకోలేకపోతున్నాం వాడి ప్రశ్నలకి.
    @రాధిక గారు: కిందో అపార్టుమెంటు పైనో అపార్టుమెంటు తీస్కొని ఇవన్నీ పైన ఇంట్లో పెట్టుకుని కింద నివశించాలేమొ ఇక.

    ReplyDelete
  8. @భాస్కర్:

    >> "వాడిని దాచేపల్లి తీస్కెళ్లి ఓ సారి నాగులేటి నీళ్లు తాగించాలి"

    ఆ అవకాశమూ లేదు. నీళ్లెక్కడున్నాయిప్పుడందులో? ఉంది నిఝంగా నాపరాళ్లే.

    ReplyDelete
  9. @అబ్రకదబ్ర: అదీ నిజమే!! లేకపోతే, కారంపూడి తీస్కెళెతేనో? లేక కారంపూడి వినుకొండ దారిలోనేగా నాగులేరు పుట్టింది. అక్కడికే ఎత్తుకెళ్తే సరిపోయా. ఈర్లబాయి సూసినట్టు ఉంటుఁది, మన పనీ అవుతున్ది. :)

    ReplyDelete